ప్రముఖ టెక్నాలజీ సంస్థ డెల్ ఉద్యోగులకు అల్టిమేట్టం జారీ చేసింది. ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగులు వారానికి మూడు రోజులు కార్యాలయాలకు రావాలని పిలుపు నిచ్చింది. లేని పక్షంలో మీ కెరియర్‌కు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించింది.
కరోనా మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలో డెల్ ఇతర టెక్ కంపెనీల తరహాలో ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ అవకాశం కల్పిచ్చింది. ఉద్యోగులు ఆఫీస్‌కు వచ్చే అవసరం లేకుండా 60 శాతం మంది సిబ్బందికి రిమోట్ వర్క్‌ను సౌకర్యాన్ని కల్పిచ్చింది. అయితే కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో కంపెనీ తన వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాలను పునఃసమీక్షించింది. మార్చి 2023లో డెల్ తన కార్యాలయాలకు ఒక గంట ప్రయాణానికి లోపల నివసించే ఉద్యోగులందరూ వారానికి కనీసం మూడు రోజులు హాజరు కావాలని తప్పనిసరి చేసింది. తాజాగా, ఆ నిబంధనను అందరికి అమలు చేసింది.
కెరీర్ ఫణంగా పెట్టి
కానీ వారిలో తక్కువ వేతనం పొందుకు ఉద్యోగులు రిమోట్ వర్క్‌కి మొగ్గు చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. కార్యాలయానికి కొన్ని గంటల దూరంలో నివసించే వారు కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుందని, లేదంటే కెరీర్‌ను ఫణంగా పెట్టి రిమోట్ వర్క్ చేస్తామంటూ డెల్‌తో కాంట్రాక్ట్ కుదర్చుకునే అవకాశం ఉందని వెలుగులోకి వచ్చిన నివేదికలు పేర్కొన్నాయి.
లేఆఫ్స్ ఉన్నప్పటికీ
డెల్ గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన వర్క్ ఫోర్స్‌లో సుమారు 6వేల మందిని లేఆఫ్స్ ప్రకటించింది. అయినప్పటికీ డెల్ స్టాక్ గణనీయమైన పెరుగుదలను చూసింది. గత 12 నెలల్లో దాని విలువను రెట్టింపు చేసి సుమారు 60 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment