సాక్షి,ఆదిలాబాద్: ఇటు రాజీనామాలు.. అటు హెచ్చరికలతో జిల్లా కాంగ్రెస్‌లో కల్లోలం చోటు చేసుకుంది. హస్తం పార్టీలో ఈ రెండు సంఘటనలకు ఆ పార్టీ అభ్యర్థులతో ముడిపడి ఉంది. ఆది లాబాద్ అభ్యరి కంది శ్రీనివాసరెడ్డిపై అసమ్మతి వర్గం తిరుగుబావుటా వేయగా, బోథ్ అభ్యర్థి వన్నెల అశోక్‌ను మార్చితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయా మండలాల వారీగా పార్టీ శ్రేణులు హెచ్చరిస్తున్నా యి. సోమవారం ఈ రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ శ్రేణుల నిరసనలు పెల్లుబికాయి.
ఆదిలాబాద్..
డీసీసీ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్, టీపీసీసీ ప్రధాన కా ర్యదర్శి గండ్రత్ సుజాత, మార్కెట్ కమిటీ మాజీ చై ర్మన్ ఎ.సంజీవ్‌రెడ్డితో పాటు పలువురు కౌన్సిలర్లు, కార్యకర్తలు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ఆ దిలాబాద్‌లో మాజీ మంత్రి, దివంగత సి.రాంచంద్రా రెడ్డి గృహంలో సోమవారం విలేకరుల సమావే శం ఏర్పాటు చేసి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
సీఆర్‌ఆర్ మేనళ్లుడు పార్టీకి రాజీనామా చేసిన సంజీవ్ రెడ్డిని స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దించనున్నట్లు అసమ్మతి వర్గం స్పష్టం చేసింది. ఈనెల 10న నామి నేషన్ వేయనున్నట్లు తెలుపడం ప్రాధాన్యత సంతరించుకుంది. పారాషూట్ లీడర్లకు టికెట్లు ఇవ్వమ ని చెప్పిన అధిష్టానం బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి కొ ద్ది నెలల క్రితమే చేరిన కంది శ్రీనివాసరెడ్డికి ఎలా ఇచ్చిందని వారు ప్రశ్నించారు.
ప్రతిపక్షంలో ఉండడంతో పార్టీ పరిస్థితులు నిర్వీర్యమవుతున్న స్థితిలో కాపాడుకుంటూ వచ్చామని, అలాంటిది కేవలం డ బ్బులున్నాయని ఆర్‌ఎస్‌ఎస్ భావాలున్న వ్యక్తికి టి కెట్ ఇవ్వడంలో కాంగ్రెస్ సిద్ధాంతాలు ఎటుపోయాయన్నారు. తాము ఏపార్టీలో చేరమని, స్వతంత్ర అ భ్యర్థిని గెలిపించుకొని తిరిగి కాంగ్రెస్‌లోనే చేరుతా మని అసమ్మతివర్గం స్పష్టంచేయడం గమనార్హం.
బోథ్‌లో..
బోథ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి వన్నెల అశోక్‌ను పార్టీ అధిష్టానం మార్చబోతుందన్న ప్రచా రంపై ఆ పార్టీ శ్రేణులు మండిపడుతున్నారు. గుడిహత్నూర్, నేరడిగొండ, బోథ్, తాంసిలో మండల కాంగ్రెస్ నాయకులు ఈ పరిణామాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అశోక్‌ను మార్చితే ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. అతనికే వెంటనే బీ–ఫామ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పార్టీ పదవులకు రాజీనామా చేస్తామని స్పష్టం చేశారు. ఆది వాసీ నాయకుడిని మార్చవద్దని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు గొడం గణేశ్ డిమాండ్ చేశారు.
టీపీసీసీ అధ్యక్షుడి పర్యటనకు ముందు లొల్లి..!
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈనెల 8న ఖానా పూర్ నియోజకవర్గంలోని ఉట్నూర్, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటిస్తున్నారు. బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఈ పర్యటనకు ముందు జిల్లాలో ఈ కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఆదిలా బాద్‌లో సీనియర్ నేతల రాజీనామా, బోథ్‌లో అభ్యర్థిని మార్చవద్దని కాంగ్రెస్ శ్రేణుల డిమాండ్ నేపథ్యంలో ఖరారైన ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉంటే ఆదిలాబాద్ అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నా రు. ఆయన బీ–ఫామ్ తీసుకొని జిల్లాకు రానున్నట్లు పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment