ews
-
జీవో 94ను ఉపసంహరించుకోండి
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని మైనారిటీ కాలేజీలు మినహా అన్ని ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వినర్ కోటా కింద జనరల్ కేటగిరీలో భర్తీ చేసే మొత్తం సీట్లలో 10 శాతం ఆర్థి కంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 94ను ఉపసంహరించుకోవాలని హైకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ మొత్తం వివాదానికి ఆ జీవోనే కారణమని తేల్చి చెప్పింది. ప్రభుత్వమే దానిని ఉపసంహరించుకుంటే సమస్యలన్నీ తీరిపోతాయంది. దీనిపై వైఖరి ఏమిటో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీవో 94 అమలును నిలిపేసిన హైకోర్టు సీట్ల సంఖ్యను పెంచకుండా ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని, అందువల్ల రాష్ట్ర ప్రభుత్వ జీవో 94ని రద్దు చేయాలని కోరుతూ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం ఆ జీవో అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత జీవో 94తో పాటు ప్రస్తుతం జనరల్ కేటగిరిలో ఉన్న 50 శాతం సీట్లలోనే ఈడబ్ల్యూఎస్ కోటాను కూడా సర్దుబాటు చేయాలంటూ ఎన్ఎంసీ జారీ చేసిన పబ్లిక్ నోటీసును సవాలు చేస్తూ దాఖలైన మరో వ్యాజ్యంపైనా సీజే ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయాన్ని ఆదేశించింది. ఈ రెండు వ్యాజ్యాలు మంగళవారం మరోసారి విచారణకు రాగా.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో ఈడబ్ల్యూఎస్ కోటా అమలుకు ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం హైకోర్టుకు స్పష్టంగా చెప్పిందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు యరగొర్ల ఠాగూర్ యాదవ్, ఎం.కె.రాజ్ కుమార్ తెలిపారు. అయితే ఈ వివరాలన్నింటినీ రికార్డ్ చేస్తూ ఈ వ్యాజ్యాలను పరిష్కరిస్తామని ధర్మాసనం తెలిపింది. అసలు జీవో 94నే ఉపసంహరించుకుంటే సమస్యలన్నీ తీరిపోతాయి కదా అని ధర్మాసనం ప్రశి్నంచింది. మెరుగైన మౌలిక సౌకర్యాలు ఉంటే ప్రైవేటు కాలేజీల్లో అదనపు సీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) చెప్పిన నేపథ్యంలో జీవో 94ను కొనసాగించడం వల్ల ప్రయోజనం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ‘బెయిల్’పై నేడు తీర్పు సాక్షి, అమరావతి: టీడీపీ ప్ర«ధాన కార్యాలయంపై దాడికి సంబంధించి పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ నేతలు దాఖలు చేసిన వ్యాజ్యాల్లో హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించనుంది. వాస్తవానికి హైకోర్టు మంగళవారమే తీర్పు వెలువరిస్తామని గతంలోనే స్పష్టం చేసింది. కానీ మంగళవారం ఆ కేసులేవీ విచారణ జాబితాలో లేకపోవడంతో వాటి గురించి వైఎస్సార్సీపీ నేతల తరఫు న్యాయవాది ప్రస్తావించారు. దీంతో న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ స్పందిస్తూ.. బుధవారం తీర్పు వెలువరిస్తానని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ నేతల తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దంటూ గతంలో ఇచి్చన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించాలని కోరారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.హైబ్రిడ్ విధానంలో కేసుల విచారణసాక్షి, అమరావతి : విజయవాడ, అమరావతిలో భారీ వరద నేపథ్యంలో మంగళవారం హైకోర్టులో కేసుల విచారణ హైబ్రిడ్ (ఆన్లైన్, భౌతిక) విధానంలో జరిగింది. ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌తో సహా సగం మంది న్యాయమూర్తులు హైకోర్టుకొచ్చి కేసుల విచారణ చేపట్టారు. సీజే ధర్మాసనం ముందు అత్యధిక న్యాయవాదులు ఆన్లైన్లో వాదనలు వినిపించగా, అతి కొద్ది మంది కోర్టుకొచ్చి వాదనలు వినిపించారు. మిగిలిన సగం మంది న్యాయమూర్తులు వారి ఇళ్ల నుంచే ఆన్లైన్లో కేసులను విచారించారు. 95 శాతం కేసులు వాయిదా పడ్డాయి. భోజన విరామ సమయానికికల్లా న్యాయమూర్తులు కేసుల విచారణ పూర్తి చేశారు. కోర్టు సిబ్బంది యథాతథంగా హైకోర్టుకొచ్చి విధులు నిర్వర్తించారు. బుధవారమూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. విజయవాడలో భారీ వరద, కరకట్ట వద్ద ప్రమాదకర పరిస్థితుల నేపథ్యంలో ఆన్లైన్ విధానంలో కేసుల విచారణ చేపట్టాలంటూ హైకోర్టు న్యాయవాదుల సంఘం కోరడంతో న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఉద్యోగుల ప్రయోజనాల నిమిత్తం మంగళ, బుధవారాల్లో కేసుల విచారణ ఆన్లైన్లోనే చేపట్టాలంటూ ప్రధాన న్యాయమూర్తి పాలనాపరమైన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం హైబ్రిడ్ విధానంలో కేసుల విచారణ జరిగింది. -
అన్ని వైద్య కళాశాలల్లోఈడబ్ల్యూఎస్ కోటా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఆర్థికంగా బలహీనమైన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్ అమలు చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఆదేశాల మేరకు ఈ ఏడాది నుంచే రిజర్వేషన్లు అమలు చేయనుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని అన్ని సీట్లలో 10 శాతం, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని (మైనారిటీ కాలేజీలు మినహా) సగం కనీ్వనర్ కోటా సీట్లలో 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం కేటాయించనున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నుంచి ఈ మేరకు అందిన ప్రతిపాదనకు ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదం తెలిపినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు 7 కాలేజీల్లోనే.. రాష్ట్రంలో ప్రస్తుతం కేవలం 7 ప్రభుత్వ వైద్య కళాశాలలు.. హైదరాబాద్‌లోని గాందీ, ఈఎస్ఐ మెడికల్ కాలేజీలు, మహబూబ్‌నగర్, నిజామాబాద్, సిద్దిపేట మెడికల్ కాలేజీలు, వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ, ఆదిలాబాద్‌లోని రాజీవ్‌గాంధీ మెడికల్ కాలేజీల్లోనే ఎన్ఎంసీ అనుమతి మేరకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలవుతున్నాయి. గతేడాది వరకు ఆయా కాలేజీల్లో 103 ఎంబీబీఎస్ సీట్లు ఈ కోటా కింద అగ్రవర్ణాల్లోని పేదలకు ఇచ్చారు. కాగా ఈ ఏడాది నుంచి అన్ని మెడికల్ కాలేజీల్లోని కనీ్వనర్ కోటా సీట్లకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌ను అమలు చేస్తే మరో 350 వరకు ఎంబీబీఎస్ సీట్లు అగ్రవర్ణ పేదలకు దక్కే అవకాశం ఉందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే దీనిపై పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది. నీట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు వెలువడిన తర్వాత, అడ్మిషన్ నోటిఫికేషన్ కంటే ముందే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌కు సంబంధించిన ఉత్తర్వులు వెలువడుతాయని వైద్యశాఖ వర్గాలు వెల్లడించాయి. జనరల్ కోటా సీట్లకు గండిరాష్ట్రంలో గతేడాది వరకు 56 మెడికల్ కాలేజీల్లో 8,490 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో 27 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 3,790 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. అలాగే 29 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 4,700 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. అయితే ఇప్పటివరకు 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలుకు గాను అంతే మొత్తంలో సీట్లను ఆయా మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసీ మంజూరు చేసింది. దీనివల్ల ఇతర రిజర్వేషన్ కేటగిరీ విద్యార్థులకు కానీ, జనరల్ కేటగిరీ కోటా సీట్లకు కానీ కోత పడేది కాదు. కానీ తాజాగా ఎన్ఎంసీ అదనపు సీట్లు మంజూరు చేయడం కుదరదని, ఉన్న సీట్లలోనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయాలని ఆదేశించింది. అయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఎలాంటి కోత ఉండదని అంటున్నారు. అంటే జనరల్ కేటగిరీ సీట్లకు కోత పెట్టి వాటిని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌కు కేటాయిస్తారు. అలాగైనా తమకు నష్టం జరుగుతుందని ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు అంటున్నారు. జనరల్ కేటగిరీలోనూ తమకు ప్రతిభ ప్రకారం రావాల్సిన సీట్లకు గండి పడుతుందని, దీనివల్ల తమకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ.8 లక్షల ఆదాయ పరిమితి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తించాలంటే ఆదాయం రూ.8 లక్షల లోపు ఉండాలి. ఈ మేరకు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేలా రెవెన్యూ శాఖకు ఆదేశాలున్నాయి. అన్ని మెడికల్ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలయ్యే పక్షంలో ఈ మేరకు విద్యార్థులు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాల్సి ఉంటుంది. -
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు.. మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక నిర్ణయం
భోపాల్: ఆర్థికంగా వెనుకబడిన జనరల్ కేటగిరీ కులాల వారికే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తిస్తాయా అనే అంశాన్ని మధ్యప్రదేశ్ హైకోర్టు విచారించింది. ఈ విషయంలో చీఫ్ జస్టిస్ రవి విజయ మలిమత్, జస్టిస్ విశాల్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లో స్పందనను తెలియజేయాలని ఆదేశించింది. అడ్వకేట్ యూనియన్ ఫర్ డెమొక్రసీ అండ్ సోషల్ జస్టిస్ సంస్థ ఈ పిటిషన్ దాఖలు చేసింది. ఇతర కులాల్లోని ఆర్థికంగా వెనుకబడిన వారిని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తించడం లేదని కోర్టుకు తెలిపింది. పేదలపై కులం పేరుతో ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని, ఈ డబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధంగా భావించి కొట్టి వేయాలని పిటిషనర్ కోరారు. ఇదీ చదవండి.. కాంగ్రెస్‌పై అమిత్ షా ఫైర్ -
ఉద్యోగాల భర్తీలో EWS వారికి ఐదేళ్ల వయోపరిమితి పెంపు
-
‘ఈడబ్ల్యూఎస్’ సర్టిఫికెట్ల జారీపై ఈనాడు తప్పుడు కథనాలు..
సాక్షి, అమరావతి: ఏడాది వ్యవధిలో జారీ చేసిన దాదాపు లక్ష సరిఫికెట్లు కళ్లెదుటే కనిపిస్తున్నా కబోదుల్లా నటిస్తూ మభ్యపుచ్చే కథనాలు ప్రచురించే వారిని ఏమనాలి? అగ్రవర్ణ పేదలకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాష్ట్రంలో జారీ చేసిన ఈడబ్ల్యూఎస్ ధ్రువపత్రాల సంఖ్య ఇదీ! రాష్ట్రవ్యాప్తంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు సజావుగా జారీ అవుతుంటే అసలు ప్రొఫార్మా సైతం రెవెన్యూ కార్యాలయాలు, సచివాలయాలకు చేరలేదంటూ ‘ఈనాడు’ యథావిధిగా తనకు అలవాటైన రీతిలో పచ్చి అబద్ధాలను వండి వార్చింది. సర్టిఫికెట్లు జారీ చేయకపోవడం వల్ల పోలీసు నియామకాలకు దరఖాస్తు చేసుకున్న వారు ఈడబ్ల్యూఎస్ సదుపాయాన్ని వినియోగించుకోగలమా? అని మథనపడుతున్నట్లు శోకాలు పెట్టింది. జనవరి నుంచే జారీ ఈ ఏడాది జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లను ప్రభుత్వం జారీ చేస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం చేసిన చట్టానికి అనుగుణంగా వీటిని జారీ చేస్తున్నారు. అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో వీటికోసం దరఖాస్తు చేసుకునే సౌకర్యాన్ని జనవరి ఒకటో తేదీ నుంచి ప్రభుత్వం ప్రారంభించింది. జనవరి నుంచి ఈ ఏడాది డిసెంబర్ 12వ తేదీ వరకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ల కోసం 1,04,961 లక్షల మంది సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోగా 93,348 జారీ అయ్యాయి. 7,608 దరఖాస్తులను తిరస్కరించారు. మరో 4,005 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. మరి ప్రొఫార్మాలే రెవెన్యూ కార్యాలయాలకు చేరకుంటే ఇన్ని లక్షల సర్టిఫికెట్లు ఎలా జారీ అయ్యాయి? ఇదీ ప్రక్రియ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ కోసం సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే డిజిటల్ అసిస్టెంట్ వద్దకు వెళుతుంది. అక్కడి నుంచి వీఆర్వో, ఆర్ఐ ద్వారా తహసీల్దార్ వద్దకు చేరుతుంది. ఇందుకోసం రూ.50 సర్వీస్ చార్జీ చెల్లించాలి. దరఖాస్తుతోపాటు నోటరీ అఫిడవిట్, ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో జత చేయాలి. దరఖాస్తును 30 రోజుల్లోపు కచ్చితంగా క్లియర్ చేస్తారు. రూ.8 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉండే అర్హులైన అగ్రవర్ణ పేదలకు నిబంధనల ప్రకారం వీటిని జారీ చేస్తారు. వాస్తవాలు ఇలా ఉండగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ల జారీకి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో అమలుకు నోచుకోవడంలేదని, దరఖాస్తుదారులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని ఈనాడు దిగజారుడు కథనాన్ని ప్రచురించింది. -
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు, చైనాతో ఉద్రిక్తతలు
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు పూర్తి చేసింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్లు, దేశ ఆర్థిక స్థితిగతులు, చైనాతో సరిహద్దు సంక్షోభం, రాజ్యాంగ వ్యవస్థలను మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ ండటం తదిరాలను సమావేశాల్లో లేవనెత్తాలని నిర్ణయించింది. కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ శనివారం పార్టీ నాయకురాలు సోనియాగాంధీ నివాసంలో సమావేశమైంది. విపక్షాలతో చర్చించి ఉమ్మడి వ్యూహాన్ని రచిస్తామని పార్టీ నేత జైరాం రమేశ్ మీడియాకు వెల్లడించారు. జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ, ఇతర కీలక నేతలు ఈసారి సమావేశాలకు దూరం కానున్నారు. నా వ్యాఖ్యల వక్రీకరణ: ఖర్గే అహ్మదాబాద్: ప్రధాని మోదీని రావణుడని తాను ప్రత్యేకంగా అనాల్సిన పని లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తిప్పికొట్టారు. ‘‘నా వ్యాఖ్యలను వక్రీకరించారు. గుజరాత్లో ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు, బ్యానర్లపై మోదీ ముఖమే. అలా అనేలా చేసుకుంది వాళ్లే’’ అన్నారు. కాంగ్రెస్ ఓట్లను చీల్చి బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకు ఆప్ ప్రయత్నిస్తోందన్నారు. -
‘కోటా’ను కాపాడుకోవడం ఎలా?
రిజర్వేషన్లు, అవినీతి భారతదేశ వెనుకబాటుతనానికి ప్రధాన కారణాలనే అభిప్రాయం ద్విజ న్యాయవ్యవస్థలో బలంగా పాతుకుపోయింది. ‘ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు’ (ఈడబ్ల్యూఎస్) కోటా విషయంలో సుప్రీంకోర్టులో మెజారిటీ తీర్పు దీన్నే ప్రతిఫలించింది. కులం కాకుండా వర్గం అనేదే రిజర్వే షన్లకు సరైన వర్గీకరణ అవుతుందన్నది వీరికి ఇష్టమైన సిద్ధాంతం. తమ యువతకు లబ్ధి చేకూర్చుతుందని నమ్ముతూ రిజర్వేషన్ పరిధిలో లేని శూద్ర వర్గాలు దీన్ని సమర్థిస్తున్నాయి. కానీ అంతిమంగా ద్విజ వర్గాలే దీని నుంచి లబ్ధి పొందుతాయనేది నిజం. అన్ని స్థాయుల్లోనూ ఉత్పాదకతతో ముడిపడి ఉన్న వర్గాల్లోంచి బలమైన లీగల్ మేధావులు ప్రత్యేకించి సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో లేకపోతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ప్రయోజనాలను కాపాడటం అసాధ్యం. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు రిజర్వేషన్‌పై సుప్రీంకోర్టు అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పు తీవ్ర చర్చలకు దారితీసింది. దళిత, ఆదివాసీ, ఓబీసీల సామాజిక ఆర్థిక మార్పునకు సంబంధించిన కోణంలోంచి చూస్తే అది తిరోగమన తీర్పా లేక పురోగమన తీర్పా అనేదే ఆ చర్చల సారాంశం. 2022 నవంబర్ 10న ఆల్ బార్ అసోసియేషన్ (ఏబీఏ) న్యాయవాదులు, అఖిల భారత వెనుకబడిన మైనారిటీ కమ్యూనిటీల ఉద్యోగుల సమాఖ్య కార్యకర్తలు ఒక ఆన్లైన్ సెమినార్ నిర్వహించారు. ఇప్పటికీ తమ చారిత్రక వెనుకబాటుతనాన్ని, తమపై నియంత్రణను అధిగమించలేకపోయిన ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఉత్పాదక ప్రజారాశులను తప్పుదోవ పట్టిస్తున్న న్యాయవ్యవస్థను, ప్రభుత్వాన్ని సవాలు చేసి భవిష్యత్తు కార్యాచరణ చేపట్టడం కోసం అవసరమైన కొత్త దృక్పథాన్ని ఈ సెమినార్ పరిశీలించింది. సుప్రీంకోర్టు ధర్మాసనం 3–2 మెజారిటీతో ఇచ్చిన తీర్పులో ప్రభుత్వ దృక్పథాన్ని మెజారిటీ న్యాయమూర్తులు ఎత్తిపట్టారు. ఇక పోతే నాటి చీఫ్ జస్టిస్ యుయు లలిత్‌తో కూడిన ఇద్దరు జడ్జీల మైనా రిటీ కొన్ని సంక్లిష్ట ప్రశ్నలను ముందుకు తెచ్చింది. సంస్థాగతంగా ఉన్న కులాన్ని నిర్మూలించి సమతావాద సమాజం వైపు పురోగమిం చాలని రాజ్యాంగం నిర్మాణాత్మకంగా మాట్లాడలేదన్న అభిప్రా యాన్ని ‘ఏబీఏ’ న్యాయవాదులు వ్యక్తపరిచారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 46 మాత్రమే కులం గురించి పేర్కొంది. ప్రజానీకంలోని బలహీన వర్గాల, ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీలకు చెందిన విద్యా, ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రోత్సహించాలని చెప్పింది. పైగా సామాజిక అన్యాయం నుంచి, అన్ని రకాల దోపిడీ నుంచి వారిని కాపాడాలని సూచించింది. ఇక్కడ కూడా కులానికి సంబంధించిన భావనను షెడ్యూల్డ్ కులాలకు మాత్రమే ఉద్దేశించడం చూడవచ్చు. రాజ్యాంగంలో ఎక్కడ కూడా శూద్ర, ఓబీసీలను కుల పీడనను ఎదుర్కొంటున్న వారిగా గుర్తించలేదు. వీరిని ఒక వర్గంగానే గుర్తిం చారు. ప్రస్తుతం ఇతర వెనుకబడిన వర్గం రిజర్వేషన్ని సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల చర్చా పరిధిలోనే ఏర్పర్చారు. ఇది రిజర్వేషన్ వ్యతిరేక రాజకీయ నాయకులు, పార్టీలు, మేధావులు, మీడియా వ్యక్తులకు విస్తారమైన పరిధిని ఇచ్చింది. 103వ రాజ్యాంగ సవరణతో 10 శాతం ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ద్వారా వర్గ ప్రాతిపదిక రిజర్వేషన్‌ను ముందుకు తెచ్చే వీలు కల్పించింది. ఇప్పుడు సుప్రీం కోర్టు తన తీర్పు ద్వారా దీనికి ఆమోద ముద్ర వేసింది. న్యాయవ్యవస్థలోని చాలామంది జడ్జీలు వర్గ (ఆర్థిక కేటగిరీ) పరమైన రిజర్వేషన్ థియరీని అనుసరిస్తున్నారు. అన్ని కులాలనూ దీంట్లో పొందుపరుస్తున్నప్పటికీ ద్విజ కులాలే ఎక్కువగా అదనపు ప్రయోజనాన్ని పొందుతాయి. ఆర్థిక వర్గీకరణ ప్రాతిపదికన ఉండే ఏ రిజర్వేషన్ అయినా ఇప్పటికే ప్రతిభ పేరుతో ప్రతి సీటును, ఉద్యో గాన్ని పొందగలుగుతున్న ద్విజ కులాలతోపాటు సాపేక్షంగా పేదలే అయినప్పటికీ, సామాజికంగా అదే స్థాయికి చెందిన శక్తులను విద్యా, ఉద్యోగ మార్కెట్లోకి తీసుకొస్తుంది. 1990 మండల్ రిజర్వేషన్ పోరాట రోజులనుంచి కులప్రాతి పదికన ఉన్న నిరక్షరాస్యత, దారిద్య్రం, అసమానత్వం, అణచివేత, దోపిడీ వంటి అంశాలను తక్కువచేసి చూపడానికి వామపక్షాలు, ఉదారవాదులు, హిందుత్వవాదులు అందరూ రిజర్వేషన్లలో ఆర్థిక ప్రాతిపదికను కూడా తేవాలని ఒత్తిడి చేస్తూ వచ్చారు. న్యాయ మూర్తులు, న్యాయ నిపుణులు రాజ్యాంగానికి చేస్తూ వచ్చిన వ్యాఖ్యా నాలు చాలావరకు వర్గ కేంద్రంగానే ఉంటూ వచ్చాయి. కులం కాకుండా వర్గం అనేదే రిజర్వేషన్లకు సరైన వర్గీకరణ అవుతుందన్నది వీరికి ఇష్టమైన సిద్ధాంతం. మన న్యాయవ్యవస్థలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల ప్రవేశాన్ని దామాషా ప్రాతిపదిక కింద చొప్పించడం ఎలా అనేది ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న. న్యాయపరమైన వ్యాజ్యాలలో పాలు పంచుకోవడాన్ని సాధా రణ ప్రజానీకం అర్థం చేసుకోలేదు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలనుంచి పోటీపడే సమర్థతలు కలిగిన సుశిక్షితులైన న్యాయ నిపుణులు మాత్రమే న్యాయ పోరాటాలలో తలపడగలరు. చట్టాలను వ్యాఖ్యా నించడంలో న్యాయవ్యవస్థ అత్యంత శక్తిమంతమైన విభాగంగా ఉంటున్నందున, అన్ని స్థాయిల్లోనూ ఉత్పాదకతతో ముడిపడి ఉన్న నేపథ్యంలోంచి బలమైన లీగల్ మేధావులు ప్రత్యేకించి సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో లేకపోతే న్యాయవ్యవస్థలో ఈ వర్గాల ప్రయోజనాలను కాపాడటం అసాధ్యం. ఈ సమరంలో ఇంగ్లిష్ పాత్ర చాలా కీలక మైంది. న్యాయ వ్యవస్థను అదుపు చేస్తున్న యంత్రాంగాలను మార్చా లంటే వీధిపోరాటాలు లేదా పార్లమెంటరీ గావుకేకలు సాయపడవు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఎంపీలు సంఖ్యరీత్యా మెజా రిటీగా ఉన్నప్పటికీ, అగ్రవర్ణ పేదలకు కోటా వంటి అంశాల్లో పాలక వర్గాలు చట్టాలను లేదా రాజ్యాంగ సవరణలను శరవేగంతో రూపొం దిస్తున్నాయి. కాంగ్రెస్ హయాంలో కూడా ఇది జరిగినప్పటికీ ఆర్ఎస్ఎస్, బీజేపీకి ప్రస్తుతం పూర్తి మెజారిటీ ఉన్నందున వీటిని మరింత తెలివిగా అమలు చేస్తూవస్తున్నాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌పై రివ్యూ పిటిషన్ గురించి ప్రస్తుతం మాట్లాడుతున్నప్పటికీ, చాలావరకు అదే తీర్పును భాషాపరమైన మార్పులతో తిరిగి రాయడమే జరుగుతుంది. కాబట్టి ఈ సమస్య మరెక్కడో ఉంది. బార్లో కానీ, ధర్మాసనంలో కానీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మేధావులు పెద్దగా ఉండటం లేదు. లేదా న్యాయపరమైన జిత్తులను అర్థం చేసుకోలేనంత బలహీనంగా ఉంటున్నారు. వీటిని సరిగా అర్థం చేసుకుని, ఉత్పాదక కులాలు ఇంతకాలం సాధించింది ఏమీలేదని దేశం మొత్తానికి నచ్చజెప్పగలిగిన అంబేడ్కర్ లాంటి ప్రతిభావంతు లైన న్యాయ నిపుణులు ఈ కులాల్లోంచి పుట్టుకురావలసిన అవసరం ఉంది. జాట్, పటేల్, రెడ్డి, కమ్మ, వెలమ, నాయర్, బెంగాల్‌లోని నామ్శూద్రుల వంటి ఓబీసీ రిజర్వేషన్ పరిధిలో లేని శూద్రుల విషయంలో సమస్య ఏమిటంటే, తమ యువతకు కాసిన్ని సీట్లు, ఉద్యోగాలు వస్తాయని ఆశించి వారు ఇలాంటి విధానాలను బల పరుస్తున్నారు. కానీ గత రెండేళ్లుగా 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజ ర్వేషన్ని అమలు చేస్తున్న రాష్ట్రాల్లో, కేంద్ర స్థాయిలో సీట్లు, ఉద్యో గాలకు సంబంధించిన డేటాను చూసినట్లయితే వారు నిజంగా లబ్ధి పొందినట్లు కనిపించడం లేదు. ఇక్కడ కూడా ఎగువ తరగతి శూద్రు లపై విద్యాపరమైన ఆధిక్యత కలిగిన ద్విజ కులాలవారే లబ్ధి పొందుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో శూద్ర ఎగువ తరగతి కులాలు పాలిస్తున్నప్పటికీ జాతీయ మేధారంగాల్లో వీరు ఎలాంటి నిర్ణయాత్మక పాత్రను పోషించడం లేదు. చివరకు 8 లక్షల ఆదాయ పరిమితితో అమలవుతున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని కూడా పూర్తిగా ద్విజులే ఉపయోగించుకుంటారు. ఇకముందు కూడా అనేక సంవత్సరాల పాటు విద్యారంగంలో ఓబీసీ క్రీమీ లేయర్, ఇతర శూద్ర కులాల వారు కూడా ద్విజ యువతతో పోటీ పడలేరన్నది వాస్తవం. రిజర్వేషన్లు, అవినీతి అనేవి భారతదేశ వెనుకబాటుతనానికి ప్రధాన కారణాలు అంటూ ద్విజ న్యాయవ్యవస్థలో పాతుకుపోయిన బలమైన అభిప్రాయాలనే సుప్రీంకోర్టులో మెజారీటీ తీర్పు ప్రతిఫ లించింది. కాబట్టి రిజర్వేషన్ వ్యవస్థను క్రమంగా ఎత్తివేయా లని వీరు చెబుతారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందినవారు తిండి తింటే బల హీనపడతారు, వీరు ఆకలి దప్పులతో ఉంటే దేవుడు వారికి మరింత శక్తిని ఇస్తాడు అని వారిచేతనే నమ్మింపజేస్తారు. చాలామంది ఇలాంటి థియరీలను నమ్ముతున్నారు కూడా. సైన్స్ ఒక మూఢనమ్మకం, రాజ్యాంగం ఒక బ్రాంతి అనే భావాలను కూడా వీరు వ్యాప్తి చెంది స్తారు. సుప్రీంకోర్టు తాజా తీర్పు దీనికి ఒక ఉదాహరణ. ప్రొ.కంచ ఐలయ్య షెపర్డ్, వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
వారికి రిజర్వేషన్లు సహేతుకం కాదు!
ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదల (ఈడబ్ల్యూఎస్)కు పదిశాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ 2019 జనవరి 8న పార్లమెంట్ చేసిన 103వ రాజ్యాంగ సవరణను సమర్థిస్తూ సుప్రీం కోర్ట్ 2022 నవంబర్ 7న తీర్పు ఇచ్చింది. దీంతో రిజర్వేషన్ అంశం దేశ వ్యాప్తంగా మరోసారి చర్చకు వచ్చింది. ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్‌లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు. లలిత్, జస్టిస్ రవీంద్రభట్‌లు ఈడబ్ల్యూఎస్ కోటాను విభేదించగా... జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ బేలా ఎం త్రివేది సమర్థించారు. మొత్తం మీద 3:2 మెజారిటీతో 103వ రాజ్యాంగ సవరణను సమర్థిస్తూ ఎస్సీ, ఎస్టీ బీసీలు కాని వారిలో పేదలు... అనగా అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీర్పునివ్వడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ దేశంలో తరతరాలుగా సామాజికంగా, విద్యాపరంగా; అంటరానితనం, వివక్షతలను అనుభవిస్తున్న కులాలకు కల్పించవలసిన రిజర్వేషన్లు... ఆర్థికపరంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు 10 శాతం కల్పించడం రాజ్యాంగ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమనీ, ఆ సవరణను రద్దు చేయాలనీ సుమారు 40 మంది సుప్రీం కోర్టులో కేసులు వేశారు. జస్టిస్ యు.యు. లలిత్ కుమార్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు బెంచ్ విచారణ సమయంలో దీన్ని ప్రభుత్వం సమర్ధించుకుంటూ... ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇంతకు ముందే రిజర్వేషన్లు కల్పిస్తున్నందున వారికి కేటాయించిన 50 శాతం కోటాకు ఈ 10 శాతం అదనంగా ఉంటుందనీ, వీటితో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధం లేదనీ, ఇది రాజ్యాంగబద్ధమే అనీ చెప్పింది. ఈ కోర్టు తీర్పు రాగానే అధికార, ప్రతిపక్ష, వివిధ రాజకీయ పార్టీలు క్రెడిట్ మాదంటే మాది అని ప్రకటించుకోవడం సిగ్గుచేటు. 103వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఆర్టికల్ 15 (6), 16 (6) క్లాజు లను చేర్చడం ద్వారా దేశ జనాభాలో 8 నుంచి 10 శాతం ఉన్న అగ్ర వర్ణాలకు అందులో కేవలం మూడు శాతం ఉన్న పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం ఏ విధంగా సబబు అని ప్రశ్నిస్తున్నారు. ఎస్సీ, ఎసీ,్ట బీసీలలో ఉన్న నిరుపేదలు పేదలు కాదా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలలో ఎలాంటి స్థిరాస్తులు కలిగి లేకుండా ఏడాదికి రూ. 2.5 లక్షల ఆదాయం ఉన్న వారిని పేదలుగా గుర్తించినప్పుడు... అగ్రవర్ణాలకు మాత్రం 5 ఎకరాల లోపు భూమీ, సంవత్సరాదాయం రూ. 8 లక్షల లోపు ఆదాయం... అంటే నెలకు 60 వేల ఆదాయం ఉండా లని నిర్ణయించడం వివక్ష కాదా? నెలకు 60 వేల ఆదాయం సంపాదించే వారు ఎలా పేదలవుతారో తెలపాలి. పేదలు ఎవరైనా పేదలే అన్న ప్పుడు ఈ వివక్ష ఎందుకో సమాధానం చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎస్సీలలో 38 శాతం, ఎస్టీలలో 48.4 శాతం, బీసీలలో 13.8 శాతం, ఓసీలలో 3 శాతం పేదలు ఉన్నారు. పేదరికం, ఆర్థిక వెనుకబాటు ఆధారంగా ఓసీలలో ఉన్న మూడు శాతం పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలలో ఉన్న పేదలకు ఎందుకు ఇందులో అవకాశం ఇవ్వరు? వీరు పేదలు కాదా? కేవలం అగ్రవర్ణాల్లోనే పేదలుంటారని ఈడబ్ల్యూఎస్ కోటా నుండి ఎస్సీ, ఎస్టీ, బీసీలను తప్పించడం రాజ్యాంగం లోని ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వపు హక్కును కాలరాయడమే. ఆర్థిక ప్రాతిపదికన రిజర్వే షన్లను కొందరికే ఎలా వర్తింపచేస్తారని రాజ్యాంగ నిపుణులు అంటు న్నారు. ఉదాహరణకు దివ్యాంగులకు ఏ కులం వారికైనా రిజర్వేషన్లు కల్పిస్తున్నప్పుడు. నిరుపేదలు ఏ కులంలో ఉన్నా ఈడబ్ల్యూఎస్ రిజ ర్వేషన్లు వర్తింపజేయాలి కదా! ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం 52 శాతం ఉన్న బీసీలకు వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వలేదు. పైపెచ్చు 1992లో ఇందిరా సహాని కేసులో తొమ్మిది మంది సభ్యులు గల సుప్రీంకోర్టు బెంచ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రభుత్వం ఇస్తున్న రిజర్వేషన్లు 50 శాతానికి దాటడానికి వీలులేదని తీర్పునిచ్చింది. ఇదే సందర్భంలో ప్రమోషన్లలో రిజర్వేషన్లను కూడా తొలగించి, బీసీలకు క్రిమిలేయర్ ని వర్తింపజేసింది. దేశంలో 49.5 శాతం రిజర్వేషన్లు అమలవుతుండగా ప్రస్తుత ఈడబ్ల్యూఎస్‌లకు ఇస్తున్న 10 శాతం కలిపితే 59.5 శాతం అవుతున్నది. అయితే ఓ న్యాయమూర్తి 50 శాతం అనేది లక్ష్మణరేఖ కాదని పేర్కొనడం విశేషం. ఎస్సీ, ఎస్టీలకు ప్రమోషన్లలోనూ అనేక అన్యాయాలు జరగుతు న్నాయి. 2018లో హైకోర్టు జీవో నంబర్ 26ను సమర్థిస్తూ ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లు కల్పించాలని తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ గత సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 26ను తొలగిస్తూ జీవో నంబర్ 247ను తీసుకు రావడం జరిగింది. దీనివల్ల దళిత, గిరిజన ఉద్యోగుల ప్రమోషన్లకు అడ్డుకట్ట వేయడం జరిగింది. ఇదిలా ఉండగా మరో అన్యాయాన్ని గమనిస్తే (ఈడబ్ల్యూఎస్) అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు కేటాయించడం వల్ల ఓపెన్ కేటగిరిలో వచ్చే ఎస్సీ, ఎస్టీ, బీసీలు పది శాతం రిజర్వేషన్లు కోల్పోవడం జరుగుతుంది. ఇటీవలే జరిగిన కానిస్టేబుల్ నియామకాల ప్రక్రియలో ‘రూల్ ఆఫ్ రిజర్వేషన్’ పాటించక పోవడం వల్ల అన్యాయానికి గురైన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు తీవ్ర ఆందోళన చేయడం... ఈ అంశం అసెంబ్లీలో చర్చకు రావడం వల్ల తిరిగి వాటిని సరిచేయడం జరిగింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఉద్యోగ నియమకాల ఫలితాలలో ఎస్సీలకు –82.50, ఎస్టీలకు –76.50, బీసీ లకు 110.50, ఈడబ్ల్యూఎస్ (ఓసీ)లకు – 51.25 మార్కులు కటాఫ్ మార్కులుగా కేటాయించారు. ఇలా నిరుపేదలు, వికలాంగుల కంటే కూడా ఈడబ్ల్యూఎస్ (ఓసీ)లకు తక్కువ కటాఫ్ మార్కులు కేటాయిం చడం అన్యాయం. ఈ విధంగా కూడా దళిత గిరిజనులకు, బహుజను లకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఇలా ఒక్కొక్కటిగా రాజ్యాంగ రక్షణలు అన్నిటిని కూడా పెకిలించివేస్తున్న చర్యలను వివిధ సామాజిక వర్గాల మేధావులు తీవ్రంగా ఖండిస్తున్నారు. సామాజిక వెనుకబాటే ఆర్థిక వెనుకబాటుకు కారణం కాబట్టి ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వ సాధన కోసం సామాజికంగా, విద్యా పరంగా... వివక్ష, అంటరానితనం అనుభవిస్తున్న ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్స్ కల్పించడం జరిగింది. రిజర్వేషన్లు ఆర్థిక ఉద్దీపన కోసం కాదన్న విషయం గమనించాలి. కాబట్టి ఆర్థిక వెనుకబాటు కారణంగా రిజర్వేషన్లు కల్పించలేమన్న విషయాన్ని గుర్తించాలి. అగ్రవర్ణ పేదలపై ఎవరికీ వ్యతిరేకత లేదనేది గమనించాలి. వారి ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వాలు రకరకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తానంటే కాదనేది ఎవరు? ఆ దిశలో కృషి చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది. (క్లిక్ చేయండి: రాష్ట్రాల వృద్ధిలో కేంద్రం పాత్రేమిటి?) - బైరి వెంకటేశం రాష్ట్ర అధ్యక్షులు, ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి, తెలంగాణ -
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై స్టాలిన్ సర్కార్ సంచలన నిర్ణయం!
సాక్షి, చెన్నై: ఆర్థికంగా వెనుకబడిన జనరల్ కేటగిరిలోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లను తమిళనాడులో అమలు చేసే ప్రసక్తే లేదని అఖిలపక్ష సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా పునఃసమీక్ష పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు. సామాజిక న్యాయమే లక్ష్యంగా తమ కార్యాచరణ ఉంటుందని సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు. వివరాల ప్రకారం.. ఆర్థికంగా వెనుకబడిన జనరల్ కేటగిరీలోని పేదలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పనకు కేంద్రం తీసుకున్న చర్యలకు బలాన్ని కలిగించే విధంగా సోమవారం సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పును డీఎంకేతో పాటు కొన్ని పారీ్టలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో ఈ తీర్పుపై చర్చించి తదుపరి చర్యలకు అఖిల పక్ష సమావేశానికి సీఎం స్టాలిన్ నిర్ణయించారు. అఖిల పక్షం సమావేశంలో సుదీర్ఘ చర్చ డీఎంకే ప్రభుత్వ పిలుపునకు ఆ పార్టీ మిత్రపక్షాలు కదిలాయి. అసెంబ్లీలోని 13 పారీ్టల ప్రతినిధులకు ఆహా్వనం పంపించగా, అన్నాడీఎంకే, బీజేపీ సభ్యులు గైర్హాజరయ్యారు. సచివాలయంలో శనివారం ఉదయం 10 గంటల నుంచి గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. ఇందులో కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత సెల్వ పెరుంతొగై, ఎమ్మెల్యే హసన్ మౌలానా, ఎండీఎంకే నేత, ఎంపీ వైగో, సదన్ తిరుమలైకుమార్, వీసీకే నేతలు, ఎంపీలు తిరుమావళన్, రవికుమార్ సీపీఐ నేత ముత్తరసన్, తమిళర్ వాల్వురిమై కట్చి నేత వేల్ మురుగన్, కొంగునాడు మక్కల్ దేశీయ కట్చి నేతలు చిన్న రాజ్, సూర్యమూర్తి, పురట్చి భారతం కట్టి నేత జగన్ మూర్తి, మనిద నేయ మక్కల్ కట్చి నేత జవహరుల్లా, డీఎంకే తరపున మంత్రులు దురై మురుగన్, పొన్ముడి, రఘుపతి, సీఎస్ ఇరై అన్భు ఈ సమావేశానికి హాజరయ్యారు. సీఎం స్టాలిన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అన్ని పారీ్టలు తమ తమ అభిప్రాయా లను వ్యక్తం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు మద్దతుగా ఉంటామని ప్రకటించాయి. తీర్మానాలు.. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, తీర్మానాలను మంత్రి పొన్ముడి మీడియాకు వివరించారు. వెనుకబడిన తదితర సామాజిక వర్గాలకు తమిళనాట కేటాయిస్తున్న 69 శాతం రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. కేంద్రం పేర్కొంటున్న 10 శాతం రిజర్వేషన్ తమిళనాటు అమలు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఆయా పారీ్టల ప్రతినిధుల సూచనలు, అభిప్రాయాల మేరకు తీర్మానాలు చేశామని తెలిపారు. జాతీయస్థాయిలో కొన్ని పారీ్టలు 10 శాతం రిజర్వేషన్‌కు మద్దతు ఇచ్చి ఉన్నా, అదే పార్టీలు తమిళనాడులో మాత్రం ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడుతామని ప్రకటించడం అభినందనీయమని కొనియాడారు. సుప్రీంకోర్టు తీర్పుపై పునః సమీక్ష పిటిషన్ దాఖలు చేయనున్నామని, బలమైన వాదనలు కోర్టు ముందు ఉంచుతామని వివరించారు. గతంలో ఈ రిజర్వేషన్లను వ్యతిరేకించిన అన్నాడీఎంకే, ఇప్పుడు అనుకూలంగా వ్యవహరించడం శోచనీయమని విమర్శించారు. తమిళనాడులో సామాజిక న్యాయమే లక్ష్యమని, 10 శాతం రిజర్వేషన్లకు ఇక్కడే చోటు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కాగా సామాజిక న్యాయం కోసం ఎంత వరకైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఈ సమావే శంలో సీఎం స్టాలిన్ ప్రకటించడం గమనార్హం. -
‘కోటా’ తీర్పుతో కొత్త ప్రశ్నలు
ఆధిపత్య కులాల్లోని నిరుపేదలకు పదిశాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం 2019లో తీసుకున్న నిర్ణయం సరైందేనని అయిదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మా సనం సోమవారం వెలువరించిన మెజారిటీ తీర్పు సహజంగానే పలు ప్రశ్నలను రేకెత్తించింది. రాజ్యాంగంలోని 15, 16 అధికరణలకు కొత్త క్లాజులు చేరుస్తూ తీసుకొచ్చిన 103వ సవరణ రాజ్యాంగ బద్ధతపై దాఖలైన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు. లలిత్, జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ బేలా ఎం. త్రివేది, జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ రవీంద్ర భట్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. తరతరాలుగా సామాజిక అణచివేతకూ, వివక్షకూ గురవుతూ అన్ని విధాలుగా వెనకబడివున్న కులాలకు రిజర్వేషన్లు కల్పించాలని మన రాజ్యాంగ నిర్మాతలు నిర్దే శించగా నిరుపేదలకు కల్పించిన కోటా ఇందుకు విరుద్ధంగా ఆర్థిక వెనకబాటుతనాన్ని ప్రాతిపది కగా తీసుకుంది. సారాంశంలో కోటా కల్పనకు ఒక వర్గాన్నీ, దాని సామాజిక స్థితిగతులనూ కాక వ్యక్తిని పరిగణనలోకి తీసుకుంది. పైగా ఈ కోటానుంచి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పేదలను మినహా యించింది. ఇది సరైందేనని మెజారిటీ తీర్పు అంటుండగా, మైనారిటీ తీర్పు నిరుపేదలకు కోటా కల్పనను సమర్థిస్తూనే దాన్నుంచి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పేదలను మినహాయించటం రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించటమేననీ, రాజ్యాంగాన్ని బలహీనపరచటమేననీ స్పష్టం చేసింది. తన ఆధ్వర్యంలోని ధర్మాసనంలో మెజారిటీ తీర్పునిచ్చిన సభ్యుల్లో ప్రధాన న్యాయమూర్తి ఒకరుగా లేకపోవటం చాలా అరుదు. పదవీ విరమణ చేయబోతున్న జస్టిస్ లలిత్ అసమ్మతి తీర్పు వెలువ రించిన ఇద్దరిలో ఒకరై ఆ రికార్డు నెలకొల్పారు. కులంతో సంబంధం లేకుండా నిరుపేద వర్గాలన్నిటికీ అవసరమైన సదుపాయాలు కల్పిం చటం, ఆ వర్గాల ఎదుగుదలకు దోహదపడటం తప్పేమీ కాదు. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు అందుకు అవకాశ మిస్తున్నాయి. కానీ పేద వర్గాలకు కోటా ఇవ్వాలంటే ఆ వర్గాలు పేదరికం కారణంగా సామాజి కంగా ఎటువంటి వివక్షనూ, అణచివేతనూ ఎదుర్కొంటున్నాయన్నది... ఒక వ్యక్తి ఎదుగుదలకు ఆర్థిక అననుకూలత ఎలా అవరోధంగా ఉందన్నది నిగ్గు తేల్చవలసిన అవసరం ఏర్పడుతుంది. దాన్ని గణించటం సాధ్యమా? పైగా నిరుపేద వర్గాలను ఉద్ధరించటం కోసం కోటా ఉద్దేశించామని చెబుతూ అత్యంత నిరుపేద వర్గాలు అధికంగా ఉండే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలను దాన్నుంచి మినహాయించటం సరైందేనా? ఆ వర్గాలు ఇప్పటికే రిజర్వేషన్ల ఫలాలను అనుభవిస్తు న్నాయన్న కారణంతో ఇలా మినహాయించటం సరికాదని మైనారిటీ తీర్పునిచ్చిన న్యాయమూర్తులు వ్యక్తం చేసిన అభిప్రాయం సహేతుకమైనదన్న భావన కలగదా? అంతేకాదు... గతంలో మండల్ కమిషన్ కేసులో తొమ్మిదిమంది న్యాయమూర్తుల రాజ్యాంగ« ధర్మాసనం ఇచ్చిన మెజారిటీ తీర్పు రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని మించరాదని స్పష్టం చేసింది. దాని ప్రాతిపదికనే రాష్ట్ర ప్రభు త్వాలు కొత్తగా ఇచ్చే కుల రిజర్వేషన్లను వివిధ హైకోర్టులు, సుప్రీంకోర్టు ఇంతవరకూ కొట్టివేస్తూ వచ్చాయి. కానీ తాజాగా మెజారిటీ సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పు 50 శాతం కోటా పరిమితి మార్చడానికి వీల్లేనిది కాదంటున్నది. ఆ తీర్పు కులప్రాతిపదికన ఇస్తున్న కోటాకే వర్తిస్తుందని భాష్యం చెబుతోంది. ఇది కొత్తగా రిజర్వేషన్లు కోరుకుంటున్న వర్గాలనుంచి తామరతంపరగా డిమాండ్లు పుట్టుకురావటానికి దోహదపడదా? నిజానికి తొలిసారి 1991లో అప్పటి ప్రధాని పీవీ జనరల్ కేటగిరీలోని పేదలకు పదిశాతం కోటా నిర్ణయం తీసుకున్నారు. కానీ సుప్రీంకోర్టు అప్పట్లో ఈ నిర్ణయాన్ని కొట్టేసింది. ఆర్థిక అసమానతలు పీడిస్తున్నప్పుడు సహజంగానే బాధిత వర్గాలు ప్రభుత్వాల నుంచి ఆసరా కోరుకుంటాయి. దేశంలో ఆర్థిక సంస్కరణల అమలు తర్వాత సాగిన అభివృద్ధికి సమాంతరంగా సంక్షోభం కూడా బయల్దేరింది. చేతివృత్తులపై ఆధారపడి జీవించే అట్టడుగు కులాలతోపాటు వ్యవ సాయంపై ఆధారపడే కులాలు సైతం ఒడిదుడుకుల్లో పడ్డాయి. అందుకే రిజర్వేషన్లు పొందుతున్న వర్గాల్లోని అత్యంత వెనకబడిన కులాలు వర్గీకరణ కావాలని ఉద్యమించటం మొదలుపెడితే... మొదటినుంచీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్న వర్గాలు తమకూ వాటిని వర్తింపజేయాలన్న డిమాండ్‌తో ముందుకొచ్చాయి. ఇక క్రీమీ లేయర్ వాదన సరేసరి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, దానిపై తాజాగా సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు సహజంగానే దళిత, ఓబీసీ వర్గాల్లో కలవరం కలిగించాయి. అందుకే మైనారిటీ తీర్పు వ్యక్తంచేసిన అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని కేంద్రం ఆ వర్గాలకు తగిన భరోసానివ్వాలి. అంతకన్నా ముందు అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మానసపుత్రికలైన ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ వంటివి, ప్రస్తుతం ఏపీలో ఇస్తున్నట్టు వివిధ వృత్తులవారికి ఏటా నిర్ణీత మొత్తంలో నగదు అందించే పథకాలవంటివి అమలు చేసే అంశాన్ని పరిశీలించాలి. ఇప్పటికే ఉన్న వాటిని మరింత మెరుగుపరచాలి. ఎటూ ప్రభుత్వరంగంలో ఉద్యోగాలు కుంచించుకుపోయా యన్నది వాస్తవం. కనుక కోటాలవల్ల ఆచరణలో పెద్దగా ఫలితం ఉండదు. ప్రభుత్వ రంగాన్ని విస్తరిస్తే, తయారీ రంగ పరిశ్రమల స్థాపనకు నడుం బిగిస్తే నిరుద్యోగం నియంత్రణలో ఉంటుంది. పేదరికం అంతరిస్తుంది. కేంద్రం ఈ సంగతి ఆలోచించాలి. -
సుప్రీంకోర్టులో మరోసారి సవాల్ చేస్తాం
ముషీరాబాద్ (హైదరాబాద్): ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు చెల్లుబాటు అవుతాయంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన మెజార్టీ తీర్పు విచారకరమని రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో మరోసారి రివ్యూ పిటిషన్ వేస్తామని ప్రకటించారు. 15 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరపాలన్నారు. హైదరాబాద్‌లోని బీసీ భవన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...అగ్ర కులాల్లోని పేదలకు ఆర్థిక పరమైన స్కీములు పెట్టి అభివృద్ధి చేయాలి తప్ప విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. రిజర్వేషన్లు పేదరిక నిర్మూలన పథకం కాదని, ఆర్థిక అభివృద్ధి పథకం అంతకంటే కాదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి కులానికి తమతమ జనాభా ప్రకారం విద్య, ఉద్యోగ, అధికార పదవులలో వాటా ఇవ్వాలని కోరారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాజ్యాంగ మౌలిక సూత్రాలకే విరుద్ధమని ఇది రాజ్యాంగ పరంగా చెల్లుబాటు కాదని పేర్కొన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. -
EWS రిజర్వేషన్ల రాజ్యాంగబద్ధతపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
-
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీం కీలక తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థికంగా వెనుకబడిన వర్గాల Economically Weaker Sections ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై నేడు(సోమవారం) సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. సీజేఐతో సహా నలుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం.. ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత ఉంటుందని తీర్పు ఇచ్చింది. మొత్తం నలుగురు.. న్యాయమూర్తుల్లో ముగ్గురు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత ఉంటుందని ప్రకటించగా.. ఒక్కరు మాత్రం తీర్పుతో విభేధించారు. దీంతో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి భారీ విజయం దక్కినట్లయ్యింది. తీర్పు వెలువరించే సయమంలో సీజేఐ యూయూ లలిత్ ఉన్నత విద్యలో ఆర్థికంగా వెనుకబడిన విభాగం (ఈడబ్ల్యుఎస్) రిజర్వేషన్ల రాజ్యాంగ చెల్లుబాటు మరియు ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగ సమస్యలకు సంబంధించిన అంశంపై నాలుగు తీర్పులు వెలువడాల్సి ఉందని తెలిపారు. తొలుత జస్టిస్ దినేశ్ మహేశ్వరి మాట్లాడుతూ, EWS సవరణ సమానత్వ కోడ్‌ను ఉల్లంఘించదు. రాజ్యాంగంలోని ముఖ్యమైన లక్షణాలను ఉల్లంఘించలేదు. 50% ఉల్లంఘన ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘించదు అని తీర్పు ఇచ్చారు. ఆ వెంటనే.. జస్టిస్ బేలా ఎం త్రివేది మాట్లాడుతూ, తన తీర్పు జస్టిస్ మహేశ్వరితో ఏకీభవించిందని, జనరల్ కేటగిరీలోని EWS కోటా చెల్లుబాటు అయ్యేదని, రాజ్యాంగబద్ధమని చెప్పారు. జస్టిస్ JB పార్దివాలా రాజ్యాంగం యొక్క 103వ సవరణ చట్టం 2019 యొక్క చెల్లుబాటును కూడా సమర్థించారు, ఇది సాధారణ వర్గంలో 10 శాతం EWS రిజర్వేషన్‌ను అందిస్తుందన్నారు. అయితే.. జస్టిస్ రవీంద్ర భట్ మాత్రం భిన్నాభిప్రాయంతో తీర్పు వెల్లడించారు. 103వ రాజ్యాంగ సవరణ యొక్క చెల్లుబాటును సమర్థిస్తూ మెజారిటీ తీర్పుతో విభేదించారు.దీంతో.. మెజార్టీ తీర్పు కేంద్ర నిర్ణయానికి అనుకూలంగా వచ్చినట్లయ్యింది. అగ్రవర్ణాల్లో వెనుకబడిన వర్గాలకు 10 శాతం కల్పిస్తూ.. 103వ రాజ్యాంగ సవరణ చేపట్టింది కేంద్రం. అయితే.. చెల్లుబాటును సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ పిటిషన్లపై ఐదుగురు న్యామూర్తుల ధర్మాసనం విచారణ చేపట్టింది. గత నెలలో తీర్పును రిజర్వ్‌లో ఉంచింది సుప్రీం ధర్మాసనం. ఈ నేపథ్యంలో ఇవాళ వెలువడబోయే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు(ఈడబ్ల్యూఎస్) ప్రవేశాలు, ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి గల రాజ్యాంగపరమైన చెల్లుబాటు గురించి 40 దాకా పిటిషన్లు దాఖలు అయ్యాయి. చీఫ్ జస్టిస్ యు.యు.లలిత్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ చేపట్టి.. అన్ని వాదనలు వింది. ఈడబ్ల్యూఎస్ EWS అభ్యర్థులకు రిజర్వేషన్లలో కోటా కల్పిస్తూ 2019లో కేంద్ర ప్రభుత్వం 103వ రాజ్యాంగ సవరణ చేసింది. ఈ రిజర్వేషన్ల చెల్లుబాటును సవాలు చేస్తూ అదే ఏడాది పలు పిటిషన్లు దాఖలు కాగా, అందులో ‘జన్హిత్ అభియాన్’ ప్రముఖంగా ఉంది. ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేస్తే.. ఎస్సీ, ఎస్టీలతోపాటు ఇతర వెనుకబడిన వర్గాలకు (ఓబీసీ) ప్రస్తుతమున్న 50 శాతం రిజర్వేషన్ల పరిధి దాటుతుందన్నది ప్రధాన అభ్యంతరం. ఇదీ చదవండి: ఒక్కరోజు ముందుగానే వీడ్కోలు -
ఈడబ్ల్యూఎస్ కోటాపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్
న్యూఢిల్లీ: విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు 10 కోటా కల్పిస్తూ చేసిన 103 రాజ్యాంగ సవరణ చట్టబద్దతపై దాఖలైన దాదాపు 40కిపైగా పిటిషన్లపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. దీనిపై తీర్పును రిజర్వ్‌లో ఉంచుతున్నట్లు సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం పేర్కొంది. 50 శాతం జనరల్ కోటాలో ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని సీనియర్ లాయర్లు రవి వర్మ కుమార్, పి. విల్సన్ సహా పలువురు లాయర్లు కోర్టులో వాదించారు. ఈడబ్ల్యూఎస్‌కు ఆర్థికపరిస్థితినే గీటురాయిగా తీసుకోకూడదని తమిళనాడు తరఫున హాజరైన సీనియర్ లాయర్ శేఖర్ నఫరే వాదించారు. వీటిని అటార్నీ జనరల్ వేణుగోపాల్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తోసిపుచ్చారు. -
‘ఓపెన్’లో ఖాళీలు తగ్గవా?
న్యూఢిల్లీ: ఆర్థికంగా వెనకబడ్డ వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) విద్యా సంస్థలు, ప్రభుత్వోద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు బుధవారం పలు ప్రశ్నలు సంధించింది. ఈ కోటా వల్ల ఓపెన్ కేటగిరీలో అందుబాటులో ఉండే సీట్లు, ఖాళీలు 40 శాతానికి తగ్గిపోతాయన్న వాదనను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్, న్యాయమూర్తులు జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ జేబీ పార్డీవాలా, జస్టిస్ బేలా ఎం.త్రివేదీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ప్రస్తావించింది. ఓపెన్ కేటగిరీలోని 50 శాతం ఖాళీలను తగ్గించడానికి వీల్లేదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన గత తీర్పులను గుర్తు చేసింది. ‘‘ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల్లోని పేదలను కులం ప్రాతిపదికన ఈడబ్ల్యూఎస్ కోటా నుంచి నహాయించడం వాస్తవమేనా? ఈ కోటా వల్ల ఓబీసీల్లోని క్రీమీ లేయర్‌కు అందుబాటులో ఉండే ఖాళీలు కూడా 40 శాతానికి తగ్గుతాయన్నది నిజమేనా? మెరిట్ ఉన్న వారందరికీ ఓపెన్ కేటగిరీలో పోటీపడేందుకు అవకాశం ఉండాలి కదా’’ అంటూ ప్రశ్నించింది. ఓపెన్ కేటగిరీ ఖాళీలకు ఏ విధంగానూ కోత పడని రీతిలోనే ఈడబ్ల్యూఎస్ కోటాను రూపొందించినట్టు కేంద్రం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు నివేదించారు. ఓపెన్, రిజర్వుడు కేటగిరీలు ప్రత్యేకమైన విభాగాలు. ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు 50 శాతం రిజర్వుడు కేటగిరీలో తగిన ప్రాతినిధ్యం దక్కిందని వేణుగోపాల్ వివరించారు. ఎస్సీ, ఎస్టీల మాదిరిగా ఈడబ్ల్యూఎస్ వర్గానికి కూడా ఎన్నికల్లో కొన్ని స్థానాలు రిజర్వు చేయగలరా అని ధర్మాసనం ప్రశ్నించింది. విచారణ గురువారం కూడా కొనసాగనుంది. ఇక ప్రత్యక్ష ప్రసారాలు సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో కీలక కేసుల విచారణ ప్రక్రియ ఇకపై ప్రత్యక్షప్రసారం కానుంది. తొలుత రాజ్యాంగ ధర్మాసనాల విచారణలు 27వ తేదీ నుంచి ప్రసారం కానున్నాయి. ప్రస్తుతానికి యూట్యూబ్ ద్వారా ప్రసారాలు ఉంటాయని సమాచారం. త్వరలో సుప్రీంకోర్టు సొంత ప్లాట్‌ఫామ్‌ను రూపొందిస్తుందని కోర్టు వర్గాలు తెలిపాయి. గుజరాత్, ఒడిశా, కర్ణాటక, జార్ఖండ్, పట్నా, మధ్యప్రదేశ్ హైకోర్టులు ఇప్పటికే తమ యూట్యూబ్ ఛానళ్ల ద్వారా విచారణలు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. -
జనరల్ కోటా నుంచే ఈడబ్ల్యూఎస్: కేంద్రం
న్యూఢిల్లీ: సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అమలవుతున్న 50 శాతం రిజర్వేషన్ కోటాలో ఎలాంటి కోత లేదని, కేవలం జనరల్ కోటా నుంచే ఈడబ్ల్యూఎస్‌కు స్థానం కల్పించామని కేంద్రం సుప్రీంకోర్టులో స్పష్టంచేసింది. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఉన్న 50 శాతం రిజర్వేషన్ స్వాతంత్య్రతకు ఎలాంటి భంగం వాటిల్లలేదని కేంద్రప్రభుత్వం తరఫున హాజరైన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సుప్రీంకోర్టు సీజే జస్టిస్ లలిత్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించారు. ప్రవేశాలు, ఉద్యోగాల్లో ఆర్థికంగా బలహీనమైన వర్గాల(ఈడబ్ల్యూఎస్)కు కేంద్రం 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్న విషయం విదితమే. రిజర్వేషన్ కల్పనకు ఆర్థిక పరిస్థితి గీటురాయి కాదని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌ను కోర్టు సమరి్థంచాలనుకుంటే అంతకుముందుగా ఇందిరా సహానీ(మండల్) తీర్పును çసమీక్షించాలని తమిళనాడు ప్రభుత్వం కోరింది. ఇదీ చదవండి: పట్టణ శ్రేయస్సు ముఖ్యం -
ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం కోటా..రాజ్యాంగబద్ధమేనా?
సాక్షి, న్యూఢిల్లీ: విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు(ఈడబ్ల్యూఎస్) 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు అవుతుందో కాదో తొలుత పరిశీలిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. ముస్లింలకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు(కోటా) కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టివేస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతోపాటు పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం దృష్టి సారించింది. సెప్టెంబర్ 6న విధానపరమైన ప్రక్రియ, ఇతర అంశాలను పరిశీలిస్తామని, సెప్టెంబర్ 13 నుంచి ఈ పిటిషన్లపై విచారణ ప్రారంభిస్తామని మంగళవారం స్పష్టం చేసింది. ఈడబ్ల్యూఎస్ కోటా, అనంతరం ముస్లిం రిజర్వేషన్ చట్టంపై విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలియజేసింది. ఈ రెండు అంశాలపై విచారణకు నోడల్ అడ్వొకేట్లుగా వ్యవహరించాలని నలుగురు న్యాయవాదులకు సూచించింది. చదవండి: అంధుడైన సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు.. మైక్రోసాఫ్ట్‌లో 47 లక్షల వేతనం -
ఆస్తులపై డిక్లరేషన్ ఇవ్వక్కర్లేదు
సాక్షి, హైదరాబాద్: అగ్రకుల పేదలకు శుభ వార్త. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఆర్థికంగా వెనక బడిన తరగతుల (ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్ల కోసం దరఖాస్తు చేసుకొనే వారి నుంచి ఆస్తుల వివరాలు, వాటిపై స్వీయ ధ్రువీకరణ (డిక్లరేషన్) స్వీకరించకుండానే ధ్రువపత్రం జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దరఖాస్తు నమూనా నుంచి ఈ స్వీయ ధ్రువీకరణను తొలగించాలని మీ–సేవను ఆదేశించింది. ఆస్తుల వివరాల విభాగం కింద వ్యవసాయ భూములు, నివాస గృహాలు, నివాస స్థలాలకు సంబంధించిన సమగ్ర వివ రాలను ఇవ్వాల్సి ఉండగా దరఖాస్తు నమూ నా నుంచి ఈ విభాగాన్ని సైతం తొలగిం చాలని సూచించింది. ప్రస్తుత దరఖాస్తు విధా నంలో ఐదెకరాలు, ఆపై పొలం.. 1,000 చద రపు అడుగులు, ఆపై విస్తీర్ణంలో నివాస స్థలం... పురపాలికల్లో 100 చదరపు గజాలు, ఆపై విస్తీర్ణంలో నివాస గృహం... గ్రామాల్లో 200 చదరపు గజాలు, ఆపై విస్తీర్ణంలో నివాస గృహంలో ఏదీ లేదని దరఖాస్తుదారులు స్వీయ ధ్రువీకరణ ఇవ్వాల్సి ఉంది. కానీ ఇక పై కుటుంబ ఆదాయం రూ. 8 లక్షల్లోపు ఉం దని స్వీయ ధ్రువీకరణ ఇస్తే సరిపోనుంది. ఐదెకరాలు, ఆపై పొలం, నివాస గృహం, నివాస స్థలాలేవి లేవని డిక్లరేషన్ ఇచ్చినట్లు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లో ప్రస్తుతం పొందు పరుస్తుండగా ఇకపై దీన్ని కూడా తొలగిం చనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, భూపరిపాలన విభాగం ముఖ్య కమిషనర్ సోమేశ్ కుమార్ గురువారం మీ– సేవ విభాగం కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. గతేడాది జారీ చేసిన జీవో నంబర్ 33 అమలు కోసం ఈ మేరకు మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొ న్నారు. రాష్ట్ర ప్రభుత్వ కొలువులతోపాటు రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో 10 శాతం ఈడ బ్ల్యూఎస్ కోటా కోసం దరఖాస్తు చేసుకొనే వారికి ఈ నిర్ణయంతో లబ్ధి కలగనుంది. కేంద్రంలో కోటాకు డిక్లరేషన్ ఇవ్వాల్సిందే.. కేంద్ర ప్రభుత్వంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు దరఖాస్తు చేసుకొనే వారు మాత్రం ఆస్తుల వివరాలతోపాటు వాటిపై స్వీయ ధ్రువీకరణను యథావిధిగా ఇవ్వాల్సి ఉండనుంది. సీఎస్ సోమేశ్ కుమార్ తాజా ఆదేశాల ప్రకారం ఈడబ్ల్యూఎస్ ఉద్దేశం (పర్పస్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్) అనే కొత్త కాలమ్‌ను మీ–సేవా దరఖాస్తులో చేర్చనున్నారు. కేంద్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు దరఖాస్తు చేసుకుంటున్నారా లేక రాష్ట్ర ప్రభుత్వంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు దరఖాస్తు చేసుకుంటున్నారా? అనే రెండు ఐచ్ఛికాలు ఈ కాలమ్‌లో ఉండనున్నాయి. వాటిలో ఒక దాన్ని దరఖాస్తుదారులు ఎంపిక చేసుకోవాల్సి ఉండనుంది. ఒకవేళ కేంద్ర ఈడబ్ల్యూఎస్ కోటా కోసం దరఖాస్తు చేసుకుంటే ప్రస్తుత దరఖాస్తు, సర్టిఫికెట్ నమూనాల్లో ఎలాంటి మార్పులుండవు. రాష్ట్ర ప్రభుత్వంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు దరఖాస్తు చేసుకుంటే మాత్రం దరఖాస్తు, సర్టిఫికెట్ నమూనాలో పైన పేర్కొన్న మార్పులు అమల్లోకి రానున్నాయి. కేంద్రంలో ఈడబ్ల్యూఎస్ కోటాకు జారీ చేసే సర్టిఫికెట్లలో మాత్రం ఈ మేరకు డిక్లరేషన్ ఇచ్చారన్న విషయాన్ని యథాతధంగా పొందుపర్చనున్నారు. -
ఉద్యోగాల భర్తీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక సంస్కరణలు
సాక్షి, అమరావతి: పారదర్శకంగా ఉద్యోగ నియామకాలతోపాటు పోస్టుల భర్తీలో అక్రమాలకు తావులేకుండా పలు కీలక సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది. గ్రూప్ 1 సహా అన్ని పోస్టులకూ ఇంటర్వ్యూలు రద్దు, డిజిటల్ మూల్యాంకనం, ట్యాబ్ ఆధారిత ప్రశ్నపత్రాలు, రిజర్వుడ్ మెరిట్ అభ్యర్థులకు ఓపెన్ కేటగిరీ పోస్టులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఈడబ్ల్యూఎస్ కోటా అమలు తదితరాలు ఇందులో ఉన్నాయి. ఎక్కువ అభ్యర్థులున్న పోస్టులకే ప్రిలిమ్స్ గ్రూప్–1 పోస్టులకు మినహా మిగతా అన్ని కేటగిరీల పోస్టులకు ప్రిలిమ్స్ పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుంది. అయితే కొన్ని పోస్టులకు లక్షల్లో దరఖాస్తులు రావడం, మెరిట్ అభ్యర్థులను నిర్ణయించడంలో సమస్యలు తలెత్తడంతో కొన్ని మినహాయింపులు చేపట్టింది. అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు అందే పోస్టులకు మినహా మిగతా వాటికి ప్రిలిమ్స్ లేకుండా ఒకే పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నారు. దీంతోపాటు గ్రూప్–1 సహా అన్ని పోస్టులకూ ఇంటర్వ్యూలను పూర్తిగా తొలగించారు. గత సర్కారు హయాంలో ఇంటర్వ్యూల పేరిట తమ వారికే పోస్టులు వచ్చేలా చేసి అర్హులకు అన్యాయం చేశారు. అన్ని బోర్డులకు ఏపీపీఎస్సీ చైర్మనే నేతృత్వం వహించడంతో అక్రమాలకు తెర లేచింది. దీన్ని పూర్తిగా రద్దు చేసి గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లలో కొన్ని పోస్టులకు బహుళ బోర్డులతో ఇంటర్వ్యూలను నిర్వహించారు. బోర్డులకు వేర్వేరు చైర్మన్లను నియమించారు. గ్రూప్ 1 సహా అన్ని పోస్టులకూ ఇంటర్వ్యూలు రద్దయిన నేపథ్యంలో ఏపీ స్టేట్ సర్వీస్ కేడర్ పోస్టుల అభ్యర్థుల ఎంపికలో వ్యక్తిత్వం, పరిపాలనా దక్షతను అంచనా వేసేందుకు ప్రత్యామ్నాయ విధానాలపై కమిషన్ కసరత్తు చేస్తోంది. మెయిన్స్‌లో ట్యాబ్ ఆధారిత ప్రశ్నపత్రం టీడీపీ సర్కారు గ్రూప్ 1తో పాటు అన్ని కేటగిరీల పోస్టులకూ ప్రిలిమ్స్‌ను తప్పనిసరి చేసింది. గతంలో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తుండగా దాన్ని రద్దు చేసి 1:15 ప్రకారం మార్చింది. దీనివల్ల వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు నష్టపోయారు. పాత విధానాన్ని కొనసాగించాలని ఆందోళన చేసినా పట్టించుకోలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ విధానాన్ని మార్చి నిరుద్యోగులకు మేలు చేసేలా 1: 50 నిష్పత్తిని తిరిగి ప్రవేశపెట్టింది. మరోవైపు గ్రూప్ 1 మెయిన్స్‌లో ట్యాబ్ ఆధారిత ప్రశ్నపత్రాల ద్వారా పరీక్షలు నిర్వహించారు. దీనివల్ల అభ్యర్థులందరికీ ఒకేసారి ప్రశ్నపత్రం అందడంతో పాటు లీకేజ్ లాంటి వాటికి ఆస్కారం లేకుండా చేశారు. అవకతవకలను నివారించేందుకు ఏపీపీఎస్సీ డిజిటల్ మూల్యాంకనాన్ని చేపట్టింది. దీనివల్ల పారదర్శకతతో పాటు అర్హులైన వారికి న్యాయం జరుగుతుంది. నెగిటివ్ మార్కులు రద్దు.. ఏపీపీఎస్సీ నిర్వహించే డిపార్టుమెంట్ పరీక్షల్లో గత సర్కారు నెగిటివ్ మార్కులు ప్రవేశపెట్టడంతో పదోన్నతులు, ఇతర ప్రయోజనాల కోసం పరీక్షలు రాసే ఉద్యోగులు నష్టపోయారు. దీన్ని రద్దు చేయాలని ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా ఆలకించలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే డిపార్టుమెంట్ పరీక్షలలో నెగిటివ్ మార్కులను రద్దు చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గరిష్ట వయోపరిమితి పొడిగింపు ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి నిబంధనల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు కల్పిస్తున్న ఐదేళ్ల సడలింపును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వర్గాలకు కల్పిస్తున్న సడలింపు కాలపరిమితి 2021 మే నెలతో ముగిసింది. కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతుండటంతో ఈ అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా వయోపరిమితి సడలింపును 2026 మే 31 వరకు ప్రభుత్వం పొడిగించింది. రిజర్వుడ్ మెరిట్ అభ్యర్థులకు ఓపెన్ కేటగిరీ పోస్టులు గత సర్కారు రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులు తమ రిజర్వేషన్ల ప్రయోజనాన్ని ముఖ్యంగా వయోపరిమితి మినహాయింపును వినియోగించుకుంటే వారిని ఆ కేటగిరీ పోస్టులకే పరిమితం చేస్తూ ఓపెన్ కేటగిరీ పోస్టులకు అనర్హులుగా చేసింది. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలతో పాటు రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులందరికీ తీరని నష్టం వాటిల్లింది. దీనిపై జాతీయ ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్లకు ఫిర్యాదులు అందినా టీడీపీ సర్కారు పట్టించుకోలేదు. ఇప్పుడు రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులు రిజర్వేషన్ ప్రయోజనాన్ని వినియోగించుకున్నా మెరిట్లో అగ్రస్థానంలో ఉంటే ఓపెన్ కేటగిరీ పోస్టులకు అర్హులుగా నిర్ణయిస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం వారికి మేలు చేసింది. ఈడబ్ల్యూఎస్ కోటా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడ బ్ల్యూఎస్) ప్రభుత్వ ఉద్యోగాల్లో పది శాతం కోటాను రిజర్వు చేస్తూ కేంద్ర ప్రభుత్వం 2018లో చట్టం తెచ్చిన సంగతి తెలిసిందే. టీడీపీ హయాంలో ఆ కోటా సంగతిని ప్రస్తా వించకుండా నోటిఫికేషన్లు జారీ చేయడంతో ఆ వర్గాల యువతకు అన్యాయం జరిగింది. పైగా పది శాతం కోటాలో 5 శాతాన్ని కాపులకు ప్రత్యేకిస్తున్నట్లు నిబంధనలకు విరుద్ధంగా ఉత్తర్వులు ఇవ్వడంతో అది న్యాయపరంగా చెల్లుబాటు కాకుండా నిలిచిపోయింది. దీనివల్ల నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయా వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో పది శాతం కోటా అమలుకు చర్యలు తీసుకుంది. ఈడబ్ల్యూఎస్ కోటా అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతో ఏపీపీఎస్సీ ఆమేరకు చర్యలు చేపట్టింది. కొత్త నోటిఫికేషన్లలో ఈడబ్ల్యూఎస్ కోటా అభ్యర్థుల వివరాలను పొందుపర్చేలా వీలు కల్పించింది. -
నీట్–పీజీ ‘ఈడబ్ల్యూఎస్ కోటా’ కేసులను సత్వరం తేల్చండి
న్యూఢిల్లీ: నీట్–పీజీ ప్రవేశాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్) కోటాకు సంబంధించి దాఖలైన కేసులను అత్యవసరమైనవిగా భావించి మంగళవారం విచారణ చేపట్టాలని కేంద్రం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బొపన్నల ధర్మాసనం ఎదుట సోమవారం సొలిసిటర్ జనరల్ తుషార్ కేంద్ర తరఫున ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘ఈ కేసును మంగళవారం విచారణ జరిపే కేసుల జాబితాలో చేర్చాలని సీజేఐకి విజ్ఞప్తి చేస్తాను’అని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. ఈ కేసును కొంత అత్యవసరమైనదిగా భావించి మంగళవారమే విచారణ చేపట్టాలని, లేకుంటే బుధవారమైనా విచారించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనాన్ని కోరారు. -
కన్వీనర్ కోటాకు జై..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల ప్రభావం ఆయా కోర్సుల సీట్ల భర్తీలో పెను మార్పులను తెస్తోంది. ఈ పథకాల ద్వారా ప్రభుత్వం ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్ చేయడంతో పాటు.. విద్యార్థుల వసతి, భోజనాల కోసం ఏటా రూ.20 వేల వరకూ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ తదితర కోర్సుల్లో కన్వీనర్ కోటాలో భర్తీ అయ్యే సీట్ల శాతం.. గతంలో కన్నా భారీగా పెరిగింది. ఈ సీట్ల కోసం అర్హులైన ప్రతి ఒక్కరూ పోటీపడుతుండటంతో సీట్ల భర్తీలో గడచిన రెండేళ్లలో ఏకంగా 10 శాతానికి పైగా పెరుగుదల కనిపిస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ముందు టీడీపీ హయాంలో చూస్తే.. ఇంజనీరింగ్ కోర్సుల్లో 2018లో 61.54 శాతం, 2019లో 51 శాతం మాత్రమే కన్వీనర్ కోటా సీట్లు భర్తీ అయ్యాయి. ఆ తర్వాత 2020లో, 2021లో 73 శాతం మేర భర్తీ అవుతుండటం విశేషం. ఈడబ్ల్యూఎస్ కోటాలోని వారికి అదనంగా 10 శాతం సీట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. వాస్తవానికి ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు రాష్ట్రంలో సీట్ల కేటాయింపు ఇంతకు ముందు నుంచీ ఉంది. అదనపు సీట్లు రాకుండా ఉంటే.. వీరికి కేటాయించిన సీట్లను కూడా కలుపుకొంటే కన్వీనర్ కోటా సీట్ల భర్తీ 2021లో 80.79 శాతం, 2020లో 80.60 శాతం అయినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. స్పాట్ అడ్మిషన్లకు ‘సీట్ల’ తగ్గుదల గతంలో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ లేనందున విద్యార్థుల చేరికల్లేక కన్వీనర్ కోటా సీట్లు భారీగా మిగిలిపోయేవి. ఆ తర్వాత వాటిని స్పాట్ అడ్మిషన్ల కింద ఆయా కాలేజీలు భర్తీచేసుకునేవి. ఇప్పుడు కన్వీనర్ కోటా సీట్లు అధిక శాతం భర్తీ అవుతుండటంతో స్పాట్ అడ్మిషన్లకు మిగులు సీట్లు తగ్గాయి. టీడీపీ హయాంలో 2015లో 40,436 సీట్లు, 2016లో 47,735 సీట్లు, 2019లో 45,888 సీట్లు మిగిలిపోయాయి. అదే పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలుతో వాటి సంఖ్య 2020లో 28,575, అలాగే 2021లో 30,369 మాత్రమే మిగిలాయి. వీటిలో ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లను మినహాయిస్తే కనుక ఈ సంఖ్య మరింత తక్కువే. 2021లో అడ్మిషన్ల కౌన్సెలింగ్ ఆలస్యం కావడంతో కేవలం రెండు విడతల్లోనే ముగించారు. గతంలో కౌన్సెలింగ్‌ను నాలుగు విడతల వరకూ కూడా నిర్వహించేవారు. ఈ సారి కూడా అలాగే ఉంటుందని భావించిన పలువురు.. రెండు విడతల్లోనే కౌన్సెలింగ్ ముగియడంతో కన్వీనర్ కోటా సీట్లను దక్కించుకోలేకపోయారు. చేరికలు లేక గతంలో తగ్గిపోతూ వచ్చిన సీట్లు గతంలో రాష్ట్రంలో ప్రమాణాలు లేకున్నా పలు కాలేజీలను కొనసాగించిన దరిమిలా రాష్ట్రం మొత్తంమీద ఇంజనీరింగ్ కాలేజీలు 467 వరకూ ఉండేవి. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ లేక చేరికలు తగ్గి ఆయా కాలేజీలు కోర్సులను రద్దు చేసుకోవడంతో సీట్ల సంఖ్య భారీగా తగ్గుతూ వచ్చింది. 2015 నాటికి రాష్ట్రంలో 467 కాలేజీల్లో 1,13,745 సీట్లుండగా.. 2018 నాటికి 96,857, 2019 నాటికి 95,582 ఉన్నాయి. 2019 నుంచి ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10 శాతం సీట్లు అదనంగా చేరి మొత్తం సీట్లు 1,06,203కు పెరిగాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ప్రమాణాలు లేని కాలేజీలను ప్రక్షాళన చేయడంతో వాటి సంఖ్య 437కు తగ్గింది. ఈడబ్ల్యూఎస్ కోటాతో కలుపుకొని కన్వీనర్ కోటా సీట్లు 2020లో 1,04,090, 2021లో 1,11,304కు చేరాయి. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో కన్వీనర్ కోటా సీట్లలో అత్యధిక శాతం భర్తీ అవుతున్నాయి. ప్రవేశ పరీక్షల్లో అత్యధిక మార్కులతో మెరిట్లో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ నిరుపేద విద్యార్థులు గతంలో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ లేక అత్యధిక ఫీజులుండే ప్రముఖ కాలేజీల్లో చేరలేకపోయేవారు. కానీ ఇప్పుడు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ రావడంతో వారంతా తమ మెరిట్‌కు తగ్గ ప్రముఖ కాలేజీల్లో చేరగలుగుతున్నారు. ప్రస్తుతం కన్వీనర్ కోటాలో పది శాతం మేర పెరిగిన భర్తీ అయిన సీట్లన్నీ ఇటువంటి పేద విద్యార్థుల చేరికలతోనే అన్నది స్పష్టమవుతోంది. గత టీడీపీ ప్రభుత్వం.. కాలేజీల్లో ఫీజు ఎంత ఉన్నా సరే.. రూ.35 వేలే ఇచ్చేది. దీనివల్ల మిగతా ఫీజును విద్యార్థులు చెల్లించాల్సి రావడంతో కోర్సు పూర్తయ్యే నాటికి తల్లిదండ్రులకు రూ.3 లక్షల నుంచి 4 లక్షల వరకూ అప్పులయ్యేవి. -
గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్.. ఏడాదికి రూ.20,000
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) 2021 సంవత్సరానికి సంబంధించి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఆర్థిక సాయం అందిస్తారు. ► అర్హత: 2020–21 విద్యా సంవత్సరంలో కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2 లక్షలు మిం^è కుండా ఉండాలి. మెడిసిన్/ఇంజనీరింగ్/ఏదైనా గ్రాడ్యుయేషన్ /ఇంటిగ్రేటెడ్ కోర్సులు/ఏదైనా విభాగంలో డిప్లొమా/తత్సమాన కోర్సులు/ఒకేషనల్ కోర్సు(ఐటీఐల్లో)ల్లో చేరాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఈ ఉపకార వేతనాలు అందజేస్తారు. ► 2020–21 విద్యా సంవత్సరంలో కనీసం 60 శాతం మార్కులతో పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2 లక్షలు మించకుండా ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన కాలేజీల్లో/ఐటీఐల్లో ఒకేషనల్ కోర్సుల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఈ స్కాలర్షిప్స్ అందజేస్తారు. ► ప్రత్యేకంగా బాలికలకు ఉపకార వేతనాలు: బాలికల విద్యను ప్రోత్సహించడానికి వీటిని అందిస్తున్నారు. కనీసం 60 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులై.. ఇంటర్మీడియట్ చదువుతున్న బాలికలు దీనికి అర్హులు. 2020–21 విద్యా సంవత్సరంలో 60 శాతం మార్కులతో పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2లక్షలు మించకూడదు. ► స్కాలర్షిప్ వ్యవధి: రెగ్యులర్ స్కాలర్స్‌కు సంబంధిత కోర్సు పూర్తయ్యే వరకు అందిస్తారు. బాలికలకు ప్రత్యేకంగా అందించే ఉపకార వేతనాలు రెండు సంవత్సరాలు అందిస్తారు. ► ఉపకార వేతనాల మొత్తం: రెగ్యులర్ స్కాలర్స్‌కు ఏడాదికి రూ.20,000లని మూడు వాయిదాల్లో అందిస్తారు. ► ప్రత్యేకంగా బాలికలకు ఏడాదికి రూ.10,000లని మూడు వాయిదాల్లో అందిస్తారు. ► ఎంపిక విధానం: 10/10+2లో సాధించిన మెరిట్ మార్కులు, తల్లిదండ్రుల కుటుంబ వార్షికాదాయం ఆధారంగా ఎంపిక చేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 31.12.2021 ► వెబ్సైట్: licindia.in -
రూ.8 లక్షల వార్షికాదాయంపై పునఃసమీక్ష
న్యూఢిల్లీ: నీట్–పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ఆలిండియా కోటా సీట్ల భర్తీలో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల(ఈడబ్ల్యూఎస్) కింద రిజర్వేషన్ పొందడానికి వార్షికాదాయ పరిమితి రూ.8 లక్షల లోపు ఉండాలన్న నిబంధనను పునఃసమీక్షించాలని నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలోకి ఎవరెవరు వస్తారన్నది తేల్చడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీని తేల్చే ప్రక్రియను నాలుగు వారాల్లో పూర్తి చేస్తామన్నారు. కోర్టు అనుమతి మేరకు నీట్–పీజీ కౌన్సెలింగ్‌ను నాలుగు వారాలపాటు వాయిదా వేసినట్లు తెలిపారు. కేంద్ర సర్కారు, మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ(ఎంసీసీ) జూలై 29న జారీ చేసిన నోటీసును సవాలు చేస్తూ పలువురు విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో నీట్–పీజీ మెడికల్ కోర్సుల్లో అఖిల భారత కోటా సీట్ల భర్తీలో ఓబీసీలకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు ఎంసీసీ గతంలో తెలిపింది. కేంద్రీయ విద్యా సంస్థలు, సెంట్రల్ యూనివర్సిటీల్లో మెడికల్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో 15 శాతం సీట్లు, పీజీ కోర్సుల్లో 50 శాతం సీట్లు అఖిల భారత కోటాకు కిందకు వస్తాయి. పీజీ కోర్సుల్లో అఖిల భారత కోటా సీట్ల భర్తీలో కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలలోపు ఉన్నవారు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద రిజర్వేషన్లు పొందడానికి అర్హులని కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది. ‘జాతీయ జీవన వ్యయ సూచిక’ ఆధారంగా ఈ పరిమితి విధించినట్లు స్పష్టం చేసింది. దీనిపై పలువురు విద్యార్థులు అభ్యంతరం వ్యక్తంచేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా, ఈడబ్ల్యూఎస్ కోటా అమలును వాయిదా వేయడం సాధ్యం కాదని తుషార్ మెహతా అన్నారు. తుషార్ మెహతా వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి ఆరవ తేదీకి వాయిదావేసింది. -
ఈడబ్ల్యూఎస్ సీట్లన్నీ కన్వీనర్ కోటాలోనే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ సహా వివిధ కోర్సుల్లో ప్రవేశాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) విద్యార్థులకు 10 శాతం కోటా అమలుపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి సెట్స్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లను పూర్తిగా కన్వీనర్ కోటాలోనే భర్తీ చేయాలని నిర్ణయించింది. గురువారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో ఏపీఈఏపీ సెట్ అడ్మిషన్ల కమిటీ కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ ప్రత్యేక కమిషనర్ డాక్టర్ పోలా భాస్కర్, చీఫ్ క్యాంపు ఆఫీసర్ (అడ్మిషన్స్) డాక్టర్ బల్లా కళ్యాణ్, సెట్స్ ప్రత్యేకాధికారి సుధీర్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈడబ్ల్యూఎస్ కోటాపై కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం ప్రకారం కాలేజీల్లోని కోర్సుల్లో పది శాతం సీట్లను సూపర్‌న్యూమరరీ కింద ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు అదనంగా ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలోని వివిధ ఉన్నత విద్యా కోర్సుల్లోని సీట్లలో 70 శాతం కన్వీనర్ కోటా కింద, 30 శాతం సీట్లు మేనేజ్మెంట్ కోటా కింద కేటాయిస్తున్నారు. కన్వీనర్ కోటాలో 7 శాతం, మేనేజ్మెంట్ కోటాలో 3 శాతం సీట్లు సూపర్‌న్యూమరరీ కింద ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు అదనంగా కేటాయిస్తున్నారు. అయితే కన్వీనర్ కోటాలో సీట్లు పొందే విద్యార్థుల ఫీజులను ప్రభుత్వమే రీయింబర్స్ చేస్తోంది. వారిపై పైసా భారం పడదు. మేనేజ్మెంట్ కోటా విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదు. ఆ కోటాలో సీట్లు పొందే ఈడబ్ల్యూఎస్ విద్యార్ధులు ఫీజు వారే చెల్లించాలి. ఇది కన్వీనర్ కోటా సీట్ల ఫీజుకంటే ఈ ఏడాది 3 రెట్లు అధికంగా ఉంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలపై ఇంత ఫీజు భారం సరికాదన్న ప్రభుత్వ అభిప్రాయం మేరకు మొత్తం 10 శాతం సీట్లను కన్వీనర్ కోటాలోనే కేటాయించాలని సమావేశంలో నిర్ణయించారు. దీనివల్ల ఆ విద్యార్థులపై ఫీజుల భారం పడదు. ప్రైవేటు యూనివర్సిటీల్లో కేంద్ర చట్టం ప్రకారం ఈడబ్ల్యూఎస్ కోటాకు అవకాశం లేనందున రాష్ట్రంలోని ప్రైవేటు యూనివర్సిటీల్లో కూడా ఆ కోటా అమలు కాదు. నేడు ఈఏపీ సీట్ల కేటాయింపు రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ ఈఏపీ సెట్–2021 సీట్ల కేటాయింపు శుక్రవారం నిర్వహించనున్నారు. ఈనెల 10వ తేదీనే సీట్లు కేటాయించాల్సి ఉన్నా, ఈడబ్ల్యూఎస్ కోటాపై నిర్ణయం తీసుకోవలసి ఉండటంతో వాయిదా పడింది. గురువారం దీనిపై నిర్ణయం తీసుకోవడంతో శుక్రవారం నుంచి సీట్లు కేటాయిస్తారు. -
ఈడబ్ల్యూఎస్ కోటా..203 ఎంబీబీఎస్ సీట్లు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 2021–22 వైద్య విద్య సంవత్సరానికి గాను ఆర్థికపరంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు 203 ఎంబీబీఎస్ సీట్లు కేటాయించారు. ఇందులో గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీల్లో 50 సీట్ల చొప్పున, ఆదిలాబాద్ రిమ్స్, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 20 సీట్ల చొప్పున, మహబూబ్‌నగర్, సిద్దిపేట మెడికల్ కాలేజీల్లో 25 సీట్ల చొప్పున, ఈఎస్ఐ మెడికల్ కాలేజీల్లో 13 సీట్లు మంజూరైనట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది. అయితే వీటిలో 102 సీట్లను మాత్రమే ఈడబ్ల్యూఎస్ కోటా కింద అర్హులైన వారితో భర్తీ చేస్తామని, మిగిలిన 101 సీట్లలో 30 ఎస్సీ విద్యార్థులకు, 59 బీసీ, 12 ఎస్టీ విద్యార్థులకు కేటాయిస్తామని విశ్వవిద్యాలయం తెలిపింది. నిబంధనల ప్రకారం ఈడబ్ల్యూఎస్ కోటాలో ఎన్ని సీట్లను భర్తీ చేస్తారో, అన్ని సీట్లను మిగిలిన రిజర్వేషన్లకు కేటాయించాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే రాష్ట్రానికి ఈడబ్ల్యూఎస్ సీట్లను మంజూరు చేశారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అఖిల భారత కోటాలోకి 230 సీట్లు.. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,285 కన్వీనర్ కోటా సీట్లుండగా, వీటిలో 15 శాతం సీట్లను అంటే సుమారు 230 సీట్లను అఖిల భారత కోటాలోకి ఇవ్వనున్నారు. ఇందులో గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీల్లో 30 చొప్పున, ఉస్మానియాలో 37, రిమ్స్ ఆదిలాబాద్, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఈఎస్ఐ కాలేజీలో 15 చొప్పున, మహబూబ్‌నగర్, సిద్దిపేట, నల్లగొండ, సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 22 సీట్ల చొప్పున కేటాయించారు. అఖిల భారత కౌన్సెలింగ్ సందర్భంగా ఈ ఎంబీబీఎస్ సీట్లను నింపుతారు. వీటికి దేశవ్యాప్త విద్యార్థులు పోటీ పడతారు. రెండు కౌన్సెలింగ్‌లలో ఈ సీట్లను భర్తీ చేస్తారు. అయినా సీట్లు మిగిలిపోతే, వాటిని తిరిగి రాష్ట్రంలో జరిగే కౌన్సెలింగ్‌లో భర్తీ చేసుకునే అవకాశం ఇస్తారు. కాగా, రెండ్రోజుల కింద నీట్ ఫలితాలు వచ్చాయి. అయితే రాష్ట్రాల వారీగా ఇంకా ర్యాంకులు ప్రకటించలేదు. త్వరలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నుంచి రాష్ట్రానికి చెందిన అర్హులైన విద్యార్థుల జాబితా వస్తుందని, అనంతరం రాష్ట్ర స్థాయి ర్యాంకులు ప్రకటిస్తామని అధికారులు చెబుతున్నారు. -
Andhra Pradesh: అగ్రవర్ణ పేదలకు దన్ను
రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధి కోసం పలు ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్ట్‌ల నిర్మాణం కోసం పర్యాటక శాఖకు భూముల అప్పగింతకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల విస్తరణ, సంస్కృత, వేద పాఠశాలల ఏర్పాటు కోసం శారదా పీఠం, దత్త పీఠం, ఇస్కాన్ చారిటీస్లకు భూములను కేటాయించింది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన ప్రజలను ఆదుకోవడం కోసం ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాల) సంక్షేమం పేరుతో ప్రత్యేక శాఖ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బ్రాహ్మణ, కాపు, క్షత్రియ, కమ్మ, రెడ్డి, ఆర్య వైశ్య తదితర వర్గాల్లో నిరుపేదలను ఆదుకోవడం కోసం ఇప్పటికే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్లను ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ పరిధిలోకి తేవాలని నిర్ణయించింది. జైన్లు, సిక్కుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా జైన్ కార్పొరేషన్, సిక్కు కార్పొరేషన్ ఏర్పాటు చేయనుంది. పద్మ, ఆది వెలమ సామాజిక వర్గాల్లోని నిరుపేదలను ఆదుకోవడం కోసం ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయడానికి వీలుగా ప్రతిపాదనను మంత్రివర్గం ముందు పెట్టాలని అధికారులను ఆదేశించింది. గురువారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలను సమాచార శాఖ మంత్రి పేర్ని నాని విలేకరులకు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. (చదవండి: 'గంజాయి'పై కదిలిన గ్రామ చైతన్యం) కొలువుల జాతర ► వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో 1285, వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్‌లలో 560 ఫార్మసిస్టులు, వైద్య విద్య శాఖలో బోధన, నర్సింగ్, పారామెడికల్ విభాగాల్లో 2,190 వెరసి 4,035 ఉద్యోగాలను కొత్తగా సృష్టించి.. నియామకాలు చేపట్టడానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ► వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో 41,308 ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. 2019 జూన్ నుంచి ఇప్పటిదాకా 26,917 మంది ఉద్యోగులను నియమించింది. మిగతా 14,391 ఉద్యోగుల నియామకాల్లో భాగంగా∙ఈ నిర్ణయం తీసుకుంది. బీసీ జన గణన ► 2021 జనాభా లెక్కల ఆధారంగా బీసీ జన గణన చేయాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టే అధికారాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రికి అప్పగిస్తూ మంత్రివర్గం తీర్మానం చేసింది. ► దేశానికి స్వాతంత్య్రం రాక ముందు 1931లో మాత్రమే కులాల ప్రాతిపదికన జన గణన చేశారు. అందు వల్ల ఆ వర్గాల జనాభా ఎంతన్నది తేల్చలేకపోతున్నారు. ఈ దృష్ట్యా బీసీ జన గణన చేపట్టడం ద్వారా శాస్త్రీయంగా వర్గాల జనాభాను తేల్చి.. ఆ మేరకు ఆ వర్గాల ప్రజల అభ్యున్నతికి నిధులు కేటాయించవచ్చన్నది మంత్రివర్గం భావన. అమ్మ ఒడికి 75 శాతం హాజరు ► అమ్మ ఒడి పథకం కింద 2022 జూన్‌లో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. 2021 నవంబర్ 8 నుంచి 2022 ఏప్రిల్ 30 వరకు పాఠశాలల్లో 130 పని దినాల్లో 75 శాతం హాజరు ఉంటేనే ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. ► 2019–20, 2020–21 విద్యా సంవత్సరాల్లో కరోనా ప్రభావం వల్ల హాజరు శాతం నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ పథకం స్ఫూర్తిపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు ► వృద్ధాప్య పెన్షన్, ఇంటి స్థలం, వైఎస్సార్ ఆసరా, చేయూత.. తదితర ఏ సంక్షేమ పథకం కిందైనా అర్హత ఉండి.. లబ్ధి చేకూరని వారితో జనవరి నుంచి మే వరకు దరఖాస్తు తీసుకుంటారు. వాటిని పరిశీలించి.. అర్హత ఉన్నట్లు తేలితే జూన్‌లో ప్రయోజనం చేకూర్చుతారు. ► ఇదే రీతిలో జూలై నుంచి నవంబర్ వరకు దరఖాస్తులు స్వీకరించి.. అర్హత ఉన్న వారికి డిసెంబర్లో లబ్ధి కల్పిస్తారు. పర్యాటక రంగ అభివృద్ధి దిశగా.. ► రాష్ట్రంలో పర్యాటక రంగ విస్తరణకు మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. చిత్తూరు జిల్లా పేరూరు, విశాఖ జిల్లా అన్నవరం, వైఎస్సార్ జిల్లా గండికోట, చిత్తూరు జిల్లా హార్స్లీ హిల్స్, తూర్పుగోదావరి జిల్లా పిచ్చుకలంకలో.. మొత్తంగా ఈ 5 ప్రాంతాల్లో లగ్జరీ రిసార్ట్‌ల నిర్మాణానికి పర్యాటక శాఖకు భూమి అప్పగింతకు మంత్రివర్గం ఆమోదం. ఈ ఐదు చోట్ల రూ.1,350 కోట్లతో ఓబెరాయ్ విలాస్ పేరుతో ఒబెరాయ్ సంస్థ 7 స్టార్ సదుపాయాలతో లగ్జరీ రిసార్టులను నిర్మించనుంది. తద్వారా 10,900 మందికి ఉద్యోగాలు వస్తాయి. ► భీమిలిలో రూ.350 కోట్లతో మరో టూరిజం ప్రాజెక్ట్. 7 స్టార్ సదుపాయాలతో రిసార్ట్ నిర్మాణం. 5500 మందికి ఉద్యోగాల కల్పన. ► తిరుపతిలో రూ.250 కోట్లతో టూరిజం ప్రాజెక్ట్. తద్వారా 1500 మందికి ఉద్యోగాలు. ► చిత్తూరు జిల్లా కొత్తకోటలో రూ.250 కోట్లతో మరో ప్రాజెక్టుకు, తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురంలో రూ.250 కోట్లతో మరో టూరిజం ప్రాజెక్టుకు ఆమోదం. విశాఖ జిల్లా శిల్పారామం బీచ్ వద్ద, తాజ్ వరుణ్ బీచ్ వద్ద టూరిజం ప్రాజెక్టులకు ఆమోదం. విజయవాడలో పార్క్ హయత్ ప్రాజెక్టుకు ఆమోదం. వీటికి పర్యాటక విధానం కింద రాయితీలకు అంగీకారం. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆన్లైన్లో సినిమా టికెటింగ్ ఆంధ్రప్రదేశ్ సినిమాల రెగ్యులేషన్ చట్టం–1955 సవరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇండియన్ రైల్వే ఆన్లైన్ టికెట్ వ్యవస్థ తరహాలో సినిమా టికెట్లను ఆన్లైన్లో జారీ చేయడానికి పోర్టల్‌ను ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అభివృద్ధి చేసి, ఈ సంస్థే నిర్వహించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1094 థియేటర్లు ఉన్నాయి. వాటిలో ఫోన్‌కాల్, ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ ద్వారా టికెట్లను బుక్ చేసుకునే సౌకర్యం ప్రేక్షకులకు కల్పించనుంది. థియేటర్ల వద్ద ట్రాఫిక్ అవాంతరాలను తొలగించడానికి, ప్రేక్షకులకు సమయం ఆదా చేయడానికి, పన్నులు ఎగ్గొట్టడాన్ని నివారించడానికి ఈ విధానం దోహదపడుతుంది. (చదవండి: ఆ.. నకిలీ సిగరెట్లు ఎవరివో? ) మరిన్ని కీలక నిర్ణయాలు ఇలా.. ► రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజైన నవంబర్ 1న వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్, వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డుల ప్రదానం. ► పాల సేకరణలో వినియోగిస్తున్న పరికరాలు, వస్తువుల తనిఖీ బాధ్యతలు, విధులు తూనికలు కొలతల శాఖ నుంచి పశుసంవర్ధక శాఖకు బదిలీ. వాటిని తనిఖీ చేసే అధికారం పశు వైద్యులకు అప్పగింత. ► సీఎం వైఎస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు. ఇందులో కొత్తగా 19 మంది ఉద్యోగుల నియామకానికి అనుమతి. ► వ్యవసాయానికి పగటి పూట తొమ్మిది గంటలు నిరంతరాయంగా నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ఏటా 7 వేల మెగావాట్ల విద్యుత్‌ను యూనిట్ రూ.2.49కే కొనుగోలు చేస్తూ కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందానికి ఆమోదం. 25 ఏళ్ల పాటు ఈ సంస్థ విద్యుత్‌ను సరఫరా చేయనుంది. తద్వారా ఏటా రూ.2 వేల కోట్లు ఆదా. ► విశాఖ జిల్లా భీమిలి మండలం కొత్తవలసలో విశాఖ శారదా పీఠానికి 15 ఎకరాలు కేటాయింపు. సంస్కృత పాఠశాల, వేద విద్య పాఠశాల సహా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల విస్తరణకు ఈ భూమిని శారదాపీఠం వినియోగించనుంది. మార్కెట్ విలువ ప్రకారం ఎకరా రూ.1.5 కోట్ల చొప్పున కేటాయించింది. ► అనంతపురం జిల్లా రాప్తాడు మండలం బొమ్మపర్తి గ్రామంలో గుండ్లూరు జయలక్ష్మి నరసింహ శాస్త్రి ట్రస్టు(దత్తపీఠం) కు 17.49 ఎకరాలు కేటాయింపు. ఈ ట్రస్టు ఇక్కడ వేద పాఠశాల, సంస్కృత పాఠశాల ఏర్పాటు చేయనుంది. ► అనంతపురం జిల్లా పెనుకొండలో ఇస్కాన్ ఛారిటీస్ ఆధ్వర్యంలో జ్ఞానగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం పాదప్రాంతంలో ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పాటుకు లీజు ప్రాతిపదికన 75 ఎకరాల భూమి కేటాయింపు. ► చిత్తూరు జిల్లా నగరిలో ఏరియా ఆసుపత్రి కోసం ప్రభుత్వ భూమి మార్పిడికి ఆమోదం. ► విజయనగరం ఇంజనీరింగ్ కళాశాల స్థానంలో గురజాడ జేఎన్టీయూ.. ప్రకాశం జిల్లాలో ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఆర్డినెన్స్ జారీకి గ్రీన్ సిగ్నల్. ► కర్నూలు జిల్లాలో సిల్వర్ జూబ్లీ కళాశాల నేతృత్వంలో క్లస్టర్ యూనివర్సిటీ ఏర్పాటుకు దిన్నెదేవరపాడు వద్ద 50 ఎకరాల కేటాయింపు. ► కృష్ణా జిల్లా నూజివీడులో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు 7 ఎకరాల కేటాయింపు. ► వాసవి కన్యకాపరమేశ్వరి చౌల్ట్రీలు, అన్నదాన సత్రాల నిర్వహణ దేవదాయ శాఖ నుంచి తప్పించి, ఆర్యవైశ్యులకే అప్పగింత. (పాదయాత్రలో హామీ మేరకు) ► విశాఖపట్నం జిల్లా మధురవాడలో 200 మెగావాట్ల డేటా సెంటర్ పార్క్, బిజినెస్ పార్క్, స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటుకు అదానీ ఎంటర్‌ప్రైజస్‌కు 130 ఎకరాల భూమి కేటాయింపు. ఇందులో ఆ సంస్థ రూ.14,634 కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది. తద్వారా ప్రత్యక్షంగా 24,990 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. ► వైఎస్సార్ కడప జిల్లాలో రూ.227.1 కోట్ల వ్యయంతో ఐదు ఎత్తిపోతల ద్వారా హంద్రీ–నీవా, గాలేరు–నగరి ప్రాజెక్టుల నుంచి చెరువులను నింపేందుకు ఆమోదం. ► మూడు కొత్త ఆక్వాకల్చర్ ప్రాజెక్టుల కోసం 6 రెగ్యులర్ పోస్టులు డిప్యూటేషన్ పద్ధతిలో, 67 పోస్టులు అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీకి అనుమతి. ► మండలి, శాసనసభల్లో కొత్త విప్‌లు వెన్నపూస గోపాల్‌రెడ్డి, చిర్ల జగ్గిరెడ్డిలకు కొత్త పేషీల ఏర్పాటు, సిబ్బంది నియామకానికి ఆమోదం. ► మావోయిస్టులతోసహా నిషేధిత సంస్థలపై నిషేధం మరో ఏడాది పొడిగింపు. ► వాడరేవు వద్ద ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుకు ఆమోదం. రూ.2205 కోట్లతో రోడ్లకు మరమ్మతులు రాష్ట్రంలో ఆర్ అండ్ బీ పరిధిలోని రహదారుల మరమ్మతులను మంత్రివర్గం సమీక్షించింది. గతంలో ఏడాదికి స్టేట్ హైవేల మరమ్మతుకు రూ.300 కోట్లు, ఎండీఆర్ రోడ్ల మరమ్మతులకు రూ.వంద కోట్లు వెరసి రూ.400 కోట్లు ఖర్చు చేసేవారని అధికారులు వివరించారు. ఆర్ అండ్ బీ శాఖ పరిధిలోని 46 వేల కిలోమీటర్ల పొడవైన రోడ్లలో 8 వేల కిలోమీటర్ల మేర రోడ్లకు మరమ్మతులు చేయాలన్నారు. ఇందుకు రూ.2,205 కోట్లతో 1,176 పనులు చేపట్టామని చెప్పారు. ఇప్పటికే 40% పనులకు టెండర్లు పిలిచి, కాంట్రాక్టర్లకు అప్పగించామని, రాయలసీమలో పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు.. మిగిలిన 60 శాతం పనులకు నవంబర్‌లోగా టెండర్లు పూర్తి చేసి.. డిసెంబర్లో పనులు ప్రారంభించి.. వచ్చే మే లోగా పనులు పూర్తి చేయాలని మంత్రివర్గం అధికారులకు దిశానిర్దేశం చేసింది. (చదవండి: పర్యావరణహితంగా ‘వైఎస్సార్ స్టీల్’) -
నీట్–పీజీ కౌన్సెలింగ్ నిలిపివేత
న్యూఢిల్లీ: ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కోటాపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు వచ్చేదాకా నీట్–పీజీ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించబోమని కేంద్ర ప్రభుత్వం సోమవారం అత్యున్నత న్యాయస్థానానికి తెలియజేసింది. ప్రస్తుత(2021–22) విద్యా సంవత్సరం నుంచే ఎంబీబీఎస్/బీడీఎస్, ఎండీ/ఎంఎస్/ఎండీఎస్ కోర్సుల్లో అఖిల భారత కోటా సీట్ల భర్తీకి ఓబీసీలకు 27 శాతం, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు(ఈడబ్ల్యూఎస్) 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు జూలై 29న నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ పలువురు ‘నీట్’ అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బీబీ నాగరత్నతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్ర సర్కారు తరపున అదనపు సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్ హాజరయ్యారు. రిజర్వేషన్లపై న్యాయస్థానం తుది ఉత్తర్వులు ఇచ్చేవరకూ కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టబోమని వెల్లడించారు. అంతకుముందు పిటిషనర్ల తరపున సీనియర్ అడ్వొకేట్ అరవింద్ దత్తార్ వాదనలు వినిపించారు. ప్రభుత్వం ప్రకటించిన ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కోటాతో చాలామంది అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని వివరించారు. మెడికల్, డెంటల్ అండర్ గ్రాడ్యుయేట్(యూజీ) కోర్సుల్లో 15 శాతం సీట్లు, పోస్టు గ్రాడ్యుయేట్(పీజీ) కోర్సుల్లో 50 శాతం సీట్లు అఖిల భారత కోటా కింద ఉంటాయి. ఈ సీట్ల భర్తీలో ఓబీసీలకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కేంద్రప్రభుత్వం ప్రకటించడం పట్ల వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ‘డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్’ ఉత్తర్వుల ప్రకారం నీట్–పీజీ సీట్ల భర్తీకి సంబంధించి ఈ నెల 25వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. -
ఏ ప్రాతిపదికన రూ.8 లక్షల పరిమితి విధించారు ?
న్యూఢిల్లీ: నీట్ ప్రవేశాల్లో వైద్య విద్య కోర్సుల్లో చేరే ఆర్థికంగా వెనకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్) విద్యార్థులకు రూ.8 లక్షల వార్షిక ఆదాయం పరిమితిని కేంద్రం విధించడాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఏ ప్రాతిపదికన రూ.8 లక్షల పరిమితిని వర్తింపజేశారో వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ బీవీ నాగరత్నల ధర్మాసనం ఆదేశించింది. రూ.8 లక్షలలోపు వార్షిక ఆదాయం ఉంటేనే ఈడబ్ల్యూఎస్‌గా పరిగణిస్తామనడంపై అఫిడవిట్ సమర్పించాలని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ, కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖలకు కోర్టు సూచించింది. నేషనల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్‌ను ఆధారంగా చేసుకుని ఆదాయ పరిమితిని నిర్ణయించామని, ఇది కేంద్ర ప్రభుత్వ విధానపర నిర్ణయమని ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ నటరాజ్ వివరణ ఇచ్చారు. దీనిపై కోర్టు స్పందించింది. ‘వేర్వేరు రాష్ట్రాలు, పట్టణాల్లో జీవన వ్యయాలు వేరుగా ఉంటాయి. యూపీలోని చిన్న పట్టణాలతో పోలిస్తే ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో ఖర్చులు ఎక్కువ. అలాంటపుడు ఒకే రకమైన ఆదాయ పరిమితిని ఎలా విధిస్తారు? కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయం అని చెప్పి తప్పించుకోలేరు’ అని కోర్టు వ్యాఖ్యానించింది. నీట్లో ఈడబ్ల్యూఎస్ కోటాకు వార్షిక ఆదాయ పరిమితిపై సుప్రీంకోర్టు -
తెలంగాణలో ఈడబ్ల్యూఎస్‌కు లైన్‌క్లియర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో 10 శాతం ఈడబ్ల్యూఎస్ (అగ్రవర్ణ పేదల) రిజర్వేషన్ల అమలుకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఈ కోటా కింద రిజర్వేషన్ పొందడంలో.. ఆదాయ ధ్రువీకరణ పత్రమే కీలకంగా ఉండనుంది. ఆయా అభ్యర్థులు/విద్యార్థులు అందజేసిన అన్నిరకాల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించాక నిబంధనలకు అనుగుణంగా తహసీల్దార్లు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీచేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ మంగళవారంఉత్తర్వులు జారీ చేశారు. ఎవరెవరు అర్హులు? ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల కిందకురాని వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో 10శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌కు అర్హులు. వీరి కుటుంబ స్థూల వార్షికాదాయం రూ.8 లక్షల లోపు ఉండాలి. వేతనం, వ్యవసాయం, వృత్తి, వ్యాపారం తదితర అన్నిమార్గాల నుంచి వచ్చే ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోరే వ్యక్తితోపాటు వారి తల్లిదండ్రులు, 18ఏళ్లలోపు ఉన్న తోబుట్టువులు, జీవిత భాగస్వామి, 18ఏళ్లలోపు వయసున్న సంతానాన్ని కుటుంబంగా పరిగణనలోకి తీసుకుంటారు. తోబుట్టువులు, సంతానం 18 ఏళ్లపైన వయసున్న వారైతే.. వారి ఆదాయాన్ని కుటుంబ ఆదాయం కింద లెక్కించరు. ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సమానంగా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 5 ఏళ్లు సడలింపు ఉంటుంది. పరీక్ష, ఇతర ఫీజుల మినహాయింపులు సమానంగా వర్తిస్తాయి. బ్యాక్లాగ్ నియామకాలకు నో.. ఏదైనా నియామక సంవత్సరం (రిక్రూట్మెంట్ ఇయర్)లో సరైన అర్హుల్లేక ఈడబ్ల్యూఎస్ కోటా పోస్టులు భర్తీ కాకుంటే.. ఆ పోస్టులను తర్వాతి నియామక సంవత్సరానికి బ్యాక్లాగ్ పోస్టుగా బదిలీ (క్యారీ ఫార్వర్డ్) చేయకూడదు. వికలాంగులు/ఎక్స్‌సర్వీ స్‌మెన్ కోటా కింద ఈడబ్ల్యూఎస్‌కు చెందిన వ్యక్తులెవరైనా ఎంపికైతే.. వారికి ఈడబ్ల్యూఎస్ రోస్టర్ వర్తింపజేయాలి. అన్రిజర్వ్డ్ పోస్టులకు పోటీపడే హక్కును ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు నిరాకరించరాదు. ఈడబ్ల్యూఎస్ వ్యక్తులు రిజర్వేషన్లతో సంబంధం లేకుండా మెరిట్ ఆధారంగా (అన్రిజర్వ్డ్, ఓపెన్ కోటాల కింద) ఎంపికైతే.. వారి ఎంపికను ఈడబ్ల్యూఎస్ కోటా కింద లెక్కించరాదు. ఈడబ్ల్యూఎస్ కోటాలో అంతర్గతంగా మహిళలకు 33 1/3 శాతం కోటా అమలు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రోస్టర్ పాయింట్లను కూడా ఖరారు చేశారు. ప్రతి 100 ఖాళీల భర్తీలో.. 9, 17 (మహిళలు), 28, 36, 50 (మహిళలు), 57, 65 (మహిళలు), 76, 86, 100 స్థానాల్లో వీటిని కేటాయిస్తారు. తప్పుడు మార్గాల్లో అనర్హులు ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా ఉద్యోగాలు పొందకుండా నిబంధనలను కఠినంగా అమలు చేయాలి. అనర్హులు ఎంపికైతే సర్వీసు నుంచి తొలగించాలి. ఇకపై జరిపే అడ్మిషన్లలో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులను చేర్చుకోవడానికి రాష్ట్రంలోని ప్రతి ఉన్నత విద్యాసంస్థ కూడా వివిధ కోర్సులు/ బ్రాంచీ/ ఫ్యాకల్టీలో సీట్ల సంఖ్యను పెంచాలి. ‘ఆదాయ’ ధ్రువీకరణ తర్వాతే ఉద్యోగం ఈడబ్ల్యూఎస్ కోటాలో ఎవరైనా ఉద్యోగానికి ఎంపికైనా.. వారి ‘ఆదాయ ధ్రువీకరణ పత్రం’ తనిఖీ ప్రక్రియను సంబంధిత వర్గాలు పూర్తిచేసే వరకు ఆ నియామకం తాత్కాలికమే. అక్రమంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పొందినట్టు గుర్తిస్తే వెంటనే ఎలాంటి కారణాలు తెలపకుండానే ఉద్యోగం నుంచి తొలగిస్తారు. క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. ఈ విషయాలను అభ్యర్థులకు జారీచేసే నియామక ఉత్తర్వుల్లో పొందుపర్చాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. అభ్యర్థి సమర్పించిన ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని జారీచేసిన అధికారి ద్వారా ధ్రువీకరించుకోవాలని సూచించారు. చదవండి: తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా లింబాద్రి -
ఉన్నత విద్యా కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లోని వివిధ కోర్సుల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు (ఈడబ్ల్యూఎస్) 10 శాతం ప్రత్యేక కోటా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి త్వరలో మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. ప్రత్యేక కోటా అమలుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్ని విశ్వవిద్యాలయాలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి సూచించింది. ఈడబ్ల్యూఎస్ కింద 10 శాతం రిజర్వేషన్లను కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆదాయం రూ.8 లక్షల లోపు ఉన్న వారికి ఈ రిజర్వేషన్లు అమలు చేస్తారు. అయితే ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ల ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. కొద్ది రోజుల్లోనే అడ్మిషన్లు పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈడబ్ల్యూఎస్ కింద 10 శాతం సీట్లను భర్తీ చేయాల్సి ఉందని, అందుకు తగినట్లు ఏర్పాట్లు చేసుకోవాలని విశ్వవిద్యాలయాలకు ఉన్నత విద్యా మండలి సూచించింది. 10 శాతం అదనంగా సీట్లు ఈ రిజర్వేషన్ల అమలుకు గాను ప్రస్తుతం అందుబాటులో ఉన్న సీట్లలో 10 శాతం సీట్లను కేటాయించడం కాకుండా, అదనంగా 10 శాతం సీట్లను సృష్టిస్తారు. ఈ సీట్లను కన్వీనర్ కోటా కింద అర్హులైన ఈడబ్ల్యూఎస్ కేటగిరీ విద్యార్థులకు కేటాయిస్తారు. ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడిన వెంటనే 10 శాతం సీట్లు పెంచి ఈ కోటా కింద భర్తీ చేస్తారు. అయితే సాధారణ ఎంఏ, ఎమ్‌కాం, సాధారణ డిగ్రీ కోర్సుల్లో ఇప్పటికే ఉన్న సీట్లు భర్తీ కావడం లేదనీ, అందువల్ల ఈ కోర్సులకు ప్రత్యేక కోటాను సృష్టించినా ప్రత్యేకంగా ఒరిగేదేమీ లేదని ఉన్నత విద్యా మండలి వర్గాలు అంటున్నాయి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఎంబీఏ, ఎంసీఏ, పాలిటెక్నిక్, డిమాండ్ ఉన్న ఇతర పీజీల వంటి కోర్సుల్లో ఈ కోటాకు విలువ ఉంటుందని చెబుతున్నాయి. -
వైద్య కోర్సుల్లో రిజర్వేషన్లు ఖరారు చేసిన కేంద్రం
సాక్షి,న్యూఢిల్లీ: వైద్య విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత విద్యా సంవత్సరం 2021-22కి గాను వైద్య కోర్సుల్లో రిజర్వేషన్లను కేంద్రం ఖరారు చేసింది. మెడికల్ అండ్ డెంటల్ ఎడ్యుకేషన్ (యూజీ, పీజీ) లో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు రిజర్వేషన్లను కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఆల్ ఇండియా కోటా కింద ఓబీసీ విద్యార్ధులకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్ విద్యార్ధులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం గురువారం నిర్ణయించింది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో దాదాపు 5,550 మంది విద్యార్థులు లబ్ధి పొందుతారని, ఓబీసీలకు, ఈడబ్ల్యుఎస్ విద్యార్థులకు రిజర్వేషన్లను కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఏడాది నుంచి ఆర్థికంగా వెనకబడిన వారికి విద్యా రిజర్వేషన్లను కల్పిస్తున్నట్టు పేర్కొంది. దీంతో ప్రతి సంవత్సరం ఎంబీబీఎస్‌లో దాదాపు 1500 మంది ఓబిసి విద్యార్థులకు, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో 2500 మంది ఓబిసి విద్యార్థులకు, ఎంబీబీఎస్‌లో 550 మంది ఈడబ్ల్యుఎస్ విద్యార్థులకు, పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌లో 1000 మంది ఈడబ్ల్యుఎస్ విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుందని వెల్లడించింది. తమ ప్రభుత్వం మైలురాయిలాంటి నిర్ణయం తీసుకుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్వీట్ చేశారు. తద్వారా ప్రతి సంవత్సరం వేలాదిమంది యువత అవకాశాలు పొంద నున్నారని పేర్కొన్నారు, మన దేశంలో సామాజిక న్యాయకల్పనలో ఇదొక కొత్త అధ్యాయంగా ప్రధాని మోదీ అభివర్ణించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యకు సమర్థవంతమైన పరిష్కారం కల్పించాలని ప్రధాని మోదీ జూలై 26న సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలను ఆదేశించిన సంగతి తెలిసిందే. Our Government has taken a landmark decision for providing 27% reservation for OBCs and 10% reservation for Economically Weaker Section in the All India Quota Scheme for undergraduate and postgraduate medical/dental courses from the current academic year. https://t.co/gv2EygCZ7N — Narendra Modi (@narendramodi) July 29, 2021 -
సీఎం వైస్ జగన్ బ్రాహ్మణులకు గౌరవ ప్రదమైన జీవనాన్ని కల్పించారు : దత్తాత్రేయ శర్మ
-
విద్యతోపాటు ఉద్యోగాల్లోనూ ‘ఈడబ్ల్యూఎస్’ రిజర్వేషన్లు
సాక్షి, అమరావతి: ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) విద్యా సంస్థలతోపాటు ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈడబ్ల్యూఎస్ వర్గాలకు విద్యావకాశాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2019 జూలై 27న రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దానికి కొనసాగింపుగా ఉద్యోగావకాశాల్లోనూ 10% రిజర్వేషన్లు కల్పిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై విధి విధానాలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మూడో వంతు మహిళలకు... ► ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ కేటగిరీలలోకి రాని వర్గాలలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు ఈ రిజర్వేషన్లకు అర్హులు. కుటుంబ వార్షిక ఆదాయం గరిష్టంగా రూ.8 లక్షల లోపు ఉండాలి. ► ఈడబ్ల్యూఎస్ కింద ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రోస్టర్ పాయింట్లను తర్వాత ప్రత్యేకంగా నిర్ణయిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ► ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద కల్పించే పది శాతం రిజర్వేషన్లలో మూడో వంతు ఆ వర్గాలకు చెందిన మహిళలకు కేటాయిస్తారు. అర్హులైన వారికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జారీ చేసే అధికారాన్ని తహసీల్దార్లకు కల్పించారు. చంద్రబాబు తీరుతోనే గందరగోళం రిజర్వేషన్ల కేటగిరీలో లేని ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈబీసీ)కు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం 2019లో విధాన నిర్ణయం తీసుకుంది. అదే స్ఫూర్తితో ఆ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయాల్సిన అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయ దురుద్దేశాలతో వ్యవహరించారు. ఈడబ్ల్యూఎస్ వర్గాలకు కేటాయించిన 10 శాతం కోటాను కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా విభజించారు. అందులో 5 శాతం కాపు సామాజికవర్గానికి, మిగిలిన 5 శాతాన్ని ఇతర అగ్రవర్ణాల పేదలకు కేటాయిస్తూ అప్పట్లో టీడీపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై కాపు సామాజికవర్గ ప్రతినిధులతోపాటు రాజ్యాంగ నిపుణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం రిజర్వేషన్ల స్ఫూర్తిని చంద్రబాబు దెబ్బతీశారని స్పష్టం చేశారు. తమను బీసీల్లో చేరుస్తామని మోసం చేసిన చంద్రబాబు ఈడబ్ల్యూఎస్‌లో 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు సరికొత్త మోసానికి తెర తీయడంపై కాపు సామాజికవర్గ నేతలు భగ్గుమన్నారు. అసలు తాము బీసీలమా? ఈడబ్ల్యూఎస్ వర్గానికి చెందిన వారమా? అనేది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈడబ్ల్యూఎస్‌కు కేటాయించిన 10 శాతం రిజర్వేషన్లను విభజించడాన్ని సవాల్ చేస్తూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను విభజించడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేస్తూ చంద్రబాబు సర్కారు ఇచ్చిన ఉత్తర్వులను న్యాయస్థానం కొట్టివేసింది. అప్పటి నుంచి రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు నిలిచిపోయింది. చంద్రబాబు నిర్వాకంతో అటు కాపు సామాజికవర్గం, ఇటు ఆర్థికంగా వెనుబడిన ఇతర అగ్రకులాలు తీవ్రంగా నష్టపోయాయి. ఈడబ్ల్యూఎస్ కోటాపై నేడు చిత్తశుద్ధితో అధికారం చేపట్టిన అనంతరం రాజ్యాంగ స్ఫూర్తితో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నడుం బిగించారు. న్యాయ నిపుణులతో చర్చించి వివాదాలకు తావులేని రీతిలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు సమగ్ర కార్యాచరణ రూపొందించారు. అందులో భాగంగా మొదట విద్యావకాశాల్లో ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2019 జూలై 27న ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీనిపై మరింత కసరత్తు అనంతరం సమగ్రంగా విధివిధానాలను నిర్ణయిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో విద్య, ఉద్యోగాలలో ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం రిజర్వేషన్లు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
సీట్ల పెంపు 10 శాతమా.. 20 శాతమా?
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యా ప్రవేశాల్లో 10 శాతం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) కోటా అమలుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జాతీయ స్థాయిలో కేంద్రం అమలు చేస్తున్న విధానాన్ని అనుసరించాలా? లేదా ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రా ల్లో అనుసరిస్తున్న విధానాన్ని అమల్లోకి తేవాలా? అన్న దానిపై ఆలోచనలు చేస్తోంది. దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు ఉన్నతవిద్యా మండలి ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయా లని భావిస్తోంది. 2021–22 విద్యా సంవత్సరంలో ఉన్నత విద్యాకోర్సుల్లో ఈడబ్ల్యూఎస్ కోటా అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సం గతి తెలిసిందే. ప్రవేశాల నాటికి మార్గదర్శకాలను జారీ చేయాలని భావిస్తోంది. జాతీయ స్థాయిలో... జాతీయ స్థాయిలో కేంద్రం ఈడబ్ల్యూఎస్ అమలు కు ప్రత్యేక విధానం తెచ్చింది. ప్రస్తుత రిజర్వేషన్లకు నష్టం వాటిల్లకుండా, ఓపెన్ కోటాను తగ్గించకుం డా చర్యలు చేపట్టింది. ఉదాహరణకు ఏదేని ఒక విద్యాసంస్థలో 100%సీట్లు ఉంటే వాటికి అదనంగా 20% సీట్లను (సూపర్ న్యూమరీ) పెంచింది. అం దులో 10 శాతం సీట్లను ఈడబ్ల్యూఎస్‌కు కేటాయిం చింది. మిగతా 10 శాతం సీట్లను అన్ని రిజర్వేషన్ల వారికి విభజించింది. అదే విధానాన్ని అన్ని ఉన్నత విద్యాకోర్సుల్లో అమలు చేస్తోంది. 20 శాతం సీట్లను పెంచితే మౌలిక సదుపాయాల సమస్య తలెత్తే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఏపీలో ఇలా... మరోవైపు పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో విధానం అమలు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లను యథావిధిగా కొనసాగిస్తూనే అదనంగా 10 శాతం (సూపర్ న్యూమరీ) సీట్లను పెంచింది. వాటిని ఈడబ్ల్యూఎస్ కోటా కింద కేటాయిస్తోంది. వీటిల్లో ఏ విధానాన్ని అమలు చేయాలన్న దానిపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. -
గ్రామీణ విద్యార్థులకు ట్రిపుల్ ఐటీల్లో పెద్దపీట
సాక్షి, అమరావతి/నూజివీడు: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అత్యున్నత సాంకేతిక విద్యనందించే లక్ష్యంతో ఏర్పాటైన రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్ ఐటీల్లో 2020–21 విద్యాసంవత్సరానికి గ్రామీణ విద్యార్థులకే అత్యధిక సంఖ్యలో సీట్లు లభించాయి. రాష్ట్రంలో నూజివీడు, ఇడుపులపాయ (ఆర్కే వ్యాలీ), ఒంగోలు, శ్రీకాకుళంలలో ట్రిపుల్ ఐటీలు ఉన్న సంగతి తెలిసిందే. వీటిలో ఒక్కో దానిలో వేయి చొప్పున మొత్తం 4 వేల సీట్లు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కోటాలో అదనంగా సూపర్ న్యూమరరీ కింద 10 శాతం చొప్పున 400 సీట్లను, ఎన్ఆర్ఐ కోటా కింద 7 సీట్లను కలిపి మొత్తం 4,407 సీట్లను ఈ విద్యాసంవత్సరంలో కేటాయించారు. గతేడాది కోవిడ్ కారణంగా పదో తరగతి పరీక్షలు నిర్వహించలేని పరిస్థితుల్లో విద్యా శాఖ విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సీట్ల భర్తీకి ఆర్జీయూకేటీ ప్రత్యేకంగా ప్రవేశ పరీక్షను నిర్వహించింది. ఈ సెట్లో ఎక్కువ స్కోరు సాధించి ర్యాంకులు పొందిన వారికి రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేటాయించారు. -
కన్వీనర్ కోటా కిందే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు!
సాక్షి, హైదరాబాద్: ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్రంలో వాటి అమలుకు చేపట్టాల్సిన చర్యలపై ఉన్నత విద్యా మండలి కసరత్తు ప్రారంభించింది. జాతీయ స్థాయిలో అన్నీ కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలే ఉన్నందున, 10 శాతం అమలులో ఎలాంటి ఇబ్బందులు లేవు. అయితే రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థల కంటే ప్రైవేటు విద్యా సంస్థలు ఎక్కువగా ఉన్నాయి. డిగ్రీ, పీజీ వంటి ఉన్నత, వృత్తి, సాంకేతిక విద్యా సంస్థలన్నీ కలిసి దాదాపు 2,500కు పైగా ఉండగా, వాటిల్లో దాదాపు 7 లక్షల వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో డిగ్రీ కాలేజీల్లోని 4 లక్షల సీట్లు మినహాయిస్తే మిగిలిన 3 లక్షల సీట్లలో ప్రభుత్వం ఏటా 2.5 లక్షల వరకే అడ్మిషన్లకు అనుమతి (అనుబంధ గుర్తింపు) ఇస్తోంది. ఈ లెక్కన 6.5 లక్షల సీట్లకు ఈడబ్ల్యూఎస్ కోటా కోసం అన్ని రకాల కోర్సులకు కలిపి 65 వేల సీట్లు అదనంగా వస్తాయి. మేనేజ్మెంట్ కోటా యధాతథం..: 65 వేల సీట్లను కన్వీనర్ కోటా కిందకే తెచ్చి రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. మొత్తం సీట్లలో 30 శాతం సీట్లను మేనేజ్మెంట్ కోటా కింద భర్తీ చేస్తుండగా, మిగతా 70 శాతం కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మేనేజ్మెంట్ కోటాను పక్కనపెట్టి, పెంచిన 10 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో కలిపి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేసేలా చర్యలు చేపట్టాల్సి ఉంటుందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ఈబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేస్తుండటంతో ఆ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ను తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి సంప్రదించారు. ఈ సందర్భంగా ఏపీలో ఇదే విధానం అమలు చేస్తున్నట్టుగా ఆయన వెల్లడించారు. కాగా వచ్చే విద్యా సంవత్సరంలో 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేసేందుకు చర్యలు చేపడతామని పాపిరెడ్డి వివరించారు. -
అగ్ర కుల పేదలకు శుభవార్త..
సాక్షి, హైదరాబాద్: అగ్ర కుల పేదలకు శుభవార్త. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు 10% రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. 2–3 రోజుల్లోనే దీనిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి ఆదేశాలు జారీ చేయనున్నట్లు గురువారం తెలిపారు. దీనితో రాష్ట్రంలో సైతం విద్య, ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్ అమల్లోకి రానుంది. ఈ మేరకు విధి విధానాలను ప్రభుత్వం ఖరారు చేసి ప్రకటించనుంది. మొత్తం 60% రిజర్వేషన్లు: ‘ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో పది శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం రిజర్వేషన్లు పొందుతున్న వర్గాలకు వాటిని యథాతథంగా కొనసాగిస్తూనే ఈడబ్ల్యూఎస్ వారికి 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించాం. రాష్ట్రంలో ఇప్పటికే బలహీన వర్గాలకు 50 శాతం మేర రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. ఈడబ్ల్యూఎస్ కోటా కలిపితే మొత్తం 60 శాతం రిజర్వేషన్లు అమలవుతాయి’’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. (చదవండి: చార్జీలు పెంచకుంటే బస్సు గట్టెక్కదు) రూ.8 లక్షల లోపు వార్షిక ఆదాయం వారికే..! ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో అగ్ర కుల పేదలకు 10 శాతం రిజర్వేషన్లను రాజ్యాంగ సవరణ ద్వారా 2019 జనవరిలో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు గల అగ్ర కులాల పేదలకు ఈ రిజర్వేషన్లను వర్తింపజేసింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు మినహా ఇతర జనరల్ కేటగిరీ పేదలకు ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని ప్రకటించింది. ఇప్పటివరకు రాష్ట్రంలోని ఎంపిక చేసిన ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్ల భర్తీలో మాత్రమే 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటా అమలుకు రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లుగా అనుమతిస్తూ వస్తోంది. చదవండి: (పదవులు కాదు.. పార్టీ శాశ్వతం: కేటీఆర్) భారీ సంఖ్యలో ఎంబీబీఎస్ సీట్లు కలిగిన గాంధీ, ఉస్మానియా వంటి వైద్య కళాశాలల్లో సైతం ఇప్పటివరకు ఈ కోటా అమలుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అయితే రాష్ట్రంలో 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటాను సంపూర్ణంగా అమలు చేయాలని అగ్ర కుల పేదలు గత కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నారు. దీనిపై తాజాగా సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో ఇకపై అన్ని రకాల ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రవేశాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో సైతం 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు కానున్నాయి. రాష్ట్రంలో కూడా రూ.8 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న వారికే రిజర్వేషన్లు వర్తించే అవకాశాలు ఉన్నాయి. అగ్ర కుల పేదలకు 5 వేల పోస్టులు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల్లో తక్షణమే 50 వేల పోస్టులను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఈ పోస్టుల్లో 10 శాతం అంటే 5 వేల పోస్టులు.. ప్రభుత్వ తాజా నిర్ణయంతో అగ్ర కుల పేదలకు రిజర్వు కానున్నాయి. ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ సహా ఇతర అన్ని రకాల కోర్సుల్లో 2020–21 విద్యా సంవత్సరానికి ఆడ్మిషన్లు ఇప్పటికే పూర్తయ్యాయి. దీంతో ఆయా కోర్సుల్లో వచ్చే విద్యా సంవత్సరం రిజర్వేషన్లు అమలు కానున్నాయి. (చదవండి: కాబోయే సీఎం కేటీఆర్‌కు కంగ్రాట్స్) -
ఈడబ్ల్యూఎస్ వర్గాలకు కేసీఆర్ గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఈడబ్ల్యూఎస్ వర్గాలకు అదనంగా 10శాతం రిజర్వేషన్ కల్పించాలని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఇప్పటికే బలహీనవర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు అమలవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో ఈడబ్ల్యూఎస్‌తో కలిపి రాష్ట్రంలో రిజర్వేషన్ల శాతం 60కి చేరనుంది.దీనిపై కేసీఆర్ రెండు రోజుల్లో అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశం తర్వాత అధికారులకు రిజర్వేషన్ల అంశానికి సంబంధించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయనున్నారు. -
ఈసారీ ఈడబ్ల్యూఎస్ కోటా లేనట్లే!
సాక్షి, హైదరాబాద్: అగ్రవర్ణ పేద విద్యార్థులకు ఈసారీ ఎంసెట్ ప్రవేశాల్లో రిజర్వేషన్ల కోటా లేనట్లే. దరఖాస్తు సమయంలో ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ ఉన్నప్పటికీ వెబ్సైట్లో వివరాల నమోదు ప్రక్రియలో మాత్రం లేదు. దీంతో వారంతా ఓపెన్ కేటగిరీ విద్యార్థులతో తలపడాల్సిందే. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఎంసెట్–20లో అమలు చేయకపోవడమే దీనికి కారణం. అగ్రవర్ణాల్లోని నిరుపేదలకు ఉన్నత విద్య, ప్రభుత్వోద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్(ఎకనామికల్లీ వీకర్ సెక్షన్) కింద 10శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు, జాతీయస్థాయి విద్యాసంస్థల సీట్ల భర్తీలో గతేడాది నుంచే కేంద్రం దీన్ని అమలు చేస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విద్యాసంస్థల్లో ఈ చట్టం అమలు కావాలంటే దీనిపై సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయాలి. కానీ ఈడబ్ల్యూఎస్ అమలుపై రాష్ట్రంలో ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సందిగ్ధం నెలకొంది. వెబ్సైట్ వివరాల నమోదులో కనిపించని ఆప్షన్... ఈ ఏడాది ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే తొలివిడత ఆన్లైన్ రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్, ఫీజు చెల్లింపు తదితరం మొదలయ్యాయి. ఇందులో భాగంగా వెబ్సైట్లో వివరాల నమోదు సమయంలో ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ కనిపించకపోవడంతో విద్యార్థులు అయోమయంలో పడ్డారు. వాస్తవానికి గతేడాదే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల చట్టం అమల్లోకి వచ్చినా అప్పటికే రాష్ట్రంలో ఎంసెట్–19 నోటిఫికేషన్ విడుదలై, ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో ఈ ఏడాది నుంచి అమలు కావచ్చని భావించారు. ఈ క్రమంలో ఎంసెట్–20 దరఖాస్తు సమయంలో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ సంఖ్యను కూడా ఆప్షన్‌గా ఇవ్వడంతో ఈసారి తప్పకుండా కోటా అమలవుతుందని అనుకున్నారు. కానీ రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఉత్తర్వులు విడుదల చేయలేదు. మరోవైపు కౌన్సెలింగ్ ప్రక్రియ సైతం ప్రారంభం కావడంతో అగ్రవర్ణ నిరుపేద విద్యార్థులు ఆందోళనలో పడ్డారు. దరఖాస్తు పత్రం క్యాస్ట్ కాలమ్‌లో ఈడబ్ల్యూఎస్‌గా పేర్కొన్నప్పటికీ ప్రస్తుతం ఓసీగా పేర్కొంటూ వివరాలు ప్రత్యక్షమవుతుండడంతో వారికి ఎంచేయాలో తోచని పరిస్థితి నెలకొంది. ఆ లోపు స్పష్టత వస్తే... ఎంసెట్–20 ప్రవేశాల కౌన్సెలింగ్ తొలివిడత శుక్రవారం నుంచి ప్రారంభమైంది. ఈ నెల 17వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్ తదితర ప్రక్రియ కొనసాగుతుంది. అలాగే 18న సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు తెరపడనుంది. ధ్రువపత్రాల పరిశీలన తర్వాత విద్యార్థులు కాలేజీలు, కోర్సులు ఎంచుకుంటూ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. ఇది ఈ నెల 20తో ముగుస్తుంది. అనంతరం 22న సీట్ల కేటాయింపు పూర్తవుతుంది. ప్రస్తుతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై అస్పష్టత ఉన్నప్పటికీ సీట్ల అలాట్మెంట్ నాటికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తే ఆమేరకు రిజర్వేషన్లు వర్తింపజేయవచ్చని విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. -
ఇటు ప్రవేశాలు.. అటు తరగతులు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలు, తరగతుల ప్రారంభం విషయంలో ఇంటర్ బోర్డు విచిత్రమైన షెడ్యూల్ జారీ చేసింది. మొదటి దశ ప్రవేశాలను బుధవారం(16వ తేదీ) నుంచి ప్రారంభిస్తున్నామని, బుధవారమే ప్రకటించిన బోర్డు, 30 వరకు ప్రవేశాలకు అవకాశం ఉన్నా, ఆన్లైన్ తరగతులను శుక్రవారం నుంచే (18వ తేదీ) ప్రారంభిస్తున్నామని ప్రకటించింది. దీంతో ఫస్టియర్ ప్రవేశాలకు కనీసం ఐదారు రోజుల సమయం కూడా ఇవ్వకుండా, విద్యార్థుల చేరికలు మొదలుకాగానే తరగతుల ప్రారంభానికి షెడ్యూల్ ఏంటని అధ్యాపకులే ఆశ్చర్యపోతున్నారు. పైగా ఈ షెడ్యూల్ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, గురుకుల, కేజీబీవీ, మోడల్ స్కూళ్లు అన్నింటికీ వర్తిస్తుందని పేర్కొంది. మొదటిసారిగా ఈడబ్ల్యూఎస్ కోటా మరోవైపు జూన్ 1న కావాల్సిన తరగతులు ఇప్పటికే ఆలస్యం అయినందున నష్టపోయిన పని దినాలను సర్దుబాటు చేసేందుకు ఫస్టియర్‌లో 30 శాతం సిలబస్‌ను తగ్గించేలా బోర్డు చర్యలు చేపట్టింది. రెండో దశ ప్రవేశాల షెడ్యూల్‌ను త్వరలోనే జారీ చేస్తామని పేర్కొంది. ప్రిన్సిపాళ్లు పదో తరగతిలో విద్యార్థుల ఇంటర్నల్ మార్కులతో కేటా యించిన గ్రేడ్ పాయింట్ ఆధారంగా ప్రవేశాలు చేపట్టాలని తెలిపింది. కాలేజీల్లో ఆయా సామాజిక వర్గాల రిజర్వేషన్లతోపాటు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ (ఈడబ్ల్యూఎస్) విద్యార్థులకు 10 శాతం సీట్లను కేటాయించాలని, మొత్తంగా బాలికలకు 33.33 శాతం సీట్లను కేటాయించాలని వివరించింది. ప్రతి సెక్షన్లో 88 మందినే తీసుకోవాలని, ఉల్లంఘిస్తే చర్యలు చేపడతామని హెచ్చరించింది. జోగినీ పిల్లలకు తండ్రి స్థానంలో తల్లి పేరును నమోదు చేయాలని స్పష్టం చేసింది. అనుబంధ గుర్తింపు ఇంకా ఇవ్వలేదు.. రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వలేదు. పైగా ఈ నెల 22 వరకు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకునేందుకు కాలేజీ యాజమాన్యాలకు అవకాశం ఇచ్చింది. ఇప్పుడు అదే బోర్డు బుధవారం నుంచే కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయని, 18 నుంచి తరగతు లు కొనసాగుతాయని ప్రకటించింది. కాలేజీలకు అనుబంధ గుర్తింపే ఇవ్వకుండా ఎలా ప్రవేశాలు చేపడతారన్నది అర్థంకాని ప్రశ్నగా మారింది. పైగా అనుబంధ గుర్తింపు లేని (అఫిలియేషన్) కాలేజీల్లో చేరవద్దని, నష్టపోవద్దని ఇంటర్ బోర్డు ప్రతిసారీ ప్రకటనలు జారీచేస్తుండటం గమనార్హం. దీంతో రాష్ట్రం లోని 1496 ప్రైవేటు కాలేజీల్లో ఏ కాలేజీకి ఇం టర్ బోర్డు అనుబంధ గుర్తింపును ఇస్తుందో.. ఏ కాలేజీకి ఇవ్వదో తెలియదు. 1136 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లకు మాత్రమే అనుబంధ గుర్తింపు ఇచ్చినట్టు మాత్రం తమ వెబ్సైట్లో పేర్కొంది. -
ఎంసెట్ దరఖాస్తులో ‘ఈడబ్ల్యూఎస్’ నంబర్ ఆప్షనల్ మాత్రమే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మా, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఎంసెట్–2020 ఆన్లైన్ దరఖాస్తులో ఎకనమికల్లీ వీకర్ సెక్షన్ (ఈడబ్ల్యూఎస్) కేటగిరీ అభ్యర్థులు ధ్రువపత్రం నంబర్‌ను నమోదు చేయడం తప్పనిసరి కాదని సెట్స్ ప్రత్యేకాధికారి ఎం.సుధీర్‌రెడ్డి సాక్షితో తెలిపారు. - అర్హులైన అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలు తీసుకొని ఉంటే ఆన్లైన్ దరఖాస్తులో ‘ఎస్’ అని టిక్ చేసి నంబర్‌ను నమోదు చేయవచ్చు. - సర్టిఫికెట్లు అందుబాటులో లేని అభ్యర్థులు ‘ఎస్’ అని టిక్ చేస్తే సరిపోతుంది. నంబర్ నమోదు కేవలం ఆప్షన్ మాత్రమే. - ఇటువంటి అభ్యర్థులు అడ్మిషన్ల కౌన్సెలింగ్ సమయంలో తమ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లను పరిశీలనకు చూపించాల్సి ఉంటుంది. - ఈడబ్ల్యూఎస్ కోటాకు చెందిన పలువురు అభ్యర్థుల నుంచి అందిన విన్నపాల మేరకు ఈ మార్పులు చేశాం. - ఎంసెట్‌కు ఇప్పటి వరకు 1,41,491 దరఖాస్తులు అందాయి. వీటిలో 58 వేల దరఖాస్తులు మెడికల్ కాగా తక్కినవి ఇంజనీరింగ్ విభాగానికి అందాయి. -
ఎంసెట్ దరఖాస్తులోనే 'ఈడబ్ల్యూఎస్ కోటా' కాలమ్
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మసీ సహా పలు సాంకేతిక వృత్తి విద్యా కోర్సుల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు 10 శాతం రిజర్వేషన్ల కల్పన ప్రక్రియను వాటి ప్రవేశ దరఖాస్తు స్థాయి నుంచే అమల్లోకి తేవాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. సోమవారం ఉన్నత విద్యామండలిలో వివిధ సెట్ల నిర్వహణ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో ప్రధానంగా ఎంసెట్, ఈసెట్‌లపై చర్చించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ రామ్మోహనరావు, ప్రొఫెసర్ లక్ష్మమ్మ, ఎంసెట్, ఈసెట్‌ల చైర్మన్లు ప్రొఫెసర్ ఎం.రామలింగరాజు, ప్రొఫెసర్ ఎస్.శ్రీనివాసకుమార్, సెట్ల కన్వీనర్లు, ప్రొఫెసర్ రవీంద్ర, ప్రొఫెసర్ భానుమూర్తి, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ ఎంఎం నాయక్, మండలి కార్యదర్శి ప్రేమ్‌కుమార్, సెట్ల ప్రత్యేకాధికారి సుధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లను రాష్ట్రంలో కూడా అమల్లోకి తెస్తూ ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు ఇచ్చింది. గతేడాది ఎంసెట్ తర్వాత ఈ రిజర్వేషన్లు రావడంతో దరఖాస్తులో దాని గురించి ప్రస్తావించలేదు. సీట్ల కేటాయింపు సమయంలో కొంతమేరకు అవకాశం కల్పించారు. ఈసారి దరఖాస్తులోనే ఈడబ్ల్యూఎస్ కోటాకు సంబంధించి అభ్యర్థుల నుంచి సమాచారం తీసుకునేలా కొన్ని కాలమ్‌లను పెట్టాలని నిర్ణయించారు. ఎంసెట్ నోటిఫికేషన్‌ను ఈ నెల 24న విడుదల చేసి 26 నుంచి దరఖాస్తులు స్వీకరించాలని భావిస్తున్నారు. ఇంజనీరింగ్ డిప్లొమా విద్యార్థులకు నిర్వహించే ఈసెట్‌లో ఇక నుంచి అగ్రికల్చరల్ ఇంజనీరింగ్‌ను కూడా చేర్చనున్నారు. నిర్వహణ సంస్థలకు చెల్లింపు మొత్తాల కుదింపు ఎంసెట్ తదితర పరీక్షలకు సంబంధించి ఆయా నిర్వహణ సంస్థలకు గత ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారంగా రుసుములు చెల్లించారు. ఈసారి వాటిని బాగా కుదించారు. గతంలో ఎంసెట్‌కు సంబంధించి ఒక్కో విద్యార్థికి రూ.305 చొప్పున సాఫ్ట్వేర్ సంస్థకు చెల్లించారు. ఈసారి దాన్ని రూ.287కు తగ్గించారు. అలాగే సాఫ్ట్వేర్ సంస్థ.. ఎంసెట్ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపునకు గేట్‌వే ఛార్జీల కింద ఒక్కో విద్యార్థి నుంచి రూ.20 చొప్పున వసూలు చేసేది. ఈసారి దాన్ని కూడా తగ్గించాలని.. గేట్‌వే సేవల కోసం ఆయా బ్యాంకులు ఎంత మొత్తంలో రుసుములు వసూలు చేస్తున్నాయో ఆ మేరకు మాత్రమే ఫీజులు తీసుకోవాలని సాఫ్ట్వేర్ సంస్థకు స్పష్టం చేశారు. వివిధ సెట్ల పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది వరకు హాజరవుతారు. ఈ తగ్గింపు వల్ల అటు మండలిపైనా, ఇటు విద్యార్థులపైనా భారం తగ్గుతుంది. -
‘ఈడబ్ల్యూఎస్ తక్షణమే అమలు చేయాలి’
అంబర్‌పేట: అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ల (ఈడబ్ల్యూఎస్)ను తెలుగు రాష్ట్రాల్లో తక్షణమే అమలు చేయాలని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఈడబ్ల్యూఎస్ తెలుగు రాష్ట్రాల సాధన సమితి ఆధ్వర్యంలో ఓసీ ప్రజలసాధన సదస్సు నిర్వహించారు. కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ప్రవేశపెట్టి ఏడాది పూర్తవుతున్నా తెలుగు రాష్ట్రాల్లో అమలు చేయకపోవడం దారుణమన్నారు. బిల్లు అమలు చేయకపోవడంతో అగ్రవర్ణాల పేదలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈడబ్ల్యూఎస్ అమలు చేయకపోతే రెడ్డి, కమ్మ, వెలమ, క్షత్రియ, వైశ్య, బ్రాహ్మణ తదితర అగ్రవర్ణ కులాల ప్రతినిధులతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అవసరమైతే ఉద్యమిస్తామన్నారు. కార్యక్రమంలో పలు అగ్రకుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఆ కాలేజీలకు ‘ఈడబ్ల్యూఎస్’ షాక్!
సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని చాలా ఇంజనీరింగ్ కాలేజీలపై ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ (ఈడబ్ల్యూఎస్) కోటా ప్రభావం పడనుంది. ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10 శాతం సీట్ల పెరుగుదల సాధారణ కాలేజీలకు నష్టదాయకం కానుండగా, టాప్ కాలేజీలకు మేలు చేకూర్చనుంది. ప్రవేశాల్లో విద్యార్థుల్లో ఎక్కువ శాతం మంది టాప్ కాలేజీలకే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. దీంతో ఈడబ్ల్యూఎస్ కోటాలో టాప్ కాలేజీల్లో సీట్లు పూర్తిగా భర్తీ అయ్యే అవకాశం ఉండగా, సాధారణ కాలేజీల్లో ఆ మేరకు ప్రవేశాల సంఖ్య తగ్గిపోయే ప్రమాదం నెలకొంది. కౌన్సెలింగ్ కసరత్తు షురూ.. రాష్ట్రంలో 2020–21 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ కోటా అమలుకు ఇప్పటికే ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాద నలు పంపించింది. దీనిపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం వెలువడనుంది. ఈ నేపథ్యంలో యాజమాన్యాలు అంచనాల్లో పడ్డాయి. తమ కాలేజీలకు ఉన్న డిమాండ్ ప్రకారం తమకు ఎంత మేలు చేకూరుతుంది.. ఎవరికి నష్టం చేకూరుతుందన్న లెక్కలు వేసుకుంటున్నాయి. మరోవైపు యాజమాన్యాల వారీగా, కోర్సుల వారీగా 10 శాతం సీట్ల పెంపుతో ఎలా కౌన్సెలింగ్ నిర్వహించాలన్న కసరత్తును ప్రవేశాల క్యాంపు కార్యాలయం ప్రారంభించింది. ఆన్లైన్ ప్రోగ్రామింగ్ రూపకల్పనకు చర్యలు చేపట్టింది. 40 నుంచి 50 కాలేజీల్లోనే 100% ప్రవేశాలు రాష్ట్రంలో 205 ఇంజనీరింగ్ కాలేజీలుండగా, గతేడాది కన్వీనర్ కోటాలో 183 కాలేజీల్లోని 65,544 సీట్లలో ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వ హించారు. మరికొన్ని మైనారిటీ కాలేజీల్లో ఆయా యాజమాన్యాలే సొంత ప్రవేశాలను చేపట్టాయి. కన్వీనర్ కోటాలో చేపట్టిన ప్రవేశాల్లో 44 కాలేజీల్లోనే సీట్లు 100% భర్తీ అయ్యాయి. ఒక్క విద్యార్థి చేరని కాలేజీలు 3 ఉండగా, అన్ని బ్రాంచీల్లో కలిపి 10 లోపే ప్రవేశాలు వచ్చిన కాలేజీలు 90కి పైగా ఉన్నాయి. ఒక్కో కాలేజీలో 200 మందికి మించి విద్యార్థులు చేరిన మరికొన్ని కాలేజీల్లోనే 45 వేలకు పైగా సీట్లు ఉన్నాయి. ఆయా కాలేజీల్లోనే 10% ఈడబ్ల్యూఎస్ కోటాలో 4,500కుపైగా సీట్లు పెరుగనున్నాయి. దీంతో విద్యార్థులు కూడా టాప్ కాలేజీల్లో పెరిగిన సీట్లలో చేరేందుకు ఆసక్తి చూపనున్నారు. 100 లోపే ప్రవేశాలు వచ్చిన 90కి పైగా కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ కోటాలో 10% సీట్లు పెరిగినా పెద్దగా ప్రయోజనం ఉండే అవకాశం లేదు. ఎంబీఏ, ఇతర వృత్తి విద్యా కోర్సుల్లోనూ రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ, లా, బీఎడ్, ఇంజనీరింగ్ లేటరల్ ఎంట్రీ (ఈసెట్) వంటి ఇతర సాంకేతిక, వృత్తి విద్యా కోర్సుల్లోనూ ఇదే ప్రభా వం ఉండనుంది. వాటిల్లోనూ టాప్ కాలేజీల్లో పెరిగే సీట్లలోనే విద్యార్థులు చేరేందుకు మొగ్గు చూపనున్నారు. ఇక ఎంబీఏను తీసుకుంటే గతే డాది 276 కాలేజీల్లో 22,434 సీట్లను భర్తీ చేశా రు. అయితే అందులో 184 కాలేజీల్లోనే 100% సీట్లు భర్తీ అయ్యాయి. మరో 92 కాలేజీల్లో 100% సీట్లు భర్తీ కాలేదు. అందులో తక్కువ అడ్మిషన్లున్న కాలేజీలు 65కు పైగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తక్కువ అడ్మిషన్లు ఉన్న కాలేజీలకు సీట్లు పెరిగినా పెద్దగా ప్రయోజనం లేకపోగా, ఎక్కువ డిమాండ్ ఉన్న కాలేజీల్లో పెరిగే సీట్లలో చేరేందుకే సాధారణ కాలేజీల్లో చేరాల్సిన విద్యార్థులే వెళ్లే అవకాశముంది. -
రాష్ట్రంలోనూ 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ (ఈడబ్ల్యూఎస్) కోటా అమలు చేయడానికి ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టింది. ఆయా సంస్థల్లో 10 శాతం సీట్లను పెంచి ఈ కోటాను అమలు చేయాలని నిర్ణయించింది. కేంద్ర విద్యా సంస్థల్లో గతేడాది నుంచి ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేస్తున్న కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్డీ).. వచ్చే విద్యా సంవత్సరం నుంచి (2020–21) అన్ని రాష్ట్రాల్లోని విద్యా సంస్థల్లో ఈ కోటా అమలు చేయాలని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేయడానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ప్రభుత్వ కాలేజీలకు ప్రయోజనం ఈడబ్ల్యూఎస్ కోటా అమల్లోకి వస్తే రాష్ట్రంలోని వృత్తి, సాంకేతిక విద్యా సంస్థల్లో సీట్లు పెరగనున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఇంజనీరింగ్, ఫార్మసీ, బీఈడీ, లా, పీజీ కాలేజీల్లో సీట్లు పెరుగుతాయి. 15 ఏళ్లుగా ఒక్క సీటు కూడా పెరగని ప్రభుత్వ కాలేజీల్లో 10 శాతం సీట్లు కొత్తగా అందుబాటులోకి వస్తే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులకు మరింత ప్రయోజనం చేకూరనుంది. జేఎన్టీయూ, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో 300కు పైగా సీట్లు అదనంగా లభిస్తాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని 14 ఇంజనీరింగ్ కాలేజీల్లో 3,071 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటు కాలేజీల్లోనూభారీ పెరుగుదల కోటా అమలుతో ప్రైవేటు కాలేజీల్లో కూడా భారీగా సీట్లు పెరిగే అవకాశం ఉంది. అయితే ఆ నిబంధనను ప్రైవేటు విద్యా సంస్థల్లో అమలు చేయాలా.. వద్దా అనేది సర్కారు తేల్చాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నత విద్యా కోర్సుల్లో మొత్తం 6,52,178 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అందులో డిగ్రీలోనే 4,43,269 సీట్లు ఉండగా.. వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో 2,08,909 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం డిగ్రీ కోర్సులకు సంబంధించిన సీట్లు సగం కూడా భర్తీ కావడం లేదు. ఈ నేపథ్యంలో డిగ్రీ సీట్ల పెంపు అవసరం లేదని ప్రభుత్వం భావిస్తోంది. ఇక వృత్తి విద్యా కోర్సుల్లో 10 శాతం సీట్లను పెంచితే అదనంగా 20,890 సీట్లు అందుబాటులోకి వస్తాయి. -
జీవో 550పై పిటిషన్లు కొట్టివేత
సాక్షి, అమరావతి: వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించి ప్రతిభావంతులైన రిజర్వుడ్ కేటగిరీ (ఎంఆర్సీ) అభ్యర్థికి కేటాయించిన సీటు ఖాళీ అయితే, ఆ సీటును మరో రిజర్వుడ్ కేటగిరి అభ్యర్థితోనే భర్తీ చేయాలంటూ 2001లో ప్రభుత్వం జారీ చేసిన జీవో 550 అమలు కావడం లేదంటూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. వచ్చే విద్యా సంవత్సరంలో జరిగే ప్రవేశాలు పూర్తి పారదర్శకంగా జరిగేందుకు వీలుగా ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కమిటీలో వైద్య విద్య రంగంలోని ఇద్దరు నిపుణులకు, ఇద్దరు విశ్రాంత ఐఏఎస్ అధికారులకు, ఇద్దరు హైకోర్టు సీనియర్ న్యాయ వాదులకు స్థానం కల్పించాలని సూచిస్తూ న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి, జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. వైద్య విద్య సీట్ల భర్తీలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) ఇస్తున్న 10 శాతం రిజర్వేషన్లు అమలుకు నోచుకోవడం లేదని,ఈ 10 శాతం రిజర్వేషన్లలో 50 శాతం సీట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయిస్తున్నారని పేర్కొంటూ దాఖలైన వ్యాజ్యాలను కూడా ధర్మాసనం కొట్టేసింది. -
‘చంద్రబాబు వల్లే ఈడబ్ల్యూఎస్‌లో కాపులకు నష్టం’
సాక్షి, అమరావతి : చంద్రబాబు నాయుడు నిర్వాహకం వల్ల ఈడబ్ల్యూఎస్ పథకంలో కాపుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని కాపునాడు జాతీయ అధ్యక్షుడు గాళ్ల సుబ్రహ్మణ్యం విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈడబ్ల్యూఎస్ పథకం దేశవ్యాప్త పథకం అయితే చంద్రబాబు అది కేవలం ఏపీకి మాత్రమేనన్న భ్రమలు కల్పించారని మండిపడ్డారు. ఈడబ్ల్యూఎస్‌పై చంద్రబాబు గతంలో తూతూమంత్రంగా జీవో జారీ చేశారని ఆరోపించారు. చంద్రబాబు నిర్వాహకంతో ఈడబ్ల్యూఎస్ పథకంపై స్పష్టత లేక చాలా మంది విద్యార్థులు నష్టపోయారన్నారు. ఈడబ్ల్యూఎస్‌పై వస్తున్న పుకార్లను ఎవరూ నమ్మొద్దని కోరారు. కాపునాడు విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వ జీవోని యధాతదంగా అమలు చేయడం వల్ల అగ్రవర్ణాల్లోని పేద పిల్లలకు పదివేల సీట్లు పెరిగాయని చెప్పారు. దీంతో జనాభాశాతం ఎక్కువగా ఉన్న కాపు విద్యార్థులకు అవకాశాలు పెరుగుతాయని వివరించారు. తన రాజకీయ లబ్ధి కోసమే కాపులను చంద్రబాబు తప్పుదారి పట్టించారని ఆరోపించారు. -
‘ఈడబ్ల్యూఎస్’కు నేడు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులు ఎంబీబీఎస్ లాంటి ఉన్నత చదువులు చదవాలనే కోరిక ఎట్టకేలకు ఫలించింది. కేంద్రం ప్రవేశపెట్టిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ (ఎకనామికల్లీ వీకర్ సెక్షన్) కోటా కింద వైద్య సీట్ల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌లో మార్గం సుగమమైంది. ఈ మేరకు కాలేజీల్లో ప్రవేశాలకు అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. దీంతో ఈడబ్ల్యూఎస్ కింద రాష్ట్రానికి పెరిగిన 360 ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం కసరత్తు ప్రారంభించింది. ఈ నెల 29న (సోమవారం) నోటిఫికేషన్ జారీ చేయనుంది. వారం రోజుల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తారు. సాధారణంగా రిజర్వేషన్ పరిధిలో ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ తదితర వర్గాలకు ఈ సీట్లు వర్తించవు. కేవలం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికోసమే ఈ సీట్లు కేటాయిస్తారు. కేంద్రం నిర్ణయించిన మార్గదర్శకాల ప్రకారం తహసీల్దార్ కార్యాలయాల నుంచి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ కచ్చితంగా పొంది ఉంటేనే సీటుకు అర్హులవుతారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పెద్ద వరం.. ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఒక్కసారిగా రాష్ట్రంలో 360 సీట్లు పెరగడం సాధారణ విషయం కాదని, ఇది నిజంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పెద్ద వరమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం 11 ప్రభుత్వ వైద్య కళాశాలలుండగా, అందులో 10 కాలేజీలకు సీట్లు పెరిగాయి. ఆంధ్రా మెడికల్ కళాశాల, గుంటూరు మెడికల్ కళాశాల, రంగరాయ మెడికల్ కళాశాల, కర్నూలు మెడికల్ కాలేజీల్లో అత్యధికంగా 50 చొప్పున సీట్లు పెరిగాయి. ఈ సీట్లకు ఇప్పటికే భారతీయ వైద్య మండలి అనుమతి కూడా లభించింది. ఇదివరకే 14 వేల మంది మొత్తం అభ్యర్థులు ఈ ఏడాది సీట్లకు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే ఎవరైనా ఆర్థికంగా వెనుకబడిన వర్గానికి చెందిన విద్యార్థులు సాధారణ మెడికల్ కాలేజీలలో ఓపెన్ కేటగిరీ కింద సీటు తీసుకుని ఉన్నా సరే మంచి కాలేజీకి మారవచ్చు. ఇందుకోసం ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు మళ్లీ ఆప్షన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎంబీబీఎస్ సీటు తృటిలో అవకాశం కోల్పోయిన చాలా మంది విద్యార్థులకు ఇప్పుడు సీటు దక్కే అవకాశం ఉంటుంది. వారం రోజుల్లో భర్తీ ప్రక్రియ పూర్తి ప్రభుత్వం నుంచి ఈడబ్ల్యూఎస్ సీట్ల భర్తీకి ఉత్తర్వులు వెలువడ్డాయి. సోమవారం నోటిఫికేషన్ ఇస్తున్నాం. ఈ ప్రక్రియ మొత్తం వారం రోజుల్లో పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నాం. ఈ కోటాలో ఉన్న సీట్లను వారితోనే భర్తీ చేస్తాం. అత్యంత పారదర్శకంగా కౌన్సిలింగ్ నిర్వహిస్తాం. – డా. సీవీ రావు, వైస్ చాన్సలర్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ -
ఫస్ట్ ప్రైవేటుకా?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీ పూర్తికాకముందే ప్రైవేటు కాలేజీల్లోని బీ, సీ కేటగిరీ సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తుండటంపై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా ప్రభుత్వ కాలేజీల్లో సీట్ల భర్తీ అయిపోయాకగానీ ప్రైవేటు సీట్ల వైపు విద్యార్థులు వెళ్లరు. ఇంకా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మూడో విడత, ఆ తర్వాత నాలుగో విడత కౌన్సెలింగ్‌లు నిర్వహించాల్సి ఉంది. పైగా జాతీయస్థాయిలో నీట్ రెండో విడత కౌన్సెలింగ్ తర్వాత, నేషనల్ పూల్‌కు రాష్ట్రం నుంచి ఇచ్చిన 15 శాతం సీట్లల్లో భర్తీ కాకుండా మిగిలే సీట్లను తిరిగి వెనక్కి ఇచ్చేస్తారు. వాటిని కూడా మూడో విడత కన్వీనర్ కోటా సీట్లతోపాటు భర్తీ చేస్తారు. అగ్రవర్ణ పేదల (ఈడబ్ల్యూఎస్) కోటాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మరో 190 సీట్లు, ఎన్సీసీ సీట్లు ఉన్నాయి. వాటన్నింటికీ మూడో విడత కన్వీనర్ కోటా కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తారు. ఇవన్నీ ఉండగా.. వాటి కౌన్సెలింగ్ పూర్తికాకముందే ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని బీ, సీ కేటగిరీ మేనేజ్మెంట్ సీట్లను నింపడం కోసం ముందస్తుగానే కౌన్సెలింగ్ నిర్వహించడంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటివరకు కన్వీనర్ కోటాలో రెండో విడత కౌన్సెలింగ్ మాత్రమే పూర్తయింది. రెండో విడతలో సీట్లు వచ్చిన విద్యార్థులు ఈ నెల 24 లోగా కాలేజీల్లో చేరాల్సి ఉంది. మూడో విడత ఆగస్టు తొలి వారంలో ప్రారంభం కానుంది. అయితే ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని బీ, సీ కేటగిరీలకు ఈ నెల 25 నుంచి 28 వరకు కౌన్సెలింగ్ తేదీలు ప్రకటించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నష్టపోతామని ఆందోళన.. మూడో విడతలో సీటు వస్తుందన్న ఆశ ఉన్నప్పటికీ, ఏదో భయంతో బీ, సీ కేటగిరీ కౌన్సెలింగ్‌కు విద్యార్థులు హాజరుకాక తప్పని పరిస్థితి. ఒకవేళ అందులో సీటు వస్తే చేరాలా? వద్దా? ఒకవేళ చేరితే కన్వీనర్ కోటాలో మూడో విడత కౌన్సెలింగ్‌లో ప్రభుత్వ సీటు వస్తే ఏమవుతుందనేది అందరినీ తొలుస్తున్న ప్రశ్న. ఏ కేటగిరీలో ప్రభుత్వ కాలేజీలో రూ.10 వేలు, ప్రైవేట్ కాలేజీల్లో రూ.60 వేలుగా ఫీజు ఉంది. అదే బీ కేటగిరీ అయితే ఏడాదికి రూ.12 లక్షలు, సీ కేటగిరీకి రూ.24 లక్షలకు పైగా ఫీజు చెల్లించాల్సి ఉంది. బీ కేటగిరీ కౌన్సెలింగ్‌కు హాజరుకావాలంటే రూ.40 వేలు డీడీనీ యూనివర్సిటీ ఫీజు కింద చెల్లించాలి. సీటు వచ్చిందంటే రూ.12 లక్షలు కాలేజీ ఫీజు, రెండో ఏడాదికి మరో రూ.12 లక్షల గ్యారంటీతో ఆగస్టు రెండో తేదీలోపు ఆయా ప్రైవేటు మెడికల్ కాలేజీలో చేరాలి. అప్పటివరకు ఏ కేటగిరీ మూడో విడత కౌన్సెలింగ్ జరగదు. ఒకవేళ బీ కేటగిరీలో చేరిన తర్వాత ఏ కేటగిరీలో సీటు వస్తే రూ.40 వేలు, కాలేజీకి సంబంధించిన ఇతరత్రా ఫీజులు దాదాపు రూ.50 వేలు వదులుకోవాల్సిందే. అలా అని వదిలేస్తే సీటు పోతుందేమోనని భయం. ఎటూ తేల్చుకోలేక తల్లిదండ్రులు మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. ఒకవేళ వదులుకోవాలని ప్రయత్నిస్తే కొన్ని ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఇబ్బంది పెట్టే అవకాశముంది. పైపెచ్చు బీ, సీ కేటగిరీ సీట్లకు డబ్బులు సమకూర్చుకోవడం, చెల్లించడం, బ్యాంకు గ్యారంటీ చూపడం తప్పదు. ఇదంతా కూడా మధ్యతరగతి ప్రజలకు అత్యంత భారం కానుంది. దీనిపై కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ అధికారులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. బీ, సీ కేటగిరీ సీట్లు నింపకపోతే సమస్య.. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి మెడికల్ కాలేజీ తరగతులు ప్రారంభించాలి. ఇది తప్పనిసరిగా చేపట్టాల్సిన ప్రక్రియ. అప్పటివరకు బీ, సీ కేటగిరీ సీట్లను భర్తీ చేయకపోతే ఏకంగా ప్రైవేటు కాలేజీల్లో 50 శాతం సీట్లు నిండే అవకాశం ఉండదు. అంత తక్కువతో కాలేజీలను ఎలా ప్రారంభించగలం? కన్వీనర్ కోటాలో సీటు వస్తుందా? రాదా? అన్నది విద్యార్థులు వారివారి ర్యాంకులను బట్టి అంచనాకు వచ్చే అవకాశముంది. ఆ ప్రకారం కన్వీనర్ కోటాలో వచ్చేట్లయితే బీ, సీ కేటగిరీలో చేరకుండా ఉండాలి. అంచనా వేయలేని పరిస్థితుల్లో బీ కేటగిరీలో చేరి.. మూడో దశ కౌన్సెలింగ్‌లో కన్వీనర్ కోటా సీటు వస్తే చెల్లించిన డొనేషన్‌ను ప్రైవేటు కాలేజీలు తిరిగి వెనక్కి ఇస్తాయి. అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. –డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, వీసీ, కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ -
ఈడబ్ల్యూఎస్ మెడికల్ సీట్లకు కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అగ్రవర్ణ పేదలకు కేటాయించిన సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం నిర్ణయించింది. మూడో విడత కన్వీనర్ కోటా సీట్లతోపాటే వీటికి కౌన్సెలింగ్ నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో ఇన్నాళ్లుగా అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ల అమలుపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడిందని ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు చెబుతున్నాయి. వాస్తవంగా ప్రభుత్వంలోని సీట్లు, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లకు మొదటి విడత కౌన్సెలింగ్‌తోపాటే అగ్రవర్ణ పేదల (ఈడబ్ల్యూఎస్)కు రిజర్వేషన్ అమలుచేయాల్సి ఉంది. ఆ మేరకు ఏర్పాట్లు కూడా జరిగాయి. అప్పటికే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ కోటా కింద మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) 190 సీట్లు అదనంగా కేటాయించింది. అంతలోనే ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లకు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని, ఆ మేరకు సంబంధిత కాలేజీలు అదనపు సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎంసీఐ ఆదేశించింది. దీంతో రాష్ట్రంలో 10 ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఈడబ్ల్యూఎస్ సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. కాలం గడుస్తున్నా ప్రైవేటు కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లపై ఎంసీఐ స్పష్టత ఇవ్వలేదు. అయితే అప్పటికే వైద్య విద్య ప్రవేశాల గడువు ఆలస్యమైంది. అందువల్ల ప్రభుత్వంలోని ఈడబ్ల్యూఎస్ సీట్లను కూడా పక్కనపెట్టి, మిగిలిన కన్వీనర్ కోటా సీట్లకు ఆరోగ్య విశ్వవిద్యాలయం కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టింది. ఇప్పటికే రెండు విడతల కౌన్సెలింగ్ పూర్తయింది. ఇప్పుడు ప్రైవేటు మేనేజ్మెంట్ కోటా సీట్లకు కౌన్సెలింగ్ ప్రక్రియ నడుస్తోంది. ఇంత జరిగినా ఎంసీఐ నుంచి ప్రైవేటు మెడికల్ సీట్లలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు, సీట్ల కేటాయింపుపై స్పష్టత రాలేదు. వస్తాయన్న నమ్మకం లేకపోయినా ఎందుకైనా మంచిదని ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇప్పటివరకు వేచిచూసింది. అయితే తాజాగా శుక్రవారం శాసనమండలిలో సభ్యులు ఈడబ్ల్యూఎస్ కోటాపై ప్రశ్న సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు ఎంసీఐ అదనపు సీట్లకు అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 190 సీట్లకు మూడో విడత కన్వీనర్ కోటా సీట్లతో కలిపి కౌన్సిలింగ్ నిర్వహించాలని నిర్ణయించినట్లు విశ్వవిద్యాలయం వర్గాలు తెలిపాయి. ఆగస్టు మొదటి వారంలో వీటికి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని విశ్వవిద్యాలయానికి చెందిన ఒక ఉన్నతాధికారి తెలిపారు. -
జీవో 5 ప్రకారమే ఏపీపీఎస్సీ ఎంపికలు
సాక్షి, అమరావతి: వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించే పలు పోటీ పరీక్షలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియను జీవో 5 ప్రకారమే చేపట్టాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. దీని ప్రకారం ఆయా పోస్టులకు ప్రిలిమ్స్ పరీక్ష నుంచి మెయిన్స్‌కు ముందుగా కటాఫ్ మార్కులు నిర్ణయించి.. అనంతరం 1:12, లేదా 1:15 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపికచేయనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన నోటిఫికేషన్లలో జీవో 5ను ప్రస్తావిస్తూ.. దాని ప్రకారమే ఎంపికలుంటాయని పొందుపరిచినందున ఆ దిశగానే ముందుకెళ్లాలని భావిస్తున్నారు. తాజాగా కమిషన్ తీసుకుంటున్న ఈ నిర్ణయం నిరుద్యోగులను తీవ్ర నిరాశానిస్పృహలకు గురిచేస్తోంది. సీఎస్‌తో ఏపీపీఎస్సీ చైర్మన్ భేటీ ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు 1:50 (అంటే ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున) నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని కొంతకాలంగా నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఏపీపీఎస్సీకి, ప్రభుత్వానికి కూడా పలుమార్లు వినతిపత్రాలిచ్చారు. ఏపీపీఎస్సీ ఈ అంశంపై ఏమీ తేల్చకపోవడంతో గ్రూప్–3, గ్రూప్–2, గ్రూప్–1 పోస్టులకు ప్రిలిమ్స్‌ను నిర్వహించినా వాటి ఫలితాలు వెల్లడికాలేదు. మెయిన్స్‌కు 1:12, లేదా 1:15 ప్రకారం కాకుండా.. 1:50 నిష్పత్తిలో ఎంపికలు చేస్తారన్న ఆశతో నిరుద్యోగులు ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వం 1:50 నిష్పత్తిలో ఎంపికలు చేయాలని కొత్తగా జీవో ఇస్తే ఆ ప్రకారమే చేస్తామని ఏపీపీఎస్సీ కొంతకాలంగా చెబుతుండటంతో నిరుద్యోగులు ప్రభుత్వానికి ఇదివరకే దీనిపై మొరపెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఎంపికల తీరుపై ప్రభుత్వం ఏపీపీఎస్సీని వివరాలడగడంతో.. ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ పిన్నమనేని ఉదయభాస్కర్ శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంతో భేటీ అయ్యారు. గ్రూప్ పరీక్షల ఫలితాల వెల్లడిలో ఏర్పడిన ప్రతిష్టంభనపై ప్రభుత్వానికి వివరించారు. 1:50 నిష్పత్తిలో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు ఎంపికచేయడం వల్ల అభ్యర్థుల సంఖ్య వేలాదిగా పెరిగి ఆన్లైన్ పరీక్షల నిర్వహణ కష్టమవుతుందని పేర్కొన్నారు. గతంలో 1:50 నిష్పత్తిలో ఎంపికలు చేయాలని ప్రభుత్వం జీవో ఇచ్చిందని.. ఆ తర్వాత పరీక్షల నిర్వహణలో యూపీఎస్సీ విధానాన్ని అనుసరించి 1:12, లేదా 1:15 నిష్పత్తిని పాటిస్తామని ప్రభుత్వానికి లేఖ రాసినట్టు తెలిపారు. దాని ఆధారంగా ప్రభుత్వం జీవో 5 ద్వారా ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపిక అధికారాన్ని ఏపీపీఎస్సీకి ఇచ్చినట్టు చెప్పారు. ఈ జీవో ద్వారా గ్రూప్ నోటిఫికేషన్లలో ఎంపికలుంటాయని పేర్కొన్నామని, దీన్ని మార్పు చేస్తే న్యాయపరంగా ఇబ్బందులొచ్చే ప్రమాదముందని చెప్పినట్టు తెలిసింది. నోటిఫికేషన్లలో జీవోను ప్రస్తావించినందున ఆ ప్రకారమే ముందుకెళ్తామని పేర్కొనడంతో.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా అందుకు సమ్మతించినట్లు కమిషన్ వర్గాలు చెబుతున్నాయి. గ్రూప్–3, గ్రూప్–2, గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షల్లో ముందుగా కటాఫ్ నిర్ణయించాక నిర్ణీత నిష్పత్తిలో ఆయా కేటగిరీలవారీగా అభ్యర్థులను ఎంపిక చేస్తామని భేటీ అనంతరం ప్రొఫెసర్ పి.ఉదయభాస్కర్ ‘సాక్షి’కి వివరించారు. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో ఎంపికలు చేయాలని నిరుద్యోగులు కోరుతున్న విషయాన్ని గుర్తుచేయగా.. అందుకు అవకాశం లేదన్నారు. జీవో 5ను రద్దుచేసి 1:50 నిష్పత్తిలో ఎంపికలు చేయాలని ప్రభుత్వం కొత్తగా జీవో ఇస్తే.. రానున్న నోటిఫికేషన్లలో అమలు చేస్తామని వివరించారు. ఈడబ్ల్యూఎస్ కోటాపై తేలితే మరో 9 నోటిఫికేషన్లు ఎకనమికల్లీ వీకర్ సెక్షన్ (ఈడబ్ల్యూఎస్) కేటగిరీకి పదిశాతం కోటా అమలుపై ప్రభుత్వం నుంచి నిర్దిష్ట ఉత్తర్వులొస్తే.. పెండింగ్‌లో ఉన్న 9 నోటిఫికేషన్లను విడుదల చేస్తామని చైర్మన్ చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఈ అంశాన్ని ప్రస్తావించామని, త్వరలోనే ఉత్తర్వులిస్తామన్నారని తెలిపారు. మహిళా రిజర్వేషన్లకు సంబంధించి హారిజాంటల్ (సమాంతరం)గా అమలు చేయడంపై కూడా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉందన్నారు. కమిషన్‌లో భర్తీచేయాల్సిన పోస్టులపై కూడా ప్రధాన కార్యదర్శికి వివరించినట్టు చెప్పారు. దాదాపు 200 మంది సిబ్బంది ఉండేలా కమిషన్‌లో పోస్టులు భర్తీ కావాల్సి ఉందని.. ముఖ్యంగా సీనియర్ అసిస్టెంట్ పోస్టులు 57కుగాను ఇద్దరే ఉన్నట్లు చెప్పారు. అలాగే ఏపీపీఎస్సీ బడ్జెట్‌ను రూ.90 కోట్లు చేయాలని కోరినట్టు ఉదయభాస్కర్ వివరించారు. -
ఈడబ్ల్యూఎస్ కోటాపై నీలినీడలు!
సాక్షి, హైదరాబాద్ : ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో నీలినీడలు అలుముకున్నాయి. వాటిల్లోని కన్వీనర్ కోటా సీట్లకు నోటిఫికేషన్ విడుదలై కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలైనా ఇప్పటికీ అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల ప్రకారం సీట్ల పెంపుపై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిర్ణయం ప్రకటించలేదు. దీంతో అసలు సీట్ల పెంపు జరుగుతుందా? లేదా? అన్న సంశయం విద్యార్థుల్లో నెలకొంది. గత నెల చివరి వారంలో ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్లల్లో అగ్రవర్ణ పేదల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, ఆ మేరకు సీట్లు పెంచుతామని ఎంసీఐ ప్రకటించింది. అందుకోసం ఆయా కాలేజీలు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీంతో రాష్ట్రంలో పది ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఈడబ్ల్యూఎస్ కోటా అమలుకు ముందుకు వచ్చాయి. సీట్లు పెంచాలని ఎంసీఐకి దరఖాస్తు చేసుకున్నాయి. ప్రతిపాదనల దరఖాస్తులను ఎంసీఐకి రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు పంపాయి. మొత్తం 15 ప్రైవేటు మెడికల్ కాలేజీలకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉండగా, 10 మాత్రమే ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. దరఖాస్తు చేసుకున్న రెండు మూడు రోజుల్లోనే సీట్ల పెంపుపై ఎంసీఐ నిర్ణయం ప్రకటిస్తుందని అందరూ ఎదురుచూశారు. కానీ వారం రోజులు దాటినా ఇప్పటికీ పెంపుపై ఎంసీఐ ఎలాంటి ప్రకటనా రాలేదు. ఈసారి ప్రైవేటులోని కన్వీనర్ కోటా సీట్లల్లో ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లను ఎంసీఐ ప్రకటించే అవకాశాలు కనిపించడం లేదని వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ) కార్యాలయ అధికారులు అంటున్నారు. మొదలైన కన్వీనర్ సీట్ల కౌన్సెలింగ్ ప్రక్రియ.. ఈడబ్ల్యూఎస్ సీట్ల కోసం దరఖాస్తు చేసిన 10 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్లు 750 ఉన్నాయి. వాటికి పది శాతం రిజర్వేషన్ల అమలుకు సీట్లు పెంచాల్సి ఉంది. ఈ మేరకు 188 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా ఈడబ్ల్యూఎస్ అమలుకు ఎంసీఐ పెంచుతుందని భావించారు. కానీ ఆ సీట్లు వచ్చే అవకాశాలు కనిపించడం లేదని అధికారులే అంటుండటంతో విద్యార్థుల్లో నిరాశ అలముకుంది. మరోవైపు ఇటీవల తెలంగాణలో ఆరు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో నాలుగు కాలేజీలకు 25 శాతానికి బదులు 20 శాతం చొప్పున మాత్రమే ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లు పెంచింది. ఆ ప్రకారం కేవలం 190 సీట్లు మాత్రమే పెంచింది. తక్కువ పెంచడంపై విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ప్రైవేటు మెడికల్ కాలేజీల విషయంలో ఎంసీఐ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కన్వీనర్ కోటా సీట్లకు కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలైంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ పూర్తయింది. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం జాబితాను కూడా ప్రకటించింది. ఆదివారం నుంచి ఈ నెల 10 వరకు వెబ్ కౌన్సెలింగ్ జరగనుంది. కన్వీనర్ కోటా సీట్లంటే ప్రభుత్వ మెడికల్ సీట్లకు, ప్రైవేటులోని కన్వీనర్ కోటా సీట్లకు ఈ వెబ్ కౌన్సెలింగ్ జరుగుతుంది. ఇంత జరుగుతున్నా ఎంసీఐ నుంచి ఈడబ్ల్యూఎస్ సీట్ల పెంపుపై ఆదేశాలు జారీకాలేదు. ఇంకా ఆయా సీట్లపై ఆశలు పెట్టుకున్న ఆరోగ్య విశ్వవిద్యాలయం ఈడబ్ల్యూఎస్ కోటా కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సంబంధించి వెబ్ ఆప్షన్లకు మరో నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించింది. మరోవైపు ఇప్పటికే జాతీయస్థాయిలో అఖిల భారత కోటా సీట్లకు మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తయింది. రెండో విడత మొదలుకానుంది. ఎక్కడికక్కడ కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగుతుంటే, ఈడబ్ల్యూఎస్ సీట్లపై ఎంసీఐ నిర్ణయం తీసుకోకపోవడం, ఏదో ఒక విషయం స్పష్టంగా చెప్పకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. -
వైద్య విద్య కౌన్సెలింగ్‌లో గందరగోళం
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత కోటా సీట్లకు జరుగుతున్న నీట్–2019 కౌన్సెలింగ్‌లో గందర గోళం నెలకొంది. మొదటి కౌన్సెలింగ్‌లో సీట్లు సాధించిన విద్యార్థుల మెరిట్ జాబితాను ఉప సంహరించుకోవడంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఎట్టకేలకు సవరించిన జాబితాను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) మంగళవారం రాత్రి విడుదల చేసింది. అయితే ఎందుకు రద్దు చేశారన్న దానిపై స్పష్టతివ్వలేదు. దీనిపై తెలంగాణలోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ వర్గాలూ ఏమీ చెప్పడం లేదు. సవరించిన జాబితాను వెబ్సైట్ ఝఛిఛి.nజీఛి.జీnలో చూడ వచ్చు. మొదటి మెరిట్ జాబితా ఉపసంహరించుకోవటానికి గల కారణం స్పష్టం చేయకపోవడంపై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం నుంచి సవరించిన జాబితాలో పేరున్న అభ్యర్థులు తమ కేటాయింపు లేఖను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. టాప్–20లో 18 మంది అక్కడే.. నీట్లో టాప్–20 ర్యాంకులు సాధించిన వారిలో 18 మంది ఢిల్లీలోని మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీని ఎంచుకున్నట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ వర్గాలు వెల్లడించాయి. మహిళల్లో జాతీయ ఫస్ట్ ర్యాంకు సాధించిన మాధురీరెడ్డి జాతీయస్థాయిలో ప్రముఖ మెడికల్ కాలేజీనే ఎంచుకున్నట్లు వర్సిటీ వర్గాలు చెబుతున్నా యి. అఖిల భారత కోటా కింద తెలంగాణలో ఏ కాలేజీని.. ఎవరెవరు ఎంచుకున్నారన్న సమాచారం తమ వద్ద లేదని వారంటున్నారు. ఈడబ్ల్యూఎస్ కోటాపై అస్పష్టత.. రాష్ట్రంలోనూ వైద్య విద్య కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగుతోంది. ఇప్పటికే కన్వీనర్, మేనేజ్మెంట్ కోటా సీట్లకు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. కన్వీనర్ కోటా సీట్లకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయింది. అయితే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని సీట్లకు మాత్రం అగ్రవర్ణ పేదల (ఈడబ్ల్యూఎస్)కు రిజర్వేషన్లను అమలు చేసేందుకు 190 సీట్లను అదనంగా కేంద్రం కేటాయించిన సంగతి తెలిసిందే. అందులో ఎవరికీ సందేహాలు లేవు. కానీ ప్రైవేటులోని కన్వీనర్ కోటా సీట్లలోనూ ఈడబ్ల్యూఎస్‌ను అమలు చేస్తామని కేంద్రం తెలిపింది. అందుకోసం దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆ మేరకు గత నెల 28వ తేదీ వరకు గడువు విధించింది. అందుకోసం రాష్ట్రంలోని 10 ప్రైవేటు మెడికల్ కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. కానీ ఇప్పటివరకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) సీట్ల పెంపుపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే కన్వీనర్ కోటా సీట్లకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయింది. అంటే ప్రైవేటులోని కన్వీనర్ కోటా సీట్లకు మరి ఎప్పుడు ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లు కేటాయిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. సకాలంలో సీట్లు కేటాయించకుంటే పరిస్థితి ఏంటనేది కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్న కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీని, అలాగే అదనపు సీట్ల కోసం ఎదురుచూస్తున్న ఆ 10 ప్రైవేటు మెడికల్ కాలేజీలను వేధిస్తుంది. -
మెడికల్ కౌన్సెలింగ్ షెడ్యూల్లో మార్పు
సాక్షి, హైదరాబాద్: నీట్ ర్యాంకుల ఆధారంగా అఖిల భారత స్థాయిలో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల ప్రవేశాలకు జరిగే కౌన్సెలింగ్ షెడ్యూల్లో కొద్దిపాటి మార్పులు చేశారు. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం గురువారమే తొలి విడత సీట్ల కేటాయింపు వివరాల్ని వెల్లడించాల్సి ఉండగా, జూలై ఒకటో తేదీకి మార్చారు. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లలో అగ్రవర్ణ పేదల (ఈడబ్ల్యూఎస్)కు రిజర్వేషన్ల అమలు, అలాగే ఆయా కాలేజీల్లోని 15 శాతం సీట్లను అఖిల భారత కోటాలో కలపాల్సి ఉన్న నేపథ్యంలో షెడ్యూల్లో మార్పులు చేశారు. పైగా ఈడబ్ల్యూఎస్ సీట్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రైవేటు కాలేజీలకు 28 వరకూ గడువిచ్చారు. దీంతో 28వ తర్వాతే నేషనల్ కోటా సీట్ల లెక్క తెలిసే అవకాశముంది. ఈ నేపథ్యంలో తొలి విడత సీట్ల కేటాయింపు తేదీని జూలై ఒకటో తేదీకి మార్చాల్సి వచ్చింది. సీట్లు పొందిన విద్యార్థులు ఒకటో తేదీ నుంచి 6వ తేదీ వరకూ సంబంధిత కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక రెండో విడత నీట్ కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ వచ్చే నెల 9న ప్రారంభమై 11వ తేదీతో ముగుస్తుంది. రెండో విడత కౌన్సెలింగ్ కోసం ఛాయిస్ లాకింగ్ సౌకర్యం 12వ తేదీ మధ్యాహ్నం 3 తర్వాత అందుబాటులో ఉంటుంది. 13 నుండి 15వ తేదీ వరకు సీట్ల కేటాయింపు ప్రక్రియ జరుగుతుంది. రెండో విడత కౌన్సెలింగ్ కోసం సీట్ల కేటాయింపు జాబితాను 15వ తేదీన విడుదల చేస్తారు. రెండో విడత కేటాయింపు జాబితా ఆధారంగా ప్రవేశ ప్రక్రియ 15 నుండి 22వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఇక రెండో విడత కౌన్సెలింగ్ తర్వాత ఖాళీగా ఉన్న సీట్లను 23వ తేదీన ఆయా రాష్ట్రాల కోటాకు బదిలీ చేస్తారు. ఈ అఖిల భారత కోటా సీట్ల కోసం రాష్ట్రస్థాయిలో అధికారులు కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు ప్రక్రియ నిర్వహిస్తారు. రాష్ట్రస్థాయి కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత కూడా ఈ సీట్లు ఖాళీగా ఉంటే, అటువంటి సీట్ల కోసం మోప్–అప్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఇదిలావుండగా రాష్ట్రంలో కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శనివారం నుంచి కన్వీనర్ కోటా సీట్లకు సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ ప్రారంభమైంది. -
ప్రైవేటు వైద్యవిద్యలోనూ ఈడబ్ల్యూఎస్
సాక్షి, హైదరాబాద్: అగ్రవర్ణ పేద (ఈడబ్ల్యూఎస్) విద్యార్థులకు శుభవార్త. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్లలో ఈడబ్ల్యూఎస్ కోటా ప్రకారం 10% రిజర్వేషన్లు అమలు చేయాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖకు బుధవారం లేఖ రాసింది. దీనికోసం ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఈ నెల 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని, ఆ దరఖాస్తులను వైద్య ఆరోగ్యశాఖ ద్వారా పంపించాలని ఆదేశించింది. అయితే నీట్ ర్యాంకుల ద్వారా దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 15% సీట్లను ఆలిండియా కోటాలో కేంద్రం భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రైవేటు మెడికల్ కాలేజీలు కూడా తమ కన్వీనర్ కోటాలోని ఎంబీబీఎస్ సీట్లలో 15% ఆలిండియా కోటాకు ఇవ్వాలని, అప్పుడే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు అనుమతి ఇస్తామని స్పష్టం చేసింది. ఇదిలావుండగా తెలంగాణలోని కొన్ని ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఈడబ్ల్యూఎస్ కోటా ప్రకారం 10% రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించుకుని ఈ మేరకు అనుమతి ఇవ్వాలని కోరుతూ గతంలోనే ఎంసీఐకి దరఖాస్తు చేసుకున్నాయి. అయితే అప్పట్లో దీనిపై ఎంసీఐ నిర్ణయం తీసుకోలేదు. దీంతో తాజాగా మరోసారి ఆయా ప్రైవేటు మెడికల్ కాలేజీలతోపాటు ఇతర ప్రైవేటు మెడికల్ కాలేజీలు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కోటాలో పెరగనున్న 281 సీట్లు తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 2019–20 విద్యాసంవత్సరానికి మొత్తంగా 4,600 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈఎస్ఐ మెడికల్ కాలేజీతో కలిపి 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,500 ఎంబీబీఎస్ సీట్లు, 21 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 3,100 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. అందులో 6 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఇటీవల ఎంసీఐ అదనంగా 190 ఎంబీబీఎస్ సీట్లను పెంచింది. ఇక 21 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 4 మైనారిటీ కాలేజీలకు, 2 కొత్త మెడికల్ కాలేజీలకు ఈ కోటా వర్తించదని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు చెబుతున్నాయి. అంటే అవి పోగా 15 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో మొత్తం 2,250 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. అందులో సగం అంటే 1125 కన్వీనర్ కోటా సీట్లున్నాయి. వాటిని ఆధారం చేసుకొని 25% సీట్లను ఈడబ్ల్యూఎస్ కోటా కింద పెంచాల్సి ఉంటుంది. అంటే 281 ఎంబీబీఎస్ సీట్లు పెరిగే అవకాశముంది. అయితే వీటికోసం ఎన్ని కాలేజీలు దరఖాస్తు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే. అయితే ఇప్పటికే కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం కన్వీనర్ కోటా సీట్లకు నోటిఫికేషన్ జారీచేసింది. ఆ సీట్లకు దరఖాస్తు చేసుకునే గడువు ఈ నెల 28వ తేదీన ముగుస్తుంది. కాబట్టి ఈడబ్ల్యూఎస్ కోటా అమలు ఎలాగన్నదానిపై చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటికే 11 వేల మంది విద్యార్థులు కన్వీనర్ కోటా సీట్లకు దరఖాస్తు చేసుకున్నారని, వారిలో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లు ఉన్నవారు సహజంగానే ప్రైవేటులో వచ్చే ఈ కోటా సీట్లకు అర్హులేనని విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి స్పష్టంచేశారు. నోటిఫికేషన్లలోనూ ఆ మేరకు వెసులుబాటుందన్నారు. ముందుకొచ్చే కాలేజీలెన్ని? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకోసం అసలు ఎన్ని ప్రైవేటు మెడికల్ కాలేజీలు ముందుకు వస్తాయన్నదే అసలైన ప్రశ్న. ఒకవైపు ఆలిండియా కోటాకు 15% సీట్లు ఇవ్వాలన్న షరతు, పైపెచ్చు కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్లకు ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఫీజు ఏడాదికి రూ.60వేలు మాత్రమే కావడంతో తమకేంలాభమన్న వాదన ప్రైవేటు యాజమాన్యాల్లో వినిపిస్తున్నాయి. ఉదాహరణకు ఒక కాలేజీకి ఈడబ్ల్యూఎస్ కోటా కింద 25 సీట్లు పెరిగితే వచ్చే ఫీజు ఏడాదికి రూ.15 లక్షలు మాత్రమే. అందుకోసం సీట్లు పెంచుకుని లాభమేంటని వారంటున్నారు. అయితే అదనంగా సీట్లు పెరగడం వల్ల అదే స్థాయిలో పీజీ మెడికల్ సీట్లు కూడా పెరుగుతాయని, కాబట్టి అది ఆయా యాజమాన్యాలకు ప్రయోజనకరంగా ఉంటుం దని వైద్యాధికారులంటున్నారు. ఈ రెండు అంశాలను బేరీజు వేసుకొని ప్రైవేటు మెడికల్ కాలేజీలు ముందుకు వెళ్లే అవకాశముందని వైద్య ఆరోగ్యశాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. -
ఈడబ్ల్యూఎస్ కోటాలో వివక్ష!
సాక్షి, హైదరాబాద్: అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్ల అమలుకు అవసరమైన ఎంబీబీఎస్ సీట్లను పెంచడంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) పక్షపాత ధోరణిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో తెలంగాణకు ఎంసీఐ తీవ్ర అన్యాయం చేసిందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మహారాష్ట్రలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు నిబంధనలను అతిక్రమించి అత్యధికంగా ఎంబీబీఎస్ సీట్లు పెంచిన ఎంసీఐ, తెలంగాణకు మాత్రం నిబంధనల మేరకు కాకుండా తక్కువ పెంచి ఇవ్వడంపై మండిపడుతున్నాయి. ఇంత పక్షపాత ధోరణి చూపడం పట్ల కేంద్రానికి తమ నిరసన తెలపాలని భావిస్తున్నట్లు సమాచారం. 190 సీట్లకే పరిమితం... దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 2019ృ20 నుంచి అగ్రవర్ణాల్లోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్)కు పది శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు ఎంసీఐ సీట్ల పెంపుపై ప్రతిపాదనలు కోరింది. పది శాతం ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేయాలంటే, ప్రస్తుతమున్న రిజర్వేషన్లకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉండాలంటే తప్పనిసరిగా 25 శాతం సీట్లు పెంచాల్సి ఉంటుందని ఎంసీఐ స్పష్టం చేసింది. ఆ మేరకు ప్రతిపాదనలను తెలంగాణ వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ) ఎంసీఐకి ప్రతిపాదనలు పంపించారు. కానీ కొన్ని కాలేజీలకు 25 శాతం సీట్లకు బదులు కేవలం 20 శాతమే పెంచి ఎంసీఐ చేతులు దులిపేసుకుంది. గాంధీ మెడికల్ కాలేజీ, మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీ, నిజామాబాద్, సిద్ధిపేట మెడికల్ కాలేజీలు, వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ, ఆదిలాబాద్‌లోని రాజీవ్‌గాంధీ మెడికల్ కాలేజీల్లో ప్రస్తుతం 900 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. 25 శాతం చొప్పున వాటిల్లో 225 ఎంబీబీఎస్ సీట్లను ఎంసీఐ అదనంగా పెంచాల్సి ఉంది. కానీ కేవలం 190 సీట్లు మాత్రమే పెంచింది. ఏకంగా 35 ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణ నష్టపోయింది. ఉదాహరణకు మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీలో ప్రస్తుతం 150 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ఆ ప్రకారం 38 సీట్లు పెంచాల్సి ఉండగా, కేవలం 25 సీట్లనే పెంచారు. ఆ ఒక్క కాలేజీనే 13 ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయింది. అలాగే సిద్దిపేటలోనూ ప్రస్తుతం 150 సీట్లుంటే, కేవలం 25 సీట్లే పెంచారు. నిజామాబాద్ మెడికల్ కాలేజీలో ప్రస్తుతం 100 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ఆ ప్రకారం అదనంగా 25 సీట్లు పెరగాల్సి ఉండగా, కేవలం 20 సీట్లే పెంచారు. అలాగే ఆదిలాబాద్‌లోని రిమ్స్‌లోనూ 100 సీట్లు ప్రస్తుతముంటే, 20 సీట్లే పెంచారు. ఇక సూర్యాపేట, నల్లగొండ మెడికల్ కాలేజీలు ఈ ఏడాది కొత్తగా ప్రారంభిస్తున్నందున వాటికి పెంచలేదు. ఈఎస్ఐ కాలేజీకి కూడా సీట్ల పెంపు జరగలేదని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. కానీ కొన్ని రాష్ట్రాలపై మాత్రం ఎనలేని ప్రేమ కనబరచడంపై విమర్శలు వస్తున్నాయి. మహారాష్ట్రకు 50 శాతం వరకు పెంపు... మహారాష్ట్రలోని అనేక ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు 25 శాతానికి బదులు ఏకంగా 50 శాతం వరకు సీట్లు పెంచడంలో ఆంతర్యమేంటో అంతుబట్టడంలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఉదాహరణకు నాందేడ్‌లోని డాక్టర్ శంకర్రావు చవాన్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రస్తుతం 100 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ఇప్పుడు ఆ కాలేజీకి అదనంగా మరో 50 సీట్లు పెంచారు. అంటే ఏకంగా 50 శాతం పెంచారు. అలాగే జలగాంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రస్తుతం 100 ఎంబీబీఎస్ సీట్లుంటే, దానికి కూడా మరో 50 సీట్లు పెంచారు. మొత్తం ఆ రాష్ట్రంలో 20 ప్రభుత్వ మెడికల్ కాలేజీలుంటే ఆరు కాలేజీల్లో 100 సీట్ల చొప్పున ప్రస్తుతమున్నాయి. వాటన్నింటికీ 50 సీట్ల చొప్పున పెంచారు. అంతేకాదు ఎనిమిది కాలేజీలకు ప్రస్తుతం 150 చొప్పున ఎంబీబీఎస్ సీట్లున్నాయి. వాటికి 38 సీట్ల చొప్పున పెంచాల్సి ఉండగా, వాటికి కూడా 50 సీట్ల చొప్పున పెంచేశారు. ముంబైలోని సేథ్ జీఎస్ మెడికల్ కాలేజీలో ప్రస్తుతం 180 ఎంబీబీఎస్ సీట్లుంటే, 25 శాతం చొప్పున ఆ కాలేజీకి 45 సీట్లు పెంచాలి. కానీ ఏకంగా 70 సీట్లు పెంచారు. ఇలాగైతే రిజర్వేషన్ల అమలు ఎలా? పది శాతం ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేయాలంటే, ప్రస్తుతమున్న సీట్లకు అదనంగా 25 శాతం సీట్లు పెంచాల్సి ఉంటుంది. అప్పుడే ప్రస్తుతమున్న సీట్లకు రిజర్వేషన్ల అమలులో ఎలాంటి ఇబ్బంది రాదు. పైగా రిజర్వేషన్ల స్ఫూర్తి దెబ్బతినదు. ఇది శాస్త్రీయమైన నిబంధన. కానీ 25 శాతం సీట్లు కాకుండా 20 శాతమే పెంచితే అనేక చట్టపరమైన సమస్యలు తలెత్తే ప్రమాదముందని వైద్యాధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో విద్యార్థులు కోర్టుకు వెళ్లే ప్రమాదమూ ఉందని అంటున్నారు. ఇక మహారాష్ట్రలో 25 శాతానికి బదులు 50 శాతం వరకు పెంచడం వల్ల కూడా రిజర్వేషన్ల సమస్యలు ఉత్పన్నం అవుతాయని అంటున్నారు. దీనిపైనా ఇతర వర్గాల ప్రజలు కూడా కోర్టుకు వెళ్లే ప్రమాదముందని అంటున్నారు. ఈడబ్ల్యూఎస్ కోటా సీట్ల పెంపులో ఎంసీఐ నిర్వాకంపై విమర్శలు వస్తున్నాయి. -
10 శాతం రిజర్వేషన్లపై అయోమయం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఆర్థికంగా వెనకబడిన అగ్రవర్ణాల పిల్లలకు విద్యా, ఉద్యోగావకాశాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం గత లోక్‌సభ ఎన్నికలకు రెండు నెలల ముందు, జనవరి నెలలో రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొచ్చిన విషయం తెల్సిందే. ఎస్సీ,ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను కోత పెట్టకుండా, అగ్రవర్ణాల విద్యార్థులకు విద్యా సంస్థల్లో అడ్మిషన్లు ఇవ్వాలంటే ప్రస్తుతం ఉన్న సీట్లకన్నా 25 శాతం సీట్లను పెంచాలని, ఆ మేరకు తరగతి గదులను, సిబ్బందిని పెంచాలని పలు విద్యా సంస్థలు ప్రభుత్వాలకు ప్రతిపాదనలు పంపించాయి. ఆ దిశగా ఇంతవరకు ఏ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో విద్యా సంస్థల అధ్యాపకులు, ఈ కేటగిరీ కింద అడ్మిషన్లు కోరుతున్న విద్యార్థినీ విద్యార్థులు గందరగోళంలో పడుతున్నారు. గుంజాన్ మఖిజాని అనే 18 ఏళ్ల యువతి జర్నలిజం కోర్సులో చేరేందుకు ఢిల్లీ యూనివర్శిటీలోని హెల్ప్ డెస్క్‌ను ఆశ్రయించారు. తాను ఏడాదికి ఎనిమిది లక్షల రూపాయల ఆదాయం కలిగి ఆర్థికంగా వెనకబడిన వర్గం కింద పది శాతం రిజర్వేషన్ల పరిధిలోకి వస్తానని చెప్పారు. అయితే సబ్–డివిజనల్ మేజిస్ట్రేట్ నుంచి ఆదాయం సర్టిఫికెట్ తీసుకరావాలని యూనివర్శిటీ వారు సూచించారు. దాంతో ఆమె అయోమయంలో పడ్డారు. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ నుంచి ఆదాయం సర్టిఫికెట్ తీసుకరావడం ఆమెకెకాదు చాలా మంది విద్యార్థులకు కష్టం. ఇదే విషయమై సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్‌ను ప్రశ్నించగా, ఆదాయ పత్రాలను జారీ చేయాల్సిందిగా తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లే వని అన్నారు. పది శాతం రిజర్వేషన్లను ఎలా అమలు చేయాలో తమకు మార్గదర్శకాలేవీ లేవని రాజస్థాన్‌లో ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఆదాయ, ఆస్తుల సర్టిఫికెట్లను చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఉత్తరప్రదేశ్‌లో విద్యార్థులు వాపోతున్నారు. -
అగ్రవర్ణ పేదలకు ‘మెడికల్’లో రిజర్వేషన్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అగ్రవర్ణాల్లోని ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు పది శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. 2019–20 వైద్య విద్యా సంవత్సరంలో భర్తీ చేయబోయే ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలుచేస్తారు. దీనికి సంబంధించి 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ, అందుకు అవసరమైన మార్గదర్శకాలను వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి జారీచేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచే తప్పనిసరిగా ఈడబ్లు్యఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించినందున ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లల్లో అమలు చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఈ రిజర్వేషన్ల అమలు కోసం ప్రత్యేకంగా మంజూరయ్యే సీట్లలోనే అమలు చేస్తామని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలోనూ ఆర్మీ, ఎన్సీసీ, దివ్యాంగులు, మహిళలకు కూడా కోటా కల్పిస్తారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలను కేవలం తెలంగాణలోనే ఉన్న కులాలకే అమలు చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. అయితే ప్రైవేటు కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లకు కూడా ఈ రిజర్వేషన్లు అమలు చేయాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఎంసీఐకి ప్రతిపాదించింది. కానీ దానిపై స్పష్టత రాకపోవడంతో కేవలం ప్రభుత్వ ఆధ్వర్యంలోని మెడికల్ కాలేజీల్లోనే అమలు చేయాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. 200 సీట్లు అదనంగా పెరిగే అవకాశం... వాస్తవంగా తెలంగాణలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,550 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. పది శాతం రిజర్వేషన్ల అమలుకు ఇతర రిజర్వేషన్ల స్ఫూర్తి దెబ్బతినకుండా ఉండాలంటే 25 శాతం అదనంగా సీట్లు పెంచాలి. ఆ ప్రకారం తెలంగాణలో ఏకంగా 387 సీట్లు పెరగాలి. కానీ ఉస్మానియా మెడికల్ కాలేజీలో 250 ఎంబీబీఎస్ సీట్లున్నాయని, అది గరిష్ట పరిమితి వరకు ఉండటంతో అక్కడ మాత్రం ఈడబ్ల్యూఎస్ కోటా అమలు కాదని అంటున్నారు. ఇక ఈఎస్ఐలోని సీట్లు కేంద్ర ప్రభుత్వ పరిధిలోవి కాబట్టి వాటిపై నిర్ణయం తీసుకునే అధికారం ఇక్కడి ప్రభుత్వానికి లేదు. ఇక నల్లగొండ, సూర్యాపేటలో ఈ ఏడాది నుంచి ప్రారంభం కాబోయే మెడికల్ కాలేజీలకు కూడా ఈడబ్ల్యూఎస్ సీట్లకు అనుమతి వచ్చే అవకాశం లేదని అంటున్నారు. ఎందుకంటే అక్కడ మంజూరైన సీట్ల మేరకు కూడా ఫ్యాకల్టీ లేదు. ఈ నేపథ్యంలో అదనపు సీట్లకు అనుమతి రావడం కష్టమని అంటున్నారు. అంటే మిగిలిన కాలేజీల్లోని సీట్ల ఆధారంగా చూస్తే అదనపు సీట్లు వచ్చే అవకాశముంది. ఆ ప్రకారం దాదాపు 200 ఎంబీబీఎస్ సీట్లు పెరిగే అవకాశముందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు చెబుతున్నాయి. ఐదెకరాలకుపైగా వ్యవసాయ భూమి ఉంటే రిజర్వేషన్ వర్తించదు... ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అగ్రకులాల్లోని పేదల ఆదాయం రూ.8 లక్షల లోపు మాత్రమే ఉండాలి. ఇక ఐదెకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉంటే అటువంటి వారికి ఈ రిజర్వేషన్ వర్తించదు. ఇంటి స్థలం వెయ్యి చదరపు అడుగులున్నా, నిర్దారించిన మున్సిపాలిటీల్లో 200 చదరపు గజాల స్థలమున్నా అనర్హులే. ఆదాయ ధ్రువీకరణ పత్రాలను జారీచేయాలని ప్రభుత్వం రెవెన్యూ యంత్రాంగానికి ఆదేశాలు జారీచేసింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే వీటికి కూడా ధ్రువీకరణ పత్రాలు జారీచేస్తారు. -
సీఎం ఆమోద ముద్ర
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అగ్రవర్ణాల్లోని బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు 10% రిజర్వేషన్లు కల్పించే ఫైలుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తెలిపినట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. అనంతరం సంబంధిత ఫైలుపై ఉన్నతాధికారుల సంతకం కూడా పూర్తయింది. ఆ ఫైలుపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సంతకం తీసుకొని తక్షణమే ఉత్తర్వులు జారీచేయాలని అధికారులు భావిస్తున్నారు. ఉత్తర్వులు జారీ అయిన వెంటనే ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ వర్గాలు తెలిపాయి. 2019–20 వైద్య విద్యా ఏడాదిలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాష్ట్రాలను ఆదేశించిన సంగతి తెలిసిందే. 10% రిజర్వేషన్ల అమలుకు 25% సీట్ల పెంపు తప్పనిసరి కావడంతో ఆ మేరకు ప్రతిపాదలను పంపాలని కోరింది. దీంతో రాష్ట్ర వైద్య విద్య డైరెక్టర్ (డీఎంఈ) ప్రతిపాదనలు పంపారు. ఆ ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో దాదాపు 312 ఎంబీబీఎస్ అదనపు సీట్లకు ప్రతిపాదనలు పంపారు. ఈ సీట్ల పెంపునకు కూడా ఎంసీఐ తాజాగా సుము ఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆరోగ్య వర్సిటీ ఎదురుచూపు.. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి వారం కిందటే ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయాల్సి ఉంది. ఆ మేరకు సన్నాహాలు జరిగాయి. కానీ వివిధ కారణాలతో అప్పుడు ఉత్తర్వులు జారీకాలేదు. నీట్ ఫలితాలు వచ్చి అఖిల భారత కోటా సీట్లకు కౌన్సెలింగ్ కూడా బుధవారం ప్రారంభమైంది. రాష్ట్ర స్థాయి ర్యాంకులు కూడా విద్యార్థుల చేతికి వచ్చాయి. దీంతో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుపై విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే మెడికల్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీచేయాల్సిన ఆరోగ్య వర్సిటీ ప్రభుత్వ ఉత్తర్వుల కోసమే ఎదురుచూస్తోంది. ఉత్తర్వులు రాకుండా నోటిఫికేషన్ జారీచేస్తే రిజర్వేషన్లు ఈ ఏడాదికి అమలు కాకుండా పోతాయి. వైద్య ఆరోగ్యశాఖలో కొందరు అధికారుల తీరువల్ల ఉత్తర్వుల జారీ కాస్తంత ఆలస్యమైందన్న విమర్శలు వచ్చాయి. ఇప్పుడు సీఎం ఆమోదం తెలపడంతో ఉత్తర్వులు రానున్నాయి. ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీ.. ప్రభుత్వం జారీచేసే ఉత్తర్వులో ప్రధానంగా అమలుతీరుపైనే మార్గదర్శకాలు ఉంటాయని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ఈడబ్ల్యూఎస్ ఆదాయ పరిమితి రూ.8 లక్షల లోపు ఉంటుందని, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేలా రెవెన్యూ శాఖకు ఈ మేరకు ఆదేశాలిస్తారని చెబుతున్నారు. ఇప్పటికే రెవెన్యూ శాఖకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. అఖిల భారత సీట్లలో చేరే విద్యార్థుల కోసం ఈడబ్ల్యూఎస్ ఆదాయ ధ్రువీకరణ పత్రాలను రాష్ట్రంలో రెవెన్యూ అధికారులు ఇస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మెడికల్ కాలేజీ సీట్ల భర్తీకి తాజాగా ధ్రువీకరణ పత్రాలు జారీచేయాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వమూ రూ.8 లక్షల లోపు ఆదాయమే నిర్ణయిస్తే, ఇప్పటికే కేంద్ర సీట్ల కోసం తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రాలు చెల్లుబాటు అవుతాయా లేదా అన్నదానిపై సందేహాలు నెలకొన్నాయి. ఇక ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణ పత్రాలను ఎలా ఇవ్వాలి.. ఎవరు ఇవ్వాలి.. అనే అంశాలపైనా మార్గదర్శకాల్లో సర్కారు స్పష్టత ఇచ్చే అవకాశముంది. -
నీట్ విద్యార్థులకు తీపికబురు
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో చేరడానికి నీట్ రాసిన అభ్యర్థులకు శుభవార్త. ఈ ఏడాది నుంచే ఆర్థికంగా బలహీన వర్గాలు (ఈడబ్ల్యూఎస్)కు ఆయా వైద్య కళాశాలల్లో సీట్లు కేటాయించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 50 చొప్పున ఎంబీబీఎస్ సీట్లు పెరగనున్నాయి. భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) రద్దు అనంతరం ఏర్పడ్డ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ దేశవ్యాప్తంగా ఈడబ్లు్యఎస్ విద్యార్థులకు ప్రత్యేక కోటా కింద సీట్లు కేటాయించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 25 శాతం వరకు సీట్లు పెరగనున్నాయి. వాస్తవానికి.. ఆర్థికంగా బలహీనవర్గాలకు 10 శాతం కోటా మాత్రమే ఉంది. కానీ నియర్ రౌండప్ పేరుతో 100 సీట్లున్న కళాశాలకు అదనంగా మరో 25 నుంచి 50 సీట్ల వరకు పెంచనున్నారు. దీంతో రాష్ట్రంలో ఉన్న 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రస్తుతం 1,750 సీట్లు ఉండగా అదనంగా 550 సీట్లు పెరుగుతాయి. ఎలాంటి నిబంధనలు లేకుండా పెంచిన సీట్లు తక్షణమే అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. పెంచిన సీట్లకు ఏడాది లోపు వసతులు కల్పించే విధంగా కళాశాలలకు అవకాశం ఇచ్చారు. ఈ విద్యా సంవత్సరం (2019–20) నుంచే పెంచిన సీట్లు అమల్లోకి వచ్చేలా ఆయా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులకు పెద్ద ఊరట మన రాష్ట్రంలో 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 1,750 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ ఏడాది రాష్ట్రం నుంచి 52 వేల మందికి పైగా నీట్ రాస్తే అందులో 39 వేల మందికి పైగా అర్హత సాధించారు. ఒక్కో సీటుకు 22 మందికి పైగా పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో 550 సీట్లు రాష్ట్రంలో పెరుగుతుండటంతో నీట్ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ పరిస్థితుల్లో ఒక్కో కళాశాలకు 50 సీట్లు పెరగడమంటే చాలా కష్టం. అలాంటిది 10 శాతం ఈడబ్లు్యఎస్ కోటా రావడం, దానికి తోడు మరిన్ని సీట్లు పెరుగుతుండటంతో విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. పెరిగిన సీట్లు రెండో విడత కౌన్సెలింగ్ నాటికి అందుబాటులోకి రావచ్చునని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల చివరి వారంలో తొలి విడత కౌన్సెలింగ్ మొదలు కానుంది. జూలై 30 నాటికి చివరి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. ఆర్థికంగా బలహీనవర్గాల కోసం కేటాయించే సీట్లలో ఒకవేళ జాప్యం జరిగితే ఆగస్టులో కూడా కౌన్సెలింగ్ నిర్వహించడానికి సడలింపు వచ్చే అవకాశం ఉంటుందని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులు చెప్పారు. ప్రతిపాదనలు పంపాం.. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలలకు సంబంధించిన సీట్ల పెంపు ప్రతిపాదనలను ఇప్పటికే బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌కు పంపినట్లు వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ కె.బాబ్జీ చెప్పారు. ఈ ఏడాది నుంచే సీట్ల పెంపు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని, సీట్లు పెరిగిన వెంటనే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సమాచారమిస్తామన్నారు. పెరిగిన సీట్లను బట్టి యూనివర్సిటీ కౌన్సెలింగ్ ప్రక్రియ చేపడుతుందని తెలిపారు. తాజా అంచనాల ప్రకారం రాష్ట్రంలో పెరగనున్న సీట్ల వివరాలు.. -
రిజర్వేషన్లు ఉన్నా దక్కని ఫలం
సాక్షి, అమరావతి: దేవుడు వరమిచ్చినా.... అన్నట్లుగా మారింది జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)కు హాజరైన ఎకనమికల్లీ వీకర్ సెక్షన్స్ (ఈడబ్ల్యూఎస్) పరిస్థితి. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అమల్లోకి తెచ్చినా అది వేలాది మంది అర్హులైన విద్యార్థులకు అందకుండా పోతోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఆయా విద్యా సంస్థలు సరైన రీతిలో ప్రచారం చేయకపోవడమే దీనికి కారణం. దీంతో 2019–20 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సులకు నిర్వహిస్తున్న ప్రవేశాల్లో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈడబ్ల్యూఎస్‌కు రిజర్వేషన్లను కల్పిస్తూ కేంద్రం ప్రస్తుత పార్లమెంట్ చిట్టచివరి సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. సాధారణ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు కేంద్రం ఈ బిల్లును ఆమోదించింది. బిల్లు ఆమోదానంతరం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు వీలుగా జాతీయ విద్యా సంస్థల్లో 2 లక్షలకు పైగా సీట్లను పెంచుతూ ఏప్రిల్ 15న కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఆయా విద్యా సంస్థల్లో సీట్ల పెంపుతోపాటు ఈడబ్ల్యూఎస్ కింద అర్హుల ఎంపికకు చర్యలు చేపట్టాలి. అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు ఆయా విద్యాసంస్థలు సరైన ప్రచారం చేయాల్సి ఉంది. ఆయా విద్యా సంస్థల్లో ప్రవేశానికి ప్రవేశ పరీక్షలు ఆన్లైన్లో నిర్వహిస్తున్నందున ఈడబ్ల్యూఎస్ కింద కొత్తగా ఆప్షన్ నమోదు చేసుకోవడంతోపాటు నిర్ణీత ధ్రువపత్రాలను అప్లోడ్ చేయడానికి తగినంత సమయం కూడా ఇవ్వాలి. కానీ అలాంటి చర్యలు లేకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. జేఈఈలో ఆప్షన్‌కు ఒకే ఒక్కసారి అవకాశం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)లలో ప్రవేశానికి జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)–2019ను కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. జాతీయ పరీక్ష ఏజెన్సీ (ఎన్టీఏ) ద్వారా జేఈఈ మెయిన్‌ను జనవరి, ఏప్రిల్ నెలల్లో రెండుసార్లు జరిపింది. జేఈఈలో ఈ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సంబంధించిన ఆప్షన్ నమోదుకు ఎన్టీఏ మార్చి 2న పబ్లిక్ నోటీసు జారీ చేసింది. అందులో ఈడబ్ల్యూఎస్ కింద అర్హులైనవారు మార్చి 11 నుంచి 15లోగా ఆప్షన్‌ను నమోదు చేసుకోవాలంటూ గడువు విధించింది. అంటే.. కేవలం ఐదు రోజులు మాత్రమే ఈ అవకాశం కల్పించింది. దీనిపై ఎలాంటి ప్రచారమూ లేకపోవడం, వేలాది మంది విద్యార్థులు పబ్లిక్ నోట్‌ను గమనించకపోవడంతో ఆప్షన్‌ను నమోదు చేసుకోలేకపోయారు. విద్యార్థులు ఆప్షన్ నమోదు చేసి ఉంటే సంబంధిత ధ్రువపత్రాలను జేఈఈ మెయిన్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదని ఎన్టీఏ పేర్కొంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసే సమయంలో మాత్రం సంబంధిత పోర్టల్‌లో ఆ ధ్రువపత్రాన్ని అప్లోడ్ చేయాలని సూచించింది. ఇంతవరకు బాగానే ఉన్నా మెయిన్ పరీక్ష సమయంలోనే ఆప్షన్ నమోదు చేయడంపై సరైన ప్రచారం కల్పించలేదు. ఆప్షన్ నమోదుకు ఒకటికి రెండుసార్లు విద్యార్థులకు గడువు ప్రకటించాల్సి ఉన్నా అదీ చేయలేదు. దీంతో అసలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ప్రస్తుత ప్రవేశాల సమయంలో అమల్లోకి వచ్చాయన్న అంశం కూడా చాలా మందికి తెలియకుండా పోయింది. ఫలితాల్లో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ చూసి అవాక్కు కాగా.. జేఈఈ మెయిన్ పేపర్–1 ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ర్యాంకులు స్కోరులను కూడా వెల్లడించింది. రెండు దశ (జనవరి, ఏప్రిల్)ల్లో బీఈ/బీటెక్‌కు సంబంధించిన పేపర్–1కు 9,35,741 మంది, బీఆర్క్, బీప్లానింగ్ కోర్సులకు సంబంధించిన పేపర్–2కు 1,69,767 మంది హాజరయ్యారు. మన రాష్ట్రం నుంచి దాదాపు 60 వేల మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేశారని అంచనా. ఏపీ, తెలంగాణ కలిపి 1.50 లక్షల మంది విద్యార్థులు మెయిన్ పరీక్ష రాశారు. దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్‌లో ఉత్తీర్ణత సాధించినవారిలో మెరిట్లో ఉన్న తొలి 2.24 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు ఎంపిక చేశారు. అడ్వాన్స్డ్ పరీక్ష రాయడానికి అవసరమైన కటాఫ్ ఎన్టీఏ స్కోర్లను కూడా ప్రకటించారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 89.7548849, ఈడబ్ల్యూఎస్ (జనరల్‌లో ఆర్థికంగా వెనుకబడినవారు)కు 78.2174869, ఓబీసీ (ఎన్సీఎల్)లకు 74.3166557, ఎస్సీలకు 54.0128155, ఎస్టీలకు 44.3345172 కటాఫ్ స్కోర్లుగా నిర్దేశించారు. ఈ స్కోర్లు సాధించిన విద్యార్థులకు మే 27న అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహించనున్నారు. దీనికి దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అయితే ఇందులో ఈడబ్ల్యూఎస్ కోటా చూసిన విద్యార్థులు అవాక్కయ్యారు.ఈడబ్ల్యూఎస్ కోటా గురించి తాము ముందుగా చూసుకోలేకపోయామని, సరైన ప్రచారమూ లేనందున ఎన్టీఏ ఇచ్చిన గడువులోగా ఆప్షన్‌ను నమోదు చేసుకోలేకపోయామని తీవ్ర ఆవేదనకు గురయ్యారు. స్పందించని ఎన్టీఏ తమకు జరిగిన అన్యాయాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫలితాలు వచ్చిన వెంటనే మీడియా సంస్థలకు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు వివరించి న్యాయం జరిగేలా చూడాలని విన్నవించారు. జేఈఈ నిర్వహించేది కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఎన్టీఏ కాబట్టి తామేమీ చేయలేమని రాష్ట్ర అధికారులు చేతులెత్తేశారు. పైగా ఎన్నికల హడావిడిలో ఉన్నందున దీనిపై దృష్టిపెట్టే పరిస్థితి కూడా అధికారులకు లేకుండా పోయింది. ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ నమోదుకు గడువు ఇస్తూ ఎన్టీఏ గతంలో విడుదల చేసిన నోటీసులోని ఫోన్ నెంబర్లను, ఈమెయిళ్లను సంప్రదించినా ఎలాంటి స్పందన లేదని విద్యార్థులు వాపోతున్నారు. ఆప్షన్ నమోదుకు మరోసారి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. తమకు వచ్చిన స్కోరు, ర్యాంకు ప్రకారం అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసే సమయంలో సంబంధిత ధ్రువపత్రాలను అప్లోడ్ చేయడానికి అవకాశం కల్పించాలని వేడుకుంటున్నారు. దీనిపై ఎన్టీఏ నుంచి కానీ సంబంధిత అధికారుల నుంచి కానీ స్పందన లేకపోవడంతో రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థులు నష్టపోతున్నారు. దేశవ్యాప్తంగా ఇలా నష్టపోయే వారి సంఖ్య లక్షల్లోనే ఉంటుందని అంచనా. అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు ఆయా విద్యాసంస్థలు సరైన ప్రచారం చేయాల్సి ఉంది. విద్యా సంస్థల్లో ప్రవేశానికి ప్రవేశ పరీక్షలు ఆన్లైన్లో నిర్వహిస్తున్నందున ఈడబ్ల్యూఎస్ కింద కొత్తగా ఆప్షన్ నమోదు చేసుకోవడంతోపాటు నిర్ణీత ధ్రువపత్రాలను అప్లోడ్ చేయడానికి తగినంత సమయం కూడా ఇవ్వాలి. కానీ అలాంటి చర్యలు లేకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. -
ఎంసెట్ ఫలితాల్లో చిక్కుముడులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్–2019 ఫలితాల విడుదల ఓ చిక్కుముడిగా మారింది. వివిధ ఆటంకాల కారణంగా ఫలితాల విడుదల ఆలస్యమవుతోంది. తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలలోని గందరగోళం పరిష్కారం కాకపోవడం, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎకనమికల్లీ వీకర్ సెక్షన్ల (ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్ల అమలు తదితర అంశాల్లో స్పష్టత లేకపోవడంతో పాటు ఏపీ ఇంటర్ విద్యార్థులకు మార్కులు కాకుండా, గ్రేడ్లు ఇవ్వడం ఎంసెట్ ఫలితాల విడుదల ఆలస్యానికి కారణంగా చెబుతున్నారు. మంగళవారం ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి దమయంతి ఈ అంశాలపై సమీక్ష నిర్వహించారు. బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సమక్షంలో వీటిపై చర్చించి తుది నిర్ణయం తీసుకుని ఎంసెట్ ఫలితాల విడుదల తేదీని ప్రకటిస్తారని అధికారవర్గాలు చెప్పాయి. ఏపీ ఇంటర్ గ్రేడ్లతో సమస్య ఎంసెట్‌లో విద్యార్థులు సాధించిన మార్కులను 75 శాతంగా పరిగణించి వాటికి ఇంటర్ మార్కులను వెయిటేజీగా తీసుకుని ర్యాంకులను ప్రకటించాల్సి ఉంటుంది. ఏపీలో కొత్తగా ఇంటర్ ఫలితాలను మార్కుల విధానంలో కాకుండా గ్రేడ్ల విధానంలో ప్రకటించారు. ఎంసెట్‌లో ర్యాంకులు ప్రకటించాలంటే ఇంటర్లో విద్యార్థులకు వచ్చిన మార్కులను తప్పనిసరిగా ఇంటర్ బోర్డు.. ఎంసెట్ కన్వీనర్‌కు అందించాలి. ఈ మార్కులకోసం కన్వీనర్ బోర్డుకు లేఖ రాశారు. అయితే గ్రేడింగ్‌పై ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకున్నందున మార్కులను ఇచ్చేందుకు బోర్డు వెనుకాడుతోంది. విద్యార్థుల మార్కుల శాతాన్ని తెలుసుకొనేందుకు పార్ములాను సూచించి దాని ఆధారంగా ముందుకు వెళ్లవచ్చని సూచిస్తోంది. అయితే ఇంటర్ గ్రేడ్ల విధానం తీసుకుని ఎంసెట్ ర్యాంకులు ప్రకటిస్తే గందరగోళంగా మారుతుందని ఎంసెట్ అధికారులు వాదిస్తున్నారు. మార్కులు ఇవ్వాల్సిందేనని స్పష్టంచేస్తున్నారు. ఇందుకు బోర్డు నుంచి స్పష్టత రాలేదు. ఇక ఏపీ ఎంసెట్ రాసిన వారిలో తెలంగాణ ఇంటర్ విద్యార్థులు దాదాపు 20 వేల మంది వరకు ఉన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ ఫలితాలు మే 8న విడుదలకు అవకాశముందని, ఆ తరువాత అంటే మే రెండో వారంలో ఆ మార్కులు అందిన తర్వాత ఏపీ ఎంసెట్ ఫలితాలను విడుదల చేయడానికి వీలుంటుందని అధికారులు చెబుతున్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపైనా సందేహాలు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్యాసంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిన నేపథ్యంలో రాష్ట్రంలోనూ దాన్ని అమలు చేయాల్సి ఉంది. ఈ పది శాతంలో 5 శాతం కాపులకు ప్రత్యేకిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ రిజర్వేషన్లను ఎలా అమలు చేయాలన్నదానిపైనా ఉన్నత విద్యాశాఖలో సందేహాలు ఏర్పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ప్రకటించినప్పుడు సూపర్‌న్యూమరరీ సీట్లు కేటాయించాలని పేర్కొన్నా ఆమేరకు ఉత్తర్వులు లేవని ఎంసెట్ అడ్మిషన్ల అధికారులు చెబుతున్నారు. జాతీయ విద్యాసంస్థల్లో వేర్వేరు విధానాలు అమలు చేస్తున్నారని పేర్కొంటున్నారు. రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వం నుంచి నిర్దిష్టమైన ఆదేశాలు రావలసి ఉందని వివరించారు. వీటన్నిటిపై సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సమక్షంలో జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. -
కొత్తగా 2.14 లక్షల సీట్లు
న్యూఢిల్లీ: ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు (ఈడబ్ల్యూఎస్) 10 శాతం రిజర్వేషన్ల అమలు కోసం 158 కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో 2.14 లక్షల సీట్లను కొత్తగా సృష్టించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం సోమవారం ఆమోదం తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లలో మార్పులు చేయకుండానే అగ్రవర్ణాల్లోని పేదలకూ రిజర్వేషన్ కల్పించేలా కేంద్రం ఈ ఏడాది మొదట్లో కొత్త చట్టం తీసుకురావడం తెలిసిందే. ఈ కొత్త రిజర్వేషన్ల వల్ల జనరల్ కోటాలోనూ సీట్లు తగ్గకుండా చూడటం కోసం కొత్తగా 2,14,766 సీట్లను సృష్టించనున్నారు. ఎన్నికల నిబంధనావళి అమల్లో ఉన్నందున ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపేముందే మానవ వనరుల అభివృద్ధి శాఖ ఈసీ నుంచి∙అనుమతులు తీసుకుంది. 2019–20 విద్యా సంవత్సరంలో 1,19,983 సీట్లను, 2020–21లో 95,783 సీట్లను ప్రభుత్వం సృష్టించనుంది. ఈడబ్ల్యూఎస్ అమలు కోసం 158 కేంద్రప్రభుత్వ విద్యాసంస్థలకు రూ.4,315 కోట్ల నిధులు వెచ్చించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో సీట్లను 25 శాతం పెంచనున్నట్లు 2019–20 బడ్జెట్లోనూ కేంద్రం వెల్లడించింది. కేబినెట్ ఇతర నిర్ణయాలు రాష్ట్రాల ఆడిట్ పనుల మధ్య సమన్వయం కోసం, అలాగే ఉత్తరప్రత్యుత్తరాల పర్యవేక్షణ కోసం అదనంగా మరో ఉప కాగ్ (కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్) పదవిని సృష్టించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఐదుగురు ఉప కాగ్‌లు ఉన్నారు. జీఎస్ఎల్వీ నాలుగోదశ కార్యక్రమాన్ని కొనసాగించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమం కింద 2729.13 కోట్ల వ్యయంతో 2021–24 మధ్య ఐదు రాకెట్ ప్రయోగాలు జరగనున్నాయి. -
10% అమలుకు 25% సీట్లు పెంచాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్) విద్యార్థుల కోసం పీజీ వైద్యవిద్య సీట్లలో 10% సీట్లను కేటాయిస్తూ భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) తీసుకున్న నిర్ణయం అమలు చేయాలంటే 25% సీట్లను పెంచాల్సి ఉంటుందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పీజీ సీట్లకు అదనంగా 10% సీట్లను పెంచాలని ఎంసీఐ చెప్పినా ఆచరణలో 25% పెంచాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు. 2020–21 విద్యా సంవత్సరం నుంచి ఈ పెంపు వర్తింపజేయాల్సి ఉంటుందని ఎంసీఐ స్పష్టం చేసింది. ఓసీల్లో ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన చట్టాన్ని పరిగణనలోకి తీసుకొని రాష్ట్రంలోనూ అందుకు అనుగుణంగా బిల్లు తీసుకురావాల్సి ఉం టుందని వర్సిటీ వర్గాలంటున్నాయి. ఈడబ్ల్యూఎస్ అమలు అంత సులువైన వ్యవహారం కాదని, అనేక రకాల సమస్యలున్నాయని పేర్కొంటున్నాయి. సుప్రీంకోర్టు చెప్పినట్లుగా.. రాష్ట్రంలో ప్రస్తుతం 706 పీజీ స్పెషాలిటీ వైద్య సీట్లు ఉన్నాయి. వాటిని 10% వరకు పెంచాలంటే 71 సీట్లు పెంచాల్సి ఉంటుందని మాత్రమే అందరూ అనుకుంటారు. కానీ 25% పెంచాల్సి ఉంటుందని ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు చెబుతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మొత్తం సీట్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లలో ఏమాత్రం తేడా రాకూడదు. అంటే ఆ పెరిగిన 71 సీట్లలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు అమలవుతాయి. ఆ ప్రకారం ఇక్కడ 10% సీట్లను పెంచితే సరిపోదు. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు అమలవుతూనే.. ఈ 10% రిజర్వేషన్‌ను అమలుచేయాలంటే మొత్తంగా 25% సీట్లను పెంచాల్సి ఉంటుంది. ఆ ప్రకారం 706 పీజీ వైద్య సీట్లకు అదనంగా మరో 25% అంటే 176 సీట్లు పెంచాల్సి ఉంటుందని వర్సిటీ వర్గాలంటున్నాయి. అలాగైతే తెలంగాణలో మొత్తం మెడికల్ పీజీ సీట్లు 882కు చేరతాయి. ఈ పెంపునకు అనుగుణంగా.. పెరగనున్న సీట్లకు తగ్గట్లుగా వైద్య కళాశాలల్లో బోధనా సిబ్బంది, శిక్షణ, ఆసుపత్రుల్లో పడకలు, తదితర మౌలిక సదుపాయాలను కల్పించుకోవాలని కోరుతూ అన్ని రాష్ట్రాల వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శులకు ఎంసీఐ లేఖ రాసింది. ఇక ఎంబీబీఎస్ సీట్లల్లోనూ ఇలాగే 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలంటే అక్కడా 25% సీట్లను పెంచాల్సి ఉంటుంది. దీంతో తెలంగాణలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రస్తుతమున్న 1,150 ఎంబీబీఎస్ సీట్లసంఖ్యకు అదనంగా మరో 287 సీట్లు పెంచాల్సి ఉంటుంది. ఈ సీట్లను పెంచాలంటే మౌలిక సదుపాయాలు, అధ్యాపకుల సంఖ్యను పెంచుకోవాలి. అసెంబ్లీలో బిల్లు రావాలి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలుచేసేందుకు 10% శాతం సీట్లను పెంచితే సరిపోదు. ఆ పెంచిన లెక్క ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు కూడా పెరుగుతాయి. అంటే మొత్తంగా 25% సీట్ల పెంపు జరిగితేనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను సమానంగా అమలు చేయగలం. ఆ ప్రకారం మౌలిక సదుపాయాలు కల్పించాలి. అధ్యాపకుల సంఖ్యను పెంచుకోవాలి. రాష్ట్ర అసెంబ్లీలోనూ అందుకు అనుగుణంగా బిల్లు పాస్ కావాలి. డాక్టర్ కరుణాకర్ రెడ్డి, వీసీ, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం -
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై 17న జాతీయ సదస్సు
హైదరాబాద్: ఆర్థికంగా వెనుకబడిన పేదల(ఈడబ్ల్యూఎస్) కోసం తెచ్చిన రిజర్వేషన్ల అమలు కోసం ఈ నెల 17న జైపూర్‌లో జాతీయ స్థాయి సదస్సును నిర్వహించనున్నట్లు ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు చట్టబద్ధత చేసి 2 నెలలు అవుతున్నా.. అనేక రాష్ట్రాలు ఇప్పటికీ స్పందించకపోవడం శోచనీయమన్నారు. అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లలో కాపులకు 5 శాతం మిగిలిన అగ్రవర్ణాలకు 5 శాతం కల్పిస్తామని ప్రకటించి రిజర్వేషన్ల అమలుకు గండికోట్టేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఇప్పటివరకు ఓసీ రిజర్వేషన్ల అమలుపై నిర్లక్ష్యం వహిస్తూ పూర్తిగా విస్మరిస్తున్నారని ఆరోపించారు. నిరుపేదల ఓసీల రిజర్వేషన్లు కేవలం 14 రాష్ట్రాలే ఇప్పటివరకు అమలు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా అమలు చేసేలా ఒత్తిడి చేస్తూ లక్నో, ఫరీదాబాద్, బెంగుళూరు, భోపాల్ తదితర నగరాల్లో జాతీయ సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏపీ, తెలంగాణలకు చెందిన బీజేపీ నాయకులు గ్రూపు తగాదాలతో సతమతం అవుతూ రిజర్వేషన్ల అమలు కోసం గవర్నర్, సీఎంలకు విజ్ఞప్తులు చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఓసీలకు కల్పించిన రిజర్వేషన్లను తెలుగు రాష్ట్రాలతోపాటు మిగతా రాష్ట్రాల్లో తక్షణం అమలు చేయకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. -
ఈడబ్ల్యూఎస్ నిర్ధారణ ఎలా?
సాక్షి, హైదరాబాద్: ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్) ధ్రువీకరణపై అయోమయం నెలకొంది. అగ్రవర్ణ పేదలకూ రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈమేరకు చట్టాన్ని తీసుకొచ్చిన కేంద్రం ఆ దిశగా ఉద్యోగ నియామకాలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఉద్యోగ ప్రకటనల్లో ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం రిజర్వేషన్ కేటాయిస్తోంది. ఈ మేరకు గత నెలలో పలు నోటిఫికేషన్లు జారీ చేసింది. అయితే, ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణపై స్పష్టత కొరవడింది. వాస్తవానికి ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణపత్రాల జారీ ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాలి. కానీ ఈడబ్ల్యూఎస్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణ దరఖాస్తు ప్రశ్నార్థకంగా మారింది. ధ్రువీకరణ కోసం రెవెన్యూ అధికారులను సంప్రదిస్తే తమకెలాంటి ఆదేశాలు లేవని, ధ్రువీకరణపత్రం ఇవ్వడం సాధ్యం కాదని సమాధానమివ్వడంతో వారు తలలు పట్టుకుంటున్నారు. ధ్రువీకరణ లేకుంటే ఓపెన్ కేటగిరీ... రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(ఆర్ఆర్బీ), ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సీఐ), వేర్‌హౌస్ కార్పొరేషన్, జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ) తదితర విభాగాల్లో పెద్దసంఖ్యలో ఉద్యోగ ప్రకటనలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో దాదాపు వెయ్యికిపైగా పోస్టులున్నట్లు అంచనా. ఒక్క ఆర్ఆర్బీలోనే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 326 పోస్టులున్నాయి. ఆన్లైన్ ద్వారా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే సందర్భంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీని ఎంపిక చేసుకుంటే అందుకు సంబంధించి ధ్రువీకరణ పత్రం సంఖ్యను ఎంట్రీ చేయాలి. కానీ రాష్ట్రంలో ప్రస్తుతం ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణ పత్రాలను ప్రభుత్వం జారీ చేయడం లేదు. దీంతో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకునే వీలు లేకపోవడంతో చివరకు ఓపెన్ కేటగిరీలో దరఖాస్తు చేసుకోవల్సి వస్తోంది. ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణపై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోకుంటే రాష్ట్రానికి సంబంధించి ఆ కేటగిరీలోని ఉద్యోగాలభర్తీ కావు. జనరల్ కేటగిరీకే దరఖాస్తు ఆర్థికంగా వెనుకబడిన వారికి కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ కేటగిరీని నిర్ధారించి ఉద్యోగాల భర్తీ చేస్తున్నప్పటికీ రాష్ట్రంలో మాత్రం ఆయా వర్గాలకు అన్యాయం జరుగుతోంది. ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఆ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. గత నెలలో కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. రాష్ట్రంలో అభ్యర్థులకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లు జారీ చేయకపోవడంతో వారంతా ఓసీ కేటగిరీకే దరఖాస్తు చేసుకోవల్సి వస్తోంది. – అయ్యప్పరెడ్డి, తొర్రూర్, మహబుబాబాద్ జిల్లా -
రైల్వేలో పేదల కోటా కింద 23 వేల ఉద్యోగాలు
న్యూఢిల్లీ: అగ్రవర్ణాల పేదల(ఈడబ్ల్యూఎస్)కు 10 శాతం రిజర్వేషన్‌ను అమలుచేయబోయే తొలి ప్రభుత్వ విభాగంగా భారతీయ రైల్వే నిలవబోతోందని ఆ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రాబోయే రెండేళ్లలో దాదాపు 23,000 మందికి ఈ కోటా కింద ఉద్యోగాలు ఇస్తామని వెల్లడించారు. ఆరు నెలల్లోగా 1.31 లక్షల ఖాళీలను భర్తీ చేస్తామనీ, రాబోయే రెండేళ్లలో మరో లక్ష ఉద్యోగుల్ని తీసుకుంటామని పేర్కొన్నారు. 2019–20 మధ్యకాలంలో 53 వేల మంది, 2020–21 కాలంలో 46 వేల మంది ఉద్యోగులు రైల్వేశాఖ నుంచి పదవీ విరమణ చేయబోతున్నారని తెలిపారు. -
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థికంగా వెనకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు రిజర్వేషన్లు కట్టబెట్టిన 123వ రాజ్యాంగ సవరణ చట్టం రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘిస్తోందని, దీనిని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ రిటైర్డ్ జస్టిస్ వి.ఈశ్వరయ్య బుధవారం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ‘123వ రాజ్యాంగ సవరణ చట్టం రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని, రాజ్యాంగంలోని 141వ ఆర్టికల్‌కు ఉల్లంఘిస్తోంది. ఇందిరా సహానీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 1991లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును విభేదిస్తోంది. 2011లో చేపట్టిన సామాజిక–ఆర్థిక కుల జనగణనను ప్రచురించి, దాని ఆధారంగా రిజర్వేష న్లు అమలు చేసేలా ఆదేశాలివ్వాలి. ఆర్థికంగా వెనకబడిన వర్గాలు ఏరకంగానూ అణచివేతకు గురికాలేదు. కానీ సామాజికంగా బలహీనులైన వెనకబడిన వర్గాలు అనేక విధాలుగా వివక్షకు గురయ్యాయి. అగ్రవర్ణాల్లో పేదలు 5% కూడా లేరు. వారికి 10 శాతం రిజర్వేషన్లు కేటాయించారు’ అని పిటిషన్లో పేర్కొన్నారు. -
‘ఈడబ్ల్యూఎస్’ పిటిషన్ స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్)కు విద్యా, ఉపాధి అవకాశాల్లో 10 శాతం రిజర్వేషన్లకోసం రాజ్యాంగ సవరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించింది. ఈ 10 శాతం రిజర్వేషన్లపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకొచ్చిన చట్టాన్ని కొట్టేయాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై మంగళవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వంగా రామచంద్రగౌడ్ వాద నలు వినిపిస్తూ, రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఆర్థిక వెనుకబాటుతనం ప్రస్తావన లేదని, అందువల్ల వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. ఈ సవరణ చట్టం రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చేవిధంగా ఉందన్నారు. కులాల వారీగా జనాభా లెక్కలను తేల్చకుండా ఇష్టానుసారం రిజర్వేషన్లు కల్పించడం సరికాదన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని, అయితే శాస్త్రీయ పద్ధతిలో కులాల వారీగా జనాభా లెక్కలను తేల్చిన తరువాతనే రిజ ర్వేషన్లు ఇవ్వాలని కోరుతున్నామని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తూ, ప్రతివాదులుగా ఉన్న కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి, కేంద్ర సామాజిక న్యాయశాఖ కార్యదర్శి, తెలంగాణ న్యాయశాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. ‘ఆ స్థలాల రక్షణపై ఏం చర్యలు తీసుకున్నారు?’ ప్రభుత్వాస్పత్రుల స్థలాల పరిరక్షణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని హైకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, ఉస్మానియా సూపరింటెండెంట్, జీహెచ్ఎంసీ కమిషనర్, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఎర్రగడ్డలోని ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి చెందిన స్థలాన్ని ఆక్రమించుకుని నిర్మాణాలు చేపడుతున్నారంటూ పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటామని ఏజీ తెలిపారు. -
ఉన్నత విద్యాసంస్థల్లో సీట్లు పెంచండి
సాక్షి, హైదరాబాద్: ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు పెంచిన రిజర్వేషన్లకు అనుగుణంగా ఉన్నత విద్యాసంస్థల్లో సీట్లు పెంచా లని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్డీ) ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ), జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ)ల చైర్మన్లతోపాటు అన్ని రాష్ట్రాల సీఎస్ లకు ఎంహెచ్ఆర్డీ డైరెక్టర్ స్మితా శ్రీవాత్సవ లేఖలు రాశారు. కేంద్రం రిజర్వేషన్లు పెంచిన నేపథ్యంలో దేశంలోని సెంట్రల్ వర్సిటీలు, ఎన్ఐటీ, ఐఐటీల వంటి జాతీయ స్థాయి విద్యా సంస్థలు, రాష్ట్ర విద్యా సంస్థల్లో సీట్లను పెంచాలని పేర్కొన్నారు. ప్రస్తుతమున్న సీట్లు, రిజర్వేషన్లకు ఇబ్బందులు తలెత్తకుండా సీట్ల పెంపునకు చర్యలు చేపట్టాలని, మార్చి 31లోగా దీన్ని పూర్తి చేయాలన్నారు. వీటికి సీట్ల పెంపు వర్తించదు..: ఈ సీట్ల పెంపు ఉత్తర్వులు 8 జాతీయస్థాయి సంస్థలైన హోమీబాబా నేషనల్ ఇన్స్టిట్యూట్, దాని పరిధిలోని 10 యూనిట్లు, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, నార్త్ ఈస్టర్న్ ఇందిరాగాంధీ రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్స్, నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్, జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్, ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, స్పేస్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్‌లకు వర్తించబోవని ఎంహెచ్ఆర్డీ స్పష్టం చేసింది. -
ఏపీ, తెలంగాణకు నోటీసులు
ఉచిత విద్య అమలుకావడంలేదన్న పిల్‌పై స్పందించిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (ఈడబ్ల్యూఎస్) విద్యార్థులకు అన్ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి వరకు ఉచిత విద్య అందించాలని విద్యా హక్కు చట్టం చెబుతున్నా అమలు చేయడం లేదన్న కేసులో ఉభయ రాష్ట్రాలకూ హై కోర్టు నోటీసులు ఇచ్చింది. ఉచిత విద్యను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అమలు చేయక పోవడంపై విశాఖపట్నం న్యాయ విద్యార్థి తాండ యోగేశ్ దాఖలు చేసిన వ్యాజ్యంపై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగ నాథన్, జస్టిస్ టి.రజనీల ధర్మాసనం ప్రతివాదులైన ఏపీ, తెలంగాణ పాఠశాలల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. ఇదే అంశా లకు చెందిన మరో రెండు కేసులతో ఈ కేసును జత చేసి, అన్నింటినీ కలిపి విచారి స్తామని ధర్మాసనం తెలిపింది. -
‘ప్రైవేటు’ఇళ్లలోనూ పేదలకు సబ్సిడీ
పట్టణాలు, నగరాల్లో ఇళ్ల కొరత తీర్చడానికి కేంద్రం నిర్ణయం బిల్డర్ల బహుళ అంతస్తుల భవనాల్లో ప్రత్యేకంగా ఫ్లాట్లు వెనుకబడిన తరగతులు, కనిష్ట ఆదాయ గ్రూపులకు వర్తింపు ఒక్కో యూనిట్‌కు 75 వేల సబ్సిడీ అందజేస్తామని వెల్లడి బిల్డర్లకు తక్కువ ధరకు స్థలాలు.. నిబంధనల్లోనూ సడలింపు ప్రభుత్వ ప్రమేయంతోనే ధరలు, కేటాయింపుల నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం, ప్రభుత్వ కార్పొరేషన్లు నిర్మించే భవన సముదాయాల్లోనే కాదు.. ఇక నుంచి ప్రైవేటు బిల్డర్లు నిర్మించే బహుళ అంతస్తుల భవనాల్లోని ఫ్లాట్ల కోసం కూడా పేదలకు సబ్సిడీ అందనుంది. దేశంలో మురికివాడలను నిర్మూలించే ఉద్దేశంతో ‘రాజీవ్ ఆవాస్ యోజన’ కింద ఈ సరికొత్త పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ప్రైవేట్ బిల్డర్లు తాము నిర్మించే భవనాల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (ఈడబ్ల్యుఎస్), కనిష్ట ఆదాయ గ్రూపు(ఎల్ఐజీ) వారికి ఫ్లాట్లు నిర్మించి.. వారికి అందిస్తే ఒక్కో ఫ్లాట్‌పై రూ. 75 వేలు సబ్సిడీ అందజేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం ఈ విధమైన సబ్సిడీని ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలే నిర్మించి అందజేసేవి. తాజాగా ప్రైవేటు బిల్డర్లు నిర్మించే బహుళ అంతస్తుల భవనాలకూ వర్తింపజేయనున్నారు. ఈ మేరకు ‘రాజీవ్ ఆవాస్ యోజన’లోని ఈ మార్గదర్శకాలు 2013-22 మధ్యకాలం వరకు వర్తిస్తాయని కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, ప్రైవేట్ బిల్డర్లు నిర్మించే హెచ్ఐజీ (అధికాదాయ వర్గాలు), ఎంఐజీ (మధ్య తరగతి వర్గాలు) పరిధితోపాటు ఈ ఇళ్లను కూడా కలగలిపి నిర్మించాలని... ఒక్కో వెంచర్లో కనీసం 250 ఫ్లాట్లు/యూనిట్లు ఉంటేనే ఈ సబ్సిడీ వర్తింపజేస్తామని కేంద్రం వెల్లడించింది. పేదలకు తక్కువ ధరలో ఇళ్లు/ఫ్లాట్లు లభించాలంటే ఇది తప్పనిసరని కేంద్రం పేర్కొంది. తక్కువ ధరకు స్థలాలు ఇవ్వాలి.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అవసరమైతే ప్రైవేటు బిల్డర్లకు తక్కువ ధరకు స్థలాలిచ్చి పేదల కోసం ఇళ్లు నిర్మించేలా ప్రోత్సహించాలని కేంద్రం సూచించింది. ఇందుకోసం అన్ని రాష్ట్రాలు నగరాలు, పట్టణాల్లో ల్యాండ్ బ్యాంక్‌లు ఏర్పాటు చేయాలని కోరింది. రాజస్థాన్, ఒడిశా, హర్యానా రాష్ట్రాల్లో అమలుచేస్తున్న విధానాన్ని పరిశీలించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ప్రైవేటు సంస్థలు ఇలాంటి ఇళ్ల నిర్మాణానికి ముందుకు వచ్చినప్పుడు.. వారికి భూ వినియోగ మార్పిడితో పాటు నిర్మాణంలో కొన్ని రాయితీలను కల్పించాలని రాష్ట్రాలకు సూచించింది. ఎల్ఐజీ, ఈడబ్ల్యుఎస్ వర్గాలకు ఇళ్ల నిర్మాణాల కోసం అభివృద్ధి నియంత్రణలను సరళతరం చేయాలని.. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్‌ను ఎక్కువగా అనుమతించాలని, పార్కింగ్ కోసం నియమాలను సరళతరం చేయాలని పేర్కొంది. అలాంటి ప్రాజెక్టులకు అన్ని అనుమతులను 60 రోజుల్లోగా ఇచ్చేలా నిబంధనలు ఉండాలని తెలిపింది. వారికి స్టాంపు డ్యూటీ రాయితీలు కల్పించాలని కోరింది. కేంద్రం ఇచ్చే రూ. 75 వేల సబ్సిడీని ప్రాజెక్టుల పురోగతి ఆధారంగా ప్రభుత్వం 40:40:20 లెక్కన మూడు దశల్లో విడుదల చేస్తుందని వెల్లడించింది. కేటాయింపుల్లో ప్రాధాన్యతా క్రమం.. ఈ తరహా ఫ్లాట్లు/ఇళ్ల కేటాయింపును పారదర్శకంగా ప్రభుత్వాలే చేపట్టాలని... మొదట వికలాంగులు, ఎస్సీ, ఎస్టీ, సీనియర్ సిటిజన్స్, వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, ఇతర అల్పాదాయ వర్గాలకు ప్రాధాన్యతా క్రమంలో అందజేయాలని కేంద్రం సూచించింది. ఒక్కో ఫ్లాట్/ఇల్లు కార్పెట్ ఏరియా (గోడల మధ్య ఉండే స్థలం) కనీసం 21-40 చదరపు మీటర్లు ఉండాలని నిర్ధారించింది. ఈడబ్ల్యుఎస్ కింద ఇల్లు/ఫ్లాట్ పొందేవారి వార్షికాదాయం రూ. లక్ష లోపు, ఎల్ఐజీ వారికి రూ. రెండు లక్షల లోపు ఉండాలని స్పష్టం చేసింది. 250 యూనిట్ల వెంచర్లో కనీసం 35 శాతాన్ని.. ఈడబ్ల్యుఎస్‌కు 21-27 చదరపు మీటర్ల కార్పెట్ ప్రాంతంగా, ఎల్ఐజీ-ఏకి 28-40 చదరపు మీటర్లు, ఎల్ఐజీ-బీకి 41-60 చదరపు మీటర్లలోపు కార్పెట్ ప్రాంతంగా ఉంచాలని పేర్కొంది. ఈ ఇళ్లు/ఫ్లాట్ల ధరలను ప్రభుత్వం నిర్ణయించాలని కూడా కేంద్రం స్పష్టం చేసింది.