సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లోని మనాలీలో రెండు రోజుల క్రితం చాందర్‌ఖానీ శిఖరాన్ని అధిరోహించేందుకు వెళ్లి అదృశ్యమైన ఎనిమిదిమంది పర్వత అధిరోహకుల జాడ ఇంకా తెలియలేదు. శనివారం రిస్క్య టీం హెలికాప్టర్‌లో అదృశ్యమైన విద్యార్థుల జాడ గుర్తించేందుకు తీవ్రంగా గాలించింది. అయితే దట్టంగా మంచు కురుస్తుండటంతో 3600 మీటర్లు ఎత్తు ఉన్న చాందర్‌ఖానీ శిఖరం వద్దకు రిస్క్యూ టీం చేరుకోలేకపోయినట్టు అధికారి ఒకరు వెల్లడించారు. దాంతో మరోసారి ఆదివారం సహాయక బృందం మోహరించి అదృశ్యమైన విద్యార్థుల కోసం గాలించనుంది.
కాగా, పంజాబ్ సంగ్రూర్ టౌన్‌లో ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న ఎనిమిది మంది విద్యార్థులు గురువారం చాందార్‌ఖానీ పర్వతారోహణకు వెళ్లారు. శిఖరాన్ని అధిరోహించే సమయంలో ఆ విద్యార్థులు మంచులో చిక్కుకున్నారు. వారి జాడ తెలుసుకునేందుకు డిప్యూటీ కమిషనర్‌తో అక్కడి రెవెన్యూ శాఖ మంత్రి కౌల్ సింగ్ సంప్రదించి జాతీయ విపత్తు సహాయక బృందం(ఎన్‌డీఆర్‌ఎఫ్) సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా ఆజ్ఞాపించారు.
అదృశ్యమైన పర్వతారోహకుల జాడ లేదు!
Published Sat, Mar 12 2016 7:54 PM | Last Updated on Sun, Sep 3 2017 7:35 PM
Advertisement