సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: దాదాపు నెల రోజులుగా ఊరించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్ట్‌లిస్ట్ ఎట్టకేలకు విడుదలైంది. ఇందులో ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాలకు కేవలం మూడు నియోజకవర్గాల అభ్యర్థులను మాత్రమే ప్రకటించారు. మిగతా ఏడింటిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. పెద్దగా పోటీ దారులు లేని మంచిర్యాల, బెల్లంపల్లి, నిర్మల్ టికెట్లు ఫస్ట్‌లిస్ట్‌లోనే ప్రకటించారు.
వరుసగా ప్రేమ్‌సాగర్‌రావు, గడ్డం వినోద్, కూచాడి శ్రీహరిరావుకు టికెట్లు ఇచ్చారు. మలి విడత జాబితాలో మిగతా ఏడు టికెట్లు ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈ ఏడు సీట్లలోనే పోటాపోటీగా నాయకులు ఉన్నారు. ఆదిలాబాద్, ముథోల్, ఖా నాపూర్, బోథ్, ఆసిఫాబాద్, సిర్పూర్, చెన్నూరు టికెట్లు ప్రకటించాల్సి ఉంది. దీంతో రెండో జాబి తాపై అందరిలో ఆసక్తి నెలకొంది. వీటిలో చెన్నూరును పొత్తులో భాగంగా సీపీఐకి ప్రకటించే అవకాశం ఉంది. మిగిలిన స్థానాల్లో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది.
బోథ్, ఖానాపూర్‌పై పీటముడి
బోథ్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరితే వా రికే టికెట్ ఖాయమని అనుచరవర్గాలు నమ్ముతున్నాయి. అయితే ఇప్పటికే అక్కడ కొంతకాలంగా పనిచేస్తున్న నాయకులు సీట్లపై ఆశలు పెట్టుకున్నా రు. వారిని ఎలా బుజ్జగిస్తారనేది సవాల్‌గా మారింది. లేకపోతే ఎమ్మెల్యేలకే టికెట్ ఇవ్వకుండా గెలుపునకు కృషి చేయాలని సూచిస్తే పార్టీలోనే ఉంటారా? లేక వేరే దారి చూసుకుంటారా? అనేది తేలాల్సి ఉంది.
బోథ్,ఖానాపూర్, ఆసిఫాబాద్ ఎస్టీ స్థానాల్లో లంబాడా,ఆదివాసీలతోభర్తీచేయాల్సి రావడంతో ఎక్క డ ఏ వర్గానికి నిర్ణయించారనేది వెల్లడి కానుంది. మూడింట రెండు కచ్చితంగా ఒకేవర్గానికి ఇవ్వాలి. మరో వర్గానికి ఎంపీ స్థానం ఇచ్చే అవకాశం ఉంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రేఖానాయక్, బాపురావు కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉండడంతో ఆచితూచి ఎంపిక జరిగినట్లు నాయకులు చెబుతున్నారు.
అసంతృప్తులు..
తొలి జాబితా, మలి జాబితాలో టికెట్ దక్కని అసంతృప్తులు ఏం చేస్తారనేది పార్టీవర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈసారి ఎలాగైనా ఉమ్మడి జిల్లాలో సత్తా చాటాలని హస్తం పార్టీ ఆరాటపడుతున్న నేపథ్యంలో నాయకుల మధ్య సమన్వయంతో ముందుకు వెళ్ల డం ముఖ్యం. ఇప్పటికే గ్రూపులుగా ఉన్న నాయకులు టికెట్ల పంపకం తర్వాత మరింత రచ్చకెక్కే అవకాశం లేకపోలేదు. దీంతో అసంతృప్తులు ఏం చేస్తారనేది పార్టీలో చర్చ సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment