సాక్షి, ఆదిలాబాద్: మూడు ప్రధాన పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలు ప్రజల ముందుకు వచ్చాయి. ఈ ఎన్నికల్లో గెలిపిస్తే ఆ హామీలను అమలు చేస్తామని చెబుతున్నాయి. నెల క్రితమే బీఆర్‌ఎస్ కేసీఆ ర్ భరోసా అంటూ ప్రకటించగా.. శుక్రవారం కాంగ్రెస్ అభయహస్తం పేరిట, శనివారం బీజేపీ సకల జనుల సౌభాగ్య తెలంగాణ గ్యారంటీ పేరిట మేని ఫెస్టోలను విడుదల చేశాయి. ఇప్పటి వరకు ఒక విధంగా సాగిన ప్రచారం ఈ మిగిలిన రోజుల్లో హా మీలను వివరిస్తూ జోరుగా సాగే అవకాశం ఉంది.
హామీ పత్రాలు ఇలా..!
పార్టీ అభ్యర్థులను ముందుగా ఖరారు చేయడంతో పాటు బీఆర్‌ఎస్ నెల క్రితమే ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా హైదరాబాద్‌లో మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇప్పటికే బీఆర్‌ఎస్ శ్రేణులు ప్రచారంలో కేసీఆర్ భరోసా పేరిట వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లారు. సామాజిక పింఛన్లను విడతల వారీగా రూ.5 వేలకు పెంచడం, కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికి ధీమా, దళితబంధును కొసాగించడం, రైతుబంధు రూ.10 వేల నుంచి విడుతల వారీగా రూ.16 వేల వరకు పెంచడం వంటి పథకాలను ఇందులో ప్రకటించారు.
ఇక కాంగ్రెస్ మేనిఫెస్టోను శుక్రవారం హైదరాబాద్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో విడుదల చే సిన విషయం తెలిసిందే. ఆరు గ్యారంటీలు, రైతు, యూత్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ డిక్లరేషన్‌లతో పాటు అదనంగా వివిధ సంక్షేమ పథకాలను ఇందులో ప్రకటించారు. ధరిణికి బదులు భూమాత పో ర్టల్ తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్, ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణపై హా మీ ఇచ్చారు.
ఆరోగ్యశ్రీ పథకం పరిమితి రూ.10 ల క్షల వరకు పెంపు, మహిళలకు, ఆడ పిల్లలకు ఆర్థిక సాయం, కులాలు–రిజర్వేషన్లు వంటి అంశాలను ప్రస్తావించారు. ఇక శనివారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హైదరాబాద్‌లో బీజేపీ మేనిఫెస్టోను ఆవిష్కరించారు. ధరణి స్థానంలో మీ భూమి వ్యవస్థ, కేంద్ర పథకాల అమలుకు ప్రత్యేక మంత్రిత్వశాఖ, మత ప్రతిపాదికన రిజర్వేషన్ల తొలగింపు, బీసీ, ఎస్టీ, ఎస్సీలకు రిజర్వేషన్లు, తెలంగాణ ముఖ్యమంత్రిగా బీసీ, వివిధ చట్టాలను ఏకీకృతం చేస్తూ ఉమ్మడి పౌరస్మృతి, ఎస్సీల వర్గీకరణకు సహకారం, బీఆర్‌ఎస్ అవినీతిపై విచారణ కమిటీ, అర్హులైన పేదలందరికీ ఇళ్లు వంటివి ప్రకటించారు.
మిగిలింది కొద్ది రోజులే..
ప్రచారానికి మరికొద్ది రోజుల సమయం మాత్రమే మిగిలింది. ఈ నెల 30న పోలింగ్ ఉండగా దానికి 48 గంటల ముందుగానే ప్రచారం పరిసమాప్తం అవుతుంది. బీఆర్‌ఎస్ ఇప్పటికే తమ మేనిఫెస్టోపై విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇక కాంగ్రెస్, బీజేపీలు తమ హామీ పత్రాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉంది.
ఇప్పటి వరకు కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలుపై ప్రచారంలో ముందుకు తీసుకెళ్లారు. ఇక బీజేపీ పరంగా ప్రధానమంత్రి మోదీ రాష్ట్ర పర్యటనలో భాగంగా మౌలిక సదుపాయాల అభివృద్ధిపై హమీలు ఇచ్చారు. అలాగే ఎస్సీ వర్గీకరణపై హైదరాబాద్ సభ ద్వారా ఆయా వర్గాల ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తాజాగా కాంగ్రెస్, బీజేపీలకు సంబంధించి హామీ పత్రాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయా పార్టీలు సిద్ధం అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment