trekkers
-
హిమాలయాల్లో విషాదం.. తొమ్మిదికి చేరిన మృతులు
యశవంతపుర: ఉత్తరాఖండ్‌లో హిమాలయ పర్వతాలలో విహారయాత్రకు వెళ్లి ఉత్తరకాశీ జిల్లా సహస్ర తాల్ వద్ద మంచు తుపానులో చిక్కుకున్న కన్నడిగుల విషాద ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. సుమారు 18 మంది బెంగళూరు గత నెలాఖరులో హిమాలయాల ట్రెక్కింగ్‌కు వెళ్లారు. కానీ మంగళవారం సంభవించి మంచు తుపానులో 5 మంది మరణించి, 9 మంది గల్లంతయ్యారు. గురువారానికి మృతుల సంఖ్య 9 కి పెరిగింది.కన్నడిగుల మృతదేహాలను ప్రత్యేక విమానంలో బెంగళూరుకు తీసుకొచ్చే విషయంపై ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో మంత్రి కృష్ణబైరేగౌడ చర్చలు జరిపారు. గురువారం ఉదయం 11 గంటలకు 9 మృతదేహాలకు ఉత్తరకాశీలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిపారు. అక్కడి నుంచి విమానంలో డెహ్రాడూన్‌కు తరలించారు. మరణించిన తొమ్మిది మంది ట్రెక్కర్ల మృతదేహాలలో ఐదుగురి మృతదేహాలు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నాయి. మిగిలిన నాలుగు మృతదేహాలు మరో విమానంలో చేరుకోనున్నాయి.Update on Uttarakhand Trekkers: After a continuous two-day rescue operation, the bodies of five out of the nine deceased trekkers have arrived at Bangalore Airport. The remaining four bodies will be arriving on the next flight. We paid homage to these trekkers, who succumbed to… pic.twitter.com/ZkltXtLWR9— Krishna Byre Gowda (@krishnabgowda) June 7, 2024 మృతులు వీరే మృతుల్లో ముగ్గురు పురుషులు, ఆరుమంది మహిళలు ఉన్నారు. ఇందులోనే మృతుడు సుధాకర్ (71) ఉన్నారు. ఆయనే కర్ణాటక మౌంటెనీరింగ్ సంఘం (కేఎంఏ)ని స్థాపించి తరచూ ఔత్సాహికులను హిమాయల పర్వతాల అధిరోహణకు తీసుకెళ్లేవారని తెలిసింది. మిగతా మృతుల వివరాలు.. సింధు వకీలం (44), సుజాత ముంగుర్‌వాడి (52), ఆమె భర్త వినాయక్.బి (52), చిత్రా ప్రణీత్ (48), కె.వెంకటేష్ ప్రసాద్ (53), కేపీ పద్మనాభ (50), అనితా రంగప్ప (55), పద్మిని హెగ్డే (34) ఉన్నారు. వీరందరూ బెంగళూరు వాసులే. తమవారు ఇక లేరని తెలిసి వారి పిల్లలు, జీవిత భాగస్వాములు తీవ్ర శోకంలో మునిగిపోయారు. -
మంచుకొండల్లో మృత్యుఘోష
శివాజీనగర: హిమాలయ పర్వతాల్లో విహారయాత్రకు వెళ్లిన కన్నడిగులకు చేదు అనుభవం ఎదురైంది. నిత్య జీవితంలో ఒత్తిళ్ల నుంచి దూరంగా పర్వతారోహణకు వెళ్తే పెను ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉత్తరకాశీలో తెహరి జిల్లా సరిహద్దు భాగాల్లో మంచుకొండల్లో ట్రెక్కింగ్ చేస్తున్నవారిలో కర్ణాటకకు చెందిన 18 మందితో పాటుగా 22 మంది వర్షం, మంచు, ప్రతికూల వాతావరణంలో చిక్కుకుపోయారు. వారిలో 5 మంది మృతి చెందగా, పలువురు మిస్సయ్యారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం వెలుగులోకి వచ్చింది. ముమ్మరంగా సహాయక చర్యలు మంగళవారం రాత్రి నుంచి అక్కడి ప్రభుత్వం సైన్యం, హెలికాప్టర్లతో సహాయక చర్యలను చేపట్టింది. కర్ణాటకకు చెందిన పలువురిని కాపాడి సురక్షిత ప్రాంతాలకు తీసుకువచ్చారు. సౌమ్య వివేక్ (37) వినయ్ కృష్ణమూర్తి (47) శివజ్యోతి, సుధాకర్, బీ.ఎన్.నాయుడు (64), సతి గురురాజ్ (40), సీనా (48)తో పాటుగా పలువురిని కాపాడినట్లు తెలిపారు. 9 మంది అదృశ్యం? బెంగళూరుకు చెందిన సుజాత (52), పదిని హెగ్డే (35), చైత్ర (48), సింధు (45) వెంకటేశ్ ప్రసాద్ (55), అనిత (61), ఆశా సుధాకర్ (72), పద్మనాభ్ కేపీఎస్ (50), వినాయక్ (52) అదృశ్యమైనట్లు ఉత్తరాఖండ్ అధికారులు ప్రకటించారు. 13 మంది ఆరోగ్యం విషమంగా ఉండగా వారిని సమీప ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గత నెల 29 నుంచి ట్రెక్కింగ్ ఇండియన్ మౌంటెనీరింగ్ ఫెడరేషన్ ద్వారా వారు హిమాలయాల అధిరోహణకు మే 29వ తేదీన వెళ్లినట్లు తెలిసింది. వారు జూన్ 7వ తేదీన తిరిగి రావాలి. అయితే మార్గమధ్యలో సహస్రతాల్ అనే చోట విపరీతమైన మంచు తుపాను, చలిగాలుల్లో వారు చిక్కుకుపోయారు. ఆ బృందంలో 18 మంది బెంగళూరు వాసులు, ఒకరు పూణెవాసి, ముగ్గురు స్థానిక గైడ్లు ఉన్నారు. మంత్రి కృష్ణభైరేగౌడ బాధితులకు సహాయం కోసం ఉత్తరాఖండ్‌కు వెళ్లారు. #TrekkingTragedy 9 #Bengalureans, who were part of a 22-member trekking team, #died following bad weather at Sahastra Tal in #Uttarakhand.#Rescue operations launched 👇#Karnataka’s revenue minister @krishnabgowda rushes to rescue site. pic.twitter.com/dKDNufdjiw— TOI Bengaluru (@TOIBengaluru) June 5, 2024 -
ట్రెక్కింగ్‌కు వెళ్లి నలుగురు మృతి..?
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ఉత్తరకాశీలో ట్రెక్కింగ్(పర్వతారోహణ)కు వెళ్లిన 22 మంది సభ్యుల టీమ్‌లో నలుగురు గల్లంతయ్యారు. ప్రతికూల వాతావరణం వల్ల వారు దారితప్పి మిస్సయినట్లు తెలుస్తోంది. వీరంతా సహస్రతాల్ ప్రాంతంలో మే29న ట్రెక్కింగ్ ప్రారంభించారు. వీరంతా సాహస యాత్ర ముగించుకుని జూన్7న తిరిగి రావాల్సి ఉంది. అయితే యాత్ర మధ్యలోనే నలుగురు దారితప్పి కనిపించకుండా పోవడంతో మిగిలిన వారిని వెనక్కి తీసుకురావాల్సిందిగా ట్రెక్రింగ్ ఏజెన్సీ ఎస్డీఆర్ఎఫ్ను కోరింది. 4100 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సహస్రతాల్ ప్రాంతంలో మొత్తం ఏడు సరస్సులుంటాయి. ఇక్కడి నుంచే పాండవులు స్వర్గానికి వెళ్లారని నమ్ముతారు. -
కార్చిచ్చు విషాదం : ప్రేమజంటకు ఎడబాటు
చెన్నై : ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు.. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు.. ట్రెక్కింగ్ వెళ్లాలన్న సరదా వారికి శాశ్వత ఎడబాటు మిగులుస్తుందని ఊహించలేకపోయారు.. కురుంగణి కొండల్లో ఆదివారం చెలరేగిన కార్చిచ్చులో నవ దంపతులు వివేక్(27) ప్రాణాలు కోల్పోగా.. దివ్య(29) తీవ్రంగా గాయపడ్డారు. తన కంటే వయసులో పెద్దదైన అమ్మాయి(దివ్య)ను పెళ్లి చేసుకునేందుకు ఇరువురి కుటుంబాలు ఒప్పుకోకపోవడంతో వివేక్, దివ్యలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేసి నాలుగు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. కుటుంబసభ్యులకు దూరంగా ఉంటూ చెన్నైలోని ఈరోడ్‌లో నివసిస్తున్నారు. ట్రెక్కింగ్‌కు వెళ్లాలనే సరదాతో ఆదివారం కురంగణి అడవులకు వెళ్లారు. ఉన్నట్లుండి అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు వారి జీవితంలో విషాదాన్ని మిగిల్చింది. ప్రమాదంలో వివేక్ మరణించగా, దివ్య మధురైలోని రాజాజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పెళ్లితో దూరమైన కుటుంబసభ్యులు ఆమెను చూసేందుకు ఆసుపత్రికి వచ్చారు. ‘వివేక్ దుబాయ్‌లో జాబ్ చేసేవాడు. కొద్దిరోజుల్లో దివ్యను దుబాయ్ తీసుకెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. కానీ ఇంతలోనే ఇలా జరగుతుందని అనుకోలేదని’ వారి స్నేహితులు కంటతడి పెట్టారు. తమిళనాడులోని తేని జిల్లా అటవీప్రాంతంలోని కురంగణి కొండల్లోని అడవుల్లో చెలరేగిన కార్చిర్చు 10 మందిని బలి తీసుకున్న విషయం తెలిసిందే. -
10కి చేరుకున్న కార్చిచ్చు మృతులు
-
10కి చేరుకున్న కార్చిచ్చు మృతులు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోని తేని జిల్లాలో బోడినాయకనూర్ అటవీప్రాంతంలోని కురంగని కొండల్లో ఆదివారం చెలరేగిన కార్చిచ్చు ఘటనలో మృతి చెందిన ట్రెక్కర్ల సంఖ్య 10కి చేరుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు పురుషులతో పాటు ఏడుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. చెన్నై, తిరుప్పూర్, ఈరోడ్ నుంచి ఈ అటవీప్రాంతానికి ట్రెక్కింగ్ కోసం వచ్చిన 36 మంది ఉద్యోగులు, విద్యార్థులు తిరుగుప్రయాణంలో కార్చిచ్చులో చిక్కుకోవడం తెల్సిందే. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు సోమవారం నాటికి∙26 మంది ట్రెక్కర్లను రక్షించారు. కాగా, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు రూ.4 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.లక్ష, స్వల్పంగా గాయపడ్డవారికి రూ.50 వేల నష్టపరిహారాన్ని సీఎం పళనిస్వామి ప్రకటించారు. రాష్ట్ర అగ్నిమాపక సిబ్బందితో పాటు, నాలుగు రక్షణశాఖ హెలికాప్టర్లు, 16 మంది గరుడ్ కమెండోలు ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. కాగా, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్, అన్నాడీఎంకే బహిష్కృత నేత ఆర్కేనగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్, మక్కల్ నీది మయ్యం పార్టీ చీఫ్ కమల్‌హాసన్‌తో పాటు సీపీఐ, పీఎంకే నేతలు అగ్నిప్రమాద మృతులకు సంతాపం తెలిపారు. -
ఆ ఎనిమిది మంది పర్వతారోహకులు క్షేమం!
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీలో రెండు రోజుల క్రితం చాందర్‌ఖానీ శిఖరాన్ని అధిరోహించేందుకు వెళ్లి మంచులో చిక్కుకున్న ఎనిమిదిమంది పర్వత అధిరోహకులు సురక్షితంగా బయటపడ్డారు. ఆదివారం జాతీయ విపత్తు సహాయక బృందం(ఎన్డీఆర్ఎఫ్) ఏరియల్ సర్వే చేస్తున్న సమయంలో అదృశ్యమైన వారిలో తొలుత ఆరుగురిని గుర్తించి హెలికాప్టర్లో రక్షిత స్థావరానికి తరలించినట్టు డిప్యూటీ కమిషనర్ హన్స్‌రాజ్ చౌహన్ వెల్లడించారు. ఆ తరువాత మరో ఇద్దరిని గుర్తించగా.. వారు క్షేమంగానే ఉన్నట్టు చెప్పారు. కాకపోతే వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో వారిద్దరినీ అక్కడినుంచి తరలించలేకపోయామని తెలిపారు. శనివారం రిస్క్య టీం హెలికాప్టర్లో అదృశ్యమైన విద్యార్థుల జాడ గుర్తించేందుకు తీవ్రంగా గాలించిన సంగతి తెలిసిందే. అయితే దట్టంగా మంచు కురుస్తుండటంతో 3600 మీటర్లు ఎత్తు ఉన్న చాందర్‌ఖానీ శిఖరం వద్దకు రిస్క్యూ టీం చేరుకోలేకపోయినట్టు అధికారి ఒకరు పేర్కొన్నారు. దాంతో మరోసారి ఆదివారం సహాయక బృందం మోహరించి అదృశ్యమైన విద్యార్థుల కోసం ఏరియల్ సర్వే ద్వారా గాలింపు చర్యలు చేపట్టింది. కాగా, పంజాబ్ సంగ్రూర్ టౌన్లో ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న ఎనిమిది మంది విద్యార్థులు గురువారం చాందార్‌ఖానీ పర్వతారోహణకు వెళ్లారు. శిఖరాన్ని అధిరోహించే సమయంలో ఆ విద్యార్థులు మంచులో చిక్కుకుని అదృశ్యమైన సంగతి తెలిసిందే. -
అదృశ్యమైన పర్వతారోహకుల జాడ లేదు!
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీలో రెండు రోజుల క్రితం చాందర్‌ఖానీ శిఖరాన్ని అధిరోహించేందుకు వెళ్లి అదృశ్యమైన ఎనిమిదిమంది పర్వత అధిరోహకుల జాడ ఇంకా తెలియలేదు. శనివారం రిస్క్య టీం హెలికాప్టర్లో అదృశ్యమైన విద్యార్థుల జాడ గుర్తించేందుకు తీవ్రంగా గాలించింది. అయితే దట్టంగా మంచు కురుస్తుండటంతో 3600 మీటర్లు ఎత్తు ఉన్న చాందర్‌ఖానీ శిఖరం వద్దకు రిస్క్యూ టీం చేరుకోలేకపోయినట్టు అధికారి ఒకరు వెల్లడించారు. దాంతో మరోసారి ఆదివారం సహాయక బృందం మోహరించి అదృశ్యమైన విద్యార్థుల కోసం గాలించనుంది. కాగా, పంజాబ్ సంగ్రూర్ టౌన్లో ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న ఎనిమిది మంది విద్యార్థులు గురువారం చాందార్‌ఖానీ పర్వతారోహణకు వెళ్లారు. శిఖరాన్ని అధిరోహించే సమయంలో ఆ విద్యార్థులు మంచులో చిక్కుకున్నారు. వారి జాడ తెలుసుకునేందుకు డిప్యూటీ కమిషనర్‌తో అక్కడి రెవెన్యూ శాఖ మంత్రి కౌల్ సింగ్ సంప్రదించి జాతీయ విపత్తు సహాయక బృందం(ఎన్డీఆర్ఎఫ్) సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా ఆజ్ఞాపించారు. -
నేపాల్ లో మంచు తుపాను; 12 మంది మృతి
ఖాట్మండు: నేపాల్ లో ఒక్కసారిగా మంచు తుపాన్ సంభవించడంతో 12 మంది మృతి చెందారు. 85 మంది గల్లంతయ్యారు. మృతులందరూ పర్వతారోహకులే. మానంగ్ జిల్లాలోని తొరాంగ్ పాస్ వద్ద ఈ ఘటన జరిగింది. సముద్రమట్టానికి 5,146 అడుగుల ఎత్తులో ఈ ఘటన చోటుచేసుకుంది. హదూద్ తుపాన్ ప్రభావంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు రావడంతో మంచు తుపాను సంభవించినట్టు చెబుతున్నారు. మృతుల్లో భారతీయుడు, నలుగురు కెనడా పౌరులు, ముగ్గురు నేపాలీలు ఉన్నారు. 18 మంది పర్వతారోహకులను నేపాల్ ఆర్మీ కాపాడింది. గాయపడిని 14 మందిని ఖాట్మండులో ఆస్పత్రికి తరలించారు. మంచుకింద చాలా మృతుదేహాలు చూశానని స్థానిక గైడ్ ఒకరు చెప్పడంతో గల్లైంతన వారు మరణించివుంటారని భావిస్తున్నారు. దౌలాగిరిలో మరో నలుగురు గల్లంతయ్యారు. వీరి కోసం నేపాల్ ఆర్మీ హెలికాప్టర్లతో గాలింపు చేపట్టింది.