
ముంబై: మహారాష్ట్ర నాసిక్‌లో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. ఓ బస్సు లోయ పడిన ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరో 28 మందికి గాయాలు కాగా.. వాళ్లను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
సత్పురా ఘాట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న వాహనాన్ని బస్సు డ్రైవర్ ఓవర్ టేక్ చేశాడు. ఆ ప్రయత్నంలో ముందు మలుపు ఉండడంతో వేగంగా వెళ్తున్న బస్సును నియంత్రించలేకపోయాడు. దీంతో బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు.
బస్సులోని ఓ ప్రయాణికుడు.. ఆ జర్నీని లైవ్ టెలికాస్ట్ కోసం చిత్రీకరించాడు. బస్సు ప్రమాదం తర్వాత కూడా ఆ వీడియో రికార్డయ్యింది. ప్రయాణికుల ఆర్తనాదాలు ఆ వీడియోలో వినిపించాయి. ఆపై ప్రమాద ఘటన తాలుకా వీడియో నెట్టింటకు చేరింది.
Nashik: A bus fell into a valley in Nashik, LIVE video of the accident has surfaced#BusAccident #Nashik #Satpura #ViralVideo pic.twitter.com/bSidD45caK
— Siraj Noorani (@sirajnoorani) July 9, 2024
Comments
Please login to add a commentAdd a comment