వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ రొటీన్‌ కాదు.. ఇక వచ్చేయండి.. | Dell Calls Global Sales Team Back To Office From September 30, Check Out Details Inside | Sakshi
Sakshi News home page

Dell Work From Office: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ రొటీన్‌ కాదు.. ఇక వచ్చేయండి..

Published Fri, Sep 27 2024 8:41 AM | Last Updated on Fri, Sep 27 2024 9:42 AM

Dell Calls Global Sales Team Back To Office from september 30

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని కంపెనీలు స్వస్తి పలుకుతున్నాయి. తాజాగా టెక్‌ దిగ్గజం డెల్‌ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ సేల్స్ టీమ్ ఉద్యోగులను సెప్టెంబరు 30 నుండి ఆఫీస్‌లకు వచ్చేయాలని ఆదేశించింది. వారానికి ఐదు రోజులూ ఆఫీస్‌ నుంచే పనిచేయాలని డెల్‌ ఉద్యోగులను కోరిందని దీనికి సంబంధించిన మెమోను తాము చూసినట్లు రాయిటర్స్ పేర్కొంది.

ఉద్యోగులకు సహకార వాతావరణాన్ని ఏర్పాటు చేయడం, నైపుణ్యాలను పెంపొందించుకోవడం కోసమే ఈ మార్పు చేస్తున్నట్లు డెల్‌ తెలిపింది. ఇందుకోస టీమ్‌ ఆఫీస్‌లో ఉండాల్సిన అవసరం ఉందని మెమో పేర్కొంది. "రిమోట్‌గా పని చేయడం అన్నది మినహాయింపుగా ఉండాలి. రొటీన్ కాకూడదు" అని జోడించింది.

మెమో ప్రకారం.. సేల్స్ టీమ్‌లోని ఫీల్డ్ ప్రతినిధులు వారానికి ఐదు రోజులు కస్టమర్‌లు, భాగస్వాములతో లేదా కార్యాలయంలో పనిచేయాల్సి ఉంటుంది. గతంలో వీరు వారానికి మూడు రోజులు కార్యాలయం నుండి పని చేయాల్సి ఉండేది. ఇక ఆఫీస్‌కు వచ్చేందుకు సాధ్యపడని సేల్స్ టీమ్ సభ్యులు రిమోట్‌గానే పని చేయవచ్చని అని డెల్ వెల్లడించింది.

కోవిడ్‌ మహమ్మారి విజృంభణ సమయం నుండి చాలా కంపెనీలు ఉద్యోగులను ఇంటి నుండి పని చేయడానికి అనుమతించాయి. అయితే, కొన్ని టెక్ సంస్థలు, ఇప్పుడు ఉద్యోగులతో వారంలో రెండు నుండి మూడు రోజులు ఆఫీస్‌ల నుంచి పని చేయిస్తున్నాయి. వచ్చే ఏడాది నుంచి వారానికి ఐదు రోజులు కంపెనీ కార్యాలయాలలో పని చేయాలని గత వారం ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ తమ ఉద్యోగులకు ఆదేశాలను జారీ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement