Asaram bapu
-
4 గంటల భేటీకి రూ. 5 లక్షలు.. జైలులో కలుసుకోనున్న ఆశారాం-నారాయణ్
సూరత్: మైనర్ విద్యార్థినిపై అత్యాచారం కేసులో 11 ఏళ్లుగా జైల్లోనే ఉంటున్న ప్రవచనకర్త ఆశారాం ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. ఇటీవలే ఆయనకు కోర్టు ఆదేశాలతో మహారాష్ట్రలో చికిత్స అందించారు. కాగా గుజరాత్ హైకోర్టు అనుమతితో ఆయన తన కుమారుడు నారాయణ్ సాయిని జోధ్‌పూర్ జైలులో కలుసుకోనున్నారు. అయితే ఇందుకోసం ఆశారాం కుమారుడు రూ.5 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.ఆశారాం కుమారుడు నారాయణ్ సాయి గుజరాత్‌లోని సూరత్ సెంట్రల్ జైలులో జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్నాడు. కొన్ని షరతులతో తన తండ్రి ఆశారాంను 4 గంటల పాటు కలిసేందుకు గుజరాత్ హైకోర్టు నారాయణ్ సాయికి అనుమతినిచ్చింది. ఈ భేటీలో ఆశారాం, నారాయణ్ మినహా కుటుంబ సభ్యులెవరూ ఉండరు. శుక్రవారం గుజరాత్ హైకోర్టులో నారాయణ్ సాయి పిటిషన్‌పై విచారణ జరిగింది. నారాయణ్ సాయి అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో సూరత్‌లోని లాజ్‌పూర్ సెంట్రల్ జైలులో ఖైదీగా ఉన్నాడు. తన తండ్రికి ఆరోగ్యం బాగాలేదని, ఆయనను కలవాలని అనుకుంటున్నానని నారాయణ్‌సాయి తన పిటిషన్లో పేర్కొన్నాడు.మైనర్‌పై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడిన ఆశారాం దాదాపు 11 ఏళ్లుగా జోధ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉంటున్నాడు. ఈ కాలంలో తండ్రీ కొడుకులు ఎప్పుడూ కలుసుకోలేదు. పెరోల్ కోసం ఆశారాం పలుమార్లు కోరినప్పటికీ మంజూరు కాలేదు. కాగా గుజరాత్ హైకోర్టు తన ఆదేశాలలో నారాయణ్ సాయిను అసిస్టెంట్ పోలీస్ కమిషనర్, ఒక పోలీస్ ఇన్స్పెక్టర్, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ఇద్దరు కానిస్టేబుళ్ల పర్యవేక్షణలో విమానంలో జోధ్‌పూర్ జైలుకు పంపాలని పేర్కొంది. నాలుగు గంటల పాటు జైలులో ఉన్న తన తండ్రిని నారాయణ్ సాయి కలుసుకోనున్నాడు. ఇందుకోసం ఆయన సూరత్‌లోని పోలీస్ స్టేషన్‌లోని ప్రభుత్వ ఖజానాకు రూ.5 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.ఇది కూడా చదవండి: కేసుల పరిష్కారానికి గడువు పెట్టలేం -
మేం వినబోం.. హైకోర్టుకు చెప్పుకోండి
న్యూఢిల్లీ: టీనేజీ అమ్మాయిలపై లైంగిక దాడులు, అత్యాచారం ఆరోపణల్లో దోషిగా తేలి యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న వివాదాస్పద గురువు ఆశారాం బాపు తన శిక్షను రద్దుచేయాలంటూ పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ విషయంలో తామేమీ వినదల్చుకోలేదని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘ఏదైనా ఉపశమనం కావాలంటే రాజస్థాన్ హైకోర్టుకు వెళ్లండి’’ అని స్పష్టం చేసింది. అయితే ఈ మేరకు ఆశారం గతంలో పెట్టుకున్న పిటిషన్లను రాజస్థాన్ హైకోర్టు నాలుగుసార్లు కొట్టేసిందని ఆయన తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ పేర్కొన్నారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆశారాం శిక్ష రద్దుచేసి మహారాష్ట్ర ఆస్పత్రిలో వైద్యానికి అవకాశం ఇవ్వాలని కోరారు. తామేమీ చేయలేవని, మళ్లీ హైకోర్టుకే వెళ్లాలని ధర్మాసనం స్పష్టం చేసింది. 2013 ఏడాదిలో తన ఆశ్రమంలో టీనేజీ అమ్మాయిని రేప్ చేశాడనే కేసులో అదే ఏడాది అరెస్టయి 2018లో పోక్సో కోర్టు యావజ్జీవ శిక్ష విధించిన నాటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు. -
ఆశారాం నుంచి రామ్ రహీం వరకూ ఏం చదువుకున్నారు?
మనదేశంలోని పేరుగాంచిన పలువురు బాబాలు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపధ్యంలో వారిమీద పోలీసు కేసులు నమోదయ్యాయి. కొందరు బాబాలు జైలు శిక్ష కూడా అనుభవిస్తున్నారు. వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ బాబాలు ఏమి చదువుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. స్వామీ నిత్యానంద: కలకత్తా యూనివర్శిటీలో ఎంఏ ఆశారాం బాపు: మూడవ తరగతి బాబా రామ్‌దేవ్: ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదవ తరగతి శ్రీశ్రీ రవిశంకర్: సెంట్ జోసెఫ్ కాలేజీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ సంత్ రామ్ పాల్: ఇంజినీరింగ్ డిప్లమో జగ్గీవాసుదేవ్(సద్గురు): మైసూరు విశ్వవిద్యాలయం నుంచి ఆంగ్లంలో బ్యాచులర్ ఇది కూడా చదవండి: అతి పెద్ద గుండె కలిగిన జీవి ఏది? -
Hyderabad: ఆశారాం బాపుపై చీటింగ్ కేసు
సాక్షి, హైదరాబాద్: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపుపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. కోర్టు వివాదంలో ఉన్న ఆస్తిని విక్రయించడంతో పాటు తన తండ్రి మరణానికీ కారణమయ్యాడంటూ హిమాయత్‌నగర్‌కు చెందిన కున్వర్ నరేష్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు రిజిస్టర్ చేసిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో ఆశారాం బాపు సహా మొత్తం 14 మంది నిందితులుగా ఉన్నారు. వివరాల్లోకి వెళితే.. బాధితుడి కుటుంబం ఆశారాం బాపునకు భక్తులుగా ఉన్నారు. వీరు పలుమార్లు శంషాబాద్, అహ్మదాబాద్, సూరత్‌లోని ఆయన ఆశ్రయాలకు వెళ్లడం, బాపు కూడా పలుమార్లు నరేష్ ఇంటికి రావడం జరిగింది. 2004 అక్టోబర్ 28న నరేష్ తండ్రి మోహన్ సింగ్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఆశారాం బాపు ఆశ్రమంలో ఇచ్చిన టానిక్, ప్రసాదం తీసుకోవడమే ఇందుకు కారణమని నరేష్ ఆరోపిస్తున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రిని ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అతడి శరీరంలో హెవీ మెటల్ పాయిజన్స్ ఉన్నట్లు చెప్పారని అతను ఆరోపిస్తున్నాడు. ఓ దశలో తన తండ్రిని అహ్మదాబాద్‌లోని ఆశ్రమానికి తీసుకెళ్లగా, బాపు స్వయంగా ప్రసాదం ఇచ్చారని, హైదరాబాద్ తీసుకువచ్చిన తర్వాత తన తండ్రి మృతి చెందారని అతను పేర్కొన్నాడు. మోహన్ మరణం తర్వాత ఆయన కుటుంబం ఆస్తులకు సంబంధించి పార్టీషన్ డీడ్ రాసుకుంది. దీని ప్రకారం హిమాయత్‌నగర్‌లోని 1326 చదరపు గజాల స్థలం నరేష్ తదితరులకు వచ్చింది. ఇదిలా ఉండగా నరేష్, అతడి తల్లి మాలతి సింగ్, సోదరుడు అనంత్ సింగ్, ఆశారాం బాపు ఆశ్రమం ట్రస్ట్ ప్రతినిధి పంజక్ కుమార్, బీకన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌కు చెందిన బి.ప్రశాంత్ రెడ్డి, లోటస్ గృహ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి కట్టా లక్ష్మీకాంత్ మధ్య సదరు స్థలానికి సంబంధించి డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నారు. దీని ప్రకారం ఆ స్థలంలో 36 నెలల్లో జీ 4 అంతస్తులతో భవనం నిర్మించాలి. ఇందులో 60 శాతం స్థల యజమానులకు, 40 శాతం డెవలపర్లకు చెందుతుంది. మొదటి, మూడో అంతస్తులు స్థల యజమానులకు, నాలుగో అంతస్తు ఆశారాం బాపు ట్రస్ట్‌కు చెందేలా నిర్మాణం చేపట్టాలని ఇందుకు అయ్యే ఖర్చు ఇరు పక్షాలు 60:40 వంతున భరించాల్సి ఉంది. భవనం నిర్మాణంలో ఉండగానే ఆశారాం బాపు, ఆయన ట్రస్ట్‌తో నరేష్ కుటుంబానికి వివాదాలు మొదలయ్యాయి. దీంతో నరేష్ తల్లి మాలతి సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసి 2014 ఫిబ్రవరిలో స్టేటస్ కో పొందారు. అయితే వాటిని ఉల్లంఘించి ఆశారాం బాపుతో పాటు ఆయన ప్రతినిధి, ఇతర సంస్థలు కుమ్మకై ్క సదరు స్థలాన్ని విక్రయించారని నరేష్ ఆరోపిస్తున్నారు. 2019–2020లో జరిగిన ఈ క్రయవిక్రయాలు ఇటీవల నరేష్ దృష్టికి రావడంతో అతను సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ చేపట్టిన అధికారులు నేరం జరిగినట్లు ఆధారాలు సేకరించారు. దీని ఆధారంగా ఆశారాం బాపుతో పాటు మరో 13 మందిపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
అత్యాచార కేసులో ఆశారాం బాపునకు జీవిత ఖైదు
అహ్మదాబాద్: దశాబ్దకాలం నాటి అత్యాచారం కేసులో వివాదాస్పద ఆధ్యాత్మిక వేత్త ఆశారాం బాపూ దోషిగా తేలిన విషయం తెలిసిందే. 2013లో తన ఆశ్రమంలో నివసిస్తున్న మహిళపై లైంగికదాడి కేసులో గాంధీనగర్ సెషన్స్ కోర్టు సోమవారం ఆయన్ను దోషిగా తేల్చింది. ఈ కేసులో తీర్పును రిజర్వు చేసిన న్యాయమూర్తి.. తాజాగా నేడు (జనవరి31) అతనికి జీవిత ఖైదు శిక్ష విధిస్తున్నట్లు వెల్లడించారు. కాగా గుజరాత్ మోతేరాలోని ఆశారాం బాపూ ఆశ్రమంలో పనిచేస్తున్న సమయంలో 2001 నుంచి 2006 వరకు తనపై గురువు పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడినట్టు ఓ మహిళ 2013లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. సూరత్‌కు చెందిన మహిళ ఆశారాం బాపూతో సహా ఏడుగురిపై అత్యాచారం, అక్రమ నిర్బంధం కేసు పెట్టారు. దీంతో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దీనిపై విచారణ జరిపిన గాంధీనగర్‌లోని సెషన్స్ కోర్టు ఈ కేసులో ఆశారాంను దోషిగా తేల్చింది. ఇదే కేసులో సరైన ఆధారాలు లేనందున ఆశారాం భార్య, కుమార్తె, కుమారుడితో పాటు మరో నలుగురు మహిళలను నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆశారాంకు జీవిత ఖైదు విధించింది. కాగా 81 ఏళ్ల ఆశారం బాపూ ప్రస్తుతం మరో అత్యాచారం కేసులో జోధ్‌పూర్ జైలులో శిక్షననుభవిస్తున్నారు. జోధ్‌పూర్ ఆశ్రమంలో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారన్న ఆరోపణలపై ఆయనపై కేసు నమోదవ్వగా..2018లో జోధ్‌పూర్ ట్రయల్ కోర్టు దోషిగా తేల్చింది. అతడిని ఇండోర్‌లో అరెస్టు చేసిన పోలీసులు అనంతరం జోధ్‌పూర్‌కు తరలించారు. 2013 నుంచి జోధ్‌పూర్ జైలులోనే ఉన్నారు. ప్రముఖ అధ్యాత్మిక గురువుగా దేశ విదేశాల్లో శిష్యులను సంపాదించుకున్న ఆశారం చివరకు ఇలా కటకటాలపాలయ్యారు. చదవండి: చైనా సంస్థ నుంచి డబ్బులు తీసుకొనే బీబీసీ తప్పుడు ప్రచారం' -
ఆశారాం ఆశ్రమానికి వెళ్లిన హైదరాబాద్ యువకుడు అదృశ్యం!
సాక్షి, హైదరాబాద్: వివాదాస్పద ఆశారాం బాపూ ఆశ్రమం మరోసారి వార్తల్లో నిలిచింది. ఆశ్రమానికి వెళ్లిన ఓ హైదరాబాద్ యువకుడు అదృశ్యమయ్యాడు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ శివారు మోతేరాలో ఉన్న ఈ ఆశ్రమానికి హైదరాబాద్ యువకుడు విజయ్ యాదవ్ తన స్నేహితులతో కలసి ఈ నెల 3న వెళ్లి అక్కడే బసచేశాడు. ఈ క్రమంలో అతడు 11వ తేదీ నుంచి కనిపించట్లేదు. ఆందోళన చెందిన కుటుంబీకులు సోమవారం ఆ ఆశ్రమానికి వెళ్లి విచారించగా నిర్వాహకుల నుంచి స్పష్టమైన సమాధానం లభించలేదు. దీంతో అక్కడి చాంద్‌ఖేడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు కావడంతో డీసీపీ–2 విజయ్ పాటిల్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందం దర్యాప్తు ప్రారంభించింది. బాలికపై అత్యాచారం కేసులో ఆశారాం బాపూ ప్రస్తుతం రాజస్తాన్‌లోని జోధ్‌పూర్ జైల్లో ఉన్నారు. ఈ నెల 8న విజయ్యాదవ్తోపాటు అతడి స్నేహితులు జోధ్‌పూర్‌లోని ఆశారాం ఆశ్రమంలో జరిగిన శిబిరానికి హాజరయ్యారు. మిగిలినవాళ్లు ఈ నెల 10న తిరిగి వచ్చేయగా, తాను మరికొన్ని రోజులుండి వస్తానంటూ విజయ్ అక్కడే ఆగిపోయాడు. ఆ మరుసటి రోజు నుంచి కుటుంబీకులు అతడికి ఫోన్ చేస్తున్నా స్విచ్ఛాఫ్ అని వస్తోంది. దీంతో ఆందోళనకు గురైన విజయ్ సోదరుడు, ఓ బంధువు మోతేరాకు చేరుకుని ఆశ్రమ నిర్వాహకులను ఆరా తీశారు. వారి నుంచి సరైన స్పందన లేకపోవడంతో రిజిస్టర్‌ను పరిశీలించారు. ఆశ్రయంలోకి వెళ్లినట్లు విజయ్ పేరు నమోదైనా, బయటకు వచ్చినట్లుగా నమోదు కాలేదు. ఆశ్రమంలో ఉన్న సీసీ కెమెరాల ఫీడ్‌ను పరిశీలించాలంటూ కుటుంబీకులు కోరగా 11వ తేదీకి సంబంధించిన ఫీడ్ అందుబాటులో లేదంటూ నిర్వాహకులు సమాధానం ఇచ్చారు. అజ్ఞాతంలోకి వెళ్తున్నట్లు విజయ్ మెయిల్ ఐడీ నుంచి మెస్సేజ్.. ఆశ్రమంతోపాటు ఆశారాం బాపూ వ్యవహారశైలి కూడా వివాదాస్పదం కావడం, గతంలోనూ కొందరు ఇక్కడ మిస్సింగ్ అయిన ఉదంతాలు ఉండటాన్ని పోలీసులు పరిగణనలోకి తీసుకున్నారు. 2008లో ఇదే ఆశ్రమం నుంచి అదృశ్యమైన దీపేశ్, అభిషేక్‌లు సమీపంలోని నదిఒడ్డున శవాలుగా కనిపించారు. బుధవారం విజయ్ ఈ–మెయిల్ ఐడీ నుంచి కుటుంబీకులకు ఓ మెస్సేజ్ వచ్చిందని, స్వచ్ఛందంగా అజ్ఞాతంలోకి వెళ్తున్నానని, ఆశ్రమంపై అపవాదులు వేయవద్దని అందులో ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. దర్యాప్తు అధి కారులు సదరు ఈ–మెయిల్ వచ్చిన ఐపీ అడ్రస్‌ను కనిపెట్టడానికి సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నారు. -
ఐసీయూలో చేరిన వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూ
జైపూర్: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూ శనివారం జోధ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లోని ఐసీయూలో చేరారు. కాలేయ సంబంధిత వ్యాధి, మూత్రంలో ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అంతేగాక గత ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో 80 ఏళ్ల ఆశారాం బాపుకు కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించి 48 గంటల పాటు వైద్యుల పరిరక్షణలో ఉంచనున్నారు. చదవండి: ‘కళ్లు పీకి.. చేతులు విరుస్తా’ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు కాగా ఆశారాం బాపూ ప్రస్తుతం అత్యాచారం కేసులో జోధ్‌పూర్ సెంట్రల్ జైలులో జీవిత ఖైదుగా ఉన్నారు. ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఓ 16 ఏళ్ల బాలిక 2013లో ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జోధ్‌పూర్ ఆశ్రమంలో ఆశారామ్ తనపై ఈ దాష్టీకానికి పాల్పడ్డారని ఆరోపించింది 2014లో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అయితే అతన్ని ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా నెలకు ఒకటి, రెండుసార్లు ఏయిమ్స్‌కు జోధ్‌పూర్‌కు తీసుకువస్తారు. శనివారం ఉదయం 11 గంటలకు ఆశారాం బాపు జైలు నుంచి బయటకు వెళ్లకముందే, ఆయన్ను జోధ్‌పూర్ ఎయిమ్స్ తీసుకెళ్తున్నారనే సమాచారంతో భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. వారిని స్థానిక అధికారులు బలవంతంగా ఆ ప్రాంతం నుంచి పంపించేశారు. -
ఆశారాం బాపూకు చుక్కెదురు
జోధ్‌పుర్: మైనర్ బాలికపై లైంగికదాడి కేసులో విధించిన జీవితఖైదును సవాలు చేస్తూ.. ఆశారాం బాపూ దాఖలు చేసిన పిటిషన్‌ను జోధ్‌పుర్ హైకోర్టు సోమవారం కొట్టిపారేసింది. బాధిత బాలిక మేజర్ అని, పోస్కో చట్టం నిబంధనల ప్రకారం ఆశారామ్‌కు శిక్ష వర్తించదని ఆయన తరపు న్యాయవాదులు శిరీష్ గుప్తే, ప్రదీప్ చౌదరి వాదించారు. జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ వినీత్ కుమార్ మాధుర్‌లతో కూడిన స్పెషల్ బెంచ్ వీరి వాదనను తోసిపుచ్చింది. నేరం జరిగిన సమయంలో బాలిక మైనర్ అని ట్రయల్ కోర్టులో అభియోగాలు రుజువైన విషయాన్ని ప్రస్తావించింది. కాగా తన ఆశ్రమంలో చదువుతున్న మైనర్ బాలికను జోధ్‌పూర్‌కు దగ్గరలోని మనాయ్ గ్రామంలో 2013 ఆగస్ట్‌లో అత్యాచారం చేశానని ఆశారాం అంగీకరించారు. గత ఏడాది ఏప్రిల్ నెలలో జోధ్‌పూర్ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆశారాం బాపూకు జీవితఖైదు విధించింది. తనను తాను దైవదూతగా చెప్పుకునే ఆశారాం ప్రస్తుతం జోధ్‌పూర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఇదే కేసులో దోషులుగా తేలిన మరో ఇద్దరికి 20 సంవత్సరాల చొప్పున శిక్షను కోర్టు విధించింది. -
లైంగిక దాడి కేసులో ఆశారాం కుమారుడు దోషి
అహ్మదాబాద్ : లైంగిక దాడి కేసులో ఆశారాం బాపూ కుమారుడు నారాయణ్ సాయిని సూరత్ సెషన్స్ కోర్టు శుక్రవారం దోషిగా నిర్ధారించింది. సూరత్‌లో ఇద్దరు అక్కాచెల్లెళ్లపై నారాయణ్ సాయి లైంగిక దాడికి పాల్పడినట్టు సెషన్స్ కోర్టు ధ్రువీకరించింది. ఇదే కేసులో గంగా,జమున, హనుమాన్‌లను కూడా కోర్టు దోషులుగా పేర్కొనగా, మోనికా అనే మహిళను నిర్ధోషిగా నిర్ధారించింది. 2013లో నమోదైన ఈ కేసులో ఆరేళ్ల తర్వాత నారాయణ్ సాయిపై అభియోగాలు రుజువయ్యాయి. ఇక ఈ కేసుకు సంబంధించి దోషులకు ఈనెల 30న శిక్ష ఖరారు చేస్తారు. కాగా, ఆశారాం బాపూ సైతం మహిళలపై లైంగిక దాడి కేసులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. -
త్వరలో మంచిరోజులొస్తాయి: ఆసారాం
జైపూర్: అత్యాచార కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 77 ఏళ్ల ఆసారాం బాపు ఆడియో సంభాషణ క్లిప్ ఒకటి వైరల్ అవుతోంది. ‘త్వరలో మంచి రోజులు వస్తాయి’ అని ఆసారాం అవతలి వ్యక్తికి చెప్పటం ఉంది. సుమారు 15 నిమిషాల నిడివి ఉన్న ఆ టేపు ప్రస్తుతం వాట్సాప్‌లో చక్కర్లు కొడుతోంది. దీంతో జోధ్‌పూర్ సెంట్రల్ జైల్ సిబ్బందిపై విమర్శలు మొదలయ్యాయి. అత్యాచార కేసు : ఆసారాం దోషి ‘వ్యవస్థ పట్ల మనం గౌరవంతో నడుచుకోవాలి. నన్ను చూసేందుకు జైలుకు ఎవరూ రావొద్దు. శాంతి భద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరించకండి. కింది కోర్టులు తప్పు చేస్తే పైకోర్టులు ఆ తప్పులను సరిదిద్దుతాయి. త్వరలో మంచి రోజులు వస్తాయన్న నమ్మకం ఉంది. ఆశ్రమంలో కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారన్న సమాచారం నాకు అందింది. ఆ విషయంలో శ్రద్ధ వహించండి. నా సంగతి తర్వాత.. ముందు శిల్పి-శరత్ చంద్రల బెయిల్ కోసం ప్రయత్నించండి. గురువుగా నా భక్తుల విషయంలో శ్రద్ధ చూపటం నా కర్తవ్యం’ అంటూ ఆసారాం ఆ వ్యక్తితో చెప్పటం ఉంది. అవతలి వ్యక్తి మాత్రం మౌనంగా ఆ మాటలన్ని విన్నాడు. ఈ క్లిప్ బయటకు ఎలా వచ్చిందో తెలీదుగానీ వైరల్ అవుతోంది. నిబంధనల ప్రకారమే ఫోన్ చేశారు... ఈ ఆడియో క్లిప్‌పై జైళ్ల డీఐజీ విక్రమ్ సింగ్ స్పందించారు. శిక్ష ఖరారైన రెండు రోజుల తర్వాత.. అంటే శుక్రవారం ఈ ఫోన్ సంభాషణ జరిగినట్లు ఆయన వెల్లడించారు. ‘సాధారణంగా ఖైదీలకు ఒక నెలలో.. రెండు ఫోన్ నంబర్లకు సుమారు 80 నిమిషాలపాటు మాట్లాడుకునేందుకు అనుమతి ఉంటుంది. దానిని అనుసరించే సబర్మతి ఆశ్రమంలోని సాధక్తో శుక్రవారం సాయంత్రం ఆసారాం మాట్లాడారు. బహుశా ఆ ఆడియో క్లిప్ లీక్ అయ్యి ఉంటుంది’ అని విక్రమ్ సింగ్ తెలిపారు. అయితే ఆ క్లిప్ ఎలా బయటకు పొక్కి ఉంటుందన్న విషయంపై దర్యాప్తుకు ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. ఆశ్రమంతో నాకు సంబధం లేదు... గత కొంత కాలంగా ఆసారాం కూతురు భారతి మీడియా కంటపడకుండా తిరుగుతున్నారు. ఆసారాం అత్యాచారం చేశాడంటూ మరో మహిళ దాఖలు చేసిన కేసులో భారతితోపాటు ఆసారాం భార్య లక్ష్మీ నిందితులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ కేసు కోసం శుక్రవారం భారతి గాంధీనగర్ కోర్టుకు హాజరయ్యారు. ఈసందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... ‘ఆశ్రమంలో జరిగే ప్రతీ వ్యవహారంలో నా హస్తం ఉందని కొందరు ఆరోపిస్తున్నారు. కానీ, 17 ఏళ్ల నుంచి ఆశ్రమానికి నేను దూరంగా ఉంటున్నా. ఈ విషయాన్ని ఆశ్రమ నిర్వాహకులను అడిగినా చెబుతారు. నా తండ్రి చేసిన అకృత్యాలకు నాకు సంబంధం లేదు’ అని ఆమె వివరణ ఇచ్చారు. ఆసారాం కూతురు భారతి(పాత చిత్రం) -
ఆసారాంకు బతికే హక్కు లేదు; నటి
సాక్షి, ముంబై: అత్యాచార కేసులో ఆసారాం బాపుకు జీవితఖైదు శిక్షపై బాలీవుడ్ నటి రాఖీ సావంత్ హర్షం వ్యక్తం చేశారు. అయితే మైనర్లపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని ప్రాణాలతో ఉంచటం సరైందని కాదని ఆమె అంటున్నారు. అసారాం లాంటి వారికి ఉరిశిక్షే సరైందన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 2013లో 16 ఏళ్ల బాలికపై ఆసారాం అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. నేరం రుజువు కావటంతో ఈ ఏప్రిల్ 25న కోర్టు ఆసారాంకు జీవిత ఖైదు విధించింది. దీనిపై రాఖీ సావంత్ స్పందిస్తూ... ‘ఆసారాంకు శిక్ష పడ్డందుకు నాకు సంతోషంగా ఉంది. రేపిస్టులకు ఇదొక హెచ్చరిక. అయితే అతనికి ఉరి శిక్ష ఎందుకు వేయలేదు? బాధితురాలు మైనర్. పైగా మైనర్లపై అఘాయిత్యాలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు విధించాలని ప్రభుత్వం అంటోంది. ఆ లెక్కన్న ఆసారాంకు కూడా మరణ శిక్ష వేయటమే సబబు. మైనర్లను చిదిమేసే రాక్షసులను వదలకూడదు’ అని రాఖీ సావంత్ వ్యాఖ్యానించారు. పోక్సో చట్టం సవరణ ద్వారా కేంద్రం తాజాగా జారీ చేసిన ఆర్డినెన్స్ ప్రకారం.. 12 ఏళ్లలోపు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడిన వారికి మరణశిక్ష విధిస్తారు. 12 నుంచి 16 ఏళ్ల లోపు అమ్మాయిలపై లైంగిక దాడి చేస్తే జీవిత ఖైదు, లేదా కనీసం 20ఏళ్ల జైలు శిక్ష విధించేలా చట్టంలో మార్పులు చేయనున్నారు. దీంతో పాటు చిన్నారులపై లైంగిక నేరాలకు సంబంధించిన కేసులు విచారణ త్వరితగతిన పూర్తి చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద ముద్ర కూడా వేశారు. -
హైదరాబాద్‌కు విస్తరించిన ఆశారాం సామ్రాజ్యం
-
జేజేల నుంచి.. జైలు దాకా...!
ఓ మైనర్ అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఆసారాం బాపూజీకి జోధ్‌పూర్ కోర్టు జీవితఖైదు విధించిన నేపథ్యంలో స్వయం ప్రకటిత బాబాలు, స్వామిజీలు, అధ్యాత్మిక గురూజీల వివాదాస్పద వైఖరి, వారు ఎదుర్కొన్న కేసులు, పడిన శిక్షలు చర్చనీయాంశమవుతున్నాయి. ప్రధానంగా ఇలాంటి స్వామిజీల్లో మహిళలపై లైంగిక దాడులు, వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. తల్లితండ్రులను పూజించాలని, లైంగిక వాంఛలు లేని పవిత్రమైన జీవితాన్ని గడపాలంటూ ఉపదేశాలిచ్చే 79 ఏళ్ల ఆసారాం బాపూజీ అత్యాచారం కేసులో అరెస్టయి 2013 నుంచి జైలు జీవితాన్ని గడుపుతున్నాడు. ఆధ్యాత్మిక కేంద్రంలోనే ఆసారాం తనపై అత్యాచారం చేశారంటూ ఓ టీనేజీ భక్తురాలి ఫిర్యాదుపై ఆయన అరెస్టయ్యారు.. ఆ తర్వాత మరో మహిళా అనుయాయి కూడా ఇదే ఆరోపణ చేశారు. ఈ ఆధ్యాత్మిక సంస్థ వ్యవహారాలు పర్యవేక్షించే ఆసారాం కుమారుడు నారాయణ్ సాయి కూడా అత్యాచారం ఆరోపణలతోనే కటకటాల పాలయ్యారు. శిక్షపడిన, కేసులు ఎదుర్కొంటున్న స్వామిజీలు కొందరు... గుర్మీత్ రాం రహీమ్ : గతేడాది ఆగస్టులో అత్యాచారం కేసులో గుర్మీత్‌సింగ్‌కు ఇరవైఏళ్ల జైలుశిక్ష పడింది. ఈ కేసులో తీర్పు వెలువరించాక జరిగిన అల్లర్లు, హింసాత్మక ఘటనల్లో 36 మంది చనిపోయారు. గంగానంద తీర్థపథ : కేరళ కొల్లాంలోని ఆశ్రమాన్ని నిర్వహించిన తీర్థపథ పూజా పద్ధతుల (ఆచారాల) నిర్వహణ నెపంతో ఓ న్యాయశాస్త్ర విద్యార్థినిని అయిదేళ్ల పాటు శారీరకంగా లొంగదీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీనికి ప్రతిగా ఆ అమ్మాయి తీర్థపథ పురుషాంగాన్ని తెగ్గోసి తన ప్రతీకారాన్ని తీర్చుకుంది. అయితే ప్రాయశ్చిత్తంగా తానే ఆ పని చేసినట్లు ఆయన ప్రకటించుకున్నాడు. మెహందీ ఖాసిం : ఏడుగురు అమ్మాయిలను రేప్ చేసినందుకు 43 ఏళ్ల మెహందీ బాబాకు ముంబై కోర్టు 2016 ఏప్రిల్‌లో జీవితఖైదు విధించింది. మానసిక వికలాంగులైన అబ్బాయిలను ఆరోగ్యవంతులను చేసే చికిత్స కోసం అమ్మాయిలను కూడా పంపించాలని, తాను చేసే చికిత్స ద్వారా ఈ అమ్మాయిలు మానసిక వికలాంగులకు జన్మనివ్వకుండా నివారించవచ్చునని వారిపై అత్యాచారం జరిపాడు. సంతోష్ మాధవన్ అలియాస్ స్వామి అమృత చైతన్య : ముగ్గురు మైనర్ బాలికలపై అత్యాచారం చేసిన కేసులో మాధవన్‌కు 2009లో కేరళ కోర్టు 16 ఏళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది. పేద కుటుంబాలకు చెందిన ఈ బాలికలను ఏదో నెపంతో రప్పించి, వారిని నిర్భందించి అత్యాచారం చేశాడు. స్వామి ప్రేమానంద : శ్రీలంక నుంచి 1984లో తమిళనాడులోని తిరుచిరాపల్లికి వచ్చిన ప్రేమానంద్ అక్కడ ఆశ్రమం నెలకొల్పాడు. ఇక్కడే అతడు తనపై అత్యాచారం చేయడంతో గర్భం దాల్చినట్లు 1994లో ఒక అమ్మాయి ఆరోపించింది. పదమూడు మంది మైనర్ బాలికలను రేప్ చేసిన కేసుల్లో ప్రేమానంద్తో పాటు మరో ఆరుగురికి కోర్టు శిక్ష విధించింది. జ్ఞానచైతన్య : మూడు హత్యలకు గాను 14 ఏళ్ల జైలు జీవితాన్ని గడిపి బయటికొచ్చాక ఒక బ్రిటీష్ కుటుంబాన్ని కలుసుకుని తన గత జన్మలో వారి కుమార్తె తన భార్యగా ఉందంటూ నమ్మించాడు. ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు ఆ యువతిని లైంగికంగా వేధించడంతో పాటు హింసించాడు. అక్కడి నుంచి తప్పించుకుని వచ్చిన ఆ యువతి చేసిన ఫిర్యాదుతో అతడిని పోలీసులు మళ్లీ ఆరెస్ట్ చేశారు. రాంపాల్ మహారాజ్ : హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో పాటు వివిధ కేసుల్లో 2014లో కోర్టు జారీచేసిన అరెస్ట్ వారెంట్ నుంచి తప్పించుకునేందుకు తన భక్తులతో రాళ్లు, పెట్రోల్ బాంబులు, ఇతర ఆయుధాలతో గురు రాంపాల్ మహారాజ్ దాడులు చేయించాడు. కొన్ని రోజుల తర్వాత కాని పోలీసులు ఈ భారీ కాంప్లెక్స్‌ను ఖాళీ చేయించలేకపోయారు. ఈ ముట్టడిలో ఆరుగురు చనిపోయారు. స్వామి నిత్యానంద : లైంగిక వేధింపులు ఇతర ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వామి నిత్యానందపై కర్ణాటకలోని ఆశ్రమంలో తమను శారీరకంగా హింసించారంటూ అయిదుగురు మహిళలు ఫిర్యాదు చేశారు. సినీనటితో శృంగారం వీడియో వివాదం వెలుగుచూడడంతో 2010లో 53 రోజుల పాటు జైలు జీవితాన్ని గడిపాడు. ఇద్దరు మహిళలతో అసభ్య ప్రవర్తనపై ఒక స్థానిక టెలివిజన్ చానల్ వీడియో విడుదల చేయడంతో గ్రామస్తులు ఆశ్రమంపై దాడి చేశారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
మోదీ, ఆశారాం మధుర ఙ్ఞాపకం.. పోస్టు వైరల్!
-
ఆశారాం- మోదీ వీడియోను షేర్ చేసిన కాంగ్రెస్
-
ఆశారాం- మోదీ వీడియోను షేర్ చేసిన కాంగ్రెస్
సాక్షి, న్యూఢిల్లీ : లైంగిక దాడి కేసులో దోషిగా తేలిన ఆశారాం బాపూతో ప్రధాని నరేంద్ర మోదీ కలిసి ఉన్న ఓ వీడియోను కాంగ్రెస్ బుధవారం తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. వీడియోలో ఉన్న ఫోటోలు కొన్నేళ్ల కిందటవి కావడం గమనార్హం. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ ‘ ఓ వ్యక్తి ఎలాంటి వాడన్నది అతని చుట్టూ ఉండే వాళ్లను చూస్తే తెలుస్తుంద’నే సామెతను క్యాప్షన్‌గా ఉటంకించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై పలువురు స్పందించారు. కాంగ్రెస్ పోస్ట్‌కు దీటుగా కొందరు సోషల్ మీడియా యూజర్లు ఆశారాంకు నమస్కరిస్తున్న కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఫోటోలను పోస్ట్ చేశారు. మరోవైపు ఆశారాంతో ప్రధాని మోదీ కలిసున్న పాత ఫోటోలను పోస్ట్ చేయడంపై నటుడు డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్ మండిపడ్డారు. స్వామీజీగా తనకు తాను చెప్పుకున్న వారితో వారు దోషులుగా నిర్థారణ కాకముందు వారితో సన్నిహితంగా మెలగడం నేరం కాదని వ్యాఖ్యానించారు. ఐదేళ్ల కిందట తన ఆశ్రమంలో16 ఏళ్ల యువతిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఆశారాం బాపూను దోషిగా నిర్ధారించిన జోథ్‌పూర్ కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే. -
మోదీ, ఆశారాం మధుర ఙ్ఞాపకం.. పోస్టు వైరల్!
16 ఏళ్ళ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపును దోషిగా తేలుస్తూ జోధ్‌పూర్ న్యాయస్థానం జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే. అయితే గతంలో ఆశారాం బాపు, ప్రధాని నరేంద్ర మోదీలు కలిసి పాల్గొన్న ఓ కార్యక్రమం వీడియోను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) అధికారిక ట్విటర్లో దర్శనమిచ్చింది. ‘నారాయణ్.. నారాయణ్ ’ అనే కామెంట్‌తో ఈ వీడియోను పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ సిన్హా.. ‘నరేంద్ర మోదీ, ఆశారాం బాపులకు సంబంధించిన కొన్ని మధుర ఙ్ఞాపకాలు’ అని ట్వీట్ చేస్తూ.. వారు కలిసి ఉన్న ఓ పాత వీడియోను పోస్ట్ చేశాడు. అయితే ఈ పోస్ట్‌ను ఐసీసీకి చెందిన వ్యక్తి ఒకరు ‘నారాయణ్.. నారాయణ్’ అంటూ కామెంట్ చేస్తూ రీట్వీట్ చేశారు. వెంటనే తేరుకున్న ఐసీసీ టీమ్ పోస్ట్ చేసిన నిమిషాల వ్యవధిలోనే ఆ ట్వీట్‌ను తొలగించింది. కానీ అప్పటికే నెటిజన్లు ఈ పోస్ట్‌ను స్క్రీన్‌షాట్ తీసి కామెంట్లు పెడుతుండటంతో, ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ అవుతోంది. అయితే ఈ ట్వీట్‌పై విమర్శలు రావడంతో ఐసీసీ క్షమాపణలు తెలిపింది. తమ అధికారిక ట్విటర్లో ఈ పోస్ట్ ఎలా వచ్చిందో అర్థం కావడంలేదని, దీనిపై విచారణ మొదలుపెట్టామని వివరణ ఇచ్చింది. Since the tweet is unavailable, here is screen-shot! :) pic.twitter.com/l4m4ZzSl7E — Goonerunny (@tushizap) April 25, 2018 Sharing some old sweet memories between @narendramodi and Asaram. pic.twitter.com/c8cveZzn0f — Pratik Sinha (@free_thinker) April 25, 2018 -
ఆశారాం బాపుకు జీవిత ఖైదు
-
2వేల బెదిరింపు లేఖలు, వందల ఫోన్ కాల్స్
జోథ్‌పూర్ : వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపుపై నమోదైన రేప్ కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో సీనియర్ ఐపీఎస్ అధకారి అజయ్ పాల్ లంబా ఎదుర్కొన్న సవాళ్లివి. ఆశారాంపై రేప్ కేసును విచారిస్తున్న సమయంలో ఆయన మద్దతుదారులు, శిష్యులు తననకు బెదిరింపులు వెల్లువెత్తాయని, బెదిరింపు లేఖలు, ఫోన్‌కాల్స్‌తో తనను భయపెట్టాలని ప్రయత్నించారని ఆయన తెలిపారు. మైనర్‌పై అత్యాచారం జరిపిన కేసులో జోథ్‌పూర్‌లోని ప్రత్యేక కోర్టు బుధవారం ఆశారాంను దోషిగా తేల్చి.. ఆయనకు జీవితఖైదు విధించింది. తన కెరీర్లోనే అత్యంత హైప్రొఫైల్ కేసు ఇదని ఈ కేసును సమర్థవంతంగా దర్యాప్తు జరిపిన ఐపీఎస్ అధికారి అజయ్‌పాల్ లంబా తెలిపారు. 2013 ఆగస్టు 20న తనకు ఈ కేసును అప్పగించారని, అప్పటికే ఈ కేసుపై మీడియా ఫోకస్ తీవ్రంగా ఉందని, పలువురు సాక్షులు హత్యకు గురయ్యారని, దీనికి తోడు ఆశారాం శిష్యుల నుంచి కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు బెదిరింపులు వచ్చేవని ఆయన గుర్తుచేసుకున్నారు. అప్పట్లో అజయ్‌పాల్ జోథ్‌పూర్ వెస్ట్ డీసీపీగా ఉండేవారు. ‘లేఖల్లో తీవ్రమైన దూషణలు ఉండేవి. ఆశారాంకు ఏమైనా జరిగితే మీ కుటుంబాన్ని అంతం చేస్తామని హెచ్చరించేవారు. నా ఫోన్ నిరంతరం మోగుతూనే ఉండేది. దీంతో గుర్తుతెలియని నంబర్ల నుంచి కాల్స్ వస్తే ఎత్తేవాడిని కాదు. నేను ఉదయ్‌పూర్‌కు మారిన తర్వాత బెదిరింపు లేఖలు ఆగిపోయాయి’ అని 2005 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ బెదిరింపుల నేపథ్యంలో తన కూతుర్ని కొంతకాలం పాఠశాలకు పంపలేదని, తన భార్య కూడా ఇంటి నుంచి బయటకు వెళ్లేది కాదని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఆయన ఏసీబీ ఎస్పీగా జోథ్‌పూర్‌లో నివాసముంటున్నారు. ఈ కేసులో ఒక నిందితుడిని అరెస్టు చేసి విచారిస్తే.. కేసుకు సంబంధించిన సాక్షిని తానే చంపానని ఒప్పుకున్నాడని, అంతేకాకుండా మరో అప్పడి జోథ్‌పూర్ డీఎస్పీ చంచల్ మిశ్రాను కూడా చంపేందుకు టార్గెట్ చేసినట్టు వెల్లడించాడని తెలిపారు. ఈ కేసు వెలుగులోకి వచ్చిన పదివారాల్లోనే మొదటి చార్జ్‌షీట్ దాఖలు చేశామని, ఈ కేసులో ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదని, అయితే, కేసులోని చిక్కుముడుల వల్లే దర్యాప్తు కొంత జాప్యమైందని ఆయన తెలిపారు. -
ఆశారాం బాపుకు శిక్ష ఖరారు
జోధ్‌పూర్ : 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపుకు జోధ్‌పూర్ ట్రయిల్ న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఈ కేసుకు సంబంధించి మరో ఇద్దరికి 20 ఏళ్లు జైలుశిక్ష విధిస్తూ కోర్టు బుధవారం తీర్పు వెల్లడించింది. కాగా 2013 సంవత్సరం నుంచి జైలు ఊచలు లెక్కిస్తున్న ఆశారాం బాపూపై మూడు అత్యాచార కేసులు నమోదై ఉన్నాయి. 2013 సంవత్సరం ఆగస్టులో పదహారేళ్ల అమ్మాయి జోధ్‌పూర్‌లోని ఆశ్రమంలో ఆశారాం తనపై లైంగిక దాడి చేశారంటూ ఫిర్యాదు చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ అమ్మాయికి పట్టిన దెయ్యాన్ని వదిలిస్తానని మభ్యపెట్టిన ఆశారాం ఆమెపై అత్యాచారం జరిపినట్టు ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదైనప్పటికీ ఆశారాం బాపూ పోలీసుల ఎదుట హాజరు కాలేదు. అందరి కళ్లు గప్పి ఇండోర్‌లోని తన ఆశ్రమంలో దాక్కున్నాడు. నాన్‌బెయిల్‌బుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసినప్పటికీ అతను బయటకి రాలేదు. అతనిని అరెస్ట్ చేయడం కూడా ఒక ప్రహసనంగానే మారింది. ఈ సందర్భంగా పోలీసులకు, ఆశారాం అనుచరులకు మధ్య తీవ్రమైన ఘర్షణలు కూడా జరిగాయి. చివరికి 2013 సెప్టెంబర్ 1న ఆశారాంను రాజస్థాన్ జోధ్‌పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ కేసులో సాక్షులపైన ఆశారాం బాపూ ప్రైవేట్ సైన్యం బెదిరింపులు, దాడులకు దిగింది. తన కండబలం ప్రదర్శించింది. ఆశారాంకు బెయిల్ ఇవ్వకపోతే చంపేస్తామంటూ కేసును విచారించిన న్యాయమూర్తిని కూడా బెదిరించారు. దీంతో సుప్రీంకోర్టులో కూడా అతనికి బెయిల్ లభించలేదు. ఈ కేసులో ఆశారాంపై ఆరోపణలు రుజువు కావడంతో ఆయనకు న్యాయస్థానం జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెల్లడిచింది. దోషిగా తేల్చింది. బాపుతో పాటు కేసులోని ఐదుగురు నిందితుల్లో ఇద్దరిని దోషులుగా పేర్కొన్న కోర్టు మరో ఇద్దరిని నిర్దోషులుగా పేర్కొంది. దోషులుగా తేలిన ఇద్దరికి ఇరవై ఏళ్లు జైలు శిక్ష విధించింది. -
‘ఆశ’గా ఎదురుచూసి.. కంగుతిన్నారు!
జోధ్‌పూర్: తాము నమ్మిన భగవత్స్వరూపం కడిగిన ముత్యంలా తిరిగొస్తుందని ఆశగా ఎదరుచూసిన భక్తులు కంగుతిన్నారు. బాలికపై అత్యాచారం కేసులో ప్రముఖ ఆథ్యాత్మిక గురువు ఆశారాం బాపు దోషిగా తేలడంతో ఆయన అభిమానులు కన్నీటిపర్యంతమవుతున్నారు. తమ గురువు నిర్దోషిగా విడుదలవుతారని దండలు కూడా తీసుకొచ్చిన అభిమానులు కోర్టు తీర్పుతో షాక్‌కు గురయ్యారు. ఉత్తరభారతంలోని పలు రాష్ట్రాల్లో బుధవారం ఉదయం కనిపించిన దృశ్యాలివి! ఆథ్యాత్మిక గురువుగా ఒక వెలుగు వెలిగిన ఆశారాం.. దేశవ్యాప్తంగా 400కుపైగా ఆశ్రమాలు స్థాపించారు. 2013లో సహారన్‌పూర్‌లోని తన ఆశ్రమంలోనే ఆయన మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడినట్లు కేసు నమోదయింది. సుదీర్ఘ విచారణ అనంతరం ఆశారాం దోషే అంటూ జోధ్‌పూర్ ఎస్సీ, ఎస్టీ ట్రయల్ కోర్టు తీర్పు చెప్పింది. బాపుతో పాటు కేసులోని ఐదుగురు నిందితుల్లో ఇద్దరు మాత్రం నిర్దోషులుగా బయటపడ్డారు. బాపూజీ నిర్దోషిగా బయటికొస్తారని దండలతో వచ్చి జోధ్‌పూర్ జైలు వద్ద హడావిడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తీర్పు నేపథ్యంలో ఆశారాం అనుచరులు విధ్వంసానికి పాల్పడే అవకాశాలున్న దరిమిలా రాజస్తాన్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లలోని కీలక పట్టణాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. న్యాయం దక్కింది: బాధితురాలి తండ్రి ‘‘ఆశారాం దోషిగా తేలడంతో మాకు న్యాయం దక్కింది. ఈ కేసులో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన సాక్షుల కుటుంబాలకు కూడా న్యాయం జరగాలని కోరుతున్నాను. దోషికి కఠిన శిక్ష పడుతుందని భావిస్తున్నా. సుదీర్ఘంగా సాగిన న్యాయ పోరాటంలో మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ తీర్పుపై అప్పీలు! అత్యాచారం కేసులో ఆశారాంను దోషిగా తేల్చిన జోధ్‌పూర్ ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు ఆశారాం ఆశ్రమ అధికార ప్రతినిధి నీలమ్ దుబే మీడియాకు చెప్పారు. తీర్పు కాపీని క్షుణ్నంగా చదివి, నిపుణులతో చర్చించిన మీదట తుది నిర్ణయం తీసుకుంటామని ఆమె చెప్పారు. దొంగ బాబాలకు చెంపపెట్టు: కాంగ్రెస్ ‘నిజమైన సాధువులకు, దొంగ బాబాలకు మధ్య తేడాలను ప్రజలు పసిగట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ తీర్పు ఖచ్చితంగా చాలా మార్పులకు దారితీస్తుంది. ముఖ్యంగా బాబాలు, సాధువుల పట్ల అంతర్జాతీయంగా నెలకొన్న అభిప్రాయాల్లో మార్పు వస్తుంది’’ అని కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ అన్నారు. -
ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూకు షాక్
-
అత్యాచార కేసు : ఆశారాం దోషి
జోధ్‌పూర్ (రాజస్థాన్) : మైనర్ బాలికపై అత్యాచార కేసులో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూను జోధ్‌పూర్ ఎస్సీ, ఎస్టీ ట్రయల్ కోర్టు దోషిగా తేల్చింది. బాపుతో పాటు కేసులోని ఐదుగురు నిందితుల్లో ఇద్దరిని దోషులుగా పేర్కొన్న కోర్టు మరో ఇద్దరిని నిర్దోషులుగా పేర్కొంది. అయితే, ఆశారాంకు శిక్షపై కోర్టులో విచారణ ఇంకా కొనసాగుతోంది. కోర్టు తీర్పుపై న్యాయపరంగా సలహా తీసుకుని ముందుకు వెళ్తామని ఆశారాం అధికార ప్రతినిధి చెప్పారు. కాగా, కోర్టు తీర్పు నేపథ్యంలో జోధ్‌పూర్‌లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ కేసులో ఆశారాంకు శిక్ష పడటంపై బాధితురాలి తండ్రి హర్షం వ్యక్తం చేశారు. ఐదేళ్ల పోరాటంలో వారికి మద్దతుగా నిలిచినందుకు పలువురికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కేసులో సాక్ష్యులుగా ఉండి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కూడా న్యాయం జరుగుతుందని భావిస్తున్నానని చెప్పుకొచ్చారు. తీర్పు అనంతరం ఆశారాం అనుచరులు విధ్వంసక చర్యలకు దిగుతారేమోనన్న అనుమానంతో ఈ నెల 30వ తేదీ వరకు 144 సెక్షన్‌ను అమలు చేశారు. ఈ కేసులో 2013 సంవత్సరం నుంచి జైలు ఊచలు లెక్కిస్తున్న ఆశారాం బాపూపై మూడు అత్యాచార కేసులు నమోదై ఉన్నాయి. 2013 సంవత్సరం ఆగష్టులో పదహారేళ్ల అమ్మాయి జోధ్‌పూర్‌లోని ఆశ్రమంలో ఆశారాం తనపై లైంగిక దాడి చేశారంటూ ఫిర్యాదు చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆమెకు పట్టిన దెయ్యాన్ని వదిలిస్తానని మభ్యపెట్టిన ఆశారాం అత్యాచారం జరిపినట్టు ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదైనప్పటికీ ఆశారాం బాపూ పోలీసుల ఎదుట హాజరు కాలేదు. అందరి కళ్లు గప్పి ఇండోర్‌లోని తన ఆశ్రమంలో దాక్కున్నాడు. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసినప్పటికీ అతను బయటకి రాలేదు. అతనిని అరెస్ట్ చేయడం కూడా ప్రహసనంగానే మారింది. ఈ సందర్భంగా పోలీసులకు, ఆశారాం అనుచరులకు మధ్య తీవ్రమైన ఘర్షణలు కూడా జరిగాయి. చివరికి 2013 సెప్టెంబర్ 1న ఆశారాంను జోధ్‌పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ కేసులో సాక్షులపైన ఆశారాం బాపూ ప్రైవేటు సైన్యం బెదిరింపులు, దాడులకు దిగింది. తన కండబలం ప్రదర్శించింది. మొత్తం 9 మంది సాక్ష్యుల్లో ముగ్గరు ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. ఆశారాంకు బెయిల్ ఇవ్వకపోతే చంపేస్తామంటూ కేసును విచారించిన న్యాయమూర్తిని సైతం ఆశారాం ప్రైవేటు సైన్యం బెదిరించింది. దీంతో సుప్రీంకోర్టులో కూడా ఆశారాంకు బెయిల్ లభించలేదు. మరో రెండు అత్యాచార కేసులు ఆశారాం బాపూని అరెస్ట్ చేసి రెండు నెలలు తిరక్కుండానే సూరత్‌కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆశారాంతో పాటు ఆయన కుమారుడు నారాయణ సాయి కూడా లైంగికంగా వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. అహ్మదాబాద్ సమీపంలోని ఆశ్రమంలో 2001, 2006 సంవత్సరం మధ్య ఆశారాం తనపై చాలాసార్లు లైంగికంగా దాడులకు దిగాడని అక్క ఆరోపణలు చేస్తే, సూరత్ ఆశ్రమంలో నారాయణ సాయి తనను అత్యాచారం చేశాడంటూ చెల్లి కోర్టుకెక్కింది. దీంతో పోలీసులు నారాయణ సాయిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆశారాం ఎలా ఎదిగాడు? 1941 సంవత్సరంలో ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న సింధ్ ప్రాంతంలో పుట్టిన ఆశారాం 15 ఏళ్ల వయసులోనే ఇల్లు విడిచిపెట్టి వెళ్లిపోయాడు. కేవలం మూడో తరగతి మాత్రమే చదువుకున్న అతను ఆధ్యాత్మిక మార్గం పట్టాడు. గురు లీలా షాజీ మహరాజ్ దగ్గర శిష్యరికం చేశాడు. 1972 సంవత్సరంలో గుజరాత్‌లోని మొతేరా దగ్గర సబర్మతి తీరంలో చిన్న కుటీరాన్ని ఏర్పాటు చేశాడు. తనని తాను దేవుడిగా ప్రకటించుకుని ప్రవచనాలు చెప్పడం మొదలు పెట్టాడు. ఏడాదిలోనే ఆ కుటీరం కాస్త ఆశ్రమంగా మారిపోయింది. ఆధ్యాత్మిక గురువుగా దేశ విదేశాల్లో ప్రఖ్యాతి వహించాడు. ప్రస్తుతం ఆయనకి దేశ విదేశాల్లో 400 ఆశ్రమాలు రెండు కోట్ల మంది శిష్యపరివారం ఉంది. పార్టీలకు అతీతంగా ఎందరో రాజకీయ వేత్తలు ఆయనకు పరమ వీర భక్తులు. వివిధ రాష్ట్రాల్లో ఎన్నో ప్రభుత్వాలు ఆయన ఆశ్రమాలకు అయాచితంగా భూ కేటాయింపులు చేశాయి. ఆశారాం ఆస్తులు చూస్తే ఎవరైనా విస్తుపోవాల్సిందే. ఏకంగా 10 వేల కోట్ల రూపాయలు విలువైన ఆస్తుల్ని ఆయన కూడబెట్టాడు. అతని ఆధ్యాత్మిక ప్రయాణంలో అడుగడుగునా వివాదాలే చోటు చోసుకున్నాయి. భూ కబ్జా ఆరోపణలు, ఆశ్రమంలో అనుమానాస్పద మృతులు వంటివి ఎప్పటి నుంచో ఉన్నాయి. అత్యాచార ఆరోపణలు వెలుగులోకి వచ్చిన తర్వాత ఆయన ఆశ్రమం ఎన్ని అరాచకాలకు నెలవుగా మారిందో ఒక్కొక్కటి వెలుగులోకి వచ్చాయి. -
రేపే తీర్పు... మూడు రాష్ట్రాల్లో హై అలర్ట్
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూ అత్యాచార ఆరోపణల కేసులో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ట్రయల్ కోర్టు బుధవారం తీర్పు వెల్లడించనుంది. దీంతో జోధ్‌పూర్‌లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆశారాం అనుచరులు విధ్వంసక చర్యలకు దిగుతారేమోనన్న అనుమానంతో ఈ నెల 30వ తారీకు వరకు 144 సెక్షన్‌ను అమలు చేశారు. 2013 సంవత్సరం నుంచి జైలు ఊచలు లెక్కిస్తున్న ఆశారాం బాపూపై మూడు అత్యాచార కేసులు నమోదై ఉన్నాయి. 2013 సంవత్సరం ఆగస్టులో పదహారేళ్ల అమ్మాయి జోధ్‌పూర్‌లోని ఆశ్రమంలో ఆశారామ్ తనపై లైంగిక దాడి చేశారంటూ ఫిర్యాదు చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ అమ్మాయికి పట్టిన దెయ్యాన్ని వదిలిస్తానని మభ్యపెట్టిన ఆశారాం ఆమెపై అత్యాచారం జరిపినట్టు ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదైనప్పటికీ ఆశారాం బాపూ పోలీసుల ఎదుట హాజరు కాలేదు. అందరి కళ్లు గప్పి ఇండోర్‌లోని తన ఆశ్రమంలో దాక్కున్నాడు. నాన్‌బెయిల్‌బుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసినప్పటికీ అతను బయటకి రాలేదు. అతనిని అరెస్ట్ చేయడం కూడా ఒక ప్రహసనంగానే మారింది. ఈ సందర్భంగా పోలీసులకు, ఆశారాం అనుచరులకు మధ్య తీవ్రమైన ఘర్షణలు కూడా జరిగాయి. చివరికి 2013 సెప్టెంబర్ 1న ఆశారాంను రాజస్థాన్ జోధ్‌పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ కేసులో సాక్షులపైన ఆశారాం బాపూ ప్రైవేట్‌సైన్యం బెదిరింపులు, దాడులకు దిగింది. తన కండబలం ప్రదర్శించింది. ఆశారాంకు బెయిల్ ఇవ్వకపోతే చంపేస్తామంటూ కేసును విచారించిన న్యాయమూర్తిని కూడా బెదిరించారు. దీంతో సుప్రీంలో కూడా అతనికి బెయిల్ లభించలేదు. ఈ కేసులో ఆశారాంపై ఆరోపణలు రుజువైతే ఆయనకు గరిష్టంగా పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మరో రెండు అత్యాచార కేసులు ఆశారాం బాపూని అరెస్ట్ చేసి రెండు నెలలు తిరక్కుండానే సూరత్‌కు చెందిన ఇద్దరు అక్కచెల్లెళ్లు ఆశారాంతో పాటు ఆయన కుమారుడు నారాయణ సాయి కూడా అమ్మాయిల్ని లైంగికంగా వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. అహ్మదాబాద్ సమీపంలోని ఆశ్రమంలో 2001, 2006 సంవత్సరం మధ్య ఆశారాం తనపై చాలాసార్లు లైంగికంగా దాడులకు దిగాడని అక్క ఆరోపణలు చేస్తే, సూరత్ ఆశ్రమంలో నారాయణ సాయి తనను అత్యాచారం చేశాడంటూ చెల్లి కోర్టుకెక్కింది. దీంతో పోలీసులు నారాయణ సాయిని కూడా అదుపులోనికి తీసుకున్నారు. ఆశారాం ఎలా ఎదిగాడు ? 1941 సంవత్సరంలో ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న సిం«ద్ ప్రాంతంలో పుట్టిన ఆశారాం 15 ఏళ్ల వయసులోనే ఇల్లు విడిచిపెట్టి వెళ్లిపోయాడు. కేవలం మూడో తరగతి మాత్రమే చదువుకున్న అతను ఆధ్యాత్మిక మార్గం పట్టాడు. గురు లీలాషాజీ మహరాజ్ దగ్గర శిష్యరికం చేశాడు. 1972 సంవత్సరంలో గుజరాత్‌లోని మొటెరా దగ్గర సబర్మతి తీరంలో చిన్న కుటీరాన్ని ఏర్పాడు చేశాడు. తనని తాను దేవుడిగా ప్రకటించుకుని ప్రవచనాలు చెప్పడం మొదలు పెట్టాడు. ఏడాదిలోనే ఆ కుటీరం కాస్త ఆశ్రమంగా మారిపోయింది. ఆధ్యాత్మిక గురువుగా దేశవిదేశాల్లో ప్రఖ్యాతి వహించాడు. ప్రస్తుతం ఆయనకి దేశవిదేశాల్లో 400 ఆశ్రమాలు 2 కోట్ల మంది శిష్యపరివారం ఉంది. పార్టీలకతీతంగా ఎందరో రాజకీయ వేత్తలు ఆయనకు పరమ వీర భక్తులు. వివిధ రాష్ట్రాల్లో ఎన్నో ప్రభుత్వాలు ఆయన ఆశ్రమాలకు అయాచితంగా భూ కేటాయింపులు చేశాయి. ఆశారాం ఆస్తులు చూస్తే ఎవరైనా విస్తుపోవాల్సిందే. ఏకంగా 10 వేల కోట్ల విలువైన ఆస్తుల్ని కూడబెట్టాడు. అతని ఆధ్యాత్మిక ప్రయాణంలో అడుగడుగునా వివాదాలే చోటు చోసుకున్నాయి. భూకబ్జా ఆరోపణలు, ఆశ్రమంలో అనుమానాస్పద మృతులు వంటివి ఎప్పట్నంచో ఉన్నాయి. అత్యాచార ఆరోపణలు వెలుగులోకి వచ్చిన తర్వాత ఆయన ఆశ్రమం ఎన్ని అరాచకాలకు నెలవుగా మారిందో ఒక్కొక్కటి వెలుగులోకి వచ్చాయి. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
ఆశారాం బాపు కేసులో తీర్పు వాయిదా
జోధ్‌పూర్ : అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపుపై తీర్పును రాజస్తాన్‌లోని జోధ్‌పూర్ కోర్టు రిజర్వ్ చేసింది. శనివారం ఈ కేసును విచారించిన కోర్టు తీర్పును ఈ నెల 25న వెలువరించనుంది. మైనర్ బాలికపై కొన్నేళ్లపాటు లైంగి దాడులకు పాల్పడ్డారన్న కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఆశారం బాపు జోధ్‌పూర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఇదే జైలులో సల్మాన్ ఖాన్ రెండు రోజులు ఉన్న తర్వాత శనివారం బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ కేసులో దోషిగా తేలితే ఆశారం బాపునకు పదేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 2013 ఆగస్ట్ 3వ తేదీన ఈ ఆధ్యాత్మిక గురువును జోధ్‌పూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో బెయిల్ కోసం ఆయన పలుమార్లు పిటిషన్లు దాఖలు చేసుకున్నా కోర్టులు అందుకు నిరాకరించాయి. 1997-2006 మధ్యకాలంలో అహ్మదాబాద్ శివార్లలోని ఆశ్రమంలో ఉన్న సమయంలో ఆశారాం బాపు పలుమార్లు తనపై లైంగిక దాడులకు పాల్పడ్డాడని బాలిక 2013లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. జోధ్‌పూర్ జైల్లో ఉన్న ఆశారాం బాపు భవితవ్యం కోర్టు తీర్పుతో మరికొన్ని రోజుల్లో తేలనుంది. -
సల్మాన్ జైల్ మేట్ ఎవరంటే...
జోధ్‌పూర్ : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను చంపిన కేసులో దోషిగా కోర్టు తేల్చటంతో అరెస్ట్ చేసిన జోధ్‌పూర్ పోలీసులు అటునుంచి అటే సెంట్రల్ జైలుకు తరలించారు. ఇదే జైలులో 2006లో సల్మాన్ ఐదు రోజులు గడిపారు కూడా. ఇక ప్రస్తుతం బ్యారక్ నంబర్ 2లో సల్మాన్‌కు జైలు గదిని కేటాయించారు. ఇదే బ్యారక్‌లో అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న స్వామిజీ ఆశారాం బాపు ఉంటున్నారు. ‘సల్మాన్ కోసం ఇప్పటికే సెల్‌ను ఏర్పాటు చేశాం. ఇందులో ఫ్యాన్, ఏసీ లాంటి ఎలాంటి సదుపాయాలు లేవు. ఆశారాంను ఉంచిన బ్యారక్‌లోనే సల్మాన్ ఉంటారు. అయితే గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి సల్మాన్‌కు బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో బ్యారక్ వద్ద భద్రతను మాత్రం కట్టుదిట్టం చేయబోతున్నాం’ అని జైలు అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. కాగా, 2013లో ఆశ్రమానికి చెందిన బాలికను అత్యాచారం చేశాడన్న ఆరోపణలపై 5 ఏళ్లుగా ఆశారాం ఇదే జైళ్లో ఉంటున్నారు. బెయిల్ పిటిషన్ దాఖలు.. ఇక శిక్షలు ఖరారైన వెంటనే సల్మాన్ తరపు న్యాయవాది బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. పిటిషన్ రేపు ఉదయం విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సల్మాన్ ఇవాళ రాత్రి జైల్లోనే గడపాల్సి ఉంటుంది. బిష్ణోయిస్లో సంబరాలు... కాగా, ఈ కేసులో 20 ఏళ్లుగా పోరాటం చేస్తున్న బిష్ణోయిస్ తెగ సంబరాలు మునిగింది. తీర్పు వెలువడిన అనంతరం కోర్టు బయట పటాసులు పేల్చి.. మిఠాయిలు పంచుకున్నారు. Visuals of #SalmanKhan at Jodhpur Central Jail. #BlackBuckPoachingCase pic.twitter.com/Q3NbMqkxhk — ANI (@ANI) 5 April 2018 -
నకిలీ బాబాల జాబితా విడుదల
-
దొంగ బాబాల జాబితా విడుదల
అలహాబాద్: తమను తాము భగవంతుని అవతారం చెప్పుకునే నకిలీ బాబాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అఖిల భారత అఖార పరిషద్ కోరింది. దేశంలో 17 మంది నకిలీ బాబాలు ఉన్నారని పేర్కొంటూ తాజాగా రెండో జాబితాను విడుదల చేసింది. గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్, రాధేమా, నిర్మల్ బాబా, రాంపాల్, ఆశారామ్ బాపు సహా 14 మంది పేర్లతో సెప్టెంబర్‌లో మొదటి లిస్ట్ తయారు చేసింది. మరో ముగ్గురి పేర్లను జతచేసి తాజా జాబితా విడుదల చేసింది. వీరేంద్ర దేవ్ దీక్షిత్(ఢిల్లీ), సచిదానంద సరస్వతి(యూపీ), త్రికాల్ భవంత్(అలహాబాద్) పేర్లను జోడించింది. ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో వీరేంద్ర దేవ్ నిర్వహిస్తున్న మూడు ఆశ్రమాల నుంచి గతవారం 47 మంది మహిళలు, ఆరుగురు మైనర్ బాలికలను పోలీసులు కాపాడారు. దొంగ బాబాల గురించి సామాన్య ప్రజలు తెలుసుకునేందుకు ఈ జాబితా తయారుచేసినట్టు అఖిల భారత అఖార పరిషద్ అధ్యక్షుడు స్వామి నరేంద్ర గిరి తెలిపారు. సాధువులు, సన్యాసులకు చెడ్డపేరు తీసుకువస్తున్న నకిలీ బాబాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
‘నేను గాడిదనే..’
సాక్షి,న్యూఢిల్లీః వివాదాస్పద ఆథ్యాత్మికవేత్త ఆశారాం బాపూ తనపై తానే సెటైర్ వేసుకున్నాడు. హిందూ ధార్మిక సంస్థ నకిలీ బాబాల జాబితాలో తనను చేర్చడంపై ఆశారం ఆగ్రహంతో ఊగిపోయారు. తాను గాడిదల వర్గానికి చెందిన వాడినని వ్యంగ్యోక్తి విసిరారు. 2013లో జోథ్‌పూర్‌లోని తన ఆశ్రమంలో మైనర్ బాలికను అత్యాచారం చేసిన కేసులో 76 ఏళ్ల ఆశారామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అప్పటినుంచి జైలులో ఉన్న ఆశారాం దాఖలు చేసుకున్న బెయిల్ దరఖాస్తులను ఏడు సార్లు కోర్టు తోసిపుచ్చింది. ఇక ఈ కేసుకు సంబంధించి కోర్టు విచారణకు హాజరైన క్రమంలో మీడియాతో మాట్లాడుతూ ఆశారాం బాపూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆశారాం నకిలీ బాబా అని, ఆయన బోధకుడు కాదు, సన్యాసీ కాదని అఖారా పరిషద్ తీసుకున్న నిర్ణయంపై ప్రశ్నించిన మీడియాకు తాను గాడిద వర్గానికి చెందిన వాడినని చెప్పుకొచ్చారు. -
ఆసారాం కేసు విచారణ ఆలస్యమెందుకు?
న్యూఢిల్లీ: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆసారాం బాపు కేసులో నాలుగేళ్లు గడుస్తున్న విచారణను ఎందుకు జాప్యం చేస్తున్నారంటూ సుప్రీంకోర్టు సోమవారం గుజరాత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. విచారణకు సంబంధించిన అఫిడవిట్‌ను దాఖలు చేసి, కేసు వివరాలు పంపాలంటూ సర్వోన్నత ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. బాలికపై అత్యాచారం చేసిన కేసులో గాంధీనగర్ న్యాయస్థానం ఆసారాం బాపును విచారిస్తోన్న విషయం తెలిసిందే. అతడు తనపై రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ఆశ్రమంలో లైంగిక దాడికి చేశాడంటూ ఓ 16 ఏళ్ల బాలిక ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బాపు భూకబ్జా, హత్యాయత్నం కేసుల్లోనూ నిందితుడు. ఇతని కుమారుడు నారాయణ్ సాయి సైతం మరో అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్నాడు. -
ఆశారాం కేసుపై సుప్రీం ఆరా
న్యూఢిల్లీః వివాదాస్పద ఆథ్యాత్మిక గురువు ఆశారాం బాపూపై నమోదైన అత్యాచార కేసు విచారణలో విపరీత జాప్యం పట్ల గుజరాత్ సర్కార్‌ను సుప్రీంకోర్టు నిలదీసింది. నిందితుడి బెయిల్ పిటిషన్ విచారిస్తూ ఈ కేసు పురోగతిపై నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ‘ఈ కేసులో ఎందుకింత జాప్యం జరుగుతున్నది..బాధితురాలిని ఇంతవరకూ ఎందుకు ప్రశ్నించలేద’ని గుజరాత్ ప్రభుత్వంపై కోర్డు మండిపడింది. సూరత్‌లోని తన ఆశ్రమంలో 16 ఏళ్ల స్కూల్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలపై 2013 ఆగస్టు నుంచి ఆథ్మాతిక గురువు ఆశారాం రాజస్థాన్‌లోని జైలులో ఉన్నారు. గాంధీనగర్‌లోని న్యాయస్థానంలో సాగుతున్న కేసు విచారణలో ఆశారాం తీరుతోనే జాప్యం జరుగుతున్నదని గుజరాత్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. కేసులో ఇంతవరకూ పలువురి సాక్ష్యాలు నమోదు చేయకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు ఆశారాంకు బెయిల్ మంజూరు చేసేందుకు సుప్రీం నిరాకరించింది. -
రేప్ కేసు: ఆసారాంకు మళ్లీ చుక్కెదురు
న్యూఢిల్లీ: అత్యాచారం కేసులో అరెస్టై, మూడేళ్లుగా జైలులోనే ఉంటున్న ప్రముఖ ఆథ్యాత్మిక గురువు ఆసారాం బాపునకు సుప్రంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. అనారోగ్య కారణాలు చూపుతూ ఆసారాం దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం సోమవారం కొట్టేసింది. కాగా, బెయిల్ కోసం ఆసారాం దాఖలుచేసిన పత్రాలు నకిలీవని తేలడంతో కోర్టు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.1లక్ష జరిమాన విధిస్తూ, ఆసారాంపై మరో కేసు పెట్టాలని పోలీసులకు సూచించింది. రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌లో గల తన ఆశ్రమంలో 72 ఏళ్ల ఆసారాం.. 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారనే విషయం 2013లో వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుమేరకు ఆసారంను అరెస్ట్‌చేసిన పోలీసుల ఆయనను జోథ్పూర్జైలుకు తరలించారు. ఈ క్రమంలోనే ఆయనపై మరో అత్యాచారం కేసు కూడా నమోదయింది. వృద్ధుడైన ఆసారాం జైలులో పలుమార్లు అస్వస్థతకు గురై బెయిల్ కోసం పలు కోర్టుల్లో పిటిషన్లు వేశారు. అవన్నీ తిరస్కరణకు గురికావడంతో చివరికి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చివరికి అత్యున్నత స్థానం కూడా ఆసారం అభ్యర్థనను మన్నించలేదు. (హవ్వ.. ఆసారాం మహాత్ముడట!) -
రేప్ కేసులో స్వామీజీకి మళ్లీ చుక్కెదురు
అత్యాచారం కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు మరోసారి నిరాశపడక తప్పలేదు. తనకు అనారోగ్యంగా ఉందని, అందువల్ల మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన పెట్టుకున్న దరఖాస్తును సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఒకవేళ ఆశారాం చికిత్స పొందాలనుకుంటే ఆయన ఎయిమ్స్‌లో లేదా జోధ్‌పూర్‌లో లేదా రాజస్థాన్ ఆయుర్వేద ఆస్పత్రిలో పొందొచ్చని, అయితే అప్పుడు కూడా జ్యుడీషియల్ కస్టడీలోనే ఉండాలని జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఎన్వీ రమణలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. తాను ఢిల్లీలో ఆయుర్వేద చికిత్స పొందాలని, అందుకోసం నెల రోజుల మధ్యంతర బెయిల్ కావాలని ఆశారాం బాపు తన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే, ఆరోగ్య పరిస్థితి అంతా బాగానే ఉందని ఎయిమ్స్ వైద్యబోర్డు చెప్పినందున బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని బెంచి తెలిపింది. రాష్ట్రంలోని ఆస్పత్రులలో ఆశారాంకు ఏ చికిత్స కావాలన్నా చేయించేందుకు రాజస్థాన్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. చికిత్స అందించే సమయంలో ఆశారాం మద్దతుదారులను ఆస్పత్రిలోకి అనుమతించకూడదని, ఎవ్వరూ ఆయనను కలవకూడదని ధర్మాసనం తెలిపింది. నవంబర్ నెలలో ఆయన బెయిల్ దరఖాస్తును విచారిస్తామని చెప్పింది. 2013 ఆగస్టు 31వ తేదీన జోధ్‌పూర్ పోలీసులు ఆశారాం బాపును అరెస్టుచేశారు. ఆయన అప్పటినుంచి జైల్లోనే ఉన్నారు. అత్యాచారం కేసులో ఆయన పెట్టుకున్న బెయిల్ దరఖాస్తును ఆగస్టు 9న హైకోర్టు తిరస్కరించింది. జోధ్‌పూర్ సమీపంలోని మనాయ్ గ్రామంలో ఆశారాం బాపు తనపై అత్యాచారం చేశారని ఓ టీనేజి యువతి ఫిర్యాదుచేసింది. -
వారి జీవితానికి వెలుగే లేకుండా చేసింది
న్యూఢిల్లీ: కిడ్నాప్‌కు గురైన తమవారిని రక్షించుకోవడం సాధారణ పౌరులకే కష్టం. అలాంటిది అంధులకు ఆ పరిస్థితి ఎదురైతే వారికి ఇంకెంత కష్టమో ఊహించనే లేము. అశారం, లక్ష్మీ అని అంధ దంపతులకు ఓ నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. అతడి పేరు హృతిక్. చీకటితో నిండిని వారి జీవితానికి హృతికే ఆశాకిరణం. వారిది రాజస్థాన్ లోని నీమ్ది అనే గ్రామం. ఢిల్లీలో ఆశారం మంగోల్ పురిలోని ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. సెప్టెంబర్ 15న లక్ష్మీ తల్లిదండ్రులను చూసేందుకు రాజస్థాన్ బయలుదేరారు. ఢిల్లీలోని రైల్వే స్టేషన్ కు చేరిన వారు నాలుగో నెంబర్ రైల్వే ఫ్లాట్ ఫాంకు చేరాల్సి ఉంది. ఆ సమయంలో వారి పరిస్థితి గమనించిన ఓ కిలాడీ లేడి తాను ప్లాట్ ఫాంకు తీసుకెళ్తానని చెప్పడంతోవారు అంగీకరించారు. ప్లాట్ ఫాంకు చేరుకున్న తర్వాత ఆ బాబు నీళ్లకోసం అడగగా తాను నీళ్లు తాగిస్తానని చెప్పి తీసుకెళ్లి కిడ్నాప్ చేసింది. ఎంతసేపటికి బాబు రాకపోవడంతో వారు తమ బిడ్డకోసం కేకలు పెట్టారు. అక్కడి సిబ్బందిగానీ, పోలీసులుగానీ, చుట్టుపక్కలవారుగానీ వారికి సహాయం చేయలేదు. దీంతో వారు బాధకు అంతులేకుండా పోయింది. ఎట్టకేలకు అతడు తన అంధుల యూనియన్ తో కలిసి నగర పోలీస్ కమిషనర్ ను సంప్రదించగా ఆయన పోలీసులకు ఆదేశించారు. అంతేకాదు. ఆ బాబును గుర్తించిన వారికి రూ.50వేల పారితోషికం ఇస్తామని రివార్డు ప్రకటించారు. ఇప్పటికి ఆ బాబు కిడ్నాప్ కు గురై పది రోజులు అవుతుంది. వారంలోగా రక్షిస్తామని పోలీసులు చెబుతున్నారు. -
ఆశారాం బాపు, భక్తులు విమానంలో ఏం చేశారంటే..
తనకు తాను దేవుడిగా చెప్పుకొనే ఆశారాం బాపు, ఆయన భక్తులు జెట్ ఎయిర్వేస్ విమానంలో నానా గొడవ చేసి తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించారు. ఆశారాం బాపు జోధ్‌పూర్ జైలు నుంచి వైద్య పరీక్షలు చేయించుకోడానికి ఢిల్లీ బయల్దేరారు. ఢిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో ఆయనకు వైద్య పరీక్షలు జరగాల్సి ఉంది. ఆశారాం బాపు, ఆయన భక్తులు తాము ఎక్కిన జెట్ ఎయిర్ వేస్ 9డబ్ల్యు 2552 విమానంలో సీట్లలో కూర్చోమంటే కూర్చోకుండా నినాదాలు చేస్తూనే ఉన్నారని తోటి ప్రయాణికులు చెప్పారు. దీనివల్ల ఉదయం 10.30 గంటలకు బయల్దేరాల్సిన విమానం.. విపరీతంగా ఆలస్యమై, చివరకు మధ్యాహ్నం రెండు గంటలకు బయల్దేరింది. అలా బయల్దేరిన తర్వాత కూడా విమానంలో ఏసీ సరిగా పనిచేయలేదని.. దాంతో తమకు ఊపిరి సరిగా ఆడలేదని ప్రయాణికులు ఫిర్యాదుచేశారు. -
వివాదాస్పద గురువుకు మళ్లీ నిరాశ
జైపూర్: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారామ్ బాపూనకు మరోసారి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనకు ఆరోగ్యం బాగోలేదని, బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆశారామ్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసింది. బాపు బెయిల్ పిటిషన్ ఇంతకుముందు రాజస్థాన్ హైకోర్టుతో పాటు సుప్రీం కోర్టు కూడా తిరస్కరించాయి. 2013లో ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు రావడంతో ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉన్నాడు. వైద్య పరీక్షల నివేదిక అందిన తర్వాతే బెయిల్ పిటిషన్‌ను విచారిస్తామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. బాపును పరీక్షించేందుకు ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఎయిమ్స్‌ను ఆదేశించింది. పది రోజుల లోపు నివేదిక ఇవ్వాలని ఎయిమ్స్‌కు గడువు విధించింది. -
ఆయనకు సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురు
న్యూఢిల్లీ: లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద ఆధ్మాత్మిక గురువు ఆశారాం బాపునకు సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురైంది. అనారోగ్యం కారణంగా తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న విజ్ఞప్తి సుప్రీంకోర్టు నిరాకరించింది. అదే సమయంలో ఎయిమ్స్ కు చెందిన మెడికల్ బోర్డులోని ముగ్గురు వైద్యులు వెళ్లి ఆయన ఆరోగ్యపరిస్థితిపై తమకు తెలియజేయాలని చెప్పింది. రాజస్థాన్ లోని ఆశ్రమంలో ఉండగా ఓ మైనర్ పై ఆశారాం బాపు లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఆయనను 2013 సెప్టెంబర్ 2న పోలీసులు అరెస్టు చేసి ప్రస్తుతం జైలులో ఉంచారు. దీంతో తనకు ఇటీవల ఆరోగ్యం బాగాలేదని, ఆస్పత్రిలో చికిత్స కోసం తనకు బెయిల్ ఇవ్వలంటూ రెండు రోజుల కిందట ఆయన రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ వేయగా అక్కడ కూడా కోర్టు అందుకు నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లగా ఉన్నత న్యాయస్థానం కూడా బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఎయిమ్స్ వైద్యాధికారులకు సూచించింది. -
'ఈ సమయంలో బెయిల్ ఇవ్వలేం'
జోద్పూర్: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆశారం బాపునకు మరోసారి రాజస్థాన్ కోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను రాజస్థాన్ హైకోర్టు తిరస్కరించింది. కేసు విచారణ దాదాపు ముగింపు దశలో ఉండగా ఇప్పుడు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదంటూ కోర్టు స్పష్టం చేసింది. 2013 సెప్టెంబర్ 2న జోద్ పూర్ సెంటర్ జైలుకు ఆశారాం బాపును తరలించారు. ఓ మైనర్ పై లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణల కిందట ఆయనను అరెస్టు చేసి జైలుకు తరలించగా అప్పటి నుంచి ఆయన పలుమార్లు బెయిల్ పిటిషన్ పెట్టుకున్నా కోర్టు ఇవ్వలేదు. ఆశారాం బెయిల్ పిటిషన్ వేయడం.. కోర్టు తిరస్కరించడం ఇది మూడోసారి. -
మాజీ ఐపీఎస్ ఆరోపణలు
వడొదర: ఆర్మీ లెఫ్టనెంట్ కల్నల్ ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్, సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, ఆశారాం బాపులను తప్పుడు కేసుల్లో ఇరికించారని గుజరాత్ కు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి డీజీ వంజారా ఆరోపించారు. తనను ఇరికించిన రాజకీయ పార్టీలే వీరిపై కేసులు బనాయించాయని పేర్కొన్నారు. వీహెచ్ పీ సంయుక్త కార్యదర్శి నీరజ్ జైన్ నేతృత్వంలోని గుజరాత్ అస్మిత మంచ్ సంస్థ ఆదివారం వంజారాకు సన్మానం చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ఆశారాంపై కేసులు గురించి చదివాను. ఇవి తప్పుడు కేసులని మాజీ పోలీసు అధికారిగా నాకు తెలుసు. పురోహిత్, సాధ్విలను కూడా కేసుల్లో ఇరికించారు. వీరిపై పెట్టిన కేసులను జాతీయ దర్యాప్తు సంస్థ ఇటీవల ఉపసంహరించుకుంది. సనాతన ధర్మ పరిరక్షకులుగా ఉన్నందువల్లే సాధ్వి, ఆశారాంలను టార్గెట్ చేశార'ని వంజారా అన్నారు. సోహ్రాబుద్దీన్ నకిలీ ఎన్ కౌంటర్ కేసులో అరెస్టైన ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. -
షార్ప్ షూటర్ అరెస్ట్
అహ్మదాబాద్: షార్ప్ షూటర్ కార్తిక్ హల్దార్ ను గుజరాత్ ఏటీఎస్ అధికారులు అరెస్ట్ చేశారు. వివాదస్పద స్వామిజీ ఆశారాం బాపు కేసులో ముగ్గురు సాక్ష్యులను అతడు హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కార్తిక్ హల్దార్ ను ఏటీఎస్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు సోమవారం పోలీసులు వెల్లడించారు. మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు ఆరోపణలు రావడంతో ఆశారాం బాపును 2013లో జోధ్‌పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో రేప్ కేసులో ఆయన కుమారుడు నారాయణసాయిని కూడా అరెస్టయ్యారు. 2001- 2005 మధ్య కాలంలో నారాయణసాయి తనపై పలు సార్లు అత్యాచారం చేశాడని ఓ మహిళ గుజరాత్‌లోని సూరత్ నగరంలో 2013లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
స్కూల్లో 'ఆశారాం చాలిసా' పఠనం..!
జైపూర్: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు. 16 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిపిన కేసులో ప్రస్తుతం ఆయన జోథ్‌పూర్ జైల్లో ఉన్నాడు. అయినా ఆయనను ఆరాధించడం ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మానుకోలేదు. తనను తను 'దేవుడి ప్రతిరూపం'గా చెప్పుకొనే ఆశారాంను ఏకంగా పాఠశాలలో ఆరాధిస్తూ పూజలు చేస్తూ ఆ టీచర్ సస్పెండ్ అయ్యాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని బర్మార్ జిల్లాలో జరిగింది. జిల్లాలోని ధోలాదర్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో మాఘరాం అనే ఉపాధ్యాయుడు పనిచేస్తున్నాడు. అతను ప్రతిరోజూ బడిలో ప్రార్థన సమయంలో ఆశారాం బాపు ఫొటోను పెట్టి, 'ఆశారాం చాలిసా'ను పఠించేవాడు. విద్యార్థులు కూడా ప్రార్థన చేయకుండా ఈ చాలిసాను పఠించాలని సూచించేవాడు. దీనిపై తోటి ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయుడు అభ్యంతరం పెట్టినా అతని తీరు మారలేదు. ఈ ఘటన తన దృష్టికి రావడంతో హెడ్మాస్టర్ ద్వారా ధ్రువీకరణ చేసుకొని ఆ టీచర్‌పై సస్పెన్షన్ వేటు వేసినట్టు ప్రాథమిక విద్యాశాఖ సెక్రటరీ కేఎల్ మీనా తెలిపారు. -
'నా భర్త వేరే యువతిని గర్భవతిని చేశాడు'
ఇండోర్: మామ, భర్త తనను శారీరకంగా, మానసికంగా తీవ్ర వేధింపులకు గురిచేశారని ఆశారాం బాపు కోడలు జానకి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. ఇప్పటికే వేర్వేరు లైంగిక వేధింపుల కేసులో జైలులో ఉన్నవారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులకు విన్నవించింది. రాజస్థాన్ లోని ఖాజురాణా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గత సెప్టెంబర్ 19నే ఆశారాం కోడలు ఫిర్యాదు చేయగా మంగళవారం ఆమె వాంగ్మూలం రికార్డు చేసేందుకు స్టేషన్ కు పిలిచారు. ఈ సందర్భంగా ఆమె తన భర్త నారాయణ హర్పలానీ ఆశ్రమంలోని మహిళా భక్తులతో సంబంధాలు పెట్టుకునేవాడని, చెడుగా ప్రవర్తించేవాడని ఓ యువతిని గర్భవతిని కూడా చేశాడని చెప్పింది. దీంతో ఆమెను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడని, అయితే, తనకు విడాకులు ఇచ్చాకే ఆమెను పెళ్లి చేసుకోవాలని చెప్పినట్లు తెలిపింది. ఆ మాటలు పట్టించుకోకుండా ఆమెతో సంబంధాన్ని పెట్టుకొని తనను చీకట్లో మగ్గేలా చేశాడని అన్నారు. తన మామ కూడా వేధించాడని, తన తండ్రి దేవరాజ్ కృష్ణానిని మాటలతో మభ్యపెట్టి ఆస్తులు మొత్తం తన ఆశ్రమానికి రాయించుకున్నాడని చెప్పింది. తనను నారాయణ్ మే 22, 1997న వివాహం చేసుకున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా పోలీసులకు తమ పెళ్లినాటి ఫొటోలు, వీడియోలు, ఇతర పత్రాలు పోలీసులకు సమర్పించింది. -
హవ్వ.. ఆసారాం మహాత్ముడట!
జోధ్‌పూర్: 'పిల్లలూ ఈ రోజు పాఠంలో మనదేశంలో మహనీయులుగా వెలుగొందిన మహాత్ముల పేర్లు చెప్పుకుందాం. శంకరాచార్య, మదర్ థెరిసా, రామకృష్ణ పరమహంస, వివేకానంద, గురునానక్, సంత్ కబీర్.. ఆసారం బాపు.. రామ్ దేవ్ బాబా..' అప్పటి వరకూ టీచర్ చెబుతున్న పేర్లను వల్లెవేస్తూ వచ్చిన పిల్లలందరూ చివరి రెండు పేర్ల దగ్గర మాత్రం ఠక్కున ఆగిపోయారు! తమ లాంటి ఓ చిన్నారిని చిదిమేసే ప్రయత్నంచేసి, ప్రస్తుతం జైలులో ఉన్న ఆసారాం మహాత్ముడు ఎలా అవుతాడో ఆ చిన్ని బుర్రలు ఆలోచించడం మొదలుపెట్టాయి. కానీ పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు.. వాటిని ముద్రించిన పబ్లిషర్లకు మాత్రం ఆ సందేహం ఇసుమంతైనా కలగలేదు. ప్రస్తుతం రాజస్థాన్ లోకి కొన్ని జిల్లాల పాఠశాలల్లో నెలకొన్న వాస్తవ పరిస్థితి ఇది! 16 ఏళ్ల బాలికను అత్యాచారం చేశాడన్న ఆరోపణలపై అరెస్టయిన ఆసారం బాబును మహాత్ముడిగా అభివర్ణిస్తూ.. ఆయన చిత్రపటాన్ని గుర్తించాల్సిందిగా మూడో తరగతి జీకే పుస్తకంలో చేర్చిన పాఠ్యాంశంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మహోన్నతుల సరసన అత్యాచారం కేసులో నిందితుడ్ని ఎలా చేర్చుతారంటూ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఇలాంటి పాఠ్యాంశం ఒకటుందని తమకు ఇంకా తెలియరాలేదని విద్యాశాఖ అధికారు చెబుతున్నారు. ఇటు పబ్లిషర్ వివరణ మరోలా ఉంది. 'ఆసారంను పాఠ్యాంశంలో చేర్చేనాటికి ఆయనపై ఎలాంటి కేసులు లేవు. పుస్తకం ప్రింట్ అయి.. విద్యార్థులకు చేరిన తర్వాతే ఆయన అరెస్టయ్యాయి. వెంటనే ఆ పుస్తకాలన్నింటినీ వెనక్కి తెప్పించి.. కొత్త వాటిని ముద్రించేపనిలో ఉన్నాం' అని చెప్పాడు పబ్లిషర్. భావిభారత పౌరులకు బోధిస్తున్న పాఠ్యాంశాల్లో ఇలాంటివి ఇంకెన్ని విషయాలు బయటపడతాయో వేచిచూడాలి. -
భయంకరమైన పరిణామాలెదుర్కొంటారు..
అహ్మదాబాద్: వివాదాస్పద ఆధ్మాత్మిక గురువు ఆశారాం బాపూ కేసులో సాక్షుల హత్యలు, బెదిరింపులకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఇద్దరు ఉన్నత మహిళా పోలీసు అధికారులకు కూడా బెదిరింపు లేఖలు వచ్చాయి. ఎసీపీ కనన్ దేశాయ్, ఎస్ఐ దివ్య రవియా అనే ఇద్దరు మహిళా పోలీసు అధికారులకు భయంకరమైన పరిణామాలను ఎదుర్కొంటారంటూ ఆ లేఖలో హెచ్చరికలు ఉన్నాయి.. సంత్ ఆశారాం ఆశ్రమం పేరుతో వచ్చిన ఈ లేఖ బుధవారం స్థానిక మహిళా పోలీస్ స్టేషన్‌కు చేరినట్టు పోలీస్ అధికారులు తెలిపారు. లేఖ ఎక్కడనుంచి వచ్చిందనే దానిపై సిటీ క్రైమ్ బ్రాంచ్ దీనిపై విచారణ చేపట్టినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆ మహిళా అధికారులిద్దరికీ 24 గంటలూ కాపలా ఉండేలా భద్రతను ఏర్పాటు చేశామన్నారు. అయితే 2014 లో ఆశారాం బాపూపై అత్యాచార ఆరోపణ కేసులు నమోదైన సమయంలో రవియా విచారణాధికారిగా ఉండగా ఆమె పై అధికారిగా కనన్ దేశాయ్‌గా ఉన్నారు. మరోవైపు హత్య చేస్తామని చెప్పి మరీ వరుసగా సాక్షులను హతమారుస్తూ ఉండడంతో దీనిపై పోలీసు అధికారుల్లో అనేక అనుమానాలు, ఆందోళన మొదలైంది. ఈ కేసులో ఆశారాం మాజీ సహాయకుడు అమృత్ ప్రజాపతి, అఖిల్ గుప్తా, కృపాల్ సింగ్ ఇలా ఇప్పటికి ఏడుగురు హతమయ్యారు. కాగా సూరత్ సిస్టర్స్ మీద అత్యాచారం కేసులో ఆశారాంతో పాటు ఆయన కుమారుడు నారాయణ్ సాయి కూడా నిందితుడిగా ఉన్నాడు. -
'నా కొడుకు హత్యను సీబీఐతో తేల్చండి'
ముజఫర్‌నగర్: వివాదాస్పద స్వామీజి ఆశారాం బాపు నేరాలకు సంబంధించి కీలకమైన సాక్షుల్లో ఒకరైన తన కుమారుడి అనుమానాస్పద మృతిపట్ల సీబీఐ దర్యాప్తు జరిపించాలని ఓ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు ఆయన గుజరాత్ అధికారులకు ప్రత్యేక లేఖ రాశారు. ఆశారాం బాపు కేసుకు సంబంధించి సాక్షుల్లో ఒకరైన అఖిల్ గుప్తా గత ఆరు నెలలకిందట అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యాడు. దీంతో ఆయన తండ్రి నరేశ్ గుప్తా స్ధానిక పోలీసులు తన కుమారుడు హత్య కేసును ఛేదించడంలో విఫలం అయ్యారని, వెంటనే జోక్యం చేసుకొని సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరారు. సూరత్‌లోని ఆశారాం బాపు ఆశ్రమంలో అఖిల్ గుప్తా వంటమనిషిగా పనిచేశాడు. ఓ మైనర్ బాలికపై ఆశారాం బాపు లైంగిక దాడులకు పాల్పడిన కేసులో అఖిల్‌ను కీలక సాక్షిగా భావించారు. అయితే అతడు మాత్రం జనవరి 11న గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. -
ఆశారాం కేసులో ప్రధాన సాక్షిపై కాల్పులు
షహజాన్ పుర్(యూపీ): సూరత్ అత్యాచారం కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న క్రిపాల్ సింగ్ పై దుండగులు కాల్పులు జరిపారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు సాక్షులుగా ఉన్న ఏడుగురి పై దాడి జరిగినట్లయింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సూరత్ అత్యాచారం కేసులో ఆశారాం, ఆయన కుమారుడు సూరత్‌కు చెందిన ఇద్దరు అక్కచెల్లెళ్లని లైంగికంగా వేధించారన్న ఆరోపణలని ఎదుర్కొంటున్నారు. వివరాలు..సర్ధార్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో దుండగులు జరిపిన కాల్పుల్లో 35 ఏళ్ల క్రిపాల్ సింగ్‌కు తీవ్రగాయాలయ్యాయి. క్రిపాల్ శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ద్విచక్రవాహనం పై ఇంటికి వెలుతున్న సమయంలో ఇద్దరు దుండగులు వెంబడించి వెనకవైపు నుంచి కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన క్రిపాల్ సింగ్‌ను వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. క్రిపాల్ సింగ్ ఎల్ఐసీ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. అతనికి ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. క్రిపాల్ ఆశారాం కేసులో ప్రధాన సాక్షిగా ఉన్నట్టు కుటుంబ సభ్యులు నిర్ధారించారు. బాధితుని నుంచి వాంగ్ములం తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. జోద్‌పుర్‌లోని ఆశారాంకి చెందిన ఆశ్రమంలో 2013లో జరిగిన అత్యాచారం ఘటనలో క్రిపాల్ సింగ్ ముఖ్యమైన సాక్షిగా ఉన్నాడని బాధితురాలి తండ్రి పేర్కొన్నారు. మూడు నెలల కింద క్రిపాల్ వాంగ్మూలాన్ని కోర్టు తీసుకుందని చెప్పారు. తనకు కూడా కేసునుంచి తప్పుకోవాలని దుండగుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని బాధితురాలి తండ్రి అన్నారు. -
ఆశారాం కేసులో ప్రధాన సాక్షిపై కాల్పులు
పానిపట్ : సూరత్ అత్యాచారం కేసులో ప్రధాన సాక్షి మహేందర్ చావ్లాపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. చండీగఢ్, పానిపట్టు జిల్లా సానౌలి గ్రామంలో మహేందర్ ఇంటి దగ్గర దుండగులు అతనిపై కాల్పులు జరిపారు. దీంతో తీవ్రంగా గాయపడిన అతడ్ని ఆసుపత్రికి తరలించారు. వెన్నులో రెండు బుల్లెట్లు దిగాయని, ప్రస్తుతం చావ్లా పరిస్థితి ప్రమాదకరంగా ఉందని పోలీసులు తెలిపారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సూరత్ అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు, ఆశారాం బాపు కుమారుడు, నారాయణ సాయికి గత రెండు వారాల క్రితమే గుజరాత్ హైకోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈ కాల్పులపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో వైపు వివిధ ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయని, దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. 2001- 2005 మధ్య కాలంలో ఆశారాం బాపు కుమారుడు నారాయణసాయి తనపై పలు సార్లు అత్యాచారం చేశాడని ఓ మహిళ గుజరాత్‌లోని సూరత్ నగరంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే 2000 సంవత్సరంలో ఆశారాం బాపు ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న తమపై బాపు, ఆయన కుమారుడు నారాయణ సాయి అత్యాచారం చేశారని గుజరాత్‌కు చెందిన ఇద్దరు అక్కచెల్లెళ్లు పోలీసు స్టేషన్లలో వేర్వేరుగా ఫిర్యాదుచేశారు. ఈ నేపథ్యంలో గుజరాత్, పంజాబ్, ఢిల్లీ పోలీసుల సంయుక్తంగా గాలింపు చర్యల్లో భాగంగా నారాయణ సాయిని, ఆశారాం బాపును అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
ఆశారాం బాపు లాయర్‌గా సుబ్రమణ్య స్వామి !
లైంగిక నేరాలు సహా పలు రకాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద స్వామి ఆశారాం బాపు తరఫున బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యస్వామి కోర్టులో వాదించనున్నారు. బెయిల్ పొందడం ఆశారాం ప్రాథమిక హక్కని, ఆయన తరఫున దిగువ కోర్టులో త్వరలోనే బెయిల్ దరఖాస్తు దాఖలు చేస్తానని స్వామి చెప్పారు. లాలుప్రసాద్, జయలలిత లాంటి వాళ్లు బెయిల్ పొందినప్పుడు.. ఆశారాం బాపు ఎందుకు బెయిల్ పొందకూడదని స్వామి ప్రశ్నించారు. స్వామి లాంటి పెద్ద లాయర్ రావడంతో, ఇక తనకు బెయిల్ లభించి బయటపడతానన్న ఆశాభావాన్ని ఆశారాం బాపు వ్యక్తం చేశారు. -
ఆశారాం బాపుపై ఫిర్యాదుచేసిన మహిళ అదృశ్యం
ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపుపై అత్యాచారం కేసు పెట్టిన మహిళ అదృశ్యమయ్యారు!! 33 ఏళ్ల ఆ మహిళతో పాటు ఆమె భర్త, కుమారుడు కూడా కనిపించడం లేదు. వారం రోజులుగా ఆ కుటుంబం మొత్తం కనిపించడం లేదని అహ్మదాబాద్ పోలీసులు తెలిపారు. ఆశారాం బాపు తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ గత సంవత్సరం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాతే ఆశారాం బాపు అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడం, ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకోవడం లాంటి పరిణామాలు జరిగాయి. అయితే, ఇప్పుడు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళే కనిపించకుండా పోవడంతో ఆమె ఆచూకీ కోసం గుజరాత్ పోలీసులు ప్రత్యేక గాలింపు బృందాలను ఏర్పాటుచేశారు. -
ఆశారాం బాపుకు ఆశాభంగం
న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నవాదాస్పద స్వామిజీ ఆశారాం బాపుకు సుప్రీంకోర్టులో ఆశాభంగం ఎదురైంది. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఆయన బెయిల్ కు తొందరేమొచ్చిందని ప్రశ్నించింది. అనారోగ్య కారణాలతో ఆశారాంకు హడావుడిగా బెయిల్ మంజూరు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. గుజరాత్, రాజస్థాన్ రాష్టాల్లో ఆయనపై రేప్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. జోధ్‌పూర్ సమీపంలోని తన ఆశ్రమంలో 16 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆయనను గతేడాది సెప్టెంబర్ లో అరెస్ట్ చేశారు. -
ఆశారాం బాపుకు వైద్య పరీక్షలు
న్యూఢిల్లీ : లైంగిక వేధింపుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నవివాదాస్పద స్వామిజీ ఆశారాం బాపుకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. నరాలకు సంబంధించిన వ్యాధి రావటంతో ఆయన తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న విషయం తెలిసిందే. వైద్య పరీక్షల కోసం న్యాయస్థానం ఓ వైద్య బృందాన్ని ఏర్పాటుకు ఆదేశించింది. ఈ మెడికల్ బోర్డు బృందం.... ఆశారాం బాపును పరీక్షించి, అవసరమైన చికిత్సపై నివేదిక అందించనుంది. ఈ బృందం తన నివేదికను సెప్టెంబర్ 23లోగా సమర్పించనుంది. నివేదిక ఆధారంగా న్యాయస్థానం తదుపరి నిర్ణయం తీసుకోనుంది. కాగా మైనర్ బాలికపై లైంగిక దాడి చేసినట్లు వచ్చిన ఆరోపణలు రుజువు కావడంతో పోలీసులు 2013లో ఆశారాం బాపును అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాల మేరకు జోధ్‌పూర్ సెంట్రల్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. కాగా ఆశారాం బాపు తన బెయిల్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. -
సుప్రీంలో ఆశారాం బాపుకు చుక్కెదురు!
న్యూఢిల్లీ: ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపుకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. గుజరాత్ లో ఆశారాం బాపుపై దాఖలైన రేప్ కేసులో బెయిల్ ఇవ్వడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. బెయిల్ పిటిషన్ గుజరాత్ హైకోర్టులో దాఖలు చేయాలని ఆశారాంకు సుప్రీం కోర్టు సూచించింది. అయితే రాజస్థాన్ లో నమోదైన మరో రేప్ కేసులో ఆశారాం బెయిల్ పిటిషన్ పై విచారణకు అనుమతిస్తామని సుప్రీం కోర్టు తెలిపింది. ఆశారాం బాపు వ్యవహారంలో రాజస్థాన్ ప్రభుత్వానికి సుప్రీం నోటీసు జారీ చేసింది. -
ఆశారాం బాపూకు కోర్టులో చుక్కెదురు
జోథ్‌పూర్: ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూకు కోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను రాజస్థాన్ హైకోర్టు తిరస్కరించింది. ఫిబ్రవరి 3వ తేదీన డిఫెన్స్, ప్రాసిక్యూషన్ లాయర్ల వాదనలను పెండింగ్ లో ఉంచిన న్యాయమూర్తి జస్టిస్ నిర్మల్జిత్ ఈ రోజు బెయిల్ పిటీషన్ ను తోసిపుచ్చుతూ తీర్పు చెప్పారు. గత వారం కోర్టుకు వచ్చిన ఆశారాం బెయిల్ పిటీషన్ పై రాం జెఠ్మలానీ వాదనలు వినిపించారు. ఆశారాం చాలా కాలంగా జైలు జీవితం గడుపుతున్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితి సరిగా లేనందును బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు తెలిపారు. అతనిపై దాఖలైన చార్జిషీట్ బలంగా ఉన్నందున బెయిల్ మంజూరు చేయకూడదని ప్రాసిక్యూషన్ కౌన్సిల్ తరుపున మిష్పాల్ బిస్నోయ్ వాదించారు. 72 ఏళ్ల ఆశారాం బాపూ సెప్టెంబర్ 2 నుంచి జోధ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు. జోధ్‌పూర్ సమీపంలోని తన ఆశ్రమంలో 16 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆగస్టు 20న ఆశారాం బాపుపై కేసు నమోదయింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ఆశ్రమంలో అరెస్ట్ చేసి ఆయనను సెప్టెంబర్ 1న జోథ్‌పూర్‌కు తరలించారు. -
ఆశారాం బాపు సంపద రూ. 10 వేల కోట్లు
-
ఆశారాం బాపు సంపద రూ. 10 వేల కోట్లు
సూరత్: కుబేరుడికే కళ్లుతిరిగేలా.. కార్పొరేట్లకే ఈర్ష్య పుట్టేలా స్వామీజీ ఆశారాం బాపు ఆస్తులు కూడగట్టారు. అదంతా పోలీసులు స్వాధీనం చేసుకున్న పత్రాల ద్వారా ఇప్పుడు బయటకి వస్తోంది. ఇప్పటి వరకూ లెక్కించిన ఆయన సంపద విలువ దాదాపు రూ. 10 వేల కోట్లు ఉందని గురువారం పోలీసులు చెప్పారు. ఆయన ఆశ్రమంపై దాడి చేసిన సందర్భంలో లభించిన డాక్యుమెంట్లను పరిశీలించగా.. బ్యాంకు ఖాతాలు, షేర్లు, డిబెంచర్లు, ప్రభుత్వ బాండ్ల రూపంలో ఆశారాం సొమ్ము రూ. 9 వేల కోట్ల నుంచి రూ. 10 వేల కోట్లు ఉంటుందని సూరత్ పోలీస్ కమిషనర్ రాకేష్ అస్తానా విలేకరులకు తెలిపారు. దీనిలో దేశవ్యాప్తంగా ఆయనకు ఉన్న భూముల విలువ కలపలేదన్నారు. మరిన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవాల్సి ఉందని, అప్పుడు ఆయన సంపద విలువ మరింత పెరగవచ్చని సీపీ తెలిపారు. ఈ విషయంలో లోతైన విచారణ కోసం సీబీడీటీ, ఐటీ, ఈడీలకు విన్నవించామని ఆయన చెప్పారు. కొన్ని నెలల క్రితం అహ్మదాబాద్‌లోని ఆయన ఆశ్రమ భవనంలో సోదా చేసిన సందర్భంగా 40 పెద్ద సంచుల నిండుగా ఉన్న వేలాది డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. వాటి ఆధారంగానే గుజరాత్‌లోని 45 ప్రాంతాల్లో ఆయనకు భూములున్నట్లు, అంతేగాక రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో కూడా భూములు సంపాదించినట్లు బయటపడిందని సీపీ రాకేష్ వెల్లడించారు. మరిన్ని చోట్ల ఆయన ఇంకా డాక్యుమెంట్లు దాచి పెట్టారా అనే విషయం పరిశీలించాల్సి ఉందన్నారు. కాగా, లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న 72 ఏళ్ల ఆశారాం బాపు జోధ్‌పూర్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఆయన కుమారుడు నారాయణ సాయి కూడా అలాంటి కేసులోనే జైలు పాలయ్యారు. -
ఎనిమిది మంది శిష్యురాళ్లతో సంబంధముంది: నారాయణ్‌సాయి అంగీకారం
సూరత్: అత్యాచారం ఆరోపణలను ఎదుర్కొంటున్న వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు కుమారుడు నారాయణ్ సాయి(40) తమ ఆశ్రమంలోని ఎనిమిది మంది మహిళలతో తనకు సంబంధమున్నట్టుగా అంగీకరించారు. తనపై అత్యాచారం ఆరోపణలు చేసిన సూరత్ యువతితోనూ శారీరక సంబంధముందని ఒప్పుకున్నారు. అయితే తనపై మోపిన అత్యాచారం ఆరోపణలను తోసిపుచ్చారు. ఆమె సమ్మతితోనే శారీరకంగా కలిసినట్టు ఆయన సూరత్ పోలీసుల విచారణలో వెల్లడించారు. ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆశారాం బాపు, అతడి కుమారుడు నారాయణ్ సాయిలపై అత్యాచారం, లైంగిక వేధింపులు తదితర అభియోగాల కింద సూరత్ పోలీసులు కేసు నమోదు చేయడం తెలిసిందే. 2002-2005 మధ్యకాలంలో తాను సూరత్ ఆశ్రమంలో ఉన్నప్పుడు సాయి తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని చెల్లి ఫిర్యాదు చేయగా, 1997-2006 మధ్యకాలంలో ఆశారాం తనపై అత్యాచారం జరిపాడని అక్క ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పరారైన సాయి 58 రోజులపాటు తప్పించుకు తిరిగారు. ఎట్టకేలకు ఆయన్ను ఈ నెల 4న హర్యానాలోని కురుక్షేత్ర సమీపంలో ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. అనంతరం సూరత్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. -
ఆశారాం కుమారుడు అరెస్టు
న్యూఢిల్లీ: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు కుమారుడు, అత్యాచారం కేసులో నిందితుడు నారాయణ సాయిని ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లో బుధవారం వేకువ జామున పోలీసులు అరెస్టు చేశారు. 58 రోజులుగా పోలీసుల కళ్లుకప్పి తిరుగుతున్న సాయితో పాటు అతడి సహాయకుడు కౌశల్ ఠాకూర్ అలియాస్ హనుమాన్ (29), డ్రైవర్ రమేశ్ మల్హోత్రా (27) కూడా పట్టుబడ్డారు. వారిని రోహిణి మేజిస్ట్రేట్ ఎదుటహాజరుపరచగా, గుజరాత్ పోలీసులకు 24 గంటల ట్రాన్సిట్ రిమాండ్‌కు అప్పగించారు. సిక్కుల మాదిరిగా తలపాగా ధరించి మారువేషంలో ఉన్న నారాయణ సాయిని, అతడి అనుచరులను కురుక్షేత్ర సమీపంలోని పిప్లి వద్ద అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. నారాయణ సాయిపై రూ.5 లక్షలు, హనుమాన్‌పై రూ.లక్ష మొత్తాలను పోలీసులు ఇదివరకే రివార్డుగా ప్రకటించారు. సాయిని, అతడి అనుచరులను రోహిణి జిల్లా కోర్టుల కాంప్లెక్స్‌లో మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచేందుకు పోలీసులు తీసుకు వచ్చిన సమయంలో సాయికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేస్తున్న వారిపై అతడి మద్దతుదారులు దాడి చేశారు. ఇద్దరు అక్కచెల్లెళ్ల ఫిర్యాదు ఆధారంగా ఆశారాం, ఆయన కుమారుడిపై సూరత్ పోలీసులు అత్యాచారం, లైంగిక వేధింపులు అభియోగాలపై కేసు లు నమోదు చేశారు. ఆశారాం ప్రస్తుతం జోధ్‌పూర్ జైలులో కస్టడీలో ఉన్నారు. -
ఆశారాం బాపు తనయుడు అరెస్ట్
సూరత్ అత్యాచారం కేసులో నిందితుడు, ఆశారాం బాపు కుమారుడు నారాయణ సాయిని అరెస్ట్ చేసినట్లు న్యూఢిల్లీ పోలీసులు బుధవారం ఇక్కడ వెల్లడించారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నామని, ఈ రోజు మధ్యాహ్నం 2.00 గంటలకు రోహిణి కోర్టులో నారాయణ సాయిని హాజరు పరుస్తామని తెలిపారు. న్యూఢిల్లీ- హర్యానా సరిహద్దుల్లో నారాయణ సాయితో అతడి స్నేహితులతో ఉండగా న్యూఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. గత 58 రోజులుగా తప్పించుకు తిరుగుతున్న నారాయణ సాయిని గుజరాత్, పంజాబ్, ఢిల్లీ పోలీసుల సంయుక్తంగా నిర్వహించిన గాలింపు చర్యల్లో భాగంగా అరెస్ట్ చేసినట్లు వివరించారు. 2001- 2005 మధ్య కాలంలో ఆశారాం బాపు కుమారుడు నారాయణసాయి తనపై పలు సార్లు అత్యాచారం చేశాడని ఓ మహిళ గుజరాత్‌లోని సూరత్ నగరంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే 2000 సంవత్సరంలో ఆశారాం బాపు ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న తమపై బాపు ఆయన కుమారుడు నారాయణ సాయి అత్యాచారం చేశారని గుజరాత్‌కు చెందిన ఇద్దరు సోదరిమణులు స్థానిక పోలీసు స్టేషన్లలో వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. దాంతో నారాయణ సాయిని వెంటనే అరెస్ట్ చేయాలని నవంబర్ 24న పోలీసులను గుజరాత్ హైకోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దాంతో నిందితుడు నారాయణ సాయిని అరెస్ట్ చేసేందుకు గుజరాత్ పోలీసులు న్యూఢిల్లీ, పంజాబ్ పోలీసుల సహాయం తీసుకున్నారు. -
'పిల్లల రక్తం తాగే డ్రాకులలా మీడియా చిత్రీకరిస్తోంది'
పిల్లల రక్తం తాగే డ్రాకులలా మీడియా తనను చిత్రీకరించడంపై జోక్యం చేసుకోవాలని ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు దాఖలు పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. తన ప్రవర్తనపై ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా తనకు వ్యతిరేకంగా కథనాలపై ఆంక్షలు విధించాలని ఆశారాం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పి సధాశివం, జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్, జస్టిస్ రాజన్ గగోయ్ లతో కూడిన ధర్నాసనం విచారించింది. పోలీసుల నుంచి, ఇతర మార్గాల సేకరించిన సమాచారాన్ని మీడియా ప్రసారాం చేయడాన్ని తప్పపట్టలేమని కోర్టు వెల్లడించింది. ఆశారాంను డ్రాకులలా చిత్రీకరించారని కోర్టుకు ఆయన తరపు న్యాయవాది తెలిపారు. ఆశారాం భార్య, కూతుళ్లు ఆయనకు అమ్మాయిలను సరఫరా చేస్తున్నారని మీడియా కథనాలు వెల్లడించిన వ్యవహారాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. -
నారాయణ్ సాయి ఆశ్రమంపై పోలీసుల దాడులు
సాక్షి ముంబై: మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆసారామ్ బాపూజీ కుమారుడు నారాయణ్ సాయికు చెందిన విరార్‌లోని ఆశ్రమంపై శుక్రవారం రాత్రి గుజరాత్ పోలీసులు దాడులు చేశారు. పరారీలో ఉన్న నారాయణ్ సాయి ఆచూకీ దొరక్కపోవడంతో ఏమైనా వివరాలు తెలుస్తాయా అనే కోణంలో ఈ ఆశ్రమంలో గాలింపు చర్యలు చేపట్టారు. విరార్‌లోని కుంభార్ పాడా గ్రామంలో ఆశ్రమం నిర్వహిస్తున్న నారాయణ్ సాయి తరచూ ఇక్కడకు వస్తుంటాడని గుజరాత్ పోలీసులకు సమాచారం వచ్చింది. ఈ మేరకు విరార్ పోలీసుల సహాయంతో ఆశ్రమంపై చర్యలు చేపట్టారు. కానీ ఆశ్రమంలో కార్మికులు తప్పా ఇంకెవ్వరు దొరకలేదు. సూరత్ పట్టణంలో ఇద్దరు ఇక్కాచెల్లెళ్లు ఆసారామ్ బాపు, నారాయణ్ సాయిపై జహాంగీర్పుర పోలీస్ స్టేషన్లో కేసు నమోదుచేశారు. -
ఆసారామ్ కుమారుని ఆశ్రమంపై పోలీసుల దాడులు
సాక్షి ముంబై: మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆసారామ్ బాపూజీ కుమారుడు నారాయణ్ సాయికు చెందిన విరార్‌లోని ఆశ్రమంపై శుక్రవారం రాత్రి గుజరాత్ పోలీసులు దాడులు చేశారు. పరారీలో ఉన్న నారాయణ్ సాయి ఆచూకీ దొరక్కపోవడంతో ఏమైనా వివరాలు తెలుస్తాయా అనే కోణంలో ఈ ఆశ్రమంలో గాలింపు చర్యలు చేపట్టారు. విరార్‌లోని కుంభార్ పాడా గ్రామంలో ఆశ్రమం నిర్వహిస్తున్న నారాయణ్ సాయి తరచూ ఇక్కడకు వస్తుంటాడని గుజరాత్ పోలీసులకు సమాచారం వచ్చింది. ఈ మేరకు విరార్ పోలీసుల సహాయంతో ఆశ్రమంపై చర్యలు చేపట్టారు. కానీ ఆశ్రమంలో కార్మికులు తప్పా ఇంకెవ్వరు దొరకలేదు. సూరత్ పట్టణంలో ఇద్దరు ఇక్కాచెల్లెళ్లు ఆసారామ్ బాపు, నారాయణ్ సాయిపై జహాంగీర్పుర పోలీస్ స్టేషన్లో కేసు నమోదుచేశారు. -
దర్యాప్తు చేస్తే కాల్చేస్తామని మహిళా ఐపీఎస్‌కు బెదిరింపులు
అత్యాచారం కేసులో ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు కొడుకు నారాయణ్ సాయి కోసం గాలింపు చర్యలు చేపడుతున్న సీనియర్ మహిళా ఐపీఎస్ అధికారికి బెదిరింపులు వస్తున్నాయి. గాలింపు చర్యలు ఆపాలని, లేదంటే కాల్చేస్తామని ఓ అపరిచితుడు ఫొనోలో హెచ్చరించాడు. ఈ మేరకు సూరత్ ఉమ్రా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆశారాం, ఆయన కొడుకుపై ఇద్దరు సోదరీమణులు సూరత్‌లోని వేర్వేరు పోలీసు స్టేషన్లలో అత్యాచార కేసులు దాఖలు చేశారు. ప్రస్తుతం ఆశారాం జైల్లో ఉండగా, నారాయణ్ సాయి పరారీలో ఉన్నాడు. ఆయన కోసం సూరత్ డిప్యూటి పోలీస్ కమిషనర్ శోభా భుటాడె పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ చేసిన వ్యక్తి మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించినట్టు ఉమ్రా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సీకే పటేల్ చెప్పారు. కేసు విచారణ కోసం అక్కడికి వెళ్లనున్నట్టు తెలిపారు. -
ఆశారాం భార్య, కుమార్తెల విచారణ
అహ్మదాబాద్: సూరత్‌కు చెందిన ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద ఆథ్యాత్మిక గురువు ఆశారాం బాపూ భార్య, కుమార్తెలను పోలీసులు ఆదివారం విచారించారు. ఆశారాం భార్య లక్ష్మి, కుమార్తె భారతిలను ఉగ్రవాద వ్యతిరేక దళం కార్యాలయంలో ప్రత్యేక విచారణ బృందం ప్రశ్నించినట్లు ఓ పోలీస్ అధికారి తెలిపారు. అహ్మదాబాద్‌లోని ఆశ్రమంలో ఆశారాం 1997 నుంచి 2006 మధ్య కాలంలో తనపై పలుసార్లు అత్యాచారం చేసినట్లు సూరత్‌కు చెందిన ఒక మహిళ ఫిర్యాదు చేసింది. ఓ సందర్భంలో ఆశారాం భార్య, కుమార్తె ఇందుకు సహకరించినట్లు పేర్కొంది. ఆశారాం కుమారుడు నారాయణ్‌సాయి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలి సోదరి కూడా ఫిర్యాదు చేసింది. తాను సూరత్ ఆశ్రమంలో ఉండగా నారాయణ శాయి 2002-2005 మధ్య కాలంలో తరచూ తనపై అత్యాచారం చేసిట్లు చెల్లెలు ఆరోపించింది. మరోవైపు ఆశారాం పోలీస్ కస్టడీని ఈనెల 22వ తేదీ వరకు పొడిగిస్తూ గాంధీనగర్ మేజిస్ట్రేట్ కోర్టు శనివారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. -
ఆశారాం కొడుకు కోసం ఢిల్లీలో గాలింపు
అత్యచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు కొడుకు నారాయణ్ సాయి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గుజరాత్, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా తూర్పు, పశ్చిమ ఢిల్లీలో అనుమానిత ప్రాంతాల్లో తనికీ చేశారు. ఈ నెల 6న సూరత్‌లో నారాయణ్‌పై అత్యాచారం కేసు నమోదు కాగానే అతను పరారయ్యాడు. 2001-2005 మధ్య నారాయణ్ తనను అత్యాచారం చేశాడని 30 ఏళ్ల మహిళ ఫిర్యాదు చేసింది. సూరత్‌లో నివసిస్తున్న ఇద్దరు సోదరీమణులు వేర్వేరు పోలీసు స్టేషన్లలో ఆశారాం, నారాయణ్‌పై అత్యాచారం కేసులు దాఖలు చేశారు. ఆశారాంను పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. -
ఆశారాం, కొడుకు శాయిపైన అత్యాచారం కేసులు
గాంధీనగర్(పిటిఐ): వివాదాస్పద స్వామీజీ అశారాంపై మరో అత్యాచారం కేసు నమోదైంది. ఆశారం, అతని కుమారుడు నారాయణ శాయి తమపై అత్యాచారం చేసినట్లు సూరత్‌కు చెందిన అక్కచెల్లెళ్లు ఇద్దరు ఫిర్యాదు చేశారు. ఒక యువతి ఆశారం తనపై అత్యాచారం చేసినట్లు ఆరోపించగా, మరో యువతి అతని కొడుకు నారాయణ శాయి అత్యాచారం చేసినట్లు ఆరోపించారు. అహ్మదాబాద్ శివారులోని ఆశ్రమంలో ఉండగా ఆశారాం తనపై అత్యాచారం చేసినట్లు తెలిపింది. 1997 నుంచి 2006 వరకు అత్యాచారం కొనసాగించినట్లు వివరించింది. తాను సూరత్ ఆశ్రమంలో ఉండగా నారాయణ శాయి 2002-2005 మధ్య కాలంలో తరచూ తనపై అత్యాచారం చేసిట్లు చెల్లెలు ఆరోపించింది. కట్టుదిట్టమైన పోలీస్ భద్రత మధ్య ఆశారాంను ఈరోజు పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. శాయి ఎక్కడ ఉన్నది ఆచూకీ తెలియలేదు. అయితే అతను సూరత్ కోర్టులో ముందస్తు బెయిలు కోసం పిటిషన్ దాఖలు చేశాడు. -
ఆశారాం ఆశ్రమంలో ముగ్గురు పిల్లల మృతి, కేసు విచారణ
ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు ఆశ్రమంలో ముగ్గురు పిల్లలు అనుమానస్పద స్థితిలో మరణించడంపై విచారణ చేపట్టాల్సిందిగా జమ్మూకాశ్మీర్ పోలీసులకు స్థానిక కోర్టు ఆదేశించింది. జమ్మూలోని ఆశారాం ఆశ్రమంలో ఈ సంఘటన జరిగింది. వారిని అక్కడే పూడ్చిపెట్టారని ఆశ్రమంలో పనిచేసే ఓ పర్యవేక్షుడు అరోపించినట్టు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు సోమవారం చెప్పారు. అఖిల భారత కిసాన్ సేవా సంఘం అధ్యక్షుడు రాజ్‌కుమార్ చౌదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఆశారాం ఆశ్రమంలో పనిచేసిన భోళానాథ్కు రక్షణ కల్పిస్తే కేసుకు సంబంధించిన అన్ని వివరాలు చెబుతాడని పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. ఇదిలావుండగా, లైంగిక వేధింపుల కేసులో ఆశారాం ప్రస్తుతం రాజస్థాన్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. గత నెలలో ఆయన్ను మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో అరెస్ట్ చేశారు. -
ఆశారాంతోపాటు కుమారుడిపై లైంగిక వేధింపుల కేసు!
వివాదస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు, ఆయన కుమారుడు నారాయణ సాయిపై తాజాగా లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తమను లైంగిక వేధింపులకు గురిచేశారంటూ ఇద్దరు యువతులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. మైనర్ బాలికపై లైంగిక దాడులకు పాల్పడ్డారనే ఆరోపణలపై అశారాం బాపును రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో అరెస్ట్ చేసిన జైలులో ఉంచిన సంగతి తెలిసిందే. ఇద్దరు యువతుల ఫిర్యాదు మేరకు అశారాం,నారాయణ సాయిలపై కేసు నమోదు చేశామని సూరత్ పోలీస్ కమిషనర్ రాకేశ్ అస్థానా తెలిపారు. బాధితురాల్లిద్దరూ కూడా అక్కాచెల్లెల్లని పోలీసులు తెలిపారు. నారాయణ సాయి పై సూరత్ లోని జహంగీర్ పూరాలో, ఆహ్మదాబాద్ లో అశారాంపై కేసులు నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో నారాయణ్ స్వామిని పోలీసులు త్వరలో విచారించనున్నారు. 2001 నుంచి 2006 మధ్య కాలంలో తమపై లైంగిక దాడులు చేశారని ఫిర్యాదులో తెలిపారు. -
ఆశారాం బాపూకు మరోసారి చుక్కెదురు
జోథ్‌పూర్: ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూకు కోర్టులో మరోసారి చుక్కెదురయింది. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను రాజస్థాన్ హైకోర్టు తిరస్కరించింది. డిఫెన్స్, ప్రాసిక్యూషన్ లాయర్ల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి జస్టిస్ నిర్మల్జిత్ కౌర్.. ఆశారాం బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చారు. ఆశారాం తరపున ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ వాదనలు వినిపించారు. గత నెల 13న ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను జోధ్‌పూర్ కోర్టు తోసిపుచ్చింది. 72 ఏళ్ల ఆశారాం బాపూ సెప్టెంబర్ 2 నుంచి జోధ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు. ఆయనకు విధించిన జ్యుడీషియల్ కస్టడీని జోధ్‌పూర్ కోర్టు ఈ నెల 11కు వరకు పొడిగించింది. జోధ్‌పూర్ సమీపంలోని తన ఆశ్రమంలో 16 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆగస్టు 20న ఆశారాం బాపుపై కేసు నమోదయింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ఆశ్రమంలో అరెస్ట్ చేసి ఆయనను సెప్టెంబర్ 1న జోథ్‌పూర్‌కు తరలించారు. -
ఆశారాం బాపూకు బెయిల్ తిరస్కరణ
-
ఆశారాం బాపూకు బెయిల్ తిరస్కరణ
జోథ్‌పూర్ : ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూకు కోర్టులో మరోసారి నిరాశే ఎదురైంది. ఆయన బెయిల్ పిటిషన్‌ను జోథ్‌పూర్ కోర్టు మరోసారి తిరస్కరించింది. ఆశారాం జ్యూడిషీయల్ కస్టడీ నేటితో ముగియటంతో పోలీసులు ఆయన్ని ఈరోజు ఉదయం కోర్టులో హాజరు పరిచారు. అలాగే ఆశారాం బాపూ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై కూడా విచారణ జరిపిన కోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది. అంతే కాకుండా ఆయన రిమాండ్‌ను మరో 14 రోజులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 16 ఏళ్ల బాలికపై ఆత్యాచారం చేశారన్న ఆరోపణలపై ఆశారాం బాపును.. సెప్టెంబర్ ఒకటి ఆర్థరాత్రి.. మధ్యప్రదేశ్‌లోని చింధ్వారా ఆశ్రమంలో అరెస్టు చేశారు. అనంతరం కోర్టు జ్యూడిషీయల్ కస్టడీ విధించడంతో జోధ్‌పూర్ జైలుకు తరలించారు. మరోవైపు ఆశారాం బాపు శిష్యులు తమను చంపుతామని బెదిరిస్తున్నారని.. బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. -
తప్పు ఒప్పుకున్న దిగ్విజయ్ సింగ్
షాజాపూర్: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారామ్ బాపూను రక్షించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. ఆశారామ్ ఆశ్రమం కోసం ఇచ్చిన భూమి లీజును వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. షాజాపూర్ జిల్లా సుస్నెర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సదస్సులో ఆయన మాట్లాడారు. తన పదవీ కాలంలోనే ఆశారామ్‌కు భూమి కేటాయించినట్లు చెప్పారు. ఇది తప్పిదమేనని ఆయన ఒప్పుకున్నారు. 1993 నుంచి 2003 వరకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా దిగ్విజయ్ పనిచేశారు. ఆ సమయంలోనే ఇండోర్ బాపు ఆశ్రమం విస్తరణ కోసం భూమి కేటాయించారు. అప్పట్లో అన్నిరాజకీయ పార్టీలు ఈ ప్రతిపాదన చేశాయని తెలిపారు. బాపు అసలు స్వరూపాన్ని ఎవరూ గుర్తించలేకపోయారన్నారు. ఆశ్రమంలో 16 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో 72 ఏళ్ల బాపు ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. -
ఆశారాం బాపుకు బెయిల్ నిరాకరణ
బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో నిందితుడు, ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు(72)కు కోర్టు బెయిల్ నిరాకరించింది. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై స్థానిక జిల్లా, సెషన్స్(రూరల్) కోర్టు న్యాయమూర్తి మనోజ్ వ్యాస్ విచారించారు. వాదనలు విన్న తర్వాత ఆశారాం బాపుకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు. ఈ కేసులో ఇద్దరు అనుమానితులు ఇంకా పట్టుబడనందున ఆశారాంకు బెయిల్ ఇవ్వడం కుదరదని కోర్టు స్పష్టం చేసిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయస్థానం వెలుపల విలేకరులతో చెప్పారు. కోర్టు ఈ నెల 15కు జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ఆశారాం బాపు జోధ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు. జోధ్‌పూర్‌లోని తన ఆశ్రమంలో ఆశారాం ఓ పదహారేళ్ల బాలికను లైంగికంగా వేధించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. -
జైల్లో నిద్రపోలేని ఆశారాం బాపు
బాలికపై అత్యాచారం కేసులో అరెస్టయ్యి ఏడు ఊచలు లెక్కపెడుతున్న ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు (72)... రాజస్థాన్‌లోని జైల్లో సరిగా నిద్రపోలేకపోయారట. అసలాయనకు అక్కడ నిద్రే పట్టలేదట. రోజూ పట్టు పరుపుల మీద పవళిస్తూ.. శిష్యులు (శిష్యురాళ్లు) సకల సేవలు చేస్తుండగా, హాయిగా కునుకు తీసే ఆశారాం.. ఇప్పుడు కటిక నేలమీద ఒక చాప మాత్రం వేసుకుని పడుకొమ్మంటే నిద్ర పట్టక అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నారట. రాజస్థాన్‌లోని జైల్లో 14 రోజుల రిమాండు ఖైదీగా ఉన్న ఆశారాం బాపును.. బారక్‌లో కాకుండా ఒక ప్రత్యేక గదిలో ఉంచారు. రాత్రంతా ఆయనను దోమలు ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. ''ఆశారాం బాపు ఒక చాపమీద పడుకున్నారు. ముందుగా ఆయన తన గది పరిసరాలను పరిశుభ్రం చేయడానికి గంగాజలం చల్లారు. కొందరు ఖైదీలు ఆయనకు కావల్సిన అవసరాలు చూశారు'' అని జైలు వర్గాలు తెలిపాయి. జైల్లో ఇతర ఖైదీలకు పెట్టే ఆహారాన్ని తీసుకోడానికి ఆయన నిరాకరించడంతో పాలు, డ్రై ఫ్రూట్స్ ఇచ్చారు. అయితే, ఆశారాం ప్రత్యేక ఖైదీ హోదా అనుభవిస్తున్నారన్న వాదనను మాత్రం జైలు వర్గాలు కొట్టిపారేశాయి. -
ఆశారాంకు అంత భద్రత అనవసరం: సుప్రీంకోర్టు
బాలికపై అత్యాచారం కేసులో అరెస్టయిన ఆధ్యాత్మికవేత్త ఆశారాం బాపు కోసం ప్రభుత్వం అనవసరంగా భారీ భద్రత కల్పించిందంటూ సుప్రీంకోర్టు మండిపడింది. టీవీలలో చూస్తుంటే భారీ ఎత్తున ఆయనకు భద్రత కల్పించినట్లు తెలుస్తోందని జస్టిస్ జీఎస్ సింఘ్వీ, జస్టిస్ వి.గోపాల గౌడలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇది సరికాదని ప్రతి ఒక్కరూ అంటున్నా, సర్వసాధారణం అయిపోయిందంటూ జస్టిస్ సింఘ్వీ వ్యాఖ్యానించారు. అనవసరమైన వ్యక్తులకు భారీ స్థాయిలో కల్పిస్తున్న భద్రతను ఉపసంహరించుకోవాలని, వాళ్లు దాన్ని ఓ స్టేటస్ సింబల్‌లా ఉపయోగించుకుంటున్నారని చెబుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. బాలికపై అత్యాచారం కేసులో ఆశారాం బాపును రాజస్థాన్‌లో 14 రోజుల కస్టడీకి పంపిన విషయం తెలిసిందే. -
ఆశారాం బాపూకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ
-
'ఆశారాం బాపూపై కేసు బలంగా ఉంది'
జోథ్ పూర్: ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూపై నమోదైన కేసు చాలా బలంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు ఆశారాంపై ఆరోపణలు రావడంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ సందర్భంగా డీసీపీ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆశారాంను విచారించడానికి మరికొన్ని రోజులు గడువు కోరతామని ఆయన తెలిపారు. కాగా, ఆశారాం బాపూ న్యూమోనియాతో బాధ పడుతున్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు. అతను శారీరకంగా, మానసికంగా చాలా ధృడంగా ఉన్నారని తెలిపారు. ఆశారాంను త్వరలోనే కోర్టులో ప్రవేశపెట్టి మరికొన్ని రోజులు విచారణ అనుమతి కోరతామన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపును శనివారం రాత్రి ఇండోర్‌లో పోలీసులు అరెస్టు చేశారు. కాగా, ఆశారాం అరెస్టుకు ముందు హైడ్రామా నడిచింది. ఆయన పోలీసులకు చిక్కకుండా దాక్కున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే, ఆయన ఇండోర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆయన కుమారుడు నారాయణ్ సాయి చెప్పారు. -
'ఆశారాం బాపూపై కేసు బలంగా ఉంది'
జోథ్ పూర్: ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూపై నమోదైన కేసు చాలా బలంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు ఆశారాంపై ఆరోపణలు రావడంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ సందర్భంగా డీసీపీ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆశారాంను విచారించడానికి మరికొన్ని రోజులు గడువు కోరతామని ఆయన తెలిపారు. కాగా, ఆశారాం బాపూ న్యూమోనియాతో బాధ పడుతున్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు. అతను శారీరకంగా, మానసికంగా చాలా ధృడంగా ఉన్నారని తెలిపారు. ఆశారాంను త్వరలోనే కోర్టులో ప్రవేశపెట్టి మరికొన్ని రోజులు విచారణ అనుమతి కోరతామన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపును శనివారం రాత్రి ఇండోర్‌లో పోలీసులు అరెస్టు చేశారు. కాగా, ఆశారాం అరెస్టుకు ముందు హైడ్రామా నడిచింది. ఆయన పోలీసులకు చిక్కకుండా దాక్కున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే, ఆయన ఇండోర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆయన కుమారుడు నారాయణ్ సాయి చెప్పారు. -
14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి ఆశారాం
జోథ్ పూర్:ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూను 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ జోథ్ పూర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పదహారేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆశారాం ఆరోపణలు రావడంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ సందర్భంగా డీసీపీ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆశారాంను విచారించడానికి మరికొన్ని రోజులు పోలీసులు గడువు కోరడంతో కోర్టు సానుకూలంగా స్పందించింది. అతన్ని 14 రోజులు పోలీసుల కస్టడీలో ఉంచి దర్యాప్తు చేయాలని సూచించింది. అంతకుముందు మీడియాతో మాట్లాడిన డీసీపీ .. ఆశారాం బాపూ శారీరకంగా, మానసికంగా చాలా ధృడంగా ఉన్నారని తెలిపారు. న్యూమోనియాతో బాధ పడుతున్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపును శనివారం రాత్రి ఇండోర్‌లో పోలీసులు అరెస్టు చేశారు. కాగా, ఆశారాం అరెస్టుకు ముందు హైడ్రామా నడిచింది. ఆయన పోలీసులకు చిక్కకుండా దాక్కున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే, ఆయన ఇండోర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆయన కుమారుడు నారాయణ్ సాయి చెప్పారు. -
ఆసారాంకు మద్దతుగా నినదించిన అనుచరులు
న్యూఢిల్లీ: ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు అనుచరులు ఆయనకు మద్దతుగా స్థానిక ఇందిరాగాంధీ విమానాశ్రయం (ఐజీఐ) బయట నినాదాలు చేశారు. ఆశారాం నిందితుడు కాదన్నారు. కాగా మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆశారం ఆరోపణలు ఎదుర్కొంటున్న బాపును ఇండోర్‌లో అరెస్టు చేసిన సంగతి విదితమే. జోధ్‌పూర్‌కు తరలించేందుకుగాను స్థానిక విమానాశ్రయానికి ఆదివారం ఉదయం గం 9.30 నిమిషాల సమయంలో తీసుకొచ్చిన పోలీసులు వీఐపీ లాంజ్‌లో ఉంచారు. ఆ తర్వాత గం 11.20 నిమిషాలకు విమానంలో జోధ్‌పూర్‌కు త రలించారు. ఈ సమాచారం అందుకున్న ఆశారం అనుచరులు హంగామా సృష్టించారు. అనంతరం ఆశారాం మద్దతుదారురాలైన జ్యోతిసింగ్ అనే 32 ఏళ్ల యువతి మీడియాతో మాట్లాడుతూ ఆయన నిందితుడు కాదన్నారు. ఆయన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా ఇరికించారని ఆరోపించారు. , , -
ఆశారాం బాపు అరెస్టు
ఇండోర్/జోధ్‌పూర్: మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపును శనివారం రాత్రి ఇండోర్‌లో పోలీసులు అరెస్టు చేశారు. కాగా, ఆశారాంపై సమాచారం కోసం జోధ్‌పూర్ ఆశ్రమానికి వెళ్లిన ఇద్దరు టీవీ జర్నలిస్టులపై ఆయన అనుచరులు దాడి చేసి, తీవ్రంగా గాయపరచారు. ఆశారాం అనుచరులు తమపై దాడిచేసి, కెమెరా లాక్కున్నట్లు జర్నలిస్టులు ఆరోపించారు. ఈ సంఘటనకు సంబంధించి ఒక మహిళ సహా 13 మందిని జోధ్‌పూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఆశారాం అరెస్టుకు ముందు హైడ్రామా నడిచింది. ఆయన పోలీసులకు చిక్కకుండా దాక్కున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే, ఆయన ఇండోర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆయన కుమారుడు నారాయణ్ సాయి చెప్పారు.