టెస్లా సీఈఓతో డెల్ చైర్మన్.. నెట్టింట్లో ఫోటో వైరల్ | Tesla CEO Elon Musk And Dell CEO Michael Dell Photo Goes Viral In X, Details Inside - Sakshi
Sakshi News home page

టెస్లా సీఈఓతో డెల్ చైర్మన్.. నెట్టింట్లో ఫోటో వైరల్

Feb 10 2024 6:11 PM | Updated on Feb 10 2024 6:41 PM

Elon Musk And Dell CEO Photo Viral In X - Sakshi

టెక్సాస్‌లోని టెస్లా గిగా ఫ్యాక్టరీని సీఈఓ ఇలాన్ మస్క్‌తో కలిసి డెల్ టెక్నాలజీస్ చైర్మన్ అండ్ సీఈఓ మైఖేల్ డెల్ సందర్శించారు. ఈ సందర్భంలో ఇటీవలే మార్కెట్లో లాంచ్ అయిన కొత్త టెస్లా సైబర్ ట్రక్ పక్కన ఇద్దరు వ్యాపారవేత్తలు చెట్టపట్టాలేసుకుని కనిపించారు. ఈ ఫోటోలు స్వయంగా డెల్ సీఈఓ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు.

ఫోటో షేర్ చేస్తూ.. టెస్లా గిగా ఫ్యాక్టరీ సందర్శించడం ఆనందంగా ఉందని, ఈ పర్యటనకు సహకరించిన మస్క్‌కు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. దీనికి మస్క్ రిప్లై ఇస్తూ.. మిమ్మల్ని చూటడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ పోస్టుకు పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో ఒకరు డెల్ ఎప్పుడు సైబర్ ట్రక్కుని పొందుతున్నారని ప్రశ్నించగా.. మరొకరు సైబర్ ట్రక్ బేస్డ్ ఏలియన్‌వేర్ కంప్యూటర్‌ను తయారు చేయాలని కామెంట్ చేశారు.

ఇదీ చదవండి: సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కారు తయారు చేసిన రైతు బిడ్డ, ముచ్చటపడ్డారు కానీ రిజెక్ట్‌!

టెస్లా సీఈఓతో డెల్ సీఈఓకు ఉన్న పరిచయం ఇప్పటిది కాదు. చాలా సంవత్సరాలుగా ఈ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. 2013లో డెల్ కంపెనీ నిర్వహించిన డెల్ వరల్డ్‌కు మస్క్ హాజరయ్యారు. ఆ తరువాత మస్క్ తన కంపెనీ 39వ వార్షికోత్సవం సందర్భంగా డెల్ సీఈఓను ఉద్దేశించి ట్వీట్ చేసారు. ఇలా వారికి చాలా సంవత్సరాల ముందు నుంచే అనుబంధం ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement