ఉత్తరాఖండ్‌లోని అటల్‌కోటిలో మంచు పెళ్లలు విరిగిపడిన ఘటనలో వాటికింద కూరుకుపోయిన ఒక మహిళ మృతిచెందగా, మరో ఐదుగురు ప్రాణాలతో బయటపడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం సాయంత్రం హేమకుండ్ సాహిబ్ యాత్రా మార్గంలోని అటల్ కోటిలో మంచు పెళ్లలు విరిగిపడిన ఘటనలో దానికింద ఆరుగురు యాత్రికుల బృందం చిక్కుకుపోయింది.
రెస్క్యూ సిబ్బంది వీరిలో ఐదుగురిని కాపాడగా, మరో మహిళ ఆచూకీ లభ్యంకాలేదు. ఈ నేపధ్యంలో అసోం స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు సంయుక్తంగా బాధితురాలిని వెదికే ప్రయత్నం చేశారు. వారికి సమీప ప్రాంతంలో ఒక మహిళ మృతదేహం లభ్యమయ్యింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మృతురాలిని కమల్జీత్ కౌర్‌గా గుర్తించారు. ఎస్డీఆర్‌ఎఫ్ కమాండెంట్ మణికాంత్ మాట్లాడుతూ ముంచు పెళ్లలు విరిగిపడిన ఘటనలో ఆరుగురు యాత్రికులు చిక్కుకుపోయారన్నారు. ఐటీబీపీ, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయ చర్యలు చేపట్టి, ఐదుగురు యాత్రికులను కాపాడాయన్నారు.
తాజాగా జరిగిన గాలింపు చర్యల్లో ఒక మహిళా యాత్రికురాలి మృతదేహం మంచులో కూరుకుపోయిన స్థితిలో లభ్యమయ్యిందన్నారు. ఆ మృతదేహాన్ని స్థానిక పోలీసులకు అప్పగించామని తెలిపారు. దీనికి ముందు ఉత్తరాఖండ్‌లో హేమకుండ్ సాహిబ్‌యాత్రా మార్గంలో విపరీతంగా మంచుకురుస్తుండటంతో రెండురోజుల పాటు ఈ రోడ్డును మూసివేశారు. తిరిగి మే 28 రాకపోకలకు అనుమతించారు.
చదవండి: బతికుండగానే కుమార్తెకు సంతాప సభ.. ఆమె చేసిన పని ఇదే..
Comments
Please login to add a commentAdd a comment