బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో నేపాల్‌కు చెందిన స్వయం ప్రకటిత బౌద్ధ గురువు రామ్ బహదూర్ బమ్జాన్‌కు కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో తీర్పునిచ్చిన సర్లాహి జిల్లా కోర్టు న్యాయమూర్తి జీవన్ కుమార్ భండారీ నిందితునికి జైలు శిక్షతో పాటు రూ. 5 లక్షల జరిమానా కూడా విధించారు.
వివరాల్లోకి వెళితే బాలికను లైంగిక వేధింపులకు గురిచేసిన ఈ కేసులో బమ్జాన్ సహచరులు జీత్ బహదూర్ తమాంగ్, జ్ఞాన్ బహదూర్ బమ్జాన్‌లు నిర్దోషులుగా విడుదలయ్యారు. బమ్జాన్ ప్రస్తుతం జలేశ్వర్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. 2024, జనవరి 9న ఖాట్మండులోని బుధ్ నీటకంఠలో నేపాల్ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో బృందం బమ్జాన్‌ను అరెస్టు చేసింది.
2020 ఫిబ్రవరి 6న సర్లాహి జిల్లా కోర్టు అతనిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆ తర్వాత బమ్జాన్ పరారయ్యాడు. 2016, ఆగస్టు 4న అతని ఆశ్రమంలో అనీ (నన్)గా ఉంటున్న 15 ఏళ్ల బాలిక.. బమ్జాన్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది. 2020 ఫిబ్రవరి 23న బాధితురాలు తనకు మైనారిటీ వచ్చిన వచ్చిన తరువాత బమ్జాన్‌పై పోలిసులకు ఫిర్యాదు చేసింది. ఇదేవిధంగా మరికొందరు బమ్జాన్‌పై హత్య, కిడ్నాప్, లైంగిక వేధిపుల ఆరోపణలు చేశారు. 2005లో ఆహారం, నీరు, నిద్ర లేకుండా ధ్యానం చేసిన కారణంగా బమ్జాన్ వెలుగులోకి వచ్చాడు. ఈ నేపధ్యంలోనే అతనికి బుద్ధ బాయ్ అనే పేరు వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment