సాక్షి, న్యూఢిల్లీ: నీట్ యూజీ 2021 ఫలితాల విడుదలకు మార్గం సుగమమైంది. ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ ఫలితాలను ప్రకటించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)ను సుప్రీంకోర్టు ఆదేశించింది. సెప్టెంబర్ 12న నీట్ యూజీ పరీక్షను ఎన్‌టీఏ నిర్వహించింది. అయితే, టెస్ట్ బుక్‌లెట్, ఓఎంఆర్ షీట్లు పరీక్షా కేంద్రంలో తారుమారయ్యాయంటూ మహారాష్ట్రకు చెందిన ఇద్దరు అభ్యర్థులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. వారిద్దరికీ పరీక్ష మళ్లీ నిర్వహించాకే నీట్ ఫలితాలను వెల్లడించాలని హై కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాలపై ఎన్‌టీఏ సుప్రీం ను ఆశ్రయించింది. జస్టిస్ లావు నాగేశ్వరరావు , జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయిల ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. ఇద్దరి కోసం 16 లక్షల మంది పరీక్షా ఫలితాలు నిలిపివేయడం కుదరదంది.
Comments
Please login to add a commentAdd a comment