Reservation Increase
-
Bihar Caste Reservation: రిజర్వేషన్లపై బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
పాట్నా: రిజర్వేషన్ల విషయంలో సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని బిహార్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రిజర్వేషన్లు 65శాతానికి పెంచాలని ప్రాతిపాదించింది. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈబీసీ వర్గాల వారి రిజర్వేషన్లు 55 శాతం ఉండగా తాజాగా వాటిని 65 శాతానికి పెంచాలని నిర్ణయించింది. ఇది ఆర్థికంగా బలహీన వర్గాలకు(ఈడబ్ల్యూఎస్) కేంద్రం నిర్దేశించిన 10శాతం రిజర్వేషన్లకు మినహయింపు. బిహార్ ప్రభుత్వం, కేంద్రం కల్పిస్తున్న రిజర్వేషన్లు కలిపి రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్లు 75శాతానికి చేరుకోనుంది. దీనిపై నిపుణులతో సంప్రదింపుల తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఈ మార్పులు అమలు చేయాలనేది తమ ఉద్ధేశ్యమని తెలిపారు. అయితే ఓబీసీ మహిళలకు కేటాయించిన మూడు శాతం కోటాను రద్దు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. తాజా ప్రతిపాదనల ప్రకారం.. షెడ్యూల్డ్ కులాల వారికి 20శాతం రిజర్వేషన్ లభిస్తుంది. ఓబీసీ, ఈబీసీలకు 43 శాతం ఉన్న రిజర్వేషన్ దక్కనుంది. ప్రస్తుతం ఓబీసీ, ఈబీసీలకు కలిపి 30 శాతం రిజర్వేషన్ ఉండగా.. తాజాగా మరో 13 శాతం పెరగనుంది. షెడ్యూల్డ్ తెగలు(ఎస్టీ) వారికి రెండు శాతం రిజర్వేషన్లను ప్రతిపాదించారు. దీంతో రాష్ట్రంలో రిజర్వేషన్లు 65 శాతానికి చేరుకుంటాయి. ప్రస్తుత ఈబీసీలకు 18 శాతం, ఓబీసీలకు 12 శాతం, ఎస్సీలకు 16 శాతం, ఎస్టీలకు ఒకశాతం రిజర్వేషన్లు ఉన్నాయి. చదవండి: బీహార్ కులగణన: 34 శాతం మంది పేదలే.. నెలకు రూ. 6 వేల కంటే తక్కువ ఆదాయం కాగా కులగణనకు సంబంధించిన నివేదికను బిహార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కొన్ని గంటల్లోనే నితీష్ కుమార్ ప్రభుత్వం ఈ రిజర్వేషన్ల పెంపు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇక ఓబీసీ వర్గం వారిలో యాదవులు అత్యధిక సంఖ్యలలో ఉన్నారు. రాష్ట్ర జనాభాలో వారు 14. 27 శాతం ఉన్నారు. కులగణన ప్రకారం.. బిహార్ 13 కోట్ల జనాభాలో 36 శాతం మంది ఈబీసీలు, 27.1 శాతం మంది వెనకబడిన తరగతులు, 19.7 శాతం మంది ఎస్సీలు, 1.7 శాతం ఎస్టీ జనాభా, జనరల్ కేటగిరీలో 15.5 శాతం ఉన్నారు. దీని ప్రకారం రాష్ట్రంలో 60 శాతానికి పైగా ప్రజలు వెనకబడిన, అత్యంత వెనకబడిన తరగతులకు చెందిన వారే ఉన్నారు. -
‘కోటా’ను కాపాడుకోవడం ఎలా?
రిజర్వేషన్లు, అవినీతి భారతదేశ వెనుకబాటుతనానికి ప్రధాన కారణాలనే అభిప్రాయం ద్విజ న్యాయవ్యవస్థలో బలంగా పాతుకుపోయింది. ‘ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు’ (ఈడబ్ల్యూఎస్) కోటా విషయంలో సుప్రీంకోర్టులో మెజారిటీ తీర్పు దీన్నే ప్రతిఫలించింది. కులం కాకుండా వర్గం అనేదే రిజర్వే షన్లకు సరైన వర్గీకరణ అవుతుందన్నది వీరికి ఇష్టమైన సిద్ధాంతం. తమ యువతకు లబ్ధి చేకూర్చుతుందని నమ్ముతూ రిజర్వేషన్ పరిధిలో లేని శూద్ర వర్గాలు దీన్ని సమర్థిస్తున్నాయి. కానీ అంతిమంగా ద్విజ వర్గాలే దీని నుంచి లబ్ధి పొందుతాయనేది నిజం. అన్ని స్థాయుల్లోనూ ఉత్పాదకతతో ముడిపడి ఉన్న వర్గాల్లోంచి బలమైన లీగల్ మేధావులు ప్రత్యేకించి సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో లేకపోతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ప్రయోజనాలను కాపాడటం అసాధ్యం. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు రిజర్వేషన్‌పై సుప్రీంకోర్టు అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పు తీవ్ర చర్చలకు దారితీసింది. దళిత, ఆదివాసీ, ఓబీసీల సామాజిక ఆర్థిక మార్పునకు సంబంధించిన కోణంలోంచి చూస్తే అది తిరోగమన తీర్పా లేక పురోగమన తీర్పా అనేదే ఆ చర్చల సారాంశం. 2022 నవంబర్ 10న ఆల్ బార్ అసోసియేషన్ (ఏబీఏ) న్యాయవాదులు, అఖిల భారత వెనుకబడిన మైనారిటీ కమ్యూనిటీల ఉద్యోగుల సమాఖ్య కార్యకర్తలు ఒక ఆన్లైన్ సెమినార్ నిర్వహించారు. ఇప్పటికీ తమ చారిత్రక వెనుకబాటుతనాన్ని, తమపై నియంత్రణను అధిగమించలేకపోయిన ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఉత్పాదక ప్రజారాశులను తప్పుదోవ పట్టిస్తున్న న్యాయవ్యవస్థను, ప్రభుత్వాన్ని సవాలు చేసి భవిష్యత్తు కార్యాచరణ చేపట్టడం కోసం అవసరమైన కొత్త దృక్పథాన్ని ఈ సెమినార్ పరిశీలించింది. సుప్రీంకోర్టు ధర్మాసనం 3–2 మెజారిటీతో ఇచ్చిన తీర్పులో ప్రభుత్వ దృక్పథాన్ని మెజారిటీ న్యాయమూర్తులు ఎత్తిపట్టారు. ఇక పోతే నాటి చీఫ్ జస్టిస్ యుయు లలిత్‌తో కూడిన ఇద్దరు జడ్జీల మైనా రిటీ కొన్ని సంక్లిష్ట ప్రశ్నలను ముందుకు తెచ్చింది. సంస్థాగతంగా ఉన్న కులాన్ని నిర్మూలించి సమతావాద సమాజం వైపు పురోగమిం చాలని రాజ్యాంగం నిర్మాణాత్మకంగా మాట్లాడలేదన్న అభిప్రా యాన్ని ‘ఏబీఏ’ న్యాయవాదులు వ్యక్తపరిచారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 46 మాత్రమే కులం గురించి పేర్కొంది. ప్రజానీకంలోని బలహీన వర్గాల, ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీలకు చెందిన విద్యా, ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రోత్సహించాలని చెప్పింది. పైగా సామాజిక అన్యాయం నుంచి, అన్ని రకాల దోపిడీ నుంచి వారిని కాపాడాలని సూచించింది. ఇక్కడ కూడా కులానికి సంబంధించిన భావనను షెడ్యూల్డ్ కులాలకు మాత్రమే ఉద్దేశించడం చూడవచ్చు. రాజ్యాంగంలో ఎక్కడ కూడా శూద్ర, ఓబీసీలను కుల పీడనను ఎదుర్కొంటున్న వారిగా గుర్తించలేదు. వీరిని ఒక వర్గంగానే గుర్తిం చారు. ప్రస్తుతం ఇతర వెనుకబడిన వర్గం రిజర్వేషన్ని సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల చర్చా పరిధిలోనే ఏర్పర్చారు. ఇది రిజర్వేషన్ వ్యతిరేక రాజకీయ నాయకులు, పార్టీలు, మేధావులు, మీడియా వ్యక్తులకు విస్తారమైన పరిధిని ఇచ్చింది. 103వ రాజ్యాంగ సవరణతో 10 శాతం ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ద్వారా వర్గ ప్రాతిపదిక రిజర్వేషన్‌ను ముందుకు తెచ్చే వీలు కల్పించింది. ఇప్పుడు సుప్రీం కోర్టు తన తీర్పు ద్వారా దీనికి ఆమోద ముద్ర వేసింది. న్యాయవ్యవస్థలోని చాలామంది జడ్జీలు వర్గ (ఆర్థిక కేటగిరీ) పరమైన రిజర్వేషన్ థియరీని అనుసరిస్తున్నారు. అన్ని కులాలనూ దీంట్లో పొందుపరుస్తున్నప్పటికీ ద్విజ కులాలే ఎక్కువగా అదనపు ప్రయోజనాన్ని పొందుతాయి. ఆర్థిక వర్గీకరణ ప్రాతిపదికన ఉండే ఏ రిజర్వేషన్ అయినా ఇప్పటికే ప్రతిభ పేరుతో ప్రతి సీటును, ఉద్యో గాన్ని పొందగలుగుతున్న ద్విజ కులాలతోపాటు సాపేక్షంగా పేదలే అయినప్పటికీ, సామాజికంగా అదే స్థాయికి చెందిన శక్తులను విద్యా, ఉద్యోగ మార్కెట్లోకి తీసుకొస్తుంది. 1990 మండల్ రిజర్వేషన్ పోరాట రోజులనుంచి కులప్రాతి పదికన ఉన్న నిరక్షరాస్యత, దారిద్య్రం, అసమానత్వం, అణచివేత, దోపిడీ వంటి అంశాలను తక్కువచేసి చూపడానికి వామపక్షాలు, ఉదారవాదులు, హిందుత్వవాదులు అందరూ రిజర్వేషన్లలో ఆర్థిక ప్రాతిపదికను కూడా తేవాలని ఒత్తిడి చేస్తూ వచ్చారు. న్యాయ మూర్తులు, న్యాయ నిపుణులు రాజ్యాంగానికి చేస్తూ వచ్చిన వ్యాఖ్యా నాలు చాలావరకు వర్గ కేంద్రంగానే ఉంటూ వచ్చాయి. కులం కాకుండా వర్గం అనేదే రిజర్వేషన్లకు సరైన వర్గీకరణ అవుతుందన్నది వీరికి ఇష్టమైన సిద్ధాంతం. మన న్యాయవ్యవస్థలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల ప్రవేశాన్ని దామాషా ప్రాతిపదిక కింద చొప్పించడం ఎలా అనేది ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న. న్యాయపరమైన వ్యాజ్యాలలో పాలు పంచుకోవడాన్ని సాధా రణ ప్రజానీకం అర్థం చేసుకోలేదు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలనుంచి పోటీపడే సమర్థతలు కలిగిన సుశిక్షితులైన న్యాయ నిపుణులు మాత్రమే న్యాయ పోరాటాలలో తలపడగలరు. చట్టాలను వ్యాఖ్యా నించడంలో న్యాయవ్యవస్థ అత్యంత శక్తిమంతమైన విభాగంగా ఉంటున్నందున, అన్ని స్థాయిల్లోనూ ఉత్పాదకతతో ముడిపడి ఉన్న నేపథ్యంలోంచి బలమైన లీగల్ మేధావులు ప్రత్యేకించి సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో లేకపోతే న్యాయవ్యవస్థలో ఈ వర్గాల ప్రయోజనాలను కాపాడటం అసాధ్యం. ఈ సమరంలో ఇంగ్లిష్ పాత్ర చాలా కీలక మైంది. న్యాయ వ్యవస్థను అదుపు చేస్తున్న యంత్రాంగాలను మార్చా లంటే వీధిపోరాటాలు లేదా పార్లమెంటరీ గావుకేకలు సాయపడవు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఎంపీలు సంఖ్యరీత్యా మెజా రిటీగా ఉన్నప్పటికీ, అగ్రవర్ణ పేదలకు కోటా వంటి అంశాల్లో పాలక వర్గాలు చట్టాలను లేదా రాజ్యాంగ సవరణలను శరవేగంతో రూపొం దిస్తున్నాయి. కాంగ్రెస్ హయాంలో కూడా ఇది జరిగినప్పటికీ ఆర్ఎస్ఎస్, బీజేపీకి ప్రస్తుతం పూర్తి మెజారిటీ ఉన్నందున వీటిని మరింత తెలివిగా అమలు చేస్తూవస్తున్నాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌పై రివ్యూ పిటిషన్ గురించి ప్రస్తుతం మాట్లాడుతున్నప్పటికీ, చాలావరకు అదే తీర్పును భాషాపరమైన మార్పులతో తిరిగి రాయడమే జరుగుతుంది. కాబట్టి ఈ సమస్య మరెక్కడో ఉంది. బార్లో కానీ, ధర్మాసనంలో కానీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మేధావులు పెద్దగా ఉండటం లేదు. లేదా న్యాయపరమైన జిత్తులను అర్థం చేసుకోలేనంత బలహీనంగా ఉంటున్నారు. వీటిని సరిగా అర్థం చేసుకుని, ఉత్పాదక కులాలు ఇంతకాలం సాధించింది ఏమీలేదని దేశం మొత్తానికి నచ్చజెప్పగలిగిన అంబేడ్కర్ లాంటి ప్రతిభావంతు లైన న్యాయ నిపుణులు ఈ కులాల్లోంచి పుట్టుకురావలసిన అవసరం ఉంది. జాట్, పటేల్, రెడ్డి, కమ్మ, వెలమ, నాయర్, బెంగాల్‌లోని నామ్శూద్రుల వంటి ఓబీసీ రిజర్వేషన్ పరిధిలో లేని శూద్రుల విషయంలో సమస్య ఏమిటంటే, తమ యువతకు కాసిన్ని సీట్లు, ఉద్యోగాలు వస్తాయని ఆశించి వారు ఇలాంటి విధానాలను బల పరుస్తున్నారు. కానీ గత రెండేళ్లుగా 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజ ర్వేషన్ని అమలు చేస్తున్న రాష్ట్రాల్లో, కేంద్ర స్థాయిలో సీట్లు, ఉద్యో గాలకు సంబంధించిన డేటాను చూసినట్లయితే వారు నిజంగా లబ్ధి పొందినట్లు కనిపించడం లేదు. ఇక్కడ కూడా ఎగువ తరగతి శూద్రు లపై విద్యాపరమైన ఆధిక్యత కలిగిన ద్విజ కులాలవారే లబ్ధి పొందుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో శూద్ర ఎగువ తరగతి కులాలు పాలిస్తున్నప్పటికీ జాతీయ మేధారంగాల్లో వీరు ఎలాంటి నిర్ణయాత్మక పాత్రను పోషించడం లేదు. చివరకు 8 లక్షల ఆదాయ పరిమితితో అమలవుతున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని కూడా పూర్తిగా ద్విజులే ఉపయోగించుకుంటారు. ఇకముందు కూడా అనేక సంవత్సరాల పాటు విద్యారంగంలో ఓబీసీ క్రీమీ లేయర్, ఇతర శూద్ర కులాల వారు కూడా ద్విజ యువతతో పోటీ పడలేరన్నది వాస్తవం. రిజర్వేషన్లు, అవినీతి అనేవి భారతదేశ వెనుకబాటుతనానికి ప్రధాన కారణాలు అంటూ ద్విజ న్యాయవ్యవస్థలో పాతుకుపోయిన బలమైన అభిప్రాయాలనే సుప్రీంకోర్టులో మెజారీటీ తీర్పు ప్రతిఫ లించింది. కాబట్టి రిజర్వేషన్ వ్యవస్థను క్రమంగా ఎత్తివేయా లని వీరు చెబుతారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందినవారు తిండి తింటే బల హీనపడతారు, వీరు ఆకలి దప్పులతో ఉంటే దేవుడు వారికి మరింత శక్తిని ఇస్తాడు అని వారిచేతనే నమ్మింపజేస్తారు. చాలామంది ఇలాంటి థియరీలను నమ్ముతున్నారు కూడా. సైన్స్ ఒక మూఢనమ్మకం, రాజ్యాంగం ఒక బ్రాంతి అనే భావాలను కూడా వీరు వ్యాప్తి చెంది స్తారు. సుప్రీంకోర్టు తాజా తీర్పు దీనికి ఒక ఉదాహరణ. ప్రొ.కంచ ఐలయ్య షెపర్డ్, వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
‘రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి ఎత్తివేయాలి’
పట్నా: దేశంలో రిజర్వేషన్లపైనున్న 50 శాతం పరిమితిని ఎత్తివేయాలని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు ఆర్థికంగా వెనుకబడిన వారికి 10% కోటాను సమర్థించడంపై నితీశ్ హర్షం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లకు తాము ఎప్పుడూ అనుకూలమేనని ప్రకటించారు. ‘సుప్రీం కోర్టు తీర్పు చాలా న్యాయంగా ఉంది. రిజర్వేషన్లకు మేము ఎప్పుడూ అనుకూలమే. అయితే రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తివేయడానికి ఇదే సరైన సమయం. ఈ పరిమితి వల్ల ఓబీసీ, ఈబీసీలకు వారి జనాభాకి అనుగుణంగా అవకాశాలు రావడం లేదు’ అని అన్నారు. దేశవ్యాప్తంగా కులాల వారీగా జనాభా గణన చేపట్టాలని ఆయన పునరుద్ఘాటించారు. కుల గణన జాతీయ స్థాయిలో జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇదీ చదవండి: షాకింగ్ రిపోర్ట్: కరోనాను మించిన వైరస్ తయారీలో పాక్-చైనా! -
అవినీతి.. అస్థిరత.. వ్యతిరేకభావం
ముంబై/ మర్గోవా: కోల్‌కతా వేదికగా సంఘీభావం తెలిపిన ప్రతిపక్ష నేతలది అవినీతి, వ్యతిరేకభావం, అస్థిరతలతో కూడిన మహాకూటమి అని ప్రధాని మోదీ అభివర్ణించారు. పేద వర్గాలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తాము తీసుకున్న వచ్చిన చట్టంతో ప్రతిపక్షాలకు నిద్ర కరువైందన్నారు. గతంలో బలహీనంగా ఉన్న భారత్ బీజేపీ నాలుగున్నరేళ్ల పాలనలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా మారిందని చెప్పారు. ఆదివారం ఆయన మహారాష్ట్రలోని కొల్హాపూర్, హట్కనంగ్లే, మాధా, సతారా, దక్షిణ గోవా లోక్‌సభ నియోజకవర్గాల బూత్ స్థాయి కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మహాకూటమి నేతలది ధనబలం కాగా తమది ప్రజాబలం అన్నారు. తమ కూటమి 125 కోట్ల భారతీయుల ఆకాంక్షలు, ఆశలు, కలలతో ముడిపడి ఉందన్నారు. ‘కోల్‌కతా సభా వేదికపై ఉన్న వారంతా బడా నేతల కుమారుడు/కుమార్తె లేదా తమ కుమారుడు/కుమార్తెను రాజకీయాల్లోకి తేవాలని ఆశపడే వారే. తమ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పై నమ్మకం లేని వారు ఇప్పుడు ప్రజాస్వామ్యంపై బహిరంగంగా ఉపన్యాసాలిస్తున్నారు’ అని దెప్పి పొడిచారు. ఎన్నికల్లో అన్ని రకాల అక్రమాలకు పాల్పడటమే వారి లక్ష్యమన్నారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో పరాజయం తప్పదని ముందుగానే ఊహించిన ప్రతిపక్షాలు ఈవీఎంలను సాకుగా చూపాలనుకుంటున్నాయి. పెట్టుబడిదారులు, కుంభకోణాలు, అవినీతి, అపనమ్మకం, అస్థిరతల కలయికే మహాకూటమి’ అని ఎద్దేవా చేశారు. బలహీనం నుంచి అభివృద్ధివైపు పయనం గత ప్రభుత్వాల పాలనతో బీజేపీ నాలుగున్నరేళ్ల పాలనను పోలుస్తూ ప్రధాని.. ‘బీజేపీ అధికారంలోకి వచ్చే సమయానికి దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉంది. విద్యుత్ కొరత, ఆర్థిక సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతోంది. కుంభకోణాల గురించిన వార్తలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భారత్ పేరు వినబడేది. ఇప్పుడు కుంభకోణాల(స్కాంల) ప్రస్తావనే లేదు. కేవలం కొత్త పథకాల(స్కీంల) గురించే చర్చ జరుగుతోంది. గత నాలుగున్నరేళ్లలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా మారింది. ప్రపంచం ఇప్పుడు భారత్‌ను నమ్మకం, విశ్వాసంతో చూస్తోంది. అప్పట్లో దేశంలోని 98 శాతం మందికి టాయిలెట్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది’ అని తెలిపారు. పేదలకు రిజర్వేషన్లతో విపక్షాలకు నిద్ర కరువు ఆర్థికంగా బలహీన వర్గాల వారికి విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ సంకల్పంతో ప్రతిపక్ష నేతలకు నిద్ర కరువైందని ప్రధాని వ్యాఖ్యానించారు. ‘మా నిర్ణయానికి తగు కారణం లేనట్లయితే, వాళ్లకు అశాంతి కరువయ్యేది కాదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అబద్ధాలు, పుకార్లను వ్యాప్తి చేసేందుకు రంగంలోకి దిగేవాళ్లు. వాళ్లు అలా చేయడం లేదంటే దానర్ధం.. దేశ ప్రజల కోసం ప్రభుత్వం మంచి పని చేసిందనే కదా’ అని అన్నారు. రిజర్వేషన్ల కారణంగా సీట్ల కొరత తలెత్తకుండా ఈ విద్యా సంవత్సరం నుంచే విద్యా సంస్థల్లో సీట్ల సంఖ్యను పది శాతం పెంచుతున్నట్లు వివరించారు. ‘ప్రతి ఒక్కరూ సమాన అవకాశాలు పొందాలన్నదే తమ అభిమతం. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం రిజర్వేషన్లపై చట్టం చేసిందన్న ప్రతిపక్షాల విమర్శలపై ఆయన మాట్లాడుతూ.. ఈ నిర్ణయాన్ని తాము ఎప్పుడు ప్రకటించినా వాళ్లు ఇలాంటి ఆరోపణలే చేసే వారని వ్యాఖ్యానించారు. -
బీసీ రిజర్వేషన్ల పెంపుపై కసరత్తు షురూ
అధ్యయనం చేయాలని బీసీ కమిషన్‌కు ప్రభుత్వ ఆదేశం సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల పెంపుపై ముందడుగు పడింది. ఇటీవల మైనార్టీలు, ఎస్టీల రిజర్వేషన్లు పెం చిన క్రమంలో బీసీ రిజర్వేషన్లనూ పెంచా లని యోచిస్తున్నట్లు సీఎం కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బీసీ కమిషన్ అధ్యయన నివేదిక ఆధారంగా పెంపు చేపడతామని పేర్కొన్న సంగతి తెలి సిందే. తాజాగా బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి శాస్త్రీయ పద్ధతిలో సమగ్ర అధ్యయనం చేయాల్సిందిగా ప్రభుత్వం బీసీ కమి షన్‌కు సూచించింది. ఈమేరకు శనివారం ఆ శాఖ ముఖ్య కార్యదర్శి జి.అశోక్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అధ్యయనం తాలుకు నివేదికను ఆర్నెల్లలోగా ప్రభుత్వానికి సమర్పించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అధ్యయన విధివిధానాలివే... ♦ బీసీ కులాల్లో సంచార, వృత్తిపరమైన వర్గాలపై ప్రత్యేక దృష్టి సారించి క్షేత్ర పరిశీలన చేయాలి. ♦ సామాజిక, విద్య, ఆర్థిక స్థితిగతులతో పాటు వారి జీవన విధానాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. ♦ వృత్తి పరమైన ఇబ్బందులు అధిగమించేందుకు తీసుకోవల్సిన చర్యలపైనా అధ్యయనం చేయాలి. ♦ సంప్రదాయ వృత్తుల్లో ఉన్న కులాల ప్రస్తుత పరిస్థితి, ప్రత్యామ్నాయ వెసులుబాటును పరిశీలించాలి ♦ కేంద్ర,, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు. ప్రైవేటు సంస్థల్లో బీసీ కులాలకు చెందిన ఉద్యోగుల సంఖ్యను పరిశీలించాలి. ♦ బీసీ కులాల్లో విద్య, అక్షరాస్యత పరిస్థితులతో పాటు, ఆరోగ్య పరమైన స్థితిగతులు, మాతాశిశు మరణాల పరిస్థితిని ఇతర వర్గాలతో పోల్చి అంచనాలు రూపొందించాలి. ♦ బ్యాంకు రుణాల సౌకర్యం, సంక్షేమ పథకాల్లో లబ్ధి పొందుతున్న తీరును అధ్యయనం చేయాలి.