న్యూఢిల్లీ: రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లుల ఆమోదంలో గవర్నర్ తాత్సారం చేస్తున్నారంటూ తమిళనాడు ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు స్పందన కోరింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జే/బీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం ఈ మేరకు నోటీసు జారీ చేసింది.
రాజ్యాంగ బద్ధమైన ఒక అధికారం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వ విధులను అడ్డుకుంటోందని తమిళనాడు ప్రభుత్వం పిటిషన్‌లో ఆరోపించింది. జోక్యం చేసుకోవాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన 12 బిల్లులు గవర్నర్ ఆర్‌ఎన్ రవి వద్ద పెండింగ్‌లో ఉన్నాయని విచారణ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణ ఈ నెల 20న చేపడతామని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment