argument
-
సీతక్కపై పాడి కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలు.. అసెంబ్లీలో దుమారం
సాక్షి,హైదరాబాద్: మహిళలకు ఉచిత బస్సు స్కీమ్‌పై తెలంగాణ అసెంబ్లీలో సోమవారం(జులై 29) దుమారం రేగింది. మంత్రి సీతక్క, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మధ్య వాగ్యుద్ధం జరిగింది. ఈ క్రమంలో మంత్రి సీతక్కకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆటోడ్రైవర్లకు, ఆర్టీసీ కార్మికులకు ఏం చేసిందో నాలెడ్జ్ లేకపోవచ్చని కౌశిక్‌రెడ్డి అన్నారు. నాలెడ్జ్ లేదు అన్న మాటలపై కాంగ్రెస్ సీరియస్ అయింది. నాలెడ్జ్ లేదు అన్న వ్యాఖ్యలపై మంత్రి సీతక్కకు క్షమాపణ చెప్పాలి లేదా ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. స్పీకర్ కలుగజేసుకోవడంతో సీతక్కపై మాట్లాడిన మాటలను కౌశిక్‌రెడ్డి వెనక్కి తీసుకున్నారు. -
మంత్రి భార్య ఓవరాక్షన్‌పై సీఎం చంద్రబాబు రియాక్షన్
అమరావతి, సాక్షి: పోలీసులతో ఏపీ రవాణా శాఖ మంత్రి రామ్‌ప్రసాద్ రెడ్డి భార్య హరితారెడ్డి వ్యవహరించిన తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మంత్రి రామ్‌ప్రసాద్‌తో ఫోన్లో మాట్లాడిన ఆయన.. వివరణ సైతం కోరినట్లు సమాచారం. సోషల్ మీడియా మాధ్యమాల్లో ఇలాంటి ప్రజలకు త్వరగతిన చేరతాయని.. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని, మరోసారి ఇలాంటివి జరిగితే ఉపేక్షించబోనని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా మంత్రిని సున్నితంగా హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసుల పట్ల తన భార్య ప్రవర్తనపై విచారం వ్యక్తం చేసిన మంత్రి రామ్‌ప్రసాద్ రెడ్డి.. మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటానన్నారని సమాచారం. చూడండి పోలీసులపై దౌర్జన్యం ఈవిడ గారు మంత్రి లేదా MLA అనుకునేరు .. కాదు కాదు రాయచోటి MLA రాం ప్రసాద్ రెడ్డి గారి భార్య గారు నాడు అధికారుల ఆత్మగౌరవాన్ని జగన్ కాపాడాడు .. నేడు అధికారులని బానిసలుగా చూస్తున్న తెలుగుదేశం కూటమి#SaveAPFromTDP #APNeedsYSJaganAgain pic.twitter.com/CeRyKLhD38— 𝑺𝒂𝒕𝒉𝒊𝒔𝒉(𝒀𝑺𝑱𝒂𝒈𝒂𝒏 𝑲𝒂 𝑷𝒂𝒓𝒊𝒗𝒂𝒓) (@SathishWithYSJ) July 1, 2024ఇదిలా ఉంటే.. అన్నమయ్య రాయచోటిలో పోలీసులు తనకూ ఎస్కార్ట్‌గా రావాలంటూ హరితారెడ్డి వారితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో వారితో దురుసుగా ప్రవర్తించిన తీరుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. -
షూట్ విషయంలో గొడవ.. బిల్డింగ్‌పై నుంచి దూకిన యూట్యూబ్ జంట
క్షణికావేశంలో తీసుకునే కఠిన నిర్ణయాలకు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. చిన్న చిన్న సంఘటనలు చిలికి చిలికి గాలి వానలా మారడంతో నిండు జీవితాలు బలైపోవడమే కాకుండా.. కుటుంబీకుల్లోనూ కొండంత విషాదాన్ని మిగిల్చుతుంది. తాజాగా ఇలాంటి ఘటనే హర్యానాలోని బహదూర్‌ఘర్‌లో వెలుగుచూసింది. ఓ విషయంలో గొడవపడిన జంట.. తొందరపాటు నిర్ణయంతో బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను డెహ్రడూన్‌కు చెందిన గర్విత్ 25, నందిని 22గా గుర్తించారు. గర్విత్, నందిని ఇద్దరూ కంటెంట్ క్రియేటర్స్, సొంతంగా ఛానల్ పెట్టి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్,ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో రీల్స్, షార్ట్ వీడియోలు చేస్తూ ఉంటారు. కొన్ని రోజుల కిత్రమే ఈ జంట తమ టీమ్‌తో కలిసి డెహ్రడూన్ నుంచి బహదూర్‌ఘర్‌కు మారారు. రుహీలా రెసిడెన్సీలోని ఏడవ అంతస్తులో ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకొని ఉంటున్నారు. టీమ్‌లోని మరో అయిదుగురు రూమ్మేట్స్తో జీవిస్తున్నారు. ఈ క్రమంలో బయట షూటింగ్ పూర్తి చేసుకొని శనివారం తెల్లవారుజామున ఇంటికి వచ్చారు. అయితే ఇద్దరి మధ్య షూట్ విషయంలో వాగ్వాదం ఏర్పడింది. ఇది కాస్తా పెరిగి పెద్దది అవ్వడంతో క్షణికావేశంలో జంట బిల్డింగ్ ఏడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. చివరగా.. ఏ సమస్యకైనా ఆలోచిస్తే తప్పక పరిష్కారం ఉంటుంది.. ప్రాణానికి మించింది ఏదీ లేదు.. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకొని జీవితాలను బలితీసుకోవద్ద -
తానే వాదిస్తాడనుకుంటే.. వెనక్కి తీసుకున్నాడు!
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. సుప్రీం కోర్టులో తన కేసును తానే వాదించాలని అనుకున్నారు. ఈ మేరకు కోర్టు కేసు స్టేటస్‌లో ఆ విషయం బయటకు వచ్చింది. అయితే.. సుప్రీం కోర్టు అత్యవసర విచారణకు అంగీకరించగా.. ఆయన వేసిన పిటిషన్‌ను ఆగమేఘాల మీద శుక్రవారం వెనక్కి తీసుకున్నారు. ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ నిన్న రాత్రే ఆయన అత్యవసర విచారణ కోసం సుప్రీం కోర్టు తలుపు తట్టారు. అయితే ఆ టైంలో కోర్టు దానిని స్వీకరించలేదు. శుక్రవారం ఉదయం కోర్టు కార్యకలాపాలు ప్రారంభమైన కాసేపటికే సీజేఐ ధర్మాసనం విచారణకు అంగీకరించింది. కేజ్రీవాల్ పిటిషన్‌ను అత్యవస విచారణ చేపట్టాలని కోరారు ఆయన తరఫున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ. దీంతో ఛీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఈ పిటిషన్‌ను జస్టిస్ సంజీవ్ ఖన్నా బెంచ్‌కు పంపించారు. అక్కడా అత్యవసర విచారణ జరపాలని లాయర్ సింఘ్వీ కోరగా.. రెగ్యులర్ కేసుల విచారణ తర్వాత స్పెషల్ బెంచ్ ఈ కేసును విచారిస్తుందని జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పష్టం చేశారు. అయితే.. రౌస్ ఎవెన్యూ కోర్టులో రిమాండ్ పిటిషన్ పై విచారణ నేపథ్యంలో ఈ అత్యవసర పిటీషన్ ఉపసంహరించుకున్నారాయన. అలా వీలుందా? మైలార్డ్.. యువర్ ఆనర్ అంటూ ఊగిపోతూ సినిమాల్లో సొంతంగా వాదించుకోవడం సినిమాల్లోనే మనం చూస్తున్నాం. కానీ, నిజ జీవితంలోనూ ఇలాంటి వాటికి ఆస్కారం ఉంటుంది. ఇదిలా ఉంటే.. కేజ్రీవాల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశారు. లా చదవని ఆయన కోర్టులో వాదనలు ఎలా వినిపిస్తారనే అనుమానాలు కలగడం సహజం. అయితే.. పార్టీ ఇన్ పర్సన్(Party In Person)గా కేజ్రీవాల్ సుప్రీం కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. పార్టీ ఇన్ పర్సన్‌గా.. ఒక కేసులో సొంతంగా వాదించుకునేందుకు కొన్ని షరతులు వర్తిస్తాయి. పార్టీ ఇన్ పర్సన్‌గా ఉండాలనుకున్నప్పుడు కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం స్టాంప్ రిజిస్ట్రేషన్ ఫీజు.. ఇలా కొన్ని విషయాలపై అవగాహన ఉండాలి. ఒక అప్లికేషన్ సమర్పిస్తే.. మీకు ఆ అర్హత ఉందని భావిస్తే దానికి కోర్టు అనుమతిస్తుంది. అయితే అవగాహన లేకున్నా సాధారణంగా అడ్వకేట్ల మీద నమ్మకం లేకనో, లేకుంటే అడ్వకేట్ల ఫీజు చెల్లించలేని స్థితిలో ఉన్నప్పుడు ఇలాంటి దరఖాస్తులు సమర్పించి కోర్టు అనుమతులతో వాదిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో.. చట్టాల గురించి తెలిసి ఉండి.. తమ కేసును తామే వాదించుకోగలమన్న నమ్మకం ఉన్నప్పుడు పార్టీ ఇన్ పర్సన్‌గా దరఖాస్తు చేసుకోవచ్చు. కేజ్రీవాల్ ఇప్పుడు అలానే దరఖాస్తు చేసుకుని.. ఆ అనుమతితో వాదించాలనుకున్నారు. కానీ, చివరకు పిటిషణ్ ఉపసంహరణతో అది జరగలేదు. ఇదీ చదవండి: కేజ్రీవాల్ సీఎంగా కొనసాగొచ్చా?.. రాజ్యాంగం, చట్టం ఏం చెబుతోందంటే.. -
TS: కండక్టర్‌తో మహిళా వాగ్వాదం.. రెండూ ఒకటే కదా..
తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సేవలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే పట్ల చోట్ల బస్సుల్లో కండక్టర్లకు మహిళలకు, డ్రైవర్లకు మహిళలు మధ్య వాగ్వాదాలు జరుగుతున్న పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా ఓ యువతి ఫోన్లో ఆధార్ కార్డు నంబర్ చూపి.. బస్సులో ప్రయాణానికి అనుమతి ఇవ్వావాలని కండక్టర్‌తో గొడవకు దిగింది. అక్కడితో ఆగకుండా ఒరిజినల్ ఆధార్, ఫోన్లో ఉండే ఆధార్ నంబర్ ఒకటే కాదా అని కండక్టర్‌తో వాదించింది. దీని సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. అయితే మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలంటే.. కచ్చింతంగా ఆధార్ కార్డు/ ఓటర్ ఐడీ కార్డు/ పాస్ పోర్టు వంటి గుర్తింపు కార్డులు చూపించాలని మార్గదర్శకాలు ఉన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే కండక్టర్లు గుర్తింపు కార్డులు తప్పనిసరిగా చూపించాలని మహిళలను కోరుతున్నారు. ఇటువంటి సమయంలోనే పలు చోట్లు బస్సుల్లో గొడవలకు దారి తీస్తోంది. బస్సుల్లో ఉచిత ప్రయాణం పలు చోట్ల గొడవలకు దారి తీస్తోంది. ఉచితంగా ప్రయాణించాలంటే కచ్చితంగా ఆధార్ కార్డు/ఓటర్ ఐడీ/పాస్ పోర్ట్ లాంటి ఒక గుర్తింపు కార్డు ఉండాలని అంటున్న కండక్టర్లు. అయితే ఓ యువతి ఫోన్లో ఆధార్ నంబర్ చూపించడంతో కండక్టర్ పర్మిషన్ ఇవ్వట్లేదు. దీంతో ఆమెకు, కండక్టర్ కు… pic.twitter.com/CYSYFMbZZV — Telugu Scribe (@TeluguScribe) December 27, 2023 -
చివరి రోజు ఉద్రిక్తత! బీఆర్ఎస్, బీజేపీ పరస్పరం దాడులు..
సాక్షి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో ప్రశాంతంగా సాగిన ప్రచారపర్వం చివరిరోజు ఒక్క ఘటనతో ఉద్రిక్తంగా ముగిసింది. జిల్లాకేంద్రంలోని వైఎస్సార్‌కాలనీలో మంగళవారం ఉదయం బీజేపీ అభ్యర్థి మహేశ్వర్‌రెడ్డి, పార్టీ నాయకులతో ప్రచారానికి వెళ్లాడు. అదే సమయానికి బీఆర్ఎస్ నాయకులు ప్రచార వాహనంతో వచ్చారు. పోటాపోటీగా పాటలు పెట్టవద్దన్న అంశంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఒక్కసారిగా బీజేపీ నాయకులపై బీఆర్ఎస్ నాయకులు రాళ్లతో దాడి చేశారు. దీంతో బీజేపీ నాయకుల కూడా ప్రతిదాడికి దిగారు. ఇరువర్గాలు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకోవడంతో వైఎస్సార్ కాలనీ ఉద్రిక్తంగా మారింది. పలువురు స్థానికులు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న డీఎస్పీ గంగారెడ్డి, సీఐలు శ్రీనివాస్, పురుషోత్తం వెంటనే అక్కడి చేరుకున్నారు. భారీసంఖ్యలో పోలీసులను మోహరించారు. ఇరుపార్టీల నాయకులను చెదరగొట్టారు. అనంతరం బీజేపీ అభ్యర్థి మహేశ్వర్‌రెడ్డి తన ప్రచారం కొనసాగించారు. ఈ ఘటనకు సంబంధించి పలువురిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ఎమ్మెల్సీ కవిత 'వర్సెస్' ఎంపీ అర్వింద్.. మాటల యుద్ధం కాస్త ఫ్లెక్సీల వార్ దాకా..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: 'ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత, ఎంపీ అర్వింద్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. కోరుట్ల నుంచి బీజేపీ తరుపున పోటీ చేస్తున్న ఎంపీ అర్వింద్‌ను బీఆర్ఎస్ కార్యకర్తలు కచ్చితంగా ఓడించనున్నట్లు కవిత వ్యాఖ్యానించారు. కేటీఆర్, కవిత కారణంగానే బీఆర్ఎస్ ఓడనుందని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. ఆకుల లలితను ప్రత్యర్థి పార్టీలోకి పంపి కోవర్టు ఆపరేషన్ చేసేందుకు కవిత స్కెచ్ వేశారని ఆరోపించారు.' శాసనసభ ఎన్నికల ప్రచారం స్పీడందుకుంటున్న కొద్దీ నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. నువ్వా నేనా అనే విధంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్సీ కవిత మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గత పార్లమెంట్ ఎన్నిక ల్లో కవితపై అర్వింద్ విజయం సాధించినప్పటి నుంచీ ఈపోరు నడుస్తూనే వస్తోంది. పసుపు బోర్డు అంశంపై అర్వింద్, కవితతోపాటు ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు సైతం పోటాపోటీ మాటలతో పాటు ఫ్లెక్సీల వార్‌కు దిగారు. మీరొక ఫ్లెక్సీ పెడితే మేము పది ఫ్లెక్సీలు పెడతాం అన్న రీతిలో ఈ వార్ నడిచింది. మాటల యుద్ధం మాత్రం ఎప్పటికప్పుడు కొనసాగుతూనే వచ్చింది. ఇదిలా ఉండగా తాజాగా ఎన్నికల నేపథ్యంలో ఈ మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. ఇది రానురాను మరింత పెరుగుతోంది. కోరుట్ల నుంచి బీజేపీ తరుపున పోటీ చేస్తున్న ఎంపీ అర్వింద్‌ను బీఆర్ఎస్ కార్యకర్తలు కచ్చితంగా ఓడించనున్నట్లు కవిత తాజాగా వ్యాఖ్యానించారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని సెగ్మెంట్లలో తిరిగి బీజేపీ, కాంగ్రెస్‌లను ఓడిస్తామన్నారు. మరోవైపు అర్వింద్ మాత్రం బీఆర్ఎస్పై మాటల దాడిని తీవ్రతరం చేశారు. కవిత ప్రచారం చేస్తే బీజేపీకి మరింత మెజారిటీ వస్తుందని అర్వింద్ అన్నారు. బీఆర్‌స్‌కు కార్యకర్తలే ఓట్లు వేయరన్నారు. ఆకుల లలితను ప్రత్యర్థి పార్టీలోకి పంపి కోవర్టు ఆపరేషన్ చేసేందుకు కవిత స్కెచ్ వేశారన్నారు. కేటీఆర్, కవిత కారణంగానే బీఆర్ఎస్ ఓడనుందన్నారు. అభద్రతా భావంతో ఉన్న బీఆర్ఎస్ హిందువులను కులాల వారీగా విభజిస్తోందన్నారు. ఎక్కడా గెలవలేని కవిత ఎమ్మెల్సీ పదవి తీసుకున్నారన్నారు. అలాంటి కవిత వేరేవాళ్లను ఎలా గెలిపిస్తుందని అర్వింద్ అన్నారు. పైడి అంటే ఫ్లవర్ కాదు.. ఫైర్.. ఆర్మూర్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది. సిట్టింగ్ అభ్యర్థి జీవన్‌రెడ్డి ఇప్పటికే ఒక విడత ప్రచారం పూర్తి చేశారు. కులసంఘాల వారీగా ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే బీజేపీ అభ్యర్థి పైడి రాకేష్‌రెడ్డి మాత్రం జీవన్‌రెడ్డిపై మాటల దాడి చేస్తున్నారు. పైడి అంటే ఫ్లవర్ కాదు.. ఫైర్ అని చెబుతున్నారు. జీవన్‌రెడ్డి సర్పంచ్‌లను బెదిరించినట్లు నన్ను బెదిరించాలంటే సాధ్యం కాదన్నారు. తాను గెలిస్తే జీవన్ మాల్ లీజ్‌ను రద్దు చేస్తానని చెబుతున్నారు. ఫాంహౌజ్, పైరవీల ధ్యాస జీవన్రెడ్డిదన్నారు. ఆర్మూర్ అంబేద్కర్ సెంటర్లో లైవ్ చర్చకు రావాలని రాకేష్‌రెడ్డి సవాల్ విసిరారు. ఆస్తుల చిట్టా బహిర్గతం చేసుకుందామన్నారు. ఎవరేమిటో తేల్చుకుందామన్నారు. నిజామాబాద్ అర్బన్‌లో బీఆర్ఎస్ అ భ్యర్థి గణేష్‌గుప్తా, బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ సైతం మెల్లగా మాటల దాడి పెంచుతున్నారు. ఇవి చదవండి: 'ఓటు' ను కొన్ని సమయాల్లో వేరే పేర్లతో పిలుస్తారు.. అవేంటో తెలుసా..!? -
మీడియా కాన్ఫరెన్స్‌లో కాంగ్రెస్ నేతల రచ్చ
తిరువనంతపురం: కేరళలో కాంగ్రెస్ నాయకులు ప్రెస్ కాన్ఫరెన్స్‌లోనే బహిరంగంగా వాగ్వాదానికి దిగారు. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సుధాకరన్, అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీషన్లు మైక్ ముందే నువ్వా-నేనా అన్నట్లు తగువులాడుకున్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ప్రసంగాన్ని ముందు ఎవరు ప్రారంభించాలనే అంశం ఇద్దరి మధ్య వాగ్వాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. పుత్తుపల్లి ఉప ఎన్నికల్లో చాందీ ఊమెన్ అఖండ విజయం సాధించిన తర్వాత సెప్టెంబర్ 8న కొట్టాయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. సతీషన్, సుధారకరన్ పక్కపక్కనే కూర్చున్నారు. ఈ క్రమంలో ముందు ఉన్న మైక్‌లను సుధాకరన్ తనవైపుకు తిప్పుకున్నారు. దీంతో ముందు మీరెలా ప్రసంగం ప్రారంభిస్తారని సతీషన్ ప్రశ్నించారు. దీంతో వివాదం రచ్చకెక్కింది. తాను పార్టీ ప్రెసిడెంట్‌ను అని తెలిపిన సుధాకరన్.. తనకు ఆ హక్కు ఉంటుందని మైక్ ముందే అన్నారు. ఎట్టకేలకు సతీషన్ తగ్గగా.. మైకులను సుధాకరన్ వైపుకు ఉంచారు. ప్రెస్ మీటింగ్‌లో అడిగిన ప్రశ్నలకు అధ్యక్షుడు ఇప్పటికే చెప్పారుగా.. అంటూ సతీషన్ దాటవేశారు. మీడియా ప్రతినిధులు ఇంగ్లీష్‌లో అడిగిన ప్రశ్నలకు సధాకరన్కు సతీషన్ సహాయం చేయడానికి కూడా నిరాకరించారు. ఇద్దరి మధ్య వాగ్వాదానికి సంబంధించిన అంశంపై సతీషన్‌ను ప్రశ్నించగా.. తమ మధ్య వేరే విషయం ఉందని అన్నారు. పుత్తుపల్లి గెలుపు క్రెడిట్ మొత్తం తనకే కేటాయిస్తానని అనడంతో నేను ఆపే ప్రయత్నం చేశానని సతీషన్ చెప్పుకొచ్చారు. ఇదీ చదవండి: Jamili Elections: జమిలి ఎన్నికల ఉన్నతస్థాయి కమిటీ తొలి భేటీ -
మహిళపై షాప్కీపర్ దౌర్జన్యం.. గొంతు పట్టుకుని..
లండన్‌లోని పెక్హోమ్లో దుకాణాదారుడు ఓ నల్లజాతి మహిళపై అమానవీయంగా ప్రవర్తించాడు. మహిళను గొంతు పట్టుకుని విచక్షణ రహితంగా దాడి చేశాడు. హెయిర్ షాప్‌లో ఇంతకు ముందు తీసుకున్న వస్తువులకు రీఫండ్ చేసే అంశంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం షాప్ కీపర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పెక్హోమ్లోని రే లేన్‌లో హెయిర్ అండ్ కాస్మెటిక్స్ దుకాణం ఉంది. షాప్‌లోకి ఓ నల్లజాతీయురాలు వచ్చి దుకాణాదారుడితో ఏదో మాట్లాడుతోంది. ఇంతకు ముందు తీసుకున్న వస్తువులపై రీఫండ్ విషయంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. దుకాణాదారుడు నిగ్రహం కోల్పోయాడు. మహిళ గొంతు పట్టుకుని దాడి చేశాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Context: A Black woman in Peckham was refused a refund for hair extensions and went to take something as a personal compensation. She was refused exit and started violently hitting the shop owner before he proceeded to STRANGLE her. pic.twitter.com/OEYZinoAOH — ᴼᴹᴳ ᶥᵗˢ Adàeze (@nubianbarbieeee) September 12, 2023 సదరు దుకాణాదారుడిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. నల్లజాతీయురాలిపై దాడి చేసినందుకు ఆ షాప్ ముందు నిరసనకు దిగారు. ఈ వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. దోషులకు కఠినంగా శిక్ష విధిస్తామని హామి ఇచ్చారు. ఇదీ చదవండి: వీడియో: తెలుగు విద్యార్థి జాహ్నవి మృతిపై అధికారి వెకిలి కామెంట్లు, ఆలస్యంగా బయటకు.. -
కృష్ణా: పీఎస్ ముందే టీడీపీ గూండాల హల్చల్
సాక్షి, కృష్ణా జిల్లా: టీడీపీ నేతలు, కార్యకర్తలు బరి తెగించడంతో వీరవల్లి పోలీస్ స్టేషన్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రంగన్నగూడెం ఘటనలో ఫిర్యాదు చేసేందుకు వైఎస్సార్సీపీ నేతలు రాగా, పోలీస్ స్టేషన్ వద్దే టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. టీడీపీ నేతలు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, యార్లగడ్డ వెంకట్రావు పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, యార్లగడ్డ వెంకట్రావు సమక్షంలోనే వైసీపీ శ్రేణులపైకి టీడీపీ కార్యకర్తలు దూసుకొచ్చారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. కాగా, జిల్లాలో తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యాత్ర సందర్భంగా.. ఆ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. బజారు రౌడీల్లాగా దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో వైఎస్సార్సీపీ కార్యకర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి. లోకేశ్ రాక సందర్భంగా బాపులపాడు మండలం రంగన్నగూడెంలో ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశాయి టీడీపీ శ్రేణులు. అయితే అదే సమయంలో కౌంటర్‌గా సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలతో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశాయి వైఎస్సార్సీపీ శ్రేణులు. ఈ పరిణామాన్ని టీడీపీ గుండాలు జీర్ణించుకోలేకపోయారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చించేసి.. కర్రలతో ఇష్టానుసారంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి దిగారు. ఈ దాడిలో వైఎస్సార్సీపీ కార్యకర్త ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. చదవండి: టక్కుటమార విద్యల్లో చంద్రబాబు పీహెచ్డీ: సజ్జల -
ఏమైందో తెలియదు..! నడిరోడ్డుపై క్యాబ్ డ్రైవర్ని చితక్కొట్టారు..
అమెరికాలోని న్యూయార్క్‌లో దారుణం జరిగింది. ఐదుగురు యువకులు కలిసి వృద్ధుడైన ఓ క్యాబ్ డ్రైవర్‌ను దారుణంగా కొట్టారు. నడిరోడ్డులో 60 ఏళ్ల వృద్ధునిపై విచక్షణా రహితంగా పిడిగుద్దులు కురిపించారు. బూటు కాలుతో తంతూ ముగ్గురు మహిళలు ఇద్దరు యువకులు కలిసి దాడి చేశారు. నగరంలోని సిక్స్త్ అవెన్యూ 34 వ కూడలికి సమీపంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్లు ఫైరవుతున్నారు. వీడియో ప్రకారం ఐదుగురు కలిసి క్యాబ్ డ్రైవర్‌పై విచక్షణా రహితంగా దాడి చేశారు. వారి దెబ్బలను తట్టుకోలేక ఆ వృద్ధుడు తనను తాను రక్షించుకోవడానికి తలపై చేతులు పెట్టుకుని దీనంగా నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. ఓ మహిళ పిడిగుద్దులను భరించలేక క్యాబ్ వైపు వంగి పడిపోయాడు. ఈ దృశ్యాలు సదరు వీక్షకున్ని ఆలోచింపజేశాయి. ఈ వీడియో వైరల్ కాగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. మొదట క్యాబ్ డ్రైవర్‌కు యువకులకు మధ్య వాగ్వాదం నడిచిందని తెలిపారు. అనంతరం దాడి జరిగినట్లు పేర్కొన్నారు. Just another day in NYC.... A group of thugs beat up a 60 year old taxi cab driver in Manhattan in broad daylight. Last year a 52 year old NYC cab driver was beaten to death by a group of teens. pic.twitter.com/v9SQAkCWcN — Leftism (@LeftismForU) July 28, 2023 తీవ్రంగా గాయపడిన వృద్ధున్ని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా ఈ కేసులో ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. హోవార్డ్ కొలీ, నటాలీ మోర్గాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరూ బ్రూక్లిన్కు చెందినవారిగా గుర్తించారు. ఇదీ చదవండి: ఏంటీ వింత? ఎపుడూ లేనిది.. ఇపుడే కొత్తగా! 45 మందికి షాకిచ్చిన గోవా ఎక్స్‌ప్రెస్ ట్రైన్ -
మోదీ, యోగీ అంశంపై వాగ్వాదం.. వ్యక్తిని చంపిన యువకుడు!
ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. రాజకీయ అంశాలపై వాగ్వాదం ఓ వ్యక్తి నిండు ప్రాణాన్ని బలిగొంది. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం యోగి ఆధిత్యనాథ్ అంశాలపై జరిగిన వాగ్వాదంలో ఓ యువకుడు తమ వ్యక్తిని చంపేశాడని బాధితుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడు రాజేశ్వర్ దూబే(50). మీర్జాపూర్లో అతని సోదరుని ఇంట్లో ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నాడు. కారులో ఐదుగురు ప్రయాణికులతో పాటు దూబే ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో కారులో రాజకీయ అంశాలపై చర్చ మొదలైంది. ప్రధాని మోదీ, యోగీ ఆధిత్యనాథ్లపై చర్చ తారాస్థాయికి చేరింది. కారు మహోఖర్ గ్రామం వద్దకు చేరగానే ఆగ్రహం వ్యక్తం చేసిన డ్రైవర్.. దూబేను కారు నుంచి దిగమని హెచ్చరించాడు. వారిరువురి వాగ్వాదంలో యువకుడు దూబేను చంపేశాడు. దూబే అక్కడికక్కడే మరణించినట్లు అతని బంధువులు తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు మీర్జాపూర్-ప్రయాగ్‌రాజ్ రోడ్డుపై ఆందోళనలు చేపట్టారు. దీంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. రంగంలోకి దిగిన పోలీసులు.. ఆందోళనను శాంతింపజేశారు. నిందితుని కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు. ఇదీ చదవండి:సన్‌ఫ్లవర్ ధరపై సమస్య..జాతీయ రహదారిని నిర్బంధించిన రైతులు -
విమానం టేకాఫ్ ఆలస్యం.. ప్రయాణికులు, సిబ్బంది మధ్య రచ్చ
ఇటీవల కాలంలో పలు విమానాల్లో అనుచిత ఘటనలు తరుచూ వెలుగులోకి వస్తున్నాయి. విమానాల్లో సాంకేతిక లోపాలు, ప్రయాణికుల అసభ్య ప్రవర్తన వంటివి ఆందోళన రేపుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో మరోటి చేరింది. విమానం టేకాఫ్ ఆలస్యం కావడంతో ప్రయాణికులకు సిబ్బంది మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటన ఢిల్లీ ఎయిర్‌పోర్టులో శుక్రవారం జరిగింది. ఢిల్లీ నుంచి పాట్నా వెళ్లాల్సిన 8721 స్పైస్ జెట్ విమానం షెడ్యూల్ ప్రకారం ఉదంయ 7.20 గంటలకు టెర్మినల్ 3 నుంచి బయల్దేరాల్సి ఉంది. అయితే దాదాపు మూడు గంటలు ఆలస్యంగా అంటే 10.10 గంటలకు బయల్దేరింది. అయితే ముందుగా వాతావరణం అనుకూలించడంతో విమానం టేకాఫ్‌కు ఆలస్యం అవుతోందని ఎయిర్‌లైన్ సిబ్బంది ప్రయాణికులకు తెలియజేశారు. అనంతరం కొద్ది సమాయానికి సాంకేతిక లోపం కారణంగా విమానం ఆలస్యం అవుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో విమానంలోకి ఎక్కి రెండున్నర గంటలకు పైగా నిరీక్షించిన ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. విమానం బయలుదేరడంలో ఆలస్యం కావడంపై విమానాశ్రయంలోని ఎయిర్‌లైన్ సిబ్బందితో తీవ్ర వాగ్వాదానికి దిగారు. చివరకు ఉదయం 10.10 గంటలకు ఆ విమానం టేకాఫ్ అయ్యింది. చదవండి: వాహనదారులకు షాక్.. పెట్రోల్, డీజిల్‌పై రూ.2 సెస్..ఎక్కడంటే? -
చేసిందే తప్పు.. పైగా అంపైర్‌ను బూతులు తిట్టాడు
ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆస్టన్ అగర్ ఫీల్డ్ అంపైర్‌తో మాటల యుద్ధానికి దిగాడు. ఇద్దరి మధ్య వివాదం పెరగడంతో సహనం కోల్పోయిన అగర్ అంపైర్‌ను బూతులు తిట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గురువారం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరిగిన తొలి వన్డేలో ఇది చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. క్రీజులో కుదురుకున్న డేవిడ్ మలాన్, సామ్ బిల్లింగ్స్ జోడిని విడదీయడానికి కమిన్స్ స్పిన్నర్ ఆస్టన్ అగర్ చేతికి బంతినిచ్చాడు. బంతితో వికెట్లు తీయాల్సింది పోయి.. బంతి వేసిన తర్వాత పదే పదే పిచ్‌పైకి వస్తూ బ్యాటర్లను అడ్డుకున్నాడు. ఇది చూసిన ఫీల్డ్ అంపైర్ పాల్ రీఫెల్ అగర్‌ను హెచ్చరించాడు. ''పదే పదే పిచ్‌పై పరిగెత్తడం కరెక్ట్ కాదు..'' అంపైర్ అనడం స్టంప్ మైక్‌లో రికార్డయింది. ఇది విన్న అగర్ వెంటనే.. ''మీరు అనేది ఏంటి.. నేను బంతిని అంచనా వేయడానికి మాత్రమే పరిగెడుతున్నా'' అంటూ సమాధానమిచ్చాడు. అగర్ సమాధానంతో ఏకీభవించని అంపైర్.. ''బ్యాటర్ బంతిని కొట్టింది మిడ్ వికెట్ వైపు.. నువ్వు పిచ్‌పైకి ఎందుకు వస్తున్నావు.. అంటే బ్యాటర్‌ను అడ్డుకోవడానికే కదా'' అంటూ తెలిపాడు. ఇది విన్న అగర్‌కు కోపం కట్టలు తెంచుకుంది. అంపైర్ మీదకు దూసుకొచ్చిన అగర్ అసభ్యకరమైన పదంతో దూషించాడు. ఇదంతా స్టంప్ మైక్‌లో రికార్డయింది. ఆ తర్వాత కూడా అగర్, పాల్ రీఫెల్లు వాదులాడుకోవడం కనిపించింది. అయితే ఫీల్డ్ అంపైర్‌తో వాదనకు దిగినందుకు ఆస్టన్ అగర్‌కు జరిమానా పడే అవకాశం ఉంది. ఇక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ ఆదిలోనే శుభారంభం ఇచ్చాడు. 14 పరుగులు చేసిన ఫిల్ సాల్ట్‌ను పెవిలియన్ చేర్చగా.. ఆ తర్వాత మిచెల్ స్టార్క్ జేసన్ రాయ్‌ను ఆరు పరుగుల వద్ద సూపర్ బౌలింగ్‌తో క్లీన్‌బౌల్డ్ చేశాడు. అయితే ఒక ఎండ్‌లో డేవిడ్ మలాన్ స్థిరంగా ఆడడంతో ఇంగ్లండ్ స్కోరుబోర్డు ముందుకు కదిలింది. సామ్ బిల్లింగ్స్, కెప్టెన్ బట్లర్లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పిన మలాన్ శతకంతో మెరిశాడు. 128 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 134 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక చివర్లో డేవిడ్ విల్లే 40 బంతుల్లో 34 నాటౌట్ దాటిగా ఆడడంతో ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో పాట్ కమిన్స్, ఆడమ్ జంపాలు చెరో మూడు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్, స్టోయినిస్ చెరొక వికెట్ తీశారు. “What do you mean⁉" Ashton Agar wasn't having it from Paul Reiffel 👀https://t.co/FQjowjYEKS — Fox Cricket (@FoxCricket) November 17, 2022 చదవండి: Video: స్టార్క్ దెబ్బ.. రాయ్‌కు దిమ్మతిరిగిపోయింది! వైరల్ వీడియో ఫిఫా వరల్డ్‌కప్ ట్రోఫీ ఎలా తయారు చేస్తారో తెలుసా? -
ఇంటి నుంచి పారిపోయి మరీ పెళ్లి.. ఏమైందో ఏమో కత్తితో పొడిచి...
భార్య తనతో వచ్చేందుకు నిరాకరించిందన్న అక్కసుతో కత్తితో దాడి చేసి పారిపోయాడు ఆమె భర్త. ఈ ఘటన రాజస్తాన్ ధోలపూర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకాం....ఈ జంట ఇంటి నుంచి పారిపోయి మరీ పెళ్లి చేసుకుసుని బారీ అనే పట్టణంలో నివసిస్తున్నారు. అయితే జైపూర్‌లో ఉంటున్న భర్త కుటుంబసభ్యులు ఆ మహిళతో సహా తిరిగి ఇంటికి వచ్చేయమని బలవంతం చేశారు. ఈ నేఫథ్యంలోనే దంపతులు రైలు ఎక్కేందుకు రైల్వేస్టేషన్‌కి వచ్చారు. కానీ ఆమె అతడి కుటుంబసభ్యుల వద్దకు తిరిగి వెళ్లేందుకు నిరాకరించింది. దీంతో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. తనతో వచ్చేందకు ఒప్పుకోవడం లేదన్న కోపందో ఆమె భర్త కోపంతో కత్తితో దాడి చేసి పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న ఆమె తాను చనిపోతానన్న భయంతో బెంచ్ మీద రక్తంతో తల్లిదండ్రుల మొబైల్ నెంబర్లను రాసింది. ఆ తర్వాత ఆమె ఒక జీఆర్పీ జవాన్ సాయంతో ఆస్పత్రిలో చేరినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. (చదవండి: మొదటి భర్త ఘాతుకం...తనని కాదని మరో పెళ్లి చేసుకుందని పెట్రోల్‌తో...) -
పాణం తీసిన బంగారు గొలుసు
రామగుండం: బంగారు గొలుసు దంపతుల మధ్య చిచ్చుపెట్టింది. మాటామాటా పెరగడంతో ఆ గొడవలో భర్తను భార్య ఇటుకతో తలపై కొట్టి చంపేసింది. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పీటీఎస్‌లో శుక్రవారం తెల్లవారు జామున ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్కలపల్లి గేటు ప్రాంతానికి చెందిన చిలుముల సుమన్ (40), పొట్యాల గ్రామానికి చెందిన స్పందన దంపతులు రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమకు సంబంధించిన సర్వెంట్ క్వార్టర్లో నివాసం ఉంటున్నారు. ఇటీవల స్పందన తన బంగారు గొలుసును సోదరుడికి ఇచ్చింది. ఈ విషయంలో దంపతుల మధ్య గొడవ జరగడంతో స్పందన ఇటుకతో సుమన్ తలపై బాదింది. దీంతో సుమన్ రక్తం మడుగులో పడి విగతజీవిగా మారాడు. -
అంబటి రాయుడు, షెల్డన్ జాక్సన్ వాగ్వాదం.. వీడియో వైరల్
టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, యంగ్ క్రికెటర్ షెల్డన్ జాక్సన్ మధ్య జరిగిన గొడవ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీలో భాగంగా ఇది చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే ఎలైట్ గ్రూఫ్ డిలో బుధవారం బరోడా, సౌరాష్ట్ర మధ్య మ్యాచ్ జరిగింది. సౌరాష్ట్ర ఇన్నింగ్స్ సమయంలో బ్యాటింగ్ చేస్తున్న షెల్డన్ జాక్సన్‌తో అంబటి రాయుడు ఏదో విషయమై మాట్లాడుతున్నాడు. చూస్తుండగానే ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగి కొట్టుకునే దాకా వెళ్లిపోయారు. ఇంతలో అంపైర్లతో పాటు ఆటగాళ్లు వచ్చి ఇద్దరిని విడదీయడంతో వివాదం సద్దుమణిగింది. అయితే వీరి గొడవకు గల కారణం మాత్రం ఏంటనేది తెలియరాలేదు. మాములుగానే అంబటి రాయుడు దూకుడు స్వభావం కలిగిన ఆటగాడు. ఇంతకముందు కూడా రాయుడు చాలా సందర్భాల్లో సహనం కోల్పోయి ఆటగాళ్లతో గొడవ పడిన దాఖలాలు ఉన్నాయి. టీమిండియాలో సరైన అవకాశాలు రాకపోవడంతో అసహనం వ్యక్తం చేసిన రాయుడు జూలై 2, 2019న అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై ప్రకటించాడు. టీమిండియా తరపున అంబటి రాయుడు 55 వన్డేలు ఆడి 1695 పరుగులు సాధించాడు. అతని ఖాతాలో మూడు సెంచరీలతో పాటు 10 అర్థసెంచరీలు ఉన్నాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన బరోడా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 175 పరుగులు చేసింది. మితేష్ పటేల్ 60, విష్ణు సోలంకి 51 పరుగులు చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర 19.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. సమరత్ వ్యాస్ 52 బంతుల్లో 97 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కేవలం మూడు పరుగుల తేడాతో సెంచరీ మార్క్‌ను చేజార్చుకున్నాడు. pic.twitter.com/twhRAM0o2Y — cricket fan (@cricketfanvideo) October 12, 2022 చదవండి: ఏకకాలంలో నలుగురు పరిగెత్తుకొచ్చారు.. ఏం లాభం! తిలక్ వర్మ.. ఈసారి మాత్రం వదల్లేదు -
మహిళా అంపైర్‌తో దురుసు ప్రవర్తన.. అందుకే గొడవ
లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022లో ఆదివారం బిల్వారా కింగ్స్, ఇండియా క్యాపిటల్స్ మధ్య మ్యాచ్‌లో యూసఫ్ పఠాన్, మిచెల్ జాన్సన్‌ల గొడవ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. మైదానంలోనే గొడవకు దిగిన ఈ ఇద్దరు దాదాపు కొట్టుకున్నంత పని చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా మ్యాచ్ అనంతరం యూసఫ్ పఠాన్, మిచెల్ జాన్సన్‌లు ఒకరినొకరు క్షమాపణ చెప్పుకున్నారు. అయితే గొడవకు ప్రధాన కారణం యూసఫ్ పఠాన్ మహిళా అంపైర్‌తో దురుసుగా ప్రవర్తించడమేనని ఫాక్స్ క్రికెట్ ఆస్ట్రేలియా తమ ట్విటర్లో పేర్కొంది. బిల్వారా కింగ్స్, ఇండియా క్యాపిటల్స్ మ్యాచ్‌కు కిమ్ కాటన్ అంపైరింగ్ విధులు నిర్వహించింది. కాగా మ్యాచ్ సందర్భంగా మిచెల్ జాన్సన్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ఒక బంతిని కిమ్ కాటన్ వైడ్ కాల్ ఇవ్వలేదు. దీంతో కాటన్‌ను ఉద్దేశించి యూసఫ్ పఠాన్ అభ్యంతకర వ్యాఖ్యలు చేసినట్లు ఫాక్స్ క్రికెట్ వెల్లడించింది. ఇదే విషయమై ఓవర్ తర్వాత ఇద్దరి మధ్య గొడవకు దారి తీసిందని పేర్కొంది. ''మిచెల్‌ది ఏం తప్పు లేదు.. పఠాన్ మహిళా అంపైర్ కిమ్ కాటన్‌తో దురుసుగా ప్రవర్తించాడు.. అందుకే గొడవ జరిగింది'' అంటూ తెలిపింది. యూసఫ్‌ను తోసేసిన కారణంగా మిచెల్ జాన్సన్‌కు క్రమశిక్షణ చర్యల కింద లెజెండ్స్ లీగ్ క్రికెట్ కమిషనర్ రవిశాస్త్రి మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించాడు. ఇక యూసఫ్ పఠాన్ మాత్రం జరిమానా నుంచి తప్పించుకున్నాడు. ఇదే విషయాన్ని లెజెండ్స్ లీగ్ క్రికెట్ సీఈవో రామన్ రహేజా స్పందించాడు. ''లెజెండ్స్ లీగ్ ద్వారా ఒక సీరియస్, కాంపిటీటివ్ క్రికెట్‌ను మాత్రమే ప్రోత్సహించాలనుకుంటున్నాం. ఆదివారం మ్యాచ్ సందర్భంగా జరిగిన గొడవ బాధాకరం. అయితే గొడవకు సంబంధించి ఎవరిది తప్పు ఉందో తెలుసుకోవడానికి వీడియోను చాలాసార్లు పరిశీలించి ఒక నిర్ణయానికి వచ్చాం. తప్పెవరిదనేది పక్కనబెడితే మిచెల్ జాన్సన్.. పఠాన్‌ను తోసేసినట్లు క్లియర్‌గా కనిపించడంతో అతనికి జరిమానా విధించాం. ఇలాంటివి మళ్లీ జరగకూడదని ఆశిస్తున్నాం. మళ్లీ రిపీట్ అయితే ఉపేక్షించేది లేదు. సీరియస్ యాక్షన్ కచ్చితంగా ఉంటుంది'' అని పేర్కొన్నాడు. #ICYMI: Things got really heated in @llct20 between Yusuf Pathan and Mitchell Johnson. 🔥 pic.twitter.com/4EnwxlOg5P — Nikhil 🏏 (@CricCrazyNIKS) October 2, 2022 చదవండి: యూసఫ్ పఠాన్,మిచెల్ జాన్సన్‌ల గొడవ.. అంపైర్ తలదూర్చినా! -
యూసఫ్ పఠాన్, మిచెల్ జాన్సన్‌ల గొడవ.. అంపైర్ తలదూర్చినా!
లెజెండ్స్ లీగ్ క్రికెట్లో భాగంగా ఆదివారం బిల్వారా కింగ్స్, ఇండియా క్యాపిటల్స్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో యూసఫ్ పఠాన్, మిచెల్ జాన్సన్ గొడవ తారాస్థాయిలో జరిగింది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగి కొట్టుకునేదాకా వెళ్లిపోయారు. అంపైర్‌తో పాటు మిగతా ఆటగాళ్లు తలదూర్చి వారిని విడదీయాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. బిల్వారా కింగ్స్ ఇన్నింగ్స్ సమయంలో జట్టు బ్యాటర్ యూసఫ్ పఠాన్ బ్యాటింగ్ చేస్తున్నాడు.ఇండియా క్యాపిటల్స్ బౌలర్ మిచెన్ జాన్సన్ బౌలింగ్ పఠాన్ బౌండరీలు బాదాడు. అయితే ఓవర్ ముగిసిన తర్వాత మిచెల్ జాన్సన్ పఠాన్‌పై నోరు పారేసుకున్నాడు. తాను ఏం తక్కువ తినలేదంటూ యూసఫ్ పఠాన్ కూడా జాన్సన్‌ను తిట్టాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. దీంతో కోపంతో యూసఫ్ పఠాన్ జాన్సన్ వైపు దూసుకొచ్చాడు. అయితే జాన్సన్ పఠాన్‌ను తోసేశాడు. ఇక గొడవ తారాస్థాయికి చేరిందన్న క్రమంలో అంపైర్ తలదూర్చి జాన్సన్‌ను పక్కకి తీసుకెళ్లారు. ఆ తర్వాత కూడా ఇద్దరు ఎక్కడా తగ్గలేదు. ఇరుజట్ల కెప్టెన్లు, అంపైర్ల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. అయితే 48 పరుగులు చేసిన యూసఫ్ పఠాన్ మిచెల్ జాన్సన్ బౌలింగ్‌లో వెనుదిరగడం గమనార్హం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇండియా క్యాపిటల్స్ ఫైనల్లో అడుగుపెట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన బిల్వారా కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. షేన్ వాట్సన్ 65 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. విలియం పోర్టర్‌ఫీల్డ్ 59, యూసఫ్ పఠాన్ 48, రాజేష్ బిష్ణోయి 36 నాటౌట్ రాణించారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా క్యాపిటల్స్ 19.3 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. రాస్ టేలర్ 39 బంతుల్లో 84 పరుగులు చేయగా.. చివర్లో ఆష్లే నర్స్ 28 బంతుల్లో 60 పరుగులు నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించాడు. ఇక క్వాలిఫయర్ 1లో ఓడినప్పటికి బిల్వారా కింగ్స్‌కు మరో అవకాశం ఉంది. క్వాలిఫయర్-2లో గుజరాత్ జెయింట్స్‌తో బిల్వారా కింగ్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు అక్టోబర్ 5న ఇండియా క్యాపిటల్స్‌తో ఫైనల్ ఆడనుంది. #ICYMI: Things got really heated in @llct20 between Yusuf Pathan and Mitchell Johnson. 🔥 pic.twitter.com/4EnwxlOg5P — Nikhil 🏏 (@CricCrazyNIKS) October 2, 2022 చదవండి: ఓయ్ చహల్.. ఏంటా పని? 'బౌలింగ్ లోపాలు సరిదిద్దుకుంటాం.. సూర్య నేరుగా అక్టోబర్ 23నే' -
‘థ్యాంక్ యూ’ చెప్పలేదని పొడిచి చంపాడు..!
వాషింగ్టన్: చిన్న చిన్న గొడవలకే కొందరు సహనం కోల్పోతున్నారు. ఎదుటివారిపై దాడి చేసి వారి ప్రాణాలు పోయేందుకు కారణమవుతున్నారు. అలాంటి సంఘటనే అమెరికాలోని బ్రూక్లిన్‌లో వెలుగు చూసింది. ‘థ్యాంక్ యూ’ చెప్పలేదని మొదలైన వాగ్వాదం.. చిలికి చిలికి గాలివానగా మారి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయేందుకు దారి తీసింది. 37 ఏళ్ల వ్యక్తిని మరో వ్యక్తి కత్తితో పొడవటంతో తీవ్ర గాయాలై మృతి చెందాడు. పార్క్ స్లోప్‌లోని 4వ అవెన్యూ భవనం స్మోకింగ్ దుకాణం వద్ద ఈ గొడవ జరిగింది. ఈ సంఘటన స్థానిక సీసీటీవీ కెమెరాలో నమోదైంది. తెల్ల రంగు టీషర్ట్ ధరించిన బాధితుడు లోపలికి రాగా.. మరో వ్యక్తి డోర్ తెరిచాడు. అయితే, డోర్ తెరిచినందుకు కృతజ్ఞతలు తెలపకపోవటంపై లోపలి వ్యక్తి ప్రశ్నించాడు. దాంతో తాను తెరవాలని కోరలేదని, థ్యాంక్ యూ చెప్పనని స్పష్టం చేశాడు. దీంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగి కొట్టుకునే వరకు వెళ్లింది. బయటకు వెళ్లిన నిందితుడు తన సైకిల్ పై ఉన్న కత్తిని తీసుకొచ్చి బెదిరించాడు. బాధితుడు వెనక్కి తగ్గకుండా రెచ్చగొట్టగా.. పొట్ట, మెడ భాగంలో కత్తితో దాడి చేశాడు నిందితుడు. తీవ్రంగా రక్తస్రావమైంది. న్యూయార్క్ ప్రెస్బిటేరియన్ బ్రూక్లిన్ మెథొడిస్ట్ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఇదీ చదవండి: టిక్‌టాక్ ప్రేమ.. భర్తకు ప్రియురాలితో పెళ్లి చేసిన భార్య -
'ఆడింది చాలు పెవిలియన్ వెళ్లు'.. ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం
ఆసియా కప్ టోర్నీ ఎలాంటి గొడవలు లేకుండా సాఫీగా సాగుతుందని మనం అనుకునేలోపే ఒక ఆసక్తికర ఘటన జరిగింది. శనివారం సూపర్-4లో భాగంగా అఫ్గానిస్తాన్, శ్రీలంక మధ్య మ్యాచ్‌లో రషీద్ ఖాన్, దనుష్క గుణతిలకల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక 17 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 145 పరుగులతో ఆడుతోంది. గుణతిలక, రాజపక్సలు సమన్వయంతో ఆడుతూ లంకను విజయపథంవైపు నడిపిస్తున్నారు. అప్పటికే 3 ఓవర్లు వేసి 30 పరుగులు ఇచ్చిన రషీద్ ఖాన్ ఒక్క వికెట్ తీయలేకపోయాడు. ఇక 17వ ఓవర్ రషీద్ ఖాన్ వేశాడు. వేసిన తొలి బంతినే దనుష్క బౌండరీగా మలిచాడు. అంతే ఆవేశంతో ఊగిపోయిన రషీద్.. దనుష్కపై పరుష పదజాలంతో విరుచుకుపడ్డాడు. తానేం తక్కువ తిన్నానా అన్నట్లుగా దనుష్క గుణతిలక కూడా రషీద్‌కు కౌంటర్ ఇచ్చాడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం చోటుచేసుకోగా.. బానుక రాజపక్స వచ్చి వారిద్దరిని విడదీసి రషీద్‌కు సర్దిచెప్పాడు. అంతటితో వివాదం సద్దుమణిగింది. అయితే ఇదే ఓవర్ నాలుగో బంతికి గుణతిలక క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఇక పెవిలియన్ వెళ్లు అంటూ రషీద్ తన చేతితో గుణతిలకకు సంజ్ఞ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టులో బ్యాటర్స్ అంతా సమిష్టిగా రాణించడంతో విజయాన్ని అందుకుంది. బానుక రాజపక్స (14 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మిగిలిన వారిలో నిసాంక (35; 3 ఫోర్లు, 1 సిక్స్), కుశాల్ మెండిస్ (19 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), గుణతిలక (20 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) అదరగొట్టారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 175 పరుగులు సాధించింది. ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ (45 బంతుల్లో 84; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు), ఇబ్రహీమ్ జద్రాన్ (40; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. SL vs AFG - Rashid Khan pic.twitter.com/EbNMcojZo9 — MohiCric (@MohitKu38157375) September 3, 2022 చదవండి: భారత్-పాక్ మ్యాచ్; నోటి దాకా వచ్చినా.. 'బూతు పదం' కావడంతో AFG Vs SL Super-4: టి20 క్రికెట్లో అఫ్గానిస్తాన్ చెత్త రికార్డు.. ఏడేళ్లలో నాలుగోసారి -
నేనేం తప్పు చేశానని అరుస్తున్నారు.. మీడియాతో తాప్సీ వాగ్వాదం
‘ఝుమ్మంది నాదం’తో టాలీవుడ్‌కి పరిచయం అయిన సొట్టబుగ్గల సుందరి తాప్సీ పన్ను.. తొలి సినిమాతోనే ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో తెలుగు వరస ఆఫర్లు, స్టార్ హీరో సరసన నటించిన ఆమె ఉన్నట్టుంటి బాలీవుడ్‌కు మాకాం మార్చింది. అక్కడ మహిళ ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో ఈ భామ బాలీవుడ్లోనే సెటిలైపోయింది. అప్పుడప్పుడు 'మిషన్ ఇంపాజిబుల్' వంటి తెలుగు సినిమాలు చేస్తూ పలకరిస్తోంది. కాగా ఇటీవల స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన 'శభాష్ మిథూ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విజయం సంగతి ఎలా ఉన్న మరో చిత్రంతో ప్రేక్షకులను పలకరించనుంది తాప్సి. ఈ సొట్ట బుగ్గల బ్యూటీ నటించిన తాజా చిత్రం 'దొబారా'. ఈ మూవీ ఆగస్టు 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటుంది తాప్సీ. అయితే ఈ క్రమంలో ఫొటోగ్రాఫర్లతో తాప్సీకి కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. ముంబైలో సినిమా ప్రమోషన్ కోసం హాజరైన తాప్సీ గుమ్మం దగ్గర ఉన్న ఫొటోగ్రాఫర్లను పట్టించుకోకుండా లోపలికి వెళ్లిపోయింది. వారు వెనుక నుంచి ఎంత పిలిచినా స్పందించలేదు. 'ఇప్పటికే ఆలస్యంగా వచ్చారు. కొద్దిగా ఆగి వెళ్లండి' అంటూ అరుస్తున్నా, అవేమీ పట్టించుకోకుండా లోపలికి వెళ్లిపోయింది తాప్సీ. ఇక ఆమె బయటకు వచ్చిన తర్వాత వారితో చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకుంది. 'నేనేం లేటుగా రాలేదు. నా టైం ప్రకారమే నేను వచ్చాను. నేను ఇప్పటివరకు ప్రతి చోటుకు సరైన సమయానికే వెళ్లాను. నేనేం తప్పు చేశానని అరుస్తున్నారు' అని అడిగింది తాప్సీ. అందుకు వారు 'మేము రెండు గంటల నుంచి మీకోసం ఎదురుచూస్తున్నాం. కానీ మేము పిలుస్తున్నా మమ్మల్ని పట్టించుకోకుండా వెళ్లిపోవడం ఏంటి?' అని నిలదీశారు. 'అందులో నా తప్పు ఏముంది? నా పని నేను చేసుకుంటూ.. వెళ్లిపోతున్నాను' అని చెప్పగా 'మేము మీకోసం రెండు గంటల నుంచి ఎదురుచూస్తున్నాం' అని ఫొటోగ్రాఫర్స్ గట్టిగా అరిచేసరికి 'దయచేసి మీరు నాతో మర్యాదగా మాట్లాడండి. నేను కూడా మీతో మర్యాదాగ మాట్లాడతాను' అంటూ గొడవకు దిగింది. తర్వాత పరిస్థితిని సద్దుమణిగించేందుకు పలువురు ఫొటోగ్రాఫర్లు ప్రయత్నించగా, తాప్సీ సహనటుడు పావైల్ గులాటి కూడా ఆమె వెనుక నిలబడ్డాడు. 'కెమెరా నాపై ఉంది కాబట్టే నా వైపు మాత్రమే కనిపిస్తుంది. అదే ఒక్కసారి మీపై ఉంటే మీరు ఎలా నాతో మాట్లాడుతున్నారో మీకు అర్థమయ్యేదు. ఎప్పుడు మీరే కరెక్ట్. ప్రతిసారి నటీనటులదే తప్పు' అని అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. కొంతమంది నెటిజన్స్ 'తాప్సీకి ఎంత పొగరు' అని విమర్శిస్తుంటే, పలువురు 'ఆమె అలా మాట్లాడటంలో తప్పు ఏముంది?' అని సమర్థిస్తున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
'ది గ్రేట్ ఖలీ' ఏందయ్యా ఇదీ.. టోల్గేట్ సిబ్బందితోనా..!
చండీగఢ్: డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్, ప్రముఖ భారత రెజ్లర్ ది గ్రేట్ ఖలీ(49) అలియాస్ దలీప్ సింగ్ రాణా మరోమారు వార్తల్లో నిలిచారు. పంజాబ్, లుధియానాలోని ఓ టోల్గేట్ వద్ద సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. టోల్ కార్మికుడిపై ఖలీ చేయి చేసుకున్నాడని అక్కడి సిబ్బంది ఆరోపించారు. టోల్గేట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన ఖలీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే.. ఆ వీడియోలో టోల్ సిబ్బందిపై చేయి చేసుకున్నట్లు ఎక్కడా కనిపించలేదు. మరోవైపు.. లాధోవాల్ టోల్ ప్లాజా సిబ్బంది తనను బ్లాక్మెయిల్ చేశారని ఆరోపించారు దలిప్ సింగ్ రాణా. ఈ సంఘటన సోమవారం జరిగిందని పోలీసులు తెలిపారు. పంజాబ్‌లోని జలంధర్ నుంచి హరియాణాలోని కర్నాల్‌కు ఖలీ తన కారులో వెళ్తున్న క్రమంలో టోల్గేట్ వద్ద ఈ సంఘటన ఎదురైనట్లు చెప్పారు. ధ్రువీకరణ పత్రం అడిగిన తమ సిబ్బందిని ఎందుకు కొట్టారని ఖలీని టోల్ సిబ్బంది అడుగుతున్నట్లు ఆ వీడియోలో స్పష్టమవుతోంది. 'మిమ్మల్ని ఐడీకార్డు చూపించాలని అడిగారు. ఐడీ చూపించండి' అని టోల్ సిబ్బంది అడగగా.. మీరు నన్ను బ్లాక్‌మెయిలింగ్ చేస్తున్నారా? అంటూ ప్రశ్నించారు ఖలీ. దానికి 'మిమ్మల్ని మేము బ్లాక్మెయిల్ చేయటం లేదు.. అతడిని ఎందుకు కొట్టారు? మీ దగ్గర ఉంటే ఐడీ చూపించండి' అని టోల్ సిబ్బంది సమాధానమిచ్చారు. అయితే.. తన వద్ద ఎలాంటి ఐడీ కార్డు లేదని ఖలీ వారితో చెప్పారు. WWE wrestler #GreatKhali clashes with toll plaza staff at #Ludhiana#TheGreatKhali #ViralVideo #Punjab #Khali #ludhiana #WWE pic.twitter.com/XYJEhsdVtL — Vineet Sharma (@Vineetsharma906) July 12, 2022 ది గ్రేట్ ఖలీ వాహనం టోల్గేట్ దాటి వెళ్లకుండా ముందు బారికేడ్ పెట్టారు అక్కడి సిబ్బంది. దీంతో కోపంతో ఊగిపోయిన ఖలీ దానిని తీసి పక్కన పడేశారు. టోల్ సిబ్బంది ఖలీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు కలుగజేసుకుని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఇరువురు తమ వాదనలు పోలీసులకు వినిపించారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిన క్రమంలో వివరణ ఇచ్చారు ఖలీ. 'నిన్న పంజాబ్‌లోని లాధోవాల్ టోల్‌ప్లాజా వద్ద సిబ్బంది నా కారును అడ్డుకుని సెల్ఫీ కోసం నాతో అసభ్యంగా ప్రవర్తించారు. నేను అందుకు అంగీకరించకపోవటం వల్ల జాతివిద్వేష వ్యాఖ్యలు చేశారు. అలాగే కొన్ని బూతులు మాట్లాడారు.' అని ఖలీ చెప్పారు. ఇదీ చూడండి: దిల్లీ- ముంబైల మధ్య 'ఎలక్ట్రిక్ హైవే'.. దేశంలోనే తొలిసారి! -
కుర్చీ నాది.. కాదు నాది
మణుగూరు టౌన్: భద్రాద్రి జిల్లా మణుగూరు మున్సిపాలిటీలో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఘటనతో అటు ఉద్యోగులు, ఇటు పనుల కోసం వచ్చిన ప్రజలు ఆశ్చర్యపోయారు. కమిషనర్ కుర్చీ నాదంటే నాదేనని ఇద్దరు అధికారులు వాదించు కోవడంతో గందరగోళంలో పడిపోయారు. గతంలో మణుగూరు మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన వెంకటస్వామిని వైరా కమిషనర్‌గా బదిలీ చేశారు. మణుగూరు కమిషనర్‌గా నాగప్రసాద్‌ను నియమించారు. అయితే మున్సిపల్ ఉన్నతాధికారులు మణుగూరు మున్సిపల్ కమిషనర్‌గా తిరిగి వెం కటస్వామిని నియమిస్తూ శనివారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో వెంటస్వామి సోమవారం కార్యాలయానికి వచ్చి కమిషనర్ సీటులో కూర్చు న్నారు. కాసేపటికి వచ్చిన నాగప్రసాద్ తనను రిలీవ్ చేస్తూ ఆదేశాలు రానందున తానే కమిషన ర్‌నని వాదించారు. సీటులో తననే కూర్చోనివ్వా లని సూచించారు. తనకు సీడీఎంఏ నుంచి ఉత్త ర్వులు వచ్చినందున తానే కమిషనర్‌నని, కలెక్టర్ ను కలిసి రిలీవ్ ఉత్తర్వులు తెచ్చుకోవాలని వెంక టస్వామి అన్నారు. ఈ విషయమై సాయంత్రం వరకు ఎలాంటి స్పష్టత రాలేదు. -
కోహ్లితో బవుమా గొడవ.. ఏం జరిగింది?
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య తొలి వన్డేలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 36వ ఓవర్ నాలుగో బంతిని కెప్టెన్ బవుమా షార్ట్ కవర్ రీజియన్ దిశగా ఆడాడు. అది నేరుగా కోహ్లి చేతుల్లోకి వెళ్లింది. అయితే పంత్ వైపు వేసే ఉద్దేశంతో కోహ్లి బంతిని బలంగా విసిరాడు. పొరపాటున బంతి బవుమాకు తగిలినప్పటికి పెద్దగా గాయం కాలేదు. చదవండి: టీమిండియా క్రికెటర్లకు ఘోర అవమానం.. ఇక్కడితో ఇది ముగిసిదనుకుంటే.. బవుమా కోహ్లివైపు కోపంగా చూస్తూ.. ''నేను క్రీజులోనే ఉన్నా అలాంటి త్రోలు వేయనవసరం లేదు'' అంటూ పేర్కొన్నాడు. దీంతో కోపం పట్టలేకపోయిన మెషిన్‌గన్ బవుమాతో.. ''నేనేం కావాలని నిన్ను కొట్టాలనుకోలేదు.. వికెట్ కీపర్‌కు త్రో వేసే క్రమంలో పొరపాటున తగిలిఉంటుంది.. ఒక బ్యాట్స్‌మన్‌గా ఇది నువ్వు అర్థం చేసుకోవాలి'' అంటూ ధీటుగా బదులిచ్చాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సాతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. ఒక దశలో 68 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సౌతాఫ్రికాని కెప్టెన్ బావుమా 143 బంతుల్లో 8 ఫోర్లతో సహాయంతో 110 పరుగులు, వాన్ డస్సెన్ 96 బంతుల్లో 9 ఫోర్లు 4 సిక్సర్లతో 129 పరుగులు నాటౌట్‌గా రాణించారు. వీరిద్దరు చెలరేగి ఆడటంతో సౌతాఫ్రికా భారీ స్కోరు సాధించింది. ఏకంగా ఇద్దరు సెంచరీలతో చెలరేగారు. నాలుగో వికెట్‌కి రికార్డ్ పార్ట్నర్ షిప్ 204 పరుగులను సాధించారు. 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 296 పరుగులు చేసి భారత్‌కి భారీ టార్గెట్‌ని విధించారు. టీమిండియా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ సాధించారు. చదవండి: 'బులెట్ వేగం'తో మార్క్రమ్ను దెబ్బకొట్టిన వెంకటేశ్ అయ్యర్ pic.twitter.com/fypjtfqCUf — Sunaina Gosh (@Sunainagosh7) January 19, 2022 -
వివాహేతర సంబంధం.. అర్ధరాత్రి ప్రియుడి ఇంట్లో ఘర్షణ..
సాక్షి, చిక్కబళ్లాపురం(కర్ణాటక): నగరంలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం కారణంగా ఓ మహిళ హత్యకు గురైంది. వివరాలు... నగరంలోని నక్కలకుంట వార్డులో నివాసం ఉంటున్న నరసింహప్పకు అంజినమ్మ (40) అనే మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో అంజినమ్మ.. నరసింహప్ప ఇంటికి వచ్చింది. ఆ సమయంలో ఇద్దరి మధ్య కొంత ఘర్షణ జరిగింది. ఆగ్రహంతో నరసింహప్ప బలమైన వస్తువుతో అంజినమ్మ తలపై కొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. చుట్టుపక్కల వారు విషయం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ మిథున్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. -
జర ఆగితే ఏమైంది.. 5 నిమిషాలు ఆగలేక పోయారా..?
సాక్షి, ఖమ్మం: కారేపల్లిలో టీఆర్ఎస్ మండల నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్, జెడ్పీటీసీ వాంకుడోత్ జగన్ మధ్య వేదికపై ఆసక్తికర చర్చ జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతుండగా.. జెడ్పీటీసీ కలగజేసుకుని ‘నేను రాకముందే పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించారు. ఎమ్మెల్యే గారూ ఓ ఐదు నిమిషాలు ఆగలేక పోయారా..?’ అన్నారు. ‘మీరే అరగంట ముందు ఉండి ఏర్పాట్లు చూసుకోవాలి కదా? మీకోసం ఎమ్మెల్యే వేచి చూడాలా?’ అని శాసనసభ్యులు బుదులిచ్చారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా కాస్త సంవాదం జరిగింది. దీంతో అక్కడి నాయకులు కలగజేసుకుని సముదాయించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. కార్యక్రమంలో ఎంపీపీ మాలోతు శకుంతల, వైఎస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, మండల కన్వీనర్ మల్లెల నాగేశ్వరరావు, సర్పంచ్ ఆదెర్ల స్రవంతి, మాజీ ఎంపీపీ పద్మావతి, నాయకులు అజ్మీర వీరన్న, ఇమ్మడి తిరుపతిరావు, ఎంపీటీసీలు ఉమాశంకర్, మూడ్ జ్యోతి పాల్గొన్నారు. -
అడిషనల్ కలెక్టర్‌ను నిలదీసిన కూలీలు
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని నేతాజీ చౌరస్తాలో కూలీలకు, అడిషనల్ కలెక్టర్ డేవిడ్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. మహరాష్ట్ర నుండి వచ్చే కూలీలను నియంత్రణ చేయాలని.. అందులో భాగంగా కూలీలు రాకుండా రాకపోకలు నిలిపివేయాలని కూలీలు డిమాండ్ చేశారు. మహరాష్ట్ర నుండి వస్తున్న వందల మంది కూలీల రాకతో ఆదిలాబాద్‌లో కరోనా విజృంభిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. మహరాష్ట్ర నుండి వచ్చే కూలీలను అడ్డుకుంటామని హమీ ఇవ్వాలంటూ కూలీలు.. అడిషనల్ కలెక్టర్‌ను నిలదీశారు. దీనిపై ఆయన కూలీలకు స్పష్టమైన సమాధానం ఇవ్వలేక వెనుదిరిగారు. చదవండి: సెల్ టవర్ ఎక్కి వ్యక్తి హల్చల్ ఈ చెరువుల్లో నీరు యమ డేంజర్, అస్సలు తాకొద్దు -
అడిషనల్ కలెక్టర్‌ను నిలదీసిన కూలీలు
-
వైరల్: బిగ్‌బాస్ నటుడి సాహసం
బిగ్‌బాస్ ఫేం సిధార్థ్ శుక్లాకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నటుడి మీద ఈగ వాలనీయరు అభిమానులు. ఇక తాజాగా సిధార్థ్ శుక్లాకి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం తెగ వైరలవుతోంది. మా అభిమాన నటుడు ఎంత ధైర్యవంతుడో చూడండి అంటూ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. పైగా ఈ రోజు సిధార్థ్ శుక్లా పుట్టిన రోజు కావడంతో ఈ వీడియోని విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఇంతకు ఈ వీడియోలో ఏం ఉందంటే.. 13-14 మంది వ్యక్తులు సిధార్థ్ను చుట్టుముట్టి తాగి డ్రైవ్ చేశాడంటూ ఆరోపిస్తూ.. అతడితో గొడవకు దిగారు. ఇంత మంది చుట్టుముట్టినా సిధార్థ్ ఏ మాత్రం భయపడకుండా ఎంతో చాకచక్యంగా వారిని డీల్ చేయడమే కాక.. తనను తాను కాపాడుకుంటారు. ఒక్కడే అంతమందిని ధైర్యంగా ఎదుర్కొవడంతో సిధార్థ్ ఫ్యాన్స్ తమ అభిమాన నటుడిని ‘షేర్’(సింహం) అంటూ ప్రశంసిస్తున్నారు. (చదవండి: ఏడేళ్ల ప్రేమకు బ్రేక్ పడింది..) They judged him for a 20 seconds video, they called him drunk, this man stood alone among 13-14 people. Guts chahiye, sher hai woh, vo ekela kafii hai in Jese chuzo k liye😏 Agli baar defame karne se pehle soch lena karma is watching🙌#SherSidharthShuklahttps://t.co/8GzAE3ATtw — Sakshi 💓 (@ItsSakshii) December 14, 2020 ఈ క్రమంలో ఓ యూజర్ ఈ వీడియోని షేర్ చేస్తూ.. ‘వారు తాగి డ్రైవ్ చేస్తున్నావంటూ సిధార్థ్తో గొడవపడ్డారు. ఒక్కడిని 13-14 మంది చుట్టుముట్టారు.. వీరందరితో తలపడటానికి ధైర్యం కావాలి.. తనో సింహం. ఇక మొదట షేర్ చేసిన 20 సెకన్ల నిడివి గల వీడియోలో తను తాగి, డ్రైవ్ చేస్తున్నాడంటూ ఆయన పేరు చెడగొట్టే ప్రయత్నం చేశారు. కానీ ఈ వీడియోతో అసలు నిజం బయటకు వచ్చింది. ఇంకో సారి తన పేరు చెడ్డగొట్టాలని భావించేవారు కర్మ అందరిని గమనిస్తూ ఉంటుందని గుర్తుంచుకోవాలి’ అంటూ ఈ వీడియోని షేర్ చేశారు. ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. -
టీడీపీ నేతల ఓవరాక్షన్
సాక్షి, అనంతపురం: బుక్కరాయసముద్రం తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం టీడీపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించడంతో.. వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు, టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకొంది. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో టీడీపీ నేతలు అసత్య ఆరోపణలతో దుష్ప్రచారం చేసి.. గ్రామాల మధ్య చిచ్చుపెడుతున్నారని వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. టీడీపీ కార్యకర్త నాగరాజు ఇంటికి వెళ్లే దారి మూసేశారంటూ ఫోటోలు తీసి.. తన ఇంటి స్థలాన్ని ఆక్రమించేందుకు కుట్ర పన్నుతున్నారని ఎల్లోమీడియాలో అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన రెవెన్యూ, పోలీసు అధికారులు టీడీపీ నేతల ఆరోపణల్లో నిజం లేదని తేల్చారు. వైఎస్సార్ సీపీ కార్యకర్త వెంకట్రామిరెడ్డి దారి మూసేయలేదని.. తన స్థలం హద్దుల్లో బండలు వేసుకున్నారని పేర్కొన్నారు. ఈ విషయమై టీడీపీ నేతలను ప్రశ్నించగా వారి మధ్య వివాదం రాజుకుంది. -
ట్రంప్ వాదనలో నిజమెంత ?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు ఆదినుంచి వివాదాస్పదమే. అధ్యక్షుడి హోదాలో ఆయన చేసే ప్రకటనల్లో నిజం కూడా నేతి బీరకాయలో నెయ్యి చందంగానే మారుతోంది. శరణార్థుల పేరు చెబితే అంతెత్తున లేస్తున్న ట్రంప్ అమెరికా వలస విధానంపైనా, మెక్సికో సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపైనా తాజా ప్రకటనలన్నీ తప్పుడు తడకలే. వలసవాదులు వాళ్లు చేస్తున్న నేరాలపై ఈ మధ్య కాలంలో ట్రంప్ చేసిన ప్రకటనలేంటి ? వాటి వెనుకనున్న వాస్తవాలేంటి ? వలస న్యాయమూర్తులపై ట్రంప్ : అక్రమంగా వలస వచ్చిన వారి విచారణకు వేలకు వేల మంది న్యాయమూర్తులున్నారు. పనికిమాలిన వలస చట్టాల కారణంగా వారిని నియమించాల్సి వస్తోంది. ఇక మా చట్టాలను మార్చేస్తాం. సరిహద్దుల్లో గోడలు కట్టేస్తాం. అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తే ఇక కోర్టులు, కేసులు ఉండవు. వెనక్కి తిరిగి పంపేస్తాం. వాస్తవం : అక్రమ వలస కేసుల్ని విచారించానికి వేలాది మంది న్యాయమూర్తులు ఉన్నారన్నది పూర్తిగా తప్పు. ఈ విచారణకు ఉద్దేశించిన కోర్టుల్లో దేశవ్యాప్తంగా 335 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారు. 150 మంది అదనపు న్యాయమూర్తుల నియామకానికి బడ్జెట్ ఉంది. ఇంకా ఏడు లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్ కేసులన్నీ పూర్తి కావాలంటే ఒక్కో న్యాయమూర్తి 2 వేలకు పైగా కేసుల్ని విచారించాల్సి ఉంది. తల్లీ బిడ్డల్ని వేరు చేయడంపై ట్రంప్: అత్యంత అమానవీయంగా సరిహద్దుల్లో తల్లీ బిడ్డల్ని వేరు చేయడంపై విమర్శలు వెల్లువెత్తడంతో వెనక్కి తగ్గిన ట్రంప్ జీరో టాలరెన్స్ విధానానికి స్వస్తి పలికే ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై సంతకం చేస్తూ .. ఇకపై మేము కుటుంబాల్ని కలిపే ఉంచుతాం. దీంతో సమస్య పరిష్కారమైపోతోందని వ్యాఖ్యానించారు. వాస్తవం : వలసదారుల సమస్యలు ఎంత మాత్రం పరిష్కారం కావు. వారిపై కేసుల విచారణ ముగిసేవరకు తల్లీబిడ్డల్ని వేర్వేరుగా బదులుగా ఒకే చోట నిర్బంధించి ఉంచుతారు. అంతేకాదు అక్రమంగా దేశంలోకి ప్రవేశించే వ్యక్తుల నుంచి వారి పిల్లలను 20 రోజులకు మించి వేరు చేసి ఉంచకూడదని 1997 నాటి ఫ్లోర్స్ ఒప్పందం చెబుతోంది. అమెరికన్ కాంగ్రెస్ లేదంటే అక్కడి కోర్టులు ఏదో ఒక నిర్ణయం తీసుకునే వరకు ఈ 20 రోజుల విధానం అమల్లోనే ఉంటుందని న్యాయశాఖ స్పష్టం చేసింది. దాని ప్రకారం చూస్తే ప్రభుత్వ అధికారులకు మూడు వారాల తర్వాత మళ్లీ తల్లీ బిడ్డల్ని బలవంతంగా వేరు చేయడానికి అన్ని అధికారాలు సంక్రమిస్తాయి. వలసదారుల అరెస్టులపై ట్రంప్ : 2011 ప్రభుత్వ నివేదిక ప్రకారం హత్యా నేరం కింద 25 వేల మంది, దోపిడి కేసులో 42 వేల మంది, లైంగిక నేరాల్లో 70 వేల మంది, కిడ్నాప్ కేసుల్లో 15 వేల మంది అక్రమవలదారుల అరెస్టులు జరిగాయి. గత ఏడేళ్లుగా కేవలం టెక్సాస్‌లోనే రెండున్నర లక్షల మంది అక్రమ వలసదారుల్ని అరెస్ట్ చేశాం. వారిపై ఆరులక్షలకు పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వాస్తవం: అక్రమ వలసదారుల అరెస్టులపై ప్రభుత్వ అధికారిక గణాంకాలు, నివేదికలో అంశాలనే ట్రంప్ ప్రస్తావించారు. సరిహద్దులు దాటుకొని వచ్చిన నేరగాళ్లలో 30 లక్షల మందికి పైగా జరిగిన అరెస్టులు వాస్తవమే కానీ, అందులో సగానికిపైగా అక్రమవలస, మాదకద్రవ్యాలు, ట్రాఫిక్ నేరాల కింద జరిగాయి. చాలా వరకు కేసులు పౌర చట్టాల అతిక్రమణలకు సంబంధించిన కేసులే తప్ప, క్రిమినల్ అభియోగాలు కాదు. వలసదారుల నేరాలపై ట్రంప్ : ఎప్పుడూ నా చెవుల్లో ఒక మాట వినపడుతూ ఉంటుంది. అమెరికా పౌరుల కంటే వాళ్లు (వలస వచ్చిన వారు) మంచివాళ్లు అని.. అదెంత మాత్రం సరైంది కాదు. వాళ్లే అధిక నేరాలు చేస్తున్నారు. వాళ్లున్న చోటే శాంతి భద్రతల సమస్య తలెత్తుతోంది. వాస్తవం : అమెరికాలో వివిధ సామాజిక సంస్థలు, కాటో ఇనిస్టిట్యూట్ వంటి మేధో సంస్థల గణాంకాల ప్రకారం అమెరికా పౌరులతో పోల్చి చూస్తే వలసదారులు చేసే నేరాల సంఖ్య చాలా తక్కువ. 1990 సంవత్సరం నుంచి 2014 వరకు గణాంకాలను పరిశీలిస్తే వలసదారులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో క్రైమ్ రేటు చాలా తక్కువగా నమోదైంది. అత్యధిక వలసదారుల జనాభా ఉన్న న్యూయార్క్ నగరంలో (5 లక్షల మంది వరకు అక్రమంగా ఉన్నారని అంచనా) గత ఏడాది 292 హత్యలు జరిగాయి. అమెరికాలో ఎన్ని హత్యలు జరిగాయన్నదానిపైనే శాంతి భద్రతల్ని అంచనా వేస్తారు. అలా చూస్తే వలస వచ్చిన వారు స్థిరపడిన ప్రాంతాల్లోనే హత్యలు తక్కువగా జరిగాయి. ఆర్థిక వ్యవస్థకు వాళ్లే ఆలంబన గత ఏడాది ఫిబ్రవరిలో అమెరికా ‘ వలసదారులు లేకుండా ఒక్కరోజు‘ పేరుతో ఇమిగ్రెంట్స్ అందరూ 24 గంటల సమ్మెకు దిగేసరికి అమెరికా వణికి పోయింది. రెస్టారెంట్లు, నిర్మాణ కంపెనీలు, ఇతర వాణిజ్య కేంద్రాల్లో వలస వచ్చిన వారుపనికి హాజరుకాకపోయేసరికి ఆ ఒక్క రోజే దుకాణాలు మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వలసదారుల శ్రమ లేకపోతే అమెరికా ఆర్థిక వ్యవస్థే కుప్పకూలిపోతుందని కొన్ని స్వతంత్ర సంస్థలు చెబుతున్నాయి. అమెరికా పౌరులు వలస వచ్చిన వారిని ఎంత చిన్న చూపు చూసినా రెస్టారెంట్లలో వంటలు చెయ్యడానికీ మెక్సికన్లు కావాలి, వ్యవసాయ క్షేత్రాల్లోపని చేయడానికి వాళ్ల సహకారమే ఉండాలి. అమెరికన్ల ఇళ్లు శుభ్రం చేయాలన్న, గిన్నెలు తోమాలన్నా, తోటల్లో మాలీలుగానైనా, పిల్లల్ని సంరక్షించాలన్నా మెక్సికన్లే దిక్కు అని అమెరికాలోని ప్రముఖ షెఫ్ ఆంథోని బౌర్డెన్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా సేవారంగంలో వసలదారులే ఎక్కువగా ఉన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారు అమెరికన్ల ఉద్యోగాలు కాజేస్తున్నారని అందరూ గగ్గోలు పెడుతున్నారు కానీ, గత రెండు దశాబ్దాల్లో రెస్టారెంట్లలో వంటలు, డిష్ వాషింగ్ వంటి ఉద్యోగాల కోసం ఒక్క అమెరికన్ కూడా ముందుకు రాలేదు. మెక్సికన్లు అంటూ లేకపోతే అమెరికాలో సేవా రంగం కుదేలైపోతుందని ఆంథోని చెబుతున్నారు. అమెరికన్ రెస్టారెంట్లలో 75 శాతం వలసదారులే పని చేస్తున్నారు. ఇక వ్యవసాయ రంగంలో కూడా అత్యధికులు వలసదారులేనని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ చదవండి: ట్రంప్ అభిశంసనకు 42 శాతం మొగ్గు -
గుర్తుపెట్టుకోవలసిన సంతోషం
కాసేపటి తర్వాత ఇద్దరు మిత్రులూ మళ్లీ మౌనంగా నడక సాగించారు. దారిలో ఓ చోట ఓ నీటి గుంట కనిపించింది. ఇద్దరూ కలిసి ఆ నీటిగుంటలోని నీటిని తాగేందుకు గుంటలోకి దిగారు. ఇద్దరు మిత్రులు ఒక ఎడారిలో నడుచుకుంటూ వెళుతున్నారు. ఉన్నట్టుండి వారి మధ్య ఓ విషయమై వాదన మొదలైంది. అది తారస్థాయికి చేరింది. కోపం తట్టుకోలేకపోయిన వ్యక్తి తటాలున తన మిత్రుడిపై చెయ్యి చేసుకున్నాడు. అయితే దెబ్బలు తిన్న వ్యక్తి ఏమాత్రం ఆవేశపడకుండా ఓ పక్కకు వెళ్లి దగ్గర్లోనే ఉన్న ఇసుక దిబ్బపై ప్రశాంతంగా కూర్చుని, అక్కడున్న ఓ పుల్లను తీసుకుని ఆ ఇసుకతిన్నెపై ఇలా రాశాడు. ‘‘ఈ రోజు నా ప్రాణస్నేహితుడు నన్ను బలంగా కొట్టాడు’’ అని! కొట్టిన మిత్రుడికి తన మిత్రుడి వైఖరి అర్థం కాలేదు. కాసేపటి తర్వాత ఇద్దరు మిత్రులూ మళ్లీ మౌనంగా నడక సాగించారు. దారిలో ఓ చోట ఓ నీటి గుంట కనిపించింది. అంతకు కొద్దిసేపటి క్రితం తమ ఇద్దరి మధ్య జరిగిన వివాదాన్ని వారు మరచిపోయారు. ఇద్దరూ కలిసి ఆ నీటిగుంటలోని నీటిని తాగేందుకు గుంటలోకి దిగారు. ఇంతలో మిత్రుడితో దెబ్బ తిన్న వ్యక్తికి తన కాలిని ఎవరో లాగుతున్నట్టు అనిపించింది. నిజానికి అది లాగడం కాదు, అతని కాలు బురదలో కూరుకుపోతోంది. మిత్రుడి స్థితి గమనించిన రెండో వ్యక్తి అతనిని ఎలాగో కష్టపడి గుంటలోంచి పైకి చేర్చాడు. ప్రాణాలతో బయటపడ్డ ఆ మిత్రుడు అక్కడికి దగ్గర్లో ఉన్న ఓ రాతిమీద కూర్చొని, అక్కడే ఉన్న ఓ రాయి తీసుకుని దానితో తాను కూర్చున్న రాతిమీద ఓ పక్కగా ఇలా రాశాడు: ‘‘ఈరోజు నా మిత్రుడు నన్ను రక్షించాడు’’ అని.ఇది చూసిన మిత్రుడు ‘‘నేను నిన్ను కొట్టినప్పుడు ఇసుకలో రాశావు. ఇప్పుడేమో కాపాడితే రాతి మీద రాశావు! వీటి అర్థమేమిటీ’’ అని అడిగాడు. అప్పుడు ఆ మిత్రుడు ఇలా జవాబిచ్చాడు.‘‘ఎవరయినా మనల్ని గాయపరచినప్పుడు దానిని ఇసుకపై రాయాలి. అప్పుడు క్షమించడమనే గాలి దానిని చెరిపేస్తుంది. ఒకవేళ ఎవరైనా మంచో మేలో చేస్తే దానిని రాతి మీద రాయాలి. అది కాలాలను దాటి ఎప్పటికీ చెక్కుచెదరక ఉంటుంది’’ అని! జీవితంలో కూడా మరచిపోవలసిన బాధలను ఇసుక మీద రాసుకోవాలి. గుర్తుపెట్టుకోవలసిన సంతోషాలను రాతి మీద బలంగా రాసుకోవాలి. అప్పుడే జీవన మాధుర్యాన్ని అనుభవించగలం. -
క్రికెట్ మ్యాచ్‌లో ఘర్షణ.. కత్తులతో దాడి
న్యూఢిల్లీ: క్రికెట్ మ్యాచ్ పిచ్ కోసం రెండు వర్గాల మధ్య నెలకొన్న వివాదం కత్తులతో పొడుచుకునేలా చేసింది. బుధవారం ఢిల్లీలోని మెహ్రాలీస్ డీడీఏ పార్క్‌లో క్రికెట్ ఆడుతున్న వర్గంతో మరో గ్రూప్‌కి పిచ్ కోసం వివాదం నెలకొంది. ఇది కాస్త పెద్దదవ్వడంతో రెండో గ్రూప్‌లోని యువకులు క్రికెట్ ఆడుతున్న వారిపై కత్తులతో దాడిచేశారు. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. 8 నుంచి 10 మంది యువకులు మా పై దాడిచేసి డబ్బులు దోచుకెళ్లారని క్షతగాత్రుడి సోదరుడు ఒకరు మీడియాకు తెలిపాడు. గాయపడ్డ యువకులను ఏయిమ్స్‌కు తరలించగా వారి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అసెంబ్లీకి ‘గుట్కా’
నిషేధిత మత్తు పదార్థాలు (గుట్కా) అమ్మకాలకు లంచం వ్యవహారం బుధవారం అసెంబ్లీని కుదిపేసింది. చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఒత్తిడి తెచ్చినా, స్పీకర్ ఏమాత్రం తలొగ్గలేదు. ప్రతిపక్ష సభ్యులు, స్పీకర్ మధ్య తీవ్ర వాగ్వాదం సాగినా, స్పందన శూన్యం. స్పీకర్ తీరును నిరసిస్తూ ప్రతిపక్షాలన్నీ వాకౌట్ చేశాయి.. ♦ చర్చకు పట్టు ♦ ప్రతిపక్షాల ఒత్తిడి ♦ తగ్గని స్పీకర్.. వాగ్వాదం ♦ వాకౌట్లతో నిరసన సాక్షి, చెన్నై : మంత్రి, అధికారుల అండతో గుట్కా వ్యవహారంపై అసెంబ్లీలో పెద్ద ఎత్తున వాగ్వాదం చోటుచేసుకుంది. మూడురోజుల సెలవుల అనంతరం బుధవారం అసెంబ్లీ సమావేశమైంది. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. ఆమేరకు బాణసంచా ధరల తగ్గింపు విషయంగా కేంద్రంతో సంప్రదింపులు జరుపుతామని మంత్రి జయకుమార్ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అలాగే, రిజిస్ట్రేషన్ చార్జీల తగ్గింపు కోసం అడిగిన ప్రశ్నకు మంత్రి వీరమణి సమాధానం దాటవేస్తూ ప్రసంగించారు. ప్రశ్నోత్తరాలు ముగియగానే, సభలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. వాగ్వాదం.. వాకౌట్ డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ అసెంబ్లీ ముందుకు ‘గుట్కా’ లంచం వ్యవహారాన్ని తీసుకొచ్చారు. స్పీకర్ ధనపాల్ అడ్డు పడుతూ,ఇది సమయం కాదని వారించారు. డీఎంకే తరపున పది గంటల సమయంలో తనకు ఈ విషయంగా లేఖ అందిందని, అది పరిశీలనలో ఉన్నట్టు పేర్కొంటూ స్టాలిన్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఇందుకు డీఎంకే సభ్యులు తీవ్ర ఆక్షేపణ వ్యక్తంచేస్తూ నినాదాల్ని హోరెత్తించారు. పత్రికల్లో వచ్చిన గుట్కా వ్యవహారాన్ని ప్రదర్శిస్తూ, చర్చకు పట్టుబట్టారు. మంత్రి విజయభాస్కర్, ఇద్దరు డీజీపీలపై చర్యలు తీసుకోవాలని ఒత్తిడి తెచ్చే పనిలో పడ్డారు. దీంతో సభలో పరిస్థితి గందరగోళంగా మారింది. తమ గళాన్ని నొక్కవద్దని, మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్టాలిన్‌తో పాటు డీఎంకే శాసన సభా పక్ష ఉపనేత దురై మురుగన్ స్పీకర్‌కు విన్నవించారు. అయితే, స్పీకర్ ఏమాత్రం ఖాతరు చేయలేదు. ఇంతలో దురై మురుగన్ స్పీకర్ పోడియం ముందుకు దూసుకెళ్లారు. దీంతో స్పీకర్ ఆగ్రహంతో డీఎంకే సభ్యుల్ని ఉద్దేశించి స్పందించడంతో సభలో వ్యతిరేక నినాదాలు మిన్నంటాయి. స్పీకర్, డీఎంకే సభ్యుల మధ్య వాగ్వాదం హోరెత్తింది. చివరకు గుట్కా వ్యవహారం అసెంబ్లీ ముందుంచే విధంగా స్టాలిన్ ప్రసంగాన్ని సాగించడం, క్షణాల్లో స్పీకర్ అడ్డుపడడంతో డీఎంకే సభ్యుల్లో ఆగ్రహం రేగింది. స్పీకర్‌కు వ్యతిరేకంగా నినదిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. తదుపరి కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత రామస్వామి తన ప్రసంగంలో స్పీకర్ తీరును తీవ్రంగా ఖండించారు. ఆయన ప్రసంగాన్ని కూడా స్పీకర్ అడ్డుకోవడంతో కాంగ్రెస్ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎమ్మెల్యే అబుబక్కర్ సైతం సభ నుంచి వాకౌట్ చేశారు. స్టాలిన్ ఆగ్రహం ప్రజా సమస్యలే కాదు, కీలక వ్యవహారాల్ని సభ దృష్టికి తీసుకెళ్లినా, చర్చించే సమయం స్పీకర్ లేదని ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ మండిపడ్డారు. ఆరోగ్య మంత్రి విజయభాస్కర్, ఇద్దరు డీజీపీల మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చి ఉంటే, వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని ధ్వజమెత్తారు. ఐటీ దాడులు హోరెత్తినా, అవినీతి ఆరోపణలు ఆధారాలతో బయటపడ్డా, ముడుపుల వ్యవహారం వెలుగులోకి వచ్చినా, ఈ పాలకులు చోద్యం చూస్తున్నారని, తమ ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడే విధంగా లంచం పుచ్చుకుని గుట్కా విక్రయాలకు అనుమతిచ్చిన వ్యవహారంలో మంత్రిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్‌చేశారు. డీజీపీలు జార్జ్, రాజేంద్రన్‌పై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత రామస్వామి మాట్లాడుతూ, స్పీకర్ ప్ర«తిపక్షాల గళాన్ని నొక్కేస్తున్నారని ధ్వజమెత్తారు. ఢిల్లీకి నివేదిక తమకు లభించిన డైరీలోని అంశాల ఆధారంగా ఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి గుట్కా లంచం వ్యవహారాన్ని ఆదాయపు పన్ను శాఖ వర్గాలు పంపించాయి. ఇందులో గుట్కా అనుమతి వ్యవహారంతో పాటు కౌన్సిలర్ మొదలు మంత్రి వరకు, ఏసీ నుంచి కమిషనర్, డీజీపీ వరకు సంబంధింత సంస్థ పండుగ మాముళ్ల ఇచ్చి ఉండడాన్ని ప్రస్తావించి ఉన్నారు. అమ్మకు స్మారక మందిరం దివంగత సీఎం జయలలిత సమాధి వద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో స్మారక మందిరం నిర్మించనున్నామని అసెంబ్లీలో సీఎం పళనిస్వామి ప్రకటించారు. సాయంత్రం ఆరు గంటల వరకు అసెంబ్లీ సమావేశం సాగగా, తన పరిధిలోని ప్రజా పనుల శాఖలో అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపుల గురించి సాయంత్రం సీఎం ప్రసంగించారు. ఇందులో దివంగత సీఎం జయలలిత సమాధి ఉన్న ప్రాంతంలో స్మారక మందిరం నిర్మించనున్నామని తెలిపారు. అలాగే, దివంగత ఎంజీయార్ శత జయంతి స్మారకంగా చెన్నైలోని ఓ ప్రధాన మార్గంలో భారీ ఆర్చ్ నిర్మించనున్నామని ప్రకటించారు. -
మీ వల్లే నష్టం.. కాదు మీవల్లే ఓడిపోయాం!
కాంగ్రెస్ నేతలు పొన్నం – అనిల్ వాగ్వాదం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న ముఠా తగాదాలు బట్టబయలవు తున్నాయి. శుక్రవారం అసెంబ్లీలోని కాం గ్రెస్ శాసనసభాపక్ష కార్యాలయంలోనే ఇద్దరు నేతలు పరస్పరం బహిరంగంగా ఆరోపణలు చేసుకున్నారు. తెలంగాణలో పార్టీకి మీవల్లే అంటే... మీవల్లనే నష్టం జరిగిందని.. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ మాజీవిప్ ఈరవత్రి అనిల్ వాదనకు దిగారు. ఆర్బీఐ ఎదుట పార్టీ ధర్నా తర్వాత అసెంబ్లీలోని కార్యాలయానికి కొందరు నాయకులు వెళ్లా రు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ మాజీవిప్ అనిల్ తదితరుల మధ్య మొదలైన రాజకీయ చర్చ క్రమంగా వేడెక్కిం ది. తెలం గాణలో కాంగ్రెస్ ఓడిపోవడానికి అప్పట్లో ఎంపీలుగా ఉన్నవారే కారణమని, కాంగ్రెస్ ఎంపీలుగా ఉన్నవారంతా కేసీఆర్ ఎజెండాను మోయడం వల్లనే పార్టీ నష్టపోయిందని పొన్నం ప్రభాకర్‌ను ఉద్దేశించి అనిల్ వ్యాఖ్యా నించారు. ‘అనిల్‌తో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు అప్పటి సీఎం కిరణ్‌కుమార్ రెడ్డికి మద్దతు ఇవ్వడం వల్లే కాంగ్రెస్ ఓడిపోయిం దని పొన్నం బదులిచ్చారు. తెలంగాణకు కాంగ్రెస్ హైకమాండ్ అనుకూల ప్రకటన చేసిన తర్వాతనే ప్రత్యేక రాష్ట్రం కోసం పార్లమెంటులో తాము డిమాండ్ చేశామన్నా రు. దీనిపై అనిల్ స్పందిస్తూ ‘తెలంగాణకు అధిష్టానం నుంచి అనుకూలంగా ప్రకటన వచ్చిన తర్వాత మేం కూడా ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసినం. కిరణ్‌కుమార్‌రెడ్డిని సీఎంని చేసింది కూడా హైకమాండేనని మరి చిపోయి మాట్లాడితే ఎట్లా’ అని ప్రశ్నించారు. కిరణ్‌పై చర్య తీసుకునుంటే... భట్టి జోక్యం చేసుకుని ‘అప్పుడు ముఖ్యమం త్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి కొనసాగడంవల్ల మేమంతా అనివార్యంగా సహకరించాల్సి వచ్చింది. రాష్ట్ర విభజనకు అధిష్టానం అనుకూలంగా నిర్ణయం తీసుకున్నాక దానిని వ్యతిరేకించిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై చర్య తీసుకుని ఉంటే పరిస్థితి మరోలా ఉండేది’ అని అన్నారు. జీవన్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌కు అనుకూలంగా అప్పట్లో కేకే, వివేక్ వంటివారు నివేదికలను ఇచ్చారని అన్నారు. అనిల్ మాట్లాడుతూ ‘అప్పుడు ఎంపీగా ఉన్న పొన్నం వంటివారంతా కేసీఆర్ ఎజెండాను మోశారు. ఇప్పటికీ వారు కేసీఆర్ ఎజెండానే మోస్తున్నారు. అప్పటి ఎంపీలు స్వంత ఇమేజ్‌కోసం కేసీఆర్ ఎజెండాను మోశారు. దీనిని కేసీఆర్ వాడుకున్నారు. కాంగ్రెస్‌పార్టీ వల్లనే తెలంగాణ వచ్చిందనే అంశం ప్రజలకు అర్థం కాకపోవడానికి టీఆర్ఎస్ను, కేసీఆర్‌ను కాంగ్రెస్ ఎంపీలు సమర్థించడమే కారణం. ఇప్పటికీ పొన్నం అదే దారిలో ఉన్నారు’ అని ఆరోపించారు. దీనిపై పొన్నం స్పందిస్తూ ‘కాంగ్రెస్ వల్లనే తెలంగాణ వచ్చిందనడానికి మేము చేసిన పోరాటమే నిదర్శనం. ఇంకా కాంగ్రెస్‌పై సానుభూతి ఉండటాని మేమే కారణం’ అని జవాబిచ్చారు. -
ఉమ్మడి వాటాలో మాకు దక్కేది సున్న: తెలంగాణ
సాక్షి, న్యూఢిల్లీ: కేవలం ఉమ్మడి రాష్ట్రానికి ఉన్న కృష్ణా జలాల వాటా నుంచి పంచుకుంటే తమకు దక్కేదేమీ ఉండదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఆవేదన వ్యక్తంచేసింది. కృష్ణా నదీ జలాలను తిరిగి నదీ పరివాహక ప్రాంతంలోని అన్ని రాష్ట్రాలకు కేటాయించాలని దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై ఏడాది కాలంగా విచారణ కొనసాగుతున్న తెలిసిందే. తాజాగా గురువారం ఈ పిటిషన్ విచారణకు రాగా.. కేంద్ర ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనానికి ఈ అంశంపై తాజా పరిస్థితిని వివరించారు. ఈ అంశంపై ఇటీవల జస్టిస్ బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్-2 ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 89 ప్రకారం నీటి పంపిణీ కేవలం రెండు కొత్త రాష్ట్రాల మధ్యేనని, కర్ణాటక, మహారాష్ట్రలకు వీటితో సంబంధం లేదని తీర్పు ప్రకటించిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ స్పందిస్తూ ‘ఉమ్మడి వాటా నుంచి పంచితే మాకు దక్కేదేమీ ఉండదు. మా న్యాయమైన వినతిని ఏనాడూ ట్రిబ్యునల్ ముందు వినిపించలేక పోయాం. వినిపించే అవకాశం ఇవ్వాలని, అందుకు వీలుగా కొత్తగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం ద్వారానైనా, లేదా ఉన్న ట్రిబ్యునల్ ద్వారానైనా అవకాశం కల్పించాలని రాష్ట్ర విభజన అనంతరం అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కార చట్టం-1956 ప్రకారం కేంద్రానికి విన్నవించాం. కానీ కేంద్రం పరిష్కరించలేదు. అందువల్ల సుప్రీం కోర్టును ఆశ్రయించాం. తెలంగాణ అవసరాలను పరిగణనలోకి తీసుకోకుండా, ఎలాంటి పరిశీలన లేకుండా ఉమ్మడి రాష్ట్ర వాటా నుంచే పంచుకోవాలని అంటే ఎలా? నదీ పరివాహక ప్రాంతంలో కర్నాటక, మహారాష్ట్ర, ఏపీకి ఉన్న హక్కులు మాకూ ఉంటాయి..’ అని పేర్కొన్నారు. ఈనేపథ్యంలో కర్ణాటక తరపున సీనియర్ న్యాయవాది నారీమన్ స్పందిస్తూ ట్రిబ్యునల్ తీర్పు అనంతరం ఈ వివాదంతో ఇక కర్ణాటక, మహారాష్ట్రకు సంబంధం లేదని పేర్కొన్నారు. ఈనేపథ్యంలో కేసు విచారణను 2017 జనవరి 18కి వాయిదా వేస్తూ ధర్మాసనం నిర్ణయించింది. -
అనుమానంతో భార్య ముక్కుకోసిన భర్త
చందర్లపాడు : భార్యపై అనుమానంతో భర్త ముక్కుకోసిన ఘటన మండలంలోని ఏటూరులో సోమవారం సాయంత్రం జరిగింది. సేకరించిన సమాచారం మేరకు గ్రామానికి చెందిన దున్నా చంటి, సుజాత దంపతులు. సుజాతపై భర్తకు అనుమానం రావడంతో పది రోజుల క్రితం వీరిమధ్య వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆమెను పుట్టింటికి పంపించివేశాడు. 17న అత్తగారింటికి (తక్కెళ్లపాడు) వెళ్లి భార్య సుజాతను ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకువచ్చిన అనంతరం ఇరువురి మధ్య తిరిగి ఘర్షణ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో చంటి తలుపులు వేసి ఆమె చేతులు కట్టేసి ముక్కుకోసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సుజాతను చికిత్స నిమిత్తం నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు చందర్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
అసూయతో కోసి పారేశాడు
మాస్కో: ఇదొక జుగుప్సాకరమైన సంఘటన. తాగిన మత్తులో ఏం చేస్తున్నామో అనే విషయం కూడా మర్చిపోయిన ఉదంతం. రష్యాలో ఇద్దరు పురుషులు తాగిన మైకంలో ఆడిన వీధి భాగోతం. మత్తులో ఉన్న ఆ ఇద్దరు మర్మాంగాల విషయంలో పోటీ పెట్టుకున్నారు. అనంతరం ఓడిపోయిన వ్యక్తి అసూయతో గెలిచిన వ్యక్తి మర్మాంగాన్ని గొడ్డలితో నరికేశాడు. ఈ సంఘటన చూసిన అక్కడి వారంతా ఒక్కసారిగా బిత్తర పోయారు. చేతిలో రక్తపు మరకలు, గొడ్డలితో తిరుగుతున్న ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మాస్కోకు సమీపంలోని ఓ గ్రామంలో ఓ 52 ఏళ్ల వ్యక్తి, 47 ఏళ్ల వ్యక్తి తాగుడుకు కూర్చున్నారు. కొంత తాగాక విశృంఖలంగా ఆలోచించారు. వినడానికే ఇబ్బంది కలిగించేలా వింతపోటీ పెట్టుకున్నారు. ఈ పోటీలో 47 ఏళ్ల వ్యక్తి గెలవడంతో 52 ఏళ్ల వ్యక్తి ఆగ్రహంతో ఊగిపోయాడు. పక్కనే ఉన్న గొడ్డలితో 47 ఏళ్ల వ్యక్తిపై బలంగా కొట్టాడు. అనంతరం అతడిని కొంతదూరం ఈడ్చుకుంటూ వెళ్లి పురుషాంగాన్ని నరికేశాడు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు రెండు రోజులుగా ఆ ఇద్దరు వ్యక్తులు పూర్తి మద్యంలో మునిగిపోయి ఉండటం వల్ల ఈ తగువుకు దారి తీసిందని చెబుతున్నారు. -
రుణమాఫీపై అంక్షలు విధించడం దారుణం
-
బ్రోకర్లా వ్యవహరిస్తున్న పొన్నాల : సిఎం సమక్షంలో వాగ్వివాదం
హైదరాబాద్ :ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ సమక్షంలో మంత్రి పొన్నాల లక్ష్మయ్య, వరంగల్ జిల్లా పాలకుర్తి టిడిపి ఎర్రబెల్లి దయాకర రావు వాగ్వివాదానికి దిగారు. వారికి సర్ధిచెప్పడానికి ముఖ్యమంత్రి శ్రమపడవలసి వచ్చింది. గేమింగ్ సెజ్ బాధితులకు న్యాయం చేయాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. బాధితులను ఆదుకోకుండా పొన్నాల బ్రోకర్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దాంతో మంత్రి పొన్నాల ఎర్రబెల్లితో వాదనకు దిగారు. ముఖ్యమంత్రి వారిద్దరికి సర్ధి చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.