ఆశారాం బాపుకు వైద్య పరీక్షలు | Supreme court directs medical examination of Asaram Bapu | Sakshi
Sakshi News home page

ఆశారాం బాపుకు వైద్య పరీక్షలు

Published Tue, Aug 19 2014 12:28 PM | Last Updated on Tue, Oct 9 2018 7:05 PM

ఆశారాం బాపుకు వైద్య పరీక్షలు - Sakshi

ఆశారాం బాపుకు వైద్య పరీక్షలు

న్యూఢిల్లీ : లైంగిక వేధింపుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నవివాదాస్పద స్వామిజీ ఆశారాం బాపుకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. నరాలకు సంబంధించిన వ్యాధి రావటంతో ఆయన తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న విషయం తెలిసిందే. వైద్య పరీక్షల కోసం న్యాయస్థానం ఓ వైద్య బృందాన్ని ఏర్పాటుకు ఆదేశించింది. ఈ మెడికల్ బోర్డు బృందం.... ఆశారాం బాపును పరీక్షించి, అవసరమైన చికిత్సపై నివేదిక అందించనుంది.

ఈ బృందం తన నివేదికను సెప్టెంబర్ 23లోగా సమర్పించనుంది. నివేదిక ఆధారంగా న్యాయస్థానం తదుపరి నిర్ణయం తీసుకోనుంది. కాగా మైనర్ బాలికపై లైంగిక దాడి చేసినట్లు వచ్చిన ఆరోపణలు రుజువు కావడంతో పోలీసులు 2013లో ఆశారాం బాపును అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాల మేరకు జోధ్‌పూర్ సెంట్రల్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. కాగా ఆశారాం బాపు తన బెయిల్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement