సాక్షి, ఆదిలాబాద్/నిర్మల్: ‘హలో రామన్న.. నమస్తేనే. మంచిగున్నవాయే. ఎట్లున్నది మనూళ్లె. అంత మనదిక్కే ఉన్నరు కదనే. ఇంతకు మన కులపోళ్లు ఎంతమంది ఉంటరే. ఊళ్లె ఏయే కులపోళ్లు ఎంతమంది ఉంటరే రామన్న. అందులో ఓళ్లు ఏమంటున్నరో కూడా.. జర అరుసుకోయే’ అంటూ గ్రామాలు, వార్డుల్లో ఉంటే క్రియాశీలక కార్యకర్తలు, నాయకులకు అభ్యర్థుల అనుచరుల నుంచి ఫోన్లు వస్తున్నాయి.
ఈమేరకు గ్రామాల్లో సదరు నాయకులు కులాలు, సంఘాల వారీగా లెక్కలు తీసి, అందులో ఎవరు ఎటు మా ట్లాడుతున్నారు.. ఏ పార్టీ దిక్కు తిరుగుతున్నారు.. అనే విషయాల నుంచి అన్ని వివరాలు సేకరించి తి రిగి వారికి చెబుతున్నారు. ఇలా వచ్చిన లెక్కల ప్ర కారం అభ్యర్థులు ఓట్లు రాబట్టుకునేందుకు ఏం చే యాలో అంచనాలు వేసుకుంటున్నారు. ఎవరికి తా యిలాలు పంపిణీ చేయాలి, ఎప్పటి నుంచి ఇవ్వా లి, ఎవరితో పంపించాలనే లెక్కలూ వేస్తున్నారు.
ఏ కులమెటు..?
జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే ఓటర్ల జాబితాలను జల్లెడ పడుతున్నారు. ఇందులో తమ పరిధిలో ఏ కులం వారు ఎంతమంది ఓటర్లు ఉన్నారనే లెక్కలూ తీస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధాన కులాలు కొన్ని వన్‌సైడ్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరు ఎవరికి ఓటు వేస్తారనే దానిపై చర్చ నడుస్తోంది. రాష్ట్రస్థాయిలో తమ కులం వాళ్లు ఎక్కువగా ఏ పార్టీలో ఉంటే స్థానికంగా దాదాపు ఆ కులం ఓటర్లు అదే పార్టీ వైపు మొగ్గుచూపుతున్నారు. ఇటీవల కొన్ని కులాలు ఈ మేరకు తీర్మానాలు చేసుకున్నాయి. తమ నేతలు ఉన్న పార్టీనే గెలిపించుకోవాలనుకుంటున్నాయి.
ప్రభావిత ఓట్లు..
జిల్లాలో కొన్ని కులాలు, వర్గాల ఓట్లు చాలా కీలకంగా మారుతాయి. అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేస్తాయి. జిల్లా జనాభా, ఓటరు జాబితాలో మున్నూరుకాపు, పద్మశాలి, ముదిరాజ్, విశ్వబ్రాహ్మణ, బెస్త, మాల, మాదిగ, యాదవ, కురమ, రజక, నాయీబ్రాహ్మణ, నాయక్‌పోడ్, లంబాడా, ఆదివాసీ, ఆరె మరాఠా, రెడ్డి, వె వెలమ, వైశ్య, బ్రాహ్మణ తదితర కులాలు ఓ మోస్తరు నుంచి అధికసంఖ్యలో ఉన్నాయి.
ఇందులో మున్నూరుకాపు, పద్మశాలి, ముదిరాజ్, మాల, మాదిగ, బెస్త ఓటర్ల సంఖ్య అత్యధికంగా ఉన్న గ్రామాలు చాలాఉన్నాయి. ఆయా గ్రామాల్లో సదరు కులాల ఓట్లే కీలకం. జిల్లాకేంద్రంలో కొన్ని గల్లీలకు గల్లీలే మున్నూరుకాపులకు సంబంధించినవి, మరికొన్ని పద్మశాలీలకు సంబంధించినవి ఉన్నాయి. ఇలా కొన్ని గ్రామాల్లోనూ రెండుమూడు కులాలు అధికసంఖ్యలో ఉన్నవి ఉన్నాయి.
ఎవరినెలా..!?
‘మీ ఊళ్లె ఫలానా కులపోళ్లు ఎటుదిక్కున్నరే. వాళ్ల కులంలో ఓళ్లు పెద్దమనుషులే..’అన్న ఆరాలనూ పార్టీల నేతలు తీస్తున్నారు. ఎన్ని కల వేళ సదరు కులాల ఓట్లను గంపగుత్తగా తమవైపు తిప్పుకోవాలంటే ఏం చేయాలనే వ్యూహాలు రచిస్తున్నారు.
ఇప్పటికే ఒకట్రెండు దఫాలుగా దావత్‌లు ఇచ్చేశారు. సంఘా ల వారీగా కులాలను కోఆర్డినేట్ చేసుకుంటూ వస్తున్నారు. వారికి కావాల్సిన పనులు తెలుసుకుంటున్నారు. వాటితోపాటు ఎన్నిక ల వేళ తాయిలాలను ఇచ్చేందుకూ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా ఒక్క ఓటు కూడా పక్కపార్టీకి పోవద్దు.. అన్న తరహాలో పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు.
మైనార్టీలు కీలకం..!
జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ముస్లిం, క్రైస్తవ ఓటర్లు ఉన్నారు. ఇందులో క్రైస్తవులు కాస్త తక్కువగా ఉన్నప్పటికీ ముస్లింలు మాత్రం గణనీయంగా ఉన్నారు. నిర్మల్, ముధోల్ రెండు నియోజకవర్గాల్లో మైనార్టీల ఓట్లే కీలకం.
వీరి ఓట్లే అభ్యర్థుల గెలుపోటములను డిసైడ్ చేస్తుంటాయి. అందుకే చాలామంది అభ్యర్థులు వారి ఓట్లు ఎన్ని వస్తాయని అంచనా వేసుకున్న తర్వాతే ఇతర ఓట్లను లెక్కించుకుంటారు. ఖానాపూర్‌లోనూ ఈసారి మైనార్టీలు కీలకంగా మారనున్నారు. జిల్లాలో 30–40 శాతం ఉండే మైనార్టీ ఓట్లు చాలావరకు వన్‌సైడ్ పడతాయన్న నమ్మకం అభ్యర్థుల్లో ఉంటోంది. ఈమేరకు వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇవి కూడా చదవండి: ‘పేట’.. సమస్యల మూట.. కాబోయే ఎమ్మెల్యేకు సమస్యల స్వాగతం!
Comments
Please login to add a commentAdd a comment