కాఠ్మాండు: నేపాల్ పోలీసులు 23 మంది భారతీయ పౌరులను అరెస్టు చేశారు. వీరిని నేపాల్‌లోని బాగమతి ప్రాంతంలో అరెస్టు చేశారు. వీరు ఆన్‌లైన్‌లో అక్రమంగా బెట్టింగ్ రాకెట్ నడుపుతున్నారనే ఆరోపణలతో చర్యలు చేపట్టామని పోలీసులు చెబుతున్నారు. నేపాల్ పోలీసు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అపిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ వీరు కాఠ్మాండుకు 10 కిలోమీటర్ల దూరంలోని బుద్ధనిలకంఠ ప్రాంతంలోని రెండస్తుల భవనంలో ఉండగా అరెస్టు చేశామన్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక రహస్య సమాచారం మేరకు ఒక భవనంపై దాడి చేసి, 23 మంది భారతీయ పౌరులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 81 వేల రూపాయలు, 88 మొబైల్ పోన్లు, 10 ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. వీరిని యాంటీ గేమింగ్ యాక్ట్ కింద అరెస్టు చేశారు. వారం రోజుల క్రితం నేపాల్ పోలీసులు కోట్ల రూపాయల విలువైన ఆన్‌లైన్ బెట్టింగ్ రాకెట్‌ను చేధించారు.
అలాగే పది మంది భారతీయులతో సహా మొత్తం 24 మందిని అరెస్టు చేశారు. లలిత్‌పూర్‌లోని సనేపా ప్రాంతంలో రెండు ఇళ్లపై ప్రత్యేక పోలీసు బృందం దాడి చేసి, ఆన్‌లైన్ గేమింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న 10 మంది భారతీయ పౌరులు, 14 మంది నేపాలీ జాతీయులను అరెస్టు చేసింది. అరెస్టయిన భారతీయుల్లో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్‌కు చెందినవారని నేపాల్ పోలీసులు తెలిపారు. నిందితులు రెండు అద్దె ఇళ్లలో అక్రమంగా ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Mahakumbh-2025: పోటెత్తిన భక్తులు.. ప్రయాగ్‌రాజ్ సంగమం స్టేషన్ మూసివేత
Comments
Please login to add a commentAdd a comment