అస్సాం : అసోం గణ పరిషద్ కు చెందిన మాజీ మంత్రి హాజీ రౌఫ్ చౌదరి(85) భార్య ఫర్హానా(28) ఒక మైనర్ బాలికను కాలితో తన్నుతూ కొడుతున్న వీడియో ఒకటి వైరల్ గా మారింది. వెంటనే బాలల హక్కుల సంరక్షణ సంస్థ ప్రతినిధి చంద్రధర్ భుయాన్ ఫిర్యాదు మేరకు అసోం పోలీసులు రంగంలోకి దిగి మాజీ మంత్రిని అతడి భార్యను అరెస్టు చేశారు.
బాలల సహాయక సంస్థ ప్రతినిధి చంద్రధర్ భుయాన్ తెలిపిన వివరాల ప్రకారం మాజీ మంత్రి చౌదరి ఫర్హానా దంపతులు ఈ 12 ఏళ్ల బాలికను తీసుకొచ్చి పెంచుకుంటున్నామని చెబుతున్నారు. దానికి సంబంధించిన ఆధారాలేవైనా ఉన్నాయా అంటే లేవంటున్నారు. వీడియోలో ఆ బాలికను ఎందుకలా చావగొడుతున్నావని అడిగితే స్కూల్ చదువుల్లో బాగా వెనకబడిపోయినందునే కోపంతో కొట్టానని చెబుతోంది మాజీ మంత్రి భార్య. అంతేకాదు ఈ వీడియో స్వయంగా నేనే తీశానని నా భర్తకు ఈ విషయం గురించి ఏమీ తెలియదని చెబుతోంది. ఏది ఏమైనా ఆ బాలిక పట్ల ఆమె ప్రవర్తన అమానుషమన్నారు చంద్రధర్.
కేసు నమోదు చేసిన హోజాయ్ పోలీసులు బాలిక తల్లితో పాటు మిగతావారిని కూడా సంప్రదించి ఇందులో వీరిద్దరే కాకుండా మూడో వ్యక్తి ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తోన్నట్లు తెలిపారు. హాజీ రౌఫ్ చౌదరి పైనా అతని భార్య ఫర్హానా పైనా ఐపీసీ 324,25 సెక్షన్లతో పాటు బాల కార్మికుల(నిషేధం & నియంత్రణ) చట్టం కింద కూడా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: మీ నాన్నను అవమానిస్తున్నారు. సిగ్గుగా లేదా?
Comments
Please login to add a commentAdd a comment