సాక్షి, ఆదిలాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు, సర్వీస్ ఉద్యోగులకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్‌లోనూ నోటాకు ఓట్లు పోలయ్యాయి. ఆదివారం వెల్లడించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విద్యావంతులు సైతం ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులను కాదని నోటాకు ఓటేశారు. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 3073 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఇందులోనూ ఎమ్మెల్యేగా విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ స్పష్టమైన అధిక్యతను కనబర్చారు.
ఆయనకు 1140 ఓట్లు రాగా, బీఆర్‌ఎస్ అభ్యర్థి జోగు రామన్నకు 595 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాస రెడ్డికి 961 ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్ అభ్యర్థి రెండో స్థానంలో నిలువడం గమనార్హం. కాగా నోటాకు 10మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారు. బోథ్ నియోజకవర్గంలో మొత్తం 1700 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలవ్వగా బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావుకు అత్యధికంగా 718 ఓట్లు వచ్చాయి. ఎమ్మెల్యేగా గెలుపొందిన బీఆర్‌ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్‌కు 495 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి అడే గజేందర్‌కు 371 ఓట్లు పోలయ్యాయి. తొమ్మిది మంది నోటాకు ఓటేయడం గమనార్హం.
ఇవి కూడా చదవండి: స్వతంత్రుల కన్నా ఎక్కువగా 'నోటా'కు ఓట్లు!
Comments
Please login to add a commentAdd a comment