Neat
-
నీట్–పీజీ ‘ఈడబ్ల్యూఎస్ కోటా’ కేసులను సత్వరం తేల్చండి
న్యూఢిల్లీ: నీట్–పీజీ ప్రవేశాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్) కోటాకు సంబంధించి దాఖలైన కేసులను అత్యవసరమైనవిగా భావించి మంగళవారం విచారణ చేపట్టాలని కేంద్రం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బొపన్నల ధర్మాసనం ఎదుట సోమవారం సొలిసిటర్ జనరల్ తుషార్ కేంద్ర తరఫున ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘ఈ కేసును మంగళవారం విచారణ జరిపే కేసుల జాబితాలో చేర్చాలని సీజేఐకి విజ్ఞప్తి చేస్తాను’అని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. ఈ కేసును కొంత అత్యవసరమైనదిగా భావించి మంగళవారమే విచారణ చేపట్టాలని, లేకుంటే బుధవారమైనా విచారించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనాన్ని కోరారు. -
ఆన్‌లైన్‌లోనూ అత్యుత్తమ బోధన
Sushma Boppana About Infinity Learn: కోవిడ్ తర్వాత విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. ఆన్లైన్ అభ్యసనానికి మరింత ప్రాధాన్యత పెరిగింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన శ్రీచైతన్య విద్యాసంస్థ ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘ఇన్ఫినిటీ లెర్న్’ అనే ఎడ్యుటెక్ సంస్థను ప్రారంభించింది. నీట్, జేఈఈ విద్యార్థులకు ఆన్లైన్ కోర్సులు అందిస్తోంది. మూడు దశాబ్దాలకు పైగా బోధనానునుభవంతో ఆన్‌లైన్‌లోనూ అత్యుత్తమ శిక్షణ అందించి విద్యార్థుల సమగ్ర అభివృద్ధి సాధించడమే తమ లక్ష్యమని ‘ఇన్ఫినిటీ లెర్న్’ సహ వ్యవస్థాపకురాలు సుష్మ బొప్పన పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ‘ఇన్ఫినిటీ లెర్న్’ గురించి ఆమె మాటల్లోనే... నాణ్యమైన కంటెంట్ ఇతర సంస్థలకు భిన్నంగా నాణ్యమైన కంటెంట్ అందించే ప్రధాన లక్ష్యంగా ‘ఇన్ఫినిటీ లెర్న్’ను తీర్చిదిద్దాం. ఆఫ్‌లైన్‌లో బోధిస్తున్న విధానానికి దీటుగా డిజిటల్‌లోనూ అత్యుత్తమ శిక్షణ అందించే ఏర్పాటు చేశాం. విద్యార్థులకు కేవలం ఆన్లైన్లో పాఠాలు చెప్పడం, హోమ్‌వర్క్‌లు కేటాయించడమే కాకుండా ఆ విద్యార్థికి సబ్జెక్టుపై పూర్తిస్థాయి అవగాహన కల్పించేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాం. గత 36 ఏళ్లుగా శ్రీచైతన్య విద్యాసంస్థల ద్వారా సాధించిన అనుభవం ఈ వ్యూహాలు అమలు చేయడానికి ఉపయోగపడుతున్నాయి. నీట్, జేఈఈపై దృష్టి మొదటగా నీట్, జేఈఈపై దృష్టి సారించాం. నీట్ లాంగ్‌టర్మ్ శిక్షణకు దేశవ్యాప్తంగా విద్యార్థులు చేరుతున్నారు. టెస్ట్ సిరీస్‌కూ ఆదరణ లభిస్తోంది. 2023 నాటికి జాతీయ స్థాయి పోటీ పరీక్షలతోపాటు సివిల్ సర్వీసెస్ కోచింగ్, ఇంగ్లీషు లాంగ్వేజ్ పాఠాలు, కంప్యూటర్ కోర్సులు అందించే ఆలోచన ఉంది. 2024 నాటికి శ్రీచైతన్య విద్యార్థులు కాకుండా మరో 10 లక్షల మంది విద్యార్థులు నేరుగా ‘ఇన్ఫినిటీ లెర్న్’ ప్రయోజనాలు పొందేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. ‘అమెజాన్ అకాడమీ’తోనూ ఒప్పందం కుదుర్చుకుని నీట్, జేఈఈ పరీక్షల పూర్తి కోర్సులను అందిస్తున్నాం. నీట్–2021లో రికార్డుస్థాయి ఫలితాలు సాధించాం. వచ్చే ఏడాది మరిన్ని ర్యాంకులు సాధించే అవకాశం ఉంది. ప్రణాళిక, పర్యవేక్షణ ఇన్ఫినిటీ లెర్న్‌లో విద్యార్థి స్థాయికనుగుణంగా బోధన ఉంటుంది. అప్పుడే విద్యార్థుల్లో విశ్వాసం పెరుగుతుందనేది మా నమ్మకం. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కాన్సెప్ట్ ఓరియెంటెడ్, ప్రాబ్లమ్ ఓరియెంటెడ్, న్యూమరికల్ అంశాలుగా విద్యార్థుల అవసరాల మేరకు కంటెంట్ అందిస్తున్నాం. ఆన్‌ౖలñ న్లో విద్యార్థి ఏ విధంగా నేర్చుకుంటున్నారో తెలుసుకునే విధంగా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుంది. తరగతిలో నేర్చుకున్న అంశాలను హోమ్ వర్క్ ద్వారా సాధన చేయడం, అందులో విద్యార్థులకు ఎదురైన అనుభవాలు, సందేహాలు నివేదికల రూపంలో అధ్యాపకుడికి చే రతాయి. వాటిని తర్వాత తరగతిలో ఉపాధ్యాయుడు విశ్లేషించి సందేహాలుంటే నివృత్తి చేస్తారు. దీంతో ఎప్పటికప్పుడు అంశాలపై పట్టు పెంచుకునే అవకాశం ఉంటుంది. అప్పుడే వారు పరీక్షల్లోనూ రాణించగలుగుతారు. టెక్నాలజీ వినియోగం తరగతి గదిలో స్మార్ట్ బోర్డులను ఏర్పాటు చేసి ‘హైబ్రిడ్ ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ ప్రోగ్రామ్’ను రూపొందించాం. నీట్ లాంగ్‌టర్మ్ విద్యార్థులందరికీ దీన్ని అమలు చేస్తున్నాం. తద్వారా ఆన్లైన్ ప్లాట్‌ఫాంను మరింత మెరుగుపరుస్తున్నాం. ఉపాధ్యాయ ఆధారిత బోధన కంటే విషయ ఆధారిత బోధనకు ప్రాధాన్యతనిస్తున్నాం. విద్యార్థులు ఆన్లైన్ పాఠాలు వినేటపుడు టెక్నాలజీ సమస్యలు తలెత్తకుండా అప్లికేషన్ తయారుచేశాం. పాఠాలు, స్టడీమెటీరియల్, యానిమేషన్ అంశాలను జోడించి బోధన సాగిస్తున్నాం. స్కాలర్షిప్ టెస్ట్ శ్రీచైతన్య విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులతోపాటు ఇతర విద్యాసంస్థల్లో చదివే విద్యార్థుల అవసరాలు తీర్చేలా దీన్ని రూపొందించాం. ముఖ్యంగా గ్రామీణప్రాంతాల్లో నిపుణులైన అధ్యాపకులు, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులోలేనిచోట విద్యార్థులకు ప్రయోజనం కలగాలని భావించాం. నామమాత్రపు ధర నిర్ణయించి కోర్సులను అందిస్తున్నాం. రూ.99 నుంచి కోర్సు ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ‘స్కోర్’ స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహించి విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాం. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉచితంగా దీర్ఘకాలిక శిక్షణ అందిస్తున్నాం. -
నీట్ యూజీ ఫలితాల విడుదలకు ఓకే!
సాక్షి, న్యూఢిల్లీ: నీట్ యూజీ 2021 ఫలితాల విడుదలకు మార్గం సుగమమైంది. ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ ఫలితాలను ప్రకటించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ను సుప్రీంకోర్టు ఆదేశించింది. సెప్టెంబర్ 12న నీట్ యూజీ పరీక్షను ఎన్టీఏ నిర్వహించింది. అయితే, టెస్ట్ బుక్లెట్, ఓఎంఆర్ షీట్లు పరీక్షా కేంద్రంలో తారుమారయ్యాయంటూ మహారాష్ట్రకు చెందిన ఇద్దరు అభ్యర్థులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. వారిద్దరికీ పరీక్ష మళ్లీ నిర్వహించాకే నీట్ ఫలితాలను వెల్లడించాలని హై కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాలపై ఎన్టీఏ సుప్రీం ను ఆశ్రయించింది. జస్టిస్ లావు నాగేశ్వరరావు , జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయిల ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. ఇద్దరి కోసం 16 లక్షల మంది పరీక్షా ఫలితాలు నిలిపివేయడం కుదరదంది. -
‘నీట్’ ఆందోళనలు అరికట్టండి: సుప్రీం
-
‘నీట్’ ఆందోళనలు అరికట్టండి: సుప్రీం
న్యూఢిల్లీ: నీట్‌ను వ్యతిరేకిస్తూ తమిళనాడులో జరుగుతున్న ఆందోళనను అదుపుచేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఆందోళనల పేరుతో జనజీవనాన్ని స్తంభించజేస్తున్న వారిపై సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని శుక్రవారం ఆదేశించింది. నీట్ పరీక్షను రద్దుచేయాలంటూ అనిత (17) అనే దళిత విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన తర్వాత తమిళనాడు ఆందోళనలతో అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనజీవనానికి ఇబ్బందులు కలుగుతున్న అంశంపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. ‘నీట్ పరీక్షకు అమలు నిర్ణయంతో తలెత్తుతున్న ఆందోళలను అదుపుచేయాల్సిన బాధ్యత తమిళనాడు చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీలదే’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. దీనిపై తదుపరి విచారణను సెప్టెంబర్ 18న చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది. -
జడ్జీల నియామకానికి ‘నీట్’ తరహా పరీక్ష
న్యూఢిల్లీ: కింది స్థాయి కోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి నీట్ తరహాలో దేశవ్యాప్త ప్రవేశ పరీక్షను నిర్వహిస్తామని కేంద్రం ప్రతిపాదించింది. సీబీఎస్ఈ నిర్వహిస్తున్న నీట్‌తో పాటు, ఐబీపీఎస్(బ్యాంకులు) తరహా విధానాల్లో న్యాయమూర్తుల ఖాళీల్ని భర్తీ చేయగలమని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి సుప్రీం కోర్టు సెక్రటరీ జనరల్‌కు లేఖ రాశారు. అంతేకాకుండా అత్యున్నత ధర్మాసనం పర్యవేక్షణలో జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్షను నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని కేంద్రం కోరింది. దేశవ్యాప్తంగా దిగువకోర్టుల్లో ప్రస్తుతమున్న 4,452 ఖాళీలను భర్తీచేయడానికి హైకోర్టుల సూచనలతో యూపీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహిస్తామని లేఖలో కేంద్రం ప్రతిపాదించింది. ఎంసీఐపై 13న భేటీ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వం లోని కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లు–2016 ముసాయిదాపై చర్చించడానికి జూన్ 13న రెండోసారి సమావేశం కానుంది. అనుమతుల జారీ, పర్యవేక్షణల్లో ఎంసీఐ (భారతీయ వైద్య మండలి) విఫలమైందని నీతిఆయోగ్ తేల్చిచెప్పడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. -
నిఘా నీడలో నీట్
► 51 కేంద్రాల్లో ప్రశాంతంగా పరీక్ష ► 88 వేల మంది విద్యార్థుల హాజరు ► ఆంక్షలతో అవస్థలు ► సేలంలో ముగ్గురు విద్యార్థులకు అనుమతి నిరాకరణ ► విద్యార్థుల కన్నీటి వేదనతో జనంలో రగిలిన ఆక్రోశం ► చొక్కాలు చింపుకున్నారు సాక్షి, చెన్నై: వైద్య కోర్సుల ప్రవేశ నిమిత్తం రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష (నీట్) నిఘా నీడలో ఆదివారం జరి గింది. ఎనిమిది నగరాల్లోని 51 కేంద్రాల్లో ప్రశాంతంగా పరీక్ష సాగింది. 88 వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. కట్టుదిట్టమైన ఆంక్షలు విద్యార్థులను తీవ్ర అవస్థలకు గురి చేశాయి. అనేక చోట్ల ఫుల్హ్యాండ్తో వచ్చిన విద్యార్థులు తమ చొక్కాలు చించుకోవాల్సిన పరిస్థితి. ఎంబీబీఎస్, బీడీఎస్ వైద్య కోర్సుల ప్రవేశ నిమిత్తం జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష(నీట్)కు కేంద్రం చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇక్కడ అమల్లో ఉన్న విద్యా విధానం మేరకు నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరినా, అసెంబ్లీలో తీర్మానం చేసినా ఫలితం శూన్యం. ఈ విద్యా సంవత్సరం వైద్య కోర్సుల ప్రవేశ నిమిత్తం జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్షకు తప్పనిసరిగా విద్యార్థులు హాజరు కావాల్సిన పరి స్థితి. ఈ పరీక్షల నిమిత్తం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ముందస్తుగా హాల్ టికెట్ల పంపిణీ సాగింది. ఆదివారం దేశ వ్యాప్త పరీక్షలో భాగంగా రాష్ట్రంలోనూ ఎనిమిది నగరాల్లోని కేంద్రాల్లో పరీక్షలకు ఏర్పాట్లు చేశారు. చెన్నై, కోయంబత్తూరు, తిరుచ్చి, మదురై, తిరునల్వేలి, నామక్కల్–సేలం, వేలూరు, పుదుచ్చేరి నగరాల్లో సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ నగరాల్లోని 51 కేంద్రాల్లో జరిగిన పరీక్షల నిమిత్తం ఉదయం ఏడు గంటలకే విద్యార్థుల తరలివచ్చారు. ఆయా కేంద్రాల్లో ఏడున్నర గంటల నుంచి బృందాలుగా విద్యార్థులను లోనికి అనుమతించారు. çహాల్ టికెట్ల పరిశీలనతో పాటు విద్యార్థుల వద్ద కనీసం పెన్నుకూడా లేకుండా చూసుకున్నారు. అయితే, కట్టుదిట్టమైన ఆంక్షల గురించి విద్యార్థులకు ముందుగా వివరించకపోవడంతో అవస్థలు తప్పలేదు. ఆంక్షలతో అవస్థలు: విద్యార్థినుల మెడలో ఉన్న చైన్లు, చెవి పోగులు, కాలి పట్టీలు, రబ్బర్ బ్యాండ్లను సైతం తీసి వేశారు. వాచీలు, షూలు ధరించిన వచ్చిన వాళ్లను వెనక్కు పంపించి, వాటన్నింటిని తొలగించినానంతరం లోనికి అనుమతించారు. ఇక ఫుల్‌హ్యాండ్ చొక్కాలతో వచ్చిన విద్యార్థులకు తంటాలు తప్పలేదు. ఆయా కేంద్రాల వద్ద ఆఫ్ హ్యాండ్‌గా చించుకుని లోనికి వెళ్లాల్సిన పరిస్థితి. కట్టుదిట్టమైన ఆంక్షలు, భద్రత ఏర్పాట్ల నడుమ విద్యార్థులు కేంద్రాల ఆవరణల్లోకి అడుగుపెట్టారు. గంట పాటు ఆవరణల్లో కూర్చోబెట్టి విద్యార్థులకు పర్యవేక్షకులు పలు సూచనలు ఇచ్చారు. ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయా అని ప్రత్యేక పరికరాల ద్వారా తనిఖీలు చేయడం గమనార్హం. ఇక, సరిగ్గా 9.30 గంటలకు కేంద్రంలోని పరీక్షా గదుల్లోకి విద్యార్థులను అనుమతించారు. అందరికీ పెన్నులు పంపిణీ చేశారు. అరగంట పాటు విద్యార్థులు ఓఎంఆర్ షీట్ పూర్తి చేయడానికి సమయం కేటా యించారు. ఫొటోల పరిశీలన, ఎవరైనా విద్యార్థి అదనంగా ఫొటో లేకుండా పరీక్షా కేంద్రంలోకి వచ్చి ఉంటే, వారిని గుర్తించి అక్కడికక్కడ ఫొటోలు తీసి ఇచ్చారు. ఇందుకుగాను రూ.50 వసూలు చేయడం గమనార్హం. సరిగ్గా పది గంటలకు ప్రశ్నా పత్రాలు అందజేశారు. ముగ్గురు విద్యార్థులకు అనుమతి నిరాకరణ: ఉదయం 9.30 తర్వాత పరీక్షా కేంద్రం వైపుగా వచ్చిన ఏ ఒక్కర్నీ లోనికి అనుమతించ లేదు. ధర్మపురి నుంచి ముగ్గురు విద్యార్థులు అతి కష్టం మీద సేలంలోని కేంద్రం వద్దకు చేరుకున్నా, ఫలితం శూన్యం. 9.35 గంటలకు వాళ్లు రావడంతో లోనికి అనుమతించ లేదు. దీంతో ఆ విద్యార్థులు కన్నీటి పర్యంతంతో అక్కడి అధికారుల్ని వేడుకున్నా ఫలితం శూన్యం. దీంతో ఆ పరిసరాల్లో ఉన్న ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఆ కేంద్రం అధికారులతో వాగ్వి వాదానికి దిగారు. ప్రశ్నాపత్రాలు ఇవ్వడానికి సమయం ఉంది కదా అని ప్రశ్నించారు. ఎంతకూ అధికారులు పట్టించుకోకపోవడంతో విద్యార్థులకు మద్దతుగా ఆందోళన సాగింది. పోలీసులు రంగంలోకి దిగి బుజ్జగించారు. అయినా ప్రయోజనం లేదు. చివరకు ఆ ముగ్గురు విద్యార్థులు కన్నీటి పర్యంతంతో ధర్మపురికి తిరుగు పయనమయ్యారు. ప్రశాంతంగా పరీక్ష : సేలం ఘటన మినహా తక్కిన అన్ని చోట్ల పకడ్బందీగా, లీక్‌లకు ఆస్కారం లేని రీతిలో నిఘా నీడలో ఒంటి గంట వరకు పరీక్ష సాగింది. తమ పిల్లలు పరీక్షలకు వెళ్లడంతో తల్లిదండ్రులు ఆ పరిసరాల్లో ఉదయం నుంచి ఉత్కంఠగా వేచి ఉన్నారు. ఆయా పరీక్షా కేంద్రాల పరిసరాల్లోనూ భద్రత కట్టుదిట్టం చేయడంతో ఏదేని కొనుగోలు చేయాలన్నా కొంత దూరం నడక సాగించక తప్పలేదు. పుదుచ్చేరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా 88 వేల మంది విద్యార్థులు తమ ఉన్నత చదువు కలల్ని సాకారం చేసుకోవడం లక్ష్యంగా పరీక్షలకు హాజరయ్యారు. చెన్నైలో అయితే, 13 కేం ద్రాల్లో పరీక్షలు జరిగాయి. ఆయా ప్రాంతాల్లోని కేంద్రాల వద్దకు ఉదయాన్నే పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు, తమ పిల్లల్ని వెంట బెట్టుకుని చేరుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆంక్షల మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ముందుగా ఆంక్షల గురించి హాల్ టికెట్‌తో పాటు వివరించి ఉండాలని, ఇప్పుడు విద్యార్థుల్లో ఆందోళన రేకెత్తించే విధంగా ఆంక్షలు విధించారని ధ్వజమెత్తారు. పరీక్షల అనంతరం అనేక మంది విద్యార్థుల సులభతరంగా ఉందని వ్యాఖ్యానించగా, మరి కొందరు పర్వాలేదని సమాధానం ఇచ్చారు. ఇక, రాష్ట్రంలోని మెట్రిక్యులేషన్ స్కూళ్లల్లో చదువుకుని పరీక్షలకు హాజరైన విద్యార్థులు అయితే, తమకు ఏమీ అర్థం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
వచ్చే ఏడాది నుంచి ఉర్దూలోనూ నీట్!
న్యూఢిల్లీ: 2018–19 విద్యా సంవత్సరం నుంచి వైద్య విద్య ఉమ్మడి ప్రవేశ పరీక్ష నీట్‌ను ఉర్దూలోనూ నిర్వహించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. మే 7న జరిగే ఈ ఏడాది నీట్లోనే ఉర్దూ మీడియాన్ని ప్రవేశపెట్టాలని పిటిషనర్ కోరగా అది సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ‘అద్భుతాలు చేయమని మేం కేంద్రాన్ని ఆదేశించలేం. పరీక్ష మే 7 న ఉంది. ఈ రోజు ఏప్రిల్ 13. ఇప్పటికిప్పుడు మార్పులు చేయడం సాధ్యం కాదు’ అని బెంచ్ స్పష్టం చేసింది. -
ఈ ఏడాది ‘నీట్’ లేదు
- పలు రాష్ట్రాలను మినహాయిస్తూ ఆర్డినెన్స్ జారీకి కేంద్రం నిర్ణయం - ప్రభుత్వ వైద్య కళాశాలలకు మినహాయింపు ఇచ్చేందుకు ఓకే - ప్రైవేటు కాలేజీల్లో కన్వీనర్, నాన్‌లోకల్ సీట్లకూ నీట్ వర్తించదు - తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాలకు మినహాయింపు - మినహాయింపు ఈ ఏడాదికే.. వచ్చే ఏడాది నుంచి నీట్ తప్పదు - కేంద్ర కేబినెట్ భేటీలో నిర్ణయం.. రాష్ట్రపతిని కలవనున్న నడ్డా - ఆ ఆర్డినెన్స్ జారీ చేస్తే సుప్రీంకోర్టులో సవాల్ చేస్తాం: సంకల్ప్ - ప్రైవేటు కాలేజీల లాబీ ప్రయోజనం కోసమే ఆర్డినెన్స్: కాంగ్రెస్ న్యూఢిల్లీ: వైద్య విద్యలోని ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన ‘నీట్’ పరీక్ష నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ఈ ఏడాది మినహాయింపు లభించనుంది. రాష్ట్రాల నుంచి వ్యక్తమైన ఆందోళనలు, ఒత్తిడి మేరకు.. నీట్ నుంచి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ ఏడాది మినహాయింపు ఇవ్వటానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. అందుకోసం ఒక ఆర్డినెన్స్ జారీ చేయాలని నిర్ణయించింది. అన్ని రాష్ట్రాలు, మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు నీట్ మాత్రమే ఏకైక ప్రవేశ పరీక్షగా ఉండాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను పాక్షికంగా సవరిస్తూ ఈ ఆర్డినెన్స్‌ను తీసుకురానుంది. శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ భేటీలో నీట్ వివాదం, ఆర్డినెన్స్ జారీ అంశంపై చర్చించి ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్డినెన్స్ జారీ కోసం ఆరోగ్య మంత్రి జె.పి.నడ్డా త్వరలో రాష్ట్రపతిని కలవనున్నారు. ఆర్డినెన్స్ జారీ అయితే ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల విద్యార్థులు ఈ ఏడాది తప్పనిసరిగా నీట్ రాయాల్సిన అవసరం ఉండదు. అయితే.. వారు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ఎంసెట్ వంటి రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. అలాగే.. ప్రైవేటు కాలేజీలు, డీమ్డ్ వర్సిటీల్లో ప్రభుత్వ కోటా మినహా మిగతా సీట్లన్నిటికీ(మేనేజ్మెంట్ కోటాకు) నీట్ వర్తిస్తుంది. అంటే.. విద్యార్థులు ప్రభుత్వ కాలేజీలు, ప్రైవేటు కాలేజీల్లోని ప్రభుత్వ(కన్వీనర్) కోటా సీట్లలో ప్రవేశాలకు రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్ష రాయాలి. ప్రైవేటు కాలేజీలు, డీమ్డ్ వర్సిటీల్లో మేనేజ్మెంట్ కోటా సీట్లలో ప్రవేశానికి ‘నీట్’ రాయాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి ఒకే జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్)ను ఈ ఏడాది నుంచే తప్పనిసరిగా అమలు చేయాలంటూ ఇటీవల సుప్రీం ఇచ్చిన ఆదేశాలపై పలు రాష్ట్రాల ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సుప్రీం ఆదేశాల మేరకు మే 1న ‘నీట్’ తొలి విడత పరీక్ష నిర్వహించిన కేంద్రం.. ఆ పరీక్ష రాయని వారికి అవకాశం కల్పిస్తూ జూలై 24న ‘నీట్’ రెండో విడత పరీక్షను నిర్వహించనుంది. అయితే.. సీబీఎస్ఈ ‘నీట్’ సిలబస్‌కు - రాష్ట్ర కోర్సుల్లోని సిలబస్‌కు మధ్య ఉన్న తేడాలు, ప్రాంతీయ భాషల వారికి అన్యాయం జరుగుతుం దన్న ఆందోళనలు, నీట్‌కు సిద్ధమవటానికి విద్యార్థులకు అవసరమైనంత సమయం లేకపోవటం వంటి అంశాలను పలు రాష్ట్రాలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లటం.. నీట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరటం విదితమే. నీట్ తప్పనిసరి చేయటాన్ని దాదాపు 15 రాష్ట్రాలు వ్యతిరేకించాయని కేంద్ర వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై రాష్ట్రాల వైద్యమంత్రులతో సమావేశమైన జె.పి.నడ్డా.. సామరస్య పూర్వక పరిష్కారంపై చర్చించారు. ప్రభుత్వ కాలేజీలకు ఏడాదిపాటు ప్రభుత్వ కాలేజీలకు మినహాయింపు ఇవ్వటం, వచ్చే ఏడాదినుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ.. అందరికీ సంయుక్తంగా ఒకే పరీక్షను నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు. ఆ మేరకు ఈ ఏడాది రాష్ట్రాలకు నీట్ నుంచి మినహాయింపునిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలతోపాటు డీమ్డ్ వర్సిటీలన్నీ ఈ ఏడాది నుంచే నీట్ పరిధిలోకి వస్తాయన్న సుప్రీం తీర్పులో కొన్ని మార్పులు చేస్తూ ఈ ఆర్డినెన్స్ తీసుకురానుంది. రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని కాలేజీలతో పాటు.. ప్రైవేటు కాలేజీల్లోని కన్వీనర్ కోటా, నాన్‌లోకల్(పక్క రాష్ట్రాల విద్యార్థులు) కోటాకు ఈ ఏడాది ‘నీట్’ నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు. ఇవి పోగా ప్రైవేటు కాలేజీలు, డీమ్డ్ వర్సిటీల్లోని స్థానికుల కోసం కేటాయించే మిగతా సీట్లకు ఈ ఏడాదే ‘నీట్’ వర్తిస్తుందని కేంద్ర వర్గాలు చెప్తున్నాయి. ఆర్డినెన్స్ తెస్తే సవాల్ చేస్తాం: సంకల్ప్ రాష్ట్ర ప్రభుత్వాల వైద్య కళాశాలలను ఈ ఏడాది ‘నీట్’ పరిధి నుంచి మినహాయించేందుకు కేంద్రం తీసుకురానున్న ఆర్డినెన్స్‌ను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని సంకల్ప్ చారిటబుల్ ట్రస్ట్ స్వచ్ఛంద సంస్థ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఒకే వైద్య ప్రవేశ పరీక్ష నిర్వహించాలనే డిమాండ్‌తో సుప్రీంకోర్టు తలుపులు తట్టింది కూడా ఈ సంస్థే. ఈ సంస్థ తరఫు న్యాయవాది అమిత్‌కుమార్ శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు భంగం కలిగిస్తూ కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురాజాలదు. ఈ కేసు విచారణ సందర్భంగా నీట్ నిర్వహించటంలో తమకు ఎటువంటి ఇబ్బందీ లేదని కేంద్రం ఒక వైఖరి తీసుకుంది. కానీ ఇప్పుడు ఇలా మాట మార్చేసి రాష్ట్రాలకు నీట్ నుంచి మినహాయింపు ఇవ్వజాలదు. ఆ ఆర్డినెన్స్ జారీ చేస్తే దానిని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తాం’’ అని పేర్కొన్నారు. ప్రైవేటు లాబీకే ప్రయోజనం: కాంగ్రెస్ ప్రైవేటు మెడికల్ కాలేజీల లాబీకి ప్రయోజనం చేకూర్చటానికే విద్యార్థులను పణంగా పెడుతూ కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొస్తోందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పి.సి.చక్కో విమర్శించారు. నీట్ నుంచి మినహాయింపు కల్పిస్తూ ఆర్డినెన్స్ తేవాలన్న కేంద్ర కేబినెట్ నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమని తప్పుపట్టారు. అంతకుముందు.. ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాస్తూ.. నీట్ నుంచి మినహాయింపు ఇవ్వాలన్న ఒత్తిడికి తలొగ్గవొద్దని కోరారు. చాలా మంది రాజకీయ నాయకులు వైద్య కళాశాలలను నడుపుతున్నందునే ఈ మినహాయింపు కోసం ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. సీట్ల కేటాయింపుపై సమీక్షించండి: సీఐసీ దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో సీట్ల కేటాయింపుపై కేంద్రం (ఎంసీఐ) విమర్శనాత్మక సమీక్ష నిర్వహించాలని కేంద్ర సమాచర కమిషన్(సీఐసీ) నిర్దేశించింది. కేటాయించిన సీట్ల కన్నా ఎక్కువ మందిని చేర్చుకుంటున్నారని తమ దృష్టికి వచ్చిందని.. దీనిపై విచారణ జరిపి దోషులుగా తేలిన కాలేజీలపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రెండు రోజుల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు : నీట్‌పై కేంద్ర మంత్రి నడ్డా న్యూఢిల్లీ: నీట్ విషయంలో అందరి ఆందోళనలనూ పరిష్కరించటానికి రెండు రోజుల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లను ఖరారు చేస్తామని కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి జె.పి.నడ్డా పేర్కొన్నారు. నీట్‌ను మొత్తానికి రద్దు చేస్తున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలు నిరాధారమని కేంద్ర కొట్టివేశారు. ఆయన శుక్రవారం రాత్రి పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడారు. ఆర్డినెన్స్ ద్వారా రాష్ట్రాలకు మినహాయింపు ఇస్తున్నారా అన్న ప్రశ్నకు.. ఆ అంశాలపైనే తాము కృషి చేస్తున్నామని బదులిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలు లేవనెత్తిన మూడు సమస్యలు - కొనసాగుతున్న పరీక్షలు, సిలబస్, ప్రాంతీయ భాషలు - వీటిని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ‘‘ఈ రోజు కేబినెట్ సమావేశమైంది. చాలా అంశాలపై చర్చించటం జరిగింది. మేం సంప్రదింపులు జరుపుతున్నాం. ఒక కట్టుదిట్టమైన ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. రేపటికి లేదా ఎల్లుండి (శనివారం లేదా ఆదివారం) కల్లా మేం ఒక నిర్ణయానికి వస్తాం. కేబినెట్ తన అభిప్రాయం చెప్పింది. దానిపై మేం కృషి చేస్తున్నాం’’ అని వివరించారు. నీట్‌ను రద్దు చేస్తున్నట్లు వచ్చిన వార్తలు నిరాధారమని కొట్టివేశారు. నీట్ అమలులో ఉందని, తొలి విడత నీట్ పూర్తయిందని, రెండో విడత జూలై 24న జరుగుతుందని స్పష్టంచేశారు. ఆ తర్వాత సామాజిక వెబ్సైట్ ట్విటర్లోనూ ఈ అంశంపై ట్వీట్లు చేశారు. ‘నీట్‌కు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. అఖిలపక్ష సమావేశం, ఆరోగ్యశాఖా మంత్రుల సమావేశంలో వ్యక్తమైన ఉమ్మడి అభిప్రాయం స్ఫూర్తితో కేంద్రం నిర్ణయం తీసుకునే ప్రక్రియలో ఉంది. నీట్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు, లక్షలాది మంది విద్యార్థుల ఆందోళనలను పరిష్కరిస్తున్నాం’ అని ఆ ట్వీట్లలో పేర్కొన్నారు. -
నీట్ విధానం వల్ల నష్టంలేదు
-మనవాళ్లు అత్యున్నత కళాశాలల్లో సీట్లు పొందే అవకాశం -యాజమాన్య సీట్ల భర్తీ కూడా మెరిట్ ఆధారంగానే -సాక్షి’తో వైద్యవిద్యా సంచాలకులు డా.వేణుగోపాలరావు దేశవ్యాప్తంగా ఓకే ప్రవేశ పరీక్ష నీట్’ విధానం వలన రాష్ట్ర విద్యార్థులకు ఎలాంటి నష్టమూ ఉండదని, పైగా దీనివల్ల లాభమే జరుగుతుందని వైద్యవిద్యా సంచాలకులు డా.టి.వేణుగోపాల్‌రావు స్పష్టం చేశారు. ఈ విధానం వలన మన విద్యార్థులు జాతీయ స్థాయిలో మంచి ర్యాంకులు సాధించే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. గురువారం ఆయన సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు. గతంలో తాను ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ రిజిస్ట్రార్‌గా ఉన్నప్పుడు నీట్’పై పలువురు నిపుణులతో రాష్ట్రప్రభుత్వం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి అభిప్రాయాలు సేకరించిందన్నారు. అప్పట్లో 90 శాతం మంది నిపుణులు నీట్’ విధానమే మంచిదని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారన్నారు. అయితే అప్పట్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా నీట్’ అమల్లోకి రాలేదని, ఆ తర్వాత రాష్ట్రం విడిపోవడం వంటి పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. జాతీయ స్థాయిలో జరిగే ఈ ప్రవేశ పరీక్ష కారణంగా మన ర్యాంకులకు ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం వాటిల్లదని అన్నారు. పైగా దీనివల్ల భవిష్యత్‌లో ప్రైవేటు కళాశాలల్లో ఉన్న యాజమాన్య కోటా సీట్లు కూడా ప్రతిభ ఆధారంగా భర్తీ అయ్యే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. అప్పుడు ప్రైవేటు కళాశాలలు ర్యాంకుల ఆధారంగా నిర్ణయించిన ఫీజులు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుందని, కోట్లకు కోట్లు వసూలు చేసే అవకాశం ఉండదని అన్నారు. ఇక ప్రవాస భారతీయ కోటా సీట్లు 15 శాతం మాత్రమే యాజమాన్యాల చేతుల్లో ఉంటాయని అవి కూడా కోర్టు తీర్పుననుసరించి భర్తీ చేయాల్సి ఉంటుందన్నారు. నీట్ వలన దేశవ్యాప్తంగా అత్యున్నత కళాశాలల్లో సీట్లు లభించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది పీజీ సీట్ల పెంపు 2017-18 ఏడాదికి రాష్ట్రంలో వందకుపైగా పీజీ వైద్య సీట్ల పెంపునకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికీ భారతీయ వైద్యమండలికి ప్రతిపాదనలు వెళ్లాయని అన్నారు. సీట్లు రావడానికి కావాల్సిన మౌలిక వసతుల కల్పన జరుగుతోందన్నారు. త్వరలోనే అసోసియేట్ ప్రొఫెసర్లకు పదోన్నతులు కల్పించి, అసిస్టెంట్ ప్రొఫెసర్లను భర్తీ చేస్తామని అన్నారు. గత ఏడాది ఆరు కళాశాలలకు వచ్చిన 300 అదనపు ఎంబీబీఎస్ సీట్లకు ఎలాంటి సమస్య ఉండదని డా.వేణుగోపాల్ రావు స్పష్టం చేశారు.