Government To Chalk Out Legal Road Map For Work From Home: వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు శుభవార్త...! కరోనా రాకతో ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్‌కే పరిమితమైన విషయం తెలిసిందే. కాగా ఆయా కంపెనీలు ఉద్యోగులతో ఎక్కువసేపు పనిచేస్తున్నారనే వార్తలు రావడంతో... వర్క్ ఫ్రమ్ హోంపై కేంద్రం త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోనుంది.
త్వరలోనే... ఫ్రేమ్ వర్క్..!
వర్క్ ప్రమ్ హోంపై కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఒక ఫ్రేమ్ వర్క్‌ను రూపొందించేందుకు ఓ కమిటీను ఏర్పాటుచేయనుంది. దీంతో ఉద్యోగుల హక్కులను కాపాడే అవకాశం ఉంది. వర్క్ ఫ్రమ్ హోం పేరుతో ఉద్యోగులను ఆయా సంస్థలు పిండేస్తున్నాయి. ఈ ఫ్రేమ్ వర్క్‌తో ఉద్యోగులకు కచ్చితమైన పనిగంటలను నిర్ణయించి అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఉద్యోగులకు విద్యుల్, ఇంటర్నెట్ బిల్లులు, ఇంట్లో ఉపయోగించే ఆఫీస్ స్పేస్, ఫర్నిచర్ వంటి ప్రాథమిక ఖర్చులను కంపెనీలు భరించేలా నిబంధనలను రూపొందించనున్నారు. వర్క్ ఫ్రమ్ హోంపై అధ్యయనం కోసం ప్రభుత్వం ఒక కన్సల్టెన్సీ సంస్థను నియమించనుంది.
చదవండి: 2021లో తెగ వాడేసిన ఎమోజీ ఇదేనండోయ్..!
మరింత జవాబుదారీగా..!
ఈ ఏడాది ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోంపై స్టాండింగ్ ఆర్డర్స్‌ను ఆమోదించడం ద్వారా పలు సేవారంగాల్లో వర్క్ ఫ్రమ్ హోంను లాంఛనప్రాయం చేసింది. ఈ ఆర్డర్స్‌తో రిమోట్‌గా పని చేయాలని నిర్ణయించుకునే ముందు ఉద్యోగులు, కంపెనీలు పరస్పరం పని గంటల సమయాన్ని, ఇతర షరతులను సెట్ చేసుకోవడానికి వీలు కల్పించింది. అయితే వాస్తవికంగా పరిస్థితులు వేరేలా ఉన్నాయి. ఉద్యోగులను ఎక్కువ సమయం మేర పని చేయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకుగాను ఉద్యోగుల హక్కులను పరిరక్షించేందుకుగాను ఇటీవల పోర్చుగల్ వర్క్ ఫ్రమ్ హోం చట్టాలను అనుసరించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ చట్టాలకు ఆమోదం లభిస్తే... వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు చట్టపరమైన మద్దతును అందిచడంతో పాటుగా కంపెనీలకు మరింత జవాబుదారీతనాన్ని జోడిస్తుంది.
చదవండి: అరెవ్వా..30 వెడ్స్ 21, సూర్య వెబ్‌సిరీస్‌లు అదరగొట్టాయే...! భారత్‌లోనే..
Comments
Please login to add a commentAdd a comment