చాహత్ బాజ్‌పాయ్
సాక్షి, ఆదిలాబాద్: ఎన్నికల నేపథ్యంలో రేపటి నుంచి నామినేషన్ల పర్వం షురూ కానుంది. ఈమేరకు నియోజకవర్గ కేంద్రంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని బోథ్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు. బుధవారం ఆమె ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు వివరాలు వెల్లడించారు.
సాక్షి: నామినేషన్ ప్రక్రియ ఏర్పాట్లు పూర్తయ్యాయా?
ఆర్వో: ఈ నెల 3 నుంచి నామినేషన్లను స్వీకరిస్తాం. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బోథ్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్లను సమర్పించాలి. ఈ నెల 10వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది.
సాక్షి: నామినేషన్‌కు ఏమేం దాఖలు చేయాలి?
ఆర్వో: నామినేషన్‌కు రూ.5వేలు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చేస్తేనే ఫాం–2 నామినేషన్ పత్రం ఇవ్వడం జరుగుతుంది. అలాగే నామినేషన్ దాఖలు చేసేవారు ఫాం–26 ద్వారా అఫిడవిట్ సమర్పించాలి. వారి ఆస్తులు, రాబడి, అప్పులు, కేసులను అందులో పేర్కొనాలి. అన్ని కాలమ్‌లను పూర్తి చేయాలి. ఖాళీలు ఉంటే అభ్యర్థికి తెలియజేస్తాం. గడువు ముగిస్తే నామినేషన్ తిరస్కరణకు గురవుతుంది.
సాక్షి: అభ్యర్థుల తుది జాబితా ఎప్పుడు ప్రకటిస్తారు?
ఆర్వో: ఈనెల 10వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తాం. 13న పరిశీలన ఉంటుంది. అదే రోజున అభ్యర్థుల జాబితా విడుదల చేస్తాం. 15వరకు ఉపసంహరణ గడువు ఉంటుంది. ఉపసంహరణ తరువాత అభ్యర్థుల తుది జాబితా విడుదల చేస్తాం.
సాక్షి: నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాలు, మిగతా వివరాలు..?
ఆర్వో: బోథ్ నియోజకవర్గంలో మొత్తం 302 పోలింగ్ కేంద్రాలున్నాయి. 422 వీవీప్యాట్‌లు, 377 ఈవీ ఎంలను సిద్ధంగా ఉంచాం. ఈ నెల 10వ తేదీన ఓ టర్ల తుది జాబితా విడుదల అవుతుంది. ఆ జా బితా ఆధారంగానే ఎన్నికల నిర్వహణ ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment