Spiritual guru
-
డియోర్ బ్యాగ్‌పై క్లారిటీ.. ఎవరీ జయ కిషోరి
ఢిల్లీ: ఆధ్యాత్మిక వక్త జయ కిషోరి సుమారు రూ.2 లక్షల విలువైన డియోర్ బ్యాగ్‌తో ఇటీవల ఎయిర్‌పోర్టులో కనిపించారు. దీంతో నిరాడంబర జీవితం గడపాలని బోధనలు చేసే.. ఆమె ఇలా ఖరీదైన బ్యాగ్‌తో కనిపించిన ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆమె ఖరీదై బ్యాగ్ వాడటంపై ఫాలోవర్లు, నెటిజన్లు విమర్శలు గుప్పించారు. అయితే ఈ విమర్శలపై 29 ఏళ్ల జయ కిషోరీ తాజాగా స్పందించారు.‘‘నేను కూడా సాధారణ అమ్మాయినే. సాధారణమైన ఇంట్లోనే ఉంటున్నా. కుటుంబంతో కలిసి జీవిస్తున్నా. యువత కష్టపడాలి. కష్టపడి డబ్బులు సంపాదించాలి. మంచి జీవితం కోసం ఖర్చు పెట్టుకోవాలి. కుటుంబానికి ఇవ్వాలి. మీ కలలను నెరవేర్చుకోవడానికి ఉపయోగించుకోవాలని చెప్పాను. ఈ బ్యాగ్ కస్టమైజ్డ్. అందులో లెదర్ ఉపయోగించలేదు. కస్టమైజ్డ్ అంటే మన ఇష్ట ప్రకారం తయారు చేసుకోవచ్చు. దానిపై నా పేరు కూడా రాసి ఉంది. ...నేనెప్పుడూ లెదర్ వాడలేదు, వాడను కూడా. నేను దేనినీ వదులుకోలేదు. కాబట్టి నేను అలా చేయమని మీకు ఎలా చెప్పగలను?. నేను సన్యాసిని, సాధువు లేదా సాధ్విని కాదని మొదటి రోజు నుంచే స్పష్టంగా చెబుతున్నా’’ అని ఆమె వివరించారు. జయ కిషోరికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాను 12.3 మిలియన్లకు ఫాలో అవుతున్నారు.Jaya Kishori ji Said I'm not BABa or SANT, I'm just ordinary girl !!Waah kya Acting hai phle Dharm k naam pr paisa chapo or fir ye gyaan do . waah DIDI waah 🫡 pic.twitter.com/bCQjD4zedE— Yogesh (@yogesh_xrma) October 29, 2024ఎవరీ జయ కిషోరి..యువ ఆధ్యాత్మిక వక్తగా జయ కిషోరి తన ప్రేరణాత్మక సందేశాల ద్వారా వార్తల్లో నిలిచారు. ఆమె ఆధ్యాత్మిక కథలు చెప్పటంతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. ఆమె వక్తనే కాకుండా సంగీత కళాకారిణీ, కథకురాలు కూడా. జయ కిషోరి 13 జూలై, 1996న కోల్‌కతాలో జన్మించారు. కోల్‌కతాలోని మహాదేవి బిర్లా వరల్డ్ అకాడమీ స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించారు. ఓపెన్ స్కూల్ ద్వారా బి.కామ్ పూర్తి చేశారు. ఆమె ఫాలోవర్స్ ద్వారా 'ది మీరా ఆఫ్ మోడర్న్ వరల్డ్', 'కిషోరి జీ'గా ప్రసిద్ధి చెందారు. జయ కేవలం ఏడేళ్ల వయస్సులోనే బహిరంగంగా ఉపన్యాసం ఇవ్వటం ప్రారంభించారు. ఆమె తన 7 రోజుల నిడివి గల మానసిక కథ 'శ్రీమద్ భగవత్ గీత', 3 రోజుల నిడివి గల 'కథా నాని బాయి రో మేరో'తో గుర్తింపు పొందారు. మరోవైపు.. ఆమె శ్రీకృష్ణుడిని పూజిస్తారు. ఆమె భజనలు యూట్యూబ్‌లో కూడా చాలా ప్రసిద్ధి చెందాయి. ఆమె జూలై 24, 2021న ‘జయ కిషోరి ప్రేరణ’ అనే కొత్త యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించారు. ఆమె ఛానెల్‌కు దాదాపు 9 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఆమె ప్రసిద్ధ పాటల్లో ‘శివ్ స్తోత్ర’, ‘మేరే కన్హా’, ‘సాజన్ మేరో గిర్ధారి’ వంటివి ఉన్నాయి.చదవండి: టికెట్ నిరాకరణ, సిట్టింగ్ ఎమ్మెల్యే అదృశ్యం.. ‘తగిన శాస్తి జరిగిందంటూ’... -
ప్రతి అమ్మా దుర్గమ్మే
విజయ దశమి సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ప్రవచనకర్త డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు సాక్షి ఫ్యామిలీకి ప్రత్యేకంగా చెప్పిన ముఖ్య విశేషాలు...పదవరోజుతో ఎందుకు ముగించాలి...లోకంలోని ప్రతి అమ్మా ఆ లోకంలోని జగదంబకి ప్రతిరూపం. ఈమె కనిపిస్తుంది. ఆమె కన్పించదు. ఈమె ఎలాగైతే తొమ్మిది నెలలపాటు తనలో జరిగే వ్యాధులూ అలజడీ... తోపోరాడి 10వ నెలలో సంతాన విజయాన్ని సాధిస్తోందో– అలా అమ్మ ఈమెకి మార్గదర్శకురాలిగా తొమ్మిది రాత్రులపాటు (రాక్షసులకి రాత్రే బలం అధికం. నిశాచరులు కదా) పోరాడి పోరాడి 10వ నాడు దశమి విజయాన్ని సాధించింది కాబట్టి దేవీ నవరాత్రులంటే ప్రతి స్త్రీ విజయానికీ సాక్ష్యమన్నమాట. సంతానాన్ని కనగలగడమంటే అమ్మ అనుగ్రహంతో జయాన్ని సాధించి పండంటి బిడ్డని పొందడమన్నమాట. జయమంటే గెలుపు. అమ్మ అనుగ్రహం దానికి అండగా నిలిస్తే అది విజయం అన్నమాట!రోజూ అమ్మకి కొత్తకొత్తగా ముస్తాబు...అమ్మ అలంకారాల విషయానికి వద్దాం... స్థూలంగా చెప్తే– యోగసాధన చేయదలచిన సాధకుడు మొదటి రోజున బాల్య స్థితిలో ఉంటాడు. అదే బాలా త్రిపుర సుందరీ రూపం. అమ్మ తన సంతానాన్ని బడికి పంపేముందు కడుపునిండుగా అన్నం పెట్టి పంపుతుంది. అదుగో అదే అన్నపూర్ణా రూపం. సంతానం బడికెళ్లాక మూడవ కన్నయిన జ్ఞానాన్ని పొందుతారు. అదే గాయత్రీ రూపం. గాయత్రీ మంత్రానుష్ఠానం సాగగానే ఆ వ్యక్తికి ఓ వాక్ఛక్తి వచ్చి, అతడు ఏం చెప్తే అది జరగడం ప్రారంభమౌతుంది. ఆ శక్తిని ధనార్జనకి ఉపయోగిస్తాడా? లేక పై చదువుకోసం వినియోగిస్తాడా... అని పరీక్షించడం కోసం 4వ రోజున పరీక్ష కోసం మహాలక్ష్మీ రూపం వేస్తారు. ఆ ఆలోచనని జయిస్తే సరస్వతి లక్ష్మి ఇతర దేవతలూ... ఇలా అందర్నీ శాసించగల లలితారూపాన్ని దర్శించేలా 5వ రోజున లలితా రూపాన్ని వేస్తారు. ఆరవ రోజున షష్ఠి తిథి మూలా నక్షత్రం ఉండే కారణంగా సరస్వతీ రూపాన్ని వేయించి జ్ఞాన అజ్ఞానాలకీ, విరోధం విచక్షణం అనే రెంటికీ మూలమైన శక్తిని తెలుసుకునేలా చేస్తారు.7వ రోజున వివాహిత అయిన స్త్రీ తన భర్తతో కలిసి ఉన్నప్పుడే భోగాన్నీ (మానసికానందం) పొందగలదని ఉపదేశిస్తూ భవానీ రూపాన్ని వేస్తారు. 8వ రోజున ఎంతటి కష్టానికైనా అండగా ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తూ దుర్గారూపాన్నీ– 9వ రోజున శత్రువుని ఎదుర్కొనే సాహసాన్ని ప్రతి స్త్రీ కలిగి ఉండాలనే దృష్టిని నేర్పుతూ మహానవమి నాడు క్రోధ రూపిణి అయిన కాలి రూపాన్నీ– 10వ రోజున మహిసాసుర మర్దినీ రూపాన్నీ (జాడ్యం బద్ధకం నిర్లక్ష్యం సిగ్గులేనితనం.. వంటి లక్షణాలని తొలగించగల) వేస్తారు. స్త్రీ అలా ఉన్న రోజున రాజరాజేశ్వరిగా సర్వులకీ అధిపత్ని గా ఉంటూ అ–పరాజిత (చేపట్టిన కార్యక్రమంలో ఓటమి లేనిది) గా అవుతుందని ఈ రూపాలతో నిరూపిస్తారు.అమ్మ చేతిలో మారణాయుధాలా?మనింట్లో ఉండే కూరగాయల్ని తరుక్కునే కత్తిపీట– వంటింట్లో ఉండే పొయ్యిమంటా... ఏవి కావు మారణాయుధాలు? వాటి ఉపయోగాన్ని బట్టి అవి ప్రయోజనాన్ని సాధించుకునే ఉపాయాలూ లేదా మారణాయుధాలూ ఔతాయి. అమ్మ చేతిలో పాశం అనురాగపాశం. అందుకే మనం ఈ ఉత్సవాలను చేసుకునేలా దాంతో బంధించింది. అమ్మ చేతిలోని అంకుశం మనం అహంకారం గర్వం హోదా ఉందనే దర్పంతో ఉన్నప్పుడు (తమోగుణం)– ఆ మదగజంలా ఉన్న మనని తోవలో పెట్టేందుకు ఉపయోగించే సాధనం. అలాగే ఆమె చేతిపుష్పబాణం మనని తన దగ్గరకి రప్పించుకునేందుకు చూపే ఆకర్షణా కుసుమం. మనని కోరికకి లొంగి΄ోకుండా నిలబడగల ధైర్యాన్ని పొందవలసిందిగా సూచించే పుష్పబాణం. పరిస్థితుల్ని దాటినట్లైతే మనని వధించడానికి లేదా శిక్షించి తోవలోకి తెచ్చేందుకు అమ్మ వాడే చాపం. అర్థం చేసుకోగలగాలి! అవి రక్షణాయుధాలు– వ్యతిరేకించిన పక్షంలో మారణాయుధాలు.దేవీ నవరాత్రుల ద్వారా తెలుసుకోవలసింది..?సంవత్సర చక్రంలో ఉగాది రాగానే అమ్మకి వసంత నవరాత్రోత్సవాలు పేరిట 9 రోజులపాటు ఉత్సవాలు, కొందరైతే పూర్ణిమ వరకూ పండుగ చేస్తారు. మళ్లీ శ్రావణ మాసంలో నాలుగు లేదా ఐదు మంగళవారాలు, మళ్లీ నాలుగు లేదా ఐదు శుక్రవారాలూ అమ్మ పండుగలే. ఇదుగో ఈ ఆశ్వయుజంలో పాడ్యమినుండి అమావాస్య వరకూ ఆమె పండుగలే 30 రోజులపాటు. కార్తికమాసం అంతటా శివునితో కలిపి పూజాఉత్సవాలే ఆమెకి. మొత్తం అమ్మకి పండుగరోజులెన్ని... అని ఆలోచిస్తే.. కనిష్ఠంగా 9+4+4+30+15=62 స్త్రీని ఓ దేవతగా ప్రతి సంవత్సరమూ ఆరాధించే ఉత్తమ సంస్కారం భారత దేశానిదే.లలితా సహస్ర నామాల్లో ఏముంటుందంటే...అమ్మకున్న వెయ్యి నామాల్లో అమ్మవారి భౌతిక రూప వర్ణనం– ఆమె ఏ మంత్ర రూపంలో ఉంటుందో ఆ మంత్ర స్వరూప విధానం– స్త్రీలలో చైతన్యాన్ని ఎలా అమ్మ నింపి ‘శక్తి సేన’ అనే ఓ దాన్ని సిద్ధం చేసిందో ఆ పద్ధతీ– ఆమెకి తన సాహస పరాక్రమాలతో దుర్మార్గులూ లోకకంటకులూ అయిన పురుష రాక్షసుల్ని ఎలా సహరించిందో తన సైన్య సహాయంతో ఆ దృశ్యం – గర్భవతి అయిన ఆమెలో ఎదుగుతున్న శిశువుకి ఏ నెలలో ఏ తీరు ఆహారసారాన్ని అందించాలో ఆ వైద్యక్రమం, శత్రువుల్ని ఎలా వధించాలో ఆ తీరుతెన్నులూ, భర్తతో ఎలా అన్యోన్యంగా ఉండాలో ఆ జీవన విధానం.. ఇలా వివరింపబడ్డాయి.దేవీ నవరాత్రాల ముఖ్యోద్దేశం అరాచకాలు చేసే పురుషుల్ని సాహస పరాక్రమాలని తోటి స్త్రీల సహాయంతో ఎదిరించి వాళ్లకి భయం కలిగేలా చేయడం– భర్తతో కలిసే ఉండే తీరుని నేర్పడం– కుటుంబ రహస్యాలని గోప్యంగా ఉంచుకుంటూ సత్త్వ గుణంతో పరిస్థితిని సానుకూలత ఉండేలా చేసుకోవడం– ఎవరో వచ్చి తమ కుటుంబాన్ని ఆదుకోవాలనుకోవడం, ఎదురు చూడ్డం కాకుండా తమె కుటుంబాన్ని తామే రక్షించుకోగల నేర్పరితనాన్ని సధైర్యంగా సాధించుకోగల విధానాన్ని నేర్పడమనేవి వీటి ముఖ్యోద్దేశాలు. -
బిగ్‌బాస్‌కు వెళ్లినందుకు ట్రోలింగ్.. ఆచార్యులు ఏమన్నారంటే?
'బిగ్‌బాస్ షోకి రమ్మని పిలిచారు.. కోట్లు ఇస్తామన్నారు, అక్కర్లేదని తిరస్కరించాను. నేను పాటించే సాంప్రదాయాలకు, విలువలకు అది అనువైన ప్రదేశం కానే కాదు.. అందుకే ఇప్పుడే కాదు, ఎప్పటికీ నేను అక్కడికి వెళ్లను. నాకు డబ్బు కన్నా విలువలే ముఖ్యం..' ఆధ్యాత్మికవేత్త, బాబా అనిరుద్ధాచార్య గతంలో అన్న మాటలివి.బాబాపై ట్రోలింగ్బిగ్బాస్ షో అంటేనే గిట్టని ఆయన ఇటీవల హిందీ బిగ్‌బాస్ 18వ సీజన్ గ్రాండ్ లాంచ్‌లో మెరిశారు. అయితే కంటెస్టెంట్‌గా కాదు, కేవలం అతిథిగానే! అయినా సరే ఆ రియాలిటీ షోకి ఎందుకు వెళ్లావంటూ జనాలు విమర్శించారు. దీంతో బాబా సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు తెలిపారు. ఊపిరి ఉన్నంతవరకు అదే చేస్తా..నేను బిగ్‌బాస్‌కు వెళ్లడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతినుంటే నన్ను క్షమించండి. సనాతన ధర్మం గొప్పదనాన్ని తెలియజేసేందుకు, దాన్ని విస్తరించాలన్న ఉద్దేశంతోనే వెళ్లానే తప్ప ఆ షోలో పాల్గొనాలని కాదు. దయచేసి నన్ను మన్నించండి. కానీ, ఒక్కటి మాత్రం నిజం.. నేను బతికున్నంతవరకు సనాతన ధర్మం గొప్పదనం గురించి మాట్లాడుతూనే ఉంటాను అని చెప్పుకొచ్చారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
స్వయం ప్రకటిత బౌద్ధ గురువు బమ్జాన్కు పదేళ్ల జైలు
బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో నేపాల్‌కు చెందిన స్వయం ప్రకటిత బౌద్ధ గురువు రామ్ బహదూర్ బమ్జాన్కు కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో తీర్పునిచ్చిన సర్లాహి జిల్లా కోర్టు న్యాయమూర్తి జీవన్ కుమార్ భండారీ నిందితునికి జైలు శిక్షతో పాటు రూ. 5 లక్షల జరిమానా కూడా విధించారు.వివరాల్లోకి వెళితే బాలికను లైంగిక వేధింపులకు గురిచేసిన ఈ కేసులో బమ్జాన్ సహచరులు జీత్ బహదూర్ తమాంగ్, జ్ఞాన్ బహదూర్ బమ్జాన్లు నిర్దోషులుగా విడుదలయ్యారు. బమ్జాన్ ప్రస్తుతం జలేశ్వర్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. 2024, జనవరి 9న ఖాట్మండులోని బుధ్ నీటకంఠలో నేపాల్ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో బృందం బమ్జాన్ను అరెస్టు చేసింది.2020 ఫిబ్రవరి 6న సర్లాహి జిల్లా కోర్టు అతనిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆ తర్వాత బమ్జాన్ పరారయ్యాడు. 2016, ఆగస్టు 4న అతని ఆశ్రమంలో అనీ (నన్)గా ఉంటున్న 15 ఏళ్ల బాలిక.. బమ్జాన్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది. 2020 ఫిబ్రవరి 23న బాధితురాలు తనకు మైనారిటీ వచ్చిన వచ్చిన తరువాత బమ్జాన్పై పోలిసులకు ఫిర్యాదు చేసింది. ఇదేవిధంగా మరికొందరు బమ్జాన్పై హత్య, కిడ్నాప్, లైంగిక వేధిపుల ఆరోపణలు చేశారు. 2005లో ఆహారం, నీరు, నిద్ర లేకుండా ధ్యానం చేసిన కారణంగా బమ్జాన్ వెలుగులోకి వచ్చాడు. ఈ నేపధ్యంలోనే అతనికి బుద్ధ బాయ్ అనే పేరు వచ్చింది. -
లైంగిక వేధింపుల ఆరోపణలు.. నేపాల్ ‘బుద్ధ బాయ్’ అరెస్ట్
కఠ్మాండు: నేపాల్‌కు చెందిన ఆధ్యాతి్మక నేత, బుద్ధుడి అవతారంగా భావించే రామ్ బహదూర్ భోంజన్(33)ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆశ్రమంలోని పలువురు యువతుల అదృశ్యం, అత్యాచారం ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. నీళ్లు, ఆహారం, నిద్ర లేకుండా ధ్యానంలో అతడు నిశ్చలంగా నెలలపాటు ఉంటాడని ఆయన అనుచరులు నమ్ముతారు. అతడిని బుద్ధ్ధ బాయ్‌గా పిలుచుకుంటారు. తన ధ్యానానికి ఆటంకం కలిగించినందుకు గాను పలువురిపై అతడు దాడి చేసినట్లు, అనుయాయులపై భౌతిక, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలున్న రామ్ బహదూర్ దశాబ్ద కాలంగా తప్పించుకు తిరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. సలార్హి ఆశ్రమంలో ఓ బాలికపై 2018లో అత్యాచారానికి పాల్పడినట్లు కూడా పోలీసులకు ఫిర్యాదు అందింది. బుధవారం పట్టుబడిన సమయంలో అతడి వద్ద 3 కోట్ల నేపాలీ కరెన్సీతోపాటు 22,500 డాలర్లు లభించినట్లు సమాచారం. -
కోరికలు కలలోని పూదోటలు! వాటి కోసం పరుగులు తీస్తే చివరికి..
ఒక రోజున బుద్ధుడు అబిరవతి నదీ తీరంలోని ఒక ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడే ఒక ఆరామం కూడా ఉంది. బుద్ధుడు అక్కడే ఉన్నాడని తెలుసుకుని ఆ పరిసర గ్రామ వాసులు ఎందరో అక్కడికి వచ్చారు. బుద్ధుని ధర్మోపదేశం పూర్తి చేయగానే... ఒక యువకుడు లేచి నమస్కరించి... ‘‘భగవాన్! కోరికలు చెడ్డవా? వాటి వల్ల ప్రయోజనం ఉండదా? వివరించి చెప్పగలరు’’ అని ప్రార్థించాడు. ‘‘ఓ యువకా! జాగ్రత్తగా విను. ఒక మాంసం వ్యాపారి తన దుకాణం దగ్గరకు వచ్చిన కుక్కకు మాంసం గీకేసిన ఎముకను వేస్తాడు. ఆ ఎముకకు మాంసం చెమ్మ, కొద్దిగా రక్తం మాత్రమే అంటి ఉంటాయి. కానీ... ఆ కుక్క ఆ ఎముకను కరచుకొని నానా తంటాలు పడుతుంది. దానివల్ల దాని ఆకలి తీరదు. దౌర్బల్యమూ తొలగదు. కోరికల వల్ల దొరికేది కూడా ఇంతే! అలాగే... వెలుగు కోసం ఒకడు ఒక గడ్డిదివిటీని పట్టుకుని గాలికి ఎదురుగా పరుగులు తీస్తుంటాడు. దివిటీ మంట చెలరేగి, పెద్దదవుతుంది. దివిటీని పట్టుకున్న వాని ముఖం మీదకే జ్వాలలు వచ్చి పడుతుంటాయి. అప్పుడు వాడు ఆ దివిటీని వదిలి పెట్టకపోతే.. తన దివిటీనే తనని కాల్చేస్తుంది. మనలో రేగిన కామాగ్నులు కూడా మనల్ని అలానే దహిస్తాయి. నిలువెత్తు లోతులో నిప్పుల గుండం ఉంటుంది. అది రగిలి చల్లారింది. పైకి మంట గానీ, పొగ గానే లేవడం లేదు. పైపై బొగ్గులన్నీ చల్లారాయి. కానీ... దానిలో దిగిన వాడు మాత్రం నిప్పుల్లో దిగబడిపోతాడు. మాడి బొగ్గులా మారిపోతాడు. కామం అనే నిప్పుల గుండంలో దిగబడిన వారు కూడా అలానే నశించిపోతారు. అలాగే... ఒకడు స్వప్నంలో అందమైన పూలతోటలో విహరిస్తూ ఉంటాడు. రంగురంగుల పూలచెట్లు, అందమైన సీతాకోకచిలుకలు, తుమ్మెదల ఝుంకార నాదాలూ... మత్తు కలిగించే చల్లని గాలి, వాడు ఆనందం లో తేలిపోయి, మైమరచిపోతాడు. అంతలో మెలకువ వస్తుంది. ఆనంద దృశ్యాలన్నీ అదృశ్యమై పోతాయి. మధురానుభూతి మాయమైపోతూ ఉంటుంది. కామ సుఖాలు కూడా అలాంటివే... ఇంకా ఒకరు అందమైన, విలువైన నగల్ని అరువు తెచ్చుకుంటారు. ధరిస్తారు. దూరంగా ఉన్న పట్టణానికి వెళ్తారు. అక్కడ అంగడిలో వాటిని అమ్మకానికి పెడతారు. బేరం జరుగుతూ ఉండగా, అసలైన నగల యజమాని వస్తాడు. దూషించి తన నగలు తాను పట్టుకుపోతాడు. అవమానంతో బేలతనంతో ఆ అరువు తెచ్చుకున్న వారు హేళన పాలవుతారు. కామాలు అంటే కోరికలు కూడా మనకి చివరికి అవమానాల్ని తెస్తాయి. హేళన పాల్జేస్తాయి. కాబట్టి కోరికలల వెంటపడి పరుగుతీసే మన మనస్సుని మనం నియంత్రించుకోవాలి.’’ అని చెప్పాడు. ఆ యువకునితో పాటు, అక్కడ ఉన్న వారందరికీ కోర్కెల వల్ల కలిగే కీడు అర్థమైంది. ఆ యువకుడు లేచి, బుద్ధునికి వంగి నమస్కరించాడు. – డా. బొర్రా గోవర్ధన్ (చదవండి: లోపలి అరలు, పొరలు, వాటికి అడ్డంగా తెరలు) -
ఎట్టకేలకు పెళ్లి కబురు చెప్పిన రొమాంటిక్ కపుల్
రాచరికపు విలాసాలను కాదని సాధారణ జీవితాన్ని ఎంచుకున్న నార్వే యువరాణి మార్థా లూయిస్ గుర్తుందా. ప్రేమికుడు, హాలీవుడ్ ఆధ్యాత్మిక గురువు, ఆఫ్రికన్ ఆరో తరం షమన్ డ్యూరెక్ వెరేట్ను త్వరలోనే పెళ్లాడనుంది. ఈ రొమాంటిక్ కపుల్ అధికారికంగా తమ పెళ్లి కబురును ప్రకటించారు. వచ్చే ఏడాది ఆగస్టు 31న (2024 ఆగస్టు 31) పెళ్లాడ బోతున్నట్టు బుధవారం ప్రకటించారు. (వాట్సాప్ కొత్త ఫీచర్ 'ఛానెల్స్' వచ్చేసింది..ఇక సెలబ్రిటీలను) నైరుతి నార్వేలోని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ,ఫ్జోర్డ్ ఒడ్డున గీరాంజర్లో వివాహ వేడుక జరగనుంది. గీరాంజర్ అందమైన పరిసరాలలో ప్రేమను సెలబ్రేట్ చేసుకోవడం పట్ల చాలా సంతోషంగా ఉన్నామని ఈ లవ్‌బర్ట్స్ ఒక ప్రకటనలో తెలిపారు. వీరి విహహ ప్రకటనపై రాజు హరాల్డ్ , రాణి సోంజా , ప్రిన్స్ హాకోన్ దంపతులను అభినందించారు "డ్యూరెక్ వెరెట్ను కుటుంబంలోకి స్వాగతించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. (రుణగ్రహీతలకు భారీ ఊరట: ఆర్బీఐ కీలక ఆదేశాలు ) View this post on Instagram A post shared by Durek Verrett (@shamandurek) 2022 జూన్‌లో మార్తా లూయిస్, డ్యూరెక్ వెరెట్ తమ నిశ్చితార్థాన్ని ప్రకటించి, కింగ్ హెరాల్డ్ ఆశీర్వాదం పొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గత ఏడాది నవంబరులో వెర్రెట్తో తన ప్రత్యామ్నాయ ఔషధ వ్యాపారంపై దృష్టి పెట్టడానికి ఆమె తన రాజ బాధ్యతలను వదులుకుంది. నార్వే యువరాణి టైటిల్‌ని మాత్రం వదులు కోలేదు. కానీ దానిని వాణిజ్య అవసరాలకు ఉపయోగించనని అంగీకరించింది. తనకు ఎలాంటి వైభవాలు అక్కర్లేదంటూప్రియమైన వ్యక్తితో కలిసి అమెరికా వెళ్లిపోయింది. రాజకుటుంబంలో ప్రశాంత వాతావరణాన్ని కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాని ఆమె ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రత్యామ్నాయ చికిత్సల అభిమాని అయిన లూయిస్ తాను దేవదూతలతో మాట్లాడగలగడం తనకు లభించిన గిఫ్ట్అని పేర్కొంది. అయితే లూయిస్ కు అంతకుముందే పెళ్లి అయ్యి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే భర్త, రచయిత అరిబెన్‌తో విడాకులు తీసుకుంది. విడిపోయిన మూడేళ్లకు 2019లో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. View this post on Instagram A post shared by Princess Märtha Louise (@princessmarthalouise) . -
బాలుడి పెదాలపై ముద్దు.. క్షమాపణలు చెప్పిన దలైలామా
ఉత్తర భారతదేశంలో జరిగిన ఒక కార్యక్రమంలో బౌద్ద మత గురువు దలైలామా ఒక బాలుడి పెదవులపై ముద్దుపెట్టుకుని, నాలుకను ముద్దు పెట్టమని కోరడం వివాదాస్పదంగా మారింది. దీంతో ఆయన అనుసరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా ఈ అంశంపై దలైలామా ట్విటర్ వేదికగా స్పందించారు. ఆ బాలుడు, అతని కుటుంబసభ్యులకు క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు. సోమవారం దలైలామా బృందం విడుదల చేసిన ప్రకటనలో.. దలైలామా వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే చింతిస్తున్నట్లు తెలిపారు. బాలుడు, అతని కుటుంబ సభ్యులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్నేహితులకు క్షమాపణలు చెప్పారు. దలైలామాను కలిసే వ్యక్తులు, ముఖ్యంగా చిన్నారులతో ఆయన సరదాగా ఉంటారు. కొన్ని సార్లు వారిని ఆటపట్టిస్తుంటారు. అయితే బాలుడి ఘటనకు ఆయన విచారం వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు. కాగా ఓ కార్యక్రమంలో తన వద్దకు ఆశీర్వాదం కోసం వెళ్లిన ఓ బాలుడి పెదాలపై దలైలామా ముద్దుపెట్టారు. అంతేకాదు తన నాలుకను ముద్దు పెట్టమని ఆ బాలుడ్ని కోరారు. దీంతో ఈ ఘటన వివాదానికి తెరలేపింది. దలైలామా బాలుడితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారేంటని నెటిజన్లు ఫైర్ అయ్యారు. -
పెదాలపై ముద్దుపెట్టిన దలైలామా.. వీడియో వైరల్.. నెటిజన్ల ఫైర్..
న్యూఢిల్లీ: టిబెట్ బౌద్ధమత గురువు, ఆధ్యాత్మికవేత్త దలైలామాకు సంబంధించిన ఓ వీడియోపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తన వద్దకు ఆశీర్వాదం కోసం వెళ్లిన ఓ బాలుడి పెదాలపై ఆయన ముద్దుపెట్టారు. అంతేకాదు తన నాలుకను ముద్దు పెట్టమని ఆ బాలుడ్ని కోరాడు. ఈ దృశ్యాలు చూసిన నెటిజన్లకు చిర్రెత్తుకొచ్చింది. ఓ మత గురువు అయిన మీరు ఏం చేస్తున్నారో అర్థమవుతుందా? పిల్లలతో ఇలాగేనా ప్రవర్తించేది అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దృశ్యాలు అసహ్యంగా ఉన్నాయని విమర్శలు గుప్పించారు. అయితే దలైలామా బాలుడికి ముద్దుపెట్టే సమయంలో అక్కడున్నవారంతా కేరింతలతో చప్పట్లు కొట్టారు. వీరంతా ఇలా చేయడంపై పులువురు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దలైలామా బాలుడితో అసభ్యంగా ప్రవర్తిస్తుంటే మీరంతా ప్రోత్సహించడమేంటని ఫైర్ అయ్యారు. So the Dalai Lama is kissing an Indian boy at a Buddhist event and he even tries to touch his tongue. He actually says "suck my tongue" Now why would he do that? 🤔 pic.twitter.com/TjDizaDHZp — Richard (@ricwe123) April 8, 2023 మరికొందరు నెటిజన్లు మాత్రం దలైలామా ముద్దుపెడుతున్నప్పుడు ఆ బాలుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాడని అన్నారు. చిన్నారిని పెదాలపై కిస్ చేయడమేంటి? ఇదేం సంప్రదాయం? నాలుకను ముద్దుపెట్టమని అడగడమేంటి అని ప్రశ్నించారు. అయితే ఓ నెటిజన్ మాత్రం వీరి విమర్శలకు సమాధానం చెప్పాడు. పెదాలు, నాలుకపై ముద్దుపెట్టడం టిబెట్ సంప్రదాయంలో ఓ భాగమని చెప్పుకొచ్చాడు. టిబెట్‌లో ఒకరి నాలుకను బయటకు తీయడం ఒక ఆచార పద్ధతి అని పేర్కొన్నాడు. ఈ సంప్రదాయం 9వ శతాబ్దానికి చెందిందని, లాంగ్ ధర్మా అనే అపఖ్యాతి పాలైన రాజు పాలన నుంచి ఇది కొనసాగుతోందన్నాడు. చదవండి: హెల్మెట్ లేకుండా స్కూటీపై మహిళా పోలీసులు.. ‘ఏంటి సర్.. ఇదే తప్పు మేం చేస్తే!’ -
ఐక్యరాజ్య సమితి చర్చల్లో నిత్యానంద ‘యూఎస్‌కే’ ప్రతినిధి
ఐక్యరాజ్యసమితి: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్థాపించిన దేశం ‘కైలాస’ ఐక్యరాజ్యసమితి చర్చల్లో పాలుపంచుకుంది. జెనీవాలో సుస్థిర అభివృద్ధి అంశంపై ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీ ఈ నెల 24న చర్చా కార్యక్రమం ఏర్పాటు చేసింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస ప్రతినిధినంటూ విజయప్రియ నిత్యానంద అనే మహిళ ఈ చర్చలో పాల్గొని, ప్రసంగించారు. హిందూ మతాన్ని, ఆచార సంప్రదాయాలను ప్రచారం చేస్తున్న నిత్యానందను భారతదేశం ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. ఆయనకు రక్షణ కల్పించాలని కోరారు. యూఎస్‌కే తరఫున ఇయాన్ కుమార్ అనే వ్యక్తి కూడా చర్చల్లో పాల్గొన్నారు. అత్యాచారం, అపహరణ కేసుల్లో అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో 2019లో నిత్యానంద దేశ విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. అజ్ఞాతంలో ఉంటూనే ఈక్వెడార్‌కు సమీపంలోని ఓ దీవిని తన సొంత కైలాస దేశమని, 200 కోట్ల మంది హిందువులకు ప్రాతినిధ్యం వహిస్తుందని ప్రకటించారు. ఐరాస గుర్తింపు పొందాలంటే భద్రతా మండలి, సర్వప్రతినిధి సభ ఆమోదం ముందుగా అవసరం. 193 దేశాల జాబితాలో యూఎస్‌కే లేదు. అయితే, జెనీవా చర్చలో పాల్గొన ద్వారా ఐరాస గుర్తింపు లభించిందనే తప్పుడు అభిప్రాయం కల్పించేందుకు యూఎస్‌కే ప్రయత్నించిందని పరిశీలకులు అంటున్నారు. -
భారతదేశంలో భగవంతుడే జాతి జీవన సూత్రం: స్వామి చిదానందగిరి
హైదరాబాద్: భారతదేశంలో భగవంతుడే జాతి జీవన సూత్రమని, ప్రపంచ నాగరికతకు ఈ జీవన విధానమే ఆధారమని యోగదా సత్సంగ సొసైటీ, సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అంతర్జాతీయ అధ్యక్షులు స్వామి చిదానంద గిరి చెప్పారు. హైదరాబాద్ కన్హ ఆశ్రమంలో జరిగిన వైఎస్ఎస్ సంగం కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మానవ జాతికి ఒక భద్రమైన, సమృద్ధమైన, ఆనందమయమైన భవిష్యత్తు కావాలంటే ఈ చైతన్యాన్ని ప్రపంచ మానవులందరిలో నెలకొల్పా లని అయన సూచించారు. స్వర్ణమయమైన సనాతన భారతీయ ఆధ్యాత్మిక నాగరికతకు, భవిష్యత్తులో రాబోయే ఏక ప్రపంచ ఆధ్యాత్మిక నాగరికతకు మధ్య, వారధులుగా తయారవ్వాలని అయన భక్తులకు పిలుపునిచ్చారు . యోగదా సత్సంగ సొసైటీ వ్యవస్థాపకులు పరమహంస యోగానంద ధ్యానం, సంఘం, గురుకృపతో కూడిన మూడు అంశాల సాధనా మార్గాన్ని ప్రసాదించారని స్వామి చిదానందగిరి చెప్పారు. ఈ మూడింటి సమ్మేళనమే ఈనాటి కార్యక్రమ ప్రధాన సూత్రమని తెలిపారు. దీన్ని "క్రియాయోగ శరణం"గా అయన అభివర్ణించారు. తద్వారా దివ్యానందం, దివ్యకాంతి అనే స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయని ఆయన చెప్పారు. నిత్యం క్రమం తప్పకుండా చేసే శాస్త్రీయ క్రియాయోగ సాధన ద్వారా శాశ్వత పరమాత్మ తత్వంలో శరణు పొందాలన్నారు. పరమహంస యోగానంద చెప్పినట్లుగా ప్రపంచం ముక్కలవుతున్నా చెక్కుచెదరకుండా స్థిరంగా నిలబడాలంటే ఆత్మాలయంలో స్థిరంగా నిలబడాలని, తద్వారా విజేతగా ఉండడానికి దృఢసంకల్పం చేసుకోవాలని స్వామి చిదానందగిరి సూచించారు. అయితే ముందుగా జ్ఞాన ఖడ్గంతో అవిద్యాజనిత సందేహాలన్నిటినీ ఖండించి పారవేయాలన్నారు కనుబొమ్మల మధ్య బిందువు మీద దృష్టిని ఏకాగ్రం చేస్తే, ఆంతరంగంలో నుంచి ఆధ్యాత్మిక శక్తి ప్రవహిస్తుందని స్వామి చిదానంద గిరి చెప్పారు. ఈ అలౌకిక చైతన్యమే జీవితానికి గొప్ప రక్షణ అని ఆయన సందేశమిచ్చారు. ఈ కార్యక్రమానికి సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ఉపాధ్యక్షులు స్వామి విశ్వానందగిరి, యోగదా సత్సంగ సొసైటీ ఉపాధ్యక్షులు స్వామి స్మరణానందగిరి, ప్రధాన కార్యదర్శి స్వామి ఈశ్వరానందగిరి తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 3200 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. ఆన్లైన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వేలాది మంది వీక్షించారు. ఈ నెల 16 వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి. చదవండి: యాదాద్రి తరహాలో ‘కొండగట్టు’ -
తిరుమల హుండీ ఆదాయంపై కమలేష్ పటేల్ వివాదాస్పద వ్యాఖ్యలు..
తిరుమల: తిరుమల హుండీ ఆదాయంపై ఆధ్యాత్మికవేత్త కమలేష్ పటేల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హుండీలో కానుకలు వేయడం స్వార్థపూరితమన్నారు. అవి ఏ ట్రస్టుకో పూజారికో వెళ్తాయంటూ కామెంట్స్ చేశారు. కానుకలతో పుణ్యం వస్తుందనుకుంటే పొరపాటు అని నోటి దురుసు ప్రదర్శించారు. కమలేశ్ వ్యాఖ్యలపై భక్తులు మండిపడుతున్నారు. తమ సెంటిమెంట్‌ను దెబ్బతీసేలా ఆయన మాట్లాడారని ధ్వజమెత్తారు. ఇలాంటి ప్రయత్నాలు మానుకోవాలని ఫైర్ అయ్యారు. చదవండి: హుండీ ఆదాయంలో రికార్డుల మోత -
దలైలామాకు గాంధీ–మండేలా అవార్డు
ధర్మశాల: టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా గాంధీ–మండేలా పురస్కారం అందుకున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రా జిల్లా ధర్మశాల సమీపంలోని మెక్లాయిడ్ గంజ్‌లో శనివారం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ పురస్కారం ప్రదానం చేశారు. యుద్ధం ద్వారా ఏ సమస్యకూ పరిష్కారం లభించదని దలైలామా అన్నారు. గాంధీ, నెల్సన్ మండేలా ఆశయసాధనకు పోరాడే ఆసియా, ఆఫ్రియా దేశాల నేతలకు గాంధీ–మండేలా ఫౌండేషన్ 2019 నుంచి పురస్కారాలను ప్రదానం చేస్తోంది. -
నాసిక్‌లో ముస్లిం మత గురువు దారుణ హత్య
ముంబై: ముస్లిం మత గురువును దారుణంగా హత్య చేసిన ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు బుధవారం వెల్లడించారు. అఫ్గనిస్తాన్‌కు చెందిన 35 ఏళ్ల ఖ్వాజా సయ్యద్ చిస్తీ గత కొన్నేళ్లుగా నాశిక్‌లో నివసిస్తున్నారు. స్థానికంగా సూఫీ బాబాగా పేరొందారు. యోలా పట్టణంలోని ఎమ్ఐడీసీ ఓపెన్ ప్లాట్‌లో సూఫీ బాబాను గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం కాల్చి చంపారు. ఈ ప్రాంతం ముంబైకి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. నిందితులు మత గురువు నుదుటిపై పిస్టోల్‌తో కాల్పులు జరపడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. బాబాను హత్య చేసిన అనంతరం నిందితులు అతనికి చెందిన ఎస్యూవీ కార్లోనే పరారయ్యారు. విషయం తెలుసుకున్న యోలా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ఆధ్యాత్మిక గురువు కారు డ్రైవర్‌నే ప్రధాని నిందితుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. బాబా డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. చదవండి: నూపుర్ వ్యాఖ్యల ప్రకంపనలు.. ఆమె తల తెస్తే ఇల్లు రాసిస్తానన్న వ్యక్తి అరెస్ట్ -
రెండేళ్ల తర్వాత కనిపించిన దలైలామా
ధర్మశాల: దేశంలో కోవిడ్ మహమ్మారి ప్రబలిన దాదాపు రెండేళ్ల తర్వాత బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా శుక్రవారం బయటకు వచ్చారు. ధర్మశాలలో ఉన్న బౌద్ధ సన్యాసులు, ఇతర సభ్యులకు జాతక కథలను ఆయన బోధించారు. అనంతరం, టిబెటన్ బౌద్ధుల ప్రధాన ఆలయం వద్ద బోధిచిత్త వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా దలైలామా మాట్లాడుతూ..‘శుక్రవారం ఢిల్లీ వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంది. అయితే, నా ఆరోగ్యం చాలా బాగుండటంతో వెళ్లడం మానేశాను. మా డాక్టర్‌తో కూడా ఇప్పుడు బాక్సింగ్ ఆడుకుంటున్నాను’ అంటూ ఆయన చమత్కరించారు. -
నిత్యానందపై ఇంటర్‌పోల్ నోటీస్
అహ్మదాబాద్/న్యూఢిల్లీ: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందపై అంతర్జాతీయ పోలీస్ సంస్థ ఇంటర్‌పోల్ ఇటీవలే బ్లూకార్నర్ నోటీస్ జారీ చేసింది. గుజరాత్లో కొంతమంది పిల్లలను అక్రమంగా నిర్బంధించారని కూడా నిత్యానందపై ఆరోపణలు ఉండటం తెలిసిందే. బ్లూ కార్నర్ నోటీసు జారీ చేస్తే ఇంటర్‌పోల్ సభ్య దేశాలు ఆ వ్యక్తి ఆచూకీ, జరిగిన నేరానికి నిందితుడికి మధ్య ఉన్న సంబంధాలపై అదనపు సమాచారం సేకరిస్తాయి. నిత్యానంద ఆనుపానులు తెలుసుకోవాలన్న గుజరాత్ పోలీసుల అభ్యర్థనకు స్పందించిన సీబీఐ ఆ మేరకు ఇంటర్‌పోల్‌కు విజ్ఞప్తిని పంపిందని అహ్మదాబాద్ డీఎస్పీ కె.టి.కమారియా తెలిపారు. నిత్యానందను అరెస్ట్ చేసేందుకు అవసరమైన రెడ్ కార్నర్ నోటీస్ కూడా జారీ చేయించేందుకు ప్రయత్ని స్తున్నట్లు ఆయన చెప్పారు. అహ్మదాబాద్‌లోని నిత్యా నంద ఆశ్రమం నుంచి ఇద్దరు బాలికలు కనిపించకుండా పోవడంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. పోలీసులు ఓ వైపు వెదుకుతుండగానే.. నిత్యానంద ఈక్వెడార్ సమీపంలోని ఓ దీవిలో కైలాస అనే పేరుతో హిందూ రాజ్యం స్థాపించినట్లు డిసెంబర్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. -
రూ.40 కోట్లు కుచ్చు టోపీ, బురిడీ బాబా అరెస్ట్
-
పెళ్లికి రూ.3 కోట్లు ఖర్చు, బురిడీ బాబా అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : ఆధ్యాత్మికవేత్తగా ప్రజలను మోసం చేస్తున్న కుమార్ గిరిష్ సింగ్ అనే బురిడి బాబాను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. డీమ్ బ్రిడ్జ్ మనీ సర్క్యూలేషన్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న గిరీష్ సింగ్‌తోపాటు అతని సోదరుడు దిలిప్ సింగ్‌ను ఎస్ఆర్ నగర్లో అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి నాలుగు కార్లను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీకి చెందిన గిరీష్ సింగ్ ఆధ్యాత్మిక వేత్తగా ప్రజలను మోసం చేస్తూ దాదాపు రూ.40 కోట్లు కాజేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. నెల్లూరుకు చెందిన గిరీష్ సింగ్ చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపడంతో ఆధ్యాత్మికతను బోధించడం ప్రారంభించాడు. అనంతరం సోదరుడు దిలీప్ సింగ్‌తోపాటు ‘అద్వైత ఆధ్యాత్మిక రీఛార్జ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్’ (ASRCE) ను ప్రారంభించాడు. ఇంటర్ ఫెయిల్ అయిన గిరీష్ కుమార్ హిమాలయాన్ యూనివర్సిటీ నుంచి నకిలీ డిగ్రీ పట్టా పొందాడు. అయితే తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ భాషల మీద మంచి పట్టు ఉండటంతో బురిడీ బాబా బుట్టలో ఈజీగా పడిపోయేవాళ్లు. గత ఏడాది గిరీష్ సింగ్ తన అనుచరురాలైన దివ్యను వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి డబ్బుపై ఆశ పెంచుకున్న గిరీష్...యువతులను టార్గెట్ చేసుకొని నేరుగా వెళ్లి కలిసి వాళ్లకి ఆధ్యాత్మిక బోధనలు ఇచ్చేవాడు. పలు టీవీ ఛానల్లో సైతం ఆధ్యాత్మిక బోధనలు ఇస్తూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నాడు. ఈ క్రమంలో గిరీష్ సింగ్ అనేక మంది నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసి, చివరికి వారికి కుచ్చు టోపీ పెట్టడంతో బాధితులు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు గిరీష్ సింగ్, అతని సోదరుడు దిలీప్‌ను పలు కేసుల కింద అరెస్టు చేశారు. జనాల నుంచి వసూలు చేసిన డబ్బుతో అతగాడు దాదాపు ఇరవై దేశాలు చుట్టేసి... అక్కడ జల్సాలు చేశావాడు. అతగాడు ఏర్పాటు చేసిన గొలుసుకట్టు వ్యాపారంలో లక్షలకు లక్షలు పెట్టుబడి పెట్టి చివరికి మోసపోయామని గ్రహించి పోలీసుల్ని ఆశ్రయించారు. గత ఏడాదే గిరీష్ కుమార్‌ను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. అయినా అతగాడిలో ఏ మార్పు రాలేదు. ఆధ్యాత్మికం ముసుగులో మళ్లీ దందా షురూ చేశాడు. రాచకొండ ఉమ్మడి కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడుతూ.. రామోజీ ఫిల్మ్ సిటీలో గిరీష్, దివ్యల వివాహం కోసం ప్రజల నుంచి రూ.3 కోట్ల సేకరించి ఖర్చు చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. అలాగే అతని తరగతులకు హాజరయ్యే వారి నుంచి రూ.10,000 నుంచి రూ .2 లక్షల వరకు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఇతనిపై 4 పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు అయ్యాయని, గిరీష్, అతని సోదరుడి పేరుతో భారీగా ఆస్తులు కూడబెట్టారని పేర్కొన్నారు. అలాగే ప్రజల నుంచి డిబెంచర్లు, డ్రీం బ్రిడ్జ్‌ల రూపంలో రూ.40 కోట్లు కాజేశారని తెలిపారు. -
ఏ కోర్టూ నన్నేమీ చేయలేదు: నిత్యానంద
న్యూఢిల్లీ: అత్యాచారం ఆరోపణలతో దేశం వదిలి పారిపోయిన వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద మరోసారి రెచ్చి పోయారు. ఏ వెదవ కోర్టూ తనను ఏమీ చేయలేదని, తానే పరమశివుడినని వ్యాఖ్యానించారు. గుర్తు తెలియని ప్రాంతం నుంచి విడుదల చేసిన ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ‘నన్నెవరూ ముట్టుకోలేరు. నేను మీకు నిజం చెబుతా. నేనే పరమ శివుడిని. అర్థమైందా? ఈ నిజాన్ని ప్రకటించినందుకు ఏ వెదవ కోర్టూ నన్ను విచారిం చలేదు. నేనే పరమశివుడిని. నాదీ గ్యారెంటీ. మీకెవరికీ మరణం లేదు’అంటూ నిత్యానంద వ్యాఖ్యానించడం వీడియోలో కనిపించింది. ఇదిలా ఉండగా దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతిని రవీశ్‌కుమార్ మాట్లాడుతూ అన్ని దేశాల్లోని కార్యాలయాలను అప్రమత్తం చేశామని, నిత్యానంద గురించి స్థానిక ప్రభుత్వాలకు వివరించాలని స్పష్టం చేసినట్లు తెలిపారు. -
మహిళల ముసుగులో పాక్ ఏజెంట్లు
న్యూఢిల్లీ: ఆన్లైన్లో అపరిచితులతో స్నేహం విషయంలో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సైన్యం హెచ్చరించింది. భారత జవాన్లే లక్ష్యంగా పాక్ గూఢచార సంస్థ పనిచేస్తోందని, ఆధ్యాత్మిక బోధకులు, విదేశీ మహిళలమంటూ స్నేహహస్తం అందించే వారి విషయంలో, ముఖ్యంగా సున్నితమైన సమాచారం పంచుకునే విషయంలో విచక్షణతో మెలగాలని సూచించింది. సున్నిత ప్రాంతాల్లో మెహరించిన సైనికులకు సంబంధించిన సమాచారం, ఉన్నతాధికారుల ఫోన్ నంబర్లు తెలుసుకునేందుకు తప్పుడు ప్రొఫైల్స్‌తో పాక్ ఏజెంట్లు భారత జవాన్లకు ఎరవేస్తున్నారని తెలిపింది. రెండు, మూడేళ్ల క్రితం నాటి ఇటువంటి 150 ప్రొఫైల్స్‌ను ఇప్పటివరకు గుర్తించామని గత నెలలోనే దేశవ్యాప్తంగా ఉన్న కమాండింగ్ సెంటర్లు, డైరెక్టరేట్ల ద్వారా హెచ్చరించినట్లు సైన్యం తెలిపింది. సైన్యానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని పాక్‌కు చెందిన మహిళా ఏజెంట్లకు సామాజిక మాధ్యమాల ద్వారా అందించారనే ఆరోపణలపై జోథ్‌పూర్‌లో ఒక జవానును తాజాగా అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. పట్టుబడిన జవాను విచిత్ర బెహ్రా ఒడిశాకు చెందిన వారు. విచారణలో బెహ్రా వెల్లడించిన వివరాల ప్రకారం.. సదరు మహిళ మారు పేరుతో ఉన్న పాక్ ఏజెంటే అని నిర్ధారణకు వచ్చారు. -
లైంగిక వేధింపుల కేసు : స్వామి ఆనంద్ గిరి అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : యోగా, ఆథ్యాత్మిక గురువుగా చెప్పుకునే స్వామి ఆనంద్ గిరిని ఇద్దరు మహిళా శిష్యులను లైంగిక వేధింపులకు గురిచేసినందుకు సిడ్నీలో అరెస్ట్ చేశారు. రూటీ హిల్‌లో 2016లో ఓ ప్రార్ధనా సమావేశానికి హాజరైన ఆనంద్ గిరి ఓ మహిళను వేధించారని, 2018 నవంబర్‌లో మరో ఘటనలో 34 ఏళ్ల మహిళను లైంగికంగా వేధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆస్ర్టేలియాలో ఆరు వారాల పర్యటనలో ఉన్న స్వామి ఆనంద్ గిరిని మే 5న సిడ్నీలో అరెస్ట్ చేశారు. ఆనంద్ బెయిల్ అప్పీల్‌ను తిరస్కరించిన కోర్టు కస్టడీకి తరలించింది. జూన్‌లో మళ్లీ కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లోని బడే హనుమాన్ ఆలయంలో నిందితుడు మహంత్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆనంద్ ఫేస్బుక్ పేజ్‌లో ఆయన పలువురు ప్రముఖ బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులతో కలిసి ఉన్న ఫోటోలు దర్శనమిచ్చాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌లతో కలిసి ఉన్న ఫోటోలున్నాయి. -
రేప్ బెదిరింపులతోనే భయ్యూ ఆత్మహత్య
ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక గురువు భయ్యూ మహరాజ్(50) ఆత్మహత్య వెనుక మిస్టరీ వీడింది. తనను పెళ్లి చేసుకోకుంటే రేప్ కేసు పెడతానని సేవకురాలు పలక్ పురాణిక్(25) బెదిరించడంతోనే 2018, జూన్ 12న భయ్యూ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారని ఇండోర్ డీఐజీ మిశ్రా తెలిపారు. తగు సాక్ష్యాలు ఉన్నాయన్నారు. ఆశ్రమానికి చెందిన వినాయక్(42), శరద్(34)లు పలక్‌తో చేతులు కలిపి భయ్యూ మహారాజ్‌కు హైడోస్ మందులు ఇచ్చారని వెల్లడించారు. వీరంతా కలిసి ఆయన్ను ఆత్మహత్యకు పురిగొల్పా రని వ్యాఖ్యానించారు. ఈ ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా, 15 రోజుల కస్టడీకి కోర్టు అప్పగించిందన్నారు. -
పాఠాలు చెప్పమని వస్తే...
అయోధ్య : ఆధ్యాత్మిక బోధనలు విందామని వచ్చిన భక్తురాలిపై అయోధ్యలోని ఓ ఆలయ పూజారి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మంచివాడిగా నటిస్తూ దేవుడి సన్నిధిలో కామంధుడి రూపం దాల్చాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో కటకటకాల పాలయ్యాడు. వివరాలు.. అయోధ్యలోని ఓ దేవాలయంలో ప్రధాన పూజారిగా పనిచేస్తున్న కృష్ణకాంతాచార్య దగ్గర ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకుందామని వారణాసికి చెందిన ఓ మహిళ (30) డిసెంబర్ 24న వచ్చారు. బయటకు వెళ్తే బోధనలకు ఇబ్బంది అవుతుందనీ, ఆలయ పరిసరాల్లోని ఓ గదిలో ఉండాలని పూజారి నమ్మబలికాడు. ఆపై ఆమెను లోబరుచుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం గోప్యంగా ఉంచేందుకు ఆమెను బయటకు రాకుండా ప్రతిఘటించాడు. ఎలాగోలా బాధితురాలు పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో ఆమెను రక్షించారు. పూజారి కృష్ణకాంతాచార్యను మంగళవారం అరెస్టు చేశారు. బాధితురాలిని మెడికల్ పరీక్షల కోసం పంపంచామని సీఐ ఏకే.సావ్ తెలిపారు. -
ఆధ్యాత్మిక గురువు ఆత్మహత్యకు కారణం..?
ఇండోర్ : ఆధ్యాత్మిక గురువు భయ్యూజీ మహారాజ్ ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం తనను తాను తుపాకితో కాల్చుకుని ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. మానసిక వత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాసిన లేఖ ఆయన గదిలో లభించింది. కానీ తాజాగా ఆయన మరణంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆత్మహత్య చేసుకునే కొన్ని గంటల ముందు ఆయన ఒక రెస్టారెంటుకు వెళ్లినట్లు సీసీటీవీ పుటేజ్ ద్వారా బయటపడింది. ఆయన రెస్టారెంటులోకి ప్రవేశిస్తునే ఫోన్లో ఎవరితోనో సంభాషిస్తున్నారు. కొంతసేపటికి ఒక టేబుల్ వద్ద కూర్చున్నారు. ఆ సమయంలో ఆయన రెండో భార్య డాక్టర్ ఆయుష్ శర్మ అక్కడికి వచ్చారు. తర్వాత భయ్యూజీ అక్కడి నుంచి బయటికి వెళ్లిపోయారు. ఆ సమయంలో ఆయన ఒకింత ఆదోళనగా, గాబరాపడుతున్నట్లు కనిపించారు. సూసైడ్ నోట్లో మానసిక వత్తిడి కారణంగానే ఆత్మహత్యకు పాల్పడుతున్నానని పేర్కొన్నప్పటికి, అసలు కారణం వేరే ఉన్నట్లు ఆయన సన్నిహితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆస్తి తగాదాలు.. భయ్యూజీ ఆస్తి విషయంలో మొదటి భార్య మాధవికి, రెండో భార్య ఆయుషీ శర్మకు విభేదాలు ఉన్నాయి. తన తండ్రి మరణానికి ఆయుషీ శర్మనే కారణమంటూ మొదటి భార్య కూతురు కుహు ఆరోపించారు. ఆస్తి కోసం కుహు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసిందని దాని కారణంగానే భయ్యూజీ ఆత్మహత్య చేసుకున్నారని ఆయుషీ ప్రత్యారోపణలు చేశారు. రాజకీయ వత్తిడి.. భయ్యూజీ ఆత్మహత్యకు మధ్యప్రదేశ్ ప్రభుత్వమే కారణమంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. భయ్యూజీకి వేల సంఖ్యలో అభిమానులు, భక్తులు ఉన్నారని అందుకోసం ఆయనకు మంత్రి పదవి ఇచ్చి లోబర్చుకోవాలని బీజేపీ ప్రయత్నించిందని విమర్శలు గుప్పించింది. తమ ప్రభుత్వానికి సహారించనందుకే భయ్యూజీని ఆత్మహత్య చేసుకునేలా బీజేపీ ఆయనను వేధించిందని కాంగ్రెస్ ఆరోపించింది. కాగా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భయ్యూజీకి తన క్యాబినెట్లో మంత్రి పదవీ ఆఫర్ చేస్తే, భయ్యూజీ దాన్ని తిరస్కరించిన సంగతి తెలిసిందే. -
‘భయ్యూజీ మరణానికి కారణం అదే...’
భోపాల్ : ప్రముఖ ఆధ్యాత్మిక గురువు భయ్యూజీ మహారాజ్ ఆత్మహత్య చేసుకోవడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వమే కారణమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని ప్రభుత్వం నర్మదా నది తీరంలో చేపట్టిన అక్రమ తవ్వకాల గురించి భయ్యూజీ ప్రశ్నించేవారని.. అయితే తమ అవినీతి గురించి నోరు విప్పకుండా ఉండేందుకు ఆయనకు మంత్రి పదవి ఆశ చూపినా లొంగలేదని వ్యాఖ్యానించారు. ఈ విషయం గురించి భయ్యూజీ తనతో ఫోన్లో మాట్లాడారని దిగ్విజయ్ సింగ్ అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్‌ను తిరస్కరించడం వల్లే ఆయనను మానసిక క్షోభకు గురి చేసి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారని ఆరోపించారు. కాగా భయ్యూజీ మహారాజ్ మంగళవారం ఇండోర్‌లోని తన నివాసంలో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన గదిలో ఓ నోట్‌ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నానని, కుటుంబ బాధ్యతలను ఎవరైనా తీసుకోవాలని భయ్యూజీ నోట్లో రాశారు. నోట్లోని దస్తూరీ మహారాజ్‌దే అని ఆయన కుటుంబ సభ్యులు నిర్ధారించారు.