ఆ ఎనిమిది మంది పర్వతారోహకులు క్షేమం! | 6 out of 8 trekkers located near Chandrakhani area during aerial survey | Sakshi
Sakshi News home page

ఆ ఎనిమిది మంది పర్వతారోహకులు క్షేమం!

Published Sun, Mar 13 2016 5:30 PM | Last Updated on Sun, Sep 3 2017 7:40 PM

ఆ ఎనిమిది మంది పర్వతారోహకులు క్షేమం!

ఆ ఎనిమిది మంది పర్వతారోహకులు క్షేమం!

సిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్లోని మనాలీలో రెండు రోజుల క్రితం చాందర్‌ఖానీ శిఖరాన్ని అధిరోహించేందుకు వెళ్లి మంచులో చిక్కుకున్న ఎనిమిదిమంది పర్వత అధిరోహకులు సురక్షితంగా బయటపడ్డారు. ఆదివారం జాతీయ విపత్తు సహాయక బృందం(ఎన్‌డీఆర్‌ఎఫ్‌) ఏరియల్‌ సర్వే చేస్తున్న సమయంలో అదృశ్యమైన వారిలో తొలుత ఆరుగురిని గుర్తించి హెలికాప్టర్‌లో రక్షిత స్థావరానికి తరలించినట్టు డిప్యూటీ కమిషనర్‌ హన్స్‌రాజ్‌ చౌహన్ వెల్లడించారు. ఆ తరువాత మరో ఇద్దరిని గుర్తించగా.. వారు క్షేమంగానే ఉన్నట్టు చెప్పారు. కాకపోతే వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో వారిద్దరినీ అక్కడినుంచి తరలించలేకపోయామని తెలిపారు.

శనివారం రిస్క్య టీం హెలికాప్టర్‌లో అదృశ్యమైన విద్యార్థుల జాడ గుర్తించేందుకు తీవ్రంగా గాలించిన సంగతి తెలిసిందే. అయితే దట్టంగా మంచు కురుస్తుండటంతో 3600 మీటర్లు ఎత్తు ఉన్న చాందర్‌ఖానీ శిఖరం వద్దకు రిస్క్యూ టీం చేరుకోలేకపోయినట్టు అధికారి ఒకరు పేర్కొన్నారు. దాంతో మరోసారి ఆదివారం సహాయక బృందం మోహరించి అదృశ్యమైన విద్యార్థుల కోసం ఏరియల్‌ సర్వే ద్వారా గాలింపు చర్యలు చేపట్టింది.  కాగా, పంజాబ్‌ సంగ్రూర్‌ టౌన్‌లో ఓ ప్రైవేట్‌ కాలేజీలో చదువుతున్న ఎనిమిది మంది విద్యార్థులు గురువారం చాందార్‌ఖానీ పర్వతారోహణకు వెళ్లారు. శిఖరాన్ని అధిరోహించే సమయంలో ఆ విద్యార్థులు మంచులో చిక్కుకుని అదృశ్యమైన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement