మంత్రి భార్య ఓవరాక్షన్‌పై సీఎం చంద్రబాబు రియాక్షన్‌ | CM Chandrababu Naidu Serious On Minister Wife Behaviour With Police Viral Video, More Details Inside | Sakshi
Sakshi News home page

మంత్రి భార్య ఓవరాక్షన్‌పై సీఎం చంద్రబాబు రియాక్షన్‌

Published Tue, Jul 2 2024 7:30 AM | Last Updated on Tue, Jul 2 2024 8:55 AM

CM Chandrababu Serious On Minister Wife Police Video Viral

అమరావతి, సాక్షి: పోలీసులతో ఏపీ రవాణా శాఖ మంత్రి రామ్‌ప్రసాద్ రెడ్డి భార్య హరితారెడ్డి వ్యవహరించిన తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మంత్రి రామ్‌ప్రసాద్‌తో ఫోన్‌లో మాట్లాడిన ఆయన.. వివరణ సైతం కోరినట్లు సమాచారం. 

సోషల్‌ మీడియా మాధ్యమాల్లో ఇలాంటి ప్రజలకు త్వరగతిన చేరతాయని.. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని, మరోసారి ఇలాంటివి జరిగితే ఉపేక్షించబోనని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా మంత్రిని సున్నితంగా హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసుల పట్ల తన భార్య ప్రవర్తనపై విచారం వ్యక్తం చేసిన మంత్రి రామ్‌ప్రసాద్‌ రెడ్డి.. మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటానన్నారని సమాచారం. 

ఇదిలా ఉంటే.. అన్నమయ్య రాయచోటిలో పోలీసులు తనకూ ఎస్కార్ట్‌గా రావాలంటూ హరితారెడ్డి వారితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో వారితో దురుసుగా ప్రవర్తించిన తీరుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement