
న్యూఢిల్లీ: నీట్–పీజీ ప్రవేశాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్) కోటాకు సంబంధించి దాఖలైన కేసులను అత్యవసరమైనవిగా భావించి మంగళవారం విచారణ చేపట్టాలని కేంద్రం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బొపన్నల ధర్మాసనం ఎదుట సోమవారం సొలిసిటర్ జనరల్ తుషార్ కేంద్ర తరఫున ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘ఈ కేసును మంగళవారం విచారణ జరిపే కేసుల జాబితాలో చేర్చాలని సీజేఐకి విజ్ఞప్తి చేస్తాను’అని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. ఈ కేసును కొంత అత్యవసరమైనదిగా భావించి మంగళవారమే విచారణ చేపట్టాలని, లేకుంటే బుధవారమైనా విచారించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనాన్ని కోరారు.