రెండోదశ కింద ఐదు జిల్లాల్లో పర్యటనలు... 25, 26 తేదీల్లో కమిషన్ కార్యాలయంలో కార్యక్రమం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సామాజికంగా, విద్యా పరంగా వెనుకబడిన తరగతుల వారి స్థితిగతులను అధ్యయనం చేసే క్రమంలో తెలంగాణ బీసీ కమిషన్ రెండోదఫా బహిరంగ విచారణ కార్యక్రమాలు నిర్వహించనుంది. గత నెలలో ఐదురోజుల పాటు ఐదు ఉమ్మడి జిల్లాల్లో కమిషన్ బృందం పర్యటించింది. రెండో విడతగా ఈనెల 18వ తేదీనుంచి 26వతేదీ వరకు మిగిలిన జిల్లాల్లో, ఆలా గే హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని బీసీ కమిషన్ రాష్ట్ర కార్యాలయంలో బహిరంగ విచారణ ప్రక్రియ చేపట్టనుంది.
ఈ సందర్భంగా వివిధ వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ జరపడంతో పాటు వినతిపత్రాలను కూడా స్వీకరిస్తుంది. 25, 26వ తేదీల్లో రాష్ట్ర కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సంబంధించి బహిరంగ విచారణ చేపట్టనుంది. ఈ మేరకు తెలంగాణ బీసీ కమిషన్ జిల్లాల వారీగా షెడ్యూల్ విడుదల చేసింది.
సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలి
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలని బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ శుక్రవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఈ సమగ్ర సర్వే తెలంగాణ బీసీ కమిషన్‌కు అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఎన్యూమరేటర్లు ఏ రోజు, ఏ ప్రాంతం, ఏయే కుటుంబాల వద్దకు వెళతారో ముందస్తు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజలు ఖచి్చతమైన సమాచారం ఇస్తేనే వెనుకబాటుకు సంబంధించిన సమాచారం తెలుస్తుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment