minister wife
-
కేంద్ర మంత్రి జుయల్ ఓరం భార్య మృతి
భువనేశ్వర్: కేంద్ర గిరిజన శాఖ మంత్రి జుయల్ ఓరం భార్య జింగియా ఓరం మృతి చెందారు. డెంగ్యూతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు. జుయల్ ఓరం సైతం డెంగ్యూ బారిన పడి అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జింగియా ఓరం మృతి పట్ల ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శనివారం రాత్రి ఆయన ఆస్పత్రిని సందర్శించారు. సీఎంతో పాటు ఒడిశా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్, ఆరోగ్య శాఖ మంత్రి ముఖేష్ మహాలింగ్, స్పీకర్ సూరమా పాడి, ఇతర బీజేపీ నేతలు కూడా జింగియా ఓరం భౌతికకాయానికి నివాళులు అర్పించారు. -
మంత్రి భార్య ఓవరాక్షన్‌పై సీఎం చంద్రబాబు రియాక్షన్
అమరావతి, సాక్షి: పోలీసులతో ఏపీ రవాణా శాఖ మంత్రి రామ్‌ప్రసాద్ రెడ్డి భార్య హరితారెడ్డి వ్యవహరించిన తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మంత్రి రామ్‌ప్రసాద్‌తో ఫోన్లో మాట్లాడిన ఆయన.. వివరణ సైతం కోరినట్లు సమాచారం. సోషల్ మీడియా మాధ్యమాల్లో ఇలాంటి ప్రజలకు త్వరగతిన చేరతాయని.. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని, మరోసారి ఇలాంటివి జరిగితే ఉపేక్షించబోనని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా మంత్రిని సున్నితంగా హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసుల పట్ల తన భార్య ప్రవర్తనపై విచారం వ్యక్తం చేసిన మంత్రి రామ్‌ప్రసాద్ రెడ్డి.. మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటానన్నారని సమాచారం. చూడండి పోలీసులపై దౌర్జన్యం ఈవిడ గారు మంత్రి లేదా MLA అనుకునేరు .. కాదు కాదు రాయచోటి MLA రాం ప్రసాద్ రెడ్డి గారి భార్య గారు నాడు అధికారుల ఆత్మగౌరవాన్ని జగన్ కాపాడాడు .. నేడు అధికారులని బానిసలుగా చూస్తున్న తెలుగుదేశం కూటమి#SaveAPFromTDP #APNeedsYSJaganAgain pic.twitter.com/CeRyKLhD38— 𝑺𝒂𝒕𝒉𝒊𝒔𝒉(𝒀𝑺𝑱𝒂𝒈𝒂𝒏 𝑲𝒂 𝑷𝒂𝒓𝒊𝒗𝒂𝒓) (@SathishWithYSJ) July 1, 2024ఇదిలా ఉంటే.. అన్నమయ్య రాయచోటిలో పోలీసులు తనకూ ఎస్కార్ట్‌గా రావాలంటూ హరితారెడ్డి వారితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో వారితో దురుసుగా ప్రవర్తించిన తీరుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. -
బాలికపై అమానుషం.. కాలితో తన్ని.. మినిష్టర్ భార్య నిర్వాకం
అస్సాం : అసోం గణ పరిషద్ కు చెందిన మాజీ మంత్రి హాజీ రౌఫ్ చౌదరి(85) భార్య ఫర్హానా(28) ఒక మైనర్ బాలికను కాలితో తన్నుతూ కొడుతున్న వీడియో ఒకటి వైరల్ గా మారింది. వెంటనే బాలల హక్కుల సంరక్షణ సంస్థ ప్రతినిధి చంద్రధర్ భుయాన్ ఫిర్యాదు మేరకు అసోం పోలీసులు రంగంలోకి దిగి మాజీ మంత్రిని అతడి భార్యను అరెస్టు చేశారు. బాలల సహాయక సంస్థ ప్రతినిధి చంద్రధర్ భుయాన్ తెలిపిన వివరాల ప్రకారం మాజీ మంత్రి చౌదరి ఫర్హానా దంపతులు ఈ 12 ఏళ్ల బాలికను తీసుకొచ్చి పెంచుకుంటున్నామని చెబుతున్నారు. దానికి సంబంధించిన ఆధారాలేవైనా ఉన్నాయా అంటే లేవంటున్నారు. వీడియోలో ఆ బాలికను ఎందుకలా చావగొడుతున్నావని అడిగితే స్కూల్ చదువుల్లో బాగా వెనకబడిపోయినందునే కోపంతో కొట్టానని చెబుతోంది మాజీ మంత్రి భార్య. అంతేకాదు ఈ వీడియో స్వయంగా నేనే తీశానని నా భర్తకు ఈ విషయం గురించి ఏమీ తెలియదని చెబుతోంది. ఏది ఏమైనా ఆ బాలిక పట్ల ఆమె ప్రవర్తన అమానుషమన్నారు చంద్రధర్. కేసు నమోదు చేసిన హోజాయ్ పోలీసులు బాలిక తల్లితో పాటు మిగతావారిని కూడా సంప్రదించి ఇందులో వీరిద్దరే కాకుండా మూడో వ్యక్తి ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తోన్నట్లు తెలిపారు. హాజీ రౌఫ్ చౌదరి పైనా అతని భార్య ఫర్హానా పైనా ఐపీసీ 324,25 సెక్షన్లతో పాటు బాల కార్మికుల(నిషేధం & నియంత్రణ) చట్టం కింద కూడా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: మీ నాన్నను అవమానిస్తున్నారు. సిగ్గుగా లేదా? -
'నా భార్యకు ఏం తెలియదు.. ఆమె అమాయకురాలు'
న్యూఢిల్లీ: తన భార్య అమాయకురాలు అని కర్ణాటక సాంఘిక సంక్షేమ మంత్రి హెచ్ ఆంజనేయ అన్నారు. స్టింగ్ ఆపరేషన్ వెనుక ఓ పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపించారు. తన భార్య ఎవరినీ లంచం డిమాండ్ చేయలేదని చెప్పారు. హాస్టళ్లకు ఆహార ధాన్యాలు పంపిణీ చేసే కాంట్రాక్టును ఇచ్చే విషయంలో ఆంజనేయ భార్య భారీ లంచం తీసుకుంటూ ఓ టీవీ చానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో దొరికిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. 'నన్ను ఆ కుర్చీలో లేకుండా చేసేందుకు భారీ కుట్ర చేశారు. నేను దళితుడిని. పైగా దళితుల్లోనే అత్యంత తక్కువ కులానికి చెందిన వాడిని. చాలామందికి నేను అధికారంలో ఉండటం నచ్చడం లేదు. నా రాజకీయ భవిష్యత్తును ముగించేందుకు చాలామంది కుట్ర పన్నారు. సాధారణంగా నా ఇంటికి ఎప్పుడూ అతిథులు బహుమతులు, స్వీట్లతో వస్తుంటారు. నా భార్య ఏమి తెలియని ఒక పల్లెటూరు మహిళ. ఆ టీవీ వాళ్లు బహుమతి అని చెప్పి ఇస్తేనే తీసుకుంది. పైగా అందులో డబ్బు లేదని ఏవో కార్డులని చెప్పి తీసుకున్న తర్వాత డబ్బుతో నిండిన బహుమానం అని చెప్పారు. మాపై ఇలాంటి జులుం ఎన్నో శతాబ్దాలుగా కొనసాగుతుండటం చూస్తూనే ఉన్నాం' అంటూ ఆయన చెప్పుకొచ్చారు. తాను రాజీనామా చేసే ప్రసక్తి లేదని చెప్పారు. -
పేదల బియ్యం.. మాఫియా వశం..!
అండదండలు పుష్కలంగా ఉండటంతో వీరు మరింతగా రెచ్చిపోతున్నారు.. చీకటి వ్యాపారాన్ని నిరంతరం కొనసాగిస్తున్నారు.. అదేమని ప్రశ్నిస్తే వారిపై దాడులకు దిగటమేగాక, ఎదురు కేసులు పెట్టి ఇరికిస్తున్నారు.. అక్రమ బియ్యం వ్యాపారంతో అధికార పార్టీ చోటా నాయకులు రూ. లక్షలు సంపాదిస్తుంటే.. వారికి వెన్నుదన్నుగా నిలిచిన ముఖ్య నేతలు మాత్రం కోట్లు గడిస్తున్నారు.. ముఖ్యంగా నరసరావుపేట, తెనాలి డివిజన్లలో రేషన్ మాఫియా జూలు విదిలిస్తోంది.. వీరిపై ఫిర్యాదు చేస్తే హతమార్చడానికి సైతం వెనకాడకపోవడంతో అధికారులు కూడా సంశయిస్తున్నారు. సాక్షి, గుంటూరు : టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్రమ మార్గాలకు ద్వారాలు తెరుచుకున్నాయి. ఇసుక, చౌక బియ్యం అక్రమ రవాణాకు అధికార పార్టీ ముఖ్య నేతలు, వారి భార్యలు, వారి కుటుంబ సభ్యులే అండదండలు అందిస్తూ అక్రమ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో అనేక చోట్ల ఇసుక మాఫియా రెచ్చిపోతూ మహిళా తహశీల్దారులపై దాడులకు తెగబడుతుండటం గమనార్హం. గుంటూరు జిల్లాలో సైతం ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ అధికారులు లోలోన మదన పడుతూ బయటకు చెప్పుకునేందుకు భయపడుతున్నారు. డీలర్ల జోలికి వెళ్లొద్దు.. జిల్లాలో చౌక బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న బియ్యం మాఫియాకు ముచ్చమటలు పట్టించిన విజిలెన్స్ అధికారులు వారి జోలికి వెళ్లకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. జిల్లాకు చెందిన ఓ మంత్రి భార్య ఆదేశాల మేరకే రేషన్ దుకాణాల జోలికి వెళ్లాలంటే జంకుతున్నట్లు సమాచారం. ఒక వేళ పూర్తి స్థాయిలో సమాచారం అంది తనిఖీకు వెళ్లిన వెంటనే సదరు మంత్రి భార్య ఫోన్ చేసి ఆ దుకాణం తమ పార్టీకి చెందినవారిదేనని, చర్యలు తీసుకోకుండా వెనక్కు వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేయడం పరిపాటిగా మారింది. ఇక రెవెన్యూ అధికారులైతే తమకేమైన సమాచారం అందితే వెంటనే సదరు రేషన్ డీలర్‌కు ఫోన్ చేసి తెలియపరచాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో బదిలీవేటు ఖాయమనే స్పష్టమైన ఆదేశాలు సదరు మంత్రి భార్య నుంచి అధికారులకు ఎప్పుడో అందాయి. దీంతో పోలీసు అధికారులు సైతం రేషన్ మాఫియా జోలికి వెళ్ళకుండా చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన విజిలెన్స్ ఎస్పీ ఆర్.ఎన్.అమ్మిరెడ్డితోపాటు సిబ్బంది కూడా సమర్ధవంతంగా పనిచేసి అక్రమ ఇసుక, బియ్యం రవాణాను నియంత్రించడంలో రాష్ట్రస్థాయిలో జిల్లాకు ప్రథమస్థానంలో గుర్తింపు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అలాంటి విజిలెన్స్ శాఖలో ఏడాది కాలంగా స్తబ్దత నెలకొంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఇసుక, బియ్యం అక్రమ రవాణాపై దృష్టి సారించి నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో అందించడంతోపాటు, ప్రభుత్వ ఆదాయాన్ని సైతం పెంచే విధంగా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.