ముంబై: ముస్లిం మత గురువును దారుణంగా హత్య చేసిన ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు బుధవారం వెల్లడించారు. అఫ్గనిస్తాన్‌కు చెందిన 35 ఏళ్ల ఖ్వాజా సయ్యద్ చిస్తీ గత కొన్నేళ్లుగా నాశిక్‌లో నివసిస్తున్నారు. స్థానికంగా సూఫీ బాబాగా పేరొందారు. యోలా పట్టణంలోని ఎమ్‌ఐడీసీ ఓపెన్ ప్లాట్‌లో సూఫీ బాబాను గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం కాల్చి చంపారు. ఈ ప్రాంతం ముంబైకి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది.
నిందితులు మత గురువు నుదుటిపై పిస్టోల్‌తో కాల్పులు జరపడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. బాబాను హత్య చేసిన అనంతరం నిందితులు అతనికి చెందిన ఎస్‌యూవీ కార్‌లోనే పరారయ్యారు. విషయం తెలుసుకున్న యోలా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ఆధ్యాత్మిక గురువు కారు డ్రైవర్‌నే ప్రధాని నిందితుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. బాబా డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
చదవండి: నూపుర్ వ్యాఖ్యల ప్రకంపనలు.. ఆమె తల తెస్తే ఇల్లు రాసిస్తానన్న వ్యక్తి అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment