BC commission
-
రెండ్రోజుల్లో డెడికేటెడ్ బీసీ కమిషన్ నివేదిక!
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన తుది నివేదికపై కసరత్తును డెడికేటెడ్ బీసీ కమిషన్ దాదాపుగా పూర్తి చేసింది. తుది మెరుగులు అనంతరం రెండ్రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించేందుకు సిద్ధమవుతోంది. ఈ నివేదిక ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయనుండడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. కోర్టు తీర్పునకు లోబడి రిజర్వేషన్ల సీలింగ్‌లో మార్పు లేకుండా ఈ కమిషన్ సిఫారసు చేసే అవకాశం ఉన్నట్లుసమాచారం. నివేదిక అందిన వెంటనే ప్రభుత్వం స్థానిక రిజర్వేషన్లు ఖరారు చేస్తుందని, ఆ తర్వాత స్థానిక ఎన్నికలకు నగారా మోగే అవకాశం ఉందని తెలుస్తోంది. మూడు నెలలు కసరత్తు డెడికేటెడ్ కమిషన్ దాదాపు మూడు నెలలు బీసీ రిజర్వేషన్ల ఖరారుపై కసరత్తు చేసింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలన, దానికి అనుగుణంగా ప్రభుత్వానికి సూచనలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నవంబర్ 4వ తేదీన డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కమిషన్‌కు చైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బూసాని వెంకటేశ్వరరావును, సభ్య కార్యదర్శిగా బీసీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి బి.సైదులను నియమించింది. నెలరోజుల్లోగా రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించాలని పేర్కొంది. ప్రణాళిక శాఖ నుంచి గణాంకాల సేకరణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే గణాంకాలను రాష్ట్ర ప్రణాళిక శాఖ ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బీసీ జనాభా, ఇతర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రణాళిక శాఖ డెడికేటెడ్ కమిషన్‌కు సమర్పించినట్లు సర్వేకు సంబంధించి ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కాగా ఆ గణాంకాలను నివేదిక రూపకల్పనలో డెడికేటెడ్ కమిషన్ పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.మరోవైపు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ కమిషన్ ఉమ్మడి జిల్లాల వారీగా పర్యటనలు, బహిరంగ విచారణలు చేపట్టడంతో పాటు కమిషన్ కార్యాలయంలో పలు దఫాలుగా వినతులు, ఆర్జీలు, అభ్యంతరాలను స్వీకరించింది. అవన్నీ లోతుగా పరిశీలించింది. అదే విధంగా తెలంగాణ బీసీ కమిషన్ చేపట్టిన అధ్యయనాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరించి విశ్లేషించినట్లు తెలిసింది. అన్ని అంశాలు, గణాంకాలు క్రోడీకరించిన కమిషన్ తుది నివేదికను కొలిక్కి తీసుకు వచ్చినట్లు తెలిసింది. -
ఎనిమిది కులాల పేర్లు మార్పు!
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల్లోని ఎనిమిది కులాల పేర్లను మా ర్పు చేసేందుకు తెలంగాణ బీసీ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయా కులాల పేర్లను తిట్ల రూపంలో వాడుతున్నారని, దీంతో కులం పేరు చెప్పేందుకు ఇబ్బందికరంగా ఉందని దొమ్మర, పిచ్చకుంట్ల, తమ్మలి, బుడబుక్కల, కుమ్మరి, చాకలి, చిప్పోలు, వీరముష్టి కులాలకు చెందిన ప్రతినిధులు పలు సందర్భాల్లో బీసీ కమిషన్‌కు పెద్ద సంఖ్యలో వినతులు సమర్పించారు.ఈ అంశంపై స్పందించిన బీసీ కమిషన్ తాజాగా పేర్ల మార్పునకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 18వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు ప్రకటించింది. అభ్యంతరాలను ఖైరతాబాద్‌లోని తెలంగాణ బీసీ కమిషన్ కార్యాలయంలో ప్రభుత్వ పనివేళల్లో స్వీకరించనున్నట్లు వివరించింది. -
18 నుంచి బీసీ కమిషన్ విచారణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సామాజికంగా, విద్యా పరంగా వెనుకబడిన తరగతుల వారి స్థితిగతులను అధ్యయనం చేసే క్రమంలో తెలంగాణ బీసీ కమిషన్ రెండోదఫా బహిరంగ విచారణ కార్యక్రమాలు నిర్వహించనుంది. గత నెలలో ఐదురోజుల పాటు ఐదు ఉమ్మడి జిల్లాల్లో కమిషన్ బృందం పర్యటించింది. రెండో విడతగా ఈనెల 18వ తేదీనుంచి 26వతేదీ వరకు మిగిలిన జిల్లాల్లో, ఆలా గే హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని బీసీ కమిషన్ రాష్ట్ర కార్యాలయంలో బహిరంగ విచారణ ప్రక్రియ చేపట్టనుంది.ఈ సందర్భంగా వివిధ వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ జరపడంతో పాటు వినతిపత్రాలను కూడా స్వీకరిస్తుంది. 25, 26వ తేదీల్లో రాష్ట్ర కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సంబంధించి బహిరంగ విచారణ చేపట్టనుంది. ఈ మేరకు తెలంగాణ బీసీ కమిషన్ జిల్లాల వారీగా షెడ్యూల్ విడుదల చేసింది. సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలని బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ శుక్రవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఈ సమగ్ర సర్వే తెలంగాణ బీసీ కమిషన్‌కు అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఎన్యూమరేటర్లు ఏ రోజు, ఏ ప్రాంతం, ఏయే కుటుంబాల వద్దకు వెళతారో ముందస్తు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజలు ఖచి్చతమైన సమాచారం ఇస్తేనే వెనుకబాటుకు సంబంధించిన సమాచారం తెలుస్తుందని పేర్కొన్నారు. -
మార్చండి.. మా కులాన్నీ చేర్చండి
సాక్షిప్రతినిధి, వరంగల్: ‘బీసీల్లోని ఏబీసీడీఈ వర్గాలను పునర్వర్గీకరణ చేయాలి. బీసీ కులాలను అవమాన పరిచేవారిని కట్టడి చేసేందుకు ‘బీసీ అట్రాసిటీ యాక్ట్’ను తీసుకు రావాలి. దూదేకుల కులం వారిని బీసీ–డీ నుంచి బీసీ–సీలోకి, సగర ఉప్పర కులçస్థులను బీసీ–డీ నుంచి బీసీ–ఏ లోకి, ముదిరాజ్‌లను బీసీ–డీ నుంచి బీసీ–ఏలోకి, ఒడ్డెర కులస్థులను బీసీ–ఏ నుంచి షెడ్యూల్ తెగ (ఎస్టీ)లోకి మార్చాలి’అని శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రాష్ట్ర బీసీ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఆయా వర్గాల నుంచి వినతులు వెల్లు్లవెత్తాయి. స్థానిక సంస్థల్లో కల్పించాల్సిన రిజర్వేషన్ల దామాషాను ఖరారు చేసే అంశంపై బీసీ కమిషన్ ఆయా వర్గాలనుంచి అభిప్రా యాలను సేకరిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కులాలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని, ఇంతవరకు రాజకీయ ప్రాతినిధ్యంలేని కులాలకు అవకాశం ఇవ్వాలని, వీరముష్టి పదం తొలగించి ఆ కులం వారికి ‘వీరభద్ర’పదాన్ని వాడాలని కమిషన్‌కు విన్నవించుకు న్నారు. రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మిలు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, బీసీ కులసంఘాల నాయకుల నుంచి అభిప్రాయాలు సేకరించారు.ఇది బృహత్తర కార్యక్రమం: గోపిశెట్టి నిరంజన్తెలంగాణలో స్థానిక సంస్థల వారీగా రిజర్వేషన్ దామాషాను ఖరారు చేసేందుకు ప్రభుత్వం బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ అన్నారు. బహిరంగ విచారణలో మొత్తం 235 అభ్యర్థనలు కమిషన్‌కు అందాయని తెలిపారు. హనుమకొండలోని బాలికల హాస్టల్లో వసతులు సరిగా లేవని ఫిర్యాదు అందిందని ఆ సమస్యలకు పరిష్కారం చూపుతామని నిరంజన్ స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ అమలుపై హైకోర్టు ఏ నిర్ణయం తీసుకున్న గౌరవిస్తామన్నారు. కానీ, ఇప్పటివరకు హైకోర్టు తీసుకున్న నిర్ణయాలు, ఆదేశాలు తమకు అందలేదన్నారు. -
పంచాయతీ ఎన్నికలపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
సాక్షి,హైదరాబాద్: వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం(జులై 26) సెక్రటేరియట్లో పంచాయతీరాజ్ శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ ఎన్నికల నిర్వహించడంపై అధికారులతో చర్చించారు. ఆగస్టు తొలివారంలోగా కొత్త ఓటరు లిస్టు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఓటరు జాబితా పూర్తయిన తర్వాత గడువులోగా నివేదిక ఇవ్వాలని బీసీ కమిషన్‌ను సీఎం కోరారు. బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఈ రివ్యూలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ వి.కృష్ణ మోహన్, సీఎస్ శాంతి కుమారి, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. -
స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్
సాక్షి, కామారెడ్డి: కులగణన, బీసీ కమిషన్ నివేదికల ఆధారంగా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇ చ్చింది. ఈ రిజర్వేషన్లను ప్రస్తుతమున్న 23శాతం నుంచి 42శాతానికి పెంచడం ద్వారా పంచాయతీలు, మున్సిపాలిటీలలో కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం లభిస్తుందని తెలిపింది. శుక్రవారం కామారెడ్డిలో నిర్వహించిన సభలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ‘బీసీ డిక్లరేషన్’ను ప్రకటించగా.. ముఖ్య అతిథిగా హాజరైన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అందులోని అంశాలను వివరించారు. డిక్లరేషన్‌లోని అంశాలివీ.. ♦ మహాత్మా జ్యోతిరావు పూలే పేరిట బీసీ సబ్‌ప్లాన్‌కు అసెంబ్లీ తొలిసెషన్‌లోనే చట్టబద్ధత కల్పిస్తాం. బీసీ సంక్షేమానికి ఏటా రూ.20వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు కేటాయిస్తాం. ♦ ఎంబీసీ కులాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఎంబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు. అన్ని బీసీ కులాల సమగ్రాభివృద్ధి కోసం కార్పొరేషన్లు. బీసీ యువత ఉన్నత చదువుల కోసం, చిరు వ్యాపారాలు చేసుకునేందుకు రూ.10 లక్షల వరకు పూచీకత్తు లేని, వడ్డీలేని రుణాలు. ♦ అన్ని జిల్లా కేంద్రాల్లో రూ.50 కోట్లతో ఓ కన్వెన్షన్ హాల్, ప్రెస్ క్లబ్, స్టడీ సర్కిల్, లైబ్రరీ, క్యాంటీన్లతో కూడిన ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యతా భవనాల నిర్మాణం. బీసీ ఐక్యతా భవన్‌లోనే జిల్లా బీసీ సంక్షేమ కార్యాలయం ఏర్పాటు. ♦ ప్రతి మండలంలో నవోదయ విద్యాలయాలతో సమానంగా బీసీలకు ఒక కొత్త గురుకులం. ప్రతి జిల్లాలో ఒక కొత్త డిగ్రీ కాలేజీ. రూ.3 లక్షల కంటే తక్కువ వార్షికాదాయం ఉన్న బీసీ విద్యార్థులకు ర్యాంకుతో సంబంధం లేకుండా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్. ♦ వృత్తి బజార్ పేరుతో ప్రతి మండలంలో 50దుకాణాల షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం. అందులో మంగలి, వడ్రంగి, చాకలి, కమ్మరి, స్వర్ణకారుల వంటి చేతివృత్తుల వారికి ఉచితంగా షాపులు పెట్టుకునే స్థలం. ♦ గీత కార్మికులు, చేనేతలకు ఉన్నట్టుగా 50ఏళ్ల వృద్ధాప్య పింఛన్ వయోపరిమితి అన్ని చేతివృత్తుల వారికి వర్తింపు. బీసీ కార్పొరేషన్లు, ఫెడరేషన్ల కింద నమోదైన ప్రతి సొసైటీకి ఎన్నికల నిర్వహణ, రూ.10 లక్షల ఆర్థిక సాయం. కులాల వారీగా ప్రత్యేక పథకాలు, హామీలు ♦ జీవో నం.19/02/2009ను పునరుద్ధరించి.. ముదిరాజ్, ముత్రాసు, తెనుగోళ్లు తదితర కులా లను బీసీ డీ నుంచి బీసీ ఏ గ్రూపులోకి మార్చడం. ♦ గంగపుత్రులకు సంబంధించి మత్స్యకార హక్కులకు.. ఇతర మత్స్యకార సామాజిక వర్గాల మధ్య పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారం. ఇందుకోసం తెలంగాణ మత్స్య అభివృద్ధి బోర్డు ఏర్పాటు. ఆక్వాకల్చర్‌కు ప్రోత్సాహం. క్యాప్టివ్ సీడ్, నర్సరీలు, మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి ఏర్పాట్లు. ♦ గొల్లకురుమలకు అధికారంలోకి వ చ్చిన వంద రోజుల్లో రెండో దశ గొర్రెల పంపిణీ. ♦ గౌడ్ కులస్తులకు ఈతచెట్ల పెంపకం కోసం ప్రతి గ్రామంలో ఐదెకరాల భూమి. ఈత మొక్కలు, బిందు సేద్యం, కాంపౌండ్ వాల్ నిర్మాణాలపై 90శాతం సబ్సిడీ. మద్యం దుకాణాల లైసెన్సుల్లో గౌడ్లకు ప్రస్తుతమున్న రిజర్వేషన్ 15శాతం నుంచి 25శాతానికి పెంపు. జనగామ జిల్లాకు సర్వాయి పాపన్నగౌడ్ జనగాం జిల్లాగా పేరు మార్పు. ♦ మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు. యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు సబ్సిడీ రుణాలు. ♦ పద్మశాలీలకు జగిత్యాల, నారాయణపేట, భువనగిరిలలో మెగా పవర్‌లూం క్లస్టర్ల ఏర్పాటు. పవర్‌లూమ్స్, పరికరాలపై 90 శాతం సబ్సిడీ. ♦ విశ్వకర్మలకు 90శాతం సబ్సిడీతో టూల్కిట్లు. పట్టణ ప్రాంతాల్లో దుకాణాల ఏర్పాటుకు భూమి కేటాయింపు. ♦ రజక యువతకు పట్టణాల్లో లాండ్రోమెట్స్ ఏర్పాటు కోసం రూ.10 లక్షల ఆర్థిక సాయం. రాష్ట్రవ్యాప్తంగా ధోబీఘాట్ల ఆధునీకరణ కోసం ప్రతి జిల్లాకు రూ.10 కోట్లు కేటాయింపు. -
త్వరలో దక్షిణాది బీసీ కమిషన్ల సదస్సు
సాక్షి, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల్లోని బీసీ కమిషన్లతో త్వరలో సదస్సు నిర్వహించనున్నట్లు తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ వెల్లడించారు. ఈ దిశగా ఏర్పాట్లు వేగవంతం చేశామన్నారు. కర్ణాటక రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జయప్రకాశ్ హెగ్డే నేతృత్వంలోని బృందం గురువారం రాష్ట్రానికి వచ్చింది. తెలంగాణ బీసీ కమిషన్ కార్యా లయాన్ని సందర్శించింది. ఇక్కడ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల తీరును అడిగి తెలుసుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాల సదస్సును విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఇటీవల జారీ చేసిన టరమ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఆధారంగా నిర్ధిష్టమైన పద్దతిలో అధ్యయనం ప్రారంభించామన్నారు. ఈ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. బీసీలకు బాసటగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన వివరించారు. అనంతరం టీ–బీసీ కమిషన్ సభ్యులు కిషోర్‌గౌడ్, సీహెచ్ ఉపేంద్ర, శుభప్రద్‌పటేల్ తదితరులు కర్నాటక ప్రతినిధి బృందానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. -
ఇంజనీరింగ్ యాజమాన్య కోటాలోనూ రిజర్వేషన్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ యాజమాన్య సీట్లలో రిజర్వేషన్ అమలు చేయాలని, ఈ దిశగా విస్తృత చర్చ చేపట్టాలని జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి తల్లోజు అభిప్రాయపడ్డారు. ఈమేరకు ఆయన అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఛైర్మన్‌కు ఇటీవల లేఖరాశారు. ఇంజనీరింగ్ కన్వీనర్ కోటా సీట్ల పంపిణీలో రిజర్వేషన్ అమలవుతోందని, ఆర్టికల్ 74 ఇందుకు అవకాశం కల్పించిందని పేర్కొన్నారు. అయితే, యాజమాన్య కోటా (బీ కేటగిరీ) సీట్ల భర్తీలో ఈ అవకాశం లేకపోవడం వల్ల బీసీలకు అన్యాయం జరుగుతోందని తెలిపారు. యాజమాన్యాలు బీ కేటగిరీ సీట్లను ఇష్టానుసారం అధిక రేట్లకు అమ్ముకుంటున్నాయని, డబ్బున్న వాళ్లకే సీట్లు వస్తున్నాయని తెలిపారు. ఈ విధానంలో మార్పు కోసం దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరముందని ఆచారి తెలిపారు. (చదవండి: వైద్య విద్య కఠినతరం .. ‘ఎగ్జిట్’ దాటితేనే ఎంట్రీ) -
తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మన్‌గా వకుళాభరణం కృష్ణమోహన్‌రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మన్‌గా వకుళాభరణం కృష్ణమోహన్‌రావును నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకుంది. బీసీ కమిషన్ సభ్యులుగా ఉపేంద్ర, శుభప్రద్ పటేల్, కిషోర్ గౌడ్‌ని నియమించింది. -
బీసీల హక్కులు కాలరాసే ప్రభుత్వాలపై ఉద్యమం
సాక్షి, న్యూఢిల్లీ: అన్ని రాష్ట్రాల్లో బీసీ కమిషన్లు ఏర్పాటు చేయడంతో పాటు చట్టబద్ధత కల్పించాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. జాతీయ బీసీ కమిషన్ మాదిరిగా రాష్ట్రాల్లో బీసీ కమిషన్లు పనిచేయాలని కోరుతున్నామన్నారు. ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ ముస్లింలను ఓబీసీ జాబితాల్లో చేర్పించి బీసీల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలపై ఆయా రాష్ట్రాల్లో ఓబీసీ మోర్చా పెద్దఎత్తున ఉద్యమం చేస్తుందని హెచ్చరించారు. గురువారం ఢిల్లీలోని ఓబీసీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ సంగమ్‌లాల్ గుప్తా నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
'26 కులాలకు రిజర్వేషన్ తొలిగింపు..విద్యార్థులకు తీవ్ర నష్టం'
ఢిల్లీ: ఏపీకి చెందిన 26 బీసీ కులాలకు తెలంగాణలో రిజర్వేషన్ పునరుద్ధరణపై బీసీ సంఘాల నేతలు, విద్యార్థులు జాతీయ బీసీ కమిషన్‌ను కలిశారు. ఈ సందర్భంగా బీసీ కులాల పోరాట కమిటీ అధ్యక్షుడు ఆళ్ల రామకృష్ణ మాట్లాడుతూ..'తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే 26 కులాలకు రిజర్వేషన్ తొలగించింది. 6 దశాబ్దాలుగా ఈ కులాలవారు తెలంగాణలో స్థిరనివాసం ఏర్పాటుచేసుకుని జీవిస్తున్నారు. గౌడ కులంలో శెట్టిబలిజ ఉపకులంగా ఉంది. ప్రభుత్వ నిర్ణయంతో శెట్టిబలిజలకు రిజర్వేషన్ లేకుండా పోయింది. తెలంగాణలో స్థిరపడ్డవారంతా భవన నిర్మాణ కార్మికులుగా, వడ్రంగి, టైలరింగ్ వంటి స్కిల్డ్, అన్‌స్కిల్డ్ పనులు చేసుకుంటున్నారు. గత 6ఏళ్లుగా రిజర్వేషన్లు లేక విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు' అని పేర్కొన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టులో వేసిన కేసులో తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడం లేదని, జాతీయ బీసీ కమిషన్ నివేదిక కోరినా సమర్పించడం లేదని ధ్వజమెత్తారు. రిజర్వేషన్ కోల్పోయిన 26 కులాలకు వెంటనే రిజర్వేషన్ పునరుద్ధరించాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ను కోరారు. -
బండి సంజయ్ అరెస్ట్; సీఎస్, డీజీపీకి నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అరెస్ట్‌పై జాతీయ బీసీ కమిషన్ స్పందించింది. సంజయ్ మీద పోలీసుల దురుసు ప్రవర్తనపై సుమోటోగా కేసు నమోదు చేయాలని తెలంగాణ సీఎస్, డీజీపీకి నోటీసులు జారీ చేసింది. నవంబర్ 5లోగా నివేదిక ఇవ్వాలని జాతీయ బీసీ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని, ఎంపీనని కూడా చూడకుండా తనపై పోలీసులు దాడి చేశారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై పార్లమెంటు ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. సిద్ధిపేట సీపీ, సీఎం కేసీఆర్ సంగతి తేలుస్తానని హెచ్చరించారు. తనపై దాడికి పాల్పడిన సీపీపై క్రిమినల్ కేసులు పెట్టాలని, సస్పెండ్ చేయాలని ట్విటర్ వేదికగా కోరారు. చదవండి: దుబ్బాక రాజకీయం.. నోట్లకట్టల లొల్లి కాగా దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా సోమవారం సిద్దిపేటలోని లెక్చరర్స్ కాలనీ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు మామ సురభి రాంగోపాల్‌రావు, పక్కనే ఉన్న సురభి అంజన్‌రావు ఇంటిలో సిద్దిపేట అర్బన్ తహసీల్దార్ (ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్) ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో అంజన్‌రావు ఇంట్లో రూ.18.67 లక్షలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ డబ్బులు పోలీసులే తీసుకొచ్చి అక్కడ పెట్టి డబ్బులు దొరికాయని ప్రచారం చేస్తున్నారంటూ... బీజేపీకి చెందిన పలువురు సంఘటనా స్థలానికి చేరుకుని నినాదాలు చేశారు. బీజేపీ నేతల ఆరోపణలు అవాస్తవం: సీపీ ఈ క్రమంలో సిద్దిపేటలో రఘునందన్ రావు ఇంట్లో జరిగిన సోదాల గురించి తెలుసుకున్న బండి సంజయ్ సిద్దిపేటకు బయలుదేరారు. అయితే సిద్దిపేటలో సంజయ్‌ని అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. అయితే అరెస్ట్ చేసిన బండి సంజయ్‌ని సిద్దిపేట నుంచి కరీంనగర్‌కి తీసుకెళ్లారు. సిద్దిపేటలో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆయన సోమవారం రాత్రి దీక్ష చేపట్టారు. చదవండి: సీపీని సస్పెండ్ చేయాలి: బండి సంజయ్ -
క్రీమీ లేయర్ పరిమితిని 30 లక్షలకు పెంచాలి
సందర్భం ఒకవేళ కేంద్ర ప్రభుత్వం బి.పి. శర్మ కమిటీ నివేదికను ఆమోదించి ఉద్యోగుల జీతాలను సంపన్న శ్రేణి నిర్ధారణలో కలిపినట్లయితే దేశంలో కోట్ల మంది ఓబీసీ విద్యార్థులు, నిరుద్యోగ యువత రిజర్వేషన్లు కోల్పోతారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న బీసీ రిజర్వేషన్లు కూడా కోల్పోవలసి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం దేశంలో ఓబీసీలను గుర్తించి రిజర్వేషన్ల అమలుకు 1953–55లో మొదటి జాతీయ బీసీ కమిషన్ నియమించింది. కానీ సదరు నివేదికను బుట్టదాఖలు చేసింది. రెండవ జాతీయ బీసీ కమిషన్‌ను 1978–80లో బి.పి. మండల్ అధ్యక్షతన ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ 41 సిఫార్సులతో 1980లో నివేదిక సమర్పించినప్పటికీ 1990 వరకు ఇనుప బీరువాలో భద్ర పరిచారు. మండల్ తీర్పు ద్వారా 1993 నుండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. అప్పటికే కేంద్రంలో లక్షలాది ఉద్యోగాల భర్తీ జరిగి పోయింది. మరొకవైఫు ప్రైవేటీకరణ మొదలైంది. ఫలితంగా ఓబీసీల ప్రాతినిధ్యం గ్రూపు–ఏ 13%, గ్రూపు–బి 14%, గ్రూపు–సి 22%, గ్రూపు–డి 14% మొత్తం సరాసరి 21% శాతానికి మించిలేదు. సామాజికంగా, విద్యాపరంగా వెనుక బడిన తరగతులకు సంబంధించిన రిజర్వేషన్లు కులాల పరంగా అమలు జరపవలసిన రిజర్వేషన్లు కావు. అయినప్పటికీ సామాజికంగా వెనుకబాటుకు ప్రామాణికం మన దేశంలో కులమే కాబట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కులాలను ఓబీసీ/ బీసీ జాబితాల్లో చేర్చి రిజర్వేషన్లు అమలు చేస్తున్నాయి. కావున ఆయా కులాల్లో సామాజికంగా వృద్ధి చెందిన వారిని ఓబీసీ రిజర్వేషన్ల నుండి తొలగించి మిగతా వారికీ 27% కేంద్రంలో అమలు చేసుకోవడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అందుకు కేంద్రం 1993లో జాతీయ స్థాయిలో ఓబీసీల్లో సంపన్న శ్రేణి వారిని గుర్తించడానికి జస్టిస్ రామ్ నందన్ ప్రసాద్ అధ్యక్షతన కమిటీని వేసింది. కమిటీ ఆరు తరగతులలో ఉన్నవారి సంతానాన్ని గుర్తించింది. 1.రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్నవారు. 2.గ్రూపు–1 లేదా తల్లి – తండ్రి గ్రూపు–2లో నియమించ బడిన వారు. 3.ఆర్మీ, పారా మిలటరీలలో కల్నల్ లేదా ఆ పై స్థాయి అధికారులు. 4. వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తల పిల్లలు. 5.స్థిర, చరాస్తులు కల్గినవారు. 6. ఆదాయ పరిమితి. చివరిదైన ఆదాయ పరిమితిలో ఉద్యోగుల జీత భత్యాలు మరియు వ్యవసాయ ఆదాయాన్ని మినహాయించారు. మొదట 1993లో వార్షిక ఆదాయం ఒక్క లక్షగా నిర్ధారించారు. ప్రతి మూడు సంవత్సరాలకు సమీక్షించి ఆదాయ పరిమితిని పెంచాలని స్పష్టంగా ఉత్తర్వుల్లో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల్లో 27 సంవత్సరాల నుండి ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేస్తోంది. అనగా నేటికి ఆదాయ పరిమితిని తొమ్మిదిసార్లు సమీక్షించి పెంచి ఉంటే వార్షిక ఆదాయ పరిమితి ముప్పై లక్షల్లో ఉండేది. కానీ కేవలం నాలుగుసార్లు మాత్రమే సమీక్షించి ఎనిమిది లక్షలుగా ఉద్యోగుల జీతభత్యాలు, వ్యవసాయ ఆదా యాన్ని మినహాయించి నిర్ధారించారు. ఇదే విధానాన్ని అన్ని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. అనేక సందర్భాల్లో ఈ విధానానికి సుప్రీం కోర్టు ఆమోదం తెలిపింది. కేంద్రంలో 1989లో జనతాదళ్ ప్రభుత్వం వి.పి. సింగ్ ప్రధానిగా బీజేపీ మద్దతుతో ఏర్పడింది. 1990లో ఓబీసీలకు 27% రిజర్వేషన్లు కేంద్ర ఉద్యోగాల్లో ప్రకటిం చగానే బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించు కుంది. మొదటి నుండి ఓబీసీ రిజర్వేషన్ల పట్ల బీజేపీ వైఖరి ఏమిటో దీనివల్ల అర్థం అవుతుంది. బీజేపీ 2014లో సొంత మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. బీసీల పక్షాన ఉన్నట్లుగా నటిస్తూ జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా అధికారాలను కల్పించింది. ఉత్తర భారతదేశంలోని జాట్ కులస్తులు, గుజరాత్లో పటేళ్లు, మహారాష్ట్రలో మరాఠాలు, ఆంధ్రప్రదేశ్‌లో కాపులు, ఇతర అగ్రకులాల వారు ఓబీసీ జాబితాలో తమను చేర్చాలని రాజకీయ ఉద్యమాలు చేస్తున్నారు. ఈ రాజకీయ ఒత్తిడికి తగ్గింపు చర్యగా 2019 జనవరిలో 103వ రాజ్యాంగ సవ రణ ద్వారా అగ్ర కులాల్లోని పేదలకు 10% రిజర్వేషన్లు ప్రవేశపెట్టింది. 2019లో బి.పి.శర్మ అధ్యక్షతన ముగ్గురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. 2017కి సంబంధిం చిన సివిల్ సర్వీసెస్ ఓబీసీ అభ్యర్థుల సమస్య పరి ష్కారం, ఓబీసీలకు సంబంధించిన క్రీమీలేయర్ విధా నాన్ని సరళీకృతం చేసి ఆదాయ పరిమితిని పెంచాలని ఈ కమిటీని ఏర్పాటు చేసింది. కానీ కమిటీలో ఒక్క సభ్యుడు కూడా ఓబీసీ కులానికి చెందినవారు లేకపోవడం బీజేపీ వెనుక రిజర్వేషన్ల వ్యతిరేక హిందుత్వ శక్తులు ఎంత శక్తి మంతంగా పని చేస్తున్నాయో తెలియజేస్తోంది. ఓబీసీల సంక్షేమం, ఇతర సమస్యలపై రాజ్యాంగ బద్ధమైన బీసీ కమిషన్‌ను నియమించిన తర్వాత బి.పి. శర్మ కమిటీకి చట్టబద్ధత, రాజ్యాంగ బద్ధత లేదని గమనించాలి. బి.పి శర్మ కమిటీ ఓబీసీ కుల సంఘాలతో, ఉద్యోగ సంఘా లతో, రాజకీయ పార్టీలతో సంప్రదించకుండా ఏక పక్షంగా అశాస్త్రీయంగా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల జీత భత్యాలను కలిపి క్రిమీలేయరు వార్షిక ఆదాయ పరిమితిని 8 లక్షల నుండి 12 లక్షలకు పెంచాలని నివేదిక సమ ర్పించింది. కేంద్రం వెంటనే కేబినెట్ నోట్ తయారు చేయడం రాజ్యాంగ తప్పిదంగా భావించాలి. ఒక వైపు రాజ్యాంగ బద్ధమైన ఓబీసీ పార్లమెంటరీ కమిటీ అధ్యక్షులు గణేష్ సింగ్ ఆధ్వర్యంలో సమర్పించిన నివేదికలో క్రీమీలేయరు వార్షిక ఆదాయాన్ని ఉద్యోగుల జీతభత్యాలు, వ్యవసాయ ఆదాయం మినహాయింపుతో 8 లక్షల నుండి 15 లక్షలకు పెంచాలని ప్రభుత్వానికి సూచించింది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం బి.పి. శర్మ కమిటీ నివేదికను ఆమోదించి ఉద్యోగుల జీతాలను సంపన్న శ్రేణి నిర్ధారణలో కలిపినట్లయితే దేశంలో కోట్లమంది ఓబీసీ విద్యార్థులు, నిరుద్యోగ యువత రిజర్వేషన్లు కోల్పోతారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న బీసీ రిజర్వేషన్లు కూడా కోల్పోవలసి వస్తుంది. దేశంలో 70 కోట్ల మందికి సంబంధించిన రిజర్వేషన్లపై చర్చ జరుగుతున్నప్పుడు జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలు స్పందించకపోవడం వారికి ఓబీసీ రిజర్వేషన్ల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఎంతో అర్థం అవుతోంది. ఇప్పటివరకు తమిళనాడు నుండి డీఎంకే పార్టీ బి.పి. శర్మ కమిటీ నివేదికను రద్దు చెయ్యాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ లేఖను సమర్పించింది. అదే విధంగా అన్ని రాజకీయ పార్టీలు స్పందించాలి. క్రీమీలేయరు వార్షిక ఆదాయాన్ని ఉద్యోగుల జీతభత్యాలు, వ్యవసాయ ఆదాయం మినహాయింపుతో 8 లక్షల నుండి 30 లక్షలకు పెంచాలని డిమాండ్ చేయాలి. వ్యాసకర్త జాతీయ అధ్యక్షులు, జాతీయ ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం మొబైల్ : 94909 59625 కోడెపాక కుమార స్వామి -
బీసీ జాబితాలోకి కొత్తగా 18 కులాలు!
సాక్షి, హైదరాబాద్ : వెనుకబడిన తరగతుల్లో మరో 18 కులాలు చేర్చే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. సంచార జాతులు, ఆశ్రిత కులాలను బీసీల్లో చేర్చే అంశంపై రాష్ట్ర బీసీ కమిషన్ ఇదివరకే బహిరంగ విచారణతో పాటు క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసి నివేదిక రూపొందించింది. ఇందులో ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి పొందకుండా కేవలం ఇతర కులాలపై ఆశ్రయం పొందుతున్నవే ఎక్కువగా ఉన్నాయి. గత నెల 28తో గడువు ముగిసే క్రమంలో చివరిరోజున బీసీ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. వాస్తవానికి 30 కులాలను బీసీ కేటగిరీలో చేర్చాలనే డిమాండ్‌తో క్షేత్రస్థాయి నుంచి ప్రభుత్వానికి వినతులు వచ్చాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం అధ్యయనంచేసి నివేదిక సమర్పించాలని రాష్ట్ర బీసీ కమిషన్‌ను ఆదేశించింది. దీంతో బీసీ కమిషన్ ఆమేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలో పూర్తిస్థాయి వివరాలు, ఆధారాలతో బహిరంగ విచారణకు రావాలని ఆదేశించిన నేపథ్యంలో కేవలం 19 కులాలకు చెందిన ప్రతినిధులు మాత్రమే హాజరయ్యారు. వీటిలో 18 కులాలకు సంబంధించి వివరాలు పక్కాగా ఉన్నట్లు తెలిసింది. కులాల సంస్కృతి, సంప్రదాయాలు, ఆర్థికస్థితి, విద్య, ఉద్యోగాలు, జీవన ప్రమాణాలను బీసీ కమిషన్ లోతుగా అధ్యయనం చేసింది. బృందాలుగా ఏర్పడి జిల్లాల వారీగా పర్యటనలు చేసింది. ఈక్రమంలో 18 కులాలను బీసీ జాబితాలో చేర్చేందుకు అర్హత ఉన్నట్లు నిర్ధారించింది. ఇందులో కొన్ని బీసీ ఏ కేటగిరీలో, మరికొన్ని బీసీ డీ కేటగిరీలో చేర్చే అవకాశముంది. బీసీ కమిషన్ కాలపరిమితి ముగిసే చివరి రోజున పరిశీలన నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుతం బీసీ కమిషన్ నివేదిక ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఈ నివేదికను పరిశీలిస్తున్నట్లు సమాచారం. పరిశీలన ప్రక్రియ పూర్తయిన తర్వాత కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ రెండో వారంలోగా పరిశీలన ప్రక్రియ పూర్తవుతుందని, వెనువెంటనే నూతన కులాల చేర్పుపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెలువర్చే అవకాశముందని సమాచారం. ప్రతిపాదించిన కులాలివే.. గంజికుంటి, ఎనూటి, రామజోగి, అరవకోమటి, బాగోతుల, గౌడజెట్టి, పటంవారు, గోవిలి, సొన్నాయిల, అద్దపువారు, అహిర్ యాదవ, సారోళ్లు, బౌల్ కమ్మర, తేరచీరాల, కుల్ల కడగి, ఓడ్, కాకిపగడాల, తోలుబొమ్మలవారు. -
దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రి జగన్
సాక్షి, తిరుపతి: దేశంలో ఏ ప్రభుత్వం.. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా బీసీలకు అన్నింటా ప్రాధాన్యత కల్పించిన నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని ఆంధ్రప్రదేశ్ ఉన్నతవిద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య కొనియాడారు. దేశంలోనే ఆయన ఆదర్శ ముఖ్యమంత్రి అని ప్రశంసించారు. తిరుపతిలో ఆదివారం జస్టిస్ ఈశ్వరయ్య, బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎ.శంకర్ నారాయణ, ప్రాథమిక విద్య, నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ రెడ్డి కాంతారావుకు ప్రశంస, అభినందన సన్మాన సభ జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ దేశంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలు ఏళ్ల తరబడి కులవృత్తులతో సామాజిక సేవ చేశారని.. వీరికి హక్కులు కల్పించడంలో మాత్రం ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కరే స్పందించారన్నారు. ఎన్నికలకు ముందు బీసీలకు జరుగుతున్న అన్యాయాల గురించి ఆయనకు నివేదిక సమర్పించామన్నారు. దళితులు, బడుగు, బలహీనవర్గాల అభివృద్ధికి కృషి చేయడంతోపాటు వారికి హక్కులతోపాటు రాజకీయ అధికారంలో భాగస్వామ్యం కలి్పస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అధికారం చేపట్టిన మూడు నెలలకే చరిత్రలో ఎవరూ చేయని విధంగా బీసీలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి వాటికి చట్టబద్ధత కూడా కల్పించిన ఏకైక సీఎం వైఎస్ జగన్ మాత్రమేనన్నారు. నామినేటెడ్ పనులు, పదవుల్లో 50 శాతం రిజర్వేషన్‌తోపాటు చట్టసభల్లో సముచిత స్థానం కల్పించి గౌరవించారన్నారు. పేద బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి ప్రాథమిక విద్య, వైద్యం అందించిన మహనీయుడు వైఎస్ జగన్ అని పేర్కొన్నారు. -
బీసీ కమిషన్ చైర్మన్‌గా రిటైర్డ్ జస్టిస్ శంకరనారాయణ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాశ్వత బీసీ కమిషన్ చైర్మన్‌గా రిటైర్డ్ జస్టిస్ శంకరనారాయణ నిమమితులయ్యారు. జస్టిస్ శంకరనారాయణ ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఆయన మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. సామాజికంగా వెనుకబడిన బీసీలకు న్యాయం చేకూర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ బిల్లుకు బడ్జెట్ సమావేశాల సమయంలో ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చింది. -
వివాదాస్పద స్థలం పరిశీలన
సాక్షి, కావలి: నెల రోజులుగా కావలి పట్టణంలో గుడిసెలు కూల్చివేత వివాదాన్ని పరీశీలించేందుకు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు కె.రాములు, జాతీయ బీసీ కమిషన్ సభ్యులు ఆచార్య తల్లోజు శుక్రవారం కావలి పట్టణానికి వచ్చి, స్థానిక బాలకృష్ణారెడ్డినగర్ పక్కన ఉన్న ప్రదేశాన్ని పరిశీలించారు. అప్పటికే అక్కడ ఉన్న మూడు వర్గాల వాదనలను రెండు జాతీయ కమిషన్ సభ్యులు ఉమ్మడిగా విన్నారు. బీజేపీ నాయకురాలు పత్తిపాటి వరలక్ష్మి ఇచ్చిన స్థలాల్లో గుడిసెలు నిర్మించుకుంటే వాటిని కూల్చేశారని ఒక వర్గానికి చెందిన బాధితులు కమిషన్ సభ్యులకు తెలిపారు. రెండో వర్గం బాధితులు మాట్లాడుతూ బీజేపీ నాయకురాలు పత్తిపాటి వరలక్ష్మి తమ వద్ద వేలాది రూపాయాలు తీసుకుని, ప్రైవేటు వ్యక్తులకు చెందిన స్థలాలకు నకిలీ పట్టాలు ఇచ్చారని పేర్కొన్నారు. ఆమెవల్ల నిండా మునిగి పోయామని కన్నీటిపర్యంతమయ్యారు. మూడో వర్గానికి చెందిన స్థలం యజమానులు తాము పైసా పైసా కూడబెట్టి పిల్లల భవిష్యత్‌కు అండగా ఉంటుందని ఆశతో ప్లాట్లను కొనుగోలు చేశామని కమిషన్ సభ్యులకు చెప్పారు. ముగ్గురి వాదనలను ఆలకించిన జాతీయ కమిషన్ సభ్యులు ప్రైవేట్ వ్యక్తుల స్థలాల్లో ఇళ్లు నిర్మిస్తుంటే అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. అప్పట్లోనే అధికారులు సీరియస్‌గా చర్యలు తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరించడంతోనే ఈ పరిస్థితి ఇంత వరకు వచ్చిందన్నారు. ఇళ్లు కూల్చేయడంతో నిరాశ్రయులైన పేదలకు మూడు నెలలకు సరిపడే నిత్యాసరవర సరుకులు వెంటనే అందజేయాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. ఇళ్లు కూల్చేయడంతో నష్టపోయిన పేదలకు ప్రభుత్వం నష్టపరిహారం అందజేయాలని చెప్పారు. పేదల కోసం ప్రభుత్వ భూమిని గుర్తించి ఇంటి స్థలాలు పంపిణీ చేయాలని ఆదేశించారు. అలాగే ఆ స్థలాల్లో పేదలు ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం పక్కా గృహాలు మంజూరు చేయాలన్నారు. ఇంటి స్థలాలు ఇచ్చే వరకు పేదలకు తాత్కాలికంగా నీడ కల్పించాలన్నారు. పేదలకు నకిలీ పట్టాలు ఇచ్చి మోసం చేసిన వ్యక్తుల చేతిలో మోసపోయిన బాధితులు ఫిర్యాదు చేస్తే వారిపై పోలీసులు కఠినంగా చర్యలు తీసుకోవాలని కావలి డీఎస్పీని ఆదేశించారు. కార్యక్రమంలో కావలి సబ్ కలెక్టర్ చామకూరి శ్రీధర్, బీజేపీ నాయకులు కందుకూరి వెంకట సత్యనారాయణ, ఆర్.డేవిడ్ విల్సన్, జి.భరత్‌కుమార్, సి.వి.సి.సి.సత్యం, మాల్యాద్రి పాల్గొన్నారు. -
సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు
సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడాలేని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు, వీటిలో 50 శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటుగా బీసీ వర్గాల అభ్యున్నతికి శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రత్యేక బిల్లులు తెచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆ వర్గాలకు చెందిన ప్రతినిధులు మంగళవారం అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైనదని, ఇది ఏపీ రాజకీయాల్లో ఓ సువర్ణాధ్యాయం అని వారు కొనియాడారు. బిల్లులు అసెంబ్లీలో ఆమోదించిన ఈ రోజు సువర్ణాక్షరాలతో లిఖించదగినదన్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు అవుతున్న ఈ తరుణంలో సమాజంలోని అట్టడుగున ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల అభ్యున్నతికి శ్రమిస్తున్న యువ నాయకుడు జగన్ అంటూ వారు అభినందనలతో ముంచెత్తారు. ముఖ్యమంత్రిని శాలువాలు, కిరీటంతో వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పార్టీ బీసీ విభాగం అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎం.శంకరనారాయణ, ఎమ్మెల్యేలు జోగి రమేశ్, కారుమూరి నాగేశ్వరరావు, విడదల రజని, ధనలక్ష్మి, అనంతపురం బీసీ నేత మీసాల రంగన్న ఉన్నారు. -
బిల్లులకు టీడీపీ అడుగడుగునా ఆటంకాలు
సాక్షి, అమరావతి : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి సంబంధించి ప్రభుత్వం పలు బిల్లులను సభ ముందుంచే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో విపక్ష తెలుగుదేశం పార్టీ వాటిని అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేసింది. ప్రతిపక్షం ప్రశ్నలకు అధికార పక్షం ఓపికగా బదులిచ్చినా గందరగోళం సృష్టించడమే అజెండాగా పెట్టుకుంది. చివరకు సభా నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సభలో వీడియో ద్వారా వాస్తవాలు వెల్లడించినా విపక్షం వినిపించుకోలేదు. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి, సభాపతిని అవమానించే రీతిలో వ్యవహరించారు. దీంతో ముగ్గురు టీడీపీ సభ్యులను స్పీకర్ స్థానంలో ఉన్న ఉప సభాపతి కోన రఘుపతి ప్రస్తుత సమావేశాల వరకు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అంతకుముందు.. మంగళవారం ఉ.9 గంటలకు మొదలైన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్లు ఇస్తామని పాదయాత్రలో వైఎస్ జగన్ ఇచ్చిన హామీ గురించి టీడీపీ పక్ష సభ్యుడు రామానాయుడు ప్రశ్నించారు. దీనికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బదులిస్తూ.. మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారమే తాము రెండో ఏడాది నుంచి నాలుగేళ్లలో దశల వారీగా ఇస్తామని చెప్పారు. వీడియో క్లిప్పింగుల ప్రదర్శన అనంతరం వైఎస్సార్ ఆసరా పథకాన్ని ఎందుకు మార్చాల్సి వచ్చిందో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సహా అధికార పార్టీ సభ్యులు వివరణ ఇచ్చారు. ‘మాట తప్పడం, అబద్ధాలు చెప్పడం ఇంటా వంటా లేదు’ అని చెబుతూ నాటి తన ప్రసంగాన్ని సభలో ప్రదర్శించాలని స్పీకర్‌ను కోరారు. ఈ సమయంలోనూ అచ్చెన్నాయుడు సహా ఇతర టీడీపీ సభ్యులు గందరగోళానికి దిగారు. ఆ తర్వాత సభలోకి వచ్చిన చంద్రబాబు ఇదే అంశంపై మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే, ఆయన వాస్తవాలు తెలుసుకోవాలన్న ఉద్దేశ్యంతో చంద్రబాబు కోసం మరోసారి వీడియో ప్రదర్శించారు. ముగ్గురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్ అయినా, టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి సభా కార్యక్రమాలకు అడ్డుపడ్డారు. సభాపతి సీటును పట్టుకుని, మైక్‌కు అడ్డుపడుతూ గందరగోళానికి దిగారు. ఈ దశలో సభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ జోక్యం చేసుకున్నారు. దేశ చరిత్రలో నిలిచిపోయేలా తమ ప్రభుత్వం చట్టాలు చేస్తోందని తెలిపారు. ఇవన్నీ జీర్ణించుకోలేకే కొన్ని రోజులుగా సభా కార్యక్రమాలకు టీడీపీ అడ్డుపడుతోందన్నారు. టీడీపీ పక్ష సభ్యులు అచ్చెన్నాయుడు, రామానాయుడు, బుచ్చయ్య చౌదరిని సస్పెండ్ చేయాలని ప్రతిపాదించారు. దీంతో ఆ ముగ్గురిని సభాపతి స్థానంలో ఉన్న కోన రఘుపతి ప్రస్తుత సమావేశాల వరకు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. సభను వీడి వెళ్లాలని ఎంత చెప్పినా విన్పించుకోకపోవడంతో మార్షల్స్‌తో వారిని బయటకు పంపారు. అయినప్పటికీ చంద్రబాబుతో సహా ఇతర సభ్యులు తిరిగి అదే అంశాన్ని ప్రస్తావించారు. దీంతో టీడీపీ సభ్యుల తీరుపై జనసేన సభ్యుడు రాపాక వరప్రసాద్, వైసీపీ సభ్యులు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. అసెంబ్లీ నుంచి వాకౌట్ టీ విరామం తర్వాత సభ తిరిగి 12.34 గంటలకు ప్రారంభమైనప్పుడు కూడా టీడీపీ సభ్యులు తమ సీట్లలో నుంచి లేచి సభ మధ్యలోకి వచ్చి నినాదాలు చేశారు. ఇలా సుమారు గంటా 15 నిమిషాల పాటు సభా కార్యక్రమాలకు అడ్డుతగిలి న వారు మ.1.47 గంటల ప్రాంతంలో సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. బీసీ శాశ్వత కమిషన్ ఏర్పాటుపై కనీసం ఒక్క టీడీపీ సభ్యుడు కూడా మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందని పలువురు బీసీ నేతలు వ్యాఖ్యానించారు. -
ఏపీలో సువర్ణాధ్యాయం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిజమైన సామాజిక విప్లవానికి నాంది పలుకుతూ రాష్ట్ర శాసనసభ నూతన అధ్యాయాన్ని లిఖించింది. బడుగు, బలహీన వర్గాలు, మహిళల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభ్యున్నతికి మార్గం సుగమం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కీలక బిల్లులను మంగళవారం ఆమోదించింది. సామాజిక న్యాయ స్ఫూర్తిని ప్రతిఫలింపజేస్తూ రాజ్యాంగ లక్ష్యాల సాధన దిశగా గొప్ప ముందడుగు వేసింది. రాష్ట్రంలో శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేసే బిల్లుతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అన్ని నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు, నామినేషన్లపై ఇచ్చే అన్ని పనులు, సర్వీస్ కాంట్రాక్టుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు, మహిళలకు నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు, నామినేషన్లపై ఇచ్చే పనులు, సర్వీస్ కాంట్రాక్టుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లులను శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ బిల్లుల లక్ష్యాలు, ఉద్దేశాలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ మంగళవారం శాసనసభకు వివరించారు. అనంతరం ఈ బిల్లులపై మంత్రులు, సభ్యులు కూలంకుషంగా చర్చించారు. ఈ బిల్లులతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు, మహిళల సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తూ ప్రశంసించారు. రాష్ట్రంలో నూతన సామాజిక విప్లవానికి తెరతీస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశానికే ఆదర్శంగా నిలిచారని సభ్యులు కొనియాడారు. అనంతరం సభ ఈ బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇది సుదినం.. కొత్త చరిత్రకు తెరతీస్తూ కీలకమైన బిల్లులను ఆమోదించడం ద్వారా శాసనసభ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు, మహిళల జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకువచ్చింది. ఎన్నో ఏళ్ల వివక్షకు ముగింపు పలుకుతూ ఆ వర్గాలకు సామాజిక, ఆర్థిక, రాజకీయంగా న్యాయమైన అవకాశాలను కల్పించేందుకు రాచబాట పరిచింది. బడుగు, బలహీన వర్గాల కష్టాలను పాదయాత్రలో చూసి చలించిన ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి ఆ వర్గాల సర్వతోముఖాభివృద్ధికి విప్లవాత్మకమైన ముందడుగు వేశారు. బీసీల హక్కుల పరిరక్షణకు చట్టబద్ధత కల్పిస్తూ శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు బిల్లును శాసనసభ ఆమోదించింది. దాంతో బీసీలు తమ హక్కులకు భంగం వాటిల్లినా, వివక్షకు గురైనా ఆశ్రయించడానికి వారికి ఓ చట్టబద్ధ వేదిక లభించింది. బీసీ జాబితాలో కొత్త కులాల చేర్పు, తొలగింపులను పరిశీలించేందుకు ఓ వ్యవస్థ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. న్యాయాధికారాలు కలిగి ఉండే బీసీ కమిషన్ ఆ వర్గాల హక్కుల పరిరక్షణకు పెద్ద దిక్కుగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు రాజకీయ, ఆర్థిక అభ్యున్నతికి చట్టబద్దత కల్పించింది. అన్ని నామినేటెడ్ పదవుల్లోనూ 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు రిజర్వేషన్ కల్పించే బిల్లును శాసనసభ ఆమోదించింది. దాంతో కార్పొరేషన్ చైర్మన్లు, మార్కెట్ కమిటీలు, ఇతర నామినేటెడ్ పోస్టుల్లో సగం బడుగు, బలహీన వర్గాలకు దక్కనున్నాయి. అదే విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు నామినేషన్లపై ఇచ్చే అన్ని పనుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును కూడా శాసనసభ ఆమోదించింది. దాంతో ఆ వర్గాలు ఆర్థికంగా స్వావలంబన సాధనకు మార్గం సుగమమైంది. ఆకాశంలో సగం.. అవనిలో సగం ఉన్న మహిళలకు అవకాశాల్లోనూ సగం కల్పించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశయానికి ఆమోద ముద్ర వేసింది. అన్ని నామినేటెడ్ పోస్టుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ బిల్లును శాసనసభ ఆమోదించింది. దాంతో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నామినేటెడ్ పదవుల్లో మహిళలకు సగభాగం హక్కు దక్కింది. నామినేషన్లపై ఇచ్చే అన్ని పనుల్లోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును ఆమోదించింది. ఈ నేపథ్యంలో బడుగు, బలహీన వర్గాలు, మహిళల అభ్యున్నతికి దోహదం చేసేకీలక బిల్లులపై చర్చను ప్రతిపక్ష పార్టీ టీడీపీ బహిష్కరించడం విస్మయపరిచింది. ఆద్యంతం అడ్డుకునేందుకే యత్నం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలతో పాటు మహిళలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ అధికారం కల్పించే కీలక బిల్లులపై అసెంబ్లీలో చర్చను అడ్డుకోడానికి ప్రతిపక్ష టీడీపీ శతథా యత్నించింది. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు బిల్లు ఉద్దేశాలను మంత్రి శంకర నారాయణ అసెంబ్లీలో వివరిస్తుండగా టీడీపీ సభ్యులు తీవ్ర స్థాయిలో అంతరాయం సృష్టించారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. కొందరు ఏకంగా స్పీకర్ పోడియం మీదకు చేరి నినాదాలు చేశారు. బడుగు, బలహీన వర్గాలు, మహిళల సంక్షేమం, సాధికారికత కోసం కీలక బిల్లులపై చర్చకు సహకరించాలని ప్రభుత్వం తరఫున మంత్రి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ టీడీపీ సభ్యులు ఏమాత్రం వినిపించుకోలేదు. మంత్రి శంకర నారాయణ ప్రసంగిస్తున్నంతసేపు నినాదాలు చేస్తునే ఉన్నారు. టీడీపీ సభ్యుల అరుపులు, కేకల మధ్యే డిప్యూటీ స్పీకర్ కొన రఘుపతి బిల్లులపై చర్చను కొనసాగించాల్సి వచ్చింది. తమ స్థానాల్లో కూర్చొని చర్చకు సహకరించాల్సిందిగా డిప్యూటీ స్పీకర్ చేసిన విజ్ఞప్తిని కూడా టీడీపీ ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు. బిల్లుపై చర్చలో పాల్గొంటూ ఎమ్మెల్యేలు వేణుగోపాల్, కరణం ధర్మశ్రీ మాట్లాడుతున్నంతసేపూ టీడీపీ సభ్యులు వారి ప్రసంగానికి అడ్డుతగిలేందుకు ప్రయత్నిస్తునే ఉన్నారు. అయినప్పటికీ డిప్యూటీ స్పీకర్ నిబద్ధతతో చర్చను కొనసాగించారు. చివరికి ఎమ్మెల్యే పార్థసారథి ప్రసంగిస్తుండగా చంద్రబాబు, టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు. బడుగు, బలహీన వర్గాలు, మహిళలకు అన్ని విధాలా మేలు చేకూర్చే విషయంలో టీడీపీ సభ్యులు వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. అంబేడ్కర్ స్ఫూర్తిని పుణికిపుచ్చుకున్న సీఎం చట్టసభల్లో బడుగు, బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ అంబేడ్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్ 366ను పొందుపరిచారు. ఆయన స్ఫూర్తితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నామినేటెడ్ పదవులు, నామినేషన్లపై ఇచ్చే పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు. – పీడిక రాజన్న దొర, ఎమ్మెల్యే, సాలూరు బీసీల సాధికారికతను అడ్డుకునేందుకు టీడీపీ కుట్ర బీసీలకు సాధికారికత చేకూర్చే చరిత్రాత్మక బిల్లులను అడ్డుకోవడానికి చంద్రబాబు, ఆయన బృందం సభకు అంతరాయం కలిగించేందుకు ప్రయత్నిస్తోండటం సబబు కాదు. వైఎస్ జగన్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న అక్కసుతో సభా వ్యవహారాలను అడ్డుకుంటున్నారు. బీసీలకు శాశ్వత కమిషన్ ఏర్పాటైతే తమ సమస్యలను నోరు విప్పి చెప్పుకోలేని స్థితిలో ఉన్న బీసీల విషయాలను సుమోటో కేసులుగా స్వీకరించే వెసులుబాటు లభిస్తుంది. – చెల్లుబోయిన వేణుగోపాల్, ఎమ్మెల్యే, రామచంద్రాపురం ఇలాంటి సీఎం కావాలని అందరూ కోరుకుంటున్నారు గత ప్రభుత్వం మైనార్టీలను ఓటు బ్యాంకుగానే చూసింది. కానీ మైనార్టీల సంక్షేమానికి చిత్తశుద్ధితో పని చేయడం ఎలాగో సీఎం వైఎస్ జగన్ చేసి చూపించారు. వారి పురోభివృద్ధికి ఏకంగా చట్టం తీసుకువస్తున్నారు. అలాంటి సీఎం కావాలని అన్ని రాష్ట్రాల ప్రజలూ కోరుకుంటున్నారు. – ముస్తఫా, ఎమ్మెల్యే, గుంటూరు ఈస్ట్ టీడీపీ ఓర్వలేకపోతోంది.. దేశ చరిత్రలోనే తొలిసారిగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవులు, నామినేషన్లపై ఇచ్చే పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు. దీన్ని చూసి ప్రతిపక్ష టీడీపీ ఓర్వలేకపోతోంది. ఇంతటి చరిత్రాత్మక సమయంలో సభలో ఉండకుండా వెళ్లిపోవడం చంద్రబాబు అహంకారానికి నిదర్శనం. 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే ఆయన తన పాలనలో బీసీలను అన్ని విధాలుగా మోసం చేశారు. ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ బీసీలకు న్యాయం చేస్తుంటే కూడా చూడలేకపోతుండటం టీడీపీ నైజాన్ని బయటపెడుతోంది. – అనిల్ కుమార్ యాదవ్, నీటి పారుదల శాఖ మంత్రి ఈ ఘనత సీఎం జగన్‌దే ఆకాశంలో సగం.. అవనిలో సగం.. అని మహిళల గురించి అందరూ అంటుంటారు. మహిళలకు నిజంగా అవకాశల్లో సగం ఇచ్చి సీఎం వైఎస్ జగన్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఉప ముఖ్యమంత్రిగా గిరిజన మహిళ, హోం మంత్రిగా ఎస్సీ మహిళకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు అన్ని నామినేటెడ్ పదవుల్లోనూ, నామినేషన్లపై ఇచ్చే అన్ని పనుల్లోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించారు. టీడీపీ ప్రభుత్వంలో మహిళలు అవమానాలకు గురయ్యారు. కానీ రాష్ట్రంలో మహిళలను చెల్లిగా, తల్లిగా గౌరవించే మహోన్నత స్వభావం ఉన్న వైఎస్ జగన్ సీఎం కావడం మన అదృష్టం. – ఆర్కే రోజా, ఎమ్మెల్యే, నగరి ఇది పండుగ దినం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇది నిజమైన పండుగ రోజు. రాజకీయ అధికారం, ఆర్థిక స్వావలంబన కల్పిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అణగారిన వర్గాలకు సామాజిక గౌరవం కల్పించారు. – కొరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యే, రైల్వేకోడూరు బీసీల గుండెల్లో సీఎం జగన్ నిలిచిపోతారు బీసీలు అంటే బ్యాక్ వర్డ్ కాదు బ్యాక్ బోన్ కులాలు అని చాటి చెప్పేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రయత్నిస్తుంటే చంద్రబాబు సహకరించకపోగా ఆటంకాలు సృష్టిస్తున్నారు. శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం దేశంలోనే తొలిసారి. బీసీ హృదయాలలో జగన్ చిరస్మరణీయునిగా ఉంటారు. – కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్యే, చోడవరం బీసీల హక్కుల పరిరక్షణకు నాంది చంద్రబాబు బీసీలకు తీవ్ర ద్రోహం చేశారు. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో 550తో రాష్ట్రంలో దాదాపు 500 మంది బీసీ విద్యార్థులు మెడికల్ సీట్లు కోల్పోయారు. చంద్రబాబు పాలనలో రాజధానితో సహా రాష్ట్రమంతటా కుల, మతాల తారతమ్యాలు, కుల వివక్ష విపరీతంగా పెరిగిపోయింది. ఇలాంటి సామాజిక రుగ్మతలను రూపు మాపడానికి సీఎం వైఎస్ జగన్ శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ నియమించాలని నిర్ణయించారు. ఈ కమిషన్‌తో బీసీల హక్కుల పరిరక్షణ సాధ్యపడుతుంది. – కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే, పెనమలూరు మరో అంబేడ్కర్, అల్లూరి అన్ని స్థాయిల్లోని పదవుల్లో బడుగు, బలహీన వర్గాలకు అంబేడ్కర్ చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించారు. ప్రస్తుతం మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో అడుగు ముందుకు వేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో, నామినేషన్లపై పనుల్లోనూ 50 శాతం రిజర్వేషన్ కల్పించారు. ఇంతే కాకుండా ఏజెన్సీలో బాక్సైట్ మైనింగ్ చేయబోమని ప్రకటించడం గిరిజనుల్లో సంతోషం కలిగించింది. అందుకే గిరిజనులు వైఎస్ జగన్‌ను మరో అంబేడ్కర్‌గా, మరో అల్లూరిగా కీర్తిస్తున్నారు. – భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే, పాడేరు మహిళా సాధికారికత సాకారం పార్లమెంటులో మహిళా బిల్లు మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉంది. కానీ సీఎం వైఎస్ జగన్ తాను అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే అన్ని నామినేటెడ్ పదవులు, పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. తద్వారా మహిళా సాధికారికత కలను సాకారం చేశారు. – జొన్నలగడ్డ పద్మావతి, ఎమ్మెల్యే, శింగనమల దేశ చరిత్రలో ఇదే తొలిసారి అసమానతలకు గురవుతున్న అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. నామినేషన్లపై ఇచ్చే పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. వైఎస్ జగన్ నామినేషన్లపై ఇచ్చే పనుల్లో బడుగు, బలహీన వర్గాలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడం ద్వారా నిజమైన సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారు. – మేరుగ నాగార్జున, ఎమ్మెల్యే, వేమూరు సామాజిక న్యాయానికి శ్రీకారం బడుగు, బలహీన వర్గాలు, మహిళల అభ్యున్నతి, నిజమైన సామాజిక న్యాయం, సమాన హక్కుల కల్పన పట్ల సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధి, నిబద్ధత దేశానికి ఆదర్శప్రాయం. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటుతో బలహీన వర్గాల హక్కులకు చట్టబద్ధమైన రక్షణ లభిస్తుంది. పాత కమిషన్ బిల్లులున్నా అవి సరిగా పని చేయకపోవడంతో నూతన బిల్లును తీసుకువచ్చాం. ఈ కొత్త శాసనం బీసీలలో విశ్వాసం కలిగిస్తుందని విశ్వసిస్తున్నాం. అన్ని స్థాయిల్లోనూ రాజకీయ అధికారంలో భాగస్వామ్యం కల్పించడం ద్వారానే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సామాజిక గౌరవం దక్కుతుందనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విధానం. అందుకే ఆ వర్గాలకు అన్ని నామినేటెడ్ పదవుల్లో, అన్ని నామినేటెడ్ పనులు, సర్వీస్ కాంట్రాక్టుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లులను ప్రవేశపెట్టి ఆ వర్గాల ఆర్థిక స్వావలంబన సాధనకు ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇక పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ మహిళలు పురోగతి సాధించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విప్లవాత్మకమైన విధాన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా మహిళలకు నామినేటెడ్ పదవుల్లో, పనుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించడం ద్వారా మహిళా సాధికారికత సాధనకు మార్గం సుగమమవుతుంది. – ఎం.శంకర నారాయణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి మహిళల అభ్యున్నతికి విప్లవాత్మక నిర్ణయం టీడీపీ ప్రభుత్వంలో మహిళలు పూర్తిగా మోసానికి గురయ్యారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామన్న హామీని చంద్రబాబు నెరవేర్చలేదు. సున్నా వడ్డీకి రుణాలను ఇవ్వలేదు. బెల్టు షాపులు రద్దు చేస్తామని చెప్పిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవి దిగేనాటికి రాష్ట్రంలో వాటి సంఖ్యను 40 వేలకు పెంచారు. తహశీల్దార్ వనజాక్షి మీద దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్యేను అప్పటి సీఎం చంద్రబాబు వెనకేసుకొచ్చారు. అందుకే ఎన్నికల్లో మహిళలు టీడీపీని ఓడించారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మహిళలు బలోపేతం అయ్యేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. – పుష్ప శ్రీవాణి, డిప్యూటీ సీఎం మనసున్న పాలకుడి గొప్ప నిర్ణయం పదేళ్ల పాటు ప్రజల్లో ఉంటూ వారి కష్టాలు, కన్నీళ్లను దగ్గరి నుంచి చూసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం ఇది. మనసున్న పాలకుడి పాలన ఎలా ఉంటుందో ఆయన చూపిస్తున్నారు. ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలని దేశానికి ఆదర్శంగా నిలిచారు. – బాలరాజు, ఎమ్మెల్యే, పోలవరం వైఎస్ జగన్‌కు సెల్యూట్.. ఐదు నెలల క్రితం ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జనలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే చేసి చూపిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. విలువలు, విశ్వసనీయత అంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజల మనసులో నిలిచిపోతారు. అందుకే బీసీ వర్గాల తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సెల్యూట్ చేస్తున్నా. – జోగి రమేష్, ఎమ్మెల్యే, పెడన మహిళల ఆత్మవిశ్వాసం పెంచే మహా విప్లవం తరతరాలుగా మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాలను సరిదిద్దే దిశగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్ద ముందడుగు వేశారు. మహిళల ఆత్మవిశ్వాసం, ఆత్మ గౌరవం పెంచే మహా విప్లవం ఇది. ఈ నిర్ణయం దేశ రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలుకుతోంది. ఇందుకు మహిళా లోకం తరఫున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. – విడదల రజని, ఎమ్మెల్యే, చిలకలూరిపేట -
వినూత్నం... సృజనాత్మకం
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మంగళవారం సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం ఆవిష్కృతమైంది. బడుగువర్గాల, మహిళల అభ్యున్నతిని కాంక్షించే అత్యంత కీలకమైన అయిదు బిల్లుల్ని శాసనసభ ఆమోదించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఈ బిల్లులన్నీ చరిత్రాత్మకమైనవి, అసాధారణమైనవి. రాష్ట్రంలో శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు... బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందినవారికి అన్ని నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు... నామినేషన్లపై ఇచ్చే పనుల్లో సైతం 50 శాతం రిజర్వేషన్లు... నామినేటెడ్ పోస్టుల్లో, నామినేషన్లపై ఇచ్చే పనుల్లో మహిళలకు 50 శాతం కోటా ఇవ్వడానికి ఈ బిల్లుల్ని ఉద్దేశించారు. స్వాతంత్య్రం వచ్చి 72 ఏళ్లయినా అట్టడుగు వర్గాలు, మహిళల స్థితిగతులెలా ఉన్నాయో అందరికీ తెలుసు. డాక్టర్ అంబేడ్కర్ నాయకత్వంలో రూపొందిన రాజ్యాంగం చట్టసభల్లో, ఉద్యోగావకాశాల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించింది. అనంతర కాలంలో కేంద్రంతోపాటు కొన్ని రాష్ట్రాలు బీసీలకు, మహిళలకు విద్య, ప్రభుత్వోద్యోగాల్లో కోటా కల్పించాయి. కానీ అంత మాత్రాన ఆ వర్గాలకు సంపూర్ణమైన ప్రయోజనం దక్కదు. ఇతర స్థాయిల్లో సైతం ఆ విధానం అమలైనప్పుడే ఆ వర్గాలకు మేలు కలుగుతుంది. వారికి కూడా అధికారంలో భాగస్వామ్యం కల్పించినట్టవుతుంది. మండల్ కమిషన్ సిఫార్సుల అమలు తర్వాత ఆ స్థాయిలో బీసీలకు లబ్ధి చేకూర్చడం ఇదే తొలిసారి. మన నిచ్చెనమెట్ల కులవ్యవస్థలో కొన్ని ఉన్నతమైన కులాలుగా చలామణి అవుతున్నాయి. ఇతర కులాలను సామాజికంగా అణచివేస్తున్నాయి. ఇలా కొన్ని వర్గాలు మాత్రమే ఆర్థిక, రాజకీయ ఆధిపత్యం గుప్పెట్లో పెట్టుకున్నచోట ప్రజాస్వామ్యం నేతి బీర చందమే అవుతుంది. సామాజిక అసమానతలు చెక్కుచెదరకుండా నిలుస్తాయి. మన దేశంలో ఇన్ని దశాబ్దాలుగా జరిగింది అదే. వాస్తవానికి వీటిని సమూలంగా తుడిచిపెట్టాలని, ప్రజాస్వామ్య ప్రక్రియలో అన్ని వర్గాల భాగ స్వామ్యం ఉండాలని రాజ్యాంగ నిర్మాతలు కోరుకున్నారు. చట్టసభలను దేశంలో జరగాల్సిన సామాజిక, ఆర్థిక మార్పులకు ఉపకరణాలుగా వారు భావించారు. ఇందులో విఫలమైతే దేశంలో అశాంతి ప్రబలుతుందని హెచ్చరించారు. దురదృష్టమేమంటే ఏ పార్టీ అధికారంలోకొచ్చినా అట్ట డుగు వర్గాలను ఓటు బ్యాంకులుగానే చూశాయి. వారి అభ్యున్నతికి తీసుకోవాల్సిన నిజమైన చర్యల విషయంలో మౌనంగా ఉండిపోయాయి. ఆ వర్గాలను మభ్యపెట్టడంలోనే పొద్దుపుచ్చాయి. చిత్తశుద్ధి లేని నేతలు, సృజనాత్మకత కొరవడిన నేతలు రాజ్యమేలుతున్నప్పుడు పరిస్థితులు ఇలాగే ఉంటాయి. కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో, చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడంలో తనకెవరూ సాటిరారని ఇప్పటికే నిరూపించుకున్న జగన్ అటువంటి నేతలకు భిన్నం. 14 నెలలపాటు సాగించిన ‘ప్రజా సంకల్ప యాత్ర’లో తాను స్వయంగా చూసిన జీవితాలను, లక్షలాదిమంది ప్రజలు తనతో పంచుకున్న అనుభవాలను గుండెల్లో పొదువుకొని వారి అభ్యున్నతికి అవసరమైన చర్యలను అమలు చేయడం ప్రారంభించారు. కేబినెట్లో దాదాపు 60 శాతం మంత్రి పదవులు, అత్యంత కీలకమైన శాఖలు ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఇవ్వడంతోపాటు స్పీకర్ పదవిని కూడా బీసీ వర్గానికే కేటాయించారు. కేబినెట్ సమావేశాల్లో స్వేచ్ఛగా సలహాలు, సూచనలు చేయొచ్చునని... అభ్యంతరాలున్నా తెలపాలని మంత్రివర్గ సహచరులకు సూచించారు. ఇప్పుడు అదే ప్రజాస్వామిక సంస్కృతిని ఆయన కింది స్థాయికి కూడా విస్తరింపజేయదల్చుకున్నారు. పై స్థాయిలో అమలవుతున్న ఈ విధానాన్ని సుస్థిరపరచాలంటే, బడుగువర్గాలు, మహిళల స్థితిగతులు మెరుగుపడాలంటే ఇదే మార్గమని ఆయన విశ్వసించారు. పర్యవసానంగానే ఈ కీలక బిల్లులు రూపొందాయి. సమాజంలో బీసీ వర్గాలపట్ల అమలవుతున్న వివక్ష ఎవరికీ తెలియనిది కాదు. ఆ వర్గాలకు చిన్నచూపు ఎదురవుతున్నా, దౌర్జన్యాలు సాగుతున్నా, న్యాయబద్ధంగా దక్కాల్సినవాటిని తొక్కి పెడుతున్నా ఎవరికీ ఫిర్యాదు చేయలేని నిస్సహాయత వారిది. విద్య, ఉద్యోగాల్లో అమలు కావాల్సిన కోటా సంగతలా ఉంచి... చివరకు ధ్రువీకరణ పత్రాలు పొందడం కూడా కొన్ని సందర్భాల్లో వారికి కష్టమవుతోంది. అలాంటి సమస్యలకు శాశ్వత స్థాయి బీసీ కమిషన్ ఒక సమాధానం. నామినేటెడ్ పోస్టులనూ, నామినేషన్లపై ఇచ్చే పనులనూ ఆధిపత్య కులాలే తన్నుకుపోతున్న దశలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అవి చట్టబద్ధంగా దక్కేందుకు 50 శాతం కోటా ఇచ్చే యోచన చేయడం... మహిళలకు సైతం ఈ లబ్ధి అందేలా చూడటం ఎంతో ప్రశంసనీయం. ఇది నిస్సందేహంగా ఆయా వర్గాల అభ్యున్నతికి తోడ్పడుతుంది. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా స్వశక్తితో ఎదిగే స్థితి వచ్చినప్పుడే వారి ఉన్నతి సాధ్యమని జగన్ మొదటినుంచీ చెబుతున్నారు. దానికి అనుగుణంగానే వారికి కూడా నామినేటెడ్ పోస్టుల్లో, నామినేషన్లపై ఇచ్చే పనుల్లో సగభాగం కేటాయిస్తూ బిల్లు తీసుకొచ్చారు. ఇంతటి విప్లవాత్మక చర్యలకు సర్కారు శ్రీకారం చుట్టినప్పుడు ప్రతిపక్షం తన వంతు సహకారం అందజేయాలి. చర్చల్లో పాల్గొని, బిల్లుల్లో లోటుపాట్లుంటే తెలియజేయాలి. కానీ చంద్ర బాబు, ఆయన అనుచరగణం అందుకు భిన్నంగా ప్రవర్తించారు. ఒక అవాస్తవమైన అంశాన్ని ఆసరా చేసుకుని సభలో గందరగోళం సృష్టించి ఈ బిల్లులపై చర్చ జరగనీయకుండా, అవి ఆమోదం పొందకుండా చూడాలని విఫలయత్నం చేశారు. అన్ని వర్గాలకు బండెడు వాగ్దానాలు చేస్తూ మేనిఫెస్టో నింపడం, అందలం ఎక్కిన తర్వాత విస్మరించడం అలవాటైనవారి నుంచి ఇంత కంటే మెరుగైన ప్రవర్తన ఆశించలేం. అట్టడుగు వర్గాల శ్రేయస్సును కాంక్షించి బిల్లులు రూపొం దించినప్పుడు చర్చల ప్రక్రియలో పాలుపంచుకోవడం మానుకుని, వాకౌట్ చేసే దుస్థితికి తెలుగు దేశం దిగజారింది. ఈ విషయంలో ఆ పార్టీ మున్ముందు సంజాయిషీ ఇచ్చుకోక తప్పదు. ఇలాంటి వినూత్నమైన, సృజనాత్మకమైన బిల్లులు తీసుకొచ్చిన జగన్ అట్టడుగువర్గాల హృదయాల్లో చిర స్థాయిగా నిలుస్తారు. -
చంద్రబాబు అహంకారానికిది నిదర్శనం: మంత్రి
సాక్షి, అమరావతి: దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత నెల్లూరు జిల్లాకు తొలిసారి బీసీ వ్యక్తికి మంత్రిపదవి అవకాశం దక్కిందని.. ఈ ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే చెందుతుందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. వెనుకబడిన వర్గాల వారిని అభివృద్ధి చేసేందుకు.. బీసీ బిల్లును ప్రవేశపెట్టడం శుభపరిణామన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంత్రి అనిల్ సభలో మాట్లాడుతూ.. 50శాతానికి పైగా బీసీ, ఎస్సీలకు అవకాశం కల్పిస్తూ.. దేశంలో తొలిసారి సామాజిక మంత్రిమండలిని ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. గత 40 ఏళ్ల నుంచి బీసీలకు ఉద్దరిస్తున్నట్లు గత పాలకులు డప్పుకొట్టారని.. కానీ వారికి ఒరిగింది ఏమీలేదని విమర్శించారు. బీసీలంతా గౌరవంగా బతకాలని, వారి అభివృద్ధికి సీఎం గొప్ప కృషి చేస్తున్నారని అభినందించారు. సభలో మంత్రి అనిల్ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి గొప్ప బిల్లును స్వాగతించాల్సిన ప్రతిపక్షం వాకౌట్ చేయడం దురదృష్టకరం. ఇది చంద్రబాబు అహంకారానికి నిదర్శనం. బిల్లు ప్రవేశపెడుతుంటే తల ఎక్కడపెట్టుకోవాలో తెలియక చంద్రబాబు నాయుడు సభ నుంచి బయటకు వెళ్లి దాక్కున్నారు. ఇలాంటి ప్రతిపక్షం దేశ చరిత్రలో ఎక్కడా లేదు. ఎన్నికలకు నాలుగు నెలల సమయం ఉందనితెలిసి.. ముస్లింకు మంత్రివర్గంలో చోటిచ్చారు. తమ ప్రభుత్వం తొలి కేబినెట్లో వెనుకబడిన వర్గాల వారికి 50శాతం అవకాశం కల్పిస్తూ.. సామాజిక మంత్రిమండలిని ఏర్పాటుచేశాం’’ అని అన్నారు. సీఎం వైఎస్ జగన్ మంత్రం: రోజా అన్ని అవకాశాల్లో మహిళలకు సగభాగం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని ఆర్కే రోజా అన్నారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో చర్చలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి మహిళను గౌరవిస్తూ.. అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించిన సీఎంకు ఆమె కృతజ్ఞత తెలిపారు. మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే మహిళలను అభివృద్ధి పథంలో నడిపించే విధంగా చారిత్రాత్మక బిల్లును తీసుకురావడం గొప్ప విషయమన్నారు. గత ప్రభుత్వం కేవలం ఓట్లు, సీట్లు కోసమే వారిని వాడుకున్నారని రోజా మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్ మంత్రం ఎస్సీ, ఎస్టీ,బీసీ మైనార్టీల అభివృద్ధి అని అన్నారు. మహిళా విప్లవానికి ఏపీ అసెంబ్లీ వేదిక అయిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విడదల రజనీ అన్నారు. అమ్మఒడి పథకం ద్వారా రాష్ట్రంలో 43 లక్షల మంది లబ్ధిపొందుతున్నారని తెలిపారు. మహిళా విప్లవానికి ఈ బిల్లే ఉదాహరణ అని అభినందించారు. -
‘వైఎస్ జగన్‌ను అంబేద్కర్‌లా చూస్తున్నారు’
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు కాంట్రాక్టు పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని వెనుకబడిన వర్గాల ప్రజలంతా అంబేద్కర్, పూలే, కొమరం భీంతో కీర్తిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తెల్లం బాలారాజు అన్నారు. చారిత్రాత్మక చట్టాన్ని రూపొందించిందుకు ఆయన కృతజ్ఞత తెలిపారు. మంగళవారం ఆయన శాసనసభ సమావేశాల్లో మాట్లాడుతూ.. దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఇప్పటికీ చాలా వెనుకబడి ఉన్నారని అన్నారు. మన రాష్ట్రంలో ఆ విధంగా ఉన్నవారిని అభివృద్ధి చేసేందుకు వైఎస్ జగన్ గొప్ప ఆలోచన చేశారని అభినందించారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గారి ఆశయం కోసం సొంతంగా పార్టీని ఏర్పాటు చేసుకుని, అనేక పాదయాత్రల ద్వారా పేద ప్రజలను కష్టాలను దగ్గర నుంచి చూసిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి సీఎం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని బాలారాజు అన్నారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం దేశ చరిత్రంలో సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుందని చెప్పుకొచ్చారు. ఇలాంటి గొప్ప ముఖ్యమంత్రి నాయకత్వంలో పనిచేస్తోందుకు ఎంతో గర్వంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. సభలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంపై విమర్శలు తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ ప్రభుత్వంలో కేవలం పచ్చచొక్కాల నేతలకు మాత్రమే పనులు జరిగేవని ఆరోపించారు. కేవలం ఒక్కసామాజిక వర్గానికి చెందిన వారికి మాత్రమే ప్రభుత్వ కాంట్రాక్టులు దక్కేవని, దోచుకున్నవాడికి దోచుకున్నంతగా ఉండేదని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులన్నింటిపైనా విచారణకు ప్రభుత్వం ఆదేశించాలని ఆయన కోరారు. అలాగే దానిపై శ్వేతపత్రం కూడా విడుదల చేయాలన్నారు. గత ప్రభుత్వంలా కాకుండా ప్రస్తుతం సీఎం అందరకీ సమాన అవకాశాలు కల్పించాలని కీలక చట్టాన్ని తీసుకువచ్చినట్లు వివరించారు. -
ఏపీలో సామాజిక విప్లవం.. కీలక బిల్లులకు ఆమోదం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సామాజిక విప్లవానికి నాంది పలుకుతూ.. చరిత్రాత్మక బిల్లులను ఏపీ శాసనసభ మంగళవారం ఆమోదించింది. రాష్ట్రంలోని బడుగు, బలహీన, మైనారిటీ వర్గాలు, మహిళలకు అన్ని రంగాల్లో చేయూతనందిస్తూ.. అన్ని విధాలుగా మేలు చేస్తూ రూపొందించిన కీలకమైన బిల్లులు అసెంబ్లీ ఆమోదంతో చట్టరూపం దాల్చాయి. ఇది ఆయా వర్గాల వారికి ఒక సుదినం. సువర్ణ అధ్యాయం. నామినేటెడ్ పదవుల్లో, నామినేషన్ పనుల్లో 50 శాతం రిజర్వేషన్లను మహిళలకు కల్పిస్తూ తీసుకువచ్చిన చరిత్రాత్మక మహిళా సాధికారిత బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. జనాభాలో సగం ఉన్న మహిళలకు సమాన అవకాశాలు కల్పించేందుకు ఈ బిల్లు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ బిల్లు ప్రకారం అన్ని కార్పొరేషన్లు, సొసైటీ పదవుల్లో, బోర్డులు, కమిటీల చైర్పర్సన్ పదవుల్లో మహిళలకు సగం పదవులు దక్కనున్నాయి. ఇక సామాజికంగా వెనుకబడిన బీసీలకు బాసటగా నిలుస్తూ.. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సర్కారు తీసుకొచ్చిన శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు బిల్లు సైతం ఆమోదం పొంది చట్టరూపం దాల్చింది. రాష్ట్ర ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో, పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఇప్పటికే సభ ఆమోదించిన సంగతి తెలిసిందే. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ మేరకు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. వర్క్, సర్వీస్ కాంట్రాక్టుల్లోనూ ఈమేరకు 50శాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయి. చాలా గొప్ప విషయం.. నామినేషన్ పనుల్లో, పదవుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పించడం చాలా గొప్ప విషయమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి కొనియాడారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లుపై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ బిల్లును ఆమోదిస్తుండటం తనకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అమ్మ ఒడి పథకంతో తల్లులందరికీ చేయూత లభిస్తుందని అన్నారు. సీఎం వైఎస్ జగన్‌తోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు న్యాయం జరగుతుందని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో మహిళలకు అవకాశం కల్పించేందుకే తమ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చిందన్నారు. సామాజిక న్యాయం కోసం సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మరో సభ్యురాలు జొన్నలగడ్డ పద్మావతి మాట్లాడుతూ.. అమ్మ ఒడి పథకం తల్లులందరికీ గొప్ప వరమని కొనియాడారు. అమ్మ ఒడితో అక్షరాస్యత రేటు పెరుగుతుందన్నారు. వైఎస్ జగన్ ప్రకటించి అమలు చేస్తున్న నవరత్నాల పథకంతో మహిళలందరికీ మేలు జరుగుతుందన్నారు. కాంట్రాక్టుల్లో కూడా మహిళలకు స్థానం కల్పించడం గొప్ప విషయమన్నారు. సీఎం వైఎస్ జగన్ సామాజిక న్యాయం పాటిస్తున్నారని కొనియాడారు. గత ప్రభుత్వం డ్వాక్రా రుణామాఫీ పేరుతో మహిళలను నట్టేట ముంచిందని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులుగా పుట్టాలని ఎవరు అనుకుంటారని వ్యాఖ్యలు చేసిన నీచ సంస్కృతి చంద్రబాబుదని వైఎస్సార్సీపీ సభ్యుడు మేరుగు నాగార్జున మండిపడ్డారు. దళితులను చంద్రబాబు ఏ ఒక్క రోజూ పట్టించుకోలేదని విమర్శించారు. దళితులకు న్యాయం చేసిన ఏకైక నాయకుడు సీఎం వైఎస్ జగనేనని పేర్కొన్నారు. సభ్యుడు పీ రాజన్న దొర మాట్లాడుతూ అందరికీ మంచి చేయాలనే ఆలోచన సీఎం వైఎస్ జగన్‌ది అని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు ఆర్థికంగా, రాజకీయంగా అవకాశం కల్పించిన నాయకుడు సీఎం వైఎస్ జగన్ అని అన్నారు. -
బీసీ కమిషన్ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం
సాక్షి, అమరావతి: సామాజికంగా వెనుకబడిన బీసీలకు న్యాయం చేకూర్చేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ బిల్లుకు శాసనసభ మంగళవారం ఆమోదం తెలిపింది. దీంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చింది. అంతకుముందు బీసీ కమిషన్ బిల్లుపై సభలో చర్చ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ.. బలహీన వర్గాల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు సీఎం వైఎస్ జగన్ కృషి చేయడం అభినందనీయమన్నారు. శాశ్వత బీసీ కమిషన్ బిల్లుపై అసెంబ్లీ చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. వెనుకబడిన వర్గాల ప్రజల సమస్యలను పరిష్కరించడానికి సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని తెలిపారు. సమాజంలో బీసీలు ఇతర వర్గాలతో సమాన స్థాయికి ఎదగాలనే బీసీ కమిషన్ బిల్లును తీసుకొచ్చామన్నారు. చంద్రబాబు హయాంలో బీసీల అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు. బీసీలను కించపరిచేవిధంగా చంద్రబాబు మాట్లాడారని పార్థసారథి గుర్తుచేశారు. దళితుల్లో పుట్టాలని ఎవరు అనుకుంటారని చంద్రబాబు అన్నారని పేర్కొన్నారు. విస్తృత అధికారాలు, లక్ష్యాలతో బీసీ కమిషన్ చట్టం రాబోతున్నదని పేర్కొన్నారు. ఔట్ సోర్సింగ్ విధానాన్ని విస్తృతంగా తీసుకొచ్చింది టీడీపీ ప్రభుత్వమేనని, దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ విధానం అమలుకాకుండాపోయిందని అన్నారు. దోచుకోవడం, దాచుకోవడమే లక్ష్యంగా టీడీపీ పాలన సాగిందన్నారు. టీడీపీ హయాంలో కులాల తారతమ్యాలు తగ్గలేదని, అలాంటి పరిస్థితుల్లో బీసీ కమిషన్ బిల్లు వెనుకబడిన వర్గాలను ఆదుకుంటుందని తెలిపారు. బీసీ కమిషన్ ఏర్పాటుతో వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తాయని అన్నారు. సామాజిక, ఆర్థిక పరిస్థితులపై సూచనలు ఇచ్చేందుకు బీసీ కమిషన్‌కు హక్కు ఉంటుందన్నారు. కులాల సర్టిఫికెట్ల జారీ అంశాన్ని బీసీ కమిషన్ ద్వారా తెలుసుకోవచ్చునని పేర్కొన్నారు. బీసీల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు టీడీపీ ఒక్క కార్యక్రమమైనా చేసిందా? అని ప్రశ్నించారు. బీసీలకు మేలు చేసేందుకు బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సభలో టీడీపీ ప్రవర్తన ప్రజలు గమనించారని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. బీసీలకు న్యాయం చేసేందుకు బీసీ కమిషన్ వైఎస్సార్సీపీ సభ్యుడు కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. బీసీ ప్రజలకు న్యాయం చేయాలని సీఎం వైఎస్ జగన్ సంకల్పించారని, పాదయాత్రలో బీసీ ప్రజల కష్టాలు తెలుసుకొని.. వారికి న్యాయం చేసేందుకు బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. బీసీ వర్గంలో ఎన్ని కులాలు ఉన్నాయో.. అన్ని కులాల వారందరికీ దీని వల్ల న్యాయం జరుగుతుందన్నారు. ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఆ సమస్యను బీసీ కమిషన్ పరిష్కరిస్తుందని కారుమూరి నాగేశ్వరరావు స్పష్టం చేశారు. బీసీలతోపాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకూ న్యాయం జరిగేలా బీసీ కమిషన్ చూస్తుందన్నారు. శాశ్వత బీసీ కమిషన్ బిల్లు బీసీలకు ధైర్యాన్నిస్తుందని, ఈబిల్లును ఓర్వలేక టీడీపీ సభను అడ్డుకుందని మండిపడ్డారు. -
చంద్రబాబును ప్రజలు క్షమించరు!
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడిని ప్రజలు క్షమించబోరని వైఎస్సార్సీపీ సభ్యుడు చెల్లుబోయిన వేణుగోపాల్ అన్నారు. శాశ్వత బీసీ కమిషన్ బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల అభివృద్ధి బీసీ కమిషన్ బిల్లు తీసుకురావడం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు. ఈ బిల్లును అడ్డుకోవడం టీడీపీకి తగదని హితవు పలికారు. బీసీలకు జరిగే మేలును టీడీపీ వినలేకపోతున్నారని తప్పుబట్టారు. బలహీన వర్గాల సంక్షేమం కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాటుపడ్డారని గుర్తు చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో అనేక మంది పేద విద్యార్థులు బాగుపడిన విషయాన్ని గుర్తు చేశారు. బీసీల పట్ల టీడీపీకి చిత్తశుద్ధి లేదన్నారు. మంజునాథ కమిషన్ చైర్మన్‌ను సైతం గౌరవించని మనస్తత్వం చంద్రబాబుదని వేణుగోపాల్ దుయ్యబట్టారు. ఐదేళ్లలో బీసీల కోసం టీడీపీ ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. బీసీల రక్షణ కోసమే బీసీ కమిషన్ బిల్లును తీసుకొచ్చినట్టు వేణుగోపాల్ స్పష్టం చేశారు. బీసీల రక్షణ కోసమే బీసీ కమిషన్ బిల్లును ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకురాలేని అంశాలను బీసీ కమిషన్ దృష్టికి తీసుకురావొచ్చునని పేర్కొన్నారు. టీడీపీకి ఆ ఆలోచన ఎందుకు రాలేదు? బీసీల అభ్యున్నతి కోసం సీఎం వైఎస్ జగన్ కట్టుబడి ఉన్నారని వైఎస్సార్సీపీ సభ్యుడు కరణం ధర్మశ్రీ స్పష్టం చేశారు. శాశ్వత బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచన టీడీపీకి ఎప్పుడైనా వచ్చిందా? అని ఆయన ప్రశ్నించారు. శాశ్వత బీసీ కమిషన్ బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల అభ్యున్నతికి టీడీపీ తూట్లు పొడిందని ధర్మశ్రీ ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేయడంతో అన్ని కులాలకూ ధైర్యం వచ్చిందని పేర్కొన్నారు. చంద్రబాబు బీసీలను నిర్లక్ష్యం చేశారని, దేశంలో మొదటిసారిగా శాశ్వత బీసీ కమిషన్ రాష్ట్రంలో ఏర్పాటయిందని అన్నారు. ఎన్నికల వస్తేనే చంద్రబాబుకు బీసీలు గుర్తుకువస్తారని పేర్కొన్నారు. బీసీల కోసం ఒక్క పథకమైనా చంద్రబాబు అమలు చేశారా? అని ప్రశ్నించారు. బీసీలంటే చంద్రబాబుకు ఎందుకంత కడుపుమంట అని నిలదీశారు. బలహీన వర్గాలు బలపడాలనేదే సీఎం వైఎస్ జగన్ లక్ష్యమని, బీసీ కమిషన్ బిల్లును అందరూ కచ్చితంగా సమర్థించాలని పేర్కొన్నారు. -
బిల్లుల భరోసా..
సాక్షి, విజయనగరం గంటస్తంభం: వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రజాసంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. సామాజిక భరోసా కల్పిస్తోంది. చారిత్రాత్మక నిర్ణయాలతో ప్రజల మన్ననలు పొందుతోంది. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంతో పాటు ఏకంగా చట్టరూపం తీసుకొచ్చి చేతల ప్రభుత్వంగా నిరూపించుకుంటోంది. శాసనసభలో నాలుగు కీలక బిల్లులకు సోమవారం ఆమోదం తెలిపింది. ఆయా బిల్లులతో రానున్న రోజుల్లో జిల్లాలోని బడుగుబలహీన వర్గాల ప్రజలు, మహిళలు, యువతకు అధిక ప్రయోజనం కలగనుంది. సామాజిక భరోసా లభించనుంది. యువత ఉపాధికి భరోసా.. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు కేటాయిస్తూ శాసనసభలో ఒక కీలక బిల్లుకు ఆమోదముద్ర పడింది. దేశ చరిత్రలోనే ఇప్పటివరకు ఇలాంటి బిల్లు పెట్టకపోవడం విశేషం. ఈ బిల్లు ఆమోదంతో జిల్లాలో నిరుద్యోగ యువత జీవితాలకు భరోసా కలగనుంది. జిల్లాలో ప్రస్తుతం 43 భారీ, మధ్యతరహా, సుమారు 4500 వేలు చిన్నతరహా, మైక్రో పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో 2.20 లక్షల మందికి ఉద్యోగాలు చేసే అవకాశం ఉంది. అయితే, స్థానికులతో ఇబ్బందులు వస్తాయని భావించిన యాజమాన్యాలు 10 నుంచి 20 శాతం ఉద్యోగాలు స్థానికులకు కల్పించి మిగిలినవి ఇతర ప్రాంతాల వారీతో భర్తీ చేస్తున్నాయి. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు 1.65 లక్షల మందికి లబ్ధి నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50శాతం సుమారు 13 లక్షల మందికి నామినేటెడ్ పనుల్లో బడుగు, బలహీన వర్గాలకు 50శాతం 16.80 లక్షల మందికి శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు వల్ల 14 లక్షల మందికి లబ్ధి దీంతో ఉపాధి కోసం జిల్లా యువత ఇతర రాష్ట్రాలకు వలస పోవాల్సి వస్తోంది. తాజా బిల్లువల్ల లక్షా 65వేల ఉద్యోగాలు స్థానికులకు దక్కనున్నాయి. జిల్లాలో ఇప్పటికే 32 పారిశ్రామిక పార్కులు ఉన్నాయి. ప్రభుత్వం పరిశ్రమలకు పెద్దపీట వేస్తామని చెబతుండడంతో అందులో కూడా ఉద్యోగవకాశాలు దక్కితే రానున్న ఐదేళ్లలో కొలువులు జాతర రానుంది. యువత ఆర్థికంగా స్థిరపడే రోజులు కనిపిస్తున్నాయి. దీంతో యువత ఆనందం వ్యక్తం చేస్తోంది. పదవుల్లో మహిళా లోకం.. పనులకు, ఉద్యోగాల్లో ముందుంటున్న మహిళలు పదవుల్లో మాత్రం కాస్తా వెనుకబడి ఉంటున్నారు. రాజ్యాంగపరంగా సక్రమించిన స్థానిక సంస్థలు పదవుల్లో మాత్రమే వారికి 33 శాతం రిజర్వేషన్లు ఉండడంతో ఆయా పదవులు వారికి దక్కుతున్న విషయం తెలిసిందే. ఇకపై నామినేటెడ్ పదవుల్లో కూడా వారి హవా కొనసాగనుంది. జనాభాలో సగం కంటే ఎక్కువ ఉన్న వారికి ఇకపై 33శాతం కాకుండా ఏకంగా 50 శాతం పదవులు దక్కనున్నాయి. ప్రభుత్వం ఈ మేరకు ఏకంగా సోమవారం బిల్లు ఆమోదించడంతో జిల్లా మహిళలకు పదవీయోగం పట్టనుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం జిల్లా స్థాయిలో చూస్తే దేవాలయాలకు చైర్మన్లు, వ్యవసాయమార్కెట్ కమిటీ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ సంఘాల చైర్మన్లు, ఇతర పోస్టులు ఉన్నాయి. నామినేటెడ్ పోస్టులన్నీ భర్తీ చేస్తే సుమారు వేయి వరకు ఉంటాయని అంచనా. ఇందులో సగం వరకు మహిళలకు దక్కనున్నాయి. దీంతో సామాజికంగా, రాజకీయంగా వారి పాత్ర పెరగనుంది. బడుగు, బలహీన వర్గాలకు ఆర్థిక తోడ్పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలను ఆర్థికంగా స్థితిమంతులు చేసే గొప్ప ఆలోచనకు ప్రభుత్వం చట్టరూపం ఇచ్చింది. ఆయా వర్గాలకు నామినేటెడ్ పనుల్లో 50శాతం పనులు వారికే దక్కనున్నాయి. దీంతో జిల్లాలో జరిగే ప్రతి రెండు నామినేటెడ్ పనుల్లో ఒకటి వారికి దక్కనుంది. జిల్లాలో జలవనరులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఉపాధిహామీ, ఇతర పథకాల కింద ఏటా తక్కువులో తక్కువ 2వేల కోట్ల రూపాయలు వరకు పనులు నామినేషన్ పద్ధతిపై జరుగుతున్నాయి. ఇందులో రూ.1000 కోట్లు వరకు ఆయా వర్గాలకు దక్కుతాయి. పనులు చేయడం వల్ల వారికి సామాజిక హోదా పెరగడమే కాకుండా ఆర్ధికంగా ఎంతోకొంత బాగుపడతారు. జిల్లాలో 70శాతం జనాభా ఆయా వర్గాలు వారు ఉన్నారు. వీరికి ఆర్థిక భరోసా కలగనుంది. శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటుతో... వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వం గొప్ప వరం ప్రకటించినట్లే. శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు శాసనసభ ఆమోదముద్ర వేసింది. దీంతో వారి సమస్యలు పరిష్కారానికి వేదిక దొరికినట్లైంది. బీసీలకు ఏదైనా సమస్యలు వచ్చినా, ఏవైనా ప్రయోజనాలు కావాలన్నా కమిషన్ వేయాలని కోరడం, ప్రభుత్వం వెంటనే వేయడం, లేకుంటే తాత్సారం చేయడం జరుగుతోంది. ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే అంశమైతే కమిషన్ జోలికి కూడా పోదు. అయితే సీఎం జగన్మోహన్రెడ్డి బీసీలు శ్రేయస్సు ఆలోచించి ఏకంగా శాశ్వత కమిషన్ ఏర్పాటు చేసింది. దీంతో వారి సంక్షేమం కోసం ఆ కమిషన్ నిత్యం పని చేస్తోంది. దీంతో జిల్లాలో ఉన్న సుమారు 14 లక్షల బీసీ జనాభాకు భరోసా, భద్రత కలగనుంది. బీసీలకు పెద్దపీట వైఎస్సార్సీపీ ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసింది. మంత్రి పదవులు, బడ్జెట్లో కేటాయింపుల్లో ప్రాధాన్యం కల్పించింది. నేడు శాశ్వత బీసీ కార్పొరేషన్ ఏర్పాటుతో బీసీలకు ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది. – ముద్దాడ మధు, ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, విజయనగరం -
బీసీల అభ్యున్నతి, సాధికారత లక్ష్యంగా..
సాక్షి, అమరావతి: సుదీర్ఘ పాదయాత్ర సమయంలో ఇచ్చిన మాట ప్రకారం, వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫేస్టోలో చేసిన వాగ్దానం మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీల అభ్యున్నతే లక్ష్యంగా శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే బీసీ కమిషన్ ఏర్పాటుకుచట్టం చేయడానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో భాగంగా సోమవారం అసెంబ్లీలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎం. శంకర్ నారాయణ బీసీ కమిషన్ ఏర్పాటు బిల్లును ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష టీడీపీ సభ్యుల అడ్డంకులు, నినాదాలు, అధికార పార్టీ సభ్యుల హర్షాతిరేకాల మధ్య బిల్లును అసెంబ్లీ ముందుంచారు. శాశ్వత ప్రాతిపదికన.. పారదర్శకంగా.. బీసీలను అన్ని రకాలుగా బలోపేతం చేయడంతోపాటు సాధికారత పెంచాలని ప్రభుత్వం బలంగా కోరుకుంటున్న నేపథ్యంలో బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు బిల్లు ఉద్దేశాలు, లక్ష్యాల్లో పేర్కొన్నారు. బీసీ కమిషన్ శాశ్వత ప్రాతిపదికన.. పారదర్శకంగా పనిచేస్తుందని అందులో తెలిపారు. వెనుకబడిన తరగతుల సాధికారత, అభ్యున్నతికి సంబంధించిన అన్ని అంశాలను బీసీ కమిషన్ చూస్తుందని స్పష్టం చేశారు. కులధ్రువీకరణ పత్రాల దగ్గర నుంచి బీసీల్లో అత్యంత వెనుకబడిన వర్గాలను గుర్తించడం, గ్రూపుల్లో చేర్పులు, మార్పులు, తదితర అంశాలపై కమిషన్ పనిచేస్తుంది. బీసీలపై జరిగే వేధింపులు, సాంఘిక బహిష్కరణ అంశాలు కూడా కమిషన్ పరిధిలోకే వస్తాయి. కమిషన్ ఏర్పాటుతో బీసీల్లో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుందని, బీసీలకు అన్ని రంగాల్లో అవసరమైన రక్షణ చర్యలను ఈ కమిషన్ కల్పిస్తుందని బిల్లులో స్పష్టం చేశారు. ఎవరైనా తమను వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చాలని కోరితే వారి వినతిని కమిషన్ అధ్యయనం చేసి, తగిన సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. బీసీలకు సంబంధించిన ఇతర అంశాలపైన కూడా అధ్యయనం చేసి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సిఫార్సులు చేయొచ్చు. విద్యా సంస్థల ప్రవేశాల్లో, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్లు పాటించకపోవడం వంటి ఫిర్యాదులపై కమిషన్ విచారణ చేసి ప్రభుత్వానికి నివేదికను సమర్పించనుంది. బీసీలతోపాటు బీసీల్లో అత్యంత వెనుకబడిన వర్గాలను గుర్తించి సామాజిక ఆర్థిక, విద్య స్థితిగతులపై ఎప్పటికప్పుడు సర్వేలు, అధ్యయనాలు చేస్తుంది. వీరి అభ్యున్నతికి అవసరమైన సిఫార్సులు చేసి.. విధానాలను రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఏదైనా అంశంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటే అందుకు సంబంధించిన సిఫార్సులను కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. బీసీల అభ్యున్నతికి రిజర్వేషన్లు, సంక్షేమ కార్యక్రమాలపైన అధ్యయనం చేస్తుంది. రాష్ట్రంలో ఎక్కడైనా సరే కమిషన్ ప్రజాభిప్రాయాన్ని సేకరించవచ్చు. బీసీ కమిషన్‌కు సివిల్ కోర్టు అధికారాలు కొత్తగా ఏర్పాటు చేసే బీసీ కమిషన్‌కు చైర్‌పర్సన్‌గా హైకోర్టు జడ్జి ఉంటారు. సభ్యులుగా ఒక సామాజిక శాస్త్రవేత్త, వెనుకబడిన వర్గాలపై ప్రత్యేక అవగాహన ఉన్న మరో ఇద్దరు, కమిషన్ సభ్య కార్యదర్శిగా ప్రభుత్వ కార్యదర్శి ఉంటారు. వీరు మూడేళ్లు పదవిలో కొనసాగుతారు. వీరిపై ఏమైనా క్రిమినల్ కేసులున్నా, ఆశించిన రీతిలో విధులు నిర్వహించకుండా అసమర్థంగా వ్యవహరించినా, ఒకరిని ఒకరు దూషించుకున్నా, సెలవు పెట్టకుండా వరుసగా మూడు సమావేశాలకు గైర్హాజరైనా తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. చైర్మన్, సభ్యులు మీడియాకు ఎలాంటి విధానపర నిర్ణయాలను వెల్లడించరాదని స్పష్టం చేశారు. కాగా.. కమిషన్‌కు సివిల్ కోర్టు అధికారాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఎవరినైనా తమ ముందు హాజరుకావాల్సిందిగా పిలిచే అధికారం ఉంటుంది. అలాగే అవసరమైన డాక్యుమెంట్లు, సమాచారాన్ని ప్రభుత్వం నుంచి తీసుకునే అధికారం కలిగి ఉంటుందని బిల్లులో స్పష్టం చేశారు. ప్రభుత్వ అనుమతితో బీసీ కమిషన్ సాంకేతిక నిపుణుల సేవలను కూడా పొందొచ్చునని బిల్లులో పేర్కొన్నారు. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నందున బిల్లులో ఆర్థిక మెమోరాండంను కూడా పొందుపరిచారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,49,94,000 కేటాయించినట్లు పేర్కొన్నారు. -
చంద్రబాబు బీసీల ద్రోహి
సాక్షి, అమరావతి: ‘దేశంలో తొలిసారిగా మన రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో, నామినేషన్ పనుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లు తీసుకువస్తుంటే ప్రతిపక్షం అడ్డుకోవాలని చూస్తోంది. ఇంత అధ్వానమైన, దిక్కుమాలిన ప్రతిపక్షం దేశంలో ఎక్కడా ఉండదు. బడుగు, బలహీన వర్గాల ద్రోహులు వీళ్లు’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి టీడీపీపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నూతన అధ్యాయానికి తెరతీస్తూ రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక బిల్లులను సోమవారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనుల్లో 50 శాతం ఇచ్చే బిల్లులు, అన్ని నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనుల్లో మహిళలకు 50 శాతం ఇచ్చే బిల్లులు, పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించే బిల్లు, శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసే బిల్లును అసెంబ్లీలో సోమవారం ప్రవేశపెట్టి ఆమోదించారు. కాగా ఈ బిల్లులు ప్రవేశ పెడుతున్నప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు, టీడీపీ సభ్యులు రాజధానిపై చర్చను కొనసాగించాలనే నెపంతో అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అప్పటికే రాజధాని అంశంపై సుదీర్ఘ చర్చ ముగిసింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వివరణ కూడా ఇచ్చారు. కానీ దీన్ని పట్టించుకోకుండా టీడీపీ సభ్యులు స్పీకర్ తమ్మినేని సీతారాం పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళన కొనసాగించారు. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. టీడీపీ సభ్యుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇలా మాట్లాడారు.. క్లారిఫికేషన్ తర్వాతా చర్చ ఉంటుందా? ‘40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు. 40 ఏళ్ల అనుభవజ్ఞుడినైన రాజకీయ నేత అంటారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రభుత్వం ఒక అంశంపై ప్రకటన చేసిన తర్వాత కేవలం క్లారిఫికేషన్ (వివరణ) మాత్రమే ఉంటుందని తెలిసినా కూడా దానిపై అర గంటపాటు మాట్లాడిన తర్వాత కూడా తృప్తి చెందకుండా ఇంకా గొడవ చేస్తున్నారు. ఇలాంటి విపక్షం ఎక్కడైనా ఉంటుందా? రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ పనుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నాం. దీన్ని కూడా అడ్డుకుంటున్న దిక్కుమాలిన ప్రతిపక్ష పార్టీ బహుశా ప్రపంచంలో మరెక్కడా ఉండదేమో? టీడీపీ ఓర్వలేకపోతోంది.. రాష్ట్ర చరిత్రలోనే కాదు.. దేశ చరిత్రలోనే తొలిసారి నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం ఇస్తుంటే టీడీపీ ఓర్వలేక పోతోంది. ఇంతకన్నా దిక్కుమాలిన ప్రతిపక్ష నేత మరొకరు ఉంటారా? ఇంతకన్నా దిక్కుమాలిన ప్రతిపక్ష పార్టీ మరొకటి ఉంటుందా? దేశ చరిత్రలోనే తొలిసారి నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఇస్తున్నాం. దీన్ని కూడా అడ్డుకుంటున్న దిక్కుమాలిన పార్టీ దేశంలో టీడీపీ తప్ప మరొకటి ఉండదు. ఉద్యోగాలు లేక మన పిల్లలు అల్లాడిపోతున్నారు. వారి జీవితాలు బాగు పరిచేందుకు పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లు తీసుకువస్తుంటే దీన్ని కూడా అడ్డుకుంటారా? ఇంతకంటే అధ్వానమైన, దిక్కుమాలిన ప్రతిపక్షం మరెక్కడా ఉండదు. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటుకు బిల్లు ప్రవేశపెడుతుంటే ఈ ప్రతిపక్షం అడ్డం పడుతోంది. ఇలాంటి ప్రతిపక్ష పార్టీ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మరొకటి లేదు. ఇంతకంటే దిక్కుమాలిన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు కాకుండా మరొకరు దేశంలోనే ఉండరు. బీసీ స్పీకర్‌ను అవమానిస్తున్నారు గతంలో మేము ప్రతిపక్షంలో ఉండగా వాళ్లు అటువైపు నుంచి స్టేట్మెంట్ ఇస్తే క్లారిఫికేషన్‌కు మాకు రెండు మూడు నిముషాలు కూడా అవకాశం ఇచ్చేవారు కాదు. మరి ఇవాళ మేము స్టేట్మెంట్ చదివిన తర్వాత అరగంట సేపు చంద్రబాబు మాట్లాడారు. ఆ మాటల్లో ఏమాత్రం పస లేకుండా మాట్లాడారు. మళ్లీ దాని గురించి ఏకంగా పోడియం దగ్గరకు వచ్చి గొడవ చేస్తున్నారు. ఇంత దిక్కుమాలిన ప్రతిపక్షం మరొకటి ఉండదు. బీసీ వర్గానికి చెందిన స్పీకర్‌ను అవమానిస్తున్నారు. స్పీకర్ అన్న గౌరవం ఏమాత్రం లేకుండా అవమానిస్తున్నారు. బీసీ వర్గానికి చెందిన స్పీకర్ ఆధ్వర్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తుంటే అడ్డుకోవాలని చూస్తున్నారు. వీళ్లు బడుగు, బలహీన వర్గాల ద్రోహులు. వీళ్లకు జ్జానోదయం కలగాలని భగవంతుని కోరుకుంటున్నా. ఎన్నికల్లో ప్రజలు ఓడించినా సరే వీళ్లకు బుద్ధి రాలేదు. ఈ ద్రోహులను భగవంతుడే శిక్షిస్తాడు’ అని సీఎం మండిపడ్డారు. -
నవశకానికి నాంది
రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలు సగర్వంగా తలెత్తుకున్నాయి.. సాధికారికత ఉట్టి పడుతుండగా మహిళలు ఆత్మగౌరవంతో తొణికిసలాడారు.. ఇక ఉపాధికి ఢోకా లేదంటూ యువతకు భవితపై భరోసా వచ్చింది.. ఇదంతా ఎన్నో ఏళ్ల కల.. ఎన్నాళ్లుగానో ఆరాటం.. అలుపెరగని పోరాటం.. వాటన్నింటినీ ఒక్కసారిగా నిజం చేసి చూపించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఆ కలను ఒక్క రోజులో సాకారం చేసి అద్భుతాన్ని ఆవిష్కరించి మన కళ్లముందు నిలిపారు.. ఈ అద్భుత చారిత్రక ఘట్టానికి రాష్ట్ర శాసససభ వేదికగా నిలిచింది.. రాష్ట్రంలో కొత్త చరిత్రకు తెరలేచింది.. సాక్షి, అమరావతి: అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికల హామీల అమలుకు వడివడిగా అడుగులు వేస్తున్న సీఎం వైఎస్ జగన్ తన మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు దాదాపు 60 శాతం పదవులు కేటాయించి దేశం దృష్టిని ఆకర్షించిన ఆయన మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నిజమైన రాజకీయ అధికారం, ఆర్థిక స్వావలంబన కల్పిస్తూ విధాన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో అన్ని నామినేటెడ్ పదవుల్లో ఈ వర్గాలకు 50 శాతం పదవులు కేటాయించే బిల్లును సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదింపజేశారు. ఇక నుంచి రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు భర్తీ చేయబోయే అన్ని రకాల నామినేటెడ్ పదవుల్లో ఆ వర్గాలు కచ్చితంగా 50 శాతం పదవులు దక్కించుకుంటాయి. దీంతో అన్ని స్థాయిల్లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు రాజకీయంగా ప్రబల శక్తిగా రూపాంతరం చెందడం ఖాయం. అదే విధంగా ఈ వర్గాల ఆర్థిక స్వావలంబన సాధన దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో నామినేషన్లపై ఇచ్చే అన్ని పనుల్లో 50 శాతం ఆ వర్గాలకే ఇవ్వాలని ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును శాసనసభ ఆమోదించడం ఆ వర్గాలకు తీపి కబురే. నామినేషన్లపై ఇచ్చే పనులు, సర్వీసుల్లో సగం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఇచ్చేలా చట్టం రూపొందడం ఆ వర్గాల అభ్యున్నతికి మార్గం సుగమం చేసింది. నిజమైన మహిళా సాధికారికతకు శ్రీకారం మహిళల రాజకీయ అధికారం, ఆర్థిక స్వాతంత్య్రం దిశగా ముఖ్యమంత్రి వైఎస్జగన్ కీలక విధాన నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి రాష్ట్రంలో భర్తీ చేయనున్న అన్ని నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో సగం అంటే 50 శాతం మహిళలకేనని తేల్చి చెప్పారు. అందుకోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులకు శాసనసభ సోమవారం ఆమోదించడం శుభపరిణామం. దీంతో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని పదవుల్లోనూ సగం మహిళలే దక్కించుకోనున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కేటాయించే నామినేటెడ్ పదవులు, పనులలో 50 శాతంతో పాటు ఇతర జనరల్ విభాగంలోని నామినేటెడ్ పదవులు, పనుల్లోనూ 50 శాతం మహిళలకు కేటాయించడం కొత్త చరిత్రే. నిజమైన మహిళా సాధికారికత అంటే ఏమిటో తెలుసుకోవాలంటే దేశం మొత్తం మన రాష్ట్రం వైపు చూడాల్సిందే. చట్టబద్ధంగా బీసీ హక్కుల పరిరక్షణ మరో సామాజిక విప్లవానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మన రాష్ట్రాన్ని వేదికగా మార్చారు. బీసీల హక్కుల పరిరక్షణకు చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్రంలో శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేసేందుకు శాసనసభలో బిల్లును ప్రవేశ పెట్టడం శుభపరిణామం. ఇకపై ఎక్కడైనా సరే బీసీ హక్కులకు భంగం వాటిల్లితే బీసీ కమిషన్ బాధితులకు అండగా నిలుస్తుంది. మరోవైపు ఉపాధి కల్పన కల కాదని నిరూపిస్తూ రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలన్న బిల్లును శాసనసభ సోమవారం ఆమోదించడం ఉద్యోగాల విప్లవాన్ని సృష్టించనుంది. ఈ విధంగా కీలకమైన ఆరు బిల్లులను శాసనసభలో ఆమోదింపజేయడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో కొత్త అధ్యాయానికి నాంది పలికారు. సాధికారత దిశగా.. రాష్ట్ర చరిత్రలో తొలిసారి మహిళలకు సీఎం వైఎస్ జగన్ సర్కార్ అగ్రతాంబూలం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో, నామినేటెడ్ పనుల్లో 50 శాతం చొప్పున మహిళలకే కేటాయిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన రెండు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టింది. రాష్ట్ర జనాభాలో సగం మంది మహిళలే ఉన్నప్పటికీ విధాన నిర్ణయాలు తీసుకునే సంస్థల్లో వారికి తగిన ప్రాతినిధ్యం లేకపోవడంతో సమాన అవకాశాలు వారికి దక్కడం లేదు. మహిళా సాధికారతను సాధించాలంటే జనాభాలో సగం ఉన్న అతివలను అందలం ఎక్కించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సామాజిక న్యాయం చేకూర్చడంతోపాటు మహిళలకూ సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా బిల్లులను రూపొందించారు. ఇందులో భాగంగా అన్ని ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ ఒక బిల్లును, అలాగే అన్ని నామినేటెడ్ పనుల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన మరో బిల్లును బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎం.శంకర్ నారాయణ సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లులో ఆయా వర్గాల మహిళలకు కూడా 50 శాతం ఇవ్వడంతోపాటు మిగతా 50 శాతం నామినేడెట్ పదవులు, నామినేటేడ్ పనుల్లో కూడా మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడంతో జనాభాలో సగం ఉన్న మహిళలకు మొత్తం మీద 50 శాతం రిజర్వేషన్లు కల్పించినట్లైంది. అతివలకు జై.. అన్ని కార్పొరేషన్లు, ఏజెన్సీలు, సంస్థలు, బోర్డులు, సొసైటీలు, కమిటీల పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి. అలాగే వీటి చైర్పర్సన్ పదవుల్లోనూ 50 శాతం మహిళలకే కేటాయిస్తారు. అదేవిధంగా డైరెక్టర్లు, సభ్యుల్లో కూడా మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తారు. దేవాదాయ చట్టం పరిధిలోని బోర్డులు, చారిటబుల్ ట్రస్టులు, వక్ఫ్ బోర్డు పరిధిలోని పదవులకు ఈ రిజర్వేషన్లు వర్తించవని స్పష్టం చేశారు. అన్ని నామినేటెడ్, కాంట్రాక్టు పనులు, నామినేటెడ్ సర్వీసు పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తారు.ఇంజనీరింగ్ విభాగాలు, పరిపాలన విభాగాల నామినేటెడ్ పనులన్నింటిలోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి. మహిళలకు అందలం బిల్లులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సహా మహిళలందరికీ నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో 50% ఉద్దేశం మహిళా సాధికారతను సాధించడం, జనాభాలో సగం ఉన్న మహిళలకు కూడా సమాన అవకాశాలు కల్పించడం ప్రధాన అంశాలు అన్ని కార్పొరేషన్లు, ఏజెన్సీలు, సంస్థలు, బోర్డులు, సొసైటీలు, కమిటీల పదవుల్లో 50 శాతం మహిళలకే, చైర్పర్సన్ పదవుల్లో కూడా 50 శాతం రిజర్వేషన్. అదేవిధంగా జనరల్ మహిళల రిజర్వేషన్ ఇదే రీతిలో వర్తింపు మినహాయింపు దేవదాయ చట్టం పరిధిలోని బోర్డులు, చారిటబుల్ ట్రస్టులు, వక్ఫ్ బోర్డు పరిధిలోని పదవులకు రిజర్వేషన్లు వర్తించవు స్థానికులకే పట్టం బిల్లు పరిశ్రమలు, ఫ్యాకర్టీల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే.. ఎవరికి ప్రయోజనం పరిశ్రమలు, ఫ్యాక్టరీల కోసం తమ భూములు ఇచ్చి జీవనోపాధిని, ఆదాయాన్ని కోల్పోతున్నవారికి, స్థానిక యువతకు.. బిల్లులో ప్రధాన అంశాలు కొత్తగా ఏర్పాటయ్యే పరిశ్రమలు, ఫ్యాకర్టీల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలి. దీంతోపాటు ఇప్పటికే ఉన్నవి కూడా మూడేళ్లలో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాల్సి ఉంటుంది. స్థానికులకు తగిన అర్హత లేకపోతే శిక్షణ ఇచ్చి మరీ ఉద్యోగం ఇవ్వాల్సి ఉంటుంది. బీసీలకు బాసట బిల్లులు శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు బిల్లు,ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో, నామినేటెడ్ పనుల్లో బీసీలకు 29 శాతం రిజర్వేషన్ వర్తింపు లక్ష్యం వెనుకబడిన వర్గాలను అన్ని రకాలుగా బలోపేతం చేయడం, వారి అభ్యున్నతికి, సాధికారతకు కృషి చేయడం బీసీ కమిషన్‌లో ఎవరెవరు ఉంటారంటే చైర్మన్‌గా హైకోర్టు న్యాయమూర్తి, సభ్యులుగా ఒక సామాజిక శాస్త్రవేత్త, వెనుకబడిన వర్గాల సమస్యలపై అవగాహన ఉన్న మరో ఇద్దరు నిపుణులు, సభ్య కార్యదర్శిగా ప్రభుత్వ కార్యదర్శి. బీసీ కమిషన్ ప్రధాన విధులు బీసీల సాధికారత, అభ్యున్నతికి సంబంధించిన అన్ని అంశాలను చూస్తుంది. కుల ధ్రువీకరణ పత్రాల దగ్గర నుంచి బీసీల్లో అత్యంత వెనుకబడిన వర్గాలను గుర్తించడం, గ్రూపుల్లో చేర్పులు, మార్పుల తదితర అంశాలపై పనిచేస్తుంది. బీసీలపై జరిగే వేధింపులు కూడా కమిషన్ పరిధిలోకే వస్తాయి. బీసీల సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సిఫారసులు చేయడం, విద్యా ప్రవేశాల్లో, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్ పాటించకపోతే ప్రభుత్వం దృష్టికి తేవడం, బీసీల సామాజిక, ఆర్థిక, విద్య స్థితిగతులపై ఎప్పటికప్పుడు సర్వేలు, అధ్యయనాలు, ప్రజాభిప్రాయ సేకరణలు చేయడం, బీసీలకు అన్ని రంగాల్లో రక్షణ చర్యలు తీసుకోవడం, తదితర అంశాలు. -
బీసీల్లోకి కొత్త కులాలు
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల్లో (బీసీ)కి మరిన్ని కొత్త కులాలు చేరబోతున్నాయి. ఈ దిశగా బీసీ కమిషన్ చర్యలు చేపట్టింది. వాస్తవానికి రెండున్నరేళ్ల క్రితమే కొత్త కులాల చేరికపై పరిశీలన నివేదిక రూపొందించిన బీసీ కమిషన్ అప్పట్లో ఆయా కులాల నుంచి వినతులు, సూచనలు, సలహాలు స్వీకరించింది. వాటిని ప్రాథమికంగా పరిశీలించిన అనంతరం క్షేత్ర పరిశీలన నిర్వహించాలనుకుంటున్న సందర్భంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం కోడ్ పూర్తికావడంతో బీసీ కమిషన్ తిరిగి పరిశీలన మొదలుపెట్టింది. ఇందులో భాగంగా మరోమారు ఆయా కులాల నుంచి సూచనలు, వినతులు స్వీకరిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 5వ తేదీ వరకు వినతులను స్వీకరించనుంది. అనంతరం ఈనెల 11వ తేదీ వరకు నిర్దేశిత కులాలకు సంబంధించిన కుల సంఘాల ప్రతినిధులు లిఖిత పూర్వక ఆధారాలు, డాక్యుమెంటరీలు తదితరాలను స్వీకరిస్తుంది. ఇప్పటివరకు 22 కులాలకు చెందిన ప్రతినిధులు వినతులు, సలహాలు, సూచనలు సమర్పించారు. ఆర్థిక స్థితిగతులే ప్రామాణింకంగా బీసీ కేటగిరీల్లో కొత్త కులాల చేర్పు అంశంలో ఆర్థిక, సామాజిక పరమైన అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనుంది. ఇందులో భాగంగా నిర్దేశిత కులాల్లోని ప్రజల జీవన విధానంతో పాటు వారి ఆర్థికస్థితులను పరిశీలిస్తారు. అదేవిధంగా కుల జనాభాలోని వ్యక్తుల వయసు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, విద్యను సైతం పరిగణలోకి తీసుకుంటారు. వీటన్నింటినీ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ప్రత్యక్షంగా పరిశీలించి విచారణ చేపడతారు. ఈనెల రెండో వారంనుంచి క్షేత్రపరిశీలన చేపట్టేందుకు బీసీ కమిషన్ చర్యలు తీసుకుంటోంది. పురపాలిక ఎన్నికల కోడ్ రాకముందే విచారణ పూర్తి చేయాలని కమిషన్ భావిస్తోంది. ఈమేరకు చర్యలను చకచకా పూర్తి చేస్తోంది. మొత్తంగా రెండు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి పరిశీలన నివేదికను ప్రభుత్వానికి ఇవ్వాలని బీసీ కమిషన్ భావిస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే ఈ ప్రక్రియ వాయిదా పడే అవకాశం లేకపోలేదు. ఆ కులాల జనాభా గరిష్టంగా 2లక్షలే ‘బీసీ కులాల్లోకి కొత్తగా 30 కులాల చేర్పుపై పరిశీలన చేపట్టాం. ఈ కులాల మొత్తం జనాభా గరిష్టంగా 2లక్షలే. కొన్ని కులాల జనాభా 200–500 మాత్రమే ఉంది. అతి తక్కువ జనాభా ఉండడం, వీరికి గుర్తింపు లేకపోవడంతో ఈ కులాలన్నీ ఇప్పటికీ నిరాదరణకు గురయ్యాయి. ప్రస్తుతం మా కమిషన్ ద్వారా చేపడుతున్న పరిశీలనతో ఈ కులాలన్నింటికీ న్యాయం జరుగుతుందని భావిస్తున్నా. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ కులాలన్నీ చాలా వెనుకబాటుకు గురయ్యాయి. వీటికి ఆదరణ అవసరం. ఇప్పటివరకు చేపట్టిన ప్రాథమిక పరిశీలనలో ఈ కులాల నుంచి పెద్దగా విద్యావంతులు లేరు. ఉద్యోగవంతులూ లేరు. కనీసం ఆర్థికంగా ఎదిగిన వారు సైతం లేరు. కొన్ని కులాల్లో కనీసం పదో తరగతి సైతం చదవలేదు. ప్రధాన కారణం రిజర్వేషన్లు లేకపోవడం, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి కలగకపోవడం, జనరల్ కేటగిరీలో పోటీపడే సత్తా లేక పోవడంతో వెనుకబాటుకు గురయ్యారు. రెండు నెలల్లో కులాల చేర్పు పరిశీలన పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించేలా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం ఆమోదిస్తే ఆ కులాలకు ఆర్థిక, సామాజికంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది’ – బీఎస్ రాములు, బీసీ కమిషన్ చైర్మన్ బీసీల్లోకి చేర్చాలని భావిస్తున్న కులాలు .బీసీల్లో 112 కులాలే ఉండగా.. అనాథలను సైతం చేర్చడంతో ఈ సంఖ్య 113కి పెరిగింది. వీటికి అదనంగా కాకి పగ డాల, మందెచ్చుల,బత్తిన, కుల్ల కడగి, సన్నాయోల్లు/బౌల్ కమ్మర, బాగోతుల, బొప్పల, తోలుబొమ్మలాట, గంజి కూటి, శ్రీ క్షత్రియ రామజోగి, ఏనూటి, గుర్రపు, అద్దపు, కడారి సైదరోళ్లు, సరగాని, ఓడ్, మాసయ్యలు/పటం, సాధనాశూరులు, రుంజ, పాపల, పనస, పెక్కర, పాండవుల, గౌడ జెట్టి, ఆదికొడుకులు, తెరచీరల, సారోళ్లు, అరవకోమటి, అహీర్ యాదవ్, గొవిలి కులాలను బీసీలో చేర్చేందుకు కమిషన్ పరిశీలన చేస్తోంది. -
బీసీ జాబితా ధర్మసత్రం కాదు: జాజుల
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం బీసీ కమిషన్‌ను అడ్డు పెట్టుకుని రోజుకొక కులాన్ని బీసీల్లో కలుపుతూ బీసీ జాబితాను ధర్మసత్రంగా మారుస్తుందని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతమున్న బీసీ రిజర్వేషన్లను తగ్గించిన ప్రభుత్వం బీసీ జాబితాలో కొత్త కులాలను కలపడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దోమలగూడ బీసీ భవన్లో ఆదివారం జరిగిన బీసీ సంఘాల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర బీసీ కమిషన్ ఏర్పాటు జరిగి రెండేళ్లు అవుతున్నా బీసీల ప్రయోజనాల కోసం పని చేయకపోగా తాజాగా 30 కులాలను బీసీ జాబితాలో కలుపుతామనడం బీసీల ప్రయోజనాలను దెబ్బ తీయడమేనని విమర్శించారు. బీసీ కమిషన్ ఇప్పటి వరకు బీసీ గణన నిర్వహించలేదని, బీసీలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, సామాజిక బహిష్కరణల వంటి చర్యలపై ఏనాడు స్పందించలేదన్నారు. ఎస్సీ లేదా ఎస్టీ జాబితాలో కలపాలి బీసీ కమిషన్ బీసీ జాబితాలో కలపాలనుకుంటున్న 30 కులాలు అత్యంత పేదరికం, వివక్ష, అంటరానితనానికి గురైన మాట వాస్తవమని ఇలాంటి కులాలను ఎస్సీ, లేదా ఎస్టీ జాబితాలో కలిపితేనే వారికి న్యాయం జరుగుతుందన్నారు. రిజర్వేషన్లు పెంచకుండా రోజుకొక కులాల్ని కలిపితే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ నాయకులు కుల్కచర్ల శ్రీనివాసు, నరాల సుధాకర్, శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
బీసీ కేటగిరీలోకి మరో 30 కులాలు!
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల (బీసీ) కేటగిరీలోకి మరో 30 కులాలను చేర్చేందుకు బీసీ కమిషన్ కసరత్తు వేగిరం చేసింది. ప్రస్తుతం బీసీల్లో 112 కులాలున్నాయి. వీటికి అదనంగా 30 కులాలను చేర్చే అంశంపై బీసీ కమిషన్... గతేడాది ఆయా కులాల నుంచి వినతులు స్వీకరించింది. వీటిని పరిశీలించిన బీసీ కమిషన్ తాజాగా నిర్దిష్ట ఆధారాలు, విజ్ఞప్తుల స్వీకరణకు ఉపక్రమించింది. వాస్తవానికి కొత్త కులాల చేర్పు ప్రక్రియ ఇప్పటికే పూర్తి కావాలి. కానీ గతేడాది సెప్టెంబర్ నుంచి వరుసగా ఎన్నికలుండటంతో ఈ ప్రక్రియను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపేసింది. ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తనా నియమావళి తొలగిపోవడంతో బీసీ కమిషన్ ఈ ప్రక్రియను వేగం చేసింది. ఈ నెల 17 నుంచి విజ్ఞప్తుల స్వీకరణ బీసీ జాబితాలో చేర్చాలని భావిస్తున్న 30 కులాల నుంచి బీసీ కమిషన్ ఇదివరకే విజ్ఞప్తులు, సూచనలు స్వీకరించింది. అయితే మరోసారి నిర్దిష్ట పద్ధతిలో విజ్ఞప్తులు, సూచనలు సమర్పించే వీలు కల్పిస్తోంది. ఈ మేరకు ఈనెల 17వ తేదీ నుంచి 27వ తేదీ వరకు బీసీ కమిషన్ కార్యాలయంలో నిర్దిష్ట విజ్ఞప్తులు, వినతులు స్వీకరించనుంది. కులాల మనుగడ, వారి జీవన విధానం, సంస్కృతితో పాటు సంబంధిత అంశాలను ఆధారాలతో జోడించి కమిషన్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. రెండు నెలల్లో పూర్తి..! బీసీల్లో కొత్త కులాల చేర్పునకు సంబంధించిన గరిష్టంగా రెండు నెలల్లో పూర్తి చేయాలని బీసీ కమిషన్ భావిస్తోంది. ఈనెల 27 వరకు విజ్ఞప్తులు స్వీకరించిన తర్వాత వాటిని పరిశీలించనుంది. ఆ తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి అభిప్రాయాల స్వీకరణ, ఆ తర్వాత అభ్యంతరాలను స్వీకరించి పరిశీలిస్తుంది. చివరగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి తుది నివేదికను తయారు చేయనుంది. రెండు నెలల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుందని, ఆగస్టు చివరికల్లా పూర్తవుతుందని బీసీ కమిషన్ సభ్యులు ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. బీసీ కేటగిరీలో చేర్చాలనుకుంటున్న కులాలు.. బీసీల్లో 112 కులాలున్నాయి. కొత్తగా కాకి పగడాల, మందెచ్చుల, సన్నాయోళ్లు/బత్తిన, కుల్ల కడగి, బౌల్ కమ్మర, బాగోతుల, బొప్పల, తోలుబొమ్మలాట, గంజికూటి, శ్రీ క్షత్రియ రామజోగి, ఏనూటి, గుర్రపు, అద్దపు, కడారి సైదరోళ్లు, సరగాని, ఓడ్, మాసయ్యలు/పటం, సాధనాశూరులు, రుంజ, పాపల, పనస, పెక్కర, పాండవుల, గౌడ జెట్టి, ఆదికొడుకులు, తెర చీరల, సారోళ్లు, అరవకోమటి, అహీర్ యాదవ్, గొవిలి కులాలను బీసీలో చేర్చేందుకు బీసీ కమిషన్ పరిశీలన చేస్తోంది. -
తెలుగులోకి పలు కమిషన్ల నివేదికలు
సాక్షి, హైదరాబాద్: భారతదేశ సామాజిక నేపథ్యం, ప్రజలకు రిజర్వేషన్ల ఆవశ్యకతకు గల ప్రామాణికమైన మండల్, అనంతరామన్, హవనూర్ కమిషన్ నివేదికలను తెలుగులోకి తీసుకువచ్చి బీసీ కమిషన్ గొప్ప పని చేసిందని గవర్నర్ నరసింహన్ అభినందించారు. దేశంలో బీసీలకు రిజర్వేషన్ల అమలుకు మూలాధారంగా నిలిచిన ఈ నివేదికలను దేశంలోనే తొలిసారిగా ప్రాంతీయ భాషలోకి తీసుకురావడం గొప్ప ప్రయత్నమన్నారు. శుక్రవారం రాజ్‌భవన్‌లో తెలంగాణ బీసీ కమిషన్ తెలుగులోకి అనువదించి, ప్రచురించిన మండల్ కమిషన్, హవనూర్, అనంతరామన్, ఇంగ్లిష్‌లో ప్రచురించిన ‘బీసీ నోట్‌బుక్ ’గ్రంథాల తొలిప్రతులను గవర్నర్‌కు అందజేసింది. ఈ సందర్భంగా బీసీ కమిషన్‌తో పలు అంశాలపై గవర్నర్ చర్చించారు. గవర్నర్‌తో బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు, సభ్యులు వకుళాభరణం కృష్ణమోహన్ రావు, ఆంజనేయలుగౌడ్, జూలూరు గౌరీశంకర్, సభ్యకార్యదర్శి అనితా రాజేంద్రన్‌లు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గత సంవత్సర కాలంగా దేశంలోని ఆయా రాష్ట్రాలకు చెందిన బీసీ కమిషన్ల నివేదికలను, తెలంగాణ బీసీ కమిషన్ క్షుణ్ణంగా అధ్యయనం చేసిందని వారు వివరించారు. అనంతరం ఇలాంటి కార్యాచరణను మున్ముందు కూడా కొనసాగించాలని గవర్నర్ కమిషన్ సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీ కమిషన్ బిల్లులో ఏముంది?
సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ వెనకబడిన వర్గాల కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించే బిల్లుకు రాష్ట్రపతి సంతకం చేయడమే ఇక తరువాయి. చట్టం అమల్లోకి వస్తుంది. ఈ చట్టానికి సంబంధించిన 123వ రాజ్యాంగ సవరణ బిల్లును రాజ్యసభ సోమవారం నాడు ఆమోదించిన విషయం తెల్సిందే. లోక్‌సభ అంతకుముందు ఎప్పుడో ఈ బిల్లును ఆమోదించింది. వాస్తవానికి 2017లోనే ఈ బిల్లు రాజ్యసభ ముందుకు వచ్చింది. అప్పటికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి రాజ్యసభలో పూర్తి మెజారిటీ లేదు. పైగా రాజ్యాంగ సవరణ బిల్లుకు మూడింట రెండు వంతుల సభ్యుల మద్దతు కావాలి. అప్పట్లో బిల్లుకు కావాల్సిన మెజారిటీని సమీకరించలేక పోవడం బీజేపీ ప్రభుత్వాన్ని కాస్త ఇబ్బందికి గురి చేసింది. అప్పటికే ఆమోదించినట్లయితే నిజంగా బీసీల తరఫున నిలబడేది తామేనంటూ భుజాలు చరుచుకునే అవకాశం ఉండేది. ఇప్పటికైనా మించి పోయిందేమీ లేదుగానీ తమ ప్రభుత్వ విజయంగా దీన్ని చాటుకునేందుకు ఎక్కువ చాటింపు వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రాజ్యసభ ఈ బిల్లును ఒక్క ప్రతికూలమైన ఓటు లేకుండా 156 ఓట్ల మద్దతుతో ఆమోదించడమే. 123వ రాజ్యాంగ సవరణ అంటే ఏమిటీ? 1993లో జాతీయ వెనకబడిన వర్గాల కమిషన్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. సమాజంలో సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన వర్గాలను గుర్తించి, వారిని బీసీ జాబితాలో చేర్చుకోవాలా, వద్దా అని నిర్ణయించడం, వాటికి సంబంధించిన ఫిర్యాదులను విచారించడం, ఈ అంశాలకు సంబంధించి అవసరమైన చర్యల కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు తగిన సిఫార్సులు చేయడం ఈ కమిషన్ బాధ్యతలు. అయితే కమిషన్ సిఫార్సులను అమలు చేయడం, అమలు చేయకపోవడం ప్రభుత్వ విధాన నిర్ణయం పరిధిలోకి వస్తుంది. ఇప్పుడు 123వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించారు. కొత్తగా వచ్చే అధికారాలేమిటీ? బిల్లులోని 338బీ అధికరణం ప్రకారం ఇతర వెనకబడిన వర్గాలకు కల్పించిన రక్షణ ప్రమాణాలు ఏ మేరకు శక్తివంతంగా ఉన్నాయో తెలుసుకునేందుకు వాటిని పర్యవేక్షించడం, దర్యాప్తు జరిపే అధికారాలు కమిషన్‌కు ఉంటాయి. అందుకోసం సివిల్ కోర్టు అధికారాలు ఉంటాయి. ఈ ఓబీసీలకు సంబంధించి ఎలాంటి విధాన పరమైన నిర్ణయం తీసుకోవాలన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిగా ఈ కమిషన్‌ను సంప్రతించాల్సి ఉంటుంది. రాజ్యాంగం మేరకు సామాజికంగా, విద్యాపరంగా బీసీలకు సిద్ధించిన హక్కులు, రక్షణ ప్రమాణాలకు సంబంధించిన ఫిర్యాదులను విచారించే అధికారం కమిషన్‌కు ఇక నుంచి ఉంటుంది. ఈ విషయమై విచారించాల్సిన వ్యక్తి దేశంలో ఎక్కడున్న పిలిపించే హక్కు కమిషన్‌కు ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాల నుంచే కాకుండా పోలీసు స్టేషన్, కోర్టుల నుంచి కూడా తమకు అవసరమైన డాక్యుమెంట్లను తెప్పించుకునే అధికారం కమిషన్‌కు ఉంటుంది. అలాగే సామాజికంగా, ఆర్థికంగా ఇతర వెనకబడిన వర్గాల అభ్యున్నతికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. వెనకబడిన వర్గాల అభ్యున్నతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను జాతీయ బీసీల కమిషన్ ఏటా సమీక్షించి, వాటిపై తీసుకోవాల్సిన చర్యల గురించి సిఫార్సు చేస్తూ రాష్ట్రపతికి ఓ నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. ఆ రాష్ట్రపతి ఆ నివేదికను పరిశీలించి చర్యల నివేదికతోపాటు దాన్ని పార్లమెంట్‌కు సమర్పించాల్సి ఉంటుంది. దానిపై ప్రభుత్వం స్పందించాల్సి ఉంటుంది. కమిషన్‌లో ఎవరెవరుంటారు? ఓ చైర్పర్సన్, ఓ వైస్ చైర్పర్సన్, ముగ్గురు సభ్యులు ఉంటారు. సభ్యుల పదవీకాలాన్నీ, వారి సర్వీసు నియమ నిబంధనలను రాష్ట్రపతి నిర్ణయిస్తారు. కమిటీలోకి తప్పనిసరిగా ఓ మహిళను తీసుకోవాలని ప్రతిపక్షం డిమాండ్ చేయగా, నియమ నిబంధనల ఖరారు సమయంలో దీన్ని పరిశీస్తామని కేంద్ర ప్రబుత్వం హామీనిచ్చింది. ఈ బిల్లు చరిత్రాత్మకమని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వర్ణించగా, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి అణచివేతకు గురవుతూ వస్తున్న బీసీలకు ఈ బిల్లు ద్వారా న్యాయం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. దేశ జనాభాలో 52 శాతం ఉన్న బీసీలకు బిల్లుతో ప్రయోజనం కలిగించడం ద్వారా బీజేపీ రాజకీయంగా లబ్ధిపొందే అవకాశాలు ఉన్నాయని సామాజిక విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఏ నివేదికల ఆధారంగా కాపులను బీసీల్లో చేర్చారు..
సాక్షి, హైదరాబాద్: ఏ నివేదికలను ఆధారంగా చేసుకుని కాపులను బీసీల్లో చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారో ఆ నివేదికలను సమాచార హక్కు చట్టం కింద బహిర్గతం చేయాలని ఉమ్మడి హైకోర్టు శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. బీసీ కమిషన్ చైర్మన్ హోదాలో జస్టిస్ మంజునాథ్ ఇచ్చిన నివేదికను, బీసీ కమిషన్ సభ్యులు ముగ్గురు ఇచ్చిన నివేదికను స.హ. చట్టం కింద న్యాయవాది కొండల్రావుకు ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఏ నివేదిక ఆధారంగా కాపులను బీసీల్లో చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారో వాటిని బహిర్గతం చేయాలంటూ స.హ. చట్టం కింద పెట్టుకున్న దరఖాస్తును బీసీ సంక్షేమశాఖ తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ న్యాయవాది కె.కొండల్రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎ.సత్యప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. కాపు, తెలగ, బలిజ, ఒంటిరి కులాలను బీసీల్లో చేర్చే విషయంలో బీసీ కమిషన్ చైర్మన్ హోదాలో జస్టిస్ మంజునాథ్ ఓ నివేదికను, కమిషన్‌కు చెందిన ముగ్గురు సభ్యులు మరో నివేదికను ప్రభుత్వానికి ఇచ్చారన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం జస్టిస్ మంజునాథ్ నివేదికను కాకుండా ముగ్గురు సభ్యులు ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకుని కాపులను బీసీల్లో చేరుస్తూ నిర్ణయం తీసుకుందన్నారు. అయితే కాపులను బీసీల్లో చేర్చడంపై పిటిషనర్‌కు పలు అభ్యంతరాలున్నాయని, వీటన్నింటినీ ఆయన బీసీ కమిషన్ ముందు వ్యక్తం చేశారని వివరించారు. ఈ నేపథ్యంలో సదరు నివేదికలను ఇవ్వాలని కోరుతూ పిటిషనర్ స.హ. చట్టం కింద బీసీ సంక్షేమ శాఖకు దరఖాస్తు చేసుకుంటే, సంబంధిత అధికారి తిరస్కరించారని తెలిపారు. అంతేకాక ఈ నివేదికలను బయటపెడితే సమస్యలు వస్తాయని, అందువల్ల కోరిన సమాచారాన్ని ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారని ఆయన కోర్టుకు నివేదించారు. దీనిపై న్యాయస్థానం విస్మయం వ్యక్తం చేసింది. పిటిషనర్ కోరిన సమాచారాన్ని అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. -
బీసీల్లోకి సంచార జాతులు
సాక్షి, హైదరాబాద్: 30 సంచార జాతులను గుర్తించి వారిని బీసీ కులాల్లో చేర్చే అంశాన్ని పరిశీలిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ కులాలను ఎవరూ గుర్తించలేదని ఆయనన్నారు. రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు జూలూరు గౌరీశంకర్ రాసిన ‘బీసీ కులాలు, సంచార జాతులు’పుస్తకాన్ని సీఎం శనివారం ప్రగతిభవన్‌లో ఆవిష్కరించారు. 30 సంచారజాతుల కులాలను బీసీ జాబితాలో చేర్చాల్సి వుందని జూలూరు పేర్కొనగా సీఎం వెంటనే స్పందించారు. సంచార జాతులను బీసీ కులాల్లో చేర్చే విషయంపై అధ్యయన బాధ్యతను రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావుకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అప్పగించారు. బీసీ కులాల్లో సంచారజాతులకు సంబంధించిన అధ్యయనాన్ని సీఎస్‌తో మాట్లాడిన తర్వాత బీసీ కమిషన్ అధ్యయనం చేస్తుందని పేర్కొన్నారు. బీసీ కులాలలో సారోల్లు, అర్వకోమటి, తోలుబొమ్మలాటవారు, కుల్లకడిగి, బైల్ కమ్మర, అహిర్, గోవిలి, బాగోతుల, బొప్పాల, గంజికూటి వారు, శ్రీక్షత్రీయ రామజోగి, ఇనూటి, గుర్రపువారు, అడ్డాపువారు, సారగాని, కడారి తిడారోళ్లు, ఓడ్, పాథం వారు, సాధనాశూరులు, రుంజా, పనాస, పెక్కర, పాండవులవారు, గొడజెట్టి, ఆదికొడుకులు, తెరచీరల, కాకిపడగల, మందహెచ్చుల, పప్పాల, సన్నాయిలు, బత్తిన కులాలకు చెందిన సంచార జాతులను బీసీ కులాల జాబితాలో చేర్చాల్సి ఉంది. బీసీలు, సంచార జాతుల కోసం నాలుగేళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను, బీసీ కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అధ్యయనాన్ని పుస్తకంలో జూలూరు పొందుపరిచారు. ప్రధానంగా సంచారజాతులకు కులాల పిల్లల విద్యాభ్యాసం కోసం ఏర్పాటు చేసిన 718 గురుకుల పాఠశాలల పురోభివృద్ధిని వివరించారు. సంచార కులాల పిల్లలు తొలిసారిగా బడిగడప తొక్కిన సందర్భాన్ని పుస్తకంలో ఆవిష్కరించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీలు కేకే, వినోద్‌కుమార్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
బీసీ నోట్‌బుక్.. బహుజనులకు దిక్సూచి
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగంలోని సామాజిక న్యాయాంశాలను, వివిధ బీసీ కమిషన్ల వివరాలను విశ్లేషిస్తూ పుస్తకాన్ని ప్రచురించడంపట్ల స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్ తెలంగాణ బీసీ కమిషన్‌ను అభినందించారు. శనివారం అసెంబ్లీ కాన్ఫరెన్స్ హాల్లో ‘బీసీ నోట్‌బుక్’పుస్తకాన్ని ఆవిష్కరించారు. మధుసూదనాచారి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజ్యాంగంలో కల్పించిన హక్కులు, ప్రయోజనాలపై బీసీ కమిషన్ చక్కని విశ్లేషణలతో తీసుకొచ్చిన ‘బీసీ నోట్‌బుక్’ బహుజన సామాజిక వర్గాలకు దిక్సూచిగా నిలుస్తుందన్నారు. స్వామిగౌడ్ మాట్లాడుతూ రాజ్యాంగం ఆంగ్ల భాషలో ఉండటం వల్ల ఇన్నాళ్లుగా బహుజన సామాజిక వర్గాలకు అందుబాటులో లేదన్నారు. జాతీయ, రాష్ట్రాల బీసీ కమిషన్ల వివరాలు, నివేదికలను అర్థమయ్యే విధంగా ప్రచురించడం వల్ల బహుజన సామాజిక వర్గాలు చైతన్యం కావడానికి ఎంతో దోహదపడుతుందన్నారు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ బీసీ నోట్‌బుక్‌ను రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలకు, పాఠశాలలకు, సంక్షేమ హాస్టళ్లకు అందజేయాలని, అందుకు తాము సహకరిస్తామన్నారు. మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ బీసీలకు ఈ పుస్తకం ఒక కరదీపికగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ చైర్మన్ బి.ఎస్.రాములు, సభ్యులు వి.కృష్ణమోహన్‌రావు, ఆంజనేయగౌడ్ పాల్గొన్నారు. -
కన్నీరింకిన చోటే జల కళ
తెలంగాణ ఉద్యమానికి ఆజ్యం పోసిన పాలమూరు ప్రజల కష్టాల కొలిమిని కేసీఆర్ ఉద్యమ సమయంలో ప్రపంచానికి విడమరిచి చాటిచెప్పారు. ఆనాడు నెర్రలుబాసిన ఎర్రసెలకల్లో జలాలను రప్పించేందుకు పాలమూరు ఊరూరా పాదయాత్రలు చేసి ఉద్యమ జలస్వప్నాలను స్వప్నించారు. అదే కేసీఆర్ నేడు నదుల నడకను మార్చి తరాల పాలమూరు కరువును తరిమేస్తున్నారు. నదులను గండికొట్టి బాజాప్తాగా నెర్రలు బారిన భూములకు గంగమ్మను అందిస్తున్నారు. నిన్నటిదాకా కన్నీరు పెట్టిన పాలమూరు పల్లెలు నేడు ఆనంద భాష్పాలను వర్షిస్తున్నాయి. కరువుకు నెర్రలు బాసిన నేలకు ముఖచిత్రంగా తెలంగాణ అంచు చివరన సరిహద్దులో ఎడారిగా మారిన గట్టు, కెటిదొడ్డి, ధరూర్ మండలాలకు సాగునీరందించేందుకు రూ. 553 కోట్ల నిధులతో 33 వేల ఎకరాల సాగు విస్తీర్ణం లక్ష్యంగా నేడు గట్టు ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయబోతున్నారు. పేదరికం వల్ల చదువుకు దూరమైన గట్టుమండలం 34.8% అత్యల్ప అక్షరాస్యత రేటుతో దక్షిణాసియాలోనే దిగువస్థానంలో మిగిలిపోయింది. సముద్ర మట్టానికి అత్యంత ఎత్తున ఉన్న గట్టు ప్రాంతానికి తెలంగాణ రాష్ట్ర మొచ్చినా, మిగిలిన ప్రాంతానికి నీళ్లు వస్తాయోమో గానీ ఈ ప్రాంత నేలలకు సాగునీరివ్వడం అసాధ్యమనే అభిప్రాయం అందరిలో బలపడి ఉంది. కానీ, తెలంగాణలో పారే ప్రతి నీటిబొట్టుపైన లెక్కలేసి పెట్టుకున్న కేసీఆర్ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిస్తున్నారు. దాదాపు రూ. 783 కోట్ల నిధులతో 55,600 ఎకరాలకు సాగునీరందించేందుకు నిర్దిష్ట ప్రణాళికతో చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పనులను కూడా కేసీఆర్ పర్యవేక్షిస్తున్నారు. 2003 జూలైలో ఆలంపూర్ జోగుళాంబ ఆలయం నుంచి గద్వాల వరకు 150 కిలోమీటర్ల మేరకు చేసిన పాదయాత్ర ముగింపు బహిరంగ సభలో ‘‘మల్దకల్’’ వెంకటేశ్వర స్వామి సాక్షిగా నడిగడ్డకు న్యాయంగా దక్కాల్సిన చివరి నీటిబొట్టు దక్కేదాకా విశ్రమించనని చేసిన ప్రకటనను నిజం చేస్తున్నారు. 87,500 ఎకరాలకు నీరందించాల్సిన ఆర్డీయస్ ఏనాడూ 50వేల ఎకరాలకు కూడా కనీసం ఒక పంటకు నీరవ్వని దుస్థితి, ఒక లక్షా రెండు వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన జూరాల ప్రాజెక్టు దశాబ్దాల పాటు ఏనాడూ 40 వేల ఎకరాలను కూడా తడపకుండా తరలిపోయిన చరిత్ర, దాని వెనకున్న పాలకుల వివక్షా పూరిత విధానాలు, వత్తాసుగా నిలిచిన స్థానిక భూస్వామ్య రాజకీయాలు మరిచిపోలేని వాస్తవాలు. కానీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలోనే పాలమూరు పొలాల తరాల దాహం తీర్చే నిర్దిష్ట చర్యలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. గద్వాల, ఆలంపూర్‌లతో పాటు ఉమ్మడి జిల్లాలోని 14 నియోజక వర్గాల నీటి కష్టాలకు ముగింపు పలుకుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో 35 లక్షల మందికి పైగా మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రజలు కరువు కుంపటిని మోశారు. జురాల, నెట్టెంపాడు, భీమా తదితర ప్రాజెక్టుల నిర్మాణాన్ని తాబేలు నడకలా మార్చిన ఫలితంగా దాదాపు 28 లక్షల సాగుయోగ్యమైన భూమి ఉన్నా పాలమూరు రైతు బక్కచిక్కి బలవన్మరణాల బాధితుడిగా మారాడు. ఇక్కడి జనం దశాబ్దాల పాటు అనుభవించిన దారిద్య్రాన్ని బద్దలు కొడుతూ కేసీఆర్ పల్లెల తలలపై నీటి సంతకాలు చేస్తున్నారు. నెట్టెంపాడు పెండింగ్ పనులు పూర్తి చేసి జోగుళాంబ గద్వాల్ జిల్లాలో, మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా నాగర్‌కర్నూల్, భీమా2 ద్వారా వనపర్తి, కోయిల్ సాగర్ తదితర ప్రాజెక్టుల ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాలో నూతనంగా నాలుగు లక్షల ఎకరాలు సాగులోకి వచ్చింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 944 కోట్లతో మిషన్ కాకతీయ పథకం ద్వారా మూడు విడతలలో 3,633 చెరువుల పునరుద్ధరణ చేసి మరో 2 లక్షల 38 వేల ఎకరాల ఆయకట్టును అందుబాటులోకి తెచ్చారు. దీంతో పాటు రూ. 35,200 కోట్ల అంచనాలతో పాలమూరు–రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టును ప్రారంభించి కరువును కూకటివేళ్లతో పెకిలించేందుకు పునాదులేశారు. ఇప్పుడు పాలమూరు నేల తల్లి కడుపారా పంటను కంటున్నది. దశాబ్దాల దారిద్య్రం మీద గెలుపు సాధించే దిశగా వడివడిగా అడుగులేస్తున్నది. నాగేటి సాళ్ళల్ల... నా తెలంగాణ...నవ్వేటి బతుకుల్ల... నా తెలంగాణ పాట నిన్నటి జ్ఞాపకం. ఇప్పుడు నాగళ్లు నేలతల్లిపై రేపటి భవితాక్షరాలను దున్నుతున్నాయి. 99% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలున్న పాలమూరు ఉమ్మడి జిల్లా గత చరిత్రను విడిచి తలెత్తుకుని నిలబడుతున్నది. నీటికి అలమటించిన నేలపై కాలువలు పరుగులు పెట్టబోతున్నాయి. ముందు చూపు, ప్రజలపై ప్రేమ, మానవీయ దృక్పథంతో చేపడుతున్న సాగునీటి పథకాలు అతి స్వల్పకాలంలోనే గ్రామాల స్వరూపాన్ని సమగ్రంగా మార్చబోతున్నాయి. (ఈ నెల 29న గట్టు ఎత్తిపోతలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తున్న సందర్భంగా) డా. ఆంజనేయగౌడ్, వ్యాసకర్త తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు 98661 65308 -
గంటలో రాజ్యాంగ పఠనం
సాక్షి, హైదరాబాద్: అతిపెద్ద లిఖిత భారత రాజ్యాంగాన్ని ఒక గంట సమయంలో మౌఖికంగా చెప్పి రాజ్యాంగ స్ఫూర్తిని కలిగించిన లక్ష్మీశ్రీజ(10) తెలంగాణ అద్భుత బాలిక అని వక్తలు కొనియాడారు. బుధవారం శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారిని లక్ష్మీశ్రీజ, ఆమె తల్లిదండ్రులు, న్యూ ఎరా స్కూల్ యజమాని రమణారావు కలిశారు. ఈ సందర్భంగా స్పీకర్ చాంబర్లో లక్ష్మీశ్రీజ భారత రాజ్యాంగాన్ని సునాయాసంగా పఠనం చేయడాన్ని చూసి అక్కడికి వచ్చిన అతిథులు శ్రీజ జ్ఞాపకశక్తిని ప్రశంసించారు. శ్రీజ లాగా రాజ్యాంగాన్ని అలవోకగా చెప్పడం అందరికీ సాధ్యమయ్యే పనికాదని స్పీకర్, మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఎమ్మెల్సీ నారదాసు, టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, బీసీ కమిషన్ మెంబర్ జూలూరి గౌరీ శంకర్ ఆమెను అభినందించారు. -
చంద్రబాబు బీసీ వ్యతిరేకి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వెనుకబడిన తరగతుల(బీసీ) వ్యతిరేకిగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర హైకోర్టు మాజీ న్యాయమూర్తి, జాతీయ బీసీ కమీషన్ మాజీ చైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్య విమర్శించారు. ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో జన చైతన్య వేదిక, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ‘రాజకీయాల్లో సామాజిక న్యాయం’ అనే అంశంపై జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉన్నత న్యాయస్థానాల్లో బీసీలు, ఎస్సీల ప్రవేశాన్ని నిరోధించడానికి చంద్రబాబు ప్రయత్నించారని ఆరోపించారు. బీసీలకు క్షమాపణ చెప్పి, తప్పును సరిదిద్దుకోవాలని చంద్రబాబుకు హితవు పలికారు. రాజకీయాల్లో, న్యాయమూర్తుల నియామకాల్లో సామాజిక న్యాయం జరగాలన్నారు. న్యాయమూర్తుల నియామకాల అంశంలో చంద్రబాబు, జస్టిస్ ఎన్వీ రమణ.. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు రాసిన లేఖల్లోని సమాచారం ఒకేలా ఉందని గుర్తుచేశారు. జ్యుడీషియల్లోనూ బీసీలకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయమూర్తులు బీసీలు కాదు కాబట్టి ఎంత నైపుణ్యం ఉన్నా అర్హత లేని వారిగా సూచిస్తూ కేంద్ర మంత్రికి చంద్రబాబు, జస్టిస్ ఎన్వీ రమణ లేఖలు రాయడం సరికాదన్నారు. న్యాయమూర్తులను నియమించే అధికారం ముఖ్యమంత్రికి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు లేదని తెలిపారు. కేవలం అర్హుడా కాదా అని మాత్రమే సమాధానం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కేసులు పెడితేనే భయం ఉంటుంది జస్టిస్ ఎన్వీ రమణ ఓ పొలిటికల్ బ్రోకర్ అంటూ ఒక న్యాయమూర్తి తన పుస్తకంలో రాశాడని జస్టిస్ ఈశ్వరయ్య గుర్తుచేశారు. స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థను సైతం కలుషితం చేస్తున్నారని మండిపడ్డారు. జస్టిస్ ఎన్వీ రమణ తమ్ముడు పద్మశ్రీ అవార్డు గ్రహీత అని, మరో తమ్ముడు టీటీడీ బోర్డు సభ్యుడని తెలిపారు. ఎన్నో ఆరోపణలున్న న్యాయమూర్తులు కూడా జస్టిస్ ఎన్వీ రమణ లాగా చేయలేదన్నారు. తప్పులు చేస్తే న్యాయమూర్తులపై కూడా కేసులు పెట్టాలని, అప్పుడే వారికి భయం ఉంటుందని స్పష్టం చేశారు. దేంట్లోనైనా పారదర్శకత ఉండాలన్నారు. వ్యవస్థలు అనేవి ప్రజలను కాపాడేలా ఉండాలని సూచించారు. ఓ ప్రశ్నకు జస్టిస్ ఈశ్వరయ్య స్పందిస్తూ.. చంద్రబాబుతో తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. పాలకులు పక్షపాతం చూపొద్దు ‘‘బీసీల పట్ల చంద్రబాబు వైఖరి మారాలి. పక్షపాత ధోరణి విడనాడి, దాపరికం లేని, పారదర్శక పాలన సాగించాలి. ప్రజలందరికీ రాజకీయ సమన్యాయం లభించకుంటే సామాజిక, ఆర్థిక న్యాయాలు లభించవు. న్యాయ, రాజకీయ వ్యవస్థల్లో బీసీలకు సముచిత న్యాయం దక్కడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర సర్వే నిర్వహించి, కులాల వివరాలను ప్రజలకు తెలియజేయాలి. 2011 జనాభా లెక్కల్లోని కులాల వివరాలను ప్రజల ముందుంచాలి. వివిధ వృత్తుల్లో ఉన్న పేదలందరికీ రిజర్వేషన్లు కల్పించాలి. కులాల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కొనసాగాలి. సామాజిక న్యాయం ప్రజల జన్మహక్కు. పాలకులు పారదర్శకతతో వ్యవహరించాలి. పక్షపాత ధోరణి పనికిరాదు. ప్రభుత్వం వాచ్డాగ్ పాత్ర పోషించాలి. ఇందుకోసం పౌరసమాజం చైతన్యవంతంగా కృషి చేయాలి’’ అని జస్టిస్ ఈశ్వరయ్య ఉద్ఘాటించారు. జనచైతన్య వేదిక ప్రతినిధి వి.లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ... ఏపీలో 100 వెనుకబడిన కులాలు ఉండగా, చట్టసభలో వారి పాత్ర నామమాత్రమేనన్నారు. దేశంలో 2,250 కులాలకు పార్లమెంట్లో స్థానం లభించలేదన్నారు. రాజకీయాల్లో ఎంబీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి: ఐవైఆర్ కృష్ణారావు రాజకీయాల్లో అత్యంత వెనుకబడిన కులాలకు (ఎంబీసీ) తగిన ప్రాధాన్యం కల్పించాలని ఏపీ ప్రభుత్వ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ, రాజ్యసభ, కార్పొరేషన్ వంటి పరోక్ష ఎన్నికల్లో ఎంబీసీలకు మరిన్ని పదవులు ఇవ్వాలన్నారు. రాజకీయాల్లో కొందరి భాగస్వామ్యం మాత్రమే ఉంటే అది ప్రజాస్వామ్యం కాదని తేల్చిచెప్పారు. దేవాలయాల ప్రాచీనతను, పవిత్రతను కాపాడాలంటూ చంద్రబాబుకు రాసిన లేఖను కృష్ణారావు మీడియాకు విడుదల చేశారు. -
‘బీసీలే బుద్ధి చెబుతారు’
సాక్షి, హైదరాబాద్ : బీసీలు ఐక్యం కాకపోతే రాబోయే రోజుల్లో ఇబ్బందులు తప్పవని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఓబీసీలకు ఇచ్చిన నిధులపై కేసీఆర్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మహాత్మా జ్యోతిరావ్‌పూలే జయంతిని పురస్కరించుకొని తెలంగాణ బీజేపీ నేతలు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్‌తో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. మహత్మా జ్యోతిరావ్‌పూలే గొప్ప ఆశయాలు కలిగిన వ్యక్తి అని, అట్టడుగు వర్గాల కోసం పూలే పాటుపడ్డారని గుర్తుచేశారు. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు విచ్ఛిన్నకర శక్తులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బలహీన వర్గాల అభివృద్ధి అంటే మహిళ చదువుకొని ఆర్థికంగా ఎదగడమే అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు అత్యంత ప్రమాదకరమైనవని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తాయిలాలు ఇస్తున్నారని, ఎన్ని తాయిలాలు ఇచ్చిన అభివృద్ధే ముఖ్యమని తెలిపారు. ఓబీసీ కమిషన్‌కి చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉందని.. దీనిపై ఉత్తమ్, వీహెచ్‌లు కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించాలని కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకం కెలక్ష్మణ్ మాట్లాడుతూ.. మహాత్మా జ్యోతిరావ్‌పూలే మహిళల చదువు కోసం ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. అంబేడ్కర్ కూడా జ్యోతిరావ్పూలేను గురువుగా భావించరన్నారు. 70 ఏళ్లలో 18వేల గ్రామాలు కరెంట్ లేక ఇబ్బందులు ఎదుర్కొన్నాయని, ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక 16 వేల గ్రామాలకు కరెంట్ ఇచ్చారని తెలిపారు. 60 సంవత్సరాల్లో కాంగ్రెస్ దళితులకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు మోదీని విమర్శిస్తూ.. ప్రజలను పక్కదోవ పట్టిస్తూ, కులాల మధ్య చిచ్చు పెడుతున్నాయని ఆరోపించారు. బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలని చూస్తుంటే విపక్షాలు అడ్డుతగులుతున్నాయని విమర్శించారు. రాబోయే రోజుల్లో బీసీలే కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. నిరుద్యోగ యువత ఉద్యోగాలు కావాలని అడుగుతుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొర్రెలు, చేపలు పంచుతోందని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందన్నారు. మత మార్పిడి చేసుకున్న ముస్లింలకు, క్రైస్తవులకు ఫీజు రాయితీలు ఇస్తున్నారు కానీ హిందువులుగా పుట్టిన బీసీ విద్యార్థులకు రాయితీ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పార్లమెంట్లో ఎంపీలు ప్రవర్తించిన తీరుపై రేపు(గురువారం) నరేంద్ర మోదీ ఒక్క రోజు దీక్ష చేస్తున్నారన్నారు. రిజర్వేషన్లు కావాలని పార్లమెంట్ సమావేశాలను అడ్డుకుంటారు కానీ ప్రైవేటు యూనివర్సిటీలో రిజర్వేషన్లు ఎందుకు కల్పించడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. -
బీసీ కమిషన్‌కు చట్టబద్ధత కల్పించండి
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటులో బీసీ బిల్లును ప్రవేశపెట్టి, బీసీ కమిషన్‌కు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ప్రధాని మోదీకి లేఖ రాశారు. బీసీలకు సామాజిక రక్షణ, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, సామాజిక పథకాలు చేరవేసే బీసీ కమిషన్ బిల్లును నిరుడు పార్లమెంటులో ప్రవేశపెట్టి, ప్రతిపక్షాల అభ్యంతరాలతో సెలెక్ట్ కమిటీకి పంపారన్నారు. ఆ కమిటీ బిల్లును మళ్లీ పార్లమెంటుకు పంపిందన్నారు. సమావేశాలు ముగియడానికి రెండు రోజులే ఉన్నందున పార్లమెంటులో ఆ బిల్లును ప్రవేశపెట్టాలని కృష్ణయ్య లేఖలో పేర్కొన్నారు. -
మహనీయులను స్మరించుకోవాలి
గద్వాల అర్బన్: దేశ చరిత్రను నూతన దారుల్లో నడిపించిన మార్గదర్శకులు జ్యోతిరావుపూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్రామ్లను స్మరించుకోవాలని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు ఆంజనేయులుగౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం గద్వాల క్యాంపు కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. మహనీయుల స్ఫూర్తిని నడిగడ్డలో కొనసాగించేలా యువత ముందుకు సాగాలని సూచించారు. ఏప్రిల్‌ను సామాజిక న్యాయ మాసంగా అన్ని వర్గాల ప్రజలు పాటించాలన్నారు. బాబు జగ్జీవన్‌రామ్ (ఏప్రిల్ 5), మహాత్మాపూలే (ఏప్రిల్ 11), డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (ఏప్రిల్ 14) వంటి మహనీయుల జయంతులను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. బడుగు, బలహీన, మైనారిటీల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. ఈ సమావేశంలో నడిగడ్డ జిల్లా బీసీ ఫోరం కన్వీనర్ గణేష్, సలహాదారులు దడవాయి నర్సింహులు, గట్టన్న, రవీందర్‌గౌడ్, జిల్లా నడిగడ్డ యువత అధ్యక్షుడు చక్రధర్‌రెడ్డి, కన్వీనర్ లక్ష్మీకాంత్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి భాస్కర్; నాయకులు పవన్, వీరేష్, సంచార జాతుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ∙ -
బీసీ కమిషన్ చైర్మన్ రాజీనామా
సాక్షి, అమరావతి: బీసీ కమిషన్ చైర్మన్ కేఎల్ మంజునాథ్ తన పదవికి రాజీనామా చేశారు. తాను నిర్వర్తించాల్సిన పని పూర్తయినందున పదవి నుంచి వైదొలుగుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు రాజీనామా లేఖను ప్రభుత్వానికి పంపించారు. నిజానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుతో పూర్తిగా విసిగిపోయి ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పించే అంశంపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి, నివేదిక ఇచ్చే బాధ్యతను ప్రభుత్వం బీసీ కమిషన్‌కు అప్పగించింది. ఈ కమిషన్‌కు కేఎల్ మంజునాథ్‌ను చైర్మన్‌గా నియమించింది. అన్ని జిల్లాల్లోనూ బీసీ కమిషన్ పర్యటించింది. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, విజ్ఞప్తులు పరిశీలించి, నివేదికను రూపొందించింది. నివేదికను కమిషన్ చైర్మన్ అధికారికంగా పంపించకముందే ఇది ముఖ్యమంత్రి చేతుల్లోకి వెళ్లింది. కమిషన్ సభ్యుల్లో తమకు అనుకూలురైన కొందరి చేత నివేదిక కాపీని చంద్రబాబు తెప్పించుకున్నారు. బీసీ కమిషన్‌కు ఏమాత్రం విలువ ఇవ్వకుండా తన ఇష్టప్రకారమే వ్యవహరించారు. దీంతో కమిషన్ చైర్మన్ మంజునాథ్ కినుక వహించారు. అప్పటి నుంచి కార్యాలయానికి కూడా రాలేదు. ముఖ్యమంత్రి నుంచి అవమానాలు ఎదురుకావడంతోపాటు ఆయన కనుసన్నల్లో పనిచేస్తున్న కమిషన్ సభ్యులు తనను లక్ష్యపెట్టకపోవడంతో మంజునాథ్ ఆవేదనకు గురై చివరకు పదవి నుంచి తప్పుకున్నట్లు సమాచారం. విలువ లేని కమిషన్‌కు చైర్మన్‌గా కొనసాగడం వ్యర్థమని ఆయన నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది. నాకు కొన్ని విలువలు ఉన్నాయి: మంజునాథ్ పని లేకుండా జీతం తీసుకోవడం తనకు ఇష్టం లేదని, అందుకే బీసీ కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేశానని కేఎల్ మంజునాథ్ చెప్పారు. ఆయన శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడారు. తనకు కొన్ని విలువలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. బీసీ కమిషన్ పని డిసెంబర్లోనే పూర్తయిందని, అప్పటివరకే జీతం తీసుకున్నానని వెల్లడించారు. రెండేళ్లపాటు విధి నిర్వహణలో ఉన్నట్లు తెలిపారు. నివేదికను ప్రభు త్వానికి ఇప్పటికీ ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించగా... తాను మెంబర్ సెక్రటరీ కి ఇచ్చానని, అంటే తన పని పూర్తయినట్లేనని పేర్కొన్నారు. కమిషన్ సభ్యులు కొనసాగుతారా? వారు కూడా రాజీనామా చేస్తారా? అని అడగ్గా... ఆ విషయం నాకు తెలియదన్నారు. వారు కొనసాగాలనుకుంటే కొనసాగవచ్చని చెప్పారు. -
ఏపీ: జస్టిస్ మంజునాథ రాజీనామా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ బీసీ కమిషన్ చైర్మన్ పదవికి జస్టిస్ కేఎల్ మంజునాథ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను మెయిల్ రూపంలో సీఎం చంద్రబాబు నాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్‌లకు పంపారు. రిజర్వేషన్లపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించినందున, ఇక తనకు పనిలేదని, అందువల్లే రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. కమిషన్‌కు చైర్మన్‌గా నియమించినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. -
బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధత కల్పించడంలో విఫలం: కృష్ణయ్య
హైదరాబాద్: బీసీ కమిషన్‌కు పార్లమెంట్లో రాజ్యాంగబద్ధత కల్పించడంలో లోక్‌సభ, రాజ్య సభల్లోని బీసీ ఎంపీలు పూర్తిగా విఫలమయ్యారని బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ ఎమ్మె ల్యే ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధత కల్పిస్తామని ఇచ్చిన హామీని ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నిలబెట్టుకోలేదని విమర్శించారు. బిల్లుకు చట్టబద్ధత కల్పించకుండానే సభలను మార్చి 5 వరకు నిరవధికంగా వాయిదా వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. శనివారం విద్యానగర్‌లోని బీసీ భవన్ లో జరిగిన బీసీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు రూ.20వేల కోట్లతో ప్రత్యేక సబ్‌ప్లాన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. బీసీల న్యాయమైన డిమాండ్ల సాధనకు మార్చి చివరి వారంలో పార్లమెంట్ ముట్టడి చేపట్టనున్నట్లు తెలిపారు. సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎర్ర సత్యనారాయణ, నీల వెంకటేశ్, రాజేందర్, బిక్షపతి తది తరులు పాల్గొన్నారు. కాగా తెలంగాణ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా వేములవాడ మదన్మోహన్ నియమితులయ్యారు. -
బీసీ కులాలపై ఇంటింటి సర్వే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వెనుకబడిన కులాల లెక్క తేల్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే నెలలో సుమారు 20 రోజుల పాటు విస్తృతంగా ఇంటింటి సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. అవసరమైతే మరో పది రోజులు పొడిగించి అయినా సమగ్రంగా అధ్యయనం చేయాలని భావిస్తోంది. వెనుకబడిన కులాల రిజర్వేషన్ల మార్పు ప్రక్రియలో దీనితో మరో అడుగు ముందుకు పడుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. బీసీ కమిషన్ ఆధ్వర్యంలో.. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో సమగ్ర అధ్యయనం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందే బీసీ కమిషన్‌ను ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో కమిషన్ ప్రభుత్వ శాఖల వారీగా సమీక్షలు నిర్వహించి బీసీల శాతంపై పరిశీలన పూర్తి చేసింది. మరోవైపు ప్రభుత్వం దీనిపై క్షేత్రస్థాయి పరిశీలనకు సన్నద్ధమవుతోంది. వచ్చే నెలలో ఇంటింటి సర్వే నిర్వహించాలని యోచిస్తోంది. సంక్రాంతి సెలవులు ఉండడంతో.. ఆ సమయంలో సర్వే నిర్వహిస్తే మంచి ఫలితాలు వస్తాయన్న ఉద్దేశంతో ఉంది. ఈ మేరకు సర్వే ఫార్మాట్లను సైతం సిద్ధం చేసినట్లు సమాచారం. వరుసగా ఇరవై రోజుల పాటు సర్వే నిర్వహించాలని.. అవసరమైతే మరో 10 రోజులు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. కర్ణాటక తరహాలో: ఇటీవల కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం బీసీలపై సమగ్ర అధ్యయనం చేసింది. ఆ సర్వే మంచి ఫలితాలు సాధించిన నేపథ్యంలో.. ఆ సర్వే నిర్వహణ తీరును రాష్ట్ర బీసీ కమిషన్ పరిశీలించింది. దాదాపు వారం రోజుల పాటు కర్ణాటక ప్రభుత్వం, ఆ రాష్ట్ర బీసీ కమిషన్‌తో చర్చించింది. అదే తరహాలో రాష్ట్రంలో అధ్యయనం నిర్వహించేలా పక్కా ప్రణాళికను రూపొందించింది. దీనిపై కార్యచరణను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించింది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే సర్వే నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఎంబీసీల లెక్కపై ప్రత్యేక దృష్టి బీసీ కులాల సర్వేతో రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లపై స్పష్టత రానుంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఎంబీసీ (అత్యంత వెనుకబడిన కులాలు) కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే కులాల జాబితా సైతం తేలనుంది. దీంతో ఎంబీసీ కార్పొరేషన్‌కు కేటాయించిన రూ.వెయ్యి కోట్ల నిధుల వినియోగంపై సర్కారుకు స్పష్టత వచ్చే అవకాశముంది. వ్యక్తిగతంగా కాకుండా కుటుంబం యూనిట్‌గా తీసుకుని ఈ సర్వే నిర్వహించనున్నారు. దీనివల్ల కుటుంబాల స్థితి వివరాలూ వెల్లడవుతాయని అధికారులు భావిస్తున్నారు. ఇక నకిలీలకు తావులేకుండా ఆధార్ నంబర్‌ను కూడా నమోదు చేస్తారు. రెవెన్యూ యంత్రాంగమే కీలకం బీసీ సర్వే నిర్వహణలో రెవెన్యూ యంత్రాంగానిదే కీలక పాత్ర కానుంది. వాస్తవానికి బీసీ కులాల సర్వేను రెండు నెలల క్రితమే నిర్వహించాలని సర్కారు భావించింది. కానీ భూప్రక్షాళన ప్రక్రియ నడుస్తుండడంతో తాత్కాలికంగా వాయిదా వేసింది. భూప్రక్షాళన ఈ నెలాఖరుతో ముగియనుంది. దీంతో ప్రభుత్వం వచ్చే నెలలో సర్వే నిర్వహణకు బీసీ కమిషన్‌కు అనుమతినిచ్చే అవకాశముంది. రూ.150 కోట్లు ఖర్చు! దాదాపు నెల రోజుల పాటు జరిగే బీసీ కులాల సర్వే ప్రక్రియలో రెవెన్యూ శాఖతోపాటు పలు ఇతర శాఖల సిబ్బందిని వినియోగించుకోవాలని భావిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉండే ఉపాధ్యాయులను భాగస్వామ్యం చేస్తే సర్వే సులభతరం అవుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే బడివేళల్లో ఉపాధ్యాయులను వినియోగించుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయి. దీంతోసర్వే నిర్వహణపై ప్రభుత్వ నిర్ణయమే కీలకం కానుంది. ఇక సర్వే సమయంలో ఉద్యోగులకు టీఏ, డీఏ ఇవ్వాల్సి ఉంటుంది. కర్ణాటకలో సర్వే కోసం రూ.170 కోట్లు ఖర్చు చేశారు. రాష్ట్రంలో జనాభా కొంత తక్కువగా ఉన్న నేపథ్యంలో.. రూ.150 కోట్ల వరకు నిధులు అవసరమని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. -
బలవంతపు సెలవుపై బీసీ కమిషన్ సభ్య కార్యదర్శి
సాక్షి, అమరావతి: బీసీ కమిషన్ సభ్య కార్యదర్శి కృష్ణమోహన్ సెలవుపై వెళ్లడంతో పలు సందేహాలు తలెత్తుతున్నాయి. మహాత్మా జ్యోతిబా పూలే ఏపీ బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల కార్యదర్శి కృష్ణమోహన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబే బలవంతంగా సెలవుపై పంపినట్లు తెలుస్తోంది. కమిషన్ చైర్మన్‌కు తెలియకుండా హడావుడిగా బీసీ కమిషన్ నివేదిక తీసుకుని, దానిని మంత్రివర్గంలో చర్చించిన పిదప అసెంబ్లీలో ఆమోదం తెలిపిన విషయం విదితమే. దీనిపై కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులు ఇచ్చింది నివేదికే కాదని, తాము అధికారికంగా నివేదిక సమర్పిస్తామని చెప్పి ఆయన ఆ నెల 2న బెంగళూరు వెళ్లిపోయారు. అయితే అధికారిక నివేదిక అంటే తమ ప్రభుత్వానికి మచ్చ వస్తుందని సీఎం చంద్రబాబు భావించారని సమాచారం. అందుకే ఆ నివేదికపై మళ్లీ చర్చ జరగకుండా ఉండటానికి ప్రభుత్వ అధికారి కృష్ణ మోహన్‌ను సెలవుపై వెళ్లాల్సిందిగా ఆయన ఆదేశించారు. కాగా, తనకు తెలియకుండా నివేదికను ప్రభుత్వం తీసుకోవడంపైనా, దానికి కమిషన్ సభ్యులు సహకరించడంపైనా కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథ్ తీవ్ర ఆగ్రహంగా ఉన్న విషయం తెలిసిందే. తన పేరుపై ఏర్పాటైన కమిటీ రిపోర్టు తనకే తెలియకుండా ప్రభుత్వానికి చేరడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. కమిషన్ తీర్మానం చేయకుండానే రిపోర్టును కార్యాలయం నుంచి బయటకు తీసుకువెళ్లిన సభ్యులపై దొంగతనం కేసుపెట్టే యోచనలో కూడా చైర్మన్ జస్టిస్ మంజునాథ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 4న కమిషన్ తరఫున సభ్య కార్యదర్శి కృష్ణమోహన్ నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేస్తారని జస్టిస్ మంజునాథ్ ఈనెల 2న మీడియాకు తెలిపారు. అయితే నాలుగవ తేదీ నుంచి కృష్ణ మోహన్ సెలవుపై ఉండటం గమనార్హం. హడావుడిగా నివేదికకు అసెంబ్లీ ఆమోదం.. పోలవరం టెండర్లకు కేంద్రం బ్రేక్ వేసిన నేపథ్యంలో ప్రజల్లో మొదలైన చర్చను దారి మళ్లించేందుకు ప్రభుత్వం హడావుడిగా కాపుల రిజర్వేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చిందనే విమర్శలు ఉన్నాయి. ఈనెల 1న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో బీసీ కమిషన్ నివేదికపై చర్చించి ఆమోదించారు. అనంతరం అసెంబ్లీలో నివేదిక ప్రవేశపెట్టి కాపులకు 5 శాతం రిజర్వేషన్ అంటూప్రకటించారు. అయితే అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో మంత్రివర్గ నిర్ణయాలు ప్రకటించకూడదని, అసెంబ్లీలో మాత్రమే చర్చించి ప్రకటించాలనే నిబంధన ఉన్నా ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదు. అసెంబ్లీలో నివేదిక ప్రవేశ పెట్టిన రోజే కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథ్ మీడియాతో మాట్లాడారు. సభ్యులు ఇచ్చింది నివేదికే కాదని స్పష్టం చేశారు. తాము అధికారిక నివేదిక ఇస్తామన్నారు. అధికారిక నివేదికపై సీఎం అసంతృప్తి చైర్మన్ జస్టిస్ మంజునాథ్ ప్రకటనపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. మంత్రివర్గ సమావేశంలో నివేదికను ఆమోదించేశామని, మరోసారి నివేదిక అందించడం ఏమిటని మెంబర్ సెక్రటరీ కృష్ణమోహన్ వద్ద ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. కమిషన్ చైర్మన్ నిర్ణయమని కృష్ణమోహన్ చెప్పడంతో సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అధికారిక రిపోర్టు అనే ప్రసక్తి రాకుండా ఉండటానికి కృష్ణమోహన్‌ను సెలవులో వెళ్లాల్సిందిగా సీఎం ఆదేశించినట్లు సమాచారం. కాగా, నివేదిక సమర్పణపై కమిషన్ చైర్మన్ మంజునాథ్‌ను శనివారం ‘సాక్షి’ సంప్రదించగా.. మెంబర్ సెక్రటరీ సెలవులో ఉన్నారని, ఆయన ఆదివారం నివేదికను అందజేస్తారని చెప్పారు. అయితే గొంతులో ఇన్ఫెక్షన్ కారణంగా మాట్లాడలేకపోతున్నానని మెంబర్ సెక్రటరీ కృష్ణమోహన్ లీవ్లెటర్లో పేర్కొన్నట్లు సమాచారం. ఆయనను సంప్రదించేందుకు ‘సాక్షి’ యత్నించగా అందుబాటులోకి రాలేదు. మరోపక్క అసెంబ్లీలో ఆమోదించాల్సి ఉన్నందున నివేదికను వెంటనే ఇవ్వాలని కమిషన్ చైర్మన్‌ను సీఎం కోరారు. తాను సెలవులో ఉన్నానని, వచ్చిన తరువాత ఇస్తానని జస్టిస్ మంజునాథ్ చెప్పినా సీఎం వినిపించుకోకుండా ముగ్గురు సభ్యుల ద్వారా ఆ నివేదికను తెప్పించుకున్నారు. వారూ తనకు విలువనివ్వకపోవడం కూడా కమిషన్ చైర్మన్ ఆగ్రహానికి కారణమని తెలుస్తోంది. నిబంధనలు తెలిసీ ఈ విధంగా ఎందుకు చేశారని సభ్యులను జస్టిస్ మంజునాథ్ ప్రశ్నించినట్లు సమాచారం. బీసీ కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకంపై ‘పిల్’ హైకోర్టును అభ్యర్థించిన బీసీ సాధికారత ఫెడరేషన్ ప్రతినిధి సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథ్, సభ్యులు వెంకటేశ్వర సుబ్రహ్మణ్యం, మల్లెల పూర్ణచంద్రరావు, శ్రీమంతుల సత్యనారాయణల నియామకాలను సవాలు చేస్తూ ఉమ్మడి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. వెనుకబడిన తరగతులను గుర్తించే విషయంలో అటు చైర్మన్కుగానీ, ఇటు మిగిలిన సభ్యులకు గానీ ఎటువంటి అనుభవంలేదని, అందువల్ల వారి నియామక ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ బీసీ సాధికారిత ఫెడరేషన్ అధికార ప్రతినిధి పామర్తి జయప్రకాశ్ నారాయణ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. -
ఇప్పటికీ నెరవేరని స్వప్నం
బీసీలకు రాజ్యాంగబద్ధ హక్కులు కల్పించడానికి డా‘‘ అంబేడ్కర్ చేసిన తీవ్ర ప్రయత్నం గత 52 ఏళ్లుగా బీసీ కమిషన్ల నియామకాలకే పరిమితం కావడం విషాదం. బీసీలపై శీతకన్ను విషయంలో జాతీయ ప్రతిపక్షానిదే ప్రధానపాత్ర. దాదాపు 70 ఏళ్ల తరువాత బీసీలకు రాజ్యాంగబద్ధ హక్కులు లభించే చారిత్రక ఘట్టంలోనూ.. నాడు అధికారపక్షంగా, నేడు ప్రతిపక్షంగా తన ఆలోచనా విధానంలో, దృక్పథంలో, వైఖరిలో ఎలాంటి మార్పును తెచ్చుకోకపోవడంతో ఆ జాతీయ పార్టీ నైజం ఏమిటో బీసీలు గమనిస్తూనే ఉన్నారు. భారత రాజ్యాంగపిత డా‘‘ బి.ఆర్. అంబేడ్కర్ బీసీల కోసం చేసిన కృషి మధ్యలోనే ఆగిపోయింది. సెప్టెంబర్ 27, 1951 నాడు నాటి కేంద్రప్రభుత్వంలో తొలి న్యాయశాఖ మంత్రిగా తన పదవికి రాజీనామా చేసిన అనంతరం బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆవిష్కరించిన ప్రసంగం పాఠంలోని మాటలు.. ‘‘ప్రభుత్వం పట్ల నేను అసంతృప్తి చెందిన మరొక విషయం గురించి ఇప్పుడు నేను ప్రస్తావిస్తాను. అది వెనుకబడిన వర్గాలు, షెడ్యూల్డ్ కులాలకు సంబంధించినది. వెనుకబడిన వర్గాల కోసం ఎలాంటి రక్షణలను కూడా రాజ్యాంగం పొందుపర్చనందుకు నేను చాలా చింతిస్తున్నాను. ఈ అంశాన్ని రాష్ట్రపతి నియమించిన కమిషన్ ప్రతిపాదనల ప్రాతిపదికపై కార్యనిర్వాహక ప్రభుత్వానికి వదిలిపెట్టడం జరిగింది. మనం రాజ్యాంగాన్ని ఆమోదించి సంవత్సరం పైబ డింది. కాని కమిషన్ నియామకం గురించి ప్రభుత్వం కనీసం ఆలోచించడమే లేదు’’. ఎంతగా కృషి చేసినప్పటికీ బీసీలకు రాజ్యాంగబద్ధ హక్కులు కల్పించలేక పోయినందుకు బాబాసాహెబ్ అంబేడ్కర్ తీవ్రంగా మథనపడ్డారు. 26 జనవరి 1950లో అమలులోకి వచ్చిన భారత రాజ్యాంగం సంవత్సర కాలాన్ని పూర్తి చేసుకున్నప్పటికీ సామాజికంగా విద్యా, ఉపాధి రంగాలలో వెనుకబడిన తరగతులను గుర్తించడానికి ఎలాంటి చర్యలను చేపట్టకపోవడం పట్ల అసహనాన్ని ప్రదర్శించారు. ఆర్టికల్ 340 ద్వారా కనీసం బీసీ కమిషన్ని కూడా ఏర్పాటు చేయించలేకపోయినందుకు ఆయన విచారాన్ని వ్యక్తం చేశారు. తాను న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఇలా జరగడం పట్ల తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. డా‘‘ అంబేడ్కర్ రాజీనామా అనంతర రాజకీయ పరిణామాలు, ఒత్తిడుల నేపథ్యంలో 1953లో జాతీయ స్థాయిలో మొదటి బీసీ కమిషన్ (కాకా కాలేల్కర్)ను నియమించడం జరిగింది. ఆ కమిషన్ 1955లో తన నివేదికను సమర్పించింది. కాగా సిఫారసులు ఏకగ్రీవంగా లేవని నాటి నెహ్రూ ప్రభుత్వం ఈ ప్రక్రియను పక్కన పెట్టింది. తదనంతర పరిణామాలలో 26 ఏళ్ల తరువాత 1979లో జాతీయ స్థాయిలో 2వ బీసీ కమిషన్ (బీపీ మండల్)ను మొరార్జీదేశాయ్ నాయకత్వంలోని జనతాపార్టీ నియమించింది. మండల్ కమిషన్ 31 డిసెంబర్ 1979న నాటి రాష్ట్రపతి జ్ఞానీ జైల్‌సింగ్‌కు నివేదికను సమర్పించింది. కానీ ఇందిరాగాంధీ నేతృత్వంలోని ప్రభుత్వం దాన్ని బుట్టదాఖలు చేసింది. పదేళ్ల తరువాత 1990లో వీపీ సింగ్ నాయకత్వంలోని జనతాదళ్ ప్రభుత్వం మండల్ సిఫారసుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఓబీసీలకు 27% రిజర్వేషన్లను అమలులోకి తెచ్చింది. జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధత కల్పించడానికి ఉద్దేశించిన 123వ రాజ్యాంగ సవరణ బిల్లును వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో లోక్‌సభలో తిరిగి ప్రవేశపెట్టాలని కేంద్రమంత్రిమండలి నిర్ణయించడం శుభ పరిణామం. గత చేదు అనుభవం నేపథ్యంగా సమావేశాల ఆరంభానికి ముందు సంశయాల నివృత్తికి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి. ఆ దిశగా నరేంద్రమోదీ ప్రత్యేక చొరవ తీసుకుంటే ప్రతిష్టాత్మకమైన ఈ బిల్లు పార్లమెంట్ ఉభయసభలలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆమోదం పొందే వీలు కలుగుతుంది. ఈ బిల్లును మోదీ ప్రభుత్వం గతంలో లోక్‌సభలో ప్రవేశపెట్టడం, ఆమోదింపజేయడం జరిగింది. అయితే అక్కడ కూడా బిల్లును అడ్డుకునేందుకు ప్రయత్నించిన జాతీయ ప్రతిపక్షానికి మెజారిటీ లేకపోవడం వల్ల చేష్టలుడిగి విఫలమైంది. బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి ముందు ప్రధాన ప్రతిపక్షం మినహా అన్ని రాజకీయ పార్టీలు అనుమానాలను నివృత్తి చేసుకొని బిల్లుకు సంపూర్ణంగా మద్దతునిచ్చాయి. ప్రధాన ప్రతి పక్షం మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సందర్భంలో ఒక కీలక ఘట్టాన్ని గమనిం చాలి. ప్రభుత్వానికి నిజాయితీగా పేద వర్గాలకు ఏదైనా చేయాలని సంకల్పం ఉంటే రాజకీయాలతో పనిలేదని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు ముందుకు వేయడం గమనించాలి. ఇవాళ దేశ మంతా ఈ గొప్ప పరిణామాన్ని తెలంగాణలో చూడవచ్చు. పార్టీ జెండాలకు, ఎజెండాలకు భిన్నంగా బీసీల సమగ్ర వికాసానికి ఎవరు ఎలాంటి సూచనలు చేసినా స్వీకరించి రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించి అమలుకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికి ఆదర్శంగా నిలుస్తారు. ఎలాగూ తిరిగి ఉభయసభలు రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించాల్సి ఉన్నందున ఆమోదయోగ్యమైన సూచనలను పరిగణనలోకి తీసుకోవడం సముచితం. ఇందుకు జూలై 7, 2017న బెంగళూరులో జరి గిన దక్షిణాది రాష్ట్రాల బీసీ కమిషన్ల సమావేశం నిర్దిష్టంగా చేసిన సూచనలను కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించాలి. ఈ సమావేశాలలోనైనా బిల్లు ఉభయ సభలలో ఆమోదింపచేయడానికి కేంద్రప్రభుత్వం అంకితభావంతో కృషి చేసినప్పుడే బీసీల చిరకాల స్వప్నం సాకారమవుతుంది. (డిసెంబర్ 6న డా‘‘ బి.ఆర్. అంబేడ్కర్ వర్ధంతి) - డా‘‘ వకుళాభరణం కృష్ణమోహనరావు వ్యాసకర్త తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు మొబైల్ : 98499 12948 -
మీ సర్వేలెలా ఉన్నాయ్..?
కర్ణాటకలో పర్యటిస్తున్న బీసీ కమిషన్ బృందం సాక్షి, హైదరాబాద్: బీసీ రిజర్వేషన్లు, ఎంబీసీ కులాల అధ్యయనాన్ని బీసీ కమిషన్ వేగవంతం చేసింది. ఆర్నెల్లలో రిజర్వేషన్లు, ఎంబీసీ కులాలపై స్పష్టతనివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో ఓవైపు వినతులు స్వీకరిస్తూనే మరోవైపు ఇతర రాష్ట్రాల్లో సర్వే తీరును అధ్యయనం చేస్తోంది. ఇందులో భాగంగా కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు నేతృత్వంలోని సభ్యుల బృందం సోమవారం కర్ణాటకలో పర్యటించింది. అక్కడ బీసీ రిజర్వేషన్లపై చేసిన సర్వేకు సంబంధించి ఆ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ హెచ్ కాంతరాజ్, సభ్యులు కేఎన్ లింగప్ప, గురులింగయ్య, ధర్మరాజులతో సోమవారం సమావేశమైంది. ఆరు గంటల పాటు చర్చించిన సభ్యులు.. సర్వే ప్రక్రియలో ఎదురైన అవాంతరాలు, న్యాయపర సమస్యలు, తీసుకున్న చర్యలను తెలుసుకున్నారు. కర్ణాటకకు వెళ్లిన బృందంలో వకులాభరణం కృష్ణమోహన్, ఆంజనేయగౌడ్, గౌరీశంకర్ ఉన్నారు. -
ఆ కులాలను బీసీల్లో చేర్చండి
బీసీ కమిషన్‌ను కోరిన ఎంపీ అసదుద్దీన్ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో దశాబ్దాలుగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న పలు కులాలను బీసీల్లో చేర్చాలని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ బీసీ కమిషన్‌ను కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం ఒవైసీ మాట్లాడుతూ.. అహిర్ యాదవ, గవిలి, సారోల్లు తదితర కులాల వారంతా ఆర్థిక, సామాజికంగా వెనకబడి ఉన్నారన్నారు. ఈ కులాలను బీసీల్లో కలిపి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను అందించాలన్నారు. అంతకుముందు సంచార కులాలకు చెందిన ప్రతినిధులు బీసీ కమిషన్‌ను కలసి తమ వాదనలు వినిపించారు. బాగోతుల, బొప్పల, శ్రీక్షత్రియ రామజోగి, ఓడ్, గౌలి, బైలుకమ్మర, కాకిపడిగల, సాధనాశూరుల, తెరచీరల కులాల ప్రతినిధులు తమను డీఎస్టీ (డీనోటిఫైడ్ ట్రైబ్స్) కేటగిరీగా పరిగణించాలన్నారు. ఎంబీసీల్లో చేర్చితే ఫలాలు అందవని అన్నారు. దీనిపై స్పందించిన ఆ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు పూర్తిస్థాయిలో పరిశీలన చేపట్టిన తర్వాత నిర్ధారిస్తామని హామీ ఇచ్చారు. -
త్వరలో బీసీ కమిషన్‌కు హోదా
కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధ హోదా లభిస్తుందని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధ హోదా బిల్లు, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేలా కేంద్రం చొరవ తీసుకోవాలని కోరుతూ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ బుధవారం దత్తాత్రేయను కలసి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. ఓబీసీ కమిషన్ బిల్లుకు రాజ్యసభలో ప్రతిపక్షాలు అడ్డుతగలకపోతే ఎప్పుడో ఆమోదం పొందేదన్నారు. సవరణల పేరుతో లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లును రాజ్యసభలో విపక్ష పార్టీలు అడ్డుకున్నాయని విమర్శించారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లు ఉభయసభల్లో ఆమోదం పొందుతుందని, ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి థావర్‌చంద్ గెహ్లట్ తనకు స్పష్టం చేశారని దత్తాత్రేయ తెలిపారు. బీసీల అభ్యున్నతికి దత్తాత్రేయ తీసుకుంటున్న చొరవకు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. -
బీసీ కమిషన్‌కు ‘హోదా’పై ఏకాభిప్రాయం
న్యూఢిల్లీ: వెనుకబడిన వర్గాల జాతీయ కమిషన్ (ఎన్సీబీసీ)కు రాజ్యాంగ హోదా కల్పించే బిల్లుపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ ఏకాభిప్రాయానికి వచ్చింది. దీంతో ఈ బిల్లు వచ్చే నెల 17 నుంచి ప్రారంభంకానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే ఆమోదం పొందే అవకాశం ఉంది. ఈ బిల్లును ఇప్పటికే లోక్‌సభ ఆమోదించగా రాజ్యసభలో విపక్షాలు వ్యతిరేకించాయి. దీంతో బిల్లుపై ఏకాభిప్రాయ సాధనకు బీజీపీ ఎంపీ భూపేంద్ర యాదవ్ నేతృత్వంలో శరద్ యాదవ్, రాంగోపాల్ యాదవ్, సతీశ్ మిశ్రా, ప్రఫుల్ పటేల్ తదితర 25 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. తాజాగా కమిటీ బిల్లుపై ఏకాభిప్రాయానికి వచ్చింది. -
‘ఎంబీసీ జాబితాను సమర్పించాలి’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న అత్యంత వెనుకబడిన కులాల జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలని బీసీ కమిషన్‌ను రాష్ట్ర ఎంబీసీ సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేసింది. ఎంబీసీ కులాల సామా జిక, ఆర్థిక అవసరాలకు అనుగుణంగా పథకాలు రూపొందించాలని పేర్కొంది. ఏ కులాలను ఎంబీసీలుగా గుర్తించాలో తేలితే కాని ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వలేమని ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. మంగళవారం శ్రీనివాస్ నేతృత్వంలో ప్రతినిధిబృందం బీసీ కమిషన్‌కు వినతిపత్రాన్ని సమర్పించింది. -
రాజ్యాధికారం కావాలి
2019 ఎన్నికల్లోపే రాజ్యాధికారంలో బీసీల వాటా తేల్చాలి - బీసీల సమర శంఖారావం సభలో నేతల హెచ్చరిక సాక్షి, హైదరాబాద్/మన్సూరాబాద్: ‘మాకు రాయితీ లొద్దు.. రాజ్యాధికారం కావాలి. 2019 ఎన్నికలకు ముందే తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు చట్టసభల్లో బీసీల వాటాను ప్రకటించాలి. లేదంటే ఆయా పార్టీలను శంకరగిరి మాన్యాలు పట్టించడం ఖాయం’అని బీసీల సమర శంఖారావం సభ హెచ్చరించింది. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీని వాస్ గౌడ్ అధ్య«క్షతన ఆదివారం హైదరాబాద్‌లో జరి గిన బీసీల సమరశంఖారావం సభకు కేంద్రమంత్రి దత్తాత్రేయ, బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగురామన్న, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, భిక్షమయ్య మాట్లాడారు. 119 నియోజకవర్గాల్లో పూలే విగ్రహాలు బీసీల సమర శంఖారావం సభ జనాభా ప్రాతి పాదికన బీసీ రిజర్వేషన్లను 50శాతానికి పెంచాలని డిమాండ్ చేసింది. సమగ్ర కుటుంబ సర్వే లెక్కలను అధికారికంగా ప్రకటించాలని, మండల కమిషన్ మురళీధర్‌రావు, అనంతరామ కమిషన్ సిఫార్సులను విధిగా అమలు చేయాలని కోరింది. జాతీయస్థాయిలో బీసీ కమిషన్ ఏర్పాటు చేసి, ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని.. దానికి రాజ్యంగబద్ధమైన చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేసింది.119 నియోజకవర్గాల్లో మహత్మా పూలే విగ్రహాలను ప్రతిష్టించాలని ప్రకటించింది. త్వరలోనే బీసీ కమిషన్: దత్తాత్రేయ ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ త్వరలోనే జాతీయ స్థాయిలో బీసీ కమిషన్‌కు చట్టబద్ధత రాబోతోందని, దీనికి సంబంధించిన విధివిధానాలు ఇప్పటికే రూపొందించినట్లు తెలిపారు. మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా బడ్జెట్లో బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చామన్నారు. 2019 ఎన్నికల్లోపే బీసీ సబ్‌ప్లాన్‌ను, తమిళనాడు తరహాలో బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పారు. -
‘బీసీల ఆరోగ్య ప్రమాణాలపై నివేదికివ్వండి’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని బీసీల ఆరోగ్య ప్రమాణాలు, మహిళలు, శిశువుల ఆరోగ్య పరిస్థితిపై విశ్లేషణాత్మక నివేదిక ఇవ్వాలని బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు వైద్యారోగ్య శాఖను కోరారు. బీసీల రిజర్వేషన్ల పెంపు అధ్యయనంలో భాగంగా శాఖల వారీగా సమీక్ష నిర్వహిస్తున్న బీసీ కమిషన్.. శనివారం వైద్యారోగ్య శాఖతో సమావేశమైంది. ఈ సందర్భంగా బీఎస్ రాములు మాట్లాడుతూ.. బీసీల స్థితిగతులతో పాటు ఎస్సీ, ఎస్టీ, ఓసీ జాబితాలోని సామాజిక వర్గాల ఆరోగ్య ప్రమాణాల్లోని వ్యత్యాసాలను కూడా పేర్కొనాలన్నారు. ప్రస్తుత అభివృద్ధి, నూతన నైపుణ్యాలను బీసీలలోని కొన్ని కులాలు అందుకోలేక పోతున్నాయని, ఆ వర్గాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఎంబీసీలు, సంచార జాతులపైనా అధ్యయనం చేస్తున్నామని పేర్కొన్నారు. -
బీసీలకు మోదీ సర్కారు అండ
బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా చరిత్రాత్మకం: అమిత్ షా నల్లగొండ టూటౌన్: కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలోనే జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించడం చరిత్రాత్మకమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అన్నారు. బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించినందుకు మోదీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ మంగళవారం నల్లగొండలోని లక్ష్మీ గార్డెన్లో బీసీ సంఘాల ప్రతినిధులు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ... 50 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో చేయని గొప్ప పనిని బీజేపీ ప్రభుత్వం చేసిందన్నారు. బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పిస్తే రాజ్యసభలో కాంగ్రెస్ అడ్డుపడుతోందన్నారు. బీసీలకు మోదీ ప్రభుత్వం అండగా ఉంటుందని, తెలంగాణలో తమను ఆదరించాలని కోరారు. ఎన్నికల్లో అన్ని కులాలకు ప్రాతినిధ్యం: దత్తాత్రేయ 2019 ఎన్నికల్లో అన్ని కులాలకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉండాలని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదాతో రాష్ట్రంలో 50 శాతం ఉన్న బీసీలకు ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. బీజేపీకి మద్దతుకు బీసీలు సిద్ధం: ఆర్.కృష్ణయ్య చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తే బీజేపీకి మద్దతు తెలపడానికి బీసీలందరూ సిద్ధంగా ఉన్నారని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. బీసీ కమిషన్‌కు మోదీ ప్రభుత్వం రాజ్యాంగ హోదా కల్పించడం అభినందనీయమన్నారు. బీసీలను ఓటర్లుగానే చూశారు: లక్ష్మణ్ గత 50 ఏళ్ల నుంచి దేశంలో అన్ని పార్టీలూ బీసీలను ఓటర్లుగానే చూశాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. బీసీల హక్కులను కాపాడేందుకు, వారి సంక్షేమా నికి మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో వివిధ కుల సంఘాల ప్రతినిధులు అమిత్‌షాను గజమాలలతో సన్మానించారు. ఇందులో ఎంపీ భూపేంద్ర యాదవ్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, బీజేపీ నేత లక్ష్మయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
ముస్లిం రిజర్వేషన్లను వ్యతిరేకించటం తగదు
బీజేపీకి బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు సూచన హైదరాబాద్: ముస్లింలలో అత్యంత వెనుకబడిన వర్గాల కోసం రిజర్వేషన్ ప్రవేశపెడితే బీజేపీ వ్యతిరేకించటం సరైంది కాదని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు అన్నారు. బీసీ ‘ఇ’గ్రూపులో ఉన్న ముస్లింలలో ఫకీర్, ధోబీ, ముస్లిం, తురక చాకలి, తురక కాశ, పాములు పట్టేవారు తదితర 14 కులాలవారు అత్యంత వెనుకబడి ఉన్నారని, వీరి కోసమే రిజర్వేషన్లు ప్రవేశపెట్టారన్నారు. ‘ముస్లింలల్లో వెనుకబడిన తరగతుల కోటా పెంపు’ అంశంపై ముస్లిం ఆలోచనాపరుల వేదిక ఆధ్వర్యంలో ఆదివార మిక్కడ జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బీసీ కమిషన్ వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. వృత్తులు కోల్పోయినవారికి జీవనోపాధి కల్పించేందుకు కమిషన్ పరంగా తోడ్పాటు కల్పిస్తామన్నారు. చాలా ఏళ్లుగా అసమానతలకు గురైన కులాలను గుర్తించి అవి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటామన్నారు. 6 నెలల్లో ముస్లిం మైనార్టీల అభివృద్ధిపై సమగ్ర సర్వే చేసి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమిషన్‌ను కోరిందని, పూర్తిగా సర్వే చేసి వాటి వివరాలను ఆన్లైన్ కూడా పెడతామని రాములు అన్నారు. ముస్లిం ఆలోచనాపరుల వేదిక కన్వీనర్ డానీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్కైబాబా,, వాహెద్, కవి యాకూబ్, సాంబశివరావు, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, ఖుర్షీద్, హుస్సేన్, షాజహానా, దాసోజు లలిత, షేక్ ఫకీర్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. బీసీ కమిషన్ చైర్మన్ దూదేకుల కులానికి క్షమాపణ చెప్పాలి: సత్తార్ సాహెబ్ బీఎస్ రాములు దూదేకుల కులానికి క్షమాపణ చెప్పాలని దూదేకుల సంఘం నాయకుడు సత్తార్ సాహెబ్ సమావేశంలో డిమాండ్ చేశారు. అంతకు ముందు బీఎస్ రాములు మాట్లాడుతూ బి.సి. ‘బి’గ్రూపులో ఉన్న దూదేకుల కులస్తులను బీసీ ‘ఈ’గ్రూపులో కలపాలనే డిమాండ్‌ను కొంతమంది వ్యతిరేకిస్తున్నారని, దీనిపై ఫిర్యాదు లు, వినతి పత్రాలు కూడా అందుతున్నాయని అనటంతో సత్తార్ సాహెబ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఎస్ రాములుకు, సత్తార్ సాహెబ్‌కు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. -
బీసీ రిజర్వేషన్ల పెంపుపై కసరత్తు షురూ
అధ్యయనం చేయాలని బీసీ కమిషన్‌కు ప్రభుత్వ ఆదేశం సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల పెంపుపై ముందడుగు పడింది. ఇటీవల మైనార్టీలు, ఎస్టీల రిజర్వేషన్లు పెం చిన క్రమంలో బీసీ రిజర్వేషన్లనూ పెంచా లని యోచిస్తున్నట్లు సీఎం కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బీసీ కమిషన్ అధ్యయన నివేదిక ఆధారంగా పెంపు చేపడతామని పేర్కొన్న సంగతి తెలి సిందే. తాజాగా బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి శాస్త్రీయ పద్ధతిలో సమగ్ర అధ్యయనం చేయాల్సిందిగా ప్రభుత్వం బీసీ కమి షన్‌కు సూచించింది. ఈమేరకు శనివారం ఆ శాఖ ముఖ్య కార్యదర్శి జి.అశోక్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అధ్యయనం తాలుకు నివేదికను ఆర్నెల్లలోగా ప్రభుత్వానికి సమర్పించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అధ్యయన విధివిధానాలివే... ♦ బీసీ కులాల్లో సంచార, వృత్తిపరమైన వర్గాలపై ప్రత్యేక దృష్టి సారించి క్షేత్ర పరిశీలన చేయాలి. ♦ సామాజిక, విద్య, ఆర్థిక స్థితిగతులతో పాటు వారి జీవన విధానాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. ♦ వృత్తి పరమైన ఇబ్బందులు అధిగమించేందుకు తీసుకోవల్సిన చర్యలపైనా అధ్యయనం చేయాలి. ♦ సంప్రదాయ వృత్తుల్లో ఉన్న కులాల ప్రస్తుత పరిస్థితి, ప్రత్యామ్నాయ వెసులుబాటును పరిశీలించాలి ♦ కేంద్ర,, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు. ప్రైవేటు సంస్థల్లో బీసీ కులాలకు చెందిన ఉద్యోగుల సంఖ్యను పరిశీలించాలి. ♦ బీసీ కులాల్లో విద్య, అక్షరాస్యత పరిస్థితులతో పాటు, ఆరోగ్య పరమైన స్థితిగతులు, మాతాశిశు మరణాల పరిస్థితిని ఇతర వర్గాలతో పోల్చి అంచనాలు రూపొందించాలి. ♦ బ్యాంకు రుణాల సౌకర్యం, సంక్షేమ పథకాల్లో లబ్ధి పొందుతున్న తీరును అధ్యయనం చేయాలి. -
బీసీ రిజర్వేషన్ల పెంపుపై టీ.సర్కార్ కసరత్తు
హైదరాబాద్ : ఇప్పటికే ముస్లిం రిజర్వేషన్ల కోటాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా బీసీ రిజర్వేషన్ల పెంపుపై కసరత్తు చేపట్టింది. బీసీ కమిషన్‌కు విధివిధానాలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. రిజర్వేషన్ల పెంపునకు అవసరమైన పూర్తి సమాచారం సేకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. బీసీల సామాజిక, ఆర్థిక, విద్యా స్థితిగతులపై సమగ్ర అధ్యయనం చేయాలని బీసీ కమిషన్‌కు తెలంగాణ సర్కార్ సూచనలు చేసింది. ఎంబీసీలు, సంచార జాతులపై ప్రత్యేకంగా దృష్టి, వారి స్థితిగతులు కూడా అధ్యయనం చేయాలని పేర్కొంది. ఇందుకు సంబంధించి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ (టీవోఆర్)లు కూడా కేబినెట్లో ఆమోదం తెలిపింది. కాగా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్టీలకు, ముస్లింలకు (బీసీ-ఈ) 12 శాతం చొప్పున రిజర్వేషన్ కల్పిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీల్లోని ఇతర కులాల వారికీ రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. బీసీ కమిషన్ అధ్యయనం చేసి, రూపొందించిన నివేదిక అందాక వారికి కూడా రిజర్వేషన్లు పెంచుతామని,. బీసీ రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గవని సీఎం గతంలో స్పష్టం చేసిన విషయం విదితమే. -
‘మత’ రిజర్వేషన్లకు మద్దతివ్వం
బీసీ ప్రతినిధుల సభలో కేంద్ర మంత్రి వెంకయ్య సాక్షి, హైదరాబాద్: ‘మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధం. దానికి మేము మద్దతివ్వం. ఆర్థికంగా వెనుకబ డిన వారిని అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చేం దుకు మాత్రమే రిజర్వేషన్లను ఉపయోగించుకో వాలి. ప్రభుత్వాలు ఆ మేరకు చర్యలు తీసుకో వాలి’ అని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. శుక్రవారం ఇక్కడ ఆర్టీసీ కళాభవన్‌లో జరిగిన బీసీ ప్రతిని ధుల మహాసభలో ఆయన మాట్లాడారు. ‘పేద కులాలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు బీజేపీ సహ కరిస్తుంది. మతపరమైన రిజర్వేషన్లతో ఇతర కులాలు నష్టపోతాయి. కాంగ్రెస్ బీసీలను ఓటుబ్యాంకుగా మాత్రమే చూసింది. ప్రధాని మోదీ జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పిస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. జాతీయ బీసీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్ల మాదిరిగా సర్వాధికారాలను సొంతం చేసుకుం ది. అరవై సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో బీసీలకు రాజ్యాధికారం లేకుండా పోయింది. కానీ, బీజేపీ హయాంలో బీసీ నేత ప్రధానిగా ఉన్నారు’ అని వెంకయ్య చెప్పారు. జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలకు విద్యా, ఉద్యోగా ల్లో సరైన ప్రాధాన్యత కల్పించాలన్నారు. అవి రాష్ట్ర ప్రభుత్వ కమిషన్లు... రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన బీసీ కమిషన్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పే విషయాలనే నివేదిక రూపంలో ఇస్తున్నాయని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఎజెండాకు అనుగుణంగా నివేదికలు ఇచ్చి వాటిని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం వ్యవహరించడం సరికాదన్నారు. ‘రాష్ట్ర బీసీ కమిషన్ ఆగమేఘాల మీద ఒక్క ముస్లింల రిజర్వేషన్లపైనే ప్రభుత్వానికి నివేదిక ఎలా ఇస్తుంది. బీసీల్లో ఉన్న అన్ని కులాలపై అధ్యయనంచేసి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలి. ఆమేరకు చర్చించి అన్ని వర్గాలకు న్యాయం చేయాలి. ముస్లింలకు రిజర్వేషన్లు పెంచడంతో బీసీలు తీవ్రంగా నష్టపోతారు. ఈ రిజర్వేషన్ల ను పార్లమెంటు ఆమోదిస్తేనే అమలు సాధ్యమ వుతుంది.’ అన్నారు. శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ బీసీల్లో కొత్త కులాలు పుట్టుకొస్తున్నాయని, ఇటీవల భూపా లపల్లి జిల్లాలో పర్యటించిన సమయంలో రాజన్న కులం పేరు విన్నానన్నారు. సమగ్ర అధ్యయనం చేసి బీసీల స్థితిగతులను పరిశీలిం చాలని సూచించారు. ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా లభించడంతో బీసీలపై జరిగే అక్రమాలు, అన్యాయాలను పరిశీలించి చర్యలు తీసుకునే అధికారం ఉంటుందన్నారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసేందుకు కేంద్రం సుముఖంగా ఉందన్నారు. జాతీయ బీసీ కమిషన్‌కు చట్టబద్ధత కల్పించి నందుకు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కేంద్ర మంత్రులు వెంకయ్య, దత్తాత్రేయలను సన్మానించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, బీసీ సంఘ నేతలు సత్యనారాయణ, గొరిగె మల్లేశ్ యాదవ్, కృష్ణ పాల్గొన్నారు. -
బీసీ కమిషన్ సిఫార్సులివీ..
బీసీ–ఈకి మరో 6 శాతం కోటా ఇవ్వాలని సూచన ► తమిళనాడు తరహా విధానం అమలు చేయాలి ► వైవిధ్య సూచిక, సమాన అవకాశాల కమిషన్ ఏర్పాటు చేయాలి ► బీసీ–ఈలో ఇతర ముస్లిం వర్గాలను చేర్చడంపై ప్రత్యేక అధ్యయనం అవసరమని వెల్లడి సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన ముస్లిం తరగ తులతో కూడిన ‘బీసీ–ఈ’గ్రూపునకు మరో 6 శాతం రిజర్వేషన్ల కోటా ఇవ్వాలని రాష్ట్ర బీసీ కమిషన్ సిఫార్సు చేసింది. వీరికి ఇప్పటికే 4 శాతం రిజర్వేషన్ ఉన్నందున.. మొత్తంగా 10 శాతానికి పెంచాలని సూచించింది. అయితే బీసీ–ఈలో ఇతర ముస్లిం వర్గాలను చేర్చడంపై ప్రత్యేక అధ్యయనం అవసరమని స్పష్టం చేసింది. ఆర్థికంగా, సామాజి కంగా వెనకబడిన పలు వెనకబడిన తరగతుల రిజర్వేషన్ల పెంపునకు సంబంధించిన నివేదికలో బీసీ కమిషన్ కీలక సిఫార్సులు చేసింది. ప్రభుత్వం ఆదివారం ఈ నివేదికను శాసనసభలో ప్రవేశపె ట్టింది. ‘‘ముస్లింలలోని వెనుకబడిన తరగతులకు బీసీ–ఈ కేటగిరీలో 12 శాతం రిజర్వేషన్లు కల్పిం చాలని, ఏవైనా ఇబ్బందులు ఎదురైతే కనీసం 9 శాతానికి తగ్గకుండా రిజర్వేషన్లు అమలు చేయాలని ఇప్పటికే సుధీర్ కమిషన్ సిఫార్సు చేసింది. ముస్లిం జనాభాలో 75.6 శాతం వెనుకబడిన తరగతుల కేటగిరీలోకి వస్తారని, మొత్తం జనాభాలో వారి ప్రాతినిధ్యం 9.6 శాతం ఉంటుందని సుధీర్ కమిష న్ గుర్తించింది. ఆ సిఫార్సులు అంగీకరించదగి నవని అభిప్రాయపడుతున్నాం. బీసీ–ఈ గ్రూపు నకు గత ప్రభుత్వం కల్పించిన 4 శాతం రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. వాటికి అదనంగా మరో 6 % రిజర్వేషన్లు కల్పించాలని గట్టిగా సిఫార్సు చేస్తు న్నాం’’అని బీసీ కమిషన్ నివేదికలో స్పష్టం చేసింది. నివేదికలోని ప్రధాన అంశాలు ⇒ విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దని కోర్టు తీర్పులున్నా.. అసాధారణ పరిస్థితులుంటే పరిమితికి మించవచ్చనే వెసులు బాటూ ఉంది. ఇందుకు సామాజికంగా, విద్యా పరంగా వెనకబడిన తరగతుల గుర్తింపునకు సంబంధించి సరైన గణన ద్వారా సేకరించిన సమగ్ర సమాచారం అందుబాటులో ఉండాలి. ⇒ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీల జనాభా నిష్పత్తి పెరిగింది. ఉమ్మడి రాష్ట్రంలోని రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల తో పోల్చితే తెలంగాణ ప్రాంత జనాభాలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు అధికంగా ఉండడమే దీనికి కారణం. ఈ నేపథ్యంలో 50 శాతం పరిమితికి మించి రిజర్వేషన్లు కల్పించడం సమంజసమే. ⇒ రాష్ట్రంలో పరిస్థితుల దృష్ట్యా గణించదగ్గ సమా చారం ఆధారంగా విద్యా, ఉద్యోగాల్లో 50శాతం పరిమితి లేకుండా రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ నిబంధనలను పునః సమీక్షించాల్సిన అవసరముంది. ⇒ రిజర్వేషన్ల పెంపుపై తమిళనాడు విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనుసరించవచ్చు. తమిళనా డులో 85వ దశకం నుంచి 69 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ముస్లింలతో సహా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 69 శాతం రిజర్వేషన్లు కల్పించేం దుకు ఆ రాష్ట్ర శాసనసభలో సమగ్ర చట్టం (యాక్ట్ 45/94)ను ఆమోదించింది. కోర్టుల్లో సవాలుకు వీల్లేకుండా ఆ చట్టాన్ని 76వ రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్లో చేర్చారు. ఈ చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చ డంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. కానీ తమిళనాడులో 69% రిజర్వేషన్ల అమలుకు ఈ చర్య రాజ్యాంగపర రక్షణ కల్పించింది. ⇒ తమిళనాడు తరహాలో తెలంగాణలో సైతం 50 పరిమితికి మించి రిజర్వేషన్లు అమలు చేసేందుకు శాసనసభలో ఓ చట్టాన్ని ఆమోదించి 9వ షెడ్యూల్లో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి. ⇒ సచార్, కుందూ కమిటీల సిఫార్సుల మేరకు రాష్ట్రంలో వైవిధ్య సూచిక (డైవర్సిటీ ఇండెక్స్) ఏర్పాటు చేయాలన్న సుధీర్ కమిషన్ సిఫార్సును సమర్థిస్తున్నాం. మానవ వనరుల కూర్పులో వైవిధ్యం ఆధారంగా రాష్ట్రంలోని ప్రతి సంస్థకు ర్యాంకింగ్స్ కల్పించాలి. రాష్ట్రంలోని అన్ని శాఖలు, సంస్థల్లో వైవిధ్య సూచికలు అమలు చేయాలి. ⇒ శిక్షణ, నియామకాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో సమాన అవకాశాల కల్పన కోసం సమాన అవకాశాల కమిషన్ ఏర్పాటు చేయాలన్న సుధీర్ కమిషన్ సిఫార్సునూ సమర్థిస్తున్నాం. ⇒ ముస్లింలోని సయీద్, మిర్జా, ఖాన్, ఇతర గ్రూపులు తమను బీసీ–ఈ కేటగిరీలో చేర్చి రిజర్వేషన్లు కల్పించాలని కోరాయి. బీసీ–బీ గ్రూపు కేటగిరీలో ఉన్న ముస్లింలలోని దూదేకుల, లద్దాఫ్, పింజరీ, నూర్‌బాషా వర్గాలు తమను బీసీ–ఈ గ్రూపులోకి మార్చాలని కోరాయి. ఈ రెండు విషయాల్లో ఇప్పటికిప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదు. ప్రత్యేక అధ్యయనం, సర్వే అవసరమని బీసీ కమిషన్ భావిస్తోంది. ⇒ బీసీ–ఈ కేటగిరీ కోటా పెంచితే ఏ, బీ, సీ, డీ గ్రూపుల వారి విద్య, ఉద్యోగాలు, రాజకీయ కోటాపై ప్రభావం పడుతుందనే ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో బీసీల ప్రస్తుత రిజర్వేషన్లలో మార్పు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. -
ముస్లిం రిజర్వేషన్ల పెంపుపై ఉద్యమిస్తాం
♦ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ♦ అసెంబ్లీలో వ్యతిరేకిస్తాం సాక్షి, హైదరాబాద్: ముస్లిం రిజర్వేషన్లను పెంచాలని రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం పై అసెంబ్లీలో, బయటా దీర్ఘకాలిక ఉద్యమా నికి సిద్ధమవుతున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ప్రకటించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ ఓటుబ్యాంకు రాజకీయాలకు వ్యతిరేకంగా రాజకీయ పోరాటానికి దిగనున్నట్లు వెల్లడిం చారు. ఒకటి, రెండు రోజుల్లో పార్టీ సమావే శాన్ని నిర్వహించి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుంటామన్నారు. ఎలాంటి శాస్త్రీ యపరమైన సమాచారం, అధ్యయనం లేకుం డా ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని 16న అసెంబ్లీలో తమ పార్టీ పూర్తి గా వ్యతిరేకిస్తుందన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముస్లిం రిజర్వేషన్లను పెంచాల నే నిర్ణయం ద్వారా ప్రభుత్వం చారిత్రక తప్పిదానికి పాల్పడిందని ధ్వజమెత్తారు. ఎలాంటి చట్టబద్ధత లేని సుధీర్ కమిటీ నివేదికను ఆధారంగా తీసుకుని ముస్లింల స్థితిగతులపై బీసీ కమిషన్ తప్పుల తడకగా సర్వే చేసి నివేదిక ఇవ్వడం సరికాదన్నారు. ప్రజలు ప్రతిఘటించాలి: కిషన్‌రెడ్డి భూమిని, ఆకాశాన్ని ఏకం చేసైనా మత పరమైన రిజర్వేషన్లను అడ్డుకుంటామని బీజే ఎల్పీనేత కిషన్‌రెడ్డి హెచ్చరించారు. ముస్లింలకు బీసీల కోటాలో రిజర్వేషన్లు అమ లు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరే కంగా బీజేపీ ప్రజా ఉద్యమాన్ని ప్రారంభి స్తుందన్నారు. మతమార్పిళ్లకు ఊతమిచ్చే ఈ రిజర్వేషన్లను ప్రజలు ప్రతిఘటించాలని కోరారు. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును లెక్కచేయకుండా రాజ్యాంగ విరుద్ధంగా, అం బేడ్కర్ ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడం సరికాద న్నారు. ముస్లింలకు బీసీల కోటాలో రిజర్వేష న్లు ఇవ్వడం బీసీలను వంచించడమే అవు తుందని పేర్కొన్నారు. మతపరమైన రిజర్వే షన్లపై పునరాలోచించాలని, లేనిపక్షంలో బీసీల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కో వాల్సి వస్తుందని హెచ్చరించారు. -
‘బీసీ’ బిల్లు ప్రవేశపెట్టడంపై సీఎం హర్షం
సాక్షి, హైదరాబాద్: జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ బద్ధత కల్పించడానికి వీలుగా పార్లమెంటులో బిల్లు (రాజ్యాంగ సవరణ బిల్లు) ప్రవేశపెట్టడంపై సీఎం కె.చంద్రశేఖర్‌రావు సంతోషం వ్యక్తం చేశారు. బీసీ కమిషన్‌కు రాజ్యాంగ బద్ధత కల్పించడం ప్రగతిశీల చర్యగా అభివర్ణించిన సీఎం.. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించారు. ఈ బిల్లుకు టీఆర్ఎస్ మద్దతు పలుకు తుందని స్పష్టం చేశారు. బిల్లుకు అనుకూలంగా ఓటేయడంతోపాటు తెలంగాణ తరఫున మద్దతుగా నిలవాలని తమ పార్టీ ఎంపీలను కోరారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాదిరిగానే బీసీ కమిషన్‌కు రాజ్యాంగ బద్ధత కల్పించడం వల్ల దేశంలోని ఇతర వెనుకబడిన తరగతులకు ఎంతో మేలు కలుగుతుందని చెప్పారు. -
బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధత
అందుకోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తాం: కేసీఆర్ ⇒ సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థుల మెస్ చార్జీల పెంపు ⇒ అందరూ కావాలంటే వచ్చే ఏడాది బీసీ సబ్‌ప్లాన్ ⇒ దళితులకు భూపంపిణీ నిరంతర ప్రక్రియ ⇒ అంబేడ్కర్ 105వ జయంతినాడు 10 వేల ఎకరాలు పంచుతాం ⇒ ఈ ఏడాదే రెండు లక్షల ‘డబుల్’ ఇళ్లు నిర్మిస్తాం ⇒ ఫీజుల పథకం కొనసాగుతుందని వెల్లడి సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధత కల్పిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. బీసీలకు సబ్ ప్లాన్ తేవడానికి తమకు ఏ మాత్రం అభ్యంతరం లేదని.. అది కావాలని అందరూ భావిస్తే వచ్చే ఆర్థిక సంవ త్సరంలోనే తీసుకొస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 90 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా రిటీలే ఉన్నారని.. ఓసీ కులాలన్నీ కలిస్తే తొమ్మి దింపావు శాతమే ఉంటారని పేర్కొన్నారు. కులానికో సబ్‌ప్లాన్ పెట్టేస్తే ఏ గొడవ ఉండదని నవ్వుతూ అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో పద్దులపై చర్చలో ముఖ్యమంత్రి మాట్లాడారు. సంక్షేమ హాస్టళ్ల మెస్ చార్జీల పెంపునకు ఆదేశా లిచ్చామని.. ప్రస్తుతమిస్తున్న రూ.600–650ను రూ.1,000–1,100కు పెంచాలని నిర్ణయించా మని తెలిపారు. దీనిపై ఒకటి రెండు రోజుల్లో ప్రకటన చేస్తామన్నారు. ఎంబీసీ (మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్)పై ఇంకోసారి నిర్ణయం తీసు కోవాల్సి ఉందని.. అది కూడా బీసీ కమిషన్‌కు ఇచ్చి నిర్ధారణ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. భూపంపిణీ చేస్తాం.. దళితులకు ఇప్పటికే పంపిణీ చేసిన 9 వేల ఎకరాలు కాకుండా.. అంబేడ్కర్ 105వ జయం తి సందర్భంగా మరో 10 వేల ఎకరాల భూమి ని ఒక ప్యాకేజీగా దళితులకు పంచుతామని కేసీఆర్ వెల్లడించారు. భూమితోపాటు ఒక ఏడాది పెట్టుబడినీ ఇస్తామన్నారు. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ తనకున్న 66 ఎకరాల భూమిని దళితులకు ఇవ్వడానికి ముం దుకు వచ్చారని తెలిపారు. విదేశాల్లో, హైదరా బాద్‌లో స్థిరపడి.. ఊళ్లలో ఉన్న వ్యవసాయ భూమిని పట్టించుకోని వారు దళితులకు ఇవ్వొచ్చని.. అలాంటివారుంటే ఎమ్మెల్యేలు ఒప్పించాలని సూచించారు. భూపంపిణీ నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. ‘ఫీజు’ కొనసాగుతుంది ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తీసుకొచ్చారని, దాన్ని తాము ఏమాత్రం మార్చకుండా అలానే అమలుచేస్తున్నామని కేసీఆర్ చెప్పారు. రీయింబర్స్మెంట్ పెండింగ్‌లో ఉందంటూ కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నది వాస్తవం కాదని.. ఏ కాలేజీ అయినా సర్టిఫికెట్లు ఇవ్వకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక విదేశాలకు వెళ్లే పేదలకు అపరిమితంగా సాయం చేస్తామని... 300 దరఖాస్తులు వస్తే 136 మందికి సాయం చేశామని కేసీఆర్ పేర్కొన్నారు. ఎన్ని వందల మంది విదేశాలకు వెళ్లాలనుకున్నా సాయం చేస్తామని తెలిపారు. ఈ ఏడాది రెండు లక్షల ఇళ్లు.. పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, నీటిపారుదల శాఖల్లో సుమారు రూ.50 వేల కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయని, అందువల్ల డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి పెద్ద కాంట్రాక్టర్లు అందుబాటులోకి రాలేదని కేసీఆర్ చెప్పారు. వారితో ఈ మధ్యే మాట్లాడామని, ఈ ఏడాది గ్రామాల్లో లక్ష ఇళ్లు, హైదరాబాద్‌లో మరో లక్ష ఇళ్లు కట్టించి ఇస్తామని ప్రకటించారు. వచ్చే ఏడాది కూడా ఇళ్లు మంజూరు చేస్తామని, ఎంత ఖర్చయినా నిర్మించి ఇస్తామని తెలిపారు. ఎవరిపైనా తమకు వివక్ష లేదని పేర్కొన్నారు. ‘దళిత క్రిస్టియన్లు కూడా ఉంటారు. కానీ రిజర్వేషన్ వంటివి దక్కవేమోనని క్రిస్టియన్లని చెప్పుకోవడానికి వెనుకాడతారు. వారికి న్యా యం జరగాలి. మతం మారినంత మాత్రాన కులం మారాల్సిన అవసరం లేదు. దళిత క్రిస్టియ న్లకు సంబంధించి కేంద్రానికి లేఖ రాస్తున్నాం. అన్ని మతాలకు సమాన గౌరవం ఇస్తున్నాం. క్రిస్టియన్లను తక్కువ చేసి చూడటంలేదు. అందరికీ లబ్ధి చేకూర్చుతాం’ అని కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్ నుంచి హజ్ వెళ్లేవారు ‘గెస్ట్ ఆఫ్ అల్లా’ ‘‘ప్రపంచంలో ఎవరికీ లేని గౌరవం తెలంగాణ రాష్ట్రానికి ఉంది. ప్రపంచం మొత్తం హజ్ యాత్రకు మక్కాకు వెళ్తారు. మన నిజాం రాజు పవిత్రమైన కాబా పక్కనే రుబాత్ కట్టారు. పూర్వ హైదరాబాద్ స్టేట్ నుంచి వెళ్లి ఆ రుబాత్‌లో ఉండే వారిని గెస్ట్ ఆఫ్ అల్లా అంటారు. అలాంటి ప్రత్యేకతలు ఉండా లనే అజ్మీర్‌లో ప్రయత్నం చేస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ రెండుసార్లు రాజస్థా న్కు వెళ్లి అక్కడి సీఎంకు విజ్ఞప్తి చేశారు. మరోసారి వెళ్లి స్థలం కోసం ప్రయత్నిస్తారు. రెండో అధికార భాషగా ఉర్దూను అమలు చేయాలని రెండు మూడు రోజుల కిందే ఆదేశించాను. యూసుఫెన్ దర్గా, బడీ పహాడ్ దర్గా, జహంగీర్ పీర్ దర్గా.. ఇక్కడ ముస్లింల కంటే హిందువులు ఎక్కువగా వెళ్తా రు. ఔరంగజేబు గోల్కొండపై దాడి చేసే సమయంలో యూసుఫేన్ దర్గా వద్ద తలవంచాకే ఆయనకు విజయం వరించిందని అంటారు. నేను చాలా సార్లు వెళ్లాను. టీఆర్ఎస్ ప్రకటించినప్పుడు 2001లో యూసుఫేన్ దర్గా వద్ద పాదాభివందనం చేసి ర్యాలీగా వెళ్లాను’’ అని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. రూ.1.12 లక్షల కోట్లు ‘బడ్జెట్ లెక్కల్లో పొంతని లేదని విమర్శిస్తున్నారు. వాస్తవానికి పొంతన ఉండదు. అన్ని రాష్ట్రాలకూ అలాగే ఉంటుంది. బడ్జెట్ అంచనా, సవరించిన అంచ నా అని ఉంటుంది. ఈ ఏడాది రూ.1.07 లక్షల కోట్ల వ్యయానికి చేరుకుంటామని భావించాం. అదృష్టవశాత్తు రూ.1.12 లక్షల కోట్లకు చేరుకుంటున్నాం’ అని కేసీఆర్ తెలిపారు. -
రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్ర
బీసీ కమిషన్ రద్దుపై రాజ్యసభలో విపక్ష ఆందోళన న్యూఢిల్లీ: వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ (ఎన్సీబీసీ)ను రద్దు చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంపై సమాజ్‌వాదీ పార్టీ నేతృత్వంలో విపక్షాలు శుక్రవారం రాజ్యసభలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. దీని వెనుక రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్ర ఉందని ఆరోపించాయి. ఎస్పీ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో డిప్యూటీ చైర్మన్ కురియన్ సభను 10 నిమిషాలు వాయిదా వేశారు. సామాజిక న్యాయం, సాధికారత మంత్రి తావర్ చంద్ గెహ్లాట్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు కొనసాగుతాయని ప్రధాని అనేకసార్లు స్పష్టం చేశారని చెప్పారు. వెనుకబడిన తరగతుల కమిషన్‌కు రాజ్యంగబద్ధత కల్పించేందుకు ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుందన్నారు. 1992లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏర్పాటైన ఎన్సీబీసీకి రాజ్యాంగబద్ధత కల్పించేందుకు బదులుగా రద్దు చేయాలని చూస్తున్నారని రామ్‌గోపాల్ యాదవ్(ఎస్పీ) మండిపడ్డారు. ఎన్సీబీసీ స్థానంలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల కమిషన్(ఎన్‌సీఎస్‌ఈబీసీ)ను ఏర్పాటు చేయడం వెనుక దళితులకు, యాదవులకు రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్ర ఉందన్నారు. నిర్ణయం వెనుక ఆర్ఎస్ఎస్ హస్తం ఉందని పరోక్షంగా పేర్కొన్నారు. ఎస్పీ సభ్యలకు కాంగ్రెస్, బీఎస్పీ సభ్యులు మద్దతు పలికారు. రూ. 45,622 కోట్ల అప్రకటిత ఆదాయం ఐటీశాఖ గత 3 ఆర్థిక సంవత్సరాల్లో, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి వరకు 2,534 వ్యక్తులు, గ్రూపులకు సంబంధించి సోదాలు జరిపి, రూ. 45,622 కోట్ల అప్రకటిత ఆదాయాన్ని బహిర్గతం చేసిందని ఆర్థిక సహాయ మంత్రి సంతోష్ గంగ్వార్ లోక్‌సభలో చెప్పారు. నగలు, నగదు సహా రూ. 3,625 కోట్ల విలువైన అప్రకటిత ఆస్తులను జప్తు చేసిందన్నారు. బినామీ లావాదేవీల నిషేధ చట్టం కింద రూ. 2వేల కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించి 140 కేసుల్లో నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 2016 నాటికి రూ. 8,08,318 కోట్ల వ్యవసాయ రుణాలను అందించామన్నారు. ‘గోవధకు పాల్పడితే మరణ శిక్ష’ గోవధ, గోవుకు సంబంధించిన ఇతర నేరాలకు పాల్పడితే మరణదండన విధించాలని ప్రతిపాదిస్తూ బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి లోక్‌సభలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించిన రాజ్యంగంలోని 37వ అధికరణ ప్రకారం ఆవుల సంరక్షణకు కేంద్ర పరిధిలో సంస్థ ఏర్పాటు చేయాలని కోరారు. లోక్‌సభకు ‘ఆత్మహత్య’ బిల్లు మానసిక ఆరోగ్యరక్షణ బిల్లును ఆరోగ్య మంత్రి నడ్డా లోక్‌సభలో ప్రవేశపెట్టారు. మానసిక రోగులకు మెరుగైన చికిత్స అందించాలని చెబుతున్న దీనికి అన్ని పార్టీల సభ్యు లూ మద్దతు పలికారు. ఆత్మహత్యను నేరంగా పరిగణించకూడదనే ప్రతిపాదన కూడా ఈ బిల్లులో ఉంది. ఇతర ముఖ్యాంఖ్యాలు ► రూ. 5వేల, రూ. 10వేల నోట్లను ప్రవేశపెట్టే యోచన లేదని ఆర్థిక సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్‌సభకు తెలిపారు. దీనిపై రిజర్వు బ్యాంకుతో చర్చించగా, వీటిని ప్రవేశపెట్టే పరిస్థితి లేదని తేలిందన్నారు. ► మాజీ ఎంపీల పింఛన్ నిర్ణయించే అధికారం పార్లమెంటుకే ఉంటుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ స్పష్టం చేశారు. మాజీ ఎంపీల్లో 80 శాతం మంది కోటీశ్వరులని సుప్రీం కోర్టు అన్నట్లు వచ్చిన వార్తలను లోక్‌భలో సభ్యులు ప్రస్తావించడంతో ఆయన స్పందించారు. ► వైద్యవిద్యా సంస్థల్లో అదనంగా 5వేల పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లను కల్పించామని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య రంగానికి నిధులను 28 శాతం పెంచామన్నారు. -
జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా
హైదరాబాద్: జాతీయ బీసీ కమిషన్‌కు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైన హోదా కల్పించడం పట్ల ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య హర్షం వ్యక్తం చేశారు. బీసీ కమిషన్ అధికారాల కోసం 20 ఏళ్లుగా చేసిన కృషికి ఫలితం దక్కిందన్నారు. గతంలో జాతీయ బీసీ కమిషన్‌కు కేవలం కులాల చేర్పు, తొలగింపు అధికారాలు మాత్రమే ఉండేవని చెప్పారు. తాజాగా రాజ్యాంగహోదా కలగడంతో బీసీలపై దాడులు జరిగితే క్షేత్రస్థాయిలో విచారణ జరిపే అధికారం ఉంటుందన్నారు. అంతేకాకుండా రిజర్వేషన్ల అమలులో అక్రమాలు అరికట్టడం, ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పర్యవేక్షించే అధికారం ఉంటుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళా కమిషన్ మాదిరిగానే జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించినందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
ముస్లింల స్థితిగతులపై అధ్యయనం
ఆత్మకూరు(పరకాల) : రాష్ట్రంలోని ముస్లింల స్థితిగతులపై బీసీ కమిషన్ అధ్యయనం చేస్తుండగా.. కమిషన్ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్ మంగళవారం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆత్మకూరు మండలంలోని కటాక్షపూర్‌లోని కాశీ(రాళ్లు కొట్టి జీవనం గడుపుకునే) పనిచేసే కుటుంబాలను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌తో కలిసి కృష్ణమోహన్‌రావు కలుసుకున్నారు. కుటుంబాలు ఏ స్థితిలో ఉన్నాయనే వివరాలు తెలుసుకునేందుకు పలువురి గృహాలకు వెళ్లి జీవనశైలి, ఆరోగ్య స్థితిగతులు, కుటుంబపోషణ, పిల్లల చదువుల పై ఆరా తీశారు. అలాగే కటాక్షపూర్ గుట్టల్లో పనిచేసే కార్మికులను కలిసి వారి పరిస్థితులు తెలుసుకున్నారు. తిండికీ కష్టమవుతోంది.. బీసీ కమిషన్ పర్యటన సందర్భంగా కాశీ కుటుంబాలకు చెందిన పలువురు కమిషన్ సభ్యుడు కృష్ణమోహన్, కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్ ముందు తమ గోడు వెల్ల బోసుకున్నారు. తినడానికి తిండి కష్టమవుతోందని, రాళ్ల పనితో అనారోగ్యం బారిన పడుతున్నామని వాపోయారు. తమకు శాశ్వత జీవనోపాధి కల్పించడంతో పాటు పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా కృష్ణమోహన్ మాట్లాడుతూ కుటుంబాల స్థితిగతులపై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందచేస్తామని తెలిపారు. కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ మాట్లాడుతూ కాశీ కుటుంబాలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, కార్మికులు సొసైటీ ఏర్పడితే పథకాలు అందుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ మహేందర్‌జీ, తహసీల్దార్ వెంకన్న, ఎంపీడీఓ నర్మద, సీఐ శ్రీనివాస్, డాక్టర్ రేష్మ, సర్పంచ్ రజిత, ఎంపీటీసీ గోరీబీ, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి నర్సింహస్వామి, సహాయ అభివృద్ధి అధికారి రమేష్‌రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ముస్లింల స్థితిగతులపై బీసీ కమిషన్ పరిశీలన
నర్సంపేట : పట్టణంలోని పలు ముస్లిం కుటుంబాలను బీసీ కమిషన్ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్, జాయింట్ కలెక్టర్ హరిత సోమవారం కలుసుకున్నారు. తొలుత వారు ముందుగా ఆర్అండ్బీ అతిథి గృహంలో సమావేశమయ్యారు. ఆ తర్వాత పట్టణంలోని మసీద్ వద్ద ఉన్న ముస్లిం కుటుంబాలను కలిసి వారి జీవన విధానం, స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. ముస్లింలకు ప్రధాన వృత్తి లేదని, దుర్భర జీవితాలను గడుపుతున్నందున వివరాలు సేకరిస్తున్నామని, నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి అందించనున్నట్లు కృష్ణమోహన్ తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లయీస్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, మైనార్టీ శాఖ ఈడీ సర్వర్, వరంగల్ ఆర్డీఓ మహేందర్‌జీ, సంగూలాల్, కామగోని శ్రీనివాస్, నాయిని నర్సయ్య, వేముల సాంబయ్య, యాకుబ్, పాష, ఇర్ఫాన్, ముస్లింలు పాల్గొన్నారు. గుండ్రపల్లిలో పర్యటన నెక్కొండ(నర్సంపేట): నెక్కొండ మండలంలోని గుండ్రపల్లిలో బీసీ కమిషన్ సభ్యుడు కృష్ణమోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా ముస్లిం ప్రజల వాస్తవ జీవన స్థితిగతులను తెలంగాణ సివిల్ సప్లయీస్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సివిల్ సప్లయీస్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ కాసీ, దుదేకుల కులస్తుల అభివృద్ధికి ప్రభుత్వం నుంచి నిధులు అందేలా కృషి చేస్తానని హామి ఇచ్చారు. జిల్లా కో ఆప్షన్ సభ్యుడు అబ్దుల్నబీ, సర్పంచ్ గుగులోత్ నందనాయక్ తదితరులు ఉన్నారు. -
జిల్లాల పర్యటనకు బీసీ కమిషన్
⇒ బీసీ–ఈ కులాల సామాజిక స్థితులపై అధ్యయనం ⇒ 10 నుంచి 14 వరకు పర్యటనలు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: బీసీ కమిషన్ తొలిసారిగా క్షేత్రస్థాయిలో పర్యటించి బీసీ కులాల తీరును అధ్యయనం చేయనుంది. ఇందులో భాగంగా తొలుత ‘బీసీ–ఈ’కులాల ఆర్థిక, సామాజిక స్థితిగతులను పరిశీలించనుంది. ఈ మేరకు పర్యటన షెడ్యూల్‌ను బీసీ సంక్షేమ శాఖ కమిషనర్, కమిషన్ సభ్య కార్యదర్శి జీడీ అరుణ జిల్లా కలెక్టర్లకు పంపారు. కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు, సభ్యులు వకుళాభరణం కృష్ణమోహన్, ఈడిగ ఆంజనేయగౌడ్, జూలూరు గౌరీశంకర్‌లు రోజుకు రెండు జిల్లాల చొప్పున ఈనెల 10 నుంచి 14 వరకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తారు. సర్వే నమూనాలు సిద్ధం.. బీసీ–ఈ కులాల తీరుపై అధ్యయనానికి ప్రత్యేక నమూనా పట్టిక (ప్రొఫార్మా)ను కమిషన్ రూపొందించింది. బీసీ–ఈలు అత్యధికంగా ఉన్న ప్రాంతాలు, గ్రామాల వివరాలను ఈనెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు తెలియజేయాలని కలెక్టర్లను కమిషన్ ఆదేశించింది. హిందీ, ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ బాషల్లో రూపొందించిన ఈ ప్రొఫార్మాను ప్రతి జిల్లాకు పంపింది. ఇందులో సామాజిక పరిస్థితులు, విద్య సౌకర్యాలు, ఉపాధి అవకాశాలు, జీవన స్థితిగతులు తెలుసుకునేలా ప్రశ్నావళి ఉంది. అలాగే ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారనేది కూడా ఉంది. ప్రతి జిల్లాకు కనీసం 500 సర్వే పత్రాలు పూర్తిచేసి ఈ నెల 15 నాటికి బీసీ కమిషన్ కార్యాలయానికి పంపించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. ఈ సర్వే పత్రాలను క్రోఢీకరించి వారి అవసరాలను ప్రభుత్వానికి కమిషన్ నివేదించనుంది. -
బీసీ కమిషన్‌కు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్: వెనుకబడిన తరగతుల వారిని గుర్తించడంలో బీసీ కమిషన్ అనుసరించిన విధానం సక్రమంగా లేదని హైకోర్టులో శశిధర్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది. దీనిపై బీసీ కమిషన్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. -
బీసీ కమిషన్ చట్ట సవరణ రాజ్యాంగ విరుద్ధం
చైర్మన్ గా రాములు నియామకం రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్లు సాక్షి, హైదరాబాద్: బీసీ కమిషన్ చట్ట సవరణ, కమిషన్ చైర్మన్ గా బి.ఎస్.రాములు నియామకంపై ఉమ్మడి హైకోర్టు బుధవారం తెలంగాణ ప్రభుత్వ వివరణ కోరింది. న్యాయ , బీసీ సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు, బీసీ కమిషన్ కార్యదర్శి, చైర్మన్ బి.ఎస్.రాములుకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌ల ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. -
ఒకే రోజు ఆరు బిల్లులకు ఆమోదం
బీసీ కమిషన్ కోరలులేని పులి వంటిదే: ఆర్.కృష్ణయ్య సాక్షి, హైదరాబాద్: ఒకేరోజు శాసనసభ ఆరు బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించింది. భూసేకరణ బిల్లు, బీసీ కమిషన్ చట్ట బిల్లు, ఏపీ ట్రిబ్యునల్‌లోని తెలంగాణ పెండింగ్ కేసులు హైదరాబాద్ ఉన్నత న్యాయ వ్యవస్థకు బదిలీ చేసే బిల్లు, టౌన్ ప్లానింగ్ ట్రిబ్యునల్ బిల్లు, ఉమ్మడి రాష్ట్రంలోని కొన్ని ఉపయోగం లేని శాసనాలను రద్దు చేసే బిల్లు, ఖమ్మం పోలీసు కమిషనరేట్ ఏర్పాటు బిల్లుకు బుధవారం శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. బీసీ కమిషన్‌పై సభలో తీవ్ర చర్చ జరిగింది. బీసీ కమిషన్ బిల్లు కోరలు లేని పులిలాంటిదేనని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. కమిషన్ చైర్మన్ నియామకం కోసమే బిల్లు ప్రవేశపడు తున్నట్లు ఉందన్నారు. బీసీలపై జరుగుతున్న అకృత్యాలను, అన్యాయాలను కమిషన్ ఆపలేకపోతోందని, రిజర్వేషన్ల అమలులో జరిగిన అన్యాయాన్ని పరిష్కరించలేక పోతోందని వివరించారు. కమిషన్‌కు విస్తృతమైన అధికారాలు కావాలని కోరారు. బీజేపీ నేత లక్ష్మణ్ మాట్లాడుతూ బీసీ కమిషన్ 112 కులాల స్థితిగతులకు అనుగుణం గా పని చేయాలని, వారి జీవన విధానం, సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఉండాలని, ప్రఖ్యాత రచయితగా , సామాజిక శాస్త్రవేత్తగా బీఎస్ రాములుకు మంచి పేరుందని, ఆయన పేరును చెడగొట్టే విధంగా బీసీ కమిషన్ ఉండొద్దని అన్నారు. కాంగ్రెస్ సభ్యుడు సంపత్‌కుమార్, సీపీఎం సభ్యులు సున్నం రాజయ్య తదితరులు బీసీ కమిషన్‌కు విశేష అధికారాలు ఇవ్వాలని సూచించారు. సభ్యుల సూచనలను పరిగిణలోకి తీసుకొ¯నే బిల్లు ప్రవేశపెట్టామని మంత్రి జోగు రామన్న చెప్పారు. -
ముస్లిం రిజర్వేషన్లతో బీసీలకు నష్టం లేదు
రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన ముస్లిం కులాలకు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు పెంచితే బీసీ సామాజిక వర్గాల రిజర్వేషన్లలో ఎలాంటి ఇబ్బందులుండవని రాష్ట్రబీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ వల్ల బీసీ సామాజిక వర్గాలకు ప్రస్తుతం అమలులో ఉన్న రిజర్వేషన్ల శాతంలో ఎలాంటి మార్పులుండవని తెలిపారు. వెనుకబడిన ముస్లిం కులాలకు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల పెంపుపై బీసీ కమిషన్ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం బహిరంగ విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ, జి.సుధీర్ నేతృత్వంలోని అధ్యయన కమిషన్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమిషన్‌కు పంపిందని, ఈమేరకు తగు సిఫార్సులు చేయాలని ప్రభుత్వం సూచించి నందున ప్రజాభిప్రాయ నిమిత్తం బహిరంగ విచారణ చేపట్టినట్లు చెప్పారు. విచారణ ఈ నెల 17 వరకు కొనసాగుతందని, 18, 19 తేదీల్లో న్యాయ నిపుణులు, సామాజికవేత్తలు, విశ్వ విద్యాలయ ఆచార్యులు, ప్రముఖులను ఆహ్వానించి మరింత సమాచారాన్ని తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా 12 సంఘాలకు చెందిన ప్రతినిధులు కమిషన్ ఎదుట హాజరై ముస్లిం లకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ముస్లిం రిజర్వేషన్ ఫ్రంట్ అధ్యక్షుడు మహమద్ ఇఫ్తకా రుద్ధీన్ అహ్మద్.. రిజర్వేషన్ల ఆవశ్యకతను వివరించారు. బహిరంగ విచారణ 15, 16, 17 తేదీల్లో హైదరాబాద్ లోని ఖైరతాబాద్ రాష్ట్ర కార్యాలయంలో జరుగుతుందని కమిషన్ తెలిపింది. ఈనెల 19 లోపు లిఖిత పూర్వక పత్రాలు, ఆన్లైన్, పోస్టు ద్వారా వాదనలు తెలియ జేయవచ్చని సూచించింది. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు వకుళాభరణం కృష్ణమోహన్, ఆంజనేయులు గౌడ్, జూలూరు గౌరీశంకర్, సభ్య కార్యదర్శి జీడీ అరుణ తదితరులు పాల్గొన్నారు. -
అప్పుల తెలంగాణగా మారుస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రాన్ని నిధులు కోరకుండా ఇష్టారాజ్యంగా అప్పులు చేస్తూ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మారుస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఆరోపించారు. శనివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. సమగ్రసర్వేలో నమోదైన బీసీ జనాభాను కులాలవారీగా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కులాల వారీగా జనాభా వివరాలను వెల్లడించాలని, అందుకు అనుగుణంగా అవకాశాలను కల్పించాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్‌కు, బీసీ కమిషన్‌కు లేఖ రాసినట్టుగా తెలిపారు. -
తమిళనాడు తరహాలో బీసీ కోటా
► అసెంబ్లీలో చట్టం చేసి పార్లమెంట్‌కు పంపుతాం ► జనాభాకు అనుగుణంగా ముస్లింల రిజర్వేషన్లు ► అందరికీ బాసటగా ఉండే అధ్యయనం చేయండ ► బీసీ కమిషన్‌కు దిశానిర్దేశం చేసిన సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: తమిళనాడు తరహాలో తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ల శాతం పెంచేందుకు శాసనసభలో చట్టం చేసి పార్లమెంటుకు పంపనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. బీసీ కులాల ప్రయోజనాలు దెబ్బతినకుండా, ముస్లిం రిజర్వేషన్ పెంచే విషయంలోనూ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. ‘‘తెలంగాణలో 80 శాతానికిపైగా బలహీన వర్గాల ప్రజలు ఉన్నారు. వారి జీవన పరిస్థితులు మెరుగుపడాలి. రిజర్వేషన్లు పెరగాలి. తమిళనాడులో అక్కడి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచారు. పార్లమెంటు కూడా ఆమోదం తెలిపి 9వ షెడ్యూల్లో చేర్చింది. తెలంగాణ విషయంలో కూడా అదే జరగాలి. తెలంగాణలో బలహీన వర్గాల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచడానికి శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపుతాం. కేంద్రాన్ని ఒప్పించి రిజర్వేషన్లు పెంచుతాం..’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాల జీవన ప్రమాణాలు పెంచే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ఈ విషయంలో బీసీ కమిషన్ సమాజంలోని వివిధ కులాల స్థితిగతులను సమగ్రంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి తగు సూచనలు, ప్రతిపాదనలు చేయాలని సూచించారు. బీసీ కమిషన్ చైర్మన్‌గా బీఎస్ రాములు, సభ్యులుగా వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, గౌరిశంకర్, ఆంజనేయగౌడ్ పదవీబాధ్యతలు స్వీకరించిన అనంతరం క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీసీ కమిషన్ చేయాల్సిన పనులు, బీసీ కులాల అభ్యున్నతికి తీసుకోవల్సిన చర్యలపై సీఎం పలు సూచనలు చేశారు. ‘‘ముస్లింల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సుధీర్ కమిటీ సిఫార్సులు ప్రభుత్వానికి అందాయి. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో బీసీ కమిషన్ సిఫార్సులు చేయాలి. ప్రస్తుతమున్న బీసీ కులాల ప్రయోజనాలు దెబ్బతినకుండా, ముస్లిం రిజర్వేషన్ పెంచే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది’’ అని అన్నారు. ‘‘బీసీల్లో అనేక కులాలు ఉన్నాయి. కొన్ని కులాలు కుల వృత్తులతో ఉపాధి పొందుతున్నాయి. మరికొన్ని కులాల విషయంలో మాత్రం దిక్కుతోచకుండా ఉంది. మారుతున్న జీవనవిధానంతో కొన్ని కులవృత్తులు అంతరించిపోతున్నాయి. వీటన్నింటినీ బీసీ కమిషన్ సమగ్ర అధ్యయనం చేయాలి. సదరు కుల వృత్తులను మానవాభిరుచికి తగినట్లు ఆధునీకరించడమా, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వారికి ఉపాధి కల్పించడమా? అనే విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. అన్నికులాల స్థితిగతులపై లోతుగా అధ్యయనం జరగాలి. ఎవరి జీవితం ఎలా ఉందో అంచనాకు రావాలి. ఎవరికేం చేయాలనే స్పష్టత ఉండాలి. అందుకనుగుణంగా వాస్తవాల ఆధారంగా బీసీ కమిషన్ సిఫార్సులు చేయాలి. బీసీ కమిషన్ పాత్ర పెరగాలి. విశ్వసనీయత పెరగాలి. అటు ప్రభుత్వంతో, ఇటు ప్రజలతో నిత్యం సంప్రదింపులు జరపాలి. ఆచరణయోగ్యమైన మార్గం వెతకాలి..’’ అని సీఎం సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలసిన బాలమల్లు, వెంకటేశ్వర్‌రెడ్డి అనంతరం టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారిగా సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. చరిత్రలో నిలిచిపోవాలి.. ‘‘2024 నాటికల్లా తెలంగాణ బడ్జెట్ దాదాపు రూ.5 లక్షల కోట్లకు చేరుతుంది. అప్పటికి మేజర్ పెట్టుబడులు పూర్తవుతాయి. పేదరిక నిర్మూలనకే భవిష్యత్తులో ఎక్కువ నిధులు ఖర్చు చేస్తాం. పేదల విద్య, ఆరోగ్యంపై మరింత దృష్టి పెడతాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాల సంఖ్య మరింతగా పెంచుతాం. అందుకే బీసీ కులాల్లో పేదరిక నిర్మూలన సాధించేందుకు అవసరమైన సూచనలు చేయాలి. ఒక్కో కులం, ఒక్కో కుటుంబం, ఒక్కో వ్యక్తికి వేర్వేరు అభిరుచులుంటాయి. వారికి చేయూతనందించే కార్యక్రమాలుండాలి. ప్రజలే కేంద్రంగా, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వ విధానాలుండాలి. వీటన్నింటా బీసీ కమిషన్ కీలక పాత్ర పోషించాలి. ప్రజల బాధను పోగొట్టే విధానాల రూపకల్పనకు సూచనలు చేయాలి. చరిత్రలో నిలిచిపోయేలా పని చేయాలి..’ అని సీఎం చెప్పారు. సమావేశంలో సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు డీఎస్ రెడ్యానాయక్, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
రిజర్వేషన్లు పెంచుతాం: కేసీఆర్
హైదరాబాద్: దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలను ఎగువకు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యం అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వివిధ కులాల స్థితిగతులను సమగ్రంగా అధ్యయనం చేసి సూచనలు ఇవ్వాలని, ప్రతిపాదనలు చేయాలని చెప్పారు. గురువారం సీఎంతో బీసీ కమిషన్ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్ తమిళనాడులో మాదిరిగా రిజర్వేషన్ల శాతం పెంచేందుకు అసెంబ్లీలో చట్టం చేసి పార్లమెంటుకు పంపిస్తామని అన్నారు. ముస్లిం రిజర్వేషన్లపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు. -
మార్పు కోసమే బీసీ కమిషన్: ఈటల
⇒ కొన్ని వర్గాలు అధర్మ పద్దతిలో అటుఇటు అయ్యాయి ⇒ బీఎస్ రాములు కమిషన్ వాటన్నిటినీ క్రమ పద్ధతిలోకి మార్చాలి ⇒ బీసీ కులాలపై పూర్తిస్థాయిలో అద్యయనం చేయాలి ⇒ అన్ని వర్గాల ప్రజల అభివద్ధే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి ఈటల హైదరాబాద్: వెనుకబడిన వర్గాల స్థితిగతులు మార్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమిషన్ ఏర్పాటు చేసిందని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. బీసీ కమిషన్ చైర్మన్‌గా బీఎస్ రాములు, సభ్యులుగా వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, ఈడిగ ఆంజనేయులుగౌడ్, గౌరీశకంర్ గురువారం రవీంద్రభారతిలో శాసనసభ స్పీకర్ మధుసూధనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్ ఆధ్వర్యంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఈటల మాట్లాడుతూ.. కొత్త రాష్ట్రంలో బీసీ కులాల పరిస్థితులను అధ్యయనం చేసి, అన్ని వర్గాలు అభివృద్ధి చెందేలా నివేదిక సమర్పించాలని కమిషన్ బృందానికి సూచించారు. రాష్ట్రంలో బీసీల జనాభా అధికంగా ఉందని, కానీ ఇప్పటివరకు ఈ జనాభాపై స్పష్టమైన అంకెను తేల్చలేకపోవడం దురదృష్టకరమన్నారు. గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కమిషన్లను మాజీ న్యాయమూర్తులచే ఏర్పాటు చేసినప్పటికీ.. అవి ఇచ్చిన నివేదికలతో ఇప్పటికీ బీసీల్లో మార్పులు రాలేదన్నారు. బీఎస్ రాములు కమిషన్ ద్వారా బీసీ కులాలకు న్యాయం జరగాలని, కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాలని ఆకాంక్షించారు. మార్కెట్ కమిటీల్లో 33శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని, స్థానిక సంస్థలతో పాటు చట్టసభల్లోనూ రిజర్వేషన్లు అమలు చేసేలా అసెంబ్లీ తీర్మాణం చేసి కేంద్రానికి పంపినట్లు పేర్కొన్నారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాల్సిందిగా ప్రధానిని కోరినట్లు తెలిపారు. యువతను స్వయం ఉపాధివైపు ప్రోత్సహించేందుకు ఏకంగా 80శాతం రాయితీలు ఇస్తున్నట్లు చెప్పారు. కొత్తగా ఏర్పాటైన తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం సమస్యల్ని వీలైనంత త్వరగా అధిగమించేందుకు కృషి చేస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీలకే కాకుండా బీసీలకు కూడా కళ్యాణలక్ష్మి పథకాన్ని వర్తింపజేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా 119 బీసీ గురుకుల పాఠశాలలను వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి తెస్తామని, ఒక్కో పాఠశాలలో 6 వందలకు పైగా పిల్లలు చదువుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బీసీ కమిషన్‌లో ఇతర అణగారిన కులాలకు సైతం ప్రాతినిధ్యం కల్పించాలని ఎంపీ వివేక్ మంత్రులను కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, సాంస్కృతిక మండలి చైర్మన్ రసమయి బాలకిషన్, ఎంపీ బాల్కసుమన్, ఎమ్మెల్సీ నారదాసు, ఎమ్మెల్యే మధు తదితరులు పాల్గొన్నారు. -
'వాదనలు వినిపించనందునే వాటా దక్కలేదు'
- డిపెండబులిటీ తగ్గడంతో రాష్ట్రానికి అన్యాయం - సుప్రీంకోర్టులో సరైన వాదనలు వినిపిస్తే నీటి కోటా పెరుగుతుంది - ఫీజు బకాయిలివ్వకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు - బీసీ కమిషన్ ఏర్పాటుపై ప్రభుత్వానికి అభినందనలు - కేంద్రం నుంచి సంక్షేమానికి మరిన్ని నిధులు వచ్చేలా ప్రయత్నిస్తా - కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ హైదరాబాద్: నీటి వాటాలపై బ్రిజేష్ ట్రిబ్యూనల్ ఎదుట రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించడంలో విఫలమైందని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. డిపెండబులిటీ 75 నుంచి 65కు తగ్గించడంతో కొంత నష్టపోగా... సరైన వానదలు వినిపించక పోవడంతో మరింత నష్టం జరిగిందని, ఫలితంగా రాష్ట్రానికి తక్కువ నీటి కేటాయింపులు జరిగాయన్నారు. చివరగా సుప్రీంకోర్టులో మరో అవకాశం ఉందని, ఈసారైన సరైన నిపుణులను సంప్రదించి సమర్థవంతంగా వాదనలు వినిపించాలని ప్రభుత్వానికి సూచించారు. నీటి వాటాలు పెరిగితే రాష్ట్రంలో ప్రాజెక్టులు కళకళలాడతాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కేటాయించిన నీటిపై హక్కు ఉండేదని, గత కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆదివారం దిల్కుషా అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫీజు బకాయిలు కోట్లలో పేరుకుపోయాయని, దీంతో విద్యార్థులపై ఒత్తిడి పెరగడంతో మధ్యలోనే చదువులు ఆపేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రూ.2వేల కోట్ల బకాయిలున్నాయని, గత నాలుగేళ్లుగా ఈ పథకం నిర్లక్ష్యానికి గురవుతుందన్నారు. పేదప్రజల సంక్షేమానికి కేంద్రం నుంచి అధిక నిధులు వచ్చేలా కృషి చేస్తానని, త్వరలో సాంఘీక సంక్షేమ శాఖ మంత్రిని కలుస్తానని తెలిపారు. ఫెడరేషన్లు, కార్పొరేషన్లకు నిధుల విడుదలలో ప్రభుత్వం జాప్యం చేస్తుందని, దీంతో ఆయా సంస్థలు దివాలా తీస్తున్నాయని, ఎస్సీ, ఎస్టీ, బీసీలు రాయితీ రుణాలు పొందేందుకు ఇష్టపడడం లేదన్నారు. ప్రతి సంస్థకు కనిష్టంగా రూ.150 కోట్ల బడ్డెట్ పెంచాలని, కులవృత్తులు అంతరించిపోతున్నాయని, వీటిపై ఆధారపడ్డ కుటుంబాలకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి సాంకేతిక నైపుణ్యాన్ని జోడించాలని, దీంతో ఉత్పత్తులు పెరగడంతో పాటు ఆయా కుటుంబాల ఆదాయం కూడా పెరుగుతుందని వివరించారు. దేశప్రజలకు ప్రధాని మోదీ సైనిక వందనాలకు పిలపునిచ్చారని, ఈ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు. ఆలస్యమైనా రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా కొత్తగా ఏర్పాటు చేసిన బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములుతో పాటు సభ్యులు వకుళాభరణం కృష్ణమోహన్, ఆంజనేయగౌడ్, గౌరిశంకర్లను ఆయన సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతల రాంచెంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.