మంచుకొండల్లో మృత్యుఘోష Five trekkers from Karnataka died due to bad weather at Sahastra Tal in Uttarakhand. Sakshi
Sakshi News home page

మంచుకొండల్లో మృత్యుఘోష

Published Thu, Jun 6 2024 9:43 AM | Last Updated on Thu, Jun 6 2024 12:23 PM

Five trekkers from Karnataka die in Uttarakhand’s extreme weather conditions

 ఉత్తరాఖండ్‌లో బెంగళూరువాసుల ట్రెక్కింగ్‌ టూర్‌  

మంచుతుపానుకు ఐదుమంది బలి?  

పలువురు మిస్సింగ్‌   కొనసాగుతున్న సహాయక చర్యలు

శివాజీనగర: హిమాలయ పర్వతాల్లో విహారయాత్రకు వెళ్లిన కన్నడిగులకు చేదు అనుభవం ఎదురైంది. నిత్య జీవితంలో ఒత్తిళ్ల నుంచి దూరంగా పర్వతారోహణకు వెళ్తే పెను ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో ఉత్తరకాశీలో తెహరి జిల్లా సరిహద్దు భాగాల్లో మంచుకొండల్లో ట్రెక్కింగ్‌ చేస్తున్నవారిలో కర్ణాటకకు చెందిన 18 మందితో పాటుగా 22 మంది వర్షం, మంచు, ప్రతికూల వాతావరణంలో చిక్కుకుపోయారు. వారిలో 5 మంది మృతి చెందగా, పలువురు మిస్సయ్యారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం వెలుగులోకి వచ్చింది.  

ముమ్మరంగా సహాయక చర్యలు  
మంగళవారం రాత్రి నుంచి అక్కడి ప్రభుత్వం సైన్యం, హెలికాప్టర్లతో సహాయక చర్యలను చేపట్టింది. కర్ణాటకకు చెందిన పలువురిని కాపాడి సురక్షిత ప్రాంతాలకు తీసుకువచ్చారు. సౌమ్య వివేక్‌ (37) వినయ్‌ కృష్ణమూర్తి (47) శివజ్యోతి, సుధాకర్, బీ.ఎన్‌.నాయుడు (64), సతి గురురాజ్‌ (40), సీనా (48)తో పాటుగా పలువురిని కాపాడినట్లు తెలిపారు.  

9 మంది అదృశ్యం?  
బెంగళూరుకు చెందిన సుజాత (52), పదిని హెగ్డే (35), చైత్ర (48), సింధు (45) వెంకటేశ్‌ ప్రసాద్‌ (55), అనిత (61), ఆశా సుధాకర్‌ (72), పద్మనాభ్‌ కేపీఎస్‌ (50), వినాయక్‌ (52) అదృశ్యమైనట్లు ఉత్తరాఖండ్‌ అధికారులు ప్రకటించారు. 13 మంది ఆరోగ్యం విషమంగా ఉండగా వారిని  సమీప ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  

గత నెల 29 నుంచి ట్రెక్కింగ్‌ 
ఇండియన్‌ మౌంటెనీరింగ్‌ ఫెడరేషన్‌ ద్వారా  వారు హిమాలయాల అధిరోహణకు మే 29వ తేదీన వెళ్లినట్లు తెలిసింది. వారు జూన్‌ 7వ తేదీన తిరిగి రావాలి. అయితే మార్గమధ్యలో సహస్రతాల్‌ అనే చోట విపరీతమైన మంచు తుపాను, చలిగాలుల్లో వారు చిక్కుకుపోయారు. ఆ బృందంలో 18 మంది బెంగళూరు వాసులు, ఒకరు పూణెవాసి, ముగ్గురు స్థానిక గైడ్లు ఉన్నారు. మంత్రి కృష్ణభైరేగౌడ బాధితులకు సహాయం కోసం ఉత్తరాఖండ్‌కు వెళ్లారు.

 #TrekkingTragedy 

9 #Bengalureans, who were part of a 22-member trekking team, #died following bad weather at Sahastra Tal in #Uttarakhand.#Rescue operations launched 👇#Karnataka’s revenue minister @krishnabgowda rushes to rescue site. pic.twitter.com/dKDNufdjiw

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement