కేంద్ర మంత్రి జుయల్‌ ఓరం భార్య మృతి | Union Minister Jual Oram wife Jhingia Oram dies of dengue | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రి జుయల్‌ ఓరం భార్య మృతి

Published Mon, Aug 19 2024 6:08 AM | Last Updated on Mon, Aug 19 2024 6:08 AM

Union Minister Jual Oram wife Jhingia Oram dies of dengue

డెంగ్యూతో మృతి చెందిన జింగియా ఓరం

భువనేశ్వర్‌: కేంద్ర గిరిజన శాఖ మంత్రి జుయల్‌ ఓరం భార్య జింగియా ఓరం మృతి చెందారు. డెంగ్యూతో ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు. జుయల్‌ ఓరం సైతం డెంగ్యూ బారిన పడి అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

 జింగియా ఓరం మృతి పట్ల ఒడిశా ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శనివారం రాత్రి ఆయన ఆస్పత్రిని సందర్శించారు. సీఎంతో పాటు ఒడిశా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్‌ హరిచందన్, ఆరోగ్య శాఖ మంత్రి ముఖేష్‌ మహాలింగ్, స్పీకర్‌ సూరమా పాడి, ఇతర బీజేపీ నేతలు కూడా జింగియా ఓరం భౌతికకాయానికి నివాళులు అర్పించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement