డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ఉత్తరకాశీలో ట్రెక్కింగ్(పర్వతారోహణ)కు వెళ్లిన 22 మంది సభ్యుల టీమ్‌లో నలుగురు గల్లంతయ్యారు. ప్రతికూల వాతావరణం వల్ల వారు దారితప్పి మిస్సయినట్లు తెలుస్తోంది. వీరంతా సహస్రతాల్ ప్రాంతంలో మే29న ట్రెక్కింగ్ ప్రారంభించారు. వీరంతా సాహస యాత్ర ముగించుకుని జూన్7న తిరిగి రావాల్సి ఉంది.
అయితే యాత్ర మధ్యలోనే నలుగురు దారితప్పి కనిపించకుండా పోవడంతో మిగిలిన వారిని వెనక్కి తీసుకురావాల్సిందిగా ట్రెక్రింగ్ ఏజెన్సీ ఎస్‌డీఆర్‌ఎఫ్‌ను కోరింది. 4100 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సహస్రతాల్ ప్రాంతంలో మొత్తం ఏడు సరస్సులుంటాయి. ఇక్కడి నుంచే పాండవులు స్వర్గానికి వెళ్లారని నమ్ముతారు.
Comments
Please login to add a commentAdd a comment