
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యా ప్రవేశాల్లో 10 శాతం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) కోటా అమలుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జాతీయ స్థాయిలో కేంద్రం అమలు చేస్తున్న విధానాన్ని అనుసరించాలా? లేదా ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రా ల్లో అనుసరిస్తున్న విధానాన్ని అమల్లోకి తేవాలా? అన్న దానిపై ఆలోచనలు చేస్తోంది. దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు ఉన్నతవిద్యా మండలి ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయా లని భావిస్తోంది. 2021–22 విద్యా సంవత్సరంలో ఉన్నత విద్యాకోర్సుల్లో ఈడబ్ల్యూఎస్ కోటా అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సం గతి తెలిసిందే. ప్రవేశాల నాటికి మార్గదర్శకాలను జారీ చేయాలని భావిస్తోంది.
జాతీయ స్థాయిలో...
జాతీయ స్థాయిలో కేంద్రం ఈడబ్ల్యూఎస్ అమలు కు ప్రత్యేక విధానం తెచ్చింది. ప్రస్తుత రిజర్వేషన్లకు నష్టం వాటిల్లకుండా, ఓపెన్ కోటాను తగ్గించకుం డా చర్యలు చేపట్టింది. ఉదాహరణకు ఏదేని ఒక విద్యాసంస్థలో 100%సీట్లు ఉంటే వాటికి అదనంగా 20% సీట్లను (సూపర్ న్యూమరీ) పెంచింది. అం దులో 10 శాతం సీట్లను ఈడబ్ల్యూఎస్‌కు కేటాయిం చింది. మిగతా 10 శాతం సీట్లను అన్ని రిజర్వేషన్ల వారికి విభజించింది. అదే విధానాన్ని అన్ని ఉన్నత విద్యాకోర్సుల్లో అమలు చేస్తోంది. 20 శాతం సీట్లను పెంచితే మౌలిక సదుపాయాల సమస్య తలెత్తే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
ఏపీలో ఇలా...
మరోవైపు పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో విధానం అమలు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లను యథావిధిగా కొనసాగిస్తూనే అదనంగా 10 శాతం (సూపర్ న్యూమరీ) సీట్లను పెంచింది. వాటిని ఈడబ్ల్యూఎస్ కోటా కింద కేటాయిస్తోంది. వీటిల్లో ఏ విధానాన్ని అమలు చేయాలన్న దానిపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
Comments
Please login to add a commentAdd a comment