
కఠ్మాండు: నేపాల్‌కు చెందిన ఆధ్యాతి్మక నేత, బుద్ధుడి అవతారంగా భావించే రామ్ బహదూర్ భోంజన్(33)ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆశ్రమంలోని పలువురు యువతుల అదృశ్యం, అత్యాచారం ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. నీళ్లు, ఆహారం, నిద్ర లేకుండా ధ్యానంలో అతడు నిశ్చలంగా నెలలపాటు ఉంటాడని ఆయన అనుచరులు నమ్ముతారు. అతడిని బుద్ధ్ధ బాయ్‌గా పిలుచుకుంటారు.
తన ధ్యానానికి ఆటంకం కలిగించినందుకు గాను పలువురిపై అతడు దాడి చేసినట్లు, అనుయాయులపై భౌతిక, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలున్న రామ్ బహదూర్ దశాబ్ద కాలంగా తప్పించుకు తిరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. సలార్హి ఆశ్రమంలో ఓ బాలికపై 2018లో అత్యాచారానికి పాల్పడినట్లు కూడా పోలీసులకు ఫిర్యాదు అందింది. బుధవారం పట్టుబడిన సమయంలో అతడి వద్ద 3 కోట్ల నేపాలీ కరెన్సీతోపాటు 22,500 డాలర్లు లభించినట్లు సమాచారం.