లేఆఫ్‌ల దడ టెకీలను పీడిస్తూనే ఉంది. తొలగింపులు కొనసాగుతాయని ప్రముఖ టెక్నాలజీ కంపెనీ డెల్ తెలియజేసింది. ఉత్పత్తుల డిమాండ్ తగ్గడం, విక్రయాలు మందగించడంతో వ్యయాలను నియంత్రణకు కంపెనీ కష్టాలు పడుతోంది. ఇప్పటికే వేలాది మందికి లేఆఫ్‌లు ప్రకటించిన కంపెనీ ఇవి ఇంకా కొనసాగుతాయని వెల్లడించడం ఉద్యోగులను కలవరపెడుతోంది.
ఇప్పటికే గత నెలలో ప్రకటించిన లేఆఫ్‌లలో దాదాపు 12,500 మందికి ఉద్వాసన పలికింది డెల్. పర్సనల్ కంప్యూటర్లకు డిమాండ్ పుంజుకోకపోవడం, ఏఐ కోసం ఆప్టిమైజ్ చేసిన సర్వర్‌ల అమ్మకాలు లాభదాయకంగా లేవన్న ఆందోళనల నేపథ్యంలో ఖర్చుల నియంత్రణ కోసం ఉద్యోగుల తొలగింపులు ఇంకా కొనసాగుతాయని ప్రకటించింది.
ఇదీ చదవండి: ‘ఇన్ఫోసిస్ సంగతేంటో చూడండి’..
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. డెల్ కంపెనీ ఉద్యోగులను తొలగింపులను కొనసాగించడంతోపాటు నియామకాలను సైతం తగ్గించనుంది. ఉద్యోగుల పునర్‌వ్యవస్థీకరణ, ఇతర చర్యలు 2025 ఫిబ్రవరి వరకు కొనసాగనున్నాయి. ఈ ఏడాది జూన్‌లో కంపెనీ ప్రకటించిన లేఆఫ్‌లతో చాలా మంది ఉద్యోగులు ప్రభావితమయ్యారు. ఇందులో సేల్స్ ఉద్యోగులే ఎక్కువ మంది. ప్రభావితమైన ఉద్యోగులు 12,500 మందికి పైనే ఉంటారని అంచనా వేసినా దాన్ని కంపెనీ ధ్రువీకరించలేదు. తొలగించినవారికి సీవెరెన్స్ కింద 328 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉందని నివేదిక పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment