చివరి రోజు ఉద్రిక్తత! బీఆర్‌ఎస్‌, బీజేపీ పరస్పరం దాడులు.. | - | Sakshi
Sakshi News home page

చివరి రోజు ఉద్రిక్తత! బీఆర్‌ఎస్‌, బీజేపీ పరస్పరం దాడులు..

Published Wed, Nov 29 2023 1:58 AM | Last Updated on Wed, Nov 29 2023 11:31 AM

- - Sakshi

వైఎస్‌ఆర్‌ కాలనీలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య దాడి

సాక్షి, ఆదిలాబాద్‌: నిర్మల్‌ జిల్లాలో ప్రశాంతంగా సాగిన ప్రచారపర్వం చివరిరోజు ఒక్క ఘటనతో ఉద్రిక్తంగా ముగిసింది. జిల్లాకేంద్రంలోని వైఎస్సార్‌కాలనీలో మంగళవారం ఉదయం బీజేపీ అభ్యర్థి మహేశ్వర్‌రెడ్డి, పార్టీ నాయకులతో ప్రచారానికి వెళ్లాడు. అదే సమయానికి బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రచార వాహనంతో వచ్చారు. పోటాపోటీగా పాటలు పెట్టవద్దన్న అంశంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది.

ఒక్కసారిగా బీజేపీ నాయకులపై బీఆర్‌ఎస్‌ నాయకులు రాళ్లతో దాడి చేశారు. దీంతో బీజేపీ నాయకుల కూడా ప్రతిదాడికి దిగారు. ఇరువర్గాలు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకోవడంతో వైఎస్సార్‌ కాలనీ ఉద్రిక్తంగా మారింది. పలువురు స్థానికులు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న డీఎస్పీ గంగారెడ్డి, సీఐలు శ్రీనివాస్‌, పురుషోత్తం వెంటనే అక్కడి చేరుకున్నారు. భారీసంఖ్యలో పోలీసులను మోహరించారు. ఇరుపార్టీల నాయకులను చెదరగొట్టారు. అనంతరం బీజేపీ అభ్యర్థి మహేశ్వర్‌రెడ్డి తన ప్రచారం కొనసాగించారు. ఈ ఘటనకు సంబంధించి పలువురిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement