న్యూఢిల్లీ: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారామ్ బాపూ (74)పై మంగళవారం ఢిల్లీలోని కమలా మార్కెట్ పోలీసుస్టేషన్‌లో లైంగిక దాడి కేసు నమోదైంది. ఆశారామ్ ఇటీవల తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఓ 16 ఏళ్ల బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ఆశ్రమంలో ఆశారామ్ తనపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితురా లు పేర్కొంది. లైంగిక దాడి జరిగినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. బాధి తురాలు మధ్యప్రదేశ్ చింద్వారాలో ఆశారామ్‌కు చెందిన గురుకులంలో 12వ తరగతి చదువుతోంది. ఈ ఆరోపణలను ఆశారామ్ బాపూ ఆశ్రమ ప్రతినిధి తోసిపుచ్చారు.
ఆశారామ్ బాపూపై లైంగిక దాడి కేసు
Published Thu, Aug 22 2013 5:30 AM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM
Advertisement
Advertisement