సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థికంగా వెనుకబడిన వర్గాల Economically Weaker Sections ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై నేడు(సోమవారం) సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. సీజేఐతో సహా నలుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం.. ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత ఉంటుందని తీర్పు ఇచ్చింది. మొత్తం నలుగురు..
న్యాయమూర్తుల్లో ముగ్గురు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత ఉంటుందని ప్రకటించగా.. ఒక్కరు మాత్రం తీర్పుతో విభేధించారు. దీంతో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి భారీ విజయం దక్కినట్లయ్యింది. తీర్పు వెలువరించే సయమంలో సీజేఐ యూయూ లలిత్ ఉన్నత విద్యలో ఆర్థికంగా వెనుకబడిన విభాగం (ఈడబ్ల్యుఎస్) రిజర్వేషన్ల రాజ్యాంగ చెల్లుబాటు మరియు ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగ సమస్యలకు సంబంధించిన అంశంపై నాలుగు తీర్పులు వెలువడాల్సి ఉందని తెలిపారు.
తొలుత జస్టిస్ దినేశ్ మహేశ్వరి మాట్లాడుతూ, EWS సవరణ సమానత్వ కోడ్‌ను ఉల్లంఘించదు. రాజ్యాంగంలోని ముఖ్యమైన లక్షణాలను ఉల్లంఘించలేదు. 50% ఉల్లంఘన ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘించదు అని తీర్పు ఇచ్చారు. ఆ వెంటనే.. జస్టిస్ బేలా ఎం త్రివేది మాట్లాడుతూ, తన తీర్పు జస్టిస్ మహేశ్వరితో ఏకీభవించిందని, జనరల్ కేటగిరీలోని EWS కోటా చెల్లుబాటు అయ్యేదని, రాజ్యాంగబద్ధమని చెప్పారు.
జస్టిస్ JB పార్దివాలా రాజ్యాంగం యొక్క 103వ సవరణ చట్టం 2019 యొక్క చెల్లుబాటును కూడా సమర్థించారు, ఇది సాధారణ వర్గంలో 10 శాతం EWS రిజర్వేషన్‌ను అందిస్తుందన్నారు. అయితే.. జస్టిస్ రవీంద్ర భట్ మాత్రం భిన్నాభిప్రాయంతో తీర్పు వెల్లడించారు. 103వ రాజ్యాంగ సవరణ యొక్క చెల్లుబాటును సమర్థిస్తూ మెజారిటీ తీర్పుతో విభేదించారు.దీంతో.. మెజార్టీ తీర్పు కేంద్ర నిర్ణయానికి అనుకూలంగా వచ్చినట్లయ్యింది.
అగ్రవర్ణాల్లో వెనుకబడిన వర్గాలకు 10 శాతం కల్పిస్తూ.. 103వ రాజ్యాంగ సవరణ చేపట్టింది కేంద్రం. అయితే.. చెల్లుబాటును సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ పిటిషన్లపై ఐదుగురు న్యామూర్తుల ధర్మాసనం విచారణ చేపట్టింది. గత నెలలో తీర్పును రిజర్వ్‌లో ఉంచింది సుప్రీం ధర్మాసనం. ఈ నేపథ్యంలో ఇవాళ వెలువడబోయే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు(ఈడబ్ల్యూఎస్) ప్రవేశాలు, ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి గల రాజ్యాంగపరమైన చెల్లుబాటు గురించి 40 దాకా పిటిషన్లు దాఖలు అయ్యాయి. చీఫ్ జస్టిస్ యు.యు.లలిత్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ చేపట్టి.. అన్ని వాదనలు వింది.
ఈడబ్ల్యూఎస్ EWS అభ్యర్థులకు రిజర్వేషన్లలో కోటా కల్పిస్తూ 2019లో కేంద్ర ప్రభుత్వం 103వ రాజ్యాంగ సవరణ చేసింది. ఈ రిజర్వేషన్ల చెల్లుబాటును సవాలు చేస్తూ అదే ఏడాది పలు పిటిషన్లు దాఖలు కాగా, అందులో ‘జన్‌హిత్ అభియాన్’ ప్రముఖంగా ఉంది. ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేస్తే.. ఎస్సీ, ఎస్టీలతోపాటు ఇతర వెనుకబడిన వర్గాలకు (ఓబీసీ) ప్రస్తుతమున్న 50 శాతం రిజర్వేషన్ల పరిధి దాటుతుందన్నది ప్రధాన అభ్యంతరం.
ఇదీ చదవండి: ఒక్కరోజు ముందుగానే వీడ్కోలు
Comments
Please login to add a commentAdd a comment