పద్మావతి(ఫైల్)
పెందుర్తి : వారం రోజులు గా డెంగ్యూతో బాధపడుతూ ఓ వివాహిత మృ తిచెందింది. పెందుర్తి మండలం చినముషిడివాడలో జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. చినముషిడివాడ రిజి స్ట్రార్ కార్యాలయం సమీపంలోని బీసీ కాలనీలో తీగల అప్పలరాజు, పద్మావతి(21) దంపతులు నివాసం ఉంటున్నారు. పద్మావతికి వారం రోజుల నుంచి జ్వరం, వాంతులు, విరేచనాలు కావడంతో బుధవారం గోపాలపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు డెంగ్యూ వ్యాధిగా నిర్థారించారు.
అక్కడే చికిత్స పొందుతూ పద్మావతి గురువారం వేకువజామున మరణించింది. ఆమెకు 8 నెలల కుమార్తె ఉంది. స్థానికంగా అపారిశుధ్యం కారణంగానే జ్వరాలు ప్రబలుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చినముషిడివాడ ప్రాంతంలో పారిశుధ్య పనులు సక్రమంగా జరగడం లేదని చెబుతున్నారు. ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించాలని కోరుతున్నారు.