Dell
-
వర్క్ ఫ్రమ్ హోమ్ రొటీన్ కాదు.. ఇక వచ్చేయండి..
వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని కంపెనీలు స్వస్తి పలుకుతున్నాయి. తాజాగా టెక్ దిగ్గజం డెల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ సేల్స్ టీమ్ ఉద్యోగులను సెప్టెంబరు 30 నుండి ఆఫీస్‌లకు వచ్చేయాలని ఆదేశించింది. వారానికి ఐదు రోజులూ ఆఫీస్ నుంచే పనిచేయాలని డెల్ ఉద్యోగులను కోరిందని దీనికి సంబంధించిన మెమోను తాము చూసినట్లు రాయిటర్స్ పేర్కొంది.ఉద్యోగులకు సహకార వాతావరణాన్ని ఏర్పాటు చేయడం, నైపుణ్యాలను పెంపొందించుకోవడం కోసమే ఈ మార్పు చేస్తున్నట్లు డెల్ తెలిపింది. ఇందుకోస టీమ్ ఆఫీస్‌లో ఉండాల్సిన అవసరం ఉందని మెమో పేర్కొంది. "రిమోట్‌గా పని చేయడం అన్నది మినహాయింపుగా ఉండాలి. రొటీన్ కాకూడదు" అని జోడించింది.మెమో ప్రకారం.. సేల్స్ టీమ్‌లోని ఫీల్డ్ ప్రతినిధులు వారానికి ఐదు రోజులు కస్టమర్లు, భాగస్వాములతో లేదా కార్యాలయంలో పనిచేయాల్సి ఉంటుంది. గతంలో వీరు వారానికి మూడు రోజులు కార్యాలయం నుండి పని చేయాల్సి ఉండేది. ఇక ఆఫీస్‌కు వచ్చేందుకు సాధ్యపడని సేల్స్ టీమ్ సభ్యులు రిమోట్‌గానే పని చేయవచ్చని అని డెల్ వెల్లడించింది.కోవిడ్ మహమ్మారి విజృంభణ సమయం నుండి చాలా కంపెనీలు ఉద్యోగులను ఇంటి నుండి పని చేయడానికి అనుమతించాయి. అయితే, కొన్ని టెక్ సంస్థలు, ఇప్పుడు ఉద్యోగులతో వారంలో రెండు నుండి మూడు రోజులు ఆఫీస్‌ల నుంచి పని చేయిస్తున్నాయి. వచ్చే ఏడాది నుంచి వారానికి ఐదు రోజులు కంపెనీ కార్యాలయాలలో పని చేయాలని గత వారం ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తమ ఉద్యోగులకు ఆదేశాలను జారీ చేసింది. -
లేఆఫ్ దడ.. కలవరపెడుతున్న డెల్ ప్రకటన
లేఆఫ్‌ల దడ టెకీలను పీడిస్తూనే ఉంది. తొలగింపులు కొనసాగుతాయని ప్రముఖ టెక్నాలజీ కంపెనీ డెల్ తెలియజేసింది. ఉత్పత్తుల డిమాండ్ తగ్గడం, విక్రయాలు మందగించడంతో వ్యయాలను నియంత్రణకు కంపెనీ కష్టాలు పడుతోంది. ఇప్పటికే వేలాది మందికి లేఆఫ్‌లు ప్రకటించిన కంపెనీ ఇవి ఇంకా కొనసాగుతాయని వెల్లడించడం ఉద్యోగులను కలవరపెడుతోంది.ఇప్పటికే గత నెలలో ప్రకటించిన లేఆఫ్‌లలో దాదాపు 12,500 మందికి ఉద్వాసన పలికింది డెల్. పర్సనల్ కంప్యూటర్లకు డిమాండ్ పుంజుకోకపోవడం, ఏఐ కోసం ఆప్టిమైజ్ చేసిన సర్వర్ల అమ్మకాలు లాభదాయకంగా లేవన్న ఆందోళనల నేపథ్యంలో ఖర్చుల నియంత్రణ కోసం ఉద్యోగుల తొలగింపులు ఇంకా కొనసాగుతాయని ప్రకటించింది.ఇదీ చదవండి: ‘ఇన్ఫోసిస్ సంగతేంటో చూడండి’..బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. డెల్ కంపెనీ ఉద్యోగులను తొలగింపులను కొనసాగించడంతోపాటు నియామకాలను సైతం తగ్గించనుంది. ఉద్యోగుల పునర్వ్యవస్థీకరణ, ఇతర చర్యలు 2025 ఫిబ్రవరి వరకు కొనసాగనున్నాయి. ఈ ఏడాది జూన్‌లో కంపెనీ ప్రకటించిన లేఆఫ్‌లతో చాలా మంది ఉద్యోగులు ప్రభావితమయ్యారు. ఇందులో సేల్స్ ఉద్యోగులే ఎక్కువ మంది. ప్రభావితమైన ఉద్యోగులు 12,500 మందికి పైనే ఉంటారని అంచనా వేసినా దాన్ని కంపెనీ ధ్రువీకరించలేదు. తొలగించినవారికి సీవెరెన్స్ కింద 328 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉందని నివేదిక పేర్కొంది. -
ఆ కంపెనీ టెకీలపై లేఆఫ్ పిడుగు! 12,500 మంది తొలగింపు
ప్రముఖ టెక్నాలజీ కంపెనీ డెల్ టెక్నాలజీస్ మళ్లీ భారీ సంఖ్యలో తొలగింపులను ప్రకటించింది. గత 15 నెలల్లో ఇది రెండవ రౌండ్ లేఆఫ్. కంపెనీ ఈసారి దాదాపు 12,500 మంది ఉద్యోగులను తొలగించింది. ఇది దాని మొత్తం వర్క్ ఫోర్స్‌లో దాదాపు 10 శాతం.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆధునిక ఐటీ సొల్యూషన్స్‌లో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఉద్దేశించిన విస్తృత పునర్వ్యవస్థీకరణలో ఈ తొలగింపులు భాగం. తమ కస్టమర్ సంస్థలకు ఏఐ ద్వారా మెరుగైన సేవలు అందించి మార్కెట్ వృద్ధిని పెంచుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.తొలగింపుల నిర్ణయాన్ని కంపెనీ గ్లోబల్ సేల్స్ అండ్ కస్టమర్ ఆపరేషన్స్ ప్రెసిడెంట్ బిల్ స్కానెల్, గ్లోబల్ ఛానెల్స్ ప్రెసిడెంట్ జాన్ బైర్న్ మెమో ద్వారా తెలియజేశారు. ఉద్యోగుల తొలగింపులు బాధాకరమే అయినప్పటికీ భవిష్యత్ వృద్ధి కోసం అనివార్యమైనట్లు పేర్కొన్నారు. తొలగింపుల గురించి ఉద్యోగులకు హెచ్ఆర్ ఎగ్జిట్ మీటింగ్‌ల ద్వారా తెలియజేశారు.కొందరికి వన్-ఆన్-వన్ మీటింగ్‌ల ద్వారా ఈ విషయం తెలిసింది. బాధిత ఉద్యోగులకు రెండు నెలల వేతనాలతో పాటు సంవత్సరానికి అదనంగా ఒక వారం, గరిష్టంగా 26 వారాల వరకు సీవెరన్స్ ప్యాకేజీలు అందిస్తున్నారు. అయితే ప్రోత్సాహకాలు, స్టాక్ ఆప్షన్లు కోల్పోవడంపై దీర్ఘకాలిక ఉద్యోగులలో అసంతృప్తి ఉంది. ఇటీవలి బడ్జెట్ తగ్గింపులు, రద్దైన ప్రాజెక్ట్‌లను గమనించిన కొంతమంది ఉద్యోగులు కోతలను ముందే ఊహించారు.డెల్ ఇప్పటికే 2023 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 13,000 మంది ఉద్యోగులను తొలగించింది. రిమోట్-వర్క్ విధానాన్ని రద్దు చేస్తూ, గత సంవత్సరం ఉద్యోగులను తిరిగి ఆఫీస్‌లకు పిలవాలని కంపెనీ తీసుకున్న నిర్ణయం కూడా సిబ్బందిని తగ్గించడంలో భాగంగా తీసుకున్న చర్యగా భావిస్తున్నారు. ప్రస్తుత తొలగింపులతో డెల్ వర్క్‌ఫోర్స్ 1.2 లక్షల నుంచి 1లక్ష దిగువకు తగ్గుతుందని అంచనా. -
‘వర్క్ ఫ్రమ్ హోమ్’ కోసం డెల్ ఉద్యోగులు చేస్తున్న రిస్క్ ఏంటి?
వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అలవాటు పడిన ఉద్యోగులను ఆఫీసులకు రప్పించడం కంపెనీలకు కత్తిమీద సాములా మారింది. ఎన్ని ఆంక్షలు పెట్టినా, కఠిన నిబంధనలు తీసుకొస్తున్నా ఉద్యోగులు జంకడం లేదు. ఆఫీస్‌కు రావడానికి ససేమిరా అంటున్నారు. ప్రముఖ టెక్నాలజీ కంపెనీ డెల్ ఉద్యోగులైతే వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ప్రమోషన్లు సైతం వదులుకునేందుకు సిద్ధమయ్యారు.డెల్ కంపెనీ గత ఫిబ్రవరిలో రిటర్న్-టు-ఆఫీస్ తప్పనిసరి నిబంధనను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం.. హైబ్రిడ్‌గా పనిచేస్తారా.. లేక రిమోట్‌గా పనిచేస్తారా అన్నది అధికారికంగా తెలియజేయాల్సి ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌ను ఎంచుకున్న ఉద్యోగులు ప్రమోషన్ లేదా పాత్ర మార్పులకు అర్హులు కాదని కంపెనీ పేర్కొంది.హైబ్రిడ్‌ను ఎంచుకున్న ఉద్యోగులకు త్రైమాసికానికి 39 రోజులు, వారానికి సుమారు మూడు రోజులు ఆఫీసులో హాజరును కంపెనీ తప్పనిసరి చేసింది. వారి హాజరును కలర్-కోడ్ సిస్టమ్ ద్వారా పర్యవేస్తుంది. బిజినెస్ ఇన్సైడర్ ప్రకారం.. డెల్ ఫుల్‌టైమ్ యూఎస్ ఉద్యోగులలో దాదాపు 50 శాతం మంది వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ఎంచుకున్నారు.దీని అర్థం ఈ ఉద్యోగులు పదోన్నతికి అర్హులు కాదు. ఇక అంతర్జాతీయ సిబ్బందిలోనూ మూడింట ఒక వంతు మంది వర్క్ ఫ్రమ్ హోమ్‌నే ఎంచుకున్నారు. ఆఫీసుకు వెళ్లడం కన్నా ఇంటి నుంచి పనిచేయడంలోనే తమకు ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని చాలా మంది ఉద్యోగులు భావిస్తున్నారు. దీంతో ప్రమోషన్లను సైతం వదులుకునేందుకు సిద్ధమయ్యారు. -
ఎంప్లాయిస్ కి చుక్కలే ! ప్రమోషన్లకు దానికీ లింకా?
-
ఆఫీస్‌కు రాకపోతే ప్రమోషన్ కట్.. ప్రముఖ టెక్ కంపెనీ కీలక నిర్ణయం
ఉద్యోగులు ఆఫీస్‌కు రాకపోతే పదోన్నతులు ఇవ్వబోమని ప్రముఖ ల్యాప్‌ట్యాప్‌ల తయారీ కంపెనీ డెల్ ప్రకటించింది. ఈమేరకు ఉద్యోగులకు మెమో పంపినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. టెక్ కంపెనీల ఉద్యోగులకు కరోనా సమయంలో వర్క్‌ఫ్రం హోం వెసులుబాటు ఇచ్చిన విషయం తెలిసిందే. క్రమంగా కొవిడ్ భయాలు తగ్గి, పరిస్థితులు మెరుగవుతుంటే కంపెనీలు హైబ్రిడ్పని విధానానికి మారాయి. తాజాగా ఆ విధానాన్ని సైతం తొలగించి కొన్ని కంపెనీలు పూర్తిగా కార్యాలయాలకు రావాలని కోరుతున్నాయి. అయినప్పటికీ కొంతమంది ఉద్యోగులు ఇతర కారణాల వల్ల ఆఫీస్ నుంచి పని చేసేందుకు ఇష్టపడడం లేదు. దాంతో కంపెనీలు చేసేదేమిలేక అలాంటి వారిపై చర్యలకు పూనుకున్నాయి. తాజాగా డెల్ కంపెనీ కార్యాలయాలకు రాని ఉద్యోగులకు ప్రమోషన్ ఇవ్వబోమని లేఖలు పంపింది. అయితే కరోనా పరిణామాలకు దశాబ్దం ముందు నుంచే హైబ్రిడ్ పని (వారంలో కొన్ని రోజులు ఇంటి నుంచి, మరికొన్ని రోజులు కార్యాలయాలకు రావడం) విధానాన్ని సంస్థ అనుమతిస్తోంది. ఆ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ మైఖేల్ డెల్ దీనికి ప్రోత్సహించారు. ఉద్యోగులు ఆఫీసుకు రావాలంటూ పట్టుపడుతున్న కంపెనీల విధానాన్ని అప్పట్లో మైఖేల్ తప్పుబట్టారు. ఇపుడు మాత్రం కంపెనీ అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందనే వాదనలు ఉన్నాయి. ఇదీ చదవండి: వీడియో క్రియేటర్లకు పెద్దదెబ్బ.. యూట్యూబ్ కొత్త నిబంధన..? కంపెనీ పంపిన లేఖలో ఉద్యోగులను హైబ్రిడ్, రిమోట్ వర్కర్లుగా వర్గీకరించింది. హైబ్రిడ్ సిబ్బంది వారంలో కనీసం 3 రోజులు ఆఫీసుకు రావాల్సి ఉంది. పూర్తిగా ఇంటి నుంచి పనిచేసే వారికి చాలా పరిమితులు ఉంటాయని కంపెనీ లేఖలో పేర్కొంది. పదోన్నతి లేదా కంపెనీలో ఇతర జాబ్ రోల్లకు ఇంటి నుంచి పనిచేసే వారి పేర్లను పరిశీలించరని కంపెనీ తెలిపింది. -
ఒక్కరోజులో ఎగిసిన షేర్లు.. 100 బిలియన్ క్లబ్‌లోకి డెల్ సీఈవో
ప్రముఖ టెక్నాలజీ కంపెనీ డెల్ (Dell Technologies) సీఈవో మైఖేల్ సాల్ డెల్ 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సంబంధిత పరికరాలకు పెరిగిన డిమాండ్‌తో కంపెనీ నాల్గవ త్రైమాసిక ఆదాయం అమాంతం ఎగిసింది. దీంతో డెల్ టెక్నాలజీస్ ఫౌండర్, చైర్మన్, సీఈవో అయిన మైఖేల్ డెల్ సంపద శుక్రవారం మొదటిసారిగా 100 బిలియన్ డాలర్ల మార్కును సాధించింది. ప్రపంచంలోని అతిపెద్ద టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలలో ఒకటైన డెల్ షేర్లు రికార్డు స్థాయికి 32 శాతం జంప్ చేసి, దాని వ్యవస్థాపకుని నెట్‌వర్త్‌ను 13.7 బిలియన్ డాలర్లు పెంచి 104.3 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.8.6 లక్షల కోట్లు) చేర్చాయి. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం డెల్ ఇప్పుడు భారత్ చెందిన గౌతమ్ అదానీ తర్వాత 12వ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. మైఖేల్ డెల్ సంపదలో దాదాపు సగం తన కంప్యూటర్ల తయారీ కంపెనీ నుంచే వచ్చింది. ఆయన 40 సంవత్సరాల క్రితం ఆస్టిన్లోని టెక్సాస్ విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉన్నప్పుడు డెల్ కంపెనీకి ప్రారంభించారు. ఏఐ సంబంధిత స్టాక్‌లలో దూసుకుపోతున్న ర్యాలీ కారణంగా ఈ సంవత్సరం సంపద విపరీతంగా పెరిగిన కొంతమంది బిలియనీర్లలో మైఖేల్ డెల్ కూడా ఒకరు. ఆయన సంపద పెరగడానికి చిప్‌మేకర్ బ్రాడ్‌కామ్ కూడా దోహదపడింది. 2021లో వీఎంవేర్‌ని కొనుగోలు చేసిన తర్వాత డెల్ అందులో వాటాను పొందారు. ఆ షేర్ల విలువ ఇప్పుడు 31 బిలియన్ల డాలర్లుకు పైగా ఉంది. -
టెస్లా సీఈఓతో డెల్ చైర్మన్.. నెట్టింట్లో ఫోటో వైరల్
టెక్సాస్‌లోని టెస్లా గిగా ఫ్యాక్టరీని సీఈఓ ఇలాన్ మస్క్‌తో కలిసి డెల్ టెక్నాలజీస్ చైర్మన్ అండ్ సీఈఓ మైఖేల్ డెల్ సందర్శించారు. ఈ సందర్భంలో ఇటీవలే మార్కెట్లో లాంచ్ అయిన కొత్త టెస్లా సైబర్ ట్రక్ పక్కన ఇద్దరు వ్యాపారవేత్తలు చెట్టపట్టాలేసుకుని కనిపించారు. ఈ ఫోటోలు స్వయంగా డెల్ సీఈఓ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. ఫోటో షేర్ చేస్తూ.. టెస్లా గిగా ఫ్యాక్టరీ సందర్శించడం ఆనందంగా ఉందని, ఈ పర్యటనకు సహకరించిన మస్క్‌కు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. దీనికి మస్క్ రిప్లై ఇస్తూ.. మిమ్మల్ని చూటడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ పోస్టుకు పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో ఒకరు డెల్ ఎప్పుడు సైబర్ ట్రక్కుని పొందుతున్నారని ప్రశ్నించగా.. మరొకరు సైబర్ ట్రక్ బేస్డ్ ఏలియన్‌వేర్ కంప్యూటర్ను తయారు చేయాలని కామెంట్ చేశారు. ఇదీ చదవండి: సెల్ఫ్ డ్రైవింగ్ కారు తయారు చేసిన రైతు బిడ్డ, ముచ్చటపడ్డారు కానీ రిజెక్ట్! టెస్లా సీఈఓతో డెల్ సీఈఓకు ఉన్న పరిచయం ఇప్పటిది కాదు. చాలా సంవత్సరాలుగా ఈ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. 2013లో డెల్ కంపెనీ నిర్వహించిన డెల్ వరల్డ్‌కు మస్క్ హాజరయ్యారు. ఆ తరువాత మస్క్ తన కంపెనీ 39వ వార్షికోత్సవం సందర్భంగా డెల్ సీఈఓను ఉద్దేశించి ట్వీట్ చేసారు. ఇలా వారికి చాలా సంవత్సరాల ముందు నుంచే అనుబంధం ఉంది. Thank @elonmusk for the most impressive and inspiring tour of @Tesla Giga Texas! 🚀🤠 pic.twitter.com/C7IuJhVoQF — Michael Dell (@MichaelDell) February 10, 2024 -
ప్రముఖ టెక్ కంపెనీ కఠిన నిర్ణయం.. ప్రమాదంలో ఐటీ ఉద్యోగుల భవిష్యత్!
ప్రముఖ టెక్నాలజీ సంస్థ డెల్ ఉద్యోగులకు అల్టిమేట్టం జారీ చేసింది. ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగులు వారానికి మూడు రోజులు కార్యాలయాలకు రావాలని పిలుపు నిచ్చింది. లేని పక్షంలో మీ కెరియర్‌కు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించింది. కరోనా మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలో డెల్ ఇతర టెక్ కంపెనీల తరహాలో ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ అవకాశం కల్పిచ్చింది. ఉద్యోగులు ఆఫీస్‌కు వచ్చే అవసరం లేకుండా 60 శాతం మంది సిబ్బందికి రిమోట్ వర్క్‌ను సౌకర్యాన్ని కల్పిచ్చింది. అయితే కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో కంపెనీ తన వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాలను పునఃసమీక్షించింది. మార్చి 2023లో డెల్ తన కార్యాలయాలకు ఒక గంట ప్రయాణానికి లోపల నివసించే ఉద్యోగులందరూ వారానికి కనీసం మూడు రోజులు హాజరు కావాలని తప్పనిసరి చేసింది. తాజాగా, ఆ నిబంధనను అందరికి అమలు చేసింది. కెరీర్ ఫణంగా పెట్టి కానీ వారిలో తక్కువ వేతనం పొందుకు ఉద్యోగులు రిమోట్ వర్క్‌కి మొగ్గు చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. కార్యాలయానికి కొన్ని గంటల దూరంలో నివసించే వారు కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుందని, లేదంటే కెరీర్‌ను ఫణంగా పెట్టి రిమోట్ వర్క్ చేస్తామంటూ డెల్‌తో కాంట్రాక్ట్ కుదర్చుకునే అవకాశం ఉందని వెలుగులోకి వచ్చిన నివేదికలు పేర్కొన్నాయి. లేఆఫ్స్ ఉన్నప్పటికీ డెల్ గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన వర్క్ ఫోర్స్‌లో సుమారు 6వేల మందిని లేఆఫ్స్ ప్రకటించింది. అయినప్పటికీ డెల్ స్టాక్ గణనీయమైన పెరుగుదలను చూసింది. గత 12 నెలల్లో దాని విలువను రెట్టింపు చేసి సుమారు 60 బిలియన్ డాలర్లకు చేరుకుంది. -
27 సంస్థలకు ఐటీ హార్డ్‌వేర్ పీఎల్ఐ స్కీము
న్యూఢిల్లీ: దేశీయంగా ఐటీ హార్డ్‌వేర్ తయారీని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) స్కీము కింద 27 సంస్థలు ఎంపికయ్యాయి. అనుమతి పొందిన వాటిలో డెల్, హెచ్‌పీ, ఫ్లెక్స్‌ట్రానిక్స్, ఫాక్స్‌కాన్ మొదలైన కంపెనీలు ఉన్నాయి. ఈ సంస్థల్లో 95 శాతం కంపెనీలు (23) ఇప్పటికే తయారీకి సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మిగతా నాలుగు కంపెనీలు వచ్చే 90 రోజుల్లో ఉత్పత్తి ప్రారంభించగలవని ఆయన వివరించారు. ‘ఈ 27 దరఖాస్తులతో దాదాపు రూ. 3,000 కోట్ల మేర పెట్టుబడులు రాగలవు. అంతకన్నా ముఖ్యంగా విలువను జోడించే ఉత్పత్తుల తయారీ వ్యవస్థ భారత్ వైపు మళ్లగలదు‘ అని మంత్రి పేర్కొన్నారు. పీసీలు, సర్వర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు వంటి ఐటీ హార్డ్‌వేర్ తయారీలో భారత్ దిగ్గజంగా ఎదిగేందుకు ఇది తోడ్పడగలదని వివరించారు. అదనంగా రూ. 3.5 లక్షల కోట్ల విలువ చేసే ఉత్పత్తుల తయారీకి, ప్రత్యక్షంగా 50,000 మంది .. పరోక్షగా 1.5 లక్షల మంది ఉపాధి పొందడానికి స్కీము దోహదపడగలదని మంత్రి చెప్పారు. -
టెక్నాలజీ రంగంలో ఉపాధి కోతలు
వాషింగ్టన్: టెక్నాలజీ రంగంలో గతేడాది నుంచి ఆరంభమైన ఉద్యోగ కోతల క్రమం ఇప్పుడప్పుడే ఆగేట్టు కనిపించడం లేదు. తాజాగా కంప్యూటర్ తయారీ సంస్థ డెల్ 6,600 ఉద్యోగులను తగ్గించుకుంటున్నట్టు ప్రకటించింది. గత నెలలోనే టెక్నాలజీ రంగంలో 50వేల ఉద్యోగాలకు కోత పడింది. అయినప్పటికీ చాలా వరకు టెక్నాలజీ కంపెనీలు మూడేళ్ల క్రితం నాటితో పోలిస్తే ఇప్పటికీ అదనపు ఉద్యోగులతో ఉండడం గమనార్హం. ► డెల్ తన ఉద్యోగుల్లో 5 శాతాన్ని తొలగించుకోనుంది. ఈ సంస్థలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,33,000గా ఉంది. ► గత నెలలో అమెజాన్ 18వేల మందిని తొలగిస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం. ► సేల్స్‌ఫోర్స్ 8,000 మంది ఉద్యోగులను తొలగించింది. ► మైక్రోసాఫ్ట్ 10వేల మంది, గూగుల్ 12వేల మంది చొప్పున ఉద్యోగులను ఇంటికి సాగనంపాయి. ► గూగుల్ 12,000 మంది (6 శాతం) ఇంటికి వెళ్లకతప్పదని ప్రకటించింది. ► స్పాటిఫై 6 శాతం మందిని తొలగించుకుంది. ► ఎస్ఏపీ అయితే ప్రపంచవ్యాప్తంగా 3,000 మంది ఉద్యోగులను (2.5 శాతం) తగ్గించుకుంది. ► పేపాల్ సంస్థ 7 శాతం ఉద్యోగులను (2,000 మంది) తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ► ఐబీఎం సంస్థ కూడా 3,900 ఉద్యోగులను తొలగించింది. ► గతేడాది చివర్లో ట్విట్టర్ సైతం పెద్ద సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపించేసింది. ► మెటా సంస్థ 11,000 మందిని (13 శాతం), లిఫ్ట్ 700 మందికి ఉద్యోగులకు ఉద్వాసన చెప్పింది. -
Tech layoffs మరో టాప్ కంపెనీ నుంచి 6650 ఉద్యోగులు ఔట్!
సాక్షి,ముంబై: టెక్ ఉద్యోగులకు మరో చేదు వార్త. గ్లోబల్ ఆర్థిక మాంద్యం భయాలు, ఆదాయాల క్షీణత పలు టెక్ కంపెనీ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. దీంతో ఖర్చుల నియంత్రలో భాగంగావేలాది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో కంప్యూటర్ల సంస్థ డెల్ నిలిచింది. పీసీ అమ్మకాలు పడిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6,650 ఉద్యోగాలను తొలగించనుంది. ఈ మేరకు కంపెనీ ఉద్యోగులకు ఈమెయిల్ సమాచారం అందించింది. బ్లూమ్‌బెర్గ్ కథనం ప్రకారం మొత్తం సిబ్బందిలో 5 శాతం ఉద్యోగులను ఉద్వాసన పలుకుతోంది. కంపెనీ మార్కెట్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందనీ ఈ అనిశ్చితి భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని కో-చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జెఫ్ క్లార్క్ ఉద్యోగులకు తెలిపారు. కోవిడ్ సంక్షోభం తరువాత, కంప్యూటర్లు ఇతర హార్డ్‌వేర్ ఉత్పత్తుల డిమాండ్ పెరిగి నప్పటికీ 2022 నాల్గవ త్రైమాసికంలో వ్యక్తిగత కంప్యూటర్ షిప్మెంట్లు బాగా పడిపోయాయని పరిశ్రమ విశ్లేషకులు అంటున్నారు. ప్రధానంగా డెల్ కంపెనీ అమ్మకాలు భారీ క్షీణించాయని ఐడీసీ పేర్కొంది. తొలగింపుల తర్వాత, డెల్ ఉద్యోగుల సంఖ్య కనీసం ఆరేళ్లలో కనిష్టంగా 1,26,300గా ఉంటుందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. కాగా 2021లో ఇదే కాలంతో పోలిస్తే డెల్ తన పర్సనల్ కంప్యూటర్ షిప్మెంట్లలో 37 శాతంతో అతిపెద్ద క్షీణతను నమోదు చేసింది. డెల్ ఆదాయం దాదాపు 55 శాతం పీసీల నుంచే వస్తుంది. -
వేలాది మంది ఉద్యోగుల తొలగింపు, ‘యాపిల్ సంస్థను అమ్మేయండి’!
స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు తర్వాత ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల్ని భారీ ఎత్తున తొలగించారు. ప్రపంచ వ్యాప్తంగా ట్విటర్లో 7500 మంది పని చేస్తుండగా..అందులో సగం మందికి పైగా తొలగిస్తున్నట్లు మెయిల్స్ పంపారు. ఇలా వేలాది మంది ఉద్యోగుల్ని ఒకేసారి తొలగించడం కొత్తేమి కాదని, సంస్థ సంక్షోభ సమయంలో యాపిల్ కో- ఫౌండర్ స్టీవ్ జాబ్ సైతం సిబ్బందికి ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది. ఎలన్ మస్క్ - ట్విటర్ మధ్య కొనుగోలు ఒప్పొందం పూర్తయిన వెంటనే శాన్ ఫ్రాన్సిస్కోలోని ట్విటర్ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. వెళ్లే సమయంలో తన చేతులో ఓ సింక్ పట్టుకొని కనిపించారు. ట్విటర్ హెడ్క్వార్టర్స్లోకి ఎంటర్ అవుతున్నానని, ఇక అది సింక్ కావాల్సిందే అని మస్క్ తన వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఆ తర్వాత రెండ్రోజుల్లో వరల్డ్ వైడ్‌గా ట్విటర్లో పనిచేస్తున్న ఉద్యోగుల తొలగింపులో భాగంగా..తొలత మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్, లీగల్ ఎగ్జిక్యూటీవ్ విజయ గద్దెలపై వేటు వేశారు. సగానికి పైగా ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపారు. యాపిల్ ఉద్యోగులకు పింక్ స్లిప్ ఇలా దిగ్గజ సంస్థలు ఉద్యోగుల్ని ఫైర్ చేయడం తొలిసారి కాదని, యాపిల్ సైతం అర్ధాంతరంగా ఉద్యోగులకు పింక్ స్లిప్ ఇచ్చిన 1990 నాటి చరిత్రని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. అమెరికాకు చెందిన వెబ్ సాఫ్ట్వేర్ కంపెనీ ‘రూబీ ఆన్ రైల్స్’ క్రియేటర్,37 సిగ్నల్స్ కో- ఫౌండర్,సీటీవో డేవిడ్ హీనెమీయర్ హాన్సన్ నివేదిక నాడు యాపిల్ తన ఉద్యోగుల్ని తొలగించిన అంశాన్ని ప్రస్తావించింది. యాపిల్‌ను అమ్మేయండి 1997లో యాపిల్ చిక్కుల్లో పడింది. కంపెనీ స్టాక్ 12 సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. దీంతో స్టాక్ మార్కెట్లో కంపెనీ విలువ పడిపోవడం ప్రారంభమైంది. ఆ సమయంలో కంప్యూటర్ మ్యానిఫ్యాక్చరింగ్ విభాగంలో యాపిల్‌కు కాంపిటీటరైన ‘డెల్’ విమర్శలు చేసింది. డెల్ అధినేత మైఖేల్ డెల్ యాపిల్ సంస్థను అమ్మేసి వాటాదారులకు డబ్బును తిరిగి ఇవ్వాలని పిలునిచ్చారు. ఆ పిలుపే యాపిల్ సంస్థలో ప్రకంపనలు రేపింది. అప్పుడే యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ జూలై 1997లో సంస్థలోకి తిరిగి వచ్చారు. ఉద్యోగులపై వేటు ఆర్ధిక సంక్షోభం నుంచి గట్టెక్కించేలా స్టీవ్ జాబ్ వచ్చీ రాగానే యాపిల్ సీఈవో గిల్ అమేలియో అడ్వైజర్‌గా జాయిన్ అయ్యారు. మైక్రోసాఫ్ట్‌తో జత కలిసి నిక్స్ ది న్యూటన్ ప్రాజెక్ట్‌పై వర్క్ చేయడం ప్రారంభించారు.ఆ మరుసటి నెలలో (ఆగస్ట్) యాపిల్ సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ ప్రాజెక్ట్‌లను భారీగా నిలిపివేసింది. అప్పటికి, యాపిల్ నిర్వహణ వ్యయాలను ప్రతి ఏడాది 500 మిలియన్ల మేర తగ్గించుకోవాలని భావించింది.అందుకే ఊహించని విధంగా స్టీవ్ జాబ్స్ 4,100 యాపిల్ ఉద్యోగుల్ని తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వ్యత్యాసం అదే అయితే నాటి యాపిల్ పరిస్థితుల్ని గుర్తు చేసుకుంటున్న నెటిజన్లు స్టీవ్ జాబ్స్‌కు..మస్క్‌కు అసలు పోలికే లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తన ఆలోచనలతో ప్రపంచాన్ని మార్చగలనని ఆలోచించేంత పిచ్చి ఉన్న మస్క్‌ను ఈ తరం ‘స్టీవ్ జాబ్స్’గా అభివర్ణిస్తుంటారు నెటిజన్లు. కానీ ఇప్పుడు వాళ్లే మస్క్ డబ్బు కోసం ఉద్యోగుల్ని తొలగించారని, స్టీవ్ జాబ్స్ సంస్థ కోసం ఉద్యోగుల్ని తొలగించాల్సి వచ్చిందంటూ చర్చించుకుంటున్నారు. చదవండి👉 ‘ట్విటర్లో నా ఉద్యోగం ఊడింది’, 25 ఏళ్ల యశ్ అగర్వాల్ ట్వీట్ వైరల్ -
హాట్ కేకుల్లా డెస్క్ టాప్ సేల్స్!! భారత్‌లో కింగ్ మేకర్ ఎవరంటే!
కోవిడ్ కారణంగా నిర్వహిస్తున్న ఆన్లైన్ క్లాసులు, వర్క్ ఫ్రమ్‌హోమ్ తో దేశంలో పర్సనల్ కంప్యూటర్లు (పీసీ-డెస్క్‌టాప్),ల్యాప్‌ట్యాప్‌ల వినియోగం బాగా పెరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన క్యూ4 ఫలితాల్లో దేశీయంగా పర్సనల్ కంప్యూటర్లు 14.8 మిలియన్ యూనిట్ల షిప్ మెంట్ జరిగినట్లు ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) తెలిపింది. 1.3 మిలియన్ యూనిట్ల షిప్‌మెంట్‌తో హెచ్‌పీ సంస్థ మార్కెట్లో కింగ్ మేకర్‌గా నిలిచింది. ►2020నుంచి హెచ్‌పీ భారత్‌లో 58.7శాతం వృద్ధితో 31.5శాతం మార్కెట్ వాటాను కలిగి ఉండగా..2021లో వాణిజ్య విభాగంలో హెచ్‌పీ మార్కెట్ వాటా 57.5శాతం నుంచి 60.1శాతానికి వృద్ధి చెందింది. వినియోగం విభాగాల్లో 30శాతం నుంచి 32.9శాతానికి పెరిగింది. ►క్యూ4లో వరుసగా రెండో త్రైమాసికంలో 1మిలియన్ యూనిట్లకు పైగా షిప్పింగ్ చేస్తూ 23.6శాతం షేర్‌తో డెల్ దేశీయ మార్కెట్లో రెండో స్థానంలో నిలించింది. ఐటీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్ నుండి పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో డెల్ 38శాతం వాటాతో ఎంటర్ప్రైజ్ విభాగంలో ముందుంది. ►మరో టెక్ సంస్థ లెనోవో పీసీ సెగ్మెంట్లో 22.8శాతం వృద్ధిని సాధించింది. 24.7శాతం వాటాతో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎస్ఎంఈ) విభాగం నుండి డిమాండ్ పెరగడంతో లెనోవో..,హెచ్‌పీ కంటే మందంజతో రెండవ స్థానంలో ఉంది. ►ఏసర్ 8.2శాతం, ఆసుస్ 5.9శాతం మార్కెట్ వాటాతో నాలుగు, ఐదవ స్థానాల్ని సంపాదించుకున్నాయి. డెస్క్‌టాప్ విభాగంగాలో ఏసర్ అతిపెద్ద లబ్ధిదారుగా ఉంది. ఇది 25.8శాతం మార్కెట్ వాటా ఉంది. ►ఆసుస్ సంవత్సరానికి 36.1శాతం వృద్ధి చెందింది. ఈ సందర్భంగా ఐడీసీ ఇండియా సీనియర్ మార్కెట్ అనలిస్ట్ (పీసీ డివైజెస్) భరత్ షెనాయ్ మాట్లాడుతూ వరుసగా రెండో సంవత్సరం సైతం విద్యార్ధులకు ఆన్లైన్ క్లాసుల్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో స్మార్ట్ఫోన్లు/టాబ్లెట్లను ఉపయోగిస్తున్నారు. వారిలో కొంతమంది విద్యార్ధులు మాత్రం పెద్దస్క్రీన్, వాడుకలో సౌలభ్యం వంటి ఇతర ప్రయోజనాల కారణంగా పర్సనల్ కంప్యూటర్లను వినియోగిస్తున్నట్లు చెప్పారు. -
చైనాకు కోలుకోని దెబ్బ, శరవేగంగా కేంద్రం కీలక నిర్ణయాలు!!
దేశంలో సెమీకండక్టర్ల తయారీలో కేంద్రం వడివడి అడుగులు వేస్తుంది. చైనా కోలుకోలేని విధంగా షాకిస్తూ కేంద్రం మరో రెండేళ్ల తర్వాత దేశంలో చిప్‌లు తయారయ్యే దిశగా ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా దేశీయ టెక్ కంపెనీలు వేలకోట్లు పెట్టుబడులు పెట్టేలా కేంద్రం ప్రోత్సహిస్తుంది. కేంద్రం దేశీయంగా సెమీకండెక్టర్లు, డిస్ప్లే తయారీకి రూ.76వేల కోట్ల విలువైన ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్(పీఎల్ఐ) పథకానికి ప్రధాని మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకంలో భాగంగా సెమీకండక్టర్ల తయారీ కోసం దేశీయ టెక్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు క్యూకడుతున్నాయి. మొబైల్ హ్యాండ్సెట్స్ మొదలుకుని ఆటోమొబైల్స్ దాకా అనేక ఉత్పత్తుల్లో సెమీ కండక్టర్లు(చిప్) కీలకంగా ఉంటున్నాయి. టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఇయర్‌బడ్స్, వాషింగ్ మెషీన్ల వంటి అనేక ఉత్పత్తుల్లో వీటిని వినియోగిస్తున్నారు. ఎక్కువ శాతం ఈ చిప్‌లు విదేశీ కంపెనీలు తయారు చేస్తుంటే..వాటిని కొనుగోలు చేస్తున్నాం. అయితే ఇకపై అలాంటి సమస్య లేకుండా కేంద్రం పీల్ఐ స్కీం అందుబాటులోకి తెచ్చింది. ఈ సందర్భంగా కేంద్రం ప్రపంచ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీలో 10% వాటా లక్ష్యంగా పెట్టుకుంది.సెమీకండక్టర్లలో రూ.90వేల కోట్ల పెట్టుబడులు పెట్టాలని భావిస్తోంది. చిప్ కొరత సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం చిప్ ఉత్పత్తి తయారీ సంస్థలతో మాట్లాడుతోందని ఐటీ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సౌరభ్ గౌర్ తెలిపారు. ఇక దేశంలో సెమీకండక్టర్ ఉత్పత్తి విషయానికొస్తే మరో రెండేళ్ల తర్వాత సాధ్యమవుతుంది" అని గౌర్ చెప్పారు. అంతేకాదు ఐటీ హార్డ్‌వేర్ పీఎల్ఐ స్కీమ్‌లో హెచ్‌పీ, డెల్, యాక్సర్ వంటి టెక్ సంస్థలు వేల పెట్టుబడులు పెట్టనున్నాయని గౌర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. చైనాకు గట్టి ఎదురుదెబ్బ! చిప్స్ కొరత సమస్య భారతదేశంలోని ఆటో, స్మార్ట్ ఫోన్, వైట్ గూడ్స్ పరిశ్రమలను కూడా పెద్ద ఎత్తున ప్రభావితం చేసింది. సెమీకండక్టర్ తయారీదారులను ఆకర్షించడానికి అమెరికా వంటి దేశాలు భారీ సబ్సిడీలను నిలిపివేయడంతో భారతదేశం వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. భారత్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చీప్ తయారీలో అగ్రస్థానంలో ఉన్న చైనాకు గట్టి ఎదురుదెబ్బ తగలనున్నట్లు నిపుణులు అంటున్నారు. కొరియన్ దిగ్గజం శామ్ సంగ్ ఇటీవల అమెరికాలోని టెక్సాస్ లో 17 బిలియన్ డాలర్ల చిప్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. చదవండి: మీరు ఈ టెక్నాలజీలో ఎక్స్‌పర్టా? అయితే మీకు జాబులే జాబులు!! -
భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన ల్యాప్టాప్స్ ఏవంటే..!
కరోనా రాకతో స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ కంపెనీలకు కాసుల వర్షం కురిసింది. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్, విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులతో పలు ల్యాప్‌ట్యాప్ కంపెనీలు గణనీయమైన అమ్మకాలను చూశాయి. దేశవ్యాప్తంగా జూలై నుంచి సెప్టెంబర్(క్యూ 3) త్రైమాసికంలో పర్సనల్ కంప్యూటర్ షిప్మెంట్లు బలమైన వృద్ధిని సాధించాయి. మూడు నెలల్లో సుమారు 4.5 మిలియన్ల యూనిట్లను పలు ల్యాప్‌టాప్ కంపెనీలు షిప్పింగ్ చేసినట్లు తెలుస్తోంది. గత ఏడాదితో పోలిస్తే 30 శాతం అధికంగా వృద్ధిని సాధించాయి. ►ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ నివేదిక ప్రకారం... ఈ ఏడాది క్యూ3లో భారత్‌లో ఎక్కువగా అమ్ముడైన ల్యాప్‌టాప్‌లో హెచ్‌పీ 28.5 శాతం వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్‌లో దాదాపు 1.3 మిలియన్ల యూనిట్ల కొనుగోలు జరిగినట్లు తెలుస్తోంది. హెచ్‌పీ సుమారు 31.4 శాతం వృద్ధిని నమోదు చేసింది. ►డెల్ టెక్నాలజీస్ రెండో స్థానంలో నిలిచింది. పర్సనల్ కంప్యూటర్ కేటగిరీలో క్యూ3లో 23.8 శాతం వాటాను డెల్ సొంతం చేసుకుంది.లెనోవోను అధిగమించి 45 శాతం వృద్దిను డెల్ సాధించింది. ►2021 క్యూ3లో లెనోవో మొత్తంగా 18.6 శాతం వాటాతో మూడవ స్థానాన్ని కొనసాగించింది. గత సంవత్సరంతో పోలిస్తే లెనోవో ల్యాప్టాప్స్ షిప్మెంట్లు 11.5 శాతం వృద్ధి చెందాయి. ►ఏసర్ 8.6 శాతం మార్కెట్ వాటాతో నాలుగో స్థానంలో నిలవగా....గత సంవత్సరం ఎగుమతులలో పోలిస్తే 16.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో రికార్డు స్థాయిలో దాదాపు 3.8 లక్షల యూనిట్లకు చేరుకుంది. ►మరో వైపు ఆసుస్ ఈ ఏడాది క్యూ3లో 8.5 శాతం మార్కెట్ వాటాతో ఐదవ స్థానంలో ఉండగా... భారత్‌లో మొదటిసారిగా 3 లక్షల పర్సనల్ కంప్యూటర్లను షిప్పింగ్ చేసింది. ►యాపిల్ లాంట్ దిగ్గజ కంపెనీ కూడా ఈ ఏడాది క్యూ3లో సుమారు 12 శాతం మేర వాటాను దక్కించుకున్నాయి. ►సరఫరా, లాజిస్టికల్ సవాళ్లు పలు కంపెనీలకు వేధిస్తున్నప్పటికీ ఆయా కంపెనీలు ఈ త్రైమాసికంలో గణనీయంగానే వృద్ధిని సాధించాయి. పర్సనల్ కంప్యూటర్స్‌లో నోట్‌బుక్ ల్యాప్‌టాప్ సుమారు 80 శాతం మేర కొనుగోలు జరిగాయి. డెస్క్‌టాప్ కంప్యూటర్లు 16.5 శాతంగా నిలిచాయి. -
ల్యాప్‌టాప్ కొనే ముందు ఇవి గుర్తుంచుకోండి!
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా విద్యార్థులు స్కూల్, కాలేజీ వెళ్లలేని పరిస్థితి. ప్రస్తుతం క్లాస్ లు అన్నీ ఇంట్లో నుంచే ఆన్లైన్ ద్వారానే జరుగుతున్నాయి. ప్రస్తుతం డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్దులకు ల్యాప్‌టాప్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ మీరు కొత్తగా ల్యాప్‌టాప్ కొనుగోలు చేయాలని చూస్తుంటే, కొనే ముందు ఒకసారి ఈ విషయాలను గుర్తుంచుకోండి. బడ్జెట్ రూ.50,000 లోపు ఉండాలి కేవలం స్కూల్ లేదా కాలేజీ విద్యార్దుల కోసం విండోస్ ల్యాప్‌టాప్ తీసుకోవాలని అనుకుంటే దానిపై ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. హెచ్ పీ, డెల్, ఏసర్, ఆసుస్ వంటి ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీలు రూ.30,000-రూ.50,000 ధరలో బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ లు తీసుకొస్తున్నాయి. ఫుల్హెచ్డీ డిస్ప్లే సరిపోతుంది ల్యాప్‌టాప్ అధిక రిజల్యూషన్ డిస్ ప్లే ప్యానెల్ వల్ల భారీగా ధర పెరుగుతుంది కనుక అలాంటి డిస్ ప్లే గల ల్యాప్‌టాప్ అవసరం లేదు. ఫుల్ హెచ్ డీ(1920 8 1080 పీక్సెల్స్) డిస్ ప్లే గల ల్యాప్‌టాప్ తీసుకున్న సరిపోతుంది. ఇంకా తక్కువ ధరకు ల్యాప్‌టాప్ తీసుకోవాలి అనుకుంటే 1366 * 768 పీక్సెల్స్ ల్యాపీ తీసుకోవచ్చు. ప్రాసెసర్ ముఖ్యమే ఇంటెల్ కోర్ ఐ3 వంటి ల్యాప్‌టాప్ లు ఇంకా మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికీ మరికొన్ని సంవత్సరాల పాటు మీరు వాడుతారు కాబట్టి కోర్ ఐ5 ప్రాసెసర్ గల ల్యాప్‌టాప్ తీసుకుంటే మంచిది. ర్యామ్ ఎంత అవసరం మీ ల్యాప్‌టాప్ లో కనీసం 8జీబీ ర్యామ్ ఉండేలా చూసుకోండి. ప్రస్తుతం, భవిష్యత్ అవసరాలకు మీకు ఇది మంచిగా సరిపోతుంది. 4 జీబీ ర్యామ్ మాత్రం తీసుకోకండి. హార్డ్ డ్రైవ్ ఎంత ఉండాలి మీ అవసరాల కోసం 512జీబీ హెచ్ డీడీ లేదా 256జీబీ ఎస్ఎస్ డీ గల ల్యాప్‌టాప్ సరిపోతుంది. మీ దగ్గర కనుక కొంచెం ఎక్కువ డబ్బులు ఉంటే 512జీబీ ఎస్ఎస్ డీ గల ల్యాప్‌టాప్ తీసుకోండి. మైక్రోసాఫ్ట్ విండోస్ 10 ఓఎస్ మీ ల్యాప్‌టాప్ లో ఒరిజినల్ విండోస్ 10 ఓఎస్ ఉండేలా చూసుకోండి. ఇప్పుడు చాలా కంపెనీ ఉచితంగా విండోస్ 10 ఓఎస్ ను అందిస్తున్నాయి. ఆపరేటింగ్ సిస్టమ్ ని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయడం మంచిది. దీని వల్ల మీరు సైబర్ బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుంది. అలాగే, మైక్రోసాఫ్ట్ ఆఫీసు 365 ఉంటే మంచిది. చదవండి: సైబర్ పవర్లో ఇజ్రాయిల్ కంటే వెనుకనే భారత్! -
అత్యంత విశ్వసనీయ బ్రాండ్ ఏదో తెలుసా?
సాక్షి:ముంబై: అమెరికాకు చెందిన కంప్యూటర్స్ బ్రాండ్ ‘డెల్’ భారత్‌లో వరుసగా రెండో ఏడాదీ అత్యంత విశ్వసనీయ బ్రాండ్‌గా నిల్చింది. అటు చైనాకు చెందిన షావోమి మొబైల్స్ రెండో స్థానంలో, కొరియన్ దిగ్గజం శాంసంగ్ మొబైల్స్ మూడో స్థానంలో నిల్చాయి. టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ నాలుగో స్థానానికి పరిమితం కాగా, ఎల్జీ టెలివిజన్ అయిదో ర్యాంక్ దక్కించుకుంది. విశ్వసనీయ బ్రాండ్స్‌పై వినియోగదారులతో నిర్వహించిన సర్వే ఆధారంగా టీఆర్ఏ రీసెర్చ్ సంస్థ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మొత్తంమీద ఎనిమిదో స్థానంలో ఉన్నప్పటికీ ఆటో మొబైల్ విభాగంలో మారుతి సుజుకీ అగ్రస్థానంలో నిల్చింది. 16 నగరాల్లో 1711మంది వినియోగదారులు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. 323 కేటగిరీల్లో మొత్తం 8 వేల బ్రాండ్స్‌ను పరిగణనలోకి తీసుకున్నారు. బ్రాండ్ల మీద నమ్మకంపై కరోనా వైరస్ ప్రభావం కూడా పడిందని, గతంలో కేటగిరీ లీడర్లుగా ఉన్న పలు బ్రాండ్లు తమ స్థానాలను కోల్పోయాయని టీఆర్ఏ రీసెర్చ్ సంస్థ సీఈవో ఎన్ చంద్రమౌళి తెలిపారు. -
ఉద్యోగులకు ఐటీ దిగ్గజం ‘డెల్’ షాక్..
బెంగుళూరు: కరోనా వైరస్ ఉదృతి నేపథ్యంలో దిగ్గజ ఐటీ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఈ బాటలోనే ఐటీ దిగ్గజం డెల్ కంపెనీ సైతం పయనిస్తున్నట్లు తెలుస్తోంది. సోమవారం డెల్ సంస్థలో జరిగిన త్రైమాసిక సమావేశంలో సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. అయితే డెల్ ఉన్నతాధికారి జెఫ్ క్లార్క్ స్పందిస్తూ ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని నిర్ణయం తీసుకుంటే ఏ ఒక్క విభాగానికో పరిమితం కాదని తెలిపారు. కాగా ప్రస్తుత పరిస్థితుల్లో ఖర్చులు తగ్గించుకునేందుకు అన్ని సంస్థలు ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు. అయితే సంస్థాగతంగా కంపెనీ కార్యకలాపాల విశ్లేషణ ఉంటుందని, కొంతమంది సిబ్బందికి ఉద్వాసన పలకొచ్చని తెలిపారు. మరో ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ ఇటీవలే భారత్‌లో వేలాది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే. ప్రస్తుతం డెల్ సంస్థలో లక్ష65వేల మంది ఉద్యోగులు సేవలంధిస్తున్నారు. అయితే నైపుణ్యం ఉన్న ఉద్యోగులకు ఎలాంటి ఢోకా ఉండదని, ఉద్యోగులకు నైపుణ్యమున్న విభాగాలను కేటాయిస్తామని భారత్‌కు చెందిన డెల్ అధికారి తెలిపారు. కాగా డెల్ సంస్థకు బెంగుళూరు, హైదరాబాద్, న్యూఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై, పూణే, చెన్నై, కోల్‌కతా తదితర మహానగరాలలో కార్యాలయాలు ఉన్నాయి. ఇటీవల డెల్ ఇండియా ఎండీ అలోక్ ఓరీ స్పందిస్తూ డిజిటల్ నైపుణ్యాలకు, ఆరోగ్య రంగం, విద్య, టెలికం రంగంలో అత్యాధునిక సాంకితకతను ఉపయోగిస్తామని పేర్కొన్న విషయం తెలిసిందే. (చదవండి: డెల్ సూపర్ ల్యాప్‌టాప్ : అన్నీ ఎక్స్‌ప్రెస్ ఫీచర్లే) -
ఉప్పు.. పప్పు.. ల్యాప్‌టాప్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 పుణ్యమాని ప్రపంచవ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోం ప్రాచుర్యం పెరుగుతోంది. లాక్డౌన్ లేకున్నా... నిబంధనలు సడలిస్తున్నా కూడా కంపెనీలు ఎక్కువ మంది ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయించడానికే ప్రాధాన్యమిస్తున్నాయి. దీంతో డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌లు కూడా మెల్లగా నిత్యావసరాల జాబితాలోకి చేరిపోతున్నాయి. ఫలితంగా... నిబంధనలు సడలించిన వెంటనే ఈ షాపులకు కస్టమర్ల తాకిడి పెరిగింది. ఐటీ సహా పలు రంగాల్లోని ఉద్యోగులకు ఇళ్లలో కూడా డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్ తప్పనిసరి అవుతున్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. రానున్న రెండేళ్లూ డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌ల అమ్మకాలు బాగా పెరుగుతాయనేది వారి అంచనా. 15–40 శాతం దాకా డిస్కౌంట్లు నిజానికి లాక్‌డౌన్‌కు ముందు ఉత్పత్తులపై ఎలాంటి డిస్కౌంట్లూ లేవు. ఇపుడు మాత్రం పలు కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకోవటానికి గిఫ్ట్ కార్డులు, డిస్కౌంట్లు వంటివి ఇస్తున్నాయి. హెచ్‌పీ, డెల్, లెనోవో, ఏసర్, ఆసస్ వంటి కంపెనీలు వ్యక్తిగత కొనుగోలుదార్లకు 15 శాతం దాకా తగ్గింపు ఆఫర్ ఇస్తున్నాయి. అలాగే స్క్రాచ్‌కార్డ్‌తో మొబైల్, ట్యాబ్లెట్ వంటి బహుమతులను, రూ.50,000 వరకు క్యాష్‌బ్యాక్‌ను, ఎంపిక చేసిన మోడళ్లపై రూ.8,000 విలువ చేసే యాక్సెసరీస్‌ను కొన్ని సంస్థలు అందిస్తున్నాయి. 25 పైన యూనిట్లు కొనుగోలు చేసే ఇన్స్టిట్యూషనల్ కస్టమర్లకయితే చాలా కంపెనీలు తమ డెస్క్‌టాప్‌లు, ల్యాప్‌టాప్‌లపై 40 శాతం దాకా... యాక్సెసరీస్‌పై 25 శాతం దాకా డిస్కౌంట్ ఇస్తున్నాయి. మారిన బ్యాంకుల వ్యూహం.. వ్యక్తిగత కొనుగోలుదార్ల కోసం గతంలో బ్యాంకులు, రుణ సంస్థలు స్పెషల్ స్కీములు ఆఫర్ చేసేవి. ఆరు నెలల్లో గనుక తిరిగి తీర్చేసేలా ఉంటే ఎలాంటి వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేసేవి కాదు. డౌన్ పేమెంట్ కూడా ఉండేది కాదు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని, 6 శాతం వడ్డీ వసూలు చేస్తున్నామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారి ఒకరు చెప్పారు. ప్రైవేటు బ్యాంకులైతే ప్రాసెసింగ్ ఫీజు రూ. 500తో పాటు డౌన్ పేమెంట్ 35% ఉండాలన్న నిబంధన విధిస్తున్నాయి. దీంతో పూర్తి నగదు చెల్లించి ఉపకరణాన్ని కొనేందుకే ఎక్కువ మంది కస్టమర్లు మొగ్గు చూపుతున్నారు. అమ్మకాలు డబుల్... లాక్‌డౌన్‌కు ముందుతో పోలిస్తే నిబంధనలు సడలించాక అమ్మకాలు రెట్టింపయినట్లు దేశంలోని టాప్ సెల్లర్స్‌లో ఒకరైన ఐటీ మాల్ ఎండీ మొహమ్మద్ అహ్మద్ చెప్పారు. ‘‘ఇన్స్టిట్యూషనల్ సేల్స్ కూడా గణనీయంగా పెరిగాయి. విద్యా సంస్థలు ఆన్లైన్ క్లాసులు మొదలుపెడితే డిమాండ్ అనూహ్యంగా ఉంటుంది. మొత్తం విక్రయాల్లో ల్యాప్‌టాప్‌లు 85%, డెస్క్‌టాప్‌లు 15% వరకు ఉంటున్నాయి. వీటిలో కూడా రూ.35–50 వేల శ్రేణి ల్యాప్‌టాప్‌లు, రూ.25–50 వేల శ్రేణి డెస్క్‌టాప్‌ల సేల్స్ ఎక్కువ’’ అని ఆయన చెప్పారు. తయారీ, సరఫరా సమస్యల కారణంగా ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌ల ధర కంపెనీని బట్టి 5–12% పెరిగినట్లు తెలియజేశారు. ఇక హార్డ్ డిస్క్, ర్యామ్, అడాప్టర్ల వంటి యాక్సెసరీస్ ధరలు రెట్టింపయ్యాయి. ‘‘అయినా కస్టమర్లు వెనుకాడడం లేదు. సర్వీస్ రిక్వెస్టులూ పెరిగాయి’’ అని చెప్పారు. -
ఇద్దరు ఐటీ ఉద్యోగులకు కరోనా
న్యూఢిల్లీ/సాక్షి, బెంగళూరు: భారత్‌లో కరోనా వైరస్ భయాందోళనలు సృష్టిస్తోంది. ఇద్దరు ఐటీ ఉద్యోగులకు కరోనా సోకడం కలకలం రేపుతోంది. డెల్, మైండ్ ట్రీ ఐటీ కంపెనీలకు చెందిన ఇద్దరు ఉద్యోగులకు కరోనా సోకినట్టు బుధవారం ఆ కంపెనీలు వెల్లడించాయి. అమెరికా టెక్సాస్ నుంచి వచ్చిన ఒకరికి కరోనా వైరస్ సోకింది. మైండ్ ట్రీ కంపెనీకి చెందిన ఉద్యోగి ఆఫీసు పని మీద ఇతర దేశానికి వెళ్లి వచ్చారు. ఈ ఉద్యోగులిద్దరూ భారత్‌కు వచ్చాక వారు కలిసిన సంబంధీకులను నిర్బంధంలో ఉంచి వైద్య పరీక్షలు చేస్తున్నారు. అది కరోనా మరణం కాదు: కర్ణాటక మంత్రి మన దేశంలో కరోనా వైరస్ సోకినట్టుగా అనుమానిస్తున్న ఒక వృద్ధుడు మరణించారు. ఇటీవల సౌదీ యాత్రకి వెళ్లొచ్చిన 76 ఏళ్ల కర్ణాటక వాసి మహమ్మద్ హుస్సేన్ సిద్ధిఖీ జ్వరం, దగ్గు, జలుబు ఉండటంతో ఐదోతేదీన కలబురిగి జిల్లా మెడికల్ కాలేజీకి, తర్వాత 9న హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. వైరస్ లక్షణాలు తగ్గకపోవడంతో అంబులెన్స్‌లో కలబురిగికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించాడు. అతనికి కోవిడ్ సోకిందన్న అనుమానంతో గతంలోనే రక్త నమూనాలను పరీక్షల నిమిత్తం బెంగుళూరు ల్యాబ్‌కి పంపారు. హుస్సేన్‌కి కోవిడ్ సోకి ఉంటుందనే అనుమానాలున్నాయని కలబురిగి జిల్లా ఆరోగ్య శాఖ వెల్లడించింది. సిద్ధిఖీ వృద్ధాప్యంతోనే తుదిశ్వాస విడిచారని, వైరస్ సోకిందని ఆందోళన చెందవద్దని మంత్రి చెప్పారు. దౌత్య, అధికారిక, ఐరాస, ఉద్యోగ, ప్రాజెక్టు వీసాలు తప్ప మిగిలిన వీసాలన్నీ ఏప్రిల్ 15 వరకూ రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. -
డెల్ కొత్త నోట్‌బుక్.. రేటెంతో తెలుసా?
డెల్ కంపెనీ ఓ కొత్త నోట్‌బుక్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఇన్సిరాన్ 5000 సిరీస్‌లో తాజా నోట్‌బుక్ ఇన్సిరాన్ 5567ను ఆవిష్కరిస్తున్నట్టు డెల్ వెల్లడించింది. వ్యక్తిగత వినియోగదారులు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఈ నోట్‌బుక్‌ను తీసుకొచ్చినట్టు తెలిపింది. 23.3ఎంఎం మందం, ప్రకాశవంతంగా ఈజీ-ఓపెన్ డిజైన్‌లో ఉండే ఈ నోట్‌బుక్ ప్రారంభ ధర రూ.39,590గా కంపెనీ నిర్ణయించింది. వైట్, మిడ్నైట్ బ్లూ, ఫాగ్ గ్రే, బ్లాక్, బలి బ్లూ, టాంగో రెడ్ వంటి ఆకట్టుకునే రంగుల్లో కంపెనీ ఈ నోట్‌బుక్‌ను తీసుకొచ్చింది. మంచి విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను, వైబ్రంట్ గ్రాఫిక్స్‌ను ఇది అందించగలదని కంపెనీ చెబుతోంది. 15.6 అంగుళాల డిస్ప్లే, ఆప్షనల్ ఫుల్ హెచ్డీ ప్యానెల్, ఏడవ తరం ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్, 2టీబీ వరకు స్టోరేజ్ విస్తరణ, ఎంతో శక్తివంతమైన ఏఎమ్‌డీ రేడియాన్ ఆర్7 సిరీస్ గ్రాఫిక్స్ నోట్‌బుక్ ఇన్సిరాన్ 5567 ఫీచర్లు. ఈ నోట్‌బుక్ బ్యాటరీ 10 గంటల వరకు నిరంతరాయంగా పనిచేయనుంది. వినోదానికి, కంప్యూటింగ్‌కు ఇది ఎంతో ఆదర్శప్రాయంగా నిలుస్తుందని కంపెనీ చెబుతోంది. -
డెల్ చేతికి ఈఎంసీ కార్పొరేషన్
న్యూయార్క్: ఐటీ రంగంలో అత్యంత భారీ డీల్‌కు తెరతీసింది టెక్నాలజీ దిగ్గజం డెల్. ఏకంగా 67 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 4,35,000 కోట్లు) వెచ్చించి ఈఎంసీ కార్పొరేషన్‌ను కొనుగోలు చేయనుంది. తద్వారా ప్రైవేట్ వ్యక్తి సారథ్యంలో అతి పెద్ద టెక్నాలజీ కంపెనీగా ఆవిర్భవించనుంది. ఒప్పందం ప్రకారం డెల్, దాని వ్యవస్థాపక చైర్మన్ మైఖేల్ ఎస్ డెల్, సిల్వర్ లేక్ కలిసి ఈఎంసీని కొనుగోలు చేస్తాయి. ఈఎంసీ డెరైక్టర్ల బోర్డు ఈ డీల్‌కు ఆమోదముద్ర వేసి, షేర్హోల్డర్లకు సిఫార్సు చేసింది. ఈఎంసీ షేర్హోల్డర్లకు షేరు ఒక్కింటికి 33.15 డాలర్లు విలువ లభిస్తుందని, డీల్ మొత్తం విలువ దాదాపు 67 బిలియన్ డాలర్లు ఉంటుందని డెల్ తెలిపింది. ఈఎంసీ కీలక అనుబంధ సంస్థ వీఎంవేర్ షేరు ధర ప్రాతిపదికన ఒప్పంద విలువను నిర్ధారించారు. ఇందుకు అక్టోబర్ 7న వీఎంవేర్ షేరు ధర 81.78 డాలర్లను పరిగణనలోకి తీసుకున్నారు. ఒప్పంద నిబంధనల ప్రకారం ఈఎంసీ షేర్హోల్డర్లకు 24.05 డాలర్ల మేర నగదు రూపంలోనూ, మిగతాది వీఎంవేర్‌లో ఈఎంసీ పెట్టుబడుల మేరకు స్టాక్స్ రూపంలో లభిస్తుందని డెల్ పేర్కొంది. దాదాపు 2 లక్షల కోట్ల డాలర్ల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మార్కెట్లో కీలక విభాగాల్లో దిగ్గజంగా ఎదిగేందుకు ఈ ఒప్పందం తోడ్పడగలదని డెల్ చైర్మన్ మైఖేల్ డెల్ తెలిపారు. డేటా సెంటర్, హైబ్రిడ్ క్లౌడ్, మొబైల్, సెక్యూరిటీ తదితర వ్యూహాత్మక విభాగాల్లో భారీ వృద్ధి సాధించగలమని ఈఎంసీ చైర్మన్ జో టుషి పేర్కొన్నారు. ఇటు కస్టమర్లకు, ఉద్యోగులకు, భాగస్వాములకు, షేర్హోల్డర్లకు ఈఎంసీ, డెల్ కలయిక ప్రయోజనం చేకూర్చగలదని జో తెలిపారు.