డెంగీతో మహిళ మృతి
Published Sat, Sep 24 2016 11:59 PM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM
నార్పల: అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలోని బేల్దారికాలనీకి చెందిన తలారి సాలమ్మ(55) శుక్రవారం రాత్రి డెంగీతో మృతిచెందింది. కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సాలమ్మ ఈ నెల 18 నుంచి జ్వరంతో బాధపడుతుండేది. స్థానికంగా ఉన్న ఓ ప్రయివేటు క్లినిక్‌లో చికిత్స చేయించుకున్నా నయం కాలేదు.
దీంతో కుటుంబ సభ్యులు జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. డెంగీ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి కర్నూలులోని ప్రైవేటు ఆస్పత్రికిS తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి చనిపోయింది. ఈమె కూలి పనులు చేస్తూ జీవనం సాగించేది. భర్త చనిపోయాడు. ఇద్దరు కుమారులు ఉన్నారు.
Advertisement
Advertisement