center govt
-
ఇక్కడ ఎవరూ ఎవరినీ... బెదిరించలేరు
ప్రయాగ్‌రాజ్: కొలీజియం విషయంపై కేంద్రానికి, న్యాయవ్యవస్థకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో న్యాయ మంత్రి కిరెణ్ రిజిజు మరోసారి స్పందించారు. ప్రయాగ్‌రాజ్‌లో అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ 150వ వార్షికోత్సవంలో పాల్గొని రిజిజు ప్రసంగించారు. హైకోర్టు జడ్జీల బదిలీలు, నియామకాల్లో ఏదైనా ఆలస్యమైతే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని కేంద్రప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేయడం తెల్సిందే. దీనిపై శనివారం మంత్రి రిజిజు మాట్లాడారు. ‘ భారత్‌లో ప్రజలే అసలైన యజమానులు. మనమంతా సేవకులం. రాజ్యాంగం చూపిన మార్గనిర్దేశకత్వంలో ప్రజలకు సేవ చేసేందుకే మనం ఇక్కడ ఉన్నాం. ప్రజాభీష్టం మేరకు రాజ్యాంగానికి లోబడే దేశపాలన కొనసాగనుంది. ఇక్కడ ఎవరూ ఎవరినీ బెదిరించలేరు. కొన్ని సార్లు కొన్ని అంశాలపై చర్చలు జరుగుతాయి. ప్రజాస్వామ్యంలో వారి అభిప్రాయం చెప్పే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. బాధ్యతాయుత పదవుల్లో ఆసీనులైన వారు ఏదైనా చెప్పేముందు ఆలోచించాలి’ అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలనుద్దేశిస్తూ పరోక్షంగా వ్యాఖ్యానించారు. దేశంలోని వేర్వేరు కోర్టుల్లో 4.90 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ‘చిన్న చిన్న కేసులు కోర్టుల బయటే పరిష్కారం పొందుతాయి. దీంతో కోర్టులకు కేసుల భారం చాలా తగ్గుతుంది’ అని మంత్రి అన్నారు. -
మోదీపై విపక్షాలది దుష్ప్రచారమే
న్యూఢిల్లీ: ‘‘కేంద్రం ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీపై ప్రతిపక్షాల ఆరోపణలన్నీ దుష్ప్రచారాలు మాత్రమే. పలు కేసుల్లో ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుల్లోనూ ఇదే స్పష్టమైంది’’ అని బీజేపీ పేర్కొంది. సోమవారం బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీలో కేంద్ర న్యాయ మంత్రి కిరెన్ రిజిజు ఈ మేరకు చేసిన రాజకీయ తీర్మానాన్ని సమావేశం ఆమోదించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాకు ఈ మేరకు వెల్లడించారు. ‘‘రఫేల్, పెగసస్, సెంట్రల్ విస్టా ప్రాజెక్టు, నోట్ల రద్దు, ఈడబ్ల్యూఎస్ కోటా తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర దుష్ప్రచారం సాగించాయి. కానీ వీటికి సంబంధించిన అన్ని కేసుల్లోనూ కేంద్రం వైఖరిని సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పులు వెలువరించింది. విపక్షాలు చెబుతున్నదంతా అబద్ధమేనని దీంతో తేలిపోయింది’’ అని ఆమె అన్నారు. మోదీపై వారి నిరాధార ఆరోపణలను చట్టపరంగా తిప్పికొట్టామన్నారు. ‘‘దేశం కోసం పనిచేస్తున్న మోదీకి ప్రపంచదేశాల్లో గౌరవం లభిస్తోంది. దేశ ప్రతిష్టను ఆయన పెంచారు’’ అన్నారు. 2023 ఎన్నికలు కీలకం: నడ్డా లోక్‌సభ ఎన్నికలకు ముందు 2023లో ఎన్నికలు జరిగే 9 రాష్ట్రాల్లో ఒక్కదాన్నీ బీజేపీ కోల్పోరాదని పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునిచ్చారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపును చరిత్రాత్మకంగా ఆయన అభివర్ణించారు. మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి దూసుకుపోతోందని కొనియాడారు. మోదీకి ఘన స్వాగతం అంతకుముందు కార్యవర్గ సమావేశానికి వస్తున్న మోదీకి బీజేపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. పటేల్ చౌక్ నుంచి ఎన్డీఎంసీ కన్వెన్షన్ దాకా పార్టీ కార్యకర్తలు రోడ్డుకు ఇరువైపులా నిలబడి ప్రధానిపై పూలు చల్లారు. నినాదాలతో హోరెత్తించారు. ప్రభుత్వ విజయాలను తెలుపుతూ భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు. వేదిక వద్ద మోదీకి నడ్డా స్వాగతం పలికారు. -
ఈడీ డైరెక్టర్ పదవీ కాలం మరో ఏడాది పొడిగింపు
న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వ విచారణ సంస్థ అయిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) డైరెక్టర్ సంజయ్‌కుమార్ మిశ్రా(62) పదవీ కాలాన్ని మరో ఏడాదిపాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 1984 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి అయిన సంజయ్ కుమార్ మిశ్రా 2023 నవంబర్ 18వ తేదీ వరకూ లేదా తదుపరి ఉత్తర్వులు జారీ చేసేదాకా ఆ పదవిలో కొనసాగుతారని వెల్లడించింది. ఆయన పదవీ కాలం పొడిగింపునకు కేంద్ర మంత్రివర్గ అపాయింట్మెంట్స్ కమిటీ ఆమోదం తెలియజేసింది. 2018 నవంబర్ 19న ఈడీ డైరెక్టర్‌గా నియమితులైన సంజయ్‌కుమార్ మిశ్రా పదవీ కాలాన్ని కేంద్రం ఇప్పటికే పలుమార్లు పొడిగించింది. -
సమష్టి కృషితోనే నేరాలకు అడ్డుకట్ట
సూరజ్‌కుండ్(హరియాణా): దేశవ్యాప్తంగా విస్తరించిన నేర సామ్రాజ్యాన్ని కూల్చేయడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమష్టి బాధ్యత అని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. హరియాణాలోని సూరజ్‌కుండ్‌లో జరుగుతున్న అన్ని రాష్ట్రాల హోం శాఖ మంత్రులు, పోలీసు ఉన్నతాధికారుల ‘చింతన్ శిబిర్’ సదస్సులో అమిత్ షా ప్రసంగించారు. ‘ స్వాతంత్య్ర దినోత్సవం రోజు ప్రధాని మోదీ అభిలషించిన పంచప్రాణ లక్ష్యాలు, వందేళ్ల స్వతంత్రభారతం(2047 దార్శనికత)ను సాకారం చేసుకోవడానికి ఈ చింతన్ శిబిర్‌లో ఫలవంత కార్యాచరణను సంసిద్ధం చేసుకుందాం. జమ్మూకశ్మీర్, విదేశీ అక్రమ విరాళాలు, మాదకద్రవ్యాల నిరోధం, ఈశాన్యరాష్ట్రాల్లో వేర్పాటువాదుల లొంగుబాటుతో సమస్యలను అణచేసి దేశ అంతర్గత భద్రతను పెంచడంలో మోదీ సర్కార్ సఫలత సాధించింది. ‘పశుపతి(నాథ్) నుంచి తిరుపతి వరకు వామపక్ష తీవ్రవాదం ఉండేది. అదీ సద్దుమణిగింది. ఇక, రాష్ట్రంలో శాంతిభద్రత అనేది ఆ రాష్ట్ర అంశమే. కానీ, మనందరం ఉమ్మడిగా పోరాడి అన్ని రాష్ట్రాల్లో నేరాలను అణచివేద్దాం. ఇది మనందరి సమష్టి బాధ్యత’ అని హోం మంత్రులతో షా వ్యాఖ్యానించారు. ‘కొన్ని ఎన్జీవోలు మతమార్పిడి వంటి దుశ్చర్యలకు పాల్పడ్డాయి. దేశార్థికాన్ని బలహీనపరిచేలా, అభివృద్ధిని అడ్డుకునేలా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు విదేశీ నిధులను దుర్వినియోగం చేశాయి. వీటిపై విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద ఆంక్షల చర్యలు తీసుకున్నాం’ అని షా చెప్పారు. -
Telangana-IPS Officers: పోస్టింగ్ లేదు.. వెళ్లిపోదాం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్‌శాఖలో పోస్టింగ్ లేకుండా నెలలకొద్దీ అటాచ్మెంట్ల మీద పనిచేస్తున్న ఐపీఎస్ అధికారుల్లో తీవ్ర నైరాశ్యం ఏర్పడింది. దీంతో బయటకు చెప్పలేక, పోస్టింగ్ కోసం తిరగలేక కొంతమంది కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఏడాది నుంచి వెయిటింగ్లో ఉన్న ఓ సీనియర్ ఐపీఎస్‌తోపాటు డీఐజీ పదోన్నతికి సిద్ధంగా ఉన్న మరో అధికారి, ఇద్దరు సీనియర్ ఎస్పీ ర్యాంకు అధికారులు కేంద్ర సర్వీసుల్లోకి డిప్యుటేషన్‌పై వెళ్లేందుకు జీఏడీకి దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది. కేంద్ర సర్వీసుల్లోని 17 విభాగాల్లో ఎక్కడో ఒకచోట అవకాశం రాకపోతుందా అని ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ పోస్టింగ్ లేకపోయినా కనీసం కేంద్ర సర్వీసులో అయినా మూడేళ్లు, అవకాశం ఉంటే మరో రెండేళ్లు అక్కడే పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు... కేంద్ర సర్వీసుల్లో పనిచేసి వచ్చిన రాష్ట్ర కేడర్ అధికారులు, ఇంటర్ కేడర్ డిప్యుటేషన్, కేడర్ మార్చుకొని వచ్చిన అధికారులు పోస్టింగ్ లేక ఏడాదిగా ఖాళీగా ఉన్నారు. అయితే కేంద్ర సర్వీసుల నుంచి డిప్యుటేషన్ పూర్తి చేసుకున్నవారు మళ్లీ కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లాలంటే ఏడాదిపాటు కూలింగ్ పీరియడ్‌గా సొంత కేడర్ స్టేట్‌లో పనిచేయాల్సి ఉంటుంది. అయితే డిప్యుటేషన్ పూర్తిచేసుకొని వచ్చినవారికి ఏడాదిపాటు వెయిటింగ్లో ఉండటం నిరాశను కలిగించినట్టు తెలుస్తోంది. దీంతో ఇక్కడ చేసేదేమీలేక మళ్లీ కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. కేడర్ మార్చుకొని తెలంగాణకు వచ్చిన అధికారులు సైతం ఇదే పద్ధతిలో కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లిపోవాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. భారీగానే ఖాళీలు కేంద్ర సర్వీసుల్లోని 17 విభాగాల్లో డిప్యుటేషన్‌కు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం జూలై చివరి వరకు ఉన్న వేకెన్సీ పరిస్థితిని పరిశీలిస్తే భారీగానే ఖాళీలున్నట్టు కేంద్ర హోంశాఖ వెబ్సైట్లో పొందుపరిచింది. డైరెక్టర్ జనరల్(డీజీ) ర్యాంకులో రెండు పోస్టులు, స్పెషల్ డైరెక్టర్ జనరల్ ర్యాంకులో రెండు పోస్టులు, ఐజీ ర్యాంకులో 25 పోస్టులు, డీఐజీ హోదాలో 102 పోస్టులు, ఎస్పీ ర్యాంకులో 116 పోస్టులు కేంద్ర పోలీస్ సంస్థలు, కేంద్ర పారామిలిటరీ బలగాల్లో ఖాళీగా ఉన్నట్టు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పోస్టింగ్ లేని అధికారులు కేంద్రంలోకి వెళ్లేందుకే సానుకూలంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. -
AP: పీఎంజీకేఏవై బియ్యం పంపిణీకి కేంద్రం అనుమతి
సాక్షి, అమరావతి: పీఎంజీకేఏవై బియ్యం పంపిణీకి కేంద్రం అనుమతినిచ్చింది. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలకు అంగీకరించిన కేంద్రం.. ఎన్ఎఫ్ఎస్ఏ కార్డుదారులకు బియ్యం పంపిణీ చేయడానికి అనుమతి ఇచ్చింది. ఆగస్ట్ 1 నుంచి ఎన్ఎఫ్ఎస్ఏ కార్డుదారులకు ప్రభుత్వం బియ్యం పంపిణీ చేయనుంది. చదవండి: ఏపీ సర్కార్‌పై ఎల్లో మీడియా విషం.. పార్లమెంట్ సాక్షిగా వెల్లడైన వాస్తవాలు -
Agnipath Scheme: అనుమానాలు, వివరణలు
అగ్నిపథ్ పథకంపై యువత నానా సందేహాలు వ్యక్తం చేస్తుండగా, ఉద్యోగ భద్రత లేదన్న మాటేగానీ ఇదో అవకాశాల నిధి అని కేంద్రం అంటోంది. పథకంపై సందేహాలు, ప్రభుత్వ వివరణలను ఓసారి చూద్దాం... ► 17.5 నుంచి 21 ఏళ్ల వారిని సైన్యంలోకి తీసుకుంటారు. నాలుగేళ్ల తర్వాత 75% మందిని వెనక్కు పంపుతారు. పెన్షనూ ఉండదు. అప్పుడు భవిష్యత్ అగమ్యగోచరం కాదా? అగ్నివీరుల భవిష్యత్తుకు ఢోకా లేదు. రిటైరయేప్పుడు సేవానిధి ప్యాకేజీ కింద ఆదాయ పన్ను మినహాయింపుతో రూ.11.71 లక్షలిస్తారు. దానికి తోడు వ్యాపారాలకు బ్యాంకులు రుణాలిస్తాయి. పన్నెండో తరగతితో సమానమైన సర్టిఫికెట్ ఇస్తారు. సైన్యంలో అనుభవంతో తేలిగ్గా ఇతర ఉద్యోగాలు లభిస్తాయి. పైగా రక్షణ శాఖ నియామకాలతో పాటు సీఏపీఎఫ్, అసోం రైఫిల్స్ నియామకాల్లోనూ వారికి 10 శాతం కోటా ఉంటుంది. పలు రాష్ట్ర ప్రభుత్వ నియామకాల్లోనూ ప్రాధాన్యముంటుంది. ► కేవలం నాలుగేళ్ల సర్వీస్ కోసం ఎవరైనా ఎందుకు అంతగా కష్టపడతారు? అగ్నిపథ్ ఒక అవకాశాల నిధి. దేశంలో 14 లక్షల మంది సైనికులున్నారు. వీరిలో ఏటా 60 వేల మంది రిటైరవుతారు. అగ్నిపథ్‌లో భాగంగా ఖాళీల కంటే 75 శాతం మందిని అదనంగా తీసుకుంటారు. అంటే అవకాశాలు మూడు రెట్లు పెరుగుతాయి. ఆర్మీ శిక్షణతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. క్రమశిక్షణ అలవడుతుంది. జీవితాన్ని నచ్చినట్టుగా మలచుకునే అవకాశముంటుంది. ► నాలుగేళ్లకే ఉద్యోగం కోల్పోతే యువత అసాంఘిక శక్తులుగా మారే ప్రమాదముంది. ఒక్కసారి యూనిఫాం ధరిస్తే అలా ఎప్పటికీ మారరు. నియమబద్ధమైన జీవితం గడుపుతారు. ► రిటైర్డ్ సైనికాధికారులు తదితరులతో సంప్రదింపులు జరపకుండా హడావుడిగా అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చారు. వారితో రెండేళ్లు విస్తృతంగా సంప్రదింపులు జరిపాకే తీసుకువచ్చాం. దీనితో ఎన్నో లాభాలంటూ మాజీ అధికారులు స్వాగతించారు. ► బలగాల సామర్థ్యాన్ని పథకం దెబ్బ తీస్తుంది. స్వల్పకాలిక సర్వీసు కోసం సైన్యంలో నియామకాలు చేపడుతున్న దేశాలెన్నో ఉన్నాయి. భారత్ కూడా అలాగే ముందుకెళ్లాలి. ప్రతి 100 మందిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 25 మంది పర్మనెంట్ అవుతారు. వారు దేశ రక్షణకు కోటగోడలా మారతారు. ► 21 ఏళ్ల వయసులో మానసిక పరిపక్వత ఉండదు. నమ్మకంగా పని చేయలేరు. ఎన్నో దేశాలు యువ రక్తాన్నే సైన్యంలోకి తీసుకుంటున్నాయి. ఉడుకు రక్తం ఉన్నప్పుడే ధైర్యం ఎక్కువగా ఉంటుంది. కరోనా వల్ల రెండేళ్లుగా సైన్యంలో నియామకాలు చేపట్టలేదు గనుక ఈ ఏడాదికి వయో పరిమితిని 23 ఏళ్లకు పెంచాం. యువత, అనుభవజ్ఞులు సగం సగం ఉండేలా చూస్తాం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎంఎస్ఎంఈలకు మరింత ప్రోత్సాహం!
న్యూఢిల్లీ: సూక్ష్మ, లఘు, మధ్య చిన్న తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) పురోగతి లక్ష్యంగా కేంద్రం జెడ్ఈడీ (జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్) సర్టిఫికేషన్ కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. కేంద్ర మంత్రి నారాయణ్ రాణే ఈ పథకాన్ని ప్రారంభించారు. ఎంఎస్ఎంఈ పారిశ్రామిక ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపరచడం, లాభాలను పెంచడం, పర్యావరణంపై హానికరమైన పద్దతులను నియంత్రించడం, ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడం వంటి అంశాలకు సంబంధించి తాజా పథకం ప్రయోజనకరంగా ఉంటుంనది మంత్రి రాణే తెలిపారు. ఎంఎస్ఎంఈ ఛాంపియన్స్ పథకంలో భాగమైన జెడ్ఈడీ ధృవీకరణ పథకం ద్వారా వ్యర్థాలను గణనీయంగా తగ్గించవచ్చని, ఉత్పాదకతను మెరుగుపరచవచ్చని, పర్యావరణ స్పృహపై అవగాహన పెరుగుతుందని, సహజ వనరులను అత్యుఉత్తమంగా ఉపయోగించుకోవచ్చని, మార్కెట్ విస్తరించుకోవచ్చని మంత్రి వెల్లడించారు. బహుళ ప్రయోజనం... అధికార వర్గాల సమాచారం ప్రకారం, ఈ పథకం కాంస్య, వెండి, బంగారంతో సహా మూడు ధృవీకరణ స్థాయిలను కలిగి ఉంటుంది. ఎంఎస్ఎంఈలు ఏదైనా ధృవీకరణ స్థాయికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అందుకు తగిన ప్రమాణాలను పాటించడానికి సిద్ధంగా ఉండాలి. పథకం కింద దాదాపు 20 మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ తర్వాత ఎంఎస్ఎంఈలు జెడ్ఈడీ మార్గర్శకాల దిశగా చర్యలు తీసుకోవాలి. జెడ్ఈడీ ధృవీకరణ వ్యయంపై ఎంఎస్ఎంఈలు సబ్సిడీని పొందుతాయి. మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌కు ధృవీకరణ ఖర్చులో 80 శాతం వరకు సబ్సిడీ మొత్తం ఉంటుంది, అయితే చిన్న, మధ్యస్థ యూనిట్లకు ఇది వరుసగా 60 శాతం, 50 శాతంగా ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల యాజమాన్యంలోని ఎంఎస్ఎంఈలకు 10 శాతం అదనపు సబ్సిడీ ఉంటుంది. పైన పేర్కొన్న వాటికి అదనంగా మంత్రిత్వ శాఖ యొక్క స్పూర్తి లేదా మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ – క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎంఎస్ఈ–సీడీపీ) భాగమైన ఎంఎస్ఎంఈలకు 5 శాతం అదనపు సబ్సిడీ ఉంటుంది. ఇంకా, జెడ్ఈడీ మార్గదర్శకాలు, ప్రమాణాలు పాటించడం ప్రారంభించిన తర్వాత ప్రతి ఎంఎస్ఎంఈకి పరిమిత ప్రయోజనం చేకూర్చే విధంగా రూ. 10,000 రివార్డు ప్రదానం జరుగుతుంది. జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ సొల్యూషన్స్ వైపు వెళ్లేందుకు ప్రోత్సాహకరంగా వారికి జెడ్ఈడీ సర్టిఫికేషన్ కింద హ్యాండ్‌హోల్డింగ్, కన్సల్టెన్సీ మద్దతు కోసం ఎంఎస్ఎంఈకి రూ. 5 లక్షల వరకూ కేటాయింపు అందుబాటులో ఉంటుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఆర్థిక సంస్థలు మొదలైన వాటి ద్వారా జెడ్ఈడీ సర్టిఫికేషన్ కోసం అందించే అనేక ఇతర ప్రోత్సాహకాలను కూడా పొందవచ్చు. ఎంఎస్ఎంఈ కవచ్ (కోవిడ్–19 రక్షణ నిమిత్తం) చొరవ కింద ఉచిత ధృవీకరణ కోసం కూడా దరఖాస్తు కూడా చేసుకోవచ్చు. -
కరోనా కాలర్ ట్యూన్లు తక్షణమే ఆపేయండి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి పట్ల ప్రజలను అప్రమత్తం చేసేందుకు అందుబా టులోకి తెచ్చిన కాలర్ ట్యూన్లను ఇకపై నిలిపివేయాలని టెలికం కంపెనీలను కేంద్రం ఆదేశించింది. కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు, వ్యాధిపై ముందు జాగ్రత్తలు, టీకా ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేంద్ర టెలీకమ్యూనికేషన్ల శాఖ రెండేళ్లుగా పలు దఫాలుగా వీటిని జారీ చేసింది. ఇకపై కరోనా సంబంధిత అన్ని ప్రకటనలు, కాలర్ ట్యూన్లను తక్షణమే ఆపేయాలని టెలికం ప్రొవైడర్లను కోరుతూ టెలికమ్యూనికేషన్ల శాఖ మార్చి 29వ తేదీన ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఇందుకు, కేంద్ర కుటుంబ, ఆరోగ్య శాఖ కూడా సమ్మతించిం దని వివరించింది. వీటి కారణంగా అత్యవసర సమయాల్లో ఫోన్ కాల్స్ ఆలస్యమవు తున్నాయంటూ కేంద్రానికి ఇటీవలి కాలంలో పలువురి నుంచి విజ్ఞాపనలు అందాయి. -
మహిళా రక్షణ మాతోనే సాధ్యం
సహరన్పూర్: ఉత్తరప్రదేశ్‌లో ఏ ముస్లిం మహిళా అణచివేతకు గురికాకూడదనే ఆదిత్యనాథ్ ప్రభుత్వం కోరుకుంటోందని, కేంద్రం త్రిపుల్ తలాక్ చట్టం చేయడంలో యూపీ సీఎం యోగీ పాత్ర కీలకమని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. యూపీలో మహిళలకు రక్షణ కావాలన్నా, నేరస్థులు జైళ్లలో ఉండాలన్నా... బీజేపీ అధికారంలో ఉండాలని స్పష్టం చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత మొట్టమొదటి సారి యూపీలో ప్రత్యక్ష ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సహరన్‌పూర్‌లో ఏర్పాటు చేసిన బీజేపీ ర్యాలీనుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. 2013లో జరిగిన ముజఫర్‌నగర్ అల్లర్లు ఒక కళంకం అయితే, 2014లో జరిగిన సహరన్పూర్ మత కల్లోహాలు మరింత భయంగొల్పాయని, వాటికి కారణమైన వాళ్లకు 2017లోనే ఇక్కడి ప్రజలు గుణపాఠం చెప్పారని కితాబిచ్చారు. పేద ప్రజలు రూ.5లక్షల వరకు ఉచిత వైద్యం పొందాలన్నా, చిన్న రైతులకు కిసాన్యోజన నిధులు రావాలన్నా, ఉచిత రేషన్ అందాలన్నా, టీకా ఉచితంగా అందాలన్నా, పక్కా ఇళ్లు ఇవ్వాలన్నా అది కేవలం బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యమని, అది యూపీ ప్రజలు గుర్తించారని తెలిపారు. ఇదివరకు ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా బీజేపీ ప్రభుత్వం చెరుకు రైతులకు మద్దతు ధర ఇచ్చిందన్నారు. బిపిన్‌రావత్ కటౌట్ వాడుకుంటున్నారు... ఉత్తరాఖండ్‌లోని శ్రీనగర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలోనూ ప్రధాని పాల్గొని ప్రసంగించారు. దివంగత జనరల్ బిపిన్ రావత్ బతికుండగా నిందించిన కాంగ్రెస్, ఇప్పుడు ఎన్నికల్లో ఓట్లకోసం ఆయన కటౌట్‌ను ఉపయోగించుకుంటోందని ఎద్దేవా చేశారు. పాకిస్తాన్ టెర్రరిస్టు స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు, ఢిల్లీలో ఉండి రుజువులు కావాలని అడిగిన ఘనత కాంగ్రెస్ పార్టీదని విమర్శించారు. సాయుధ దళాలపై విద్వేషం వెల్లగక్కిన నేతలు ఇప్పుడు వారి చిత్రాలను ఉపయోగించుకోవడం హాస్యాస్పదమన్నారు. బిపిన్‌రావత్ జ్ఞాపకాలను కొనియాడిన మోదీ ఉద్వేగానికి లోనయ్యారు. నెహ్రూ వల్లే గోవా విముక్తి ఆలస్యం పండిట్ జనవహర్‌లాల్ నెహ్రూ పట్టుబడితే... 1947లో కొన్ని గంటల్లోనే గోవా, పోర్చుగీసు నుంచి విముక్తమయ్యేదని, కానీ ఆయన నిర్లక్ష్యం వల్లే 15ఏళ్ల కాలం పట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మపుసలో ఏర్పాటు చేసిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్‌పార్టీ గోవాను శత్రువులా చూస్తోందని, భవిష్యత్‌లోనూ అదే తీరు కొనసాగుతుందని జోస్యం చెప్పారు. గోవా యువత ఏం కోరుకుంటోంది? ఇక్కడి రాజకీయ సంస్కృతి ఏమిటన్నది కాంగ్రెస్‌కు ఎప్పటికీ అర్థం కాదన్నారు. -
మోదీ ఇజ్రాయెల్ పర్యటనతో సీన్ మారింది
‘‘ది బ్యాటిల్ ఫర్ ది వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ సైబర్‌వెపన్’’ అనే టైటిల్‌తో న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన ఆ కథనంలో వివరాలు ఇలా ఉన్నాయి. ‘‘ఇజ్రాయెల్‌కు చెందిన భద్రతా సంస్థ ఎన్‌ఎస్‌ఒఓ గ్రూప్ గత దశాబ్దాకాలంగా పెగసస్ స్పైవేర్ నిఘా వ్యవస్థని ప్రపంచ దేశాలకు విక్రయిస్తోంది. ఇది పని చేసినట్టు మరేది చేయలేదని వివిధ దేశాల పోలీసు, ఇంటెలిజెన్స్ వ్యవస్థలకు ఆ సంస్థ హామీలు గుప్పించింది. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, ప్రైవేటు డిటెక్టివ్ కంపెనీలు కూడా చేయలేని పని ఈ పెగసస్ చేస్తుంది. ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లలో ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్లను కూడా కనిపెట్టగలదు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2017 జులైలో ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లినప్పుడు పెగసస్ స్పైవేర్‌పై ఒప్పందం కుదిరింది. ఒక భారత ప్రధాని ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లడం అదే తొలిసారి. అంతకు ముందు దశాబ్దాలుగా పాలస్తీనాకు మద్దతుగానే భారత్ వ్యవహరించింది. కానీ మోదీ పర్యటనలో అప్పటి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో అత్యంత సుహృద్భావ వాతావరణం మధ్య చర్చలు జరిగాయి. నెతన్యాహూతో కలిసి మోదీ చెప్పులు లేకుండా మరీ స్థానిక బీచ్‌లో విహరించారు. ఆ పర్యటనలో ఇరు దేశాల మధ్య 200 కోట్ల డాలర్ల ఒప్పందం కుదిరింది. అత్యంత ఆధునిక ఆయుధాలు, క్షిపణి వ్యవస్థ, పెగసస్ స్పైవేర్ అన్నీ కలిసి ఒక ప్యాకేజీలా కొనుగోలు ఒప్పందం జరిగింది. ఆ తర్వాత కొద్ది నెలలకే నెతన్యాహూ ఆకస్మికంగా భారత్‌కు పర్యటించారు. 2019 జూన్‌లో ఐక్యరాజ్యసమితి ఆర్థిక సామాజిక మండలి పాలస్తీనాకు చెందిన మానవ హక్కుల సంస్థకు అబ్జర్వర్ స్టేటస్‌కు ఇవ్వడానికి నిరాకరించినప్పుడు జరిగిన ఓటింగ్‌లో భారత్ ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఓటు వేసింది. అంతర్జాతీయ వేదికపై ఇజ్రాయెల్‌కు భారత్ మద్దతునివ్వడం అదే తొలిసారి. అమెరికాకు చెందిన ఎఫ్బిఐ కూడా పెగసస్ స్పైవేర్‌ను కొనుగోలు చేసినప్పటికీ దానిని ఎవరి మీద వినియోగించకూడదని నిర్ణయించింది. 2011లో ఇజ్రాయెల్ ప్రపంచ మార్కెట్లో పెగసస్‌ని ప్రవేశపెట్టిన తర్వాత పలు యూరప్ దేశాలు ఉగ్రవాదుల ఉనికి కనిపెట్టడానికి దీనిని వినియోగించాయి. ఉగ్రవాదులు, కరడుగట్టిన నేరస్తులు దగ్గర అత్యంత ఆధునికమైన కమ్యూనికేషన్ వ్యవస్థలు ఉన్నాయి. వాటిని డీక్రిప్ట్ (డీకోడ్) చేయగలిగే సామర్థ్యం పెగసస్‌కి ఉండటంతో విధ్వంసకారుల గుట్లు తెలిసేవి. కానీ దీనిని కొనుగోలు చేసిన దేశాలు హక్కుల సంఘాలపై కూడా ప్రయోగించాయి. జర్నలిస్టులు, రాజకీయ అసమ్మతివాదులపైనా మెక్సికో ప్రయోగిస్తే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పౌర హక్కుల కార్యకర్తలపైనా, సౌదీ అరేబియా మహిళా హక్కుల కార్యకర్తలపైనా నిఘాను ఉంచాయి. ఈ స్పైవేర్ ఇలా దుర్వినియోగమడం వివాదాస్పదం కావడంతో ఇజ్రాయెల్ ప్రభుత్వం దీనిపై గత ఏడాది జులైలో విచారణకు ఒక కమిటీ వేసింది. దీనిపై ఎన్ఎస్ఒ ఆనాటి చీఫ్ షాలెవ్ హులియో ఇజ్రాయెల్ సైబర్ పరిశ్రమపైనే బురదజల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. గత ఏడాది నవంబర్‌లో ఇజ్రాయెల్ ప్రభుత్వం ఈ వివాదం నుంచి దూరంగా జరిగింది. స్పైవేర్‌ని రూపొందించిన ఎన్ఎస్ఒ ప్రైవేటు సంస్థ కాబట్టి ఇజ్రాయెల్ ప్రభుత్వ విధానాలు ఆ సంస్థకి వర్తించవని తప్పించుకుంది. దీంతో అమెరికా ప్రభుత్వం ఆ సంస్థపై ఆంక్షలు విధించింది’’ అని న్యూయార్క్ టైమ్స్ ఆ కథనాన్ని ముగించింది. -
నీట్–పీజీ ‘ఈడబ్ల్యూఎస్ కోటా’ కేసులను సత్వరం తేల్చండి
న్యూఢిల్లీ: నీట్–పీజీ ప్రవేశాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్) కోటాకు సంబంధించి దాఖలైన కేసులను అత్యవసరమైనవిగా భావించి మంగళవారం విచారణ చేపట్టాలని కేంద్రం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బొపన్నల ధర్మాసనం ఎదుట సోమవారం సొలిసిటర్ జనరల్ తుషార్ కేంద్ర తరఫున ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘ఈ కేసును మంగళవారం విచారణ జరిపే కేసుల జాబితాలో చేర్చాలని సీజేఐకి విజ్ఞప్తి చేస్తాను’అని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. ఈ కేసును కొంత అత్యవసరమైనదిగా భావించి మంగళవారమే విచారణ చేపట్టాలని, లేకుంటే బుధవారమైనా విచారించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనాన్ని కోరారు. -
Work From Home: వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్..!
Government To Chalk Out Legal Road Map For Work From Home: వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు శుభవార్త...! కరోనా రాకతో ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్‌కే పరిమితమైన విషయం తెలిసిందే. కాగా ఆయా కంపెనీలు ఉద్యోగులతో ఎక్కువసేపు పనిచేస్తున్నారనే వార్తలు రావడంతో... వర్క్ ఫ్రమ్ హోంపై కేంద్రం త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోనుంది. త్వరలోనే... ఫ్రేమ్ వర్క్..! వర్క్ ప్రమ్ హోంపై కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఒక ఫ్రేమ్ వర్క్‌ను రూపొందించేందుకు ఓ కమిటీను ఏర్పాటుచేయనుంది. దీంతో ఉద్యోగుల హక్కులను కాపాడే అవకాశం ఉంది. వర్క్ ఫ్రమ్ హోం పేరుతో ఉద్యోగులను ఆయా సంస్థలు పిండేస్తున్నాయి. ఈ ఫ్రేమ్ వర్క్‌తో ఉద్యోగులకు కచ్చితమైన పనిగంటలను నిర్ణయించి అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఉద్యోగులకు విద్యుల్, ఇంటర్నెట్ బిల్లులు, ఇంట్లో ఉపయోగించే ఆఫీస్ స్పేస్, ఫర్నిచర్ వంటి ప్రాథమిక ఖర్చులను కంపెనీలు భరించేలా నిబంధనలను రూపొందించనున్నారు. వర్క్ ఫ్రమ్ హోంపై అధ్యయనం కోసం ప్రభుత్వం ఒక కన్సల్టెన్సీ సంస్థను నియమించనుంది. చదవండి: 2021లో తెగ వాడేసిన ఎమోజీ ఇదేనండోయ్..! మరింత జవాబుదారీగా..! ఈ ఏడాది ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోంపై స్టాండింగ్ ఆర్డర్స్‌ను ఆమోదించడం ద్వారా పలు సేవారంగాల్లో వర్క్ ఫ్రమ్ హోంను లాంఛనప్రాయం చేసింది. ఈ ఆర్డర్స్‌తో రిమోట్‌గా పని చేయాలని నిర్ణయించుకునే ముందు ఉద్యోగులు, కంపెనీలు పరస్పరం పని గంటల సమయాన్ని, ఇతర షరతులను సెట్ చేసుకోవడానికి వీలు కల్పించింది. అయితే వాస్తవికంగా పరిస్థితులు వేరేలా ఉన్నాయి. ఉద్యోగులను ఎక్కువ సమయం మేర పని చేయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకుగాను ఉద్యోగుల హక్కులను పరిరక్షించేందుకుగాను ఇటీవల పోర్చుగల్ వర్క్ ఫ్రమ్ హోం చట్టాలను అనుసరించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ చట్టాలకు ఆమోదం లభిస్తే... వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు చట్టపరమైన మద్దతును అందిచడంతో పాటుగా కంపెనీలకు మరింత జవాబుదారీతనాన్ని జోడిస్తుంది. చదవండి: అరెవ్వా..30 వెడ్స్ 21, సూర్య వెబ్‌సిరీస్‌లు అదరగొట్టాయే...! భారత్‌లోనే.. -
రాజకీయ ఇంధనం!
పెట్రోల్... డీజిల్... పాలకుల పుణ్యమా అని సెంచరీ దాటేసిన వీటి రిటైల్ రేట్లపై చర్చ ఇప్పుడప్పుడే ఆగేలా లేదు. అక్టోబర్ 30న వివిధ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలలో వీచిన ఎదురుగాలి ఫలితమో ఏమో బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం పెట్రో రేట్లను రవ్వంత తగ్గించాల్సి వచ్చింది. దీపావళి కానుకగా వచ్చిన ఆ ఊరడింపు ప్రకటనతో ఇప్పుడు రాష్ట్రాలూ తమ వంతు పన్నులను తగ్గించాలన్నది డిమాండ్ పైకొచ్చింది. అసెంబ్లీ ఎన్నికలు రానున్న పంజాబ్, ఉత్తరప్రదేశ్, గోవా సహా పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు సహజంగానే తమ వంతుగా వ్యాట్‌ను కొంత తగ్గించాయి. కానీ, ఇప్పటికే కేంద్రం నుంచి నిధుల విషయంలో ఇబ్బందులు పడుతున్నామని భావిస్తున్న ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు ఈ కరోనా వేళ అందుకు నిరాకరించాయి. కేంద్రమే మరింత తగ్గించాలన్నాయి. కేంద్రం ఇష్టానికి పెంచుకుంటూ పోయిన రేట్లు ఇప్పుడు రాజకీయ అవసరాల క్రీడగా మారడమే విచారకరం. ప్రాథమిక చమురు ధరకు కేంద్ర ఎక్సైజ్ సుంకం, డీలర్ కమిషన్, వ్యాట్‌ను కలిపితే వచ్చేది – పెట్రోల్ బంకుల్లో అమ్మే రిటైల్ ధర. అంతర్జాతీయ ముడి చమురు ధరలను బట్టి దేశీయంగా పెట్రోల్ రిటైల్ రేటు పెరగడం అర్థం చేసుకోవచ్చు. కానీ, అంతర్జాతీయ మార్పులతో సంబంధం లేకుండా, ఇక్కడ పాలకులు ఎప్పటికప్పుడు అధిక సుంకాలు విధించుకుంటూ పోవడం సరైనది కాదు. గత ఏడాది క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోయినా సరే కేంద్రం లీటరు పెట్రోలుపై రూ. 13, డీజిల్‌పై రూ. 16 వంతున ఎక్సైజ్ బాదుడు బాదింది. కరోనా ముందునాళ్ళతో పోలిస్తే, ఇప్పుడు పెట్రో రేట్లు కొండెక్కి కూర్చోవడానికి అలాంటి నిర్ణయాలే కారణం. అలా ధరలను కొండంత పెంచిన కేంద్రం ఏ ప్రయోజనాల కోసమైతేనేం ఇప్పుడు ఎక్సైజ్ సుంకాన్ని గోరంత తగ్గించింది. పెట్రోలుపై రూ. 5, డీజిల్‌పై రూ. 10 మేరకైనా కేంద్రం తగ్గింపునివ్వడం ఆహ్వానించ దగినదే. అయితే, దాని వల్ల లభించిన ఊరట స్వల్పమే. పెట్రోలియమ్ ప్లానింగ్ అండ్ ఎనాలసిస్ సెల్ డేటా ప్రకారం పెట్రోలియమ్ రంగంపై వివిధ రకాల పన్నుల ద్వారా కేంద్రానికి 2014–15లో రూ. 1.72 లక్షల కోట్లు వస్తే, ఇప్పుడది ఏకంగా రూ. 3.35 లక్షల కోట్లకు చేరింది. అందులో రాష్ట్రాలకు దక్కేది రూ. 19,475 కోట్లే. అంటే, 5.8 శాతమే. ఒకవైపున అంతర్జాతీయ సగటు క్రూడ్ ఆయిల్ ధరలు గణనీయంగా తగ్గినా సరే, సామాన్యుడు కొనే పెట్రోల్, డీజిల్ రేట్లు చుక్కలనంటాయి. 2019 మేలో లీటరు పెట్రోల్ రూ. 76.89, డీజిల్ రూ. 71.50 ఉండేవి. పాలకుల పుణ్యమా అని రెండున్నరేళ్ళలో ఈ ఏడాది నవంబర్ 1 నాటికి పెట్రోల్ రూ. 115.99, డిజీల్ రూ. 108.66కు సర్రున పెరిగాయి. ఇది కళ్ళెదుటి నిజం. గడచిన రెండేళ్ళలో పెట్రోలు, డీజిల్ రేట్లపై విధించే ఎక్సైజ్ సుంకం రూపురేఖలనే కేంద్ర సర్కారు మార్చేసింది. నిజానికి, ఇంధనంపై కేంద్రం వసూలు చేసే పన్నుల్లో 41 శాతం వాటాను రాష్ట్రాలకు పంచవలసి ఉంటుంది. కానీ, కేంద్రం తెలివిగా పెరిగిన పెట్రో ఆదాయం డివిజబుల్ పూల్‌లోకి రాకుండా, సెస్‌లు, సర్‌ఛార్జీల రూపంలోనే రూ. 2,87,500 కోట్లు వసూలు చేసింది. అలా వచ్చినదాన్ని రాష్ట్రాలకు ఇచ్చే పని లేకుండా, తన దగ్గరే ఉండిపోయేలా కేంద్రం ఎత్తు వేసింది. న్యాయబద్ధంగా తమకు రావాల్సిన వాటాకు కేంద్రం ఇలా గండి కొట్టడంతో, రాష్ట్రాలు గతంలో సాక్షాత్తూ 15వ ఆర్థిక సంఘానికి ఫిర్యాదు కూడా చేశాయి. యథేచ్ఛగా సెస్ పెంచిన కేంద్రం తీరా ఇప్పుడు రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలనే వాదనను స్వపక్షీయుల నోట అనిపిస్తోంది. అసలే కరోనా దెబ్బతో ఆదాయాలు పోయి, దేశవ్యాప్తంగా రాష్ట్రాలన్నీ కునారిల్లాయి. ఈ పరిస్థితుల్లో పెట్రోల్ రేట్లలోనూ రాష్ట్రాలే తగ్గింపు ఇవ్వాలని కోరితే, రాష్ట్రాలు మాత్రం ఎక్కడకు పోతాయి? ఏం చేస్తాయి? ఆ మాటకొస్తే ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్ను, కేంద్ర జీఎస్టీల వల్ల వచ్చే ఆదాయం కన్నా చమురుపై ఎక్సైజ్ సుంకంతో కేంద్రానికి వచ్చేది తక్కువ. కానీ, ప్రభుత్వం నడపడానికి ఈ చమురుపై వచ్చే ఆదాయమే అత్యంత కీలకమన్నట్టు కేంద్ర పాలకులు మాట్లాడడం ఎంతవరకు అర్థవంతం? ఏమైనా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా పన్నులను సమర్థించుకోవడం వల్ల అంతిమ భారం వినియోగదారుడి మీదే పడుతోంది. దేశంలో అమ్ముడయ్యే ప్రైవేట్ ప్యాసింజర్ వాహనాల్లో నూటికి 80కి పైగా ప్రారంభ స్థాయి ద్విచక్ర వాహనాలే. పెట్రో ధరలపై కేంద్రం అనుసరిస్తున్న ప్రస్తుత విధానాలతో ఏకంగా ఈ సామాన్యుల ఇంటి బడ్జెట్లే తలకిందులు అవుతున్నాయి. అంటే, అటు ఆర్థికవ్యవస్థ పరంగా కానీ, ఇటు ప్రజా సంక్షేమ రీత్యా కానీ పెట్రోల్‌పై కేంద్ర సర్కారు వారి పన్ను విధానం లోపాలపుట్టే. ఇకనైనా, పెట్రో రేట్ల వ్యవహారాన్ని రాజకీయ విన్యాసంగా మార్చకుండా, పాలకులు సరైన నిర్ణయం తీసుకోవాలి. రాబడిలో న్యాయమైన వాటాపై కేంద్రం, రాష్ట్రాలు ఒక అంగీకారానికి వచ్చి, పెట్రోల్‌పై అధిక పన్నులు తగ్గించాలి. సామాన్యులకు మేలు చేయాలి. పెట్రో రంగంపై బాదుడుతో ఆదాయాన్ని పెంచుకొనే ప్రయాస మానేసి, దశాబ్దకాలంగా పడిపోతున్న ప్రత్యక్ష పన్నుల ఆదాయాన్ని పెంచుకోవడంపై కేంద్రం దృష్టి పెట్టడం అత్యవసరం. మరోపక్క జీఎస్టీ మెరుగ్గా అమలయ్యేలా, మరింత ఆదాయం వచ్చేలా చూసుకోవాలి. ఇలాంటి అసలైన ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తేనే, ఈ పెట్రో మంటలు తగ్గుతాయి. అలా కాకుండా, తామే ధరలు పెంచేసి, ఆ పైన పదో, పరకో తగ్గించాం లెమ్మంటే అది అక్షరాలా పిర్ర గిల్లి జోల పాడడమే! -
తెరపైకి మళ్లీ ఏఐజేఎస్
సాక్షి, న్యూఢిల్లీ: అఖిల భారత న్యాయ సర్వీసు (ఏఐజేఎస్) ఏర్పాటు చేసే దిశగా కేంద్రం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రాలతో కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజుజు త్వరలోనే నిర్వహించే సమావేశంలో ప్రధాన అజెండాగా ఈ అంశాన్ని తీసుకోనున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా రాష్ట్రాలతో ఏకాభిప్రాయానికి రావాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి న్యాయ వ్యవస్థలో మౌలికసదుపాయాల కల్పన మాత్రమే ఈ సమావేశం అజెండాగా ఉంది. దేశవ్యాప్తంగా న్యాయసేవలు బలోపేతం చేయడానికి ఏఐజేఎస్ పాత్ర కీలకమని కేంద్రం భావిస్తోంది. ప్రతిభ ఆధారిత అఖిల భారత ఎంపిక వ్యవస్థతో అర్హతలు కలిగిన వారి ఎంపికకు ఏఐజేఎస్ అవకాశం కల్పిస్తుందని కేంద్రం చెబుతోంది. అణగారిన, కిందిస్థాయి వర్గాలకు అవకాశాలు వస్తాయని గతంలో కేంద్రమంత్రులు వ్యాఖ్యానించిన విషయం విదితమే. -
జీఎస్టీ లోటు భర్తీ...
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) లోటును భర్తీ చేయడానికి కేంద్రం గురువారం రూ.44,000 కోట్లను రుణంగా రాష్ట్రాలకు విడుదల చేసింది, దీనితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ తరహా నిధుల విడుదల పరిమాణం మొత్తం రూ.1.59 లక్షల కోట్లకు చేరుకుంది. నిధులను బ్యాక్–టు–బ్యాక్ లోన్లుగా విడుదల చేయడం... సెస్ వసూళ్ల నుండి ఇచ్చే ద్వైమాసిక జీఎస్టీ పరిహారానికి అదనం. 2021–22 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం రూ. 1.59 లక్షల కోట్ల రుణ సమీకరణలు జరపాలని, ఈ నిధులను (జీఎస్టీ పరిహార నిధిలో లోటు భర్తీకి) వనరుల అంతరాన్ని తీర్చడానికి ఒక బ్యాక్–టు–బ్యాక్ ప్రాతిపదికన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు విడుదల చేయాలని ఈ ఏడాది మే 28వ తేదీన జరిగిన 43వ జీఎస్టీ అత్యున్నత నిర్ణాయక మండలి సమావేశం నిర్ణయించింది. గత ఆర్థిక సంవత్సరం ఈ విధంగా ఇదే విధానం ప్రకారం రాష్ట్రాలకు కేంద్రం రూ. 1.10 లక్షల కోట్లు విడుదల చేసింది. -
మహిళల హక్కుల్ని వాయిదా వేయలేం
న్యూఢిల్లీ: నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీయే) ప్రవేశ పరీక్షకు హాజరయ్యేందుకు మహిళలను అనుమతించడాన్ని వచ్చే సంవత్సరానికి వాయిదా వేయాలన్న కేంద్ర ప్రభుత్వ వినతిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. మహిళల హక్కులను నిరాకరించాలని తాము కోరుకోవడం లేదని స్పష్టం చేసింది. వారికి ఎన్డీయేలో ప్రవేశం కల్పించడం మరో ఏడాది వాయిదా వేయలేమని తేల్చిచెప్పింది. 2022 మే నాటికి ఎన్డీయే నోటిఫికేషన్ జారీ చేస్తామని, మహిళలను అనుమతిస్తామని కేంద్రం చెప్పగా, న్యాయస్థానం అంగీకరించలేదు. తాము ఇదివరకే ఇచ్చిన ఆదేశాల ప్రకారం... ఈ ఏడాది నవంబర్లోనే వారిని పరీక్ష రాసేందుకు అనుమతించాలని స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో సైనిక దళాలు అత్యుత్తమ సేవలు అందిస్తుంటాయని జస్టిస్ ఎస్.కె.కౌల్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం గుర్తుచేసింది. ఎన్డీయేలో మహిళలను చేర్చుకొనేందుకు ఇక ఎలాంటి జాప్యం లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ విషయంలో యూపీఎస్సీ, రక్షణ శాఖ కలిసి పని చేయాలని పేర్కొంది. ఎన్డీయేలో మహిళా అభ్యర్థుల కోసం సమగ్రమైన కరిక్యులమ్ రూపొందించాలని, ఇందుకోసం రక్షణ దళాల ఆధ్వర్యంలో నిపుణులతో కూడిన స్టడీ గ్రూప్‌ను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్డీయేలో మహిళలకు శిక్షణ ఇచ్చే విషయంలో సలహాలు, సూచనలు ఇవ్వడానికి బోర్డ్ ఆఫ్ ఆఫీసర్ల సమావేశం నిర్వహించాలని తెలిపింది. ఎన్డీయేలో మహిళలకు ప్రవేశం నిరాకరించడాన్ని ఆక్షేపిస్తూ న్యాయవాది కుశ్ కల్రా దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటీ వాదనలు వినిపించారు. నవంబర్ 14న జరిగే పరీక్షకు మహిళలను అనుమతించలేమని, అందుకు సమయం సరిపోదని చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించగల సామర్థ్యం ప్రభుత్వానికి ఉందని ధర్మాసనం బదులిచి్చంది. ఎన్డీయే ప్రవేశ పరీక్ష కోసం మహిళలు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని, వారిని నిరాశపర్చలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. -
ఏపీకి అదనపు రుణ సమీకరణకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
సాక్షి, ఢిల్లీ: మూలధన వ్యయ లక్ష్యాన్ని చేరుకున్న రాష్ట్రాలకు కేంద్రం రుణ ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఏపీ సహా 11 రాష్ట్రాలకు అదనపు రుణ సమీకరణకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మూలధన వ్యయంలో తొలి త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్ 15 శాతం టార్గెట్ పూర్తి చేసింది. ఏపీకి రూ.2,655 కోట్ల రుణ సమీకరణకు కేంద్రం అనుమతి ఇచ్చింది. జీఎస్డీపీలో నాలుగు శాతం నికర రుణాల పరిమితిపై 0.50 శాతం కేంద్రం ప్రోత్సాహకం ఇచ్చింది. ఇవీ చదవండి: ఢిల్లీలో ఆపదలో ఉన్న మహిళను కాపాడిన ‘దిశ యాప్’ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు: క్షమాపణ కోరిన అచ్చెన్నాయుడు -
నాసల్ వ్యాక్సిన్ రెండోదశ ట్రయల్స్‌కు కేంద్రం అనుమతి
న్యూఢిల్లీ: భారత్ బయెటెక్ నాసల్ వ్యాక్సిన్ రెండోదశ ట్రయల్స్‌కు కేంద్రం అనుమతి ఇచ్చింది. ముక్కు ద్వారా వేసే కోవిడ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు కేంద్రం అనుమతి జారీ చేసింది. కాగా మొదటి దశ క్లినికల్ ట్రయల్ 18 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులలో పూర్తయింది. 2/3 దశల పరీక్షలకు రెగ్యులేటరీ ఆమోదం పొందిన మొట్టమొదటి వ్యాక్సిన్ భారత్ బయోటెక్ ఇంట్రానాసల్ వ్యాక్సిన్(నాసికా టీకా) అని డీబీటీ తెలిపింది. అందుబాటులో ఐదు టీకాలు.. దేశంలో కోవాగ్జిన్, కోవిషీల్డ్‌లతో టీకా కార్యక్రమం మొదలైన విషయం తెలిసిందే. అయితే కొంత కాలం తరువాత రష్యా తయారు చేసిన స్పుత్నిక్–వీ వినియోగానికి ప్రభుత్వం అనుమతులిచ్చింది. అయితే స్థానికంగా తయారీలో కొన్ని సమస్యలు ఎదురు కావడంతో వీటిని రష్యా నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ఇది జాప్యానికి దారితీసింది. తాజా సమాచారం ప్రకారం స్పుత్నిక్–వీ స్థానిక ఉత్పత్తి వచ్చే నెలకు గానీ ప్రారంభమయ్యే అవకాశం లేదు. రెండు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం మోడెర్నా వ్యాక్సిన్ అత్యవసర వాడకానికి అనుమతులు జారీ చేసినా... న్యాయపరమైన రక్షణ కల్పించాలన్న కంపెనీ డిమాండ్‌కు ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో ఇప్పటివరకూ ఒక్క టీకా కూడా పడలేదు. తాజాగా అమెరికన్ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ టీకాకూ (సింగిల్ డోస్) ప్రభుత్వం అనుమతిచ్చింది. కానీ.. ఈ టీకాల వాడకం ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. ఇదిలా ఉండగా.. జైడస్ క్యాడిల్లా జైకోవ్–డీ టీకాతోపాటు భారత్‌లో తయారైన మొట్టమొదటి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సీన్ ‘హెచ్‌జీసీఓ19’, భారత్ బయోటెక్ తయారు చేస్తున్న నాసల్ వ్యాక్సిన్లు మానవ ప్రయోగాల దశలో ఉన్నాయి. ఇవే కాకుండా... అమెరికన్ కంపెనీ తయారు చేస్తున్న నోవావ్యాక్స్ టీకాను భారత్‌లో కోవావ్యాక్స్ పేరుతో తయారు చేసేందుకు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఆగస్టు – డిసెంబర్ మధ్యకాలంలో దేశంలో పంపిణీ అయ్యే టీకాల జాబితాలో కోవావ్యాక్స్‌ను కూడా చేర్చడాన్ని బట్టి చూస్తే దీనికి త్వరలోనే అత్యవసర అనుమతులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అగ్రరాజ్యం అమోరికా, ఇతర జీ7 సభ్యదేశాలు ఇస్తామన్న టీకాలు న్యాయపరమైన చిక్కుల కారణంగా ఇప్పటికీ అందలేదు. -
ఉపాధి కల్పనలో ఏపీ ఫస్ట్: కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్ మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించే అంశంపై సంప్రదింపులు జరుపుతున్నట్లు కేంద్రం తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జాతీయ విపత్తుల సహాయనిధి నుంచి పరిహారం ఇచ్చే అంశం పరిశీలనలో ఉందా అని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ బుధవారం రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. కోవిడ్ మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించే అంశంపై మార్గదర్శకాలను రూపొందించాలని ఈ ఏడాది జూన్ 30న సుప్రీంకోర్టు జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్డీఎంఏ)ని ఆదేశించినట్లు చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ అంశంపై భాగస్వాములతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. గడిచిన 16 నెలల్లో వంటగ్యాస్ ధరను 13 సార్లు సవరించినట్లు కేంద్ర పెట్రోలియం, సహజవాయువులశాఖ సహాయమంత్రి రామేశ్వర్ తేలి చెప్పారు. 2020 మార్చిలో సబ్సిడీపై సరఫరా చేసే గ్యాస్ సిలిండర్ ధర రూ.805 ఉండగా ప్రస్తుతం అది రూ.834 ఉందని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు బదులిచ్చారు. దేశవ్యాప్తంగా 9 విమానాశ్రయాలు పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ పద్ధతిలో నడుస్తున్నాయని వైఎస్సార్సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నకు జవాబుగా కేంద్ర మంత్రి వీకే సింగ్ తెలిపారు. ఉపాధి కల్పనలో తొలిస్థానంలో ఏపీ ఉపాధిహామీ పథకంలో పనులు కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ తొలిస్థానంలో నిలిచిందని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సహాయమంత్రి సాధ్వి నిరంజన్‌జ్యోతి లోక్‌సభలో తెలిపారు. ఏపీలో జూలై వరకు 71.90 లక్షల మందికి పని కల్పించారని బీజేపీ సభ్యుడు చున్నీలాల్ సాహూ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. -
జీఎస్టీ చెల్లింపులపై టీటీడీకి కేంద్రం ప్రశంస
తిరుమల: జీఎస్టీ చెల్లింపులకుగాను టీటీడీకి కేంద్రం నుంచి ప్రశంసాపత్రం లభించింది. దేశంలోని 11 రాష్ట్రాల్లో టీటీడీ జీఎస్టీæ రిజిస్ట్రేషన్ చేసుకుంది. 2 రాష్ట్రాల్లో టీటీడీ జరిపిన లావాదేవీల జీఎస్టీ చెల్లింపులకుగాను ఈ ప్రశంస లభించింది. దేశంలో 1.3 కోట్ల సంస్థలు జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోగా.. ఇందులో 54,439 సంస్థలు జీఎస్టీని కచ్చితంగా చెల్లిస్తున్నాయి. దేశంలో జీఎస్టీ ప్రవేశపెట్టి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా క్రమం తప్పకుండా పన్నులు చెల్లించిన వారిని సన్మానించాలని కేంద్రం నిర్ణయించింది. 2021 మార్చి 31వ తేదీ వరకు జీఎస్టీ రిటర్న్ ఫైల్ చేయడంలోనూ, పన్ను చెల్లింపులకుగాను టీటీడీకి కేంద్రం ప్రశంసాపత్రం అందించింది. -
కేసీఆర్ ఢిల్లీ వెళ్లినా.. న్యాయం మావైపే..
అమరావతి: తెలంగాణ కడుతున్న అక్రమ ప్రాజెక్ట్‌లపై కేంద్రం, కేఆర్ఎంబీ వద్ద వాదనలు వినిపిస్తున్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కేఆర్ఎంబీ మీటింగ్ వదిలి కేసీఆర్ ఢిల్లీ వెళ్తే ఏమవుతుంది? అని సజ్జల ప్రశ్నించారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్లినా... న్యాయం మావైపే ఉందని ఆయన అన్నారు. కేఆర్ఎంబీ మీటింగ్‌కు వచ్చి తెలంగాణ తమ వాదన వినిపిస్తే బాగుంటుందని ఆయన కోరారు. సమస్య ఇక్కడే పరిష్కారం అయ్యేది.. ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం ఏముంది? అని అన్నారు. న్యాయబద్ధ హక్కు కోసం కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని సజ్జల తెలిపారు. కేఆర్ఎంబీ పక్షపాతంగా వ్యవహరిస్తోందని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్షించారు. తెలంగాణ కడుతున్న అక్రమ ప్రాజెక్ట్‌లు కేఆర్ఎంబీకి కనిపించడం లేదా? అని నిలదీశారు. విద్యుత్ పేరుతో అక్రమంగా నీటిని వృథా చేస్తున్నారని సజ్జల ఆరోపించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ సగం వాటా అడగడం అసంబద్ధం అని ఆయన విమర్శించారు. విభజన జరిగినప్పుడే ఎవరి వాటా ఏంటనేది నిర్ణయించారని సజ్జల గుర్తు చేశారు. ఇక ఈ సమస్యంతా చంద్రబాబు వల్లే వచ్చిందని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ఆరోజు తెలంగాణ ప్రాజెక్ట్‌లపై మాట్లాడి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని అన్నారు. నాడు పారిపోయిన చంద్రబాబు ఇప్పుడు వచ్చి సీఎంని విమర్శించడం అర్ధరహితమిని, కృష్ణా జలాల గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదని సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. -
డ్రోన్లను గుర్తించి పేల్చేసే సాంకేతికత!
న్యూఢిల్లీ: దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న రక్షణ సంబంధిత సవాళ్లను, భవిష్యత్‌తో ఎదుర్కోబోయే సవాళ్లను దృష్టిలో ఉంచుకొని విస్తృతమైన రక్షణ విధానాన్ని రూపొందించేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా ప్రధాని మోదీ అధ్యక్షతన హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌దోవల్ సమావేశమయ్యారు. సమావేశంలో నూతన రక్షణ విధాన రూపకల్పనపై దృష్టి పెట్టారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇటీవల జమ్మూ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ వద్ద పేలుడు పదార్థాలున్న డ్రోన్స్ ప్రత్యక్షమైన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. డ్రోన్ల ఘటనపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులున్నారని అనుమానాలున్నాయి. దీంతో కొత్త పాలసీ రూపకల్పనపై పలువురు మంత్రులు, శాఖలు కసరత్తులు చేస్తున్నాయి. కొత్తవిధానం రూపకల్పన, అమలులో వివిధ ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ మిలటరీ, వైమానిక, నౌకా దళాలు కీలక పాత్ర పోషిస్తాయని సదరు వర్గాలు వెల్లడించాయి. డ్రోన్ ఎటాక్స్ వంటి నూతన సవాళ్లను ఎదుర్కొనడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, యాంటీ డ్రోన్ టెక్నాలజీపై దృష్టి సారించాలని కేంద్రం త్రివిధ దళాలకు సూచించింది. రక్షణ దళాలకు నూతన సాంకేతికతను అందించడం, ఇందుకోసం నవ యువతను, స్టార్టప్స్‌ను భాగస్వాములుగా చేసుకోవడం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. ఇప్పటికే కృత్తిమ మేధ, రోబోటిక్స్, డ్రోన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ తదితర కొత్త సాంకేతికతలపై మిలటరీ దృష్టి సారించింది. రాబోయే వారాల్లో త్రివిధ దళాలు, కీలక భద్రతా వ్యూహకర్తలు మరిన్ని సమావేశాలు నిర్వహించి, కొత్త పాలసీపై చర్చలు జరుపుతారు. జమ్ము ఘటన అనంతరం ఎయిర్‌ఫోర్స్ జమ్మూలోని స్టేషన్ల వద్ద భద్రతను పెంచింది. రెండు మూడు కిలోమీటర్ల దూరం నుంచే డ్రోన్లను గుర్తించి పేల్చేసే సాంకేతికతను ఇప్పటికే డీఆర్డీఓ రూపొందించింది. దీన్ని మరింత విస్తృతీకరించేందుకు కృషి జరుగుతోంది. చదవండి: ప్రైవేట్ ఆస్పత్రులు వినియోగించని వ్యాక్సిన్లు రాష్ట్రాలకు ఇవ్వండి HP: ఔషధ మొక్కల పెంపకానికి ఆయుష్ 128.94 లక్షలు -
ఆ ఇరువురు డైరెక్టర్లను నియమించండి!
న్యూఢిల్లీ: ఎంక్వైరీ అండ్ ప్రాసిక్యూషన్ డైరెక్టర్లను త్వరగా నియమించాలని కేంద్రప్రభుత్వాన్ని లోక్‌పాల్ కోరింది. ఈ మేరకు కేంద్రానికి లేఖ పంపినట్లు ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు లోక్‌పాల్ బదులిచ్చింది. ప్రభుత్వధికారుల అవినీతిపై ఫిర్యా దులను పరిశీలించడం, ప్రాసిక్యూషన్ ప్రక్రియ జరపడమనే రెండు ప్రధాన విధులను ఈ ఇరువురు డైరెక్టర్లు నిర్వహిస్తారు. 2019 మార్చిలో లోక్‌పాల్‌కు ఛైర్పర్సన్ను, సభ్యులను నియమించారు. అయితే ఎంక్వైరీ డైరక్టర్, ప్రాసిక్యూషన్ డైరెక్టర్ల నియామకం జరగలేదు. దీనిపై అజయ్ దూబే అనే యాక్టివిస్టు ఆర్టీఐ కింద లోక్‌పాల్‌ను ప్రశ్నించారు. లోక్‌పాల్ అండ్ లోకాయుక్త చట్టం కింద వీరివురి నియామకం జరపాల్సిఉందని, కేంద్రం పంపిన పేర్ల నుంచి ఇద్దరిని లోక్‌పాల్ చైర్పర్సన్ ఎంపిక చేయాల్సి ఉందని అజయ్ చెప్పారు. చదవండి: మహిళకు ఒకే రోజు మూడు డోసుల వ్యాక్సిన్ ట్రాలీ బ్యాగుల్లో హెరాయిన్.. మార్కెట్ విలువ రూ.126 కోట్లు -
కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం నూతన మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకి తగ్గుముఖం పడుతున్నాయి. అయితే కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గం కావడంతో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్‌పై దృష్టిపెట్టింది. జాతీయ టీకా కార్యక్రమానికి సంబంధించి సవరించిన మార్గదర్శకాలను మంగళవారం కేంద్రం విడుదల చేసింది. జూన్ 21లోపు రెండు వారాల పాటు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని తెలిపింది. జనాభా, కరోనా కేసులను బట్టి రాష్ట్రాలకు టీకాలను కేటాయించనున్నట్టు వెల్లడించింది. టీకాల వృథాను బట్టి రాష్ట్రాలకు వ్యాక్సిన్ కేటాయింపుల్లో కోత విధిస్తామని కేంద్రం పేర్కొంది. అన్ని ఆస్పత్రులకు సమానంగా వ్యాక్సిన్ పంపిణీ చేయడానికి చర్యలు తీసుకోనున్నట్టు ప్రకటించింది. ప్రైవేట్ ఆస్పత్రులకు కావాల్సిన డోసుల వివరాలను రాష్ట్రాలే ఇవ్వాలని తెలిపింది. పేదలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో టీకా వేయించుకోవడం కోసం ఈ-వోచర్లు ప్రవేశపెట్టనున్నట్టు పేర్కొంది. ఇక కోవిడ్-19 వ్యాక్సిన్ల సేకరణ, వాటిని రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. (చదవండి: సువేందు అధికారి ఢిల్లీ పర్యటన.. కారణం ఇదేనా!) -
ఇంటింటికీ టీకాలు సాధ్యం కాదు!
సాక్షి, న్యూఢిల్లీ: ఇంటింటికీ వెళ్లి టీకాలు వేయడం సాధ్యం కాదని కేంద్రం పేర్కొంది. ఇంటింటికీ (డోర్–టు–డోర్) టీకాలు వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ బాంబే హైకోర్టులో దాఖలైన పిటిషన్‌కు కౌంటరు దాఖలు చేస్తూ... ఆ విధంగా చేయలేకపోవడానికి ఐదు కారణాలున్నాయంటూ కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. కరోనా వ్యాక్సినేషన్ నిమిత్తం జాతీయ నిపుణుల బృందం దేశంలో టీకా డ్రైవ్ అంశాలకు మార్గనిర్దేశం చేస్తోందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అఫిడవిట్లో పేర్కొంది. 1. టీకా వేశాక ప్రతికూల సంఘటనలు ఎదురైతే తక్షణ వైద్య సదుపాయాలు అందించడంలో ఆలస్యం కావొచ్చు. 2. వ్యాక్సినేషన్ తర్వాత తీసుకున్న వ్యక్తికి 30 నిమిషాలు పరిశీలించడంలో అందరికీ సాధ్యం కాకపోవచ్చు. 3. పదేపదే వ్యాక్సిన్ భద్రత పరిచే పెట్టెను తెరవడం, ఉష్ణోగ్రతల్లో మార్పుల వల్ల వ్యాక్సిన్ పాడయ్యే అవకాశం ఉంది. తద్వారా వ్యాక్సిన్ సామర్థ్యం తగ్గడం తోపాటు దుష్పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాం. వ్యాక్సిన్‌పై నమ్మకం కూడా తగ్గే అవకాశం ఉంది. 4. ఒక లబ్ధి దారుడు నుంచి మరో లబ్ధిదారుడిని చేరుకొనే క్రమంలో వ్యాక్సిన్ వృథా అయ్యే అవకాశం ఉంది. 5. డోర్ టు డోర్ వల్ల కరోనా ప్రొటోకాల్స్ పాటించే అవకాశం ఉండదు. -
కోహ్లి మద్దతు.. నెటిజనుల విమర్శలు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రానికి వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఉద్యమానికి అంతర్జాతీయ సెలబ్రిటీలు మద్దతు తెలుపుతోన్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ పాప్ స్టార్ రిహన్నా, పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్, మీనా హారిస్‌లు రైతులకు మద్దతుగా ట్వీట్ చేశారు. ఇక అంతర్జాతీయ ప్రముఖులు రైతు ఉద్యమానికి మద్దతు తెలపడం పట్ల మన దేశ క్రీడా, సినీ ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌తో సహా బాలీవుడ్ ప్రముఖులు కేంద్రానికి మద్దతుగా నిలవడమే కాక.. ఇండియాటుగెదర్ అనే హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండ్ చేశారు. తాజాగా వీరి జాబితాలోకి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా చేరారు. (చదవండి: రైతు ఉద్యమంపై ట్వీట్ వార్) Let us all stay united in this hour of disagreements. Farmers are an integral part of our country and I'm sure an amicable solution will be found between all parties to bring about peace and move forward together. #IndiaTogether — Virat Kohli (@imVkohli) February 3, 2021 ‘‘విభేదాలు తలెత్తిన ఈ సమయంలో మనమంతా ఐకమత్యంగా ఉండాలి. రైతులు మన దేశంలో అంతర్భాగం. ఇక ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఉద్రిక్తతల పరిష్కారం కొరకు అన్ని పార్టీలు, వర్గాలతో చర్చించి ఓ స్నేహపూర్వక పరిష్కారంతో శాంతి నెలకొల్పేందుకు సమైక్యంగా ముందుకు వస్తారని ఆశిస్తున్నాను. ఇండియాటుగెదర్’’ అంటూ కోహ్లి ట్వీట్ చేశారు. ఇక దీనిపై నెటిజనులు విపరీతంగా మండిపడుతున్నారు. ‘‘నువ్వు మా కెప్టెన్ కాదు.. హిట్ మ్యాన్’’.. ‘‘రెండు పడవల ప్రయాణం మంచిది కాదు.. వివాదాస్పద అంశంలో ఎవరో ఒక్కరికే మద్దతుగా నిలవడం బెటర్’’.. ‘‘రైతుల గురించి నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావ్.. నీకంటే రిహన్నా ఎంతో నయం’’ అంటూ నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు. -
సెన్సూర్ అధికారం ఎస్ఈసీది కాదు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పరిధి దాటి వ్యవహరిస్తున్నారని కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ (డీవోపీటీ) కార్యదర్శికి రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. నిబంధనలను ఏమాత్రం పాటించకుండా ఇద్దరు ఐఏఎస్ అధికారులను ఎస్ఈసీ సెన్సూర్ చేశారని తెలిపింది. అఖిల భారత సర్వీసు అధికారులను సెన్సూర్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుందని, సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో ఇదే అంశాన్ని స్పష్టం చేసిందని పేర్కొంది. ఈ క్రమంలో ఏకపక్షంగా ఇద్దరు ఐఏఎస్‌లను సెన్సూర్ చేస్తూ ఎస్ఈసీ జారీ చేసిన ఉత్తర్వులను తిరస్కరించామని వివరించింది. చదవండి: ఆ అధికారం నిమ్మగడ్డకు ఉందా..? డీవోపీటీకి ఎస్ఈసీ చేసిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోవద్దని, ఆ ఇద్దరు ఐఏఎస్‌లపై చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. తన పరిధి దాటి వ్యవహరించవద్దని ఎస్ఈసీకి సూచించాలని కోరింది. ఈ మేరకు సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్ గురువారం కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. దీన్ని కేంద్ర హోం శాఖ కార్యదర్శి, డీవోపీటీ కార్యదర్శిని సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్ ఢిల్లీలో స్వయంగా కలిసి అందించారు. ఆ లేఖలో ప్రధాన అంశాలివీ.. చదవండి: టీడీపీ కుట్రకు యాప్ దన్ను అది చట్ట విరుద్ధం.. ‘పంచాయతీ ఎన్నికలకు జనవరి 2021 నాటికి అర్హత ఉన్న వారందరి పేర్లతో ఓటర్ల జాబితాను సిద్ధం చేయలేదనే ఆరోపణలతో ఈనెల 26న పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, కమిషనర్ గిరిజా శంకర్‌ను సెన్సూర్ చేస్తూ ఎస్ఈసీ ఉత్తర్వులిచ్చారు. ఇదే అంశంపై డీవోపీటీ కార్యదర్శికి ఆయన ఫిర్యాదు చేశారు. ఎస్ఈసీ తన పరిధిని దాటి ఇద్దరు ఐఏఎస్‌లను బలవంతపు పదవీ విరమణ చేయాలని సూచించడాన్ని ఆక్షేపిస్తున్నాం. ఎన్నికల నిర్వహణలో నిబంధనలను అతిక్రమించిన అధికారులను సస్పెండ్ చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసే అధికారం మాత్రమే ఎస్ఈసీకి ఉంది. ఓటర్ల జాబితా సవరణలో లోటు పాట్లుంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసే వెసులుబాటు మాత్రమే ఎస్ఈసీకి ఉంటుంది. ఇదే అంశాన్ని సుప్రీంకోర్టు 2000లో ఇచ్చిన తీర్పులో స్పష్టం చేసింది. అఖిల భారత సర్వీసు అధికారుల(డి అండ్ ఏ) రూల్స్–1969 ప్రకారం సెన్సూర్ చేయడమంటే చిన్న చిన్న పెనాల్టీలు విధించవచ్చు. ఆ అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది. కానీ ఎస్ఈసీ తన పరిధి దాటి రాష్ట్ర ప్రభుత్వ అధికారాల్లోకి చొరబడి ఇద్దరు ఐఏఎస్ అధికారుల సర్వీసు రికార్డుల్లోకి సెన్సూర్ ఉత్తర్వులను చేర్చడం చట్ట విరుద్ధం. అందువల్ల సెన్సూర్ చేస్తూ ఎస్ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఎస్ఈసీ డీవోపీటికి ఇదే అంశంపై ఫిర్యాదు చేశారు. ఈ ఇద్దరు ఐఏఎస్‌ల గత సర్వీసు రికార్డును పరిశీలిస్తే ఎలాంటి తప్పిదాల్లేవు. సెన్సూర్ ఉత్తర్వులను తోసి పుచ్చండి. తన పరిధిలో లేని అధికారాలను నిర్వహించకుండా ఎస్ఈసీకి సూచిస్తూ ఆదేశాలివ్వండి’ అని కోరారు. -
కోవిడ్ నిబంధనల గడువు పొడిగింపు
సాక్షి, ఢిల్లీ: కోవిడ్ మార్గదర్శకాల గడువును జనవరి 31 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్ కేసులు తగ్గుతున్నా.. కొత్త స్ట్రెయిన్ దృష్ట్యా గడువు పొడిగించింది. కంటైన్మెంట్ జోన్లలో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని కేంద్రం ఆదేశించింది. కాగా, భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. కేసుల సంఖ్యలో రోజురోజు స్వల్ప హెచ్చుతగ్గులు కనిపిస్తున్నప్పటికీ వ్యాధి అదుపులో ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణంకాలు తెలుపుతున్నాయి. దేశంలో కేసుల సంఖ్య కోటి రెండు లక్షలకు చేరాయి. -
కేంద్రంతో మమత ఢీ
కోల్‌కతా: బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై జరిగిన దాడి ఘటన కేంద్రం, పశ్చిమబెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వం మధ్య విభేదాలకు మరోసారి ఆజ్యం పోసింది. నడ్డా కాన్వాయ్‌పై అధికార టీఎంసీ కార్యకర్తలే దాడి చేశారన్న ఆరోపణల నేపథ్యంలో గవర్నర్ ధన్కర్ కేంద్రానికి నివేదిక పంపారు. ఈ నివేదిక అందుకున్న హోం శాఖ..రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఈ నెల 14వ తేదీన స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ సీఎస్, డీజీపీలకు శుక్రవారం సమన్లు జారీ చేసింది. అయితే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మొదట్నుంచీ తీవ్ర వ్యతిరేకత కనబరుస్తున్న మమతా బెనర్జీ ప్రభుత్వం.. ఈ నోటీసులకు స్పందించరాదని నిర్ణయించింది. బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బందోపాధ్యాయ్ శుక్రవారం హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు ఈ మేరకు ఒక లేఖ రాశారు. శాంతిభద్రతలతోపాటు, జెడ్– కేటగిరీకి చెందిన కొందరిపై జరిగిన దాడిని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా తీసుకుని చర్చించేందుకు 14వ తేదీన సమావేశం ఏర్పాటు చేసినందున వివరణ ఇచ్చేందుకు ఢిల్లీకి రాలేకపోతున్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ విధంగా ఆయన.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు మాత్రమే లోబడి నడుచుకుంటానని పరోక్షంగా కేంద్రానికి తెలిపారు. డైమండ్ హార్బర్లో గురువారం జేపీ నడ్డా కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు చేసిన రాళ్లదాడిలో బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయ్‌వర్గీయ, ఆయన వాహన డ్రైవ ర్కు గాయాలు కాగా, వారి వాహన అద్దాలు ధ్వంసమైన విషయం తెలిసిందే. నిప్పుతో చెలగాటం వద్దు.. బెంగాల్ గవర్నర్ ధన్కర్ మరోసారి ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్రంగా మండిపడ్డారు. నిప్పుతో చెలగాటం వద్దంటూ హెచ్చరించారు. నడ్డా కాన్వాయ్‌పై దాడి ఘటనపై కేంద్రానికి నివేదిక పంపినట్లు వెల్లడించారు. దాడి ఘటనపై సీఎం స్పందించిన తీరు చూస్తే రాజ్యాంగం పట్ల ఆమెకు ఏమాత్రం విశ్వాసం ఉందో తెలుస్తుం దన్నారు. కోల్‌కతాలో గురువారం జరిగిన ర్యాలీలో మ మత..నడ్డా కాన్వాయ్‌పై దాడి ఘటనను బీజేపీ ఆడుతున్న నాటకంగా పేర్కొంటూ, నడ్డా పేరు ను పలు మార్లు వ్యంగ్యంగా ఉచ్చరించారు. ఈ విషయమై గవర్నర్ స్పందిస్తూ.. బెంగాలీ సంస్కృతి పట్ల గౌరవం ఉన్న వారెవరూ ఆమె మాదిరిగా మాట్లాడరని దుయ్యబట్టారు. -
ప్రమాదకరంగా సెకండ్ వేవ్
న్యూఢిల్లీ: కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆంక్షల్ని కఠినంగా అమలు చేయాలని సుప్రీం కోర్టు శుక్రవారం కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. వ్యాక్సిన్ వచ్చేంతవరకు పూర్తి స్థాయిలో జాగ్రత్తలు పాటించాలని, కరోనా మార్గదర్శకాలు అమలయ్యేలా చూసే బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేసింది. దేశంలో కరోనా వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేసిన జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ఎస్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాల బెంచ్ సెకండ్ వేవ్ ప్రమాదకరంగా ఉండబోతోందని హెచ్చరించింది. ‘‘కరోనా మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలి. దేశ ప్రజల్లో 60 శాతం మంది మాస్కులు పెట్టుకోవడం లేదు. 30శాతం మంది గడ్డం కిందకి మాస్కుల్ని వేలాడదీస్తున్నారు. గడ్డు పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి. ఆంక్షల్ని కఠినతరం చేయాలి’’ అని స్పష్టం చేసింది. ఒకే రోజు 43 వేలకు పైగా కేసులు నమోదు దేశంలో 24 గంటల్లో 43,082 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 93,09,788కి చేరుకుంది. ఒకే రోజు 492 మంది ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య లక్షా 35 వేల 715కి చేరుకుంది. ఆ రాష్ట్రాల నుంచే దేశవ్యాప్తంగా కరోనా కేసుల్లో పది రాష్ట్రాల నుంచి 77% కేసులు నమోదవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టుకి తెలిపింది. కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, పశ్చిమబెంగాల్, కర్ణాటక, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కేసులు అధికంగా వెలుగు చూస్తున్నాయంటూ ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. ఢిల్లీలో రాష్ట ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల కేసుల సంఖ్య బాగా పెరిగాయని ఆయన పేర్కొన్నారు. అయితే రాష్ట్రాలు చర్యలు తీసుకోకపోతే కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా చూసే బాధ్యత కేంద్రానిదేనని బెంచ్ స్పష్టం చేసింది. -
అది విశ్వాసఘాతుకమే!
న్యూఢిల్లీ: రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లించడానికి కేంద్రం నిరాకరించడం విశ్వాసఘాతుకమని కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియాగాంధీ మండిపడ్డారు. కాంగ్రెస్ సహా విపక్ష పార్టీల ముఖ్యమంత్రుల భేటీని ఉద్దేశించి సోనియా బుధవారం ప్రసంగించారు. నేడు జీఎస్టీ మండలి భేటీ జరగనుండడం, సెప్టెంబర్ 14 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశమున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ వర్చువల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. జీఎస్టీ పరిహారం పొందడం రాష్ట్రాల హక్కు అని, దాన్ని నిరాకరించడం దేశ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడంతో సమానమేనని ఈ సందర్భంగా సోనియా వ్యాఖ్యానించారు. పార్లమెంట్లో చేసిన చట్టాల ఆధారంగానే జీఎస్టీ పరిహారాన్ని నిర్ణయించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. సహకార సమాఖ్య స్ఫూర్తితో జీఎస్టీ ఏర్పాటయిందని, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పన్నుల విషయంలో తమ రాజ్యాంగబద్ధ హక్కులను కోల్పోయేందుకు రాష్ట్రాలు అంగీకరించినందువల్లనే జీఎస్టీ అమలు సాధ్యమైందని ఆమె వివరించారు. రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్న కేంద్రంపై కలసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. పరిహార బకాయిలు పెరిగి రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు. కేంద్రం మాత్రం రాష్ట్రాలతో పంచుకోవడానికి వీల్లేని ఏకపక్ష సెస్‌లతో లాభాలు దండుకుంటోందని దుయ్యబట్టారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాల విషయంలో ఒకే విధంగా ఆలోచించే పక్షాలను సమన్వయపరిచే ఉద్దేశంతో ఈ భేటీ ఏర్పాటు చేశామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సమావేశాలు మరిన్ని జరగాలన్నారు. ఇటీవల కేబినెట్ ఆమోదించిన నూతన విద్యా విధానం లోపభూయిష్టంగా ఉందని విమర్శించారు. శాస్త్రీయ, ప్రగతిశీల, లౌకిక విలువలకు వ్యతిరేకంగా ఆ విధానముందన్నారు. వ్యవసాయ మార్కెటింగ్‌పై తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ల వల్ల కనీస మద్దతు ధర విధానం, ప్రజా పంపిణీ వ్యవస్థ దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా సృష్టించుకున్న ప్రభుత్వ రంగ సంపదలను ప్రభుత్వం అమ్మకానికి పెడ్తోందని విమర్శించారు. ముఖ్యమైన 6 విమానాశ్రయాలను ప్రైవేటుకు అప్పగించారని, రైల్వేలోనూ ప్రైవేటుకు తలుపులు తీశా రని విమర్శించారు. దేశ ప్రయోజనాల కోసం వేరే రాష్ట్రాల సీఎంలతో మాట్లాడాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీని సోనియా కోరారు. మమతతో పాటు ఉద్ధవ్ ఠాక్రే (మహారాష్ట్ర), హేమంత్ సోరెన్ (జార్ఖండ్), అమరీందర్ సింగ్ (పంజాబ్), భూపేశ్ భఘేల్ (ఛత్తీస్‌గఢ్), అశోక్ గహ్లోత్ (రాజస్తాన్) సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రపతిని కలుద్దాం రాష్ట్రాల సమస్యలపై, నిధుల లేమిపై రాష్ట్రపతిని కానీ, ప్రధానిని కానీ సీఎంలంతా ఒక ప్రతినిధి బృందంగా కలుద్దామని రాజస్తాన్ సీఎం గహ్లోత్ ప్రతిపాదించారు. ఈ బృందానికి నేతృత్వం వహించాలని సోనియాను కోరారు. కరోనా కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాలకు కేంద్రం ఎలాంటి సాయం అందించడం లేదన్నారు. భయమా.. పోరాటమా? కేంద్రానికి భయపడడమా? రాష్ట్రాల హక్కుల కోసం పోరాడడమా? తేల్చుకోవాలని ఈ సందర్భంగా ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. జీఎస్టీ మంచిదా? గత పన్ను వ్యవస్థ మంచిదా? అని ఆలోచించాల్సిన సమయం వచ్చిందన్నారు. పరిస్థితి సీరియస్‌గా ఉందని, ఈ సమయంలో విపక్షాలు కలసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని మమతా బెనర్జీ చెప్పారు. విపక్షాలపై కక్ష సాధింపునకు దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని భఘేల్ ఆరోపించారు. -
కృష్ణా బోర్డుకు జవసత్వాలు
సాక్షి, అమరావతి: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి జవసత్వాలు చేకూర్చడానికి కేంద్రం సిద్ధమైంది. పరిధిని ఖరారు చేసి.. వర్కింగ్ మాన్యువల్ (కార్యనిర్వాహక నియమావళి)ని ఆమోదించడం ద్వారా బోర్డుకు పూర్తిస్థాయిలో అధికారాలు కల్పించాలని నిర్ణయించింది. తద్వారా కృష్ణా నదీ జలాల వినియోగంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తకుండా చూడవచ్చని భావిస్తోంది. కేడబ్ల్యూడీటీ (కృష్ణా జలవివాదాల పరిష్కార ట్రిబ్యునల్)–2 తీర్పు నోటిఫై అయ్యేదాకా బోర్డు పరిధి, వర్కింగ్ మాన్యువల్‌ను ఖరారు చేయకూడదంటూ తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను తోసిపుచ్చింది. ఆ తీర్పునకూ బోర్డు వర్కింగ్ మాన్యువల్‌కు సంబంధంలేదని స్పష్టీకరించింది. కేడబ్ల్యూడీటీ–2 తీర్పు అమల్లోకి వస్తే బోర్డు పరిధి విస్తృతమవడమే కాక.. విస్తృత అధికారాలు వస్తాయని.. బేసిన్ పరిధిలోని తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటకలు కూడా బోర్డు పరిధిలోకి వస్తాయని కేంద్ర జల్‌శక్తి శాఖ వివరించింది. విభజన చట్టం ప్రకారం బోర్డు పరిధి, వర్కింగ్ మాన్యువల్‌ను ఆమోదించి.. అపెక్స్ కౌన్సిల్ భేటీ తర్వాత అమల్లోకి తేవాలని నిర్ణయించింది. ఆరేళ్లు పూర్తయిన తర్వాత.. కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చూసేందుకు విభజన చట్టం ప్రకారం మే 28, 2014న కృష్ణా బోర్డు ఏర్పాటైంది. ♦కానీ, ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణలో తలెత్తుతున్న ఇబ్బందులతో కృష్ణా బోర్డు పరిధి, వర్కింగ్ మాన్యువల్ ఖరారు చేయాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తుంటే, తెలంగాణ వ్యతిరేకిస్తోంది. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరగలేదని.. కేడబ్ల్యూడీటీ–2 తీర్పు అమల్లోకి వచ్చాక బోర్డు వర్కింగ్ మాన్యువల్‌ను ఆమోదిస్తే తమకు అభ్యంతరం లేదంటూ చెబుతోంది. ♦వాస్తవానికి పరిధిని ఖరారు చేయకపోవడం.. వర్కింగ్ మాన్యువల్‌ను ఆమోదించకపోవడంవల్ల బోర్డుకు అధికారాలు లేకుండాపోయాయి. దాంతో బోర్డు ఉత్తర్వులకు విలువ లేకుండాపోతోందని, విభేదాలను పరిష్కరించడం కష్టమవుతోందని కేంద్ర జల్‌శక్తి శాఖ భావిస్తోంది. ♦ఈ నేపథ్యంలో.. జనవరి 21న ఏపీ, తెలంగాణ జలవనరుల అధికారులు, కృష్ణా బోర్డు చైర్మన్‌తో కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్ ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో పరిధి, వర్కింగ్ మాన్యువల్‌ను ఖరారుచేస్తామని.. వీటికి, కేడబ్ల్యూడీటీ–2 తీర్పునకూ సంబంధం లేదని స్పష్టంచేశారు. వీటిపై అపెక్స్ కౌన్సిల్ భేటీ తర్వాత కేంద్ర జల్‌శక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. -
క్వారంటైన్లో 23 లక్షల మంది
న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో, ఆయా ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో సుమారు 23 లక్షల మంది ఉన్నారని కేంద్రం ప్రకటించింది. దేశంలోపల ప్రయాణాలు చేసినవారు, విదేశాల నుంచి వచ్చినవారు, ఇతరులు అందులో ఉన్నారని పేర్కొంది. మహారాష్ట్రలో అత్యధికంగా 6.02 లక్షల మంది,గుజరాత్లో 4.42 లక్షల మంది నిర్బంధంలో ఉన్నారన్నారు. బుధవారం వరకు 91 లక్షల మంది వలస కూలీలను రైళ్లు, బస్సుల్లో స్వస్థలాలకు పంపించినట్లు కేంద్రం తెలిపింది. అత్యధికంగా వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లిన రాష్ట్రం ఉత్తర ప్రదేశ్. అక్కడ సుమారు 3.6 లక్షల మంది క్వారంటైన్లో ఉన్నారు. అయితే, వారిలో అత్యధికులు హోం క్వారంటైన్‌లోనే ఉన్నారు. -
అక్కడ పరిస్థితి సీరియస్
న్యూఢిల్లీ: కరోనా కట్టడి కోసం తాము ప్రకటించిన లాక్డౌన్ నిబంధనలను కొన్ని రాష్ట్రాలు సరిగ్గా అమలు చేయకపోవడంపై కేంద్ర ప్రభుత్వం మండిపడింది. రాష్ట్రాలు స్థానిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరింత కఠిన నిబంధనలు విధించవచ్చు కానీ.. కేంద్రం ప్రకటించిన నిబంధనలను మాత్రం కచ్చితంగా అమలు చేయాలని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. మహారాష్ట్రలోని ముంబై, పుణెల్లో, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో, రాజస్తాన్‌లోని జైపూర్‌లో, పశ్చిమబెంగాల్లోని కోల్‌కతా, హౌరా, తూర్పు మిడ్నాపూర్, నార్త్ 24 పరగణ, డార్జిలింగ్, జల్పయిగురి, కలింపాంగ్ల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వ్యాఖ్యానించింది. ఆయా ప్రాంతాల్లో లాక్డౌన్ నిబంధనల అమలులో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది వైరస్ వ్యాప్తికి దోహదపడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. రానున్న మూడు రోజుల్లో ఆయా ప్రాంతాల్లో కేంద్ర మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులతో కూడిన ఆరు బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తాయని సోమవారం ప్రకటించింది. వారు లాక్డౌన్ నిబంధనల అమలులో చోటు చేసుకున్న లొసుగులను గుర్తించి నివేదిక రూపొందిస్తారని పేర్కొంది. అలాగే, ఆయా ప్రాంతాల్లో కోవిడ్–19 చికిత్స కోసం తీసుకున్న చర్యలు, వైద్యులకు అవసరమైన పీపీఈల అందుబాటు.. మొదలైనవాటిని సమీక్షిస్తారని తెలిపింది. అనంతరం, అవసరమైన చర్యలపై రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేస్తాయని హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా జారీ చేసిన నోటిఫికేషన్ స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వంలోని అదనపు కార్యదర్శి హోదాతో ఉన్న అధికారి నేతృత్వంలోని ఒక్కో బృందంలో ఐదుగురు అధికారులు ఉంటారని పేర్కొంది. ఆయా అధికారులకు వసతులను ఆయా రాష్ట్రాలు కల్పించాలని కోరింది. కరోనా కట్టడిలో రాష్ట్రాలకు సహకరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆ 4 రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వైద్య సిబ్బందిపై దాడులు, మార్కెట్లు, బ్యాంకులు, రేషన్ షాపుల వద్ద వ్యక్తిగత దూరం పాటించకపోవడం, ప్రయాణికులతో వాహనాలు రాకపోకలు సాగించడం.. మొదలైన ఆంక్షల ఉల్లంఘన తమ దృష్టికి వచ్చినట్లు హోం శాఖ ఆయా రాష్ట్రాలకు లేఖ రాసింది. కేంద్రం ప్రకటించిన నిబంధనలను పాటించాలని కోరుతూ హోం శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాసింది. మమత సీరియస్ లాక్డౌన్ ఉల్లంఘనలను పరిశీలించేందుకు కేంద్రం అధికార బృందాలను పంపిస్తుండటంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఏ ప్రాతిపదికన వారు కేంద్ర బృందాలను పంపుతున్నారో అర్థం కావడం లేదన్నారు. సరైన కారణాలు చూపకుండా ఇలాంటి చర్యలు తీసుకోవడం సమాఖ్య స్ఫూర్తికి విఘాతమన్నారు. కేరళపై ఆగ్రహం అవసరమైతే మరింత కఠిన నిబంధనలు విధించండి కాని కేంద్రం ప్రకటించిన ఆంక్షలను మాత్రం సడలించవద్దు అని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది. కొన్ని రాష్ట్రాల్లో అలాంటి సడలింపులు తమ దృష్టికి వచ్చాయంది. రెస్టారెంట్లు, క్షౌర శాలలను, స్టేషనరీ షాప్స్ను, పట్టణ ప్రాంతాల్లో చిన్న, మధ్య తరహా పరిశ్రమలను, పట్టణాల్లో రవాణాను అనుమతించడంపై కేరళపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు కేరళ ప్రధాన కార్యదర్శి టామ్ జోస్‌కు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ రాశారు. లాక్డౌన్ నిబంధనలతో పాటు, వాటికి సంబంధించిన సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కూడా కేరళ ఉల్లంఘిస్తోందని ఆ లేఖలో పేర్కొన్నారు. దీంతో లాక్డౌన్ సడలింపులను రద్దు చేసుకుంటున్నట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. -
బాకీ మొత్తం కట్టాల్సిందే..
న్యూఢిల్లీ: ఏజీఆర్ బాకీల విషయంలో కేంద్రం, టెల్కోలకు సుప్రీం కోర్టు తలంటింది. ఈ అంశాన్ని టెల్కోలు సాగదీస్తుండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతేడాది అక్టోబర్ 24న ఇచ్చిన తీర్పు ప్రకారం.. నిర్దేశిత బాకీలు మొత్తం కట్టి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. స్వీయ మదింపులు, బకాయిల పునఃసమీక్ష లాంటివి కుదరదని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. బాకీల చెల్లింపునకు టెలికం సంస్థలకు 20 ఏళ్ల వ్యవధినివ్వాలంటూ కేంద్రం వేసిన పిటిషన్‌ను జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎస్ఏ నజీర్, జస్టిస్ ఎంఆర్ షా తో కూడిన బెంచ్ బుధవారం తిరస్కరించింది. రెండు వారాల తర్వాత దీన్ని పరిశీలిస్తామని పేర్కొంది. ‘20 ఏళ్ల వ్యవధి ఇవ్వడమనేది అసమంజసం. తీర్పులో పేర్కొన్నట్లుగా టెలికం కంపెనీలు బాకీలన్నీ తీర్చాల్సిందే‘ అని స్పష్టం చేసింది. వడ్డీలు, జరిమానాలపై టెలికం కంపెనీలు, ప్రభుత్వం వాదోపవాదాలన్నీ విన్న మీదటే ఏజీఆర్ బాకీలపై తీర్పునిచ్చామని, అన్ని పక్షాలు కట్టుబడి ఉండాల్సిందేనని పేర్కొంది. ఆ అధికారులను పిలిపిస్తాం.. ఏజీఆర్ బాకీలపై టెలికం కంపెనీలు స్వీయ మదింపు చేపట్టడంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిన తర్వాత కూడా ఇలాంటి వాటికి ఎలా అనుమతిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇలాంటివి కలలో కూడా ఊహించలేనివంటూ వ్యాఖ్యానించింది. స్వీయ మదింపు ప్రక్రియ చేపట్టేందుకు టెల్కోలను అనుమతించిన టెలికం శాఖ కార్యదర్శి, డెస్క్ ఆఫీసర్లను పిలిపిస్తామని సుప్రీం కోర్టు పేర్కొంది. స్వీయ మదింపు పేరుతో టెలికం కంపెనీలు తీవ్రమైన మోసానికి పాల్పడుతున్నాయని ఆక్షేపించింది. ఏజీఆర్ బాకీల విషయంలో అత్యున్నత న్యాయస్థానం తీర్పే అంతిమమని, దాన్ని తు.చ తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది. టెల్కోల చీఫ్‌లకు హెచ్చరిక.. టెల్కోలు తమకు అనుకూలంగా వార్తాపత్రికల్లో కథనాలు రాయించుకుంటున్నాయని సుప్రీం కోర్టు పేర్కొంది. ఇలాంటి కథనాలు తమ తీర్పును ప్రభావితం చేయలేవని స్పష్టం చేసింది. ఏజీఆర్ బాకీలపై సుప్రీం కోర్టుకు వ్యతిరేకంగా ’తప్పుడు వార్తలు’ ప్రచురిస్తే టెలికం కంపెనీల ఎండీలపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. స్వీయ మదింపుతో భారీ వ్యత్యాసం.. ఏజీఆర్ బాకీలకు సంబంధించి డాట్ చెబుతున్న దానికి టెల్కోల స్వీయ మదింపునకు మధ్య ఏకంగా రూ. 82,300 కోట్ల వ్యత్యాసం ఉంది. డాట్ లెక్కల ప్రకారం ఎయిర్టెల్, టెలినార్‌వి కలిపి రూ. 43,980 కోట్లు, వొడాఐడియా రూ. 58,254 కోట్లు, టాటా గ్రూప్ సంస్థలు రూ. 16,798 కోట్లు చెల్లించాలి. అయితే, ఆయా టెల్కోలు జరిపిన స్వీయ మదింపు లెక్కల ప్రకారం.. భారతి గ్రూప్ రూ.13,004 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ.21,533 కోట్లు, టాటా గ్రూ ప్ సంస్థలు రూ.2,197 కోట్లు కట్టాల్సి ఉంటుంది. -
ఇంకా సమయం ఇవ్వొద్దు!
న్యూఢిల్లీ: ‘నిర్భయ’పై పాశవికంగా హత్యాచారం జరిపిన దోషులకు వెంటనే ఉరిశిక్ష విధించాలని కేంద్రం కోరింది. వారికి ఇంక ఎంతమాత్రం సమయం ఇవ్వడం సరికాదని, అందుకు వారు అర్హులు కారని స్పష్టం చేసింది. నిర్భయ హత్యాచారం కేసు దోషుల ఉరిశిక్ష అమలుపై విధించిన స్టేను సవాలు చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు ముందు ఆదివారం కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా, గత సంవత్సరం డిసెంబర్లో హైదరాబాద్‌లో చోటు చేసుకున్న ‘దిశ’ సామూహిక అత్యాచారం, హత్య ఘటనను ఆయన ప్రస్తావించారు. ఆ నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారని, ఆ ఎన్కౌంటర్ షాకింగ్ ఘటనే అయినా, ప్రజలు సంబరాలు చేసుకున్నారని గుర్తు చేశారు. ‘ఆ ఘటన తీవ్రమైన తప్పుడు అభిప్రాయాన్ని ఏర్పరిచింది. న్యాయవ్యవస్థ విశ్వసనీయత, సొంత తీర్పును అమలు చేసే అధికారం ప్రశ్నార్థకంగా మారాయి’ అని మెహతా వ్యాఖ్యానించారు. ఉరిశిక్ష పదేపదే వాయిదా పడేలా నిర్భయ దోషులు వ్యవహరిస్తున్న తీరు దేశ ప్రజల ఓపికను పరీక్షిస్తోందని ఆయన పేర్కొన్నారు. ‘ఆ నలుగురు దోషులు ఉద్దేశపూర్వకంగా, ముందస్తు ప్రణాళికతో వ్యవహరిస్తూ చట్టం ఇచ్చిన తీర్పును అవహేళన చేస్తున్నారు’ అన్నారు. పవన్ గుప్తా ఇన్నాళ్లు క్యురేటివ్ పిటిషన్ కానీ, క్షమాభిక్ష పిటిషన్ కానీ దాఖలు చేయకపోవడం ఈ ఉద్దేశపూర్వక ప్రణాళికలో భాగమేనన్నారు. సాధ్యమైన అన్ని మార్గాలను ఉపయోగించుకుని ఉరి శిక్ష అమలును వాయిదా వేయడం లక్ష్యంగా వారు ప్రయత్నిస్తున్నారన్నారు. న్యాయవ్యవస్థతో ఆ దోషులు ఆడుకుంటున్నారని మెహతా ఆగ్రహం వ్యక్తం చేశారు. దోషులు అక్షయ్ సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్తాల తరఫున న్యాయవాది ఏపీ సింగ్, మరో దోషి ముకేశ్ కుమార్ తరఫున న్యాయవాది రెబెకా జాన్ వాదనలు వినిపించారు. ఉరిశిక్ష అమలుపై స్టే విధించడాన్ని కేంద్రం సవాలు చేయకూడదని రెబెకా అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్రయల్ కోర్టులో జరిగిన ఈ కేసు విచారణలో కేంద్రం ఎన్నడూ భాగస్వామి కాలేదన్నారు. ఉరిశిక్ష అమలు జరిగేలా డెత్ వారెంట్లను జారీ చేయాలని ట్రయల్ కోర్టును ఆశ్రయించింది బాధితురాలి తల్లిదండ్రులే కానీ కేంద్రం కాదని ఆమె కోర్టుకు గుర్తు చేశారు. దోషులను ఒకే రోజు కాకుండా, వేర్వేరు రోజుల్లో ఉరి తీసే అవకాశంపై స్పష్టత ఇవ్వాల్సిందిగా కేంద్రం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పెండింగ్‌లో ఉన్న విషయాన్ని హైకోర్టుకు రెబెకా తెలిపారు. అంతేకాకుండా, ఒకే తీర్పు ద్వారా ఆ నలుగురు దోషులకు ఉరి శిక్ష పడినందువల్ల.. వారిని వేర్వేరు రోజుల్లో ఉరి తీయడం చట్టబద్ధంగా సమ్మతం కాదన్నారు. ‘నేనొక దుర్మార్గుడిని. దారుణ నేరానికి పాల్పడ్డాను. ఉరి ప్రక్రియను ఆలస్యం చేస్తున్నాను. ఇవన్నీ నేను ఒప్పుకుంటున్నాను. అయినా, ఆర్టికల్ 21 కింద జీవించే హక్కును కోరుకునే హక్కు నాకుంది’ అని దోషుల తరఫున రెబెకా వాదించారు. చట్టబద్ధంగా తమకున్న అన్ని అవకాశాలను ఉపయోగించుకునే హక్కు దోషులకు ఉందని తేల్చిచెప్పారు. దాదాపు 3 గంటలకు పైగా సాగిన వాదనల అనంతరం.. తీర్పును రిజర్వ్‌లో ఉంచుతూ న్యాయమూర్తి సురేశ్ కాయిట్ నిర్ణయం తీసుకున్నారు. నలుగురు దోషుల్లో ముకేశ్, వినయ్‌ల క్షమాభిక్ష పిటిషన్లను రాష్ట్రపతి తిరస్కరించారు. అక్షయ్ సింగ్ శనివారం క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నారు. అది పెండింగ్‌లో ఉంది. పవన్ ఇంకా క్షమాభిక్ష కోసం రాష్ట్రపతిని ఆశ్రయించలేదు. -
ఉరి వాయిదాపై హైకోర్టుకు కేంద్రం
న్యూఢిల్లీ: ‘నిర్భయ’దోషుల ఉరి అమలును నిరవధిక వాయిదా వేస్తూ ఢిల్లీలోని ట్రయల్ కోర్టు చెప్పిన తీర్పును కేంద్రం ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. అత్యవసరంగా విచారించాలంటూ శనివారం పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేశ్ కైత్ ఈ పిటిషన్‌ను ఆదివారం విచారిస్తామని చెప్పారు. దీనికి సంబంధించి నలుగురు దోషులకు, జైళ్ల శాఖ డీజీ, తీహార్జైలు అధికారులకు కూడా నోటీసులు పంపించారు. ఉరిని వాయిదా వేస్తున్నట్లు ట్రయల్‌కోర్టు శుక్రవారం తీర్పునివ్వగా, శనివారమే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ హైకోర్టును చేరింది. ట్రయల్ కోర్టు తమ పరిధిని మించి తీర్పునిచ్చిందని పిటిషన్లో పేర్కొంది. కేంద్రం తరఫునవాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా దోషులకు ఉన్న అన్ని చట్టపరమైన అవకాశాలు ఉపయోగించుకొనేందుకు తగిన సమయం ఇచ్చామని, అయితే వారు ఉద్దేశపూర్వకంగానే విచారణ ఆలస్యమయ్యేలా పిటిషన్లు దాఖలు చేస్తున్నారని తెలిపారు. ఇది న్యాయ వ్యవస్థను అవమానపర్చడమేనని పేర్కొన్నారు. దోషులకు ఉరి వాయిదా పడడంపై నిర్భయ తల్లి ఆశా దేవి స్పందిస్తూ.. దోషులకు మరణశిక్ష పడేవరకూ తన పోరాటం ఆగదని చెప్పారు. తిరస్కరించిన రాష్ట్రపతి ‘నిర్భయ’కేసులో దోషి వినయ్‌కుమార్ శర్మ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి కోవింద్ తిరస్కరించారు. ఇప్పటికే వినయ్ కుమార్ శర్మ, అక్షయ్‌ల క్యూరేటివ్ పిటిషన్లను సుప్రీకోర్టు కొట్టేసింది. -
పండుగ సీజన్లో గోల్డ్ బాండ్ ధమాకా
న్యూఢిల్లీ: పండుగ సీజన్లో భౌతిక పసిడి కొనుగోళ్లను తగ్గించి, ఆ మొత్తాలను పూర్తిస్థాయి ఇన్వెస్ట్మెంట్గా మార్చడానికి కేంద్రం కీలక నిర్ణయం ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా అక్టోబర్ 7వ తేదీన సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2019–20– సిరీస్ 5కు శ్రీకారం చుట్టింది. ఈ సిరీస్‌లో పసిడి గ్రామ్ ఇష్యూ ధర రూ.3,788గా నిర్ణయించింది. అక్టోబర్ 7 నుంచి 11వ తేదీ వరకూ ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. ఆన్లైన్ అప్లై చేసిన, డిజిటల్ రూపంలో చెల్లింపులు జరిపిన ఇన్వెస్టర్లకు రూ.50 డిస్కౌంట్ ఉంటుంది. అంటే వీరికి 3,738కే గ్రాము బాండ్ అందుబాటులో ఉంటుందన్నమాట. భౌతికపరమైన పసిడి డిమాండ్ తగ్గింపు, తద్వారా దేశీయ పొదుపుల పెంపు లక్ష్యంగా 2015 నవంబర్‌లో సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌ను కేంద్రం తీసుకువచ్చింది. వ్యక్తిగతంగా ఒకరు ఒక ఆర్థిక సంవత్సరంలో 500 గ్రాముల వరకూ విలువైన పసిడి బాండ్లను కొనుగోలు చేసే వీలుంది. హిందూ అవిభక్త కుటుంబం 4 కేజీల వరకూ కొనుగోలు చేయవచ్చు. ట్రస్టీల విషయంలో ఈ పరిమాణం 20 కేజీలుగా ఉంది. -
ఆర్థిక వ్యవస్థకు బూస్ట్..
న్యూఢిల్లీ: మందగమన సంకేతాలతో సతమతమవుతున్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు కేంద్రం తగు చర్యలు తీసుకుంటుందని పరిశ్రమ వర్గాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భరోసానిచ్చారు. ఎకానమీకి తోడ్పాటునిచ్చే చర్యలు తీసుకునే విషయంలో ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఒకే అభిప్రాయంతో ఉన్నాయని ఆమె చెప్పారు. శుక్రవారం జరిగిన పరిశ్రమల సమాఖ్య సీఐఐ జాతీయ మండలి సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. ‘ఎకానమీకి ఊతమిచ్చే చర్యలు తీసుకునే విషయంలో రిజర్వ్ బ్యాంక్, ప్రభుత్వం ఒకే అభిప్రాయంతో ఉన్నాయి‘ అని ఆమె తెలిపారు. ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య సుహృద్భావ వాతావరణమే ఉందన్నారు. పరిశ్రమ వర్గాలకు పరిస్థితులను కఠినతరం చేయాలన్న ఉద్దేశమేదీ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థ పురోగతికి సూచనగా నిలిచే కీలక రంగాల వృద్ధి గణాంకాలు, ఆటోమొబైల్ తదితర రంగాల పనితీరు నానాటికి దిగజారుతుండటంతో పాటు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగం (ఎన్బీఎఫ్సీ) పలు సవాళ్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆర్థిక రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలిస్తున్నామని, రాబోయే వారాల్లో పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని నిర్మలా సీతారామన్ తెలిపారు. కాస్త మందగించినా భారత్ .. ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమని ఈ సందర్భంగా సీతారామన్ చెప్పారు. సీఎస్‌ఆర్‌పై భరోసా.. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద కంపెనీలు తప్పనిసరిగా నిర్దేశిత మొత్తం కేటాయించకపోతే తీసుకునే కఠిన చర్యలను ప్రభుత్వం మరోసారి సమీక్షిస్తుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. ‘ఎవరిపైనా క్రిమినల్ కేసులు పెట్టాలన్న ఉద్దేశమేదీ ప్రభుత్వానికి లేదు‘ అని ఆమె స్పష్టం చేశారు. ఆదాయ పన్ను శాఖపరమైన వేధింపుల ఆరోపణల గురించి తెలుసుకునేందుకు వచ్చే వారం నుంచి పరిశ్రమ వర్గాలతో సమావేశం కానున్నట్లు ఆమె తెలిపారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు ఆమె వివరించారు. ఫిర్యాదుల పరిష్కారానికి తక్షణ చర్యలు కూడా తీసుకోనున్నట్లు నిర్మలా సీతారామన్ వివరించారు. అప్పటికప్పుడు పన్ను అధికారులకు ఆయా అంశాలకు సంబంధించిన ఆదేశాలు జారీ చేయడం జరుగుతుందన్నారు. పన్నులపరమైన వేధింపు ఉదంతాలను స్వయంగా తానే పరిశీలించేందుకు వీలుగా టెక్నాలజీ ఆధారిత ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఇక కార్పొరేట్ ట్యాక్స్‌ను తగ్గించాలని ప్రభుత్వానికి కూడా ఉందని, అయితే.. కార్పొరేట్లు ఇందుకోసం కొంత ఓపిక పట్టాల్సి ఉంటుందని ఆమె వివరించారు. మరోవైపు, వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి కార్పొరేట్లు, సరఫరాదారులకు రావాల్సిన బకాయిల సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టినట్లు మంత్రి చెప్పారు. చిన్న, మధ్యతరహా సంస్థలకు రావాల్సిన బకాయిలు ఏకంగా రూ. 48,000 కోట్ల మేర ఉంటాయని అంచనా. పన్ను ఊరట కల్పించండి: ఎఫ్‌పీఐల వినతి అధిక ఆదాయవర్గాలపై అదనపు సర్‌చార్జీలు తదితర అంశాలతో ఆందోళన చెందుతున్న మార్కెట్ వర్గాలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు శుక్రవారం నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. అదనపు సర్‌చార్జీ నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్‌పీఐ) మినహాయింపునివ్వాలని, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (డీడీటీ) సమీక్షించాలని, దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ (ఎల్టీసీజీ)ని పూర్తిగా ఎత్తివేయడం లేదా కనీసం తగ్గించడమైనా చేయాలని కోరుతూ డిమాండ్ల చిట్టాను మంత్రికి అందజేశారు. గోల్డ్‌మన్ శాక్స్, నొమురా, బ్లాక్‌రాక్, సీఎల్ఎస్ఏ, బార్క్లేస్, జేపీ మోర్గాన్ తదితర సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎఫ్‌పీఐల అభిప్రాయాలను మంత్రి సావధానంగా విన్నారని.. అయితే ఎటువంటి హామీ మాత్రం ఇవ్వలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. రూ. 2 కోట్ల పైగా ఆదాయం ఉన్న వారికి వర్తించే పన్నులతో పాటు అదనపు సర్‌చార్జీ కూడా విధించాలని బడ్జెట్లో చేసిన ప్రతిపాదనతో ఆందోళన చెందుతున్న ఎఫ్‌పీఐలు స్టాక్‌మార్కెట్లలో భారీగా విక్రయాలు జరపడం, మార్కెట్లు భారీగా పడటం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆర్థిక మంత్రితో ఎఫ్‌పీఐల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. నిధుల అవసరాల కోసం ఎన్బీఎఫ్సీలు కేవలం బ్యాంకులపైనే ఆధారపడకుండా ఇతరత్రా సాధనాలూ పరిశీలించాలని, అలాగే ఈ రంగానికి కూడా నేషనల్ హౌసింగ్ బోర్డు (ఎన్‌హెచ్‌బీ) తరహాలో ప్రత్యేక నియంత్రణ సంస్థ ఏర్పాటు చేయాల్సిన అవ సరం ఉందని ఫైనాన్స్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్ రామన్ అగర్వాల్ చెప్పారు. -
తీర్పులో సమీక్షించేంత తప్పేం లేదు
న్యూఢిల్లీ: రఫేల్ కేసుకు సంబంధించి గతంలో తాము ఇచ్చిన విస్పష్టమైన తీర్పులో సమీక్షించాల్సినంత తప్పేమీ లేదని సుప్రీంకోర్టుకు కేంద్రం శనివారం తెలిపింది. తీర్పు సమీక్ష పేరిట పిటిషనర్లు.. కొన్ని పత్రికా కథనాలు, చట్టవ్యతిరేకంగా, అనధికారికంగా సేకరించిన కొన్ని అసంపూర్తి అంతర్గత ప్రభుత్వ పత్రాలను ఆధారంగా చేసుకుని మొత్తం వ్యవహారాన్ని తిరగదోడాల్సిందిగా కోరలేరని చెప్పింది. ప్రభుత్వ రహస్య సమాచారాన్ని ఈ విధంగా వెల్లడించడం తీవ్ర దుష్పరిణామాలకు దారితీస్తుందని తెలిపింది. రఫేల్ కేసులో గత ఏడాది డిసెంబర్ 14న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాల్సిందిగా దాఖలైన పిటిషన్‌పై సుప్రీం ఆదేశాల మేరకు కేంద్రం శనివారం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. రివ్యూ పిటిషన్ ద్వారా కోర్టు నుంచి మరొక విచారణ ఉత్తర్వు తెచ్చుకునేందుకు పిటిషనర్లు ప్రయత్నిస్తున్నారంది. కొందరు వ్యక్తుల అభిప్రాయాలను ఆధారంగా చేసుకుని విచారణ జరిపేందుకు కోర్టు ఇంతకుముందే నిరాకరించిందని తెలిపింది. 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే ఇందులో జోక్యం చేసుకోవాల్సిన పనిలేదని కోర్టు భావించిందని వివరించింది. మీడియా కథనాల ఆధారంగా కోర్టులు నిర్ణయం తీసుకోలేవని చట్టంలోనే ఉందని తెలిపింది. కేసులో యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరితో పాటు మరో ఇద్దరు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లపై చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం వచ్చే వారం విచారణ జరపనుంది. -
వడ్డీ రేట్లు ఇంకా తగ్గుతాయా?
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ క్రియాశీలతకు అటు కేంద్రం, ఇటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తూ, శుక్రవారం తాజా ఆర్థిక గణాంకాలు వెలువడ్డాయి. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) ద్వారా పరిశీలించే ఈ రంగం వృద్ధి ఈ ఏడాది ఫిబ్రవరిలో కేవలం 0.1 శాతం. 2018 ఫిబ్రవరిలో ఇది 6.9 శాతం. ఇది 20 నెలల కనిష్టస్థాయి. 2017 జూన్ (0.3 శాతం) తర్వాత ఇంత పేలవ వృద్ధి రేటు నమోదుకావడం ఇదే తొలిసారి. ఇక మార్చి నెలలో వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం కొంచెం పెరిగి 2.57 శాతంగా నమోదయ్యింది. అయితే ఇది ఆర్బీఐ నిర్దేశిస్తున్న 4 శాతం దిగువనే ఉండడం గమనార్హం. ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం ఇవ్వడానికి ఆర్బీఐ మరోదఫా రెపో (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6 శాతంగా ఉంది) రేటు కోతకు వీలుకల్పిస్తున్న గణాంకాలు ఇవని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్ఓ) విడుదల చేసిన గణాంకాలను చూస్తే... తయారీ రంగం పేలవం... ► తయారీ: మొత్తం సూచీలో 78 శాతం వాటా కలిగిన తయారీ విభాగం 2019 ఫిబ్రవరిలో పేలవ పనితనాన్ని ప్రదర్శించింది. ఈ రంగంలో వృద్ధి లేకపోగా 0.3 శాతం క్షీణత నమోదయింది. 2018 ఫిబ్రవరిలో ఈ విభాగం భారీగా 8.4 శాతం వృద్ధిని నమోదుచేసింది. తయారీ రంగంలోని మొత్తం 23 పారిశ్రామిక గ్రూపుల్లో 10 మాత్రమే సానుకూల ఫలితాన్ని నమోదు చేయటం గమనార్హం. ► క్యాపిటల్ గూడ్స్: భారీ పెట్టుబడులకు సంకేతమైన భారీ యంత్రపరికరాల ఉత్పత్తి సంబంధ క్యాపిటల్ గూడ్స్... ఉత్పత్తి 2018లో 16.6 శాతమయితే ఇప్పుడు ఈ రేటు 8.8 శాతానికి తగ్గింది. ► విద్యుత్: ఈ రంగంలో ఈ రేటు 4.5 శాతం నుంచి 1.2 శాతానికి పడింది. ► మైనింగ్: ఈ విభాగంలో ఉత్పత్తి రేటు మాత్రం కొంత మెరుగుపడి, 2 శాతంగా నమోదయ్యింది. 2018 ఇదే నెలలో ఈ విభాగంలో అసలు వృద్ధిలేకపోగా 0.4 శాతం క్షీణత నమోదయ్యింది. ► కన్జూమర్ ప్రొడక్ట్స్: కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగం 1.2 శాతం వృద్ధిని నమోదుచేసుకుంటే, నాన్–డ్యూరబుల్స్ విభాగం 4.3 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. ► నవంబర్ గణాంకాలు దిగువముఖం: 2018 నవంబర్ ఐఐపీ వృద్ధి రేటును సైతం దిగువముఖంగా 0.3 శాతం నుంచి 0.2 శాతానికి తగ్గడం గమనార్హం. 11 నెలల కాలంలో.. 2018 ఏప్రిల్ నుంచి 2019 ఫిబ్రవరి నెలలను చూస్తే, పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు స్వల్పంగా తగ్గి 4 శాతంగా నమోదయ్యింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో (2017 ఏప్రిల్ నుంచి 2018 మార్చి మధ్య) ఈ రేటు 4.3 శాతంగా ఉంది. స్వల్పంగా పెరిగిన రిటైల్ ధరల స్పీడ్ వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మార్చిలో 2.86 శాతంగా నమోదయ్యింది. ఫిబ్రవరిలో ఈ రేటు 2.57 శాతంకాగా, 2018లో మార్చిలో 4.28 శాతం. మార్చిలో ఆహార ఉత్పత్తులు, ఇంధన ధరలు స్వల్పంగా పెరిగాయని గణాంకాలు పేర్కొన్నాయి. 4 శాతం లోపు రిటైల్ ద్రవ్యోల్బణం ఉండాలన్నది ఆర్బీఐ, విధాన నిర్ణేతల నిర్ణయం. ఈ దిగువనే తాజా గణాంకాలు ఉండడం గమనార్హం. ఆర్బీఐ నిర్దేశ స్థాయిలో రిటైల్ ద్రవ్యోల్బణం కొనసాగడం ఇది వరుసగా ఎనిమిదవ నెల. 2018 జూలై (4.17 శాతం) తర్వాత 4 శాతంపైకి రిటైల్ ద్రవ్యోల్బణం ఎప్పుడూ పెరగలేదు. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ నియంత్రణలోని కేంద్ర గణాంకాల కార్యాలయం శుక్రవారం తాజా రిటైల్ ద్రవ్యోల్బణం లెక్కలను విడుదల చేసింది. 0.3 శాతం పెరిగిన ఫుడ్ బాస్కెట్ ధర ఫుడ్ బాస్కెట్ ధర మార్చిలో 0.3 శాతం పెరిగింది (2018 ఇదే నెల ధరలతో పోల్చి). ఫిబ్రవరిలో ఈ ధర అసలు పెరక్కపోగా –0.66 శాతం తగ్గింది. పండ్లు, కూరగాయల ధరల్లో పెరుగుదల లేకపోగా –5.88 శాతం తగ్గాయి. ఫిబ్రవరిలోనూ ఈ తగ్గుదల –4.90 శాతంగా ఉంది. తృణ ధాన్యాలు, ఉత్పత్తుల ధరలు 1.32 శాతం నుంచి 1.25 శాతానికి తగ్గాయి. -
చిక్కుల్లో గవర్నర్ కల్యాణ్ సింగ్
న్యూఢిల్లీ: రాజస్తాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్(87) మరిన్ని చిక్కుల్లో పడ్డారు. ఆయన ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సమర్పించిన నివేదికను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురువారం కేంద్ర హోంశాఖకు పంపారు. ఈ వ్యవహారంలో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గత నెల 25న యూపీలోని అలీగఢ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కల్యాణ్ సింగ్ మాట్లాడుతూ.. ‘మనమంతా బీజేపీ కార్యకర్తలం. కాబట్టి మళ్లీ బీజేపీనే అధికారంలోకి రావాలని కోరుకుంటాం. దేశ ప్రయోజనాల దృష్ట్యా మోదీ మళ్లీ ప్రధాని కావాల్సిన అవసరముంది. మే 23న మోదీ మళ్లీ ప్రధాని కావాలని మేమంతా కోరుకుంటున్నాం. దేశంలోని ప్రతీ బీజేపీ కార్యకర్త పార్టీ విజయానికి కృషి చేయాలి’ అని చెప్పారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో విచారణ జరిపిన ఈసీ.. కల్యాణ్ సింగ్ ఎన్నికల నియమావళితో పాటు గవర్నర్ పదవికి సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించారని తేల్చింది. ఈ నివేదికను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సమర్పించింది. విదేశీ పర్యటన నుంచి బుధవారం భారత్‌కు చేరుకున్న కోవింద్, సింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ నివేదికను హోంశాఖకు పంపారు. ఈ నేపథ్యంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు చర్యలు ఎదుర్కొన్న తొలి గవర్నర్‌గా కల్యాణ్ సింగ్ నిలిచే అవకాశముందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. సింగ్‌కు ముందు 1990ల్లో హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా వ్యవహరించిన గుల్షర్ అహ్మద్ తన కుమారుడి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీంతో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని అన్నివైపుల నుంచి విమర్శలు రావడంతో అహ్మద్ తన పదవికి రాజీనామా చేశారు. 1992, డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో కల్యాణ్ సింగ్ యూపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. బీజేపీ అగ్రనేతలతో పొసగకపోవడంతో 1999లో పార్టీకి రాజీనామా చేసిన కల్యాణ్ సింగ్, తిరిగి 2004లో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 2014లో మోదీ ప్రధానిగా ఎన్నికయ్యాక కేంద్ర ప్రభుత్వం కల్యాణ్ సింగ్ ను రాజస్తాన్ గవర్నర్‌గా నియమించింది. -
ఎలక్టోరల్ బాండ్లపై కేంద్రం సమర్థన
న్యూఢిల్లీ: ఎన్నికల్లో పారదర్శకత, జవాబుదారీతనం సాధించేందుకు తాము తీసుకుని వచ్చిన సంస్కరణల్లో ఎలక్టోరల్ బాండ్లు ప్రవేశపెట్టడం కీలక ముందడుగని కేంద్రం తెలిపింది. ఈసీ లేవనెత్తిన అభ్యంతరాలను వ్యతిరేకించింది. పాత విధానంలో వివిధ సంస్థలు, వ్యక్తుల నుంచి రాజకీయ పార్టీలకు అందిన విరాళాల్లో అధిక భాగం అక్రమ మార్గాల్లో పోగైందేననీ, అదంతా లెక్కచూపని నల్లధనమని గురువారం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్రం తెలిపింది. పార్టీలకు ఎలక్టోరల్ బాండ్లను జారీ చేస్తూ కేంద్రం తీసుకున్న చర్యల చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్లపై ఈ నెల 5వ తేదీన మరో ధర్మాసనం వాదనలు వింటుందని సుప్రీంకోర్టు బుధవారం తెలిపింది. -
దేశ భద్రతను ప్రమాదంలోకి నెట్టారు
న్యూఢిల్లీ: వివాదాస్పద రఫేల్ ఒప్పంద పత్రాలు చోరీకి గురయ్యాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలుచేసింది. లీకైన రహస్య సమాచారం ఆధారంగానే పిటిషన్‌దారులు కోర్టును ఆశ్రయించారని తెలిపింది. ఫ్రాన్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం అంతా సక్రమంగానే ఉందని గతంలో అత్యున్నత న్యాయస్థానం తీర్పునివ్వగా, దానిని సమీక్షించాలని కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ రివ్యూ పిటిషన్లు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం రక్షణశాఖ అఫిడవిట్ దాఖలుచేసింది. రఫేల్ పత్రాలు బహిర్గతం కావడం దేశ భద్రతను ప్రమాదంలోకి నెట్టిందని రక్షణ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పేపర్లను నకళ్లు తీసినవారు దొంగతనానికి పాల్పడ్డారని ఆరోపించింది. బలగాల పోరాట సామర్థ్యానికి సంబంధించిన ఈ సమాచారం విస్తృతంగా వ్యాపించి శత్రువుకు కూడా అందుబాటులోకి వచ్చిందని రక్షణ శాఖ ఆక్షేపించింది. ఈ వ్యవహారంలో అంతర్గత విచారణ ప్రారంభమైందని, లీకేజీ ఎక్కడ జరిగిందో కనుక్కోవడంపై ప్రధానంగా దృష్టిపెట్టామని కోర్టుకు తెలిపింది. ఈ అఫిడవిట్ గురువారం సుప్రీంకోర్టు ముందుకు రానుంది. వారంతా ఐపీసీ కింద దోషులే రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి చోరీకి గురైన పత్రాల ఆధారంగానే రివ్యూ పిటిషన్లు వేశారని మార్చి 6నే అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మళ్లీ రెండు రోజుల తరువాత మాటమారుస్తూ..పత్రాలు తస్కరణకు గురి కాలేదని, వాటి నకళ్లనే పిటిషన్‌దారులు ఉపయోగించారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రక్షణ శాఖ వివరణ ఇస్తూ అఫిడవిట్ దాఖలు చేసింది. కేంద్రం రఫేల్ గోప్యతను కాపాడుతున్నా..సిన్హా, శౌరి, భూషణ్‌లు సున్నిత సమాచారాన్ని బహిర్గతం చేసి ఒప్పంద నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని అందులో పేర్కొంది. ఈ కుట్రలో పాలుపంచుకుని అనధికారికంగా ఆ పత్రాలను నకళ్లు తీసిన వారు ఐపీసీ చట్టం ప్రకారం దోషులేనని తెలిపింది. ఈ వ్యవహారంలో లీకేజీ ఎక్కడ జరిగిందో తెలుసుకుని భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వ కీలక నిర్ణయాల గోప్యతను కాపాడతామని చెప్పింది. అనధికారికంగా, అక్రమంగా సేకరించి సమర్పించిన పత్రాలను కోర్టు రికార్డుల నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేసింది. రక్షణ శాఖ, కేంద్ర ప్రభుత్వ అనుమతి లేనిదే ఆ సమాచారాన్ని సమాచార హక్కు చట్టం కింద బహిర్గతం చేయరాదని గుర్తు చేసింది. -
రఫేల్ పత్రాలు చోరీ
న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన పత్రాలు రక్షణ మంత్రిత్వ శాఖ దగ్గరి నుంచి దొంగతనానికి గురయ్యాయని కేంద్రం బుధవారం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఆ చోరీకి గురైన పత్రాల్లోని సమాచారం ఆధారంగానే ‘ద హిందూ’ పత్రిక రఫేల్‌పై కథనాలు రాసి అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించిన నేరానికి పాల్పడిందని అటార్నీ జనరల్ (ఏజీ) కేకే వేణుగోపాల్ కోర్టుకు తెలిపారు. రఫేల్ వ్యవహారం మొత్తం రక్షణ పరికరాలను సమకూర్చుకోవడానికి సంబంధించినది కాబట్టి అసలు ఈ కేసుపై న్యాయసమీక్ష జరపడమే సాధ్యం కాదని ఏజీ అన్నారు. రఫేల్ ఒప్పందంపై వచ్చిన ప్రజాహిత వ్యాజ్యా(పిల్)లను గతేడాది డిసెంబర్ 14న సుప్రీంకోర్టు తిరస్కరించడం తెలిసిందే. ఆ సమయంలో కేంద్రం కొన్ని కీలక వాస్తవాలను దాచిపెట్టిందనీ, ఇప్పుడు ద హిందూ పత్రిక కథనాలతో అవన్నీ వెలుగులోకి వచ్చినందున పిల్లను విచారణకు స్వీకరించడంపై పునరాలోచించాలని కోరుతూ కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌లు సంయుక్తంగా పిటిషన్ వేశారు. ఆ వాస్తవాలు అప్పుడే బయటకొచ్చి ఉంటే సుప్రీంకోర్టు ఆ పిల్లను కొట్టివేసేది కాదని వారు పిటిషన్లో పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసును బుధవారం విచారించింది. ఈ సందర్భంగా ఏజీ తన వాదన వినిపిస్తూ ‘రఫేల్ పత్రాల దొంగతనం కేసులో విచారణ జరుగుతోంది. ఇప్పటికైతే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. రఫేల్ ఒప్పందం వివరాలు రహస్యమైనవి. వాటిని ప్రజా బాహుళ్యంలో పెట్టడం ద్వారా అధికారిక రహ్యసాల చట్టాన్ని ఉల్లంఘించడం, కోర్టు ధిక్కార నేరాలకు పాల్పడినట్లైంది. రహస్యం అన్న పదాన్ని తొలగించి వారు కథనాలు ప్రచురించారు’ అని తెలిపారు. కోర్టు విచారణను ప్రభావితం చేయడమే లక్ష్యంగా వార్తా కథనాలు వచ్చాయన్నారు. గత నెల 8 నుంచి ఇప్పటివరకు ద హిందూ పత్రిక రఫేల్‌పై పలు సంచలన కథనాలను ప్రచురించడం తెలిసిందే. ఈ వాదనలు జరిగిన బుధవారమే తాజాగా మరో కథనం వెలువడింది. అవినీతి జరిగితే చట్టాన్ని అడ్డుపెట్టుకుంటారా? ఏజీ వాదనలపై న్యాయమూర్తులు ఒకింత అసహనం వ్యక్తం చేశారు. చోరీకి గురైన పత్రాల్లోని సమాచారం ఆధారంగా కథనాలు వచ్చాయని ఏజీ వెల్లడించడంతో ‘ఆ విషయం ఇప్పుడెందుకు చెబుతున్నారు? ఇప్పటివరకు ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? ఇన్ని రోజుల్లో ఏమేం చర్యలు తీసుకున్నారో చెప్పండి.’ అని జడ్జీలు ప్రశ్నించారు. ‘రఫేల్ ఒప్పందంలో అవినీతి జరిగి ఉంటే, దానిని కప్పిపుచ్చుకోడానికి అధికారిక రహస్యాల చట్టాన్ని అడ్డుపెట్టుకుంటారా? అవినీతి జరిగిందని నేననడం లేదు. కానీ ఒకవేళ జరిగి ఉంటే, ప్రభుత్వం చట్టాన్ని తమకు రక్షణగా ఉపయోగించుకోజాలదు’ అని జస్టిస్ గొగోయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసు విచారణను కోర్టు ఈ నెల 14న కొనసాగించనుంది. ఆ సమాచారం ఎక్కడిదో చెప్పం: ఎన్.రామ్ న్యూఢిల్లీ: రఫేల్ ఒప్పందంపై కీలక సమాచారాన్ని తమకు అందించిన వర్గాల వివరాల్ని బహిర్గతం చేయలేమని ది హిందూ దినపత్రిక చైర్మన్ ఎన్.రామ్ తేల్చిచెప్పారు. రాజ్యాంగంలోని భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కు ఆర్టికల్ 19(1)కు లోబడే రఫేల్ వివరాల్ని ప్రచురించామని సమర్థించుకున్నారు. ఫ్రాన్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం వివరాల్ని గోప్యంగా నిలిపి ఉంచే ప్రయత్నం జరిగిందని, అందుకే వాటిని బహిర్గతం చేశామని తెలిపారు. రఫేల్ పత్రాలు రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి చోరీకి గురయ్యాయని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపిన నేపథ్యంలో రామ్ స్పందించారు. రఫేల్ ఒప్పందంపై ఆయన పలు కథనాలు రాశారు. అందులో బుధవారం కూడా ఒకటి ప్రచురితమైంది. ‘ రఫేల్ ఒప్పంద పత్రాలు తస్కరణకు గురయ్యాయని భావిస్తే మాకేం సంబంధం లేదు. మాకు ఆ సమాచారం కొన్ని విశ్వసనీయ వర్గాల నుంచి అందింది. మా వనరులను కాపాడుకునేందుకు కట్టుబడి ఉన్నాం. వారి గురించి మా నుంచి ఎవరూ సమాచారం పొందలేరు. మేము ప్రచురించిన పత్రాలు యధార్థమైనవి. ప్రజా ప్రయోజనాల రీత్యానే వాటిని వెలుగులోకి తెచ్చాం. ముఖ్యమైన అంశాలపై సంబంధిత సమాచారాన్ని ప్రజాక్షేత్రంలోకి తీసుకురావడం పాత్రికేయుల విధి’ అని రామ్ అన్నారు. -
ఈ–కామర్స్ నిబంధనలు సరైనవే
ముంబై: విదేశీ పెట్టుబడులున్న ఈ– కామర్స్ కంపెనీలకు సంబంధించి కేంద్రం కొత్తగా ప్రకటించిన నిబంధనలు సరైనవేనని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో మోహన్‌దాస్ పాయ్ వ్యాఖ్యానించారు. ఈ–కామర్స్ సంస్థలు కారు చౌక రేట్లతో.. స్థానిక వ్యాపార సంస్థలను నాశనం చేస్తున్నాయన్నారు. భారత్‌లో అంతర్జాతీయ సంస్థలు గుత్తాధిపత్యం చలాయిస్తే చూస్తూ కూర్చోవాల్సిన అవసరం లేదని టైకాన్ 2019 స్టార్టప్స్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ఈ–కామర్స్ నిబంధనలను ప్రకటించిన తీరు అభ్యంతరకరంగా ఉన్నా, ఈ నిబంధనలు కొంత సముచితమైనవేనన్నారు. మరోవైపు, ఇందులో వ్యాపారాలకు ప్రోత్సాహాన్నిచ్చే కోణం కన్నా ఓటు బ్యాంక్ రాజకీయాల కోణమే ఎక్కువగా కనిపిస్తోందని సదస్సులో పాల్గొన్న స్టార్టప్ సంస్థల లాయర్ కరణ్ కల్రా వ్యాఖ్యానించారు. ఒక ప్రత్యేక వర్గానికి ప్రయోజనం చేకూర్చేందుకే ఈ నిబంధనలు ప్రవేశపెట్టినట్లుగా అనిపిస్తోందని సీనియర్ లాయర్ నిశిత్ దేశాయ్ అభిప్రాయపడ్డారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులున్న ఈ–కామర్స్ కంపెనీలు.. తమ అనుబంధ సంస్థల ఉత్పత్తులను సొంత ప్లాట్‌ఫాంపై విక్రయించరాదని, ధరలను ప్రభావితం చేసేలా ప్రత్యేక మార్కెటింగ్ ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటివి చేయరాదని కేంద్రం ఎఫ్‌డీఐ నిబంధనలు కఠినతరం చేసింది. ఫిబ్రవరి 1 నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి. అంతకు ముందు అమెజాన్ ఇండియా ప్లాట్‌ఫాంపై 4 లక్షల పైచిలుకు చిన్న స్థాయి విక్రేతలు ఉండేవారు. తాజా నిబంధనలతో అమెజాన్‌కి చెందిన క్లౌడ్‌టెయిల్, అపారియో సంస్థల కార్యకలాపాలు నిల్చిపోయాయి. ఆశావహంగా వాల్‌మార్ట్.. నిబంధనలు కఠినం చేసినప్పటికీ భారత మార్కెట్‌పై ఆశావహంగానే ఉన్నట్లు ఫ్లిప్‌కార్ట్‌లో ఇన్వెస్ట్ చేసిన అమెరికా దిగ్గజం వాల్‌మార్ట్ వెల్లడించింది. భారత మార్కెట్లో దీర్ఘకాలిక వ్యాపారానికి కట్టుబడి ఉన్నామని వాల్‌మార్ట్ ఏషియా రీజనల్ సీఈవో డర్క్ వాన్ డెన్ బెర్గీ తెలిపారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ఉపాధి కల్పన, చిన్న వ్యాపార సంస్థలు ..రైతులకు తోడ్పాటు ఇవ్వడం ద్వారా దేశ ఆర్థిక వృద్ధిలో భాగం అవ్వాలన్నదే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. -
రెండో రోజుకు మమత ధర్నా
కోల్‌కతా/న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి, సీబీఐకి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్లో సీఎం మమతా బెనర్జీ ఆదివారం చేపట్టిన ధర్నా కొనసాగుతోంది. ఈ అంశంపై దేశవ్యాప్తంగా సోమవారం రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది. ఇన్నాళ్లూ అటు ఎన్డీయే, ఇటు యూపీఏలకు సమ దూరంలో ఉన్న బీజేడీతోపాటు అనేక విపక్ష పార్టీలు ఈ అంశంలో మమతకు మద్దతు పలికాయి. పార్లమెంటు ఉభయ సభలు కూడా ఇదే అంశంపై దద్దరిల్లాయి. అటు శారదా, రోజ్‌వ్యాలీ చిట్‌ఫండ్ కుంభకోణాలకు సంబంధించిన ఆధారాల ధ్వంసం అంశంపై కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌ను విచారించే విషయమై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును మంగళవారం సుప్రీంకోర్టు విచారించనుంది. మరోవైపు రాజీవ్ కుమార్‌ను ప్రశ్నించాలన్న సీబీఐ ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తూ బెంగాల్ ప్రభుత్వం కలకత్తా హైకోర్టును ఆశ్రయించగా, కేసును అత్యవసరంగా విచారించేందుకు కోర్టు నిరాకరించింది. కాగా, నియంతల నుంచి రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడేందుకే తాను ధర్నాకు దిగానని మమత పేర్కొన్నారు. బెంగాల్లో జరుగుతున్నవి కనీవినీ ఎరుగని దురదృష్టకర ఘటనలనీ, రాజ్యాంగం అక్కడ విఫలమైందనేలా ఇవి ఉన్నాయని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో అన్నారు. రాజ్యాంగం ప్రకారం దేశంలోని ఏ భాగంలోనైనా సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూసే అధికారం కేంద్రానికే ఉందని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిపై పశ్చిమ బెంగాల్ గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠిని రాజ్‌నాథ్ నివేదిక కోరారు. కోల్‌కతాలోని రాజ్‌భవన్ నివేదికను వెంటనే పంపించినప్పటికీ అందులో ఏం ఉందనే వివరాలు వెల్లడి కాలేదు. ఆదివారం నాటి ఘటనల్లో బెంగాల్లో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారులు ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి ప్రవర్తించారా అనే విషయంపై కేంద్ర హోం శాఖ విచారణ జరుపుతుందని హోం శాఖ అధికారులు చెప్పారు. రాజీవ్‌ను ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు ఆదివారం ఆయన ఇంటికి వెళ్లగా బెంగాల్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించడం, కేంద్రం తనపై కక్షగట్టి సీబీఐని పంపిందంటూ మమత ధర్నాకు దిగారు. ధర్నా రాజకీయపరమైనది కాదు∙ సీబీఐకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను రాజకీయేతర ధర్నా చేస్తున్నాననీ, అయితే రాజకీయ పక్షాల మద్దతును తాను స్వాగతిస్తున్నానని మమత చెప్పారు. టీఎంసీ కార్యకర్తలు కొన్నిచోట్ల రైళ్లను అడ్డుకున్నారని తెలిసి, ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా శాంతియుతంగా నిరసనలు తెలపాలని ఆమె కోరారు. ‘ఇది రాజకీయ కార్యక్రమం కాదు. కానీ అన్ని రాజకీయ పార్టీలూ నిరసనలో పాల్గొనచ్చు. ఆయా పార్టీల మద్దతును నేను స్వాగతిస్తున్నా’ అని చెప్పారు. బెంగాల్లో తిరుగుబాటును తెచ్చేందుకు మోదీ, అమిత్ కుట్రపన్నుతున్నారని ఆమె ఆరోపించారు. ‘దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడే లక్ష్యంతో చేపట్టిన దీక్ష ఇది. శుక్రవారం వరకు దీక్ష కొనసాగిస్తా’ అని అన్నారు. టీఎంసీ కార్యకర్తలు, మద్దతుదారులు బెంగాల్లో పలుచోట్ల ప్రధాని మోదీ, అమిత్ షాల దిష్టిబొమ్మలను దగ్ధంచేశారు. ధర్నాకు కూర్చున్న చోటు నుంచే మమత సోమవారం అధికారిక విధులు నిర్వర్తించారు. అక్కడే ఒక కార్యక్రమంలో ప్రస్తుత వివాదానికి కేంద్ర బిందువుగా మారిన రాజీవ్ పాల్గొనడం గమనార్హం. సోమవారం బెంగాల్ శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు మంత్రివర్గ సమావేశాన్ని మమత తాను ధర్నాకు దిగిన చోటే నిర్వహించారు. రాజ్యాంగానికి, దేశానికి రక్షణ లభించేవరకు ధర్నాను కొనసాగిస్తానని తొలుత చెప్పిన మమత.. అనంతరం విద్యార్థులకు పరీక్షలు ఉన్నందున వారికి ఇబ్బంది కలిగించకూడదనే ఉద్దేశంతో ఫిబ్రవరి 8 వరకే ఈ ధర్నా చేయాలని నిర్ణయించామన్నారు. మమతకు మద్దతుగా నేతలు బీజేడీ సహా అనేక విపక్షాలు మమత ధర్నాకు సంఘీభావం ప్రకటించాయి. మాజీ ప్రధాని దేవెగౌడ బెంగళూరులో మాట్లాడుతూ కేంద్రం వైఖరి చూస్తుంటే తనకు అత్యయిక స్థితి నాటి రోజులు గుర్తొచ్చాయన్నారు. ఆమెకు తమ పార్టీ మద్దతు తెలుపుతోందని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తెలిపారు. ప్రతిపక్షాలను నాశనం చేసి నిరంకుశ పాలన సాగించేందుకు కేంద్రం సీబీఐని ఉపయోగించుకుంటోందని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ తదితరులు మమతకు మద్దతు ప్రకటించారు. సీబీఐ నుంచి తప్పించుకునేందుకే సీబీఐ కేసుల నుంచి తనను తాను కాపాడుకునేందుకే మమత ధర్నాకు దిగారని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ అన్నారు. ‘ఇది మోదీ ఎమర్జెన్సీ కాదు, బెంగాల్లో మమత ఎమర్జెన్సీ. దీనిపై మేం పోరాడతామని టీఎంసీని హెచ్చరిస్తున్నాం. నాటి ప్రధాని ఇందిర ఎమర్జెన్సీ విధించినప్పుడు మేం ఆమెపై పోరాడి ఓడించాం. టీఎంసీనీ ఓడిస్తాం. సీబీఐ నుంచి తనను కాపాడుకునేందుకే ఆమె ధర్నా చేపడుతున్నారు’ అని జవడేకర్ అన్నారు. అమిత్ షా, స్మృతీ ఇరానీ, యోగి ఆదిత్యనాథ్‌ల హెలికాప్టర్లు బెంగాల్లో దిగేందుకు మమత అనుమతి ఇవ్వలేదనీ, ఇది ప్రజాస్వామ్యమేనా అని ఆయన ప్రశ్నించారు. మరోవైపు మమత వర్సెస్ కేంద్రం అంశంపై బిహార్ సీఎం నితీశ్ కుమార్ స్పందిస్తూ లోక్‌సభ ఎన్నికల ప్రకటన వచ్చేలోపు ఏదైనా జరగొచ్చని అన్నారు. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు మార్గదర్శకాల వల్ల గతంలోలాగ ఎప్పుడు పడితే అప్పుడు రాష్ట్రపతి పాలన విధించడం కుదరదనీ, మమత సర్కారును కూల్చే అవకాశం మోదీ ప్రభుత్వానికి లేదన్నారు. నిజమైతే తీవ్ర చర్యలు: సుప్రీం శారదా చిట్ ఫండ్ కుంభకోణానికి సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలను కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ నాశనం చేశారంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం అత్యవసరంగా విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఆధారాలను ధ్వంసం చేయడంలో ఆయన పాత్ర ఇసుమంతైనా ఉందని తేలితే తీవ్ర చర్యలుంటాయని న్యాయమూర్తులు పేర్కొన్నారు. కోల్‌కతాలో సీబీఐకి వ్యతిరేకంగా బెంగాల్ పోలీస్ ఉన్నతాధికారులు కూడా ధర్నాలో పాల్గొంటున్న అసాధారణ పరిస్థితి నెలకొందని పిటిషన్లో సీబీఐ పేర్కొంది. రాజీవ్ కుమార్‌పై సీబీఐ చేసిన ఆరోపణలతో కూడిన దరఖాస్తును సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ సంజీవ్ ఖన్నాల ధర్మాసనం ముందుంచారు. మధ్యాహ్నమే కేసును విచారించాలని మెహతా కోరినప్పటికీ కోర్టు తిరస్కరించింది. ‘ఆధారాలను నాశనం చేయడంలో పోలీస్ కమిషనర్ పాత్ర ఏ కొంచెం ఉందని తెలిసినా ఆయనపై తీవ్ర చర్యలుంటాయి’ అని జడ్జీలు అన్నారు. కేసుకు సంబంధించిన అన్ని పత్రాలు, ఆధారాలను కోర్టుకు అఫిడవిట్ రూపంలో సమర్పించాలని ఆదేశించారు. రాజీవ్‌ను సీబీఐ ప్రశ్నించకుండా అడ్డుకునేందుకు బెంగాల్ ప్రభుత్వం కలకత్తా హైకోర్టులో వేసిన పిటిషన్‌పై అత్యవసర విచారణ జరిపేందుకు హైకోర్టు నిరాకరించింది. మంగళవారమే ఈ కేసును విచారిస్తామంది. పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడంతో జస్టిస్ శివకాంత ప్రసాద్ ఈ నిర్ణయం తీసుకున్నారు. పోలీసు అధికారులపై నోటీసులకు సంబంధించిన చర్యలపై హైకోర్టు స్టే విధించినప్పటికీ రాజీవ్ ఇంట్లోకి ప్రవేశించేందుకు సీబీఐ అధికారులు ప్రయత్నించారని బెంగాల్ ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ కిశోర్ దత్తా కోర్టుకు తెలిపారు. 2017లోనే నోటీసులు పంపించాం: సీబీఐ శారద స్కామ్‌ను విచారించిన బెంగాల్ పోలీసు విభాగనికి చెందిన సిట్ సభ్యులకు 2017 సెప్టెంబర్, 2018 డిసెంబర్ మధ్య దాదాపు 20 నోటీసులను జారీ చేశామని సీబీఐ వెల్లడించింది. వారిలో కోల్‌కతా ప్రస్తుత కమిషనర్ రాజీవ్ కుమార్ కూడా ఉన్నారని తెలిపింది. నోటీసులకు స్పందన లేనందువల్లనే విచారణ నిమిత్తం ఆయన నివాసానికి రావాల్సి వచ్చిందని పేర్కొంది. 2014లోనే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ ప్రారంభించామని, అయితే, తమ వద్ద ఉన్న సాక్ష్యాధారాలను ఇవ్వకుండా సిట్ అధికారులు ఇబ్బందులకు గురి చేశారని ఒక సీబీఐ అధికారి తెలిపారు. అత్యుత్సాహం వెనుక.. మమత వ్యవహరిస్తున్న తీరు తమను దిగ్భ్రాంతికి గురి చేసిందిన శారద స్కామ్ బాధితులు వాపోతున్నారు. విచారణ జరపకుండా సీబీఐని అడ్డుకోవడం తమను మోసం చేయడమేనన్నారు. ఇది వాస్తవాలను దాచే ప్రయత్నమని చిట్‌ఫండ్ సఫరర్స్ ఫోరం కన్వీనర్ అసిమ్ చటర్జీ పేర్కొన్నారు. కాగా, ఈ అంశంలో మమత వ్యవహరిస్తున్న తీరుపై విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ధర్నా కేంద్రం తీరుకు నిరసనగానే అని మమత చెబుతున్నా.. శారద స్కామ్‌కు సంబంధించి విచారణ ఎప్పుడో ప్రారంభమైందని, గతంలోనూ అనేక అరెస్ట్‌లు జరిగాయని పలువురు గుర్తు చేస్తున్నారు. అప్పుడు స్పందించకుండా.. ఇప్పుడే ఈ స్థాయిలో ఘర్షణకు దిగడమేంటని ప్రశ్నిస్తున్నారు. మమత చేస్తున్న హంగామా వెనుక వేరే ఉద్దేశాలున్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ స్కామ్‌ను విచారించిన సిట్‌కు నేతృత్వం వహించిన, ప్రస్తుత కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ నివాసంలోని లాకర్లో కీలకమైన ఆధారాలున్నాయని, అందువల్లనే స్పందన ఈ స్థాయిలో ఉందని వెల్లడించాయి. ధర్నా వేదికపై సీఎం మమతా బెనర్జీ. పక్కన కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ -
ఈ నెల నుంచే ‘పీఎం కిసాన్’ సాయం
న్యూఢిల్లీ: చిన్న, సన్నకారు రైతులను ఆదుకునేందుకు తెచ్చిన పీఎం కిసాన్ పథకం నగదు సాయాన్ని ఈ నెల నుంచే ఇవ్వాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాన్ మం త్రి కిసాన్ సమ్మాన్ యోజన (పీఎం కిసాన్) కింద ఐదెకరాల్లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులకు ఏటా రూ.6 వేలు ఇస్తామని ఇటీవల బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద 12 కోట్ల మంది లబ్ధి పొందే రైతులు న్నారని.. రూ.20 వేల కోట్ల బడ్జెట్‌ను ఈ ఆర్థిక సంవత్సరంలో కేటాయించినట్లు కేంద్రం పేర్కొంది. ‘ఈ పథకం గతేడాది డిసెంబర్ నుంచి వర్తించనుంది. బడ్జెట్ కేటాయింపుల కింద ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.20 వేల కోట్లు కేటాయించారు. భూముల రికార్డుల డేటా కూడా సిద్ధంగా ఉంది. అలాగే చిన్న, సన్నకారు రైతుల వివరాలు మా దగ్గర ఉన్నా యి..’ అని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ ఆదివారం తెలిపారు. -
పర్యావరణ అనుమతులు లేవా?
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టును పర్యావరణ అనుమతులు లేకుండానే నిర్మిస్తున్నారా? అని సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పర్యావరణ అనుమతులపై స్పష్టత ఇస్తూ అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది. పోలవరం ప్రాజెక్టుపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ 2007లో ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒరిజినల్ సూట్ దాఖలు చేయగా దానిపై గత కొంతకాలంగా విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్టు పనుల నిలిపివేత ఉత్తర్వులను పునరుద్ధరించాలంటూ ఒడిశా ప్రభుత్వం మధ్యంతర దరఖాస్తు దాఖలు చేసింది. అలాగే పర్యావరణ అనుమతులు లేకుండానే పోలవరం నిర్మిస్తున్నారని రేలా స్వచ్ఛంద సంస్థ మధ్యంతర దరఖాస్తు దాఖలు చేసింది. ఈ పిటిషన్లను ఇప్పటి వరకు జస్టిస్ మదన్ బి.లోకూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది. డిసెంబర్ 30న ఆయన పదవీ విరమణ చేయడంతో గురువారం జస్టిస్ ఏకే సిక్రీ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఒడిశా ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది గోపాల సుబ్రమణ్యం వాదనలు వినిపించారు. 36 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహ సామర్థ్యంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పర్యావరణ అనుమతులు పొందిన ఏపీ ప్రభుత్వం.. ఆ డిజైన్‌ను మార్చి 50 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహ సామర్థ్యానికి అనుగుణంగా ప్రాజెక్టును నిర్మిస్తోందని తెలిపారు. నిల్వ నీటి (బ్యాక్ వాటర్)తో ఒడిశాకు ముంపు ముప్పు ఎక్కువగా ఉందని విన్నవించారు. ఈ వాదనలతో ఏపీ తరఫు సీనియర్ న్యాయవాది ఏకే గంగూలీ విభేదించారు. ముంపు ముప్పుపై బచావత్ ట్రిబ్యునల్ విచారించిన మీదటే అవార్డు జారీ చేసిందని నివేదించారు. కాగా పర్యావరణ అనుమతులు తిరిగి పొందాలని చెప్పిన కేంద్ర పర్యావరణ శాఖ పనుల నిలిపివేత ఆదేశాలను పదే పదే నిలిపివేస్తోందని రేలా స్వచ్ఛంద సంస్థ తరపు న్యాయవాది జయంత్ భూషణ్ ధర్మాసనానికి విన్నవించారు. అనుమతులు తిరిగి తీసుకునేంతవరకు ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపేయాలని కోరారు. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదంలోకి ప్రైవేటు సంస్థలు రావడం సరికాదంటూ ఏకే గంగూలీతో పాటు కేంద్ర అదనపు సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ చేసిన వ్యాఖ్యలతో ధర్మాసనం విభేదించింది. ప్రజాప్రయోజన వ్యాజ్యం ఎవరైనా వేయొచ్చని స్పష్టం చేస్తూ విచారణను జనవరి 24కు వాయిదా వేసింది. -
ఇక స్మార్ట్ డ్రైవింగ్ లైసెన్స్‌లు
న్యూఢిల్లీ: దేశమంతటా ఒకే రకమైన డ్రైవింగ్ లైసెన్స్‌లను జారీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దేశంలో ఎక్కడ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నా అన్నీ ఒకే పరిమాణం, రంగు, రూపురేఖలు, భద్రతా సౌకర్యాలతో ఉండేలా చర్యలు తీసుకుంటోంది. వచ్చే ఏడాది జూలై నుంచి ఈ రకమైన కొత్త డ్రైవింగ్ లైసెన్స్‌లు దేశంలోని అన్ని రోడ్డు రవాణా కార్యాలయాల్లోనూ జారీ అవుతాయని తెలుస్తోంది. ఆ తర్వాత కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేవారితోపాటు పాత వాటిని రెన్యువల్ చేసుకునే వారికి కూడా ఈ కొత్త ఫార్మాట్లోనే లైసెన్స్‌లను జారీ చేయనున్నారు. ఈ లైసెన్స్‌లపై జాతీయ, సబంధిత రాష్ట్ర చిహ్నాలు ఉంటాయి. భద్రత కోసం కార్డుల్లో మైక్రో చిప్‌లను అమర్చి, క్యూఆర్ కోడ్లను కూడా ముద్రించనున్నారు. లైసెన్స్‌దారుడి సమాచారాన్ని సులువుగా తెలుసుకునేందుకు వీలుగా ప్రస్తుతం మెట్రోరైళ్ల స్మార్ట్‌కార్డుల్లో వాడుతున్న ఎన్ఎఫ్సీ (నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్) టెక్నాలజీని కూడా కొత్త డ్రైవింగ్ లైసెన్సుల్లో వాడొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత ఫార్మాట్లలో డ్రైవింగ్ లైసెన్స్‌లు జారీ చేస్తుండటంతో ఇతర రాష్ట్రాల్లోని ట్రాఫిక్ పోలీసులకు తలనొప్పులు ఎదురవుతున్నాయి. -
కేంద్రంపై జస్టిస్ చంద్రచూడ్ అసంతృప్తి
న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కం సహా పలు సున్నితమైన కేసుల్లో తుది నిర్ణయాన్ని కేంద్రం కోర్టుల విచక్షణకు వదిలేస్తుండటంపై సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ డీవై చంద్రచూడ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీలోని నేషనల్ లా వర్సిటీలో 19వ బోధ్‌రాజ్ సావ్నీ స్మారక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ఈ రాజకీయ నాయకులు కొన్నిసార్లు తమ అధికారాలను న్యాయమూర్తులకు ఎందుకు అప్పగిస్తున్నారు? ఈ తరహా వ్యవహారాలు సుప్రీంకోర్టులో నిత్యకృత్యంగా మారిపోయాయి. ‘ఐపీసీ సెక్షన్ 377(స్వలింగ సంపర్కాన్ని నేరంగా పేర్కొంటోంది)పై నిర్ణయాన్ని కోర్టు విచక్షణకే వదిలేస్తున్నాం’ అనడం జడ్జీలకు చాలా సమ్మోహనపరిచే మాట. పొగడ్తలు ఎన్నటికైనా చేటు తెస్తాయనీ, వాటి కారణంగా ఇబ్బందులు ఎదుర్కోకతప్పదని జడ్జీలు గుర్తుంచుకోవాలి’ అని అన్నారు. స్వలింగ సంపర్కం నేరంకాదని ప్రకటించిన ధర్మాసనంలో జస్టిస్ చంద్రచూడ్ ఉన్నారు. ఇతరులు, సమాజంతో మన కలివిడి కారణంగానే వ్యక్తిత్వం ఏర్పడుతుందనీ, లైంగికత అలా ఏర్పడదని ఆయన అన్నారు. సెక్షన్ 377లోని కొన్ని నిబంధనలు ‘పురుషులంటే ఇలానే ఉండాలి, స్త్రీలంటే ఇలాగే ఉండాలి’ అంటూ ఉందనీ వెల్లడించారు. దీని కారణంగా స్వలింగ సంపర్కులపై కొందరు చాదస్తపు మనుషులు వివక్ష చూపారన్నారు. ప్రజలపై జాతి, లైంగికత, మతం, ప్రాంతం, రంగు ఆధారంగా వివక్ష చూపరాదని రాజ్యాంగంలోని 15వ అధికరణ చెబుతోందనీ, సెక్షన్ 377 దీన్ని స్పష్టంగా ఉల్లంఘించిందని జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు. -
కేంద్రం ప్రతిపాదనకు వాట్సాప్ నో
న్యూఢిల్లీ: సందేశాలు తొలుత ఎక్కడి నుంచి వచ్చాయో కనిపెట్టగలిగే సాంకేతికతను అభివృద్ధి చేస్తే యూజర్ల వ్యక్తిగత గోప్యతతో పాటు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉద్దేశాలు దెబ్బతింటాయని ప్రముఖ సోషల్‌మీడియా సంస్థ వాట్సాప్ భారత ప్రభుత్వానికి స్పష్టంచేసింది. నకిలీ సందేశాలను అడ్డుకునేందుకు వార్తల మూలాలను కనిపెట్టే సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించింది. ఈ నేపథ్యంలో వాట్సాప్ అధికార ప్రతినిధి మీడియాతో మాట్లాడారు. ‘దీనివల్ల వాట్సాప్ ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిష్షన్(మెసేజ్ పంపేవారు, రిసీవ్ చేసుకునేవారు తప్ప మరెవరూ సమాచారాన్ని చూడలేని సాంకేతికత) ఉద్దేశాలు దెబ్బతింటాయి. ఒకవేళ అలాంటి సాఫ్ట్‌వేర్‌ను తయారుచేస్తే మా యూజర్లకు సంబంధించి సున్నితమైన సమాచారం, గోప్యత తీవ్రమైన ప్రమాదంలో పడతాయి. యూజర్ల గోప్యత నిబంధనల్ని ఉల్లంఘించే పనులను వాట్సాప్ ఎన్నడూ చేయబోదు’ అని ఆయన అన్నారు. నకిలీ వార్తలు, వదంతుల కారణంగా సంభవిస్తున్న మూకహత్యలను నియంత్రించేందుకు వీలుగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాలని కేంద్రం గతంలో వాట్సాప్‌ను కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నకిలీ వార్తలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను తాము చేపడుతున్నట్లు వాట్సాప్ తెలిపింది. ఇందుకోసం భారత్‌లో ఓ బృందాన్ని నియమించామని, వాట్సాప్‌లో ఓసారి గరిష్టంగా పంపగలిగే సందేశాల సంఖ్యను తగ్గించామని పేర్కొంది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ కొనుగోలు చేసిన వాట్సాప్‌కు ప్రస్తుతం భారత్‌లో 20 కోట్లకుపైగా వినియోగదారులు ఉన్నారు. -
బాటిళ్లలో ‘మహువా’ అమ్మకాలు
న్యూఢిల్లీ: సంప్రదాయ గిరిజన పానీయం ‘మహువా’ను బాటిళ్లలో నింపి మార్కెటింగ్ చేయాలని కేంద్రం యోచిస్తోంది. వన్‌ధన్ కార్యక్రమం కింద గిరిజన ఉత్పత్తులకు ప్రచారం కల్పించడంలో భాగంగా ఈ దిశగా ఆలోచిస్తోంది. ఈ మేరకు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ, గిరిజన సహకార మార్కెటింగ్ సమాఖ్య ట్రైఫెడ్తో అవగాహనా ఒప్పందం కుదర్చుకుందని అధికారులు తెలిపారు. అయితే మహువాలో ఆల్కహాల్ పాళ్లు ఉన్నందున దాని అమ్మకానికి ఇంకా పలు అనుమతులు రావాల్సి ఉంది. బాటిళ్లలో నింపే సమయంలోనే ఈ పానీయానికి అల్లం, వాము కలిపితే మరింత రుచికరంగా మారుతుందని ట్రైఫెడ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గిరిజనుల ఏ వేడుకలోనైనా సేవించే ఈ పానీయాన్ని మహువా పువ్వుల నుంచే తయారుచేస్తారు. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లోని గరిజన ప్రాంతాల నుంచి ఈ ఉత్పత్తిని సేకరిస్తారు. గిరిజనుల ఇతర ఉత్పత్తులైన చింతపండు, ఉసిరిని కూడా జామ్ రూపంలో మార్కెటింగ్ చేయాలని కూడా కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. -
ఆ వాహనాల విక్రయాలను ఆపేయాలి
న్యూఢిల్లీ: భారత్ స్టేజ్(బీఎస్)–6 నాన్ కంప్లెయింట్ వాహనాల తయారీ, విక్రయాలను 2020 ఏప్రిల్ నుంచి దేశంలో నిలిపివేయాలని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. శుద్ధి చేసిన బీఎస్–6 ఇంధనాన్ని వాడటం వల్ల ఒనగూరే పర్యావరణ ప్రయోజనం ఈ వాహనాల వల్ల దక్కడం లేదని తెలిపింది. రాజధానిలో వాయు కాలుష్యం పెరిగిపోతుండటంపై దాఖలైన పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. డీజిల్ ధరను వేరుగా నిర్ణయించటం లేదా ప్రైవేట్ వాహనాలకు ప్రత్యేక ఇంధన ధరల విధానాన్ని ఏర్పాటు చేయటం సాధ్యం కాదని కోర్టుకు కేంద్రం వివరించింది. మార్చి 2020 వరకు తయారైన వాహనాల రిజిస్ట్రేషన్‌కు జూన్ 2020 వరకుగడువుంది. -
వాట్సాప్‌కు మళ్లీ నోటీసులు
న్యూఢిల్లీ: వదంతులు, బూటకపు వార్తలు వ్యాప్తిచెందకుండా తగిన పరిష్కార మార్గాలు కనుగొనాలని కేంద్రం వాట్సాప్‌ను మరోసారి కోరింది. లేబలింగ్ ఫార్వర్డ్స్(ఫార్వర్డ్ చేసిన సందేశాలను గుర్తించే విధానం)ని మించిన మరింత ప్రభావశీల చర్యలతో ముందుకు రావాలని ఆదేశిస్తూ గురువారం లేఖ రాసింది. వదంతుల ప్రచారానికి ఉపయోగపడుతున్న వేదికలను కూడా ప్రేరేపకాలుగానే భావిస్తామని, అవి ప్రేక్షక పాత్ర వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించింది. ‘కొందరు పోకిరీలు వదంతులను ప్రచారం చేస్తున్నారు. అందుకు వారు వాడుతున్న సాధనాలు తమ బాధ్యత, జవాబుదారీతనం నుంచి తప్పించుకోజాలవు. ప్రేక్షకులుగా మిగిలిపోయే అలాంటి వేదికలను ప్రేరేపకాలుగా భావిస్తూ, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం’ అని సమాచార, సాంకేతిక శాఖ వాట్సాప్‌ను హెచ్చరించింది. నకిలీ వార్తలను గుర్తించి, అవి వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు ప్రస్తుతం అనుసరిస్తున్న లేబలింగ్ ఫార్వర్డ్స్ కన్నా మెరుగైన విధానాన్ని ప్రవేశపెట్టాలని సూచించింది. సోషల్ మీడియా దుర్వినియోగంపై రాజకీయ పార్టీలు సహా అన్ని భాగస్వామ్య పక్షాలతో చర్చించి తగిన విధానాలు రూపొందిస్తామని ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ రాజ్యసభలో వెల్లడించారు. -
ఏకకాల ఎన్నికలకు రజినీ మద్దతు
సాక్షి, చెన్నై: లోక్‌సభతోపాటు అన్ని శాసనసభలకూ ఏకకాలంలో ఎన్నికలు జరపాలన్న కేంద్రం ప్రతిపాదనకు ప్రముఖ సినీ నటుడు రజినీకాంత్ మద్దతు తెలిపారు.అన్ని ఎన్నికలూ ఒకేసారి జరిగితే సమయం, ఖర్చు ఆదా అవుతాయని రజినీ అన్నారు. అలాగే 277 కి.మీ. పొడవైన, రూ.పదివేల కోట్లతో చేపట్టనున్న చెన్నై–సేలం 8 వరుసల రహదారి ప్రాజెక్టునూ ఆయన సమర్థించారు. ఈ ప్రాజెక్టు సాగు, అటవీ భూములకు చేటు అంటూ కొందరు వ్యతిరేకిస్తుండగా.. అభివృద్ధి జరగాలంటే ఇలాంటివి అవసరమేననీ, అయితే భూములు కోల్పోయే వారికి తగిన నష్ట పరిహారం చెల్లించాల్సిందేనని పేర్కొన్నారు. బాలుడి దత్తత: పాఠశాలకు వెళ్తున్నప్పుడు రూ.50 వేలు డబ్బు దొరకగా నిజాయితీతో దానిని పోలీసులకు అప్పగించిన ఏడేళ్ల బాలుడు మహ్మద్ యాసిన్‌ను దత్తత తీసుకుంటానని రజినీ ప్రకటించారు. ఈరోడ్‌కు చెందిన యాసిన్‌తోపాటు, అతని తల్లిదండ్రుల్ని రజినీకాంత్ తన ఇంటికి పిలిపించుకుని మాట్లాడారు. బాలుడికి బంగారు గొలుసును బహుమతిగా ఇచ్చిన ఆయన.. ఆ పిల్లాడి ఉన్నత విద్యకయ్యే ఖర్చునంతా తానే భరిస్తానని చెప్పారు. -
ఐఏఎస్‌ల పనితీరు అంచనాకు కొత్త విధానం
న్యూఢిల్లీ: సీనియర్ ఐఏఎస్‌ల పనితీరు మదింపునకు కేంద్రం త్వరలో కొత్త విధానాన్ని తీసుకురానుంది. దీనిపై రూపొందించిన ముసాయిదాను కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులకు పంపించింది. దీని ప్రకారం.. కార్యదర్శులు, అదనపు కార్యదర్శుల స్థాయి అధికారుల పనితీరు అంచనాకు ఇతర అంశాలతోపాటు సమాజంలోని బలహీన వర్గాల ప్రజలతో వ్యవహరించేటప్పుడు వారి వైఖరిని కూడా పరిగణనలోకి తీసుకోనుంది. సమయానుకూలంగా, ప్రభావవంతంగా నిర్ణయాలు తీసుకోవటంలో వారి సామర్థ్యాన్ని లెక్కలోకి తీసుకోనుంది. విధుల పట్ల బాధ్యతగా వ్యవహరించటం, నమ్మిన అంశాలకు ధైర్యంగా కట్టుబడి ఉండటం, వినూత్నంగా ఆలోచించటం, నాయకత్వ లక్షణాలు, సహకారం, సమన్వయం అంశాలకు సంబంధించి 50 పదాలకు మించకుండా వారి నుంచి అభిప్రాయాల్ని సేకరించనుంది. -
లోక్‌పాల్ కోసం అన్నా హజారే నిరశన
న్యూఢిల్లీ: కేంద్రంలో లోక్‌పాల్‌ను ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. అవినీతికి వ్యతి రేకంగా హాజారే ఏడేళ్ల కింద ఉద్యమం చేపట్టి దేశవ్యాప్తం గా సంచలనం సృష్టించి, అప్పటి యూపీఏ ప్రభుత్వాన్ని కుదిపేయడం తెల్సిందే. రామ్‌లీలా మైదానంలో శుక్రవా రం ఆయన నిరాహార దీక్ష ప్రారంభించారు. అయితే ఈసారి ఆయన టార్గెట్‌గా ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కనిపిస్తోంది. కేంద్రంలో లోక్‌పాల్, రాష్ట్రాల్లో లోకాయుక్తలు ఏర్పాటు చేయాలని చాలా కాలం నుంచే అన్నా హజారే డిమాండ్ చేస్తున్నారు. అలాగే వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభాన్ని తొలగించేందుకు స్వామినాథన్ కమిషన్ నివేదికను అమలు చేయాలని కూడా ఆయన కోరుతున్నారు. -
ఢిల్లీ కేసు తర్వాతే ఆధార్ విచారణ: సుప్రీం
న్యూఢిల్లీ: ఢిల్లీలో పాలనాపరమైన అధికారాల్లో కేజ్రీవాల్ ప్రభుత్వం, కేంద్రానికి మధ్య తలెత్తిన వివాదాన్ని తమ రాజ్యాంగ బెంచ్ విచారించిన తర్వాతే సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానం పిటిషన్లను విచారిస్తామని సుప్రీం కోర్టు తెలిపింది. ఆధార్ కేసుల్ని రాజ్యాంగ బెంచ్ మాత్రమే విచారిస్తుందని సోమవారం సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానం తుదిగడువును వచ్చే ఏడాది మార్చి 31వరకు పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్రం అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. -
ఢిల్లీ పాలనపై మాదే అధికారం: కేంద్రం
న్యూఢిల్లీ: ఢిల్లీ నగరం కేవలం ఢిల్లీ వాసులదే కాదనీ, ఇది మొత్తం భారత ప్రజలందరికీ చెందుతుందని కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఢిల్లీ పరిపాలనపై అక్కడి ఆమ్ ఆద్మీ (ఆప్) ప్రభుత్వానికన్నా తమకే ఎక్కువ అధికారాలు ఉన్నాయంటూ కేంద్రం అత్యున్నత న్యాయస్థానంలో తన వాదనలు వినిపించింది. ఢిల్లీకి లెఫ్టినెంట్ గవర్నరే పరిపాలనాధిపతి అనీ, ముఖ్యమంత్రి కాదంటూ గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆప్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ అంశంపై విచారణను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం చేపట్టింది. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ మణీందర్ సింగ్ వాదిస్తూ ‘దేశ రాజధాని దేశ ప్రజలందరికీ చెందుతుంది. వారేమో (ఆప్) అక్కడి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అంటారు. మరి కేంద్రం కూడా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే కదా. ఢిల్లీ పూర్తిగా రాష్ట్రం కూడా కాదు. అది ఒక కేంద్ర పాలిత ప్రాంతమే. ఆ ప్రాంత పరిపాలనపై ఢిల్లీ శాసనసభకన్నా కేంద్రానికే ఎక్కువ అధికారాలుంటాయి. కేంద్రంతోపాటు శాసనసభకూ కూడా ఇక్కడి పాలన విషయంలో సమానాధికారాలు ఉంటాయనడం అప్రజాస్వామికం. ఇలాగైతే జనవరి 26న ఢిల్లీలో కవాతు జరగాలా లేదా అనేది కూడా వారే నిర్ణయిస్తామంటారేమో’ అని అన్నారు. విచారణ గురువారం కూడా కొనసాగనుంది. -
కేంద్రానికి సంబంధం లేదు
జిల్లాల విభజనపై ముఖ్యమంత్రి స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: జిల్లాల విభజనకు కేంద్రానికి సంబం ధంలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంచేశారు. ఇది రాష్ట్రాలకు సంబంధించిన అంశమన్నారు. జిల్లాలను 31గా విభజించడంపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పిందని.. అంగీకారం తెలపలేదంటూ ఇటీవల ఒక టీవీ చానల్లో వచ్చిన కథనాన్ని శుక్రవారం అసెంబ్లీలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ లేవనెత్తగా సీఎం కలుగజేసుకొని సమాధానమిచ్చారు. అత్యుత్సాహపు మీడియా ఏదేదో చేస్తుందని... ఉన్నదీ లేనిదీ చెపుతుందని.. అది తప్పుడు కథనమని స్పష్టంచేశారు. -
రుణమాఫీ మిగతా రైతులకు చేయరా?
కేంద్రానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రశ్న సాక్షి, హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ రైతుల రుణమాఫీకి పూర్తి స్థాయిలో నిధులు సమకూర్చి మిగిలిన రాష్ట్రా లను విస్మరించడం దారుణమని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, బిగాల గణేశ్‌గుప్తా, చింతా ప్రభాకర్‌లు కేంద్రంపై ధ్వజమెత్తారు. శుక్రవారం వారు మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రైతుల పరిస్థితే మిటని ప్రశ్నించారు. ప్రధానమంత్రి అన్ని రాష్ట్రాలను ఒకే రకండా చూడాలని, దేశా భివృద్ధి రైతులపైనే ఆధారపడి ఉందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దేశంలో ఎక్కడా రైతులు ఆనందగా లేరని, రైతులందరికీ ఒకే రకమైన జాతీయ విధానం ఉండాలని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ రైతుల రుణమాఫీకి అవసరమైన రూ. 50వేల కోట్లను కేంద్ర భరించాలని నిర్ణయించడం చూస్తే.. మిగిలిన రాష్ట్రాల రైతులను వంచించడమేనని ఆయన ఆరోపించారు. దోపిడీకి గురైన తెలంగా ణలో ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వ లేదన్నారు. కేంద్రం వెంటనే స్పందించి రూ. 17వేల కోట్లను ఇవ్వాలని, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బీజేపీ నేతలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఢిల్లీ వెళ్లి తెలంగాణకు కూడా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని, రుణమాఫీ నిధులను సమకూర్చాలని కోరాల న్నారు. కేంద్రానిది సవతి తల్లి ప్రేమని గణేశ్‌గుప్తా ఆరోపించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకే ప్రయోజనం చేసేలా కేంద్రం వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి మంచిదికాదన్నారు. -
భద్రాద్రికి ‘పర్యావరణ’ బ్రేక్
-
భద్రాద్రికి ‘పర్యావరణ’ బ్రేక్
విద్యుత్ ప్లాంట్‌కు అనుమతిని నిరాకరించిన కేంద్రం కేంద్ర విద్యుత్ శాఖ పాలసీకి విరుద్ధమని స్పష్టీకరణ ఎన్జీటీ కేసులు, పర్యావరణ వివాదాలతో ప్రాజెక్టు నిర్మాణంపై నీలినీడలు 32 నెలల నిర్మాణ గడువులో ఇప్పటికే 20 నెలలు పూర్తి సాక్షి, హైదరాబాద్/పినపాక: జిల్లా మణుగూరులో 1080 (270గీ4) మెగావాట్ల సామర్థ్యంతో తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) నిర్మించతలపెట్టిన భద్రాద్రి సబ్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతులు జారీ చేయలేమని తాజాగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పింది. 13వ పంచవర్ష ప్రణాళిక (2017-22) కాలంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో పనిచేసే థర్మల్ విద్యుత్ కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేయాలని 2009 నవంబర్ 13న కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ రూపొందించిన ఈ పాలసీకి విరుద్ధంగా సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఆధారిత ప్లాంట్లకు అనుమతిచ్చే ప్రతిపాదనలను పరిశీలించలేమని స్పష్టం చేసింది. భద్రాద్రి ప్లాంట్‌కు పర్యావరణ అనుమతుల కోసం జెన్కో సమర్పించిన ప్రతిపాదనలు పరిశీలనార్హం కావని ప్రకటిస్తూ ఈ నెల 4న కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) కేసుతో భద్రాద్రి థర్మల్ ప్లాంట్ ఇప్పటికే తీవ్ర చిక్కుల్లో ఇరుక్కుంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఈ ప్లాంట్ నిర్మాణ ప్రతిపాదనలు మూలనపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మిగిలింది మరో 12 నెలల గడువే.. ‘ఇండియా బుల్స్’అనే ప్రైవేటు కంపెనీ కోసం 270 మెగావాట్ల సామర్థ్యం గల 10 సబ్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్లకు సంబంధించిన బాయిర్లు, జనరేటర్లు, టర్బైయిన్లను కొన్నేళ్ల కింద బీహెచ్ఈఎల్ తయారు చేసింది. అరుుతే, యూపీఏ హయాంలో జరిగిన బొగ్గు కుంభకోణానికి సంబంధించిన కేసులో ఇండియా బుల్స్‌తో సహా దేశ వ్యాప్తంగా 214 బొగ్గు గనుల కంపెనీలకు కేటాయింపులను 2014లో సుప్రీం కోర్టు రద్దు చేసింది. దీంతో బీహెచ్ఈఎల్తో సైతం ఇండియా బుల్స్ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఇండియా బుల్స్ కోసం రూపొందించిన పరికరాలు సిద్ధంగా వుండడంతో కేవలం రెండేళ్లలో రాష్ట్రంలో థర్మల్ ప్రాజెక్టును నిర్మిస్తామని బీహెచ్ఈఎల్ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది. 5,044 కోట్ల అంచనా వ్యయంతో భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ నిర్మాణం కోసం దాదాపు ఏడాదిన్నర కింద బీహెచ్ఈఎల్, జెన్కో మధ్య ఒప్పందం కుదిరింది. అతి తక్కువ సమయంలో అనగా, 2015 మార్చి నుంచి 32 నెలల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసేలా ఈ ఒప్పందం జరిగింది. నాలుగు యూనిట్లలో తొలి యూనిట్‌ను 24 నెలల్లోనే పూర్తి చేయాల్సి ఉండగా.. ఆ తర్వాత ప్రతి మూడు నెలకో ప్లాంట్ చొప్పున మొత్తం 32 నెలల్లో నాలుగు ప్లాంట్లను నిర్మించాల్సి ఉంది. ఇప్పటికే 20 నెలల కాలం ముగిసిపోగా ఈ ప్లాంట్ నిర్మాణంలో ఎలాంటి పురోగతి లేదు. మరో 12 నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ ప్రాజెక్టుకు అనుమతులు జారీ చేయాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యుత్ మంత్రి పీయూశ్ గోయల్‌ను కలసి విజ్ఞప్తి కూడా చేశారు. కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో ఈ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టడం పట్ల కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఆదిలోనే అభ్యంతరం తెలపడంతో ఇప్పటి వరకు పర్యావరణ అనుమతులు రాలేదు. ఆధునిక సూపర్ క్రిటికల్ టెక్నాలజీకి మారాలని, లేకుంటే కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నుంచి ప్రత్యేక అనుమతులు పొందాలని అప్పట్లో షరతులు విధించిన కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ... తాజాగా ఈ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతులను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఆందోళనలో నిర్వాసిత యువత భద్రాద్రి పవర్‌ప్లాంట్ నిర్మాణానికి కేంద్రం అనుమతులు నిరాకరిం చడంతో ప్లాంట్ నిర్మాణం కోసం భూములు కోల్పోరుు పరిహారం తీసుకోకుండా ఉద్యోగాలు కోరుకున్న నిర్వాసిత యువత తీవ్ర ఆందోళన చెందుతోంది. నిర్వాసితుల కోటాలో పరిహారం తీసుకోకుండా ఉద్యోగాలు కోరుకొని ఇప్పటికే ఐటీఐలో చేరి శిక్షణ పొందుతున్న యువత తమ భవిష్యత్ ఎలా ఉంటుందో అనే ఆందోళనలో పడ్డారు. ఇదిలా ఉండగా ఇప్పటికే సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించే విద్యుత్ ప్లాంట్ సామగ్రిని 40 శాతం మేర నిర్మాణ ప్రాంతమైన పినపాక -మణుగూరు మండలాలకు తరలించడం గమనార్హం. -
ఎన్నికల వేళ 'అమ్మ'కు షాక్!
రాజీవ్ హంతకుల విడుదలకు కేంద్రం నో సుప్రీంలో కేసు ఉందంటూ దాటవేత సాక్షి ప్రతినిధి, చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 1991 మే 21వ తేదీన ఎన్నికల ప్రచారం నిమిత్తం తమిళనాడులోని శ్రీపెరంబుదూరుకు చేరుకున్న సమయంలో ఎల్టీటీఈ మానవబాంబు చేతిలో దారుణహత్యకు గురైన సంగతి పాఠకులకు విదితమే. సంవత్సరాల తరబడి సాగిన ఈ కేసు విచారణలో చివరకు ఏడుగురికి ఉరిశిక్ష పడగా రాష్ట్రపతి క్షమాభిక్షతో యావజ్జీవంగా మారింది. మురుగన్, పేరరివాళన్, శాంతన్, నళిని, జయకుమార్, రవిచంద్రన్, రాబర్ట్ బయాస్ ఈ ఏడుగురు గత 20 ఏళ్లుగా వేలూరు సెంట్రల్ జైలు జీవితం గడుపుతున్నారు. యావజ్జీవ శిక్ష పడిన ఖైదీలు 14 ఏళ్లకు పైగా జైలు జీవితాన్ని గడిపిన పక్షంలో రాష్ట్రప్రభుత్వమే స్వతంత్రంగా నిర్ణయం తీసుకుని విడుదల చేయవచ్చని చట్టం చెబుతోంది. రెండేళ్ల క్రితం అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పి. సదాశివం సైతం ఇదే విషయాన్ని ఆనాడు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జయలలిత సైతం సుప్రీంకోర్టు ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని దీపావళి కానుకగా ఏడుగురిని విడుదల చేయాలని నిర్ణయించినట్లు 2014లో ప్రకటించారు. ఇందుకోసం అవసరమైన తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదించి అనుమతి కోసం కేంద్రానికి పంపారు. అయితే కాంగ్రెస్ నేతృత్వంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వం ఇందుకు అభ్యంతరం తెలిపింది. మాజీ ప్రధాని హత్య కేసుకే ఈ గతా అంటూ రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. అంతేగాక హంతకుల విడుదలకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయించారు. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు సీబీఐ అధికారులు చేపట్టిన విచారణలో శిక్షపడినందున వారిని విడుదల చేసే హక్కు రాష్ట్రప్రభుత్వానికి లేదని గత ఏడాది డిశంబరు 2 వ తేదీన తీర్పుచెప్పింది. దీంతో ఏడు మంది హంతకుల విడుదల అంశంపై అప్పటికి అటకెక్కేసింది. అయితే, 24 ఏళ్లుగా జైలులో ఉన్న ఏడు మంది అర్హులు కాబట్టి వెంటనే విడుదల చేయాల్సిందిగా రాష్ట్రంలోని అనేక ప్రజా సంఘాలు, పార్టీలు డిమాండ్ చేయడంతోపాటు నిరసనలు వ్యక్తం చేశాయి. ఈ పరిణామంతో సీఎం జయలలిత ఆదేశాల మేరకు రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జ్ఞానదేశికన్ గత నెల 2వ తేదీన ఇటీవల కేంద్రహోంశాఖకు ఉత్తరం రాశారు. 24 ఏళ్లగా జైలులో ఉన్న ఏడుగురు రాజీవ్ హంతకులను విడుదల చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. ఈ అంశంలో కే ంద్రం అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా కోరారు. మేమేమీ చెప్పలేం తమిళనాడు ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి స్పందించిన కేంద్ర హోంశాఖ ఓ ఉత్తరం రాసింది. ఏడుగురు ఖైదీల విడుదల అంశం సుప్రీంకోర్టు విచారణలో ఉన్నందున తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించలేమని పేర్కొంది. రాష్ట్రప్రభుత్వం నుంచి అందిన ఉత్తరంపై న్యాయనిపుణులను సంప్రదించగా తమ నిర్ణయాన్నే సమర్థించినట్లు కేంద్రం తెలిపింది. ఏడుగురు ఖైదీలను విడుదల చేసే అధికారం తమిళనాడు ప్రభుత్వానికి లేదని సైతం న్యాయనిపుణులు స్పష్టం చేశారని తెలిపింది. ఎన్నికల వేళ ఎదురుగాలి రాష్ట్రంలో దాదాపుగా ప్రతి అంశానికి రాజకీయాలు ముడిపడి ఉండగా, రాజీవ్ హంతకుల అంశానికి సైతం రాజకీయ రంగు పులుముకుంది. తమిళులకు ఎంతో ప్రీతిపాత్రమైన దీపావళి రోజున ఏడు మంది హంతకులను విడుదల చేయడం ద్వారా మార్కులు కొట్టేయాలని సీఎం జయలలిత భావించారు. అయితే అనుకోని అవాంతరాలు వచ్చిపడటంతో నిరాశచెందారు. ఎన్నికల సమయంలో ఏడుమందిని విడుదల చేయడం ద్వారా సానుభూతిపరులను ఓట్లు రాబట్టుకోవాలని అన్నాడీఎంకే ప్రభుత్వం సహజంగానే ఆశించి ఉండవచ్చు. అందుకే సరిగ్గా ఎన్నికల ప్రకటన వెలువడే సమయంలో కేంద్రంతో సంప్రదింపులు జరిపింది. అయితే ఇదే సానుభూతిని పొందాలని ఎదురుచూస్తున్న బీజేపీ అన్నాడీఎంకేతో పొత్తు కోసం అర్రులుచాచి భంగపడింది. రెండుపార్టీల మధ్య పొత్తు చర్చలు ప్రారంభం కాక ముందే బెడిసికొట్టాయి. హంతకుల విడుదల అంశం తమ చేతుల్లో లేదని బీజేపీ ప్రభుత్వం తెలివిగా తప్పుకున్నట్లు భావించవచ్చు. తాజా పరిణామంతో సీఎం జయ, ఏడు మంది హంతకుల ఆశ నిరాశగా మిగిలిపోయింది.