సూరత్‌కు చెందిన ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద ఆథ్యాత్మిక గురువు ఆశారాం బాపూ భార్య, కుమార్తెలను పోలీసులు ఆదివారం విచారించారు.
అహ్మదాబాద్: సూరత్‌కు చెందిన ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద ఆథ్యాత్మిక గురువు ఆశారాం బాపూ భార్య, కుమార్తెలను పోలీసులు ఆదివారం విచారించారు. ఆశారాం భార్య లక్ష్మి, కుమార్తె భారతిలను ఉగ్రవాద వ్యతిరేక దళం కార్యాలయంలో ప్రత్యేక విచారణ బృందం ప్రశ్నించినట్లు ఓ పోలీస్ అధికారి తెలిపారు.
అహ్మదాబాద్‌లోని ఆశ్రమంలో ఆశారాం 1997 నుంచి 2006 మధ్య కాలంలో తనపై పలుసార్లు అత్యాచారం చేసినట్లు సూరత్‌కు చెందిన ఒక మహిళ ఫిర్యాదు చేసింది. ఓ సందర్భంలో ఆశారాం భార్య, కుమార్తె ఇందుకు సహకరించినట్లు పేర్కొంది. ఆశారాం కుమారుడు నారాయణ్‌సాయి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలి సోదరి కూడా ఫిర్యాదు చేసింది. తాను సూరత్ ఆశ్రమంలో ఉండగా నారాయణ శాయి 2002-2005 మధ్య కాలంలో తరచూ తనపై అత్యాచారం చేసిట్లు చెల్లెలు ఆరోపించింది.
మరోవైపు ఆశారాం పోలీస్ కస్టడీని ఈనెల 22వ తేదీ వరకు పొడిగిస్తూ గాంధీనగర్ మేజిస్ట్రేట్ కోర్టు శనివారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.