‘కోటా’ను కాపాడుకోవడం ఎలా? | Supreme Court Verdict On Reservation For EWS Led To Debates | Sakshi
Sakshi News home page

‘కోటా’ను కాపాడుకోవడం ఎలా?

Published Sat, Nov 19 2022 12:14 AM | Last Updated on Sat, Nov 19 2022 12:14 AM

Supreme Court Verdict On Reservation For EWS Led To Debates - Sakshi

రిజర్వేషన్లు, అవినీతి భారతదేశ వెనుకబాటుతనానికి ప్రధాన కారణాలనే అభిప్రాయం ద్విజ న్యాయవ్యవస్థలో బలంగా పాతుకుపోయింది. ‘ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు’ (ఈడబ్ల్యూఎస్‌) కోటా విషయంలో సుప్రీంకోర్టులో మెజారిటీ తీర్పు దీన్నే ప్రతిఫలించింది. కులం కాకుండా వర్గం అనేదే రిజర్వే షన్లకు సరైన వర్గీకరణ అవుతుందన్నది వీరికి ఇష్టమైన సిద్ధాంతం. తమ యువతకు లబ్ధి చేకూర్చుతుందని నమ్ముతూ రిజర్వేషన్‌ పరిధిలో లేని శూద్ర వర్గాలు దీన్ని సమర్థిస్తున్నాయి. కానీ అంతిమంగా ద్విజ వర్గాలే దీని నుంచి లబ్ధి పొందుతాయనేది నిజం. అన్ని స్థాయుల్లోనూ ఉత్పాదకతతో ముడిపడి ఉన్న వర్గాల్లోంచి బలమైన లీగల్‌ మేధావులు ప్రత్యేకించి సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో లేకపోతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ప్రయోజనాలను కాపాడటం అసాధ్యం. 

ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌)కు రిజర్వేషన్‌పై సుప్రీంకోర్టు అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పు తీవ్ర చర్చలకు దారితీసింది. దళిత, ఆదివాసీ, ఓబీసీల సామాజిక ఆర్థిక మార్పునకు సంబంధించిన కోణంలోంచి చూస్తే అది తిరోగమన తీర్పా లేక పురోగమన తీర్పా అనేదే ఆ చర్చల సారాంశం. 2022 నవంబర్‌ 10న ఆల్‌ బార్‌ అసోసియేషన్‌ (ఏబీఏ) న్యాయవాదులు, అఖిల భారత వెనుకబడిన మైనారిటీ కమ్యూనిటీల ఉద్యోగుల సమాఖ్య కార్యకర్తలు ఒక ఆన్‌లైన్‌ సెమినార్‌ నిర్వహించారు. ఇప్పటికీ తమ చారిత్రక వెనుకబాటుతనాన్ని, తమపై నియంత్రణను అధిగమించలేకపోయిన ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఉత్పాదక ప్రజారాశులను తప్పుదోవ పట్టిస్తున్న న్యాయవ్యవస్థను, ప్రభుత్వాన్ని సవాలు చేసి భవిష్యత్తు కార్యాచరణ చేపట్టడం కోసం అవసరమైన కొత్త దృక్పథాన్ని ఈ సెమినార్‌ పరిశీలించింది.

సుప్రీంకోర్టు ధర్మాసనం 3–2  మెజారిటీతో ఇచ్చిన  తీర్పులో ప్రభుత్వ దృక్పథాన్ని మెజారిటీ న్యాయమూర్తులు ఎత్తిపట్టారు. ఇక పోతే నాటి చీఫ్‌ జస్టిస్‌ యుయు లలిత్‌తో కూడిన ఇద్దరు జడ్జీల మైనా రిటీ కొన్ని సంక్లిష్ట ప్రశ్నలను ముందుకు తెచ్చింది. సంస్థాగతంగా ఉన్న కులాన్ని నిర్మూలించి సమతావాద సమాజం వైపు పురోగమిం చాలని రాజ్యాంగం నిర్మాణాత్మకంగా మాట్లాడలేదన్న అభిప్రా యాన్ని ‘ఏబీఏ’ న్యాయవాదులు వ్యక్తపరిచారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 46 మాత్రమే కులం గురించి పేర్కొంది. ప్రజానీకంలోని బలహీన వర్గాల, ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీలకు చెందిన విద్యా, ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రోత్సహించాలని చెప్పింది. పైగా సామాజిక అన్యాయం నుంచి, అన్ని రకాల దోపిడీ నుంచి వారిని కాపాడాలని సూచించింది. ఇక్కడ కూడా కులానికి సంబంధించిన భావనను షెడ్యూల్డ్‌ కులాలకు మాత్రమే ఉద్దేశించడం చూడవచ్చు. 

రాజ్యాంగంలో ఎక్కడ కూడా శూద్ర, ఓబీసీలను కుల పీడనను ఎదుర్కొంటున్న వారిగా గుర్తించలేదు. వీరిని ఒక వర్గంగానే గుర్తిం చారు. ప్రస్తుతం ఇతర వెనుకబడిన వర్గం రిజర్వేషన్‌ని సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల చర్చా పరిధిలోనే ఏర్పర్చారు. ఇది రిజర్వేషన్‌ వ్యతిరేక రాజకీయ నాయకులు, పార్టీలు, మేధావులు, మీడియా వ్యక్తులకు విస్తారమైన పరిధిని ఇచ్చింది. 103వ రాజ్యాంగ సవరణతో 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ ద్వారా వర్గ ప్రాతిపదిక రిజర్వేషన్‌ను ముందుకు తెచ్చే వీలు కల్పించింది. ఇప్పుడు సుప్రీం కోర్టు తన తీర్పు ద్వారా దీనికి ఆమోద ముద్ర వేసింది.

న్యాయవ్యవస్థలోని చాలామంది జడ్జీలు వర్గ (ఆర్థిక కేటగిరీ) పరమైన రిజర్వేషన్‌ థియరీని అనుసరిస్తున్నారు. అన్ని కులాలనూ దీంట్లో పొందుపరుస్తున్నప్పటికీ ద్విజ కులాలే ఎక్కువగా అదనపు ప్రయోజనాన్ని పొందుతాయి. ఆర్థిక వర్గీకరణ ప్రాతిపదికన ఉండే ఏ రిజర్వేషన్‌ అయినా ఇప్పటికే ప్రతిభ పేరుతో ప్రతి సీటును, ఉద్యో గాన్ని పొందగలుగుతున్న ద్విజ కులాలతోపాటు సాపేక్షంగా  పేదలే అయినప్పటికీ, సామాజికంగా అదే స్థాయికి చెందిన శక్తులను విద్యా, ఉద్యోగ మార్కెట్‌లోకి తీసుకొస్తుంది. 
1990 మండల్‌ రిజర్వేషన్‌ పోరాట రోజులనుంచి కులప్రాతి పదికన ఉన్న నిరక్షరాస్యత, దారిద్య్రం, అసమానత్వం, అణచివేత, దోపిడీ వంటి అంశాలను తక్కువచేసి చూపడానికి వామపక్షాలు, ఉదారవాదులు, హిందుత్వవాదులు అందరూ రిజర్వేషన్లలో ఆర్థిక ప్రాతిపదికను కూడా తేవాలని ఒత్తిడి చేస్తూ వచ్చారు. న్యాయ మూర్తులు, న్యాయ నిపుణులు రాజ్యాంగానికి చేస్తూ వచ్చిన వ్యాఖ్యా నాలు చాలావరకు వర్గ కేంద్రంగానే ఉంటూ వచ్చాయి. కులం కాకుండా వర్గం అనేదే రిజర్వేషన్లకు సరైన వర్గీకరణ అవుతుందన్నది వీరికి ఇష్టమైన సిద్ధాంతం.

మన న్యాయవ్యవస్థలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల ప్రవేశాన్ని దామాషా ప్రాతిపదిక కింద చొప్పించడం ఎలా అనేది ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న. న్యాయపరమైన వ్యాజ్యాలలో పాలు పంచుకోవడాన్ని సాధా రణ ప్రజానీకం అర్థం చేసుకోలేదు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలనుంచి పోటీపడే సమర్థతలు కలిగిన సుశిక్షితులైన న్యాయ నిపుణులు మాత్రమే న్యాయ పోరాటాలలో తలపడగలరు. చట్టాలను వ్యాఖ్యా నించడంలో న్యాయవ్యవస్థ అత్యంత శక్తిమంతమైన విభాగంగా ఉంటున్నందున, అన్ని స్థాయిల్లోనూ ఉత్పాదకతతో ముడిపడి ఉన్న నేపథ్యంలోంచి బలమైన లీగల్‌ మేధావులు ప్రత్యేకించి సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో లేకపోతే న్యాయవ్యవస్థలో ఈ వర్గాల ప్రయోజనాలను కాపాడటం అసాధ్యం. ఈ సమరంలో ఇంగ్లిష్‌ పాత్ర చాలా కీలక మైంది.

న్యాయ వ్యవస్థను అదుపు చేస్తున్న యంత్రాంగాలను మార్చా లంటే వీధిపోరాటాలు లేదా పార్లమెంటరీ గావుకేకలు సాయపడవు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఎంపీలు సంఖ్యరీత్యా మెజా రిటీగా ఉన్నప్పటికీ, అగ్రవర్ణ పేదలకు కోటా వంటి అంశాల్లో పాలక వర్గాలు చట్టాలను లేదా రాజ్యాంగ సవరణలను శరవేగంతో రూపొం దిస్తున్నాయి. కాంగ్రెస్‌ హయాంలో కూడా ఇది జరిగినప్పటికీ ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీకి ప్రస్తుతం పూర్తి మెజారిటీ ఉన్నందున వీటిని మరింత తెలివిగా అమలు చేస్తూవస్తున్నాయి.
ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌పై రివ్యూ పిటిషన్‌ గురించి ప్రస్తుతం మాట్లాడుతున్నప్పటికీ, చాలావరకు అదే తీర్పును భాషాపరమైన మార్పులతో తిరిగి రాయడమే జరుగుతుంది. కాబట్టి ఈ సమస్య మరెక్కడో ఉంది. బార్‌లో కానీ, ధర్మాసనంలో కానీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మేధావులు పెద్దగా ఉండటం లేదు. లేదా న్యాయపరమైన జిత్తులను అర్థం చేసుకోలేనంత బలహీనంగా ఉంటున్నారు. వీటిని సరిగా అర్థం చేసుకుని, ఉత్పాదక కులాలు ఇంతకాలం సాధించింది ఏమీలేదని దేశం మొత్తానికి నచ్చజెప్పగలిగిన అంబేడ్కర్‌ లాంటి ప్రతిభావంతు లైన న్యాయ నిపుణులు ఈ కులాల్లోంచి పుట్టుకురావలసిన అవసరం ఉంది.

జాట్, పటేల్, రెడ్డి, కమ్మ, వెలమ, నాయర్, బెంగాల్‌లోని నామ్‌శూద్రుల వంటి ఓబీసీ రిజర్వేషన్‌ పరిధిలో లేని శూద్రుల విషయంలో సమస్య ఏమిటంటే, తమ యువతకు కాసిన్ని సీట్లు, ఉద్యోగాలు వస్తాయని ఆశించి వారు ఇలాంటి విధానాలను బల పరుస్తున్నారు. కానీ గత రెండేళ్లుగా 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజ ర్వేషన్‌ని అమలు చేస్తున్న రాష్ట్రాల్లో, కేంద్ర స్థాయిలో సీట్లు, ఉద్యో గాలకు సంబంధించిన డేటాను చూసినట్లయితే వారు నిజంగా లబ్ధి పొందినట్లు కనిపించడం లేదు. ఇక్కడ కూడా ఎగువ తరగతి శూద్రు లపై విద్యాపరమైన ఆధిక్యత కలిగిన ద్విజ కులాలవారే లబ్ధి పొందుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో శూద్ర ఎగువ తరగతి కులాలు పాలిస్తున్నప్పటికీ జాతీయ మేధారంగాల్లో వీరు ఎలాంటి నిర్ణయాత్మక పాత్రను పోషించడం లేదు. చివరకు 8 లక్షల ఆదాయ పరిమితితో అమలవుతున్న ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ని కూడా పూర్తిగా ద్విజులే ఉపయోగించుకుంటారు. ఇకముందు కూడా అనేక సంవత్సరాల పాటు విద్యారంగంలో ఓబీసీ క్రీమీ లేయర్, ఇతర శూద్ర కులాల వారు కూడా ద్విజ యువతతో పోటీ పడలేరన్నది వాస్తవం.

రిజర్వేషన్లు, అవినీతి అనేవి భారతదేశ వెనుకబాటుతనానికి ప్రధాన కారణాలు అంటూ ద్విజ న్యాయవ్యవస్థలో పాతుకుపోయిన బలమైన అభిప్రాయాలనే సుప్రీంకోర్టులో మెజారీటీ తీర్పు ప్రతిఫ లించింది. కాబట్టి రిజర్వేషన్‌ వ్యవస్థను క్రమంగా ఎత్తివేయా లని వీరు చెబుతారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందినవారు తిండి తింటే బల హీనపడతారు, వీరు ఆకలి దప్పులతో ఉంటే దేవుడు వారికి మరింత శక్తిని ఇస్తాడు అని వారిచేతనే నమ్మింపజేస్తారు. చాలామంది ఇలాంటి థియరీలను నమ్ముతున్నారు కూడా. సైన్స్‌ ఒక మూఢనమ్మకం, రాజ్యాంగం ఒక బ్రాంతి అనే భావాలను కూడా వీరు వ్యాప్తి చెంది స్తారు. సుప్రీంకోర్టు తాజా తీర్పు దీనికి ఒక ఉదాహరణ.

ప్రొ.కంచ ఐలయ్య షెపర్డ్‌, వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement