బీసీ రిజర్వేషన్ల పెంపుపై కసరత్తు షురూ | Work progress in BC reservation increment | Sakshi
Sakshi News home page

బీసీ రిజర్వేషన్ల పెంపుపై కసరత్తు షురూ

Published Sun, May 7 2017 1:44 AM | Last Updated on Wed, Aug 15 2018 8:06 PM

బీసీ రిజర్వేషన్ల పెంపుపై కసరత్తు షురూ - Sakshi

బీసీ రిజర్వేషన్ల పెంపుపై కసరత్తు షురూ

అధ్యయనం చేయాలని బీసీ కమిషన్‌కు ప్రభుత్వ ఆదేశం
సాక్షి, హైదరాబాద్‌: వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల పెంపుపై ముందడుగు పడింది. ఇటీవల మైనార్టీలు, ఎస్టీల రిజర్వేషన్లు పెం చిన క్రమంలో బీసీ రిజర్వేషన్లనూ  పెంచా లని యోచిస్తున్నట్లు సీఎం కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బీసీ కమిషన్‌ అధ్యయన నివేదిక ఆధారంగా పెంపు చేపడతామని పేర్కొన్న సంగతి తెలి సిందే.

తాజాగా బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి శాస్త్రీయ పద్ధతిలో సమగ్ర అధ్యయనం చేయాల్సిందిగా ప్రభుత్వం బీసీ కమి షన్‌కు సూచించింది. ఈమేరకు శనివారం ఆ శాఖ ముఖ్య కార్యదర్శి జి.అశోక్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అధ్యయనం తాలుకు నివేదికను ఆర్నెల్లలోగా ప్రభుత్వానికి సమర్పించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

అధ్యయన విధివిధానాలివే...
♦  బీసీ కులాల్లో సంచార, వృత్తిపరమైన వర్గాలపై ప్రత్యేక దృష్టి సారించి క్షేత్ర పరిశీలన చేయాలి.
♦  సామాజిక, విద్య, ఆర్థిక స్థితిగతులతో పాటు వారి జీవన విధానాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి.
♦  వృత్తి పరమైన ఇబ్బందులు అధిగమించేందుకు తీసుకోవల్సిన చర్యలపైనా అధ్యయనం చేయాలి.
♦  సంప్రదాయ వృత్తుల్లో ఉన్న కులాల ప్రస్తుత పరిస్థితి, ప్రత్యామ్నాయ వెసులుబాటును పరిశీలించాలి
♦  కేంద్ర,, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు. ప్రైవేటు సంస్థల్లో బీసీ కులాలకు చెందిన ఉద్యోగుల సంఖ్యను పరిశీలించాలి.
♦  బీసీ కులాల్లో విద్య, అక్షరాస్యత పరిస్థితులతో పాటు, ఆరోగ్య పరమైన స్థితిగతులు, మాతాశిశు మరణాల పరిస్థితిని ఇతర వర్గాలతో పోల్చి అంచనాలు రూపొందించాలి.
♦  బ్యాంకు రుణాల సౌకర్యం, సంక్షేమ పథకాల్లో లబ్ధి పొందుతున్న తీరును అధ్యయనం చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement