techies
-
‘రూ.కోటి జీతమిచ్చినా సాఫ్ట్వేర్ ఉద్యోగులంతే’
భారతీయ సాఫ్ట్వేర్ ఉద్యోగులపై తీవ్ర విమర్శలు చేశారు అమెరికాకు చెందిన ఓ కంపెనీ సీఈవో. భారత్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు రూ. 1 కోటి వరకు అధిక జీతాలు ఇస్తున్నా కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా లేరని విమర్శించారు. ఐఐటీ పూర్వ విద్యార్థి అయిన వరుణ్ ఉమ్మడి తన కంపెనీ భారతీయ కార్యాలయానికి నియామకం ఇబ్బందిగా మారిందని, చాలా మంది ఇంజనీర్లు కూడా వారానికి ఆరు రోజులు పని చేయడానికి కూడా ఇష్టపడటం లేదంటూ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు."మా భారతీయ కార్యాలయానికి ఇంజనీర్లను నియమించుకోవడంలో ఒక విచిత్ర పరిస్థితిని గమనించాను. రూ. 1 కోటి మూల వేతనం ఉన్నప్పటికీ, చాలా మంది కష్టపడి పనిచేయడానికి ఇష్టపడటం లేదు. 3 నుంచి 8 సంవత్సరాల అనుభవం ఉన్న ఇంజనీర్లు చాలా మంది వారానికి ఆరు రోజులు పని చేయడానికి ముందుకు రాలేదు" అంటూ వరుణ్ రాసుకొచ్చారు.వరుణ్ ‘ఎక్స్’ పోస్ట్‌కు లక్షలలో వ్యూస్ వచ్చాయి. భారతీయ సాఫ్ట్వేర్ ఉద్యోగులపై ఆయన చేసిన వ్యాఖ్యలపై యూజర్ల నుంచి పెద్ద ఎత్తున ప్రతిస్పందన వచ్చింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మాత్రమే కాదు.. ప్రస్తుతం అన్ని వృత్తులలోనివారూ మెరుగైన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోరుకుంటున్నారని చాలా మంది వినియోగదారులు కామెంట్స్ చేశారు.ఉద్యోగులను ఆదివారాలు కూడా పని చేయాలంటూ ఎల్అండ్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలతో వర్క్-లైఫ్ బ్యాలెన్స్ వివాదం మళ్లీ రాజుకుంది. ఈ నేపథ్యంలో వరుణ్ ఉమ్మడి చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశమయ్యాయి. ఉద్యోగులతో వారానికి ఆరు రోజులు ఎందుకు పని చేయిస్తున్నారంటూ కొంతమంది ఎక్స్ యూజర్లు వరుణ్‌ను ప్రశ్నించారు. -
టెక్కీ.. వెయిటెక్కీ
ఎక్కువ పనివేళలు టెకీలను ఊబకాయులుగా మారుస్తున్నాయా?! అనే సందేహానికి ‘అవును’ అనే సమాధానం సాఫ్ట్వేర్ రంగం నుంచి వస్తోంది. ఈ విషయంపైన ‘చైనీస్ ఇన్స్టాగ్రామ్ జియాహోంగ్షులో వా΄ోతున్న యువతుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంద’ని సౌత్ చైనా మార్నింగ్ ΄ోస్ట్ వెల్లడి చేసింది. టెకీ ఉద్యోగçస్తులు ఎదుర్కొంటున్న సమస్యలు అన్ని దేశాల్లోనూ ఒకేలా ఉంటున్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి నిపుణులు చెబుతున్న సూచన లు ΄ాటిద్దాం..చైనాలోని ఓయాంగ్ వెన్జింగ్ అనే 24 ఏళ్ల యువతి ఉద్యోగంలో ఒత్తిడి కారణంగా గత ఏడాది కాలంలో 20 కేజీల బరువు పెరిగిందని సౌత్ చైనా మార్నింగ్ ΄ోస్ట్ వెల్లడించింది. ‘నా శారీరక, మానసిక ఆరోగ్యానికి సాఫ్ట్వేర్ ఉద్యోగం ఒక విపత్తుగా మారింది. ఎక్కువ పని గంటలు, మారుతూ ఉండే షిప్ట్ వేళల కారణంగా ఆహారం తీసుకోవడంలో అపసవ్యత చోటు చేసుకునేది. దీంతో ఏడాది కాలంలో 60 కేజీల నుంచి 80 కేజీల బరువు పెరిగాను. ఇలా అయితే నా ఆరోగ్య పరిస్థితి ఏమవుతుందో అని జూన్‌లో ఉద్యోగం మానేశాను. అప్పటి నుంచి నా ఆరోగ్యంలో మెరుగైన మార్పులు వచ్చాయి’ అని ఇన్‌స్టాలో ΄ోస్ట్ చేసింది ఓయాంగ్. ఆమె ఇప్పుడు ఫ్రీలాన్స్ వెయిట్‌లాస్ ఇన్ఫ్లుయెన్సర్గా మారింది. తన ఆహారంలో కూరగాయలు, ధాన్యాలు, ్ర΄ోటీన్లను చేర్చుతూ 6 కిలోల బరువు తగ్గానని తెలిపింది. ఓయాంగ్ అనుభవం చెప్పడంతో ఆమెలాంటి వ్యక్తులు తమ పని కష్టాలను పంచుకోవడానికి ముందుకు వచ్చారు. చైనాలోనే కాదు ఏ దేశంలోనైనా సాఫ్ట్వేర్ ప్రపంచంలో పనిచేసే టెకీలందరికీ ఇది వర్తిస్తుంది. మానసికమైన అలసట ‘పని ఒత్తిడి కారణంగా డిజర్ట్‌లను అతిగా తినడం వల్ల నెల రోజుల్లోనే 3 కిలోల బరువు పెరిగాను’ అని తన అనుభవాన్ని ఇన్‌స్టా ద్వారా పంచుకుంది మరో టెక్ ఉద్యోగిని 33 ఏళ్ల షాంఘై.. అతిగా ఆకలిఎక్కువ గంటలు పనిచేయడం అనేది పని సంబంధిత ఒత్తిడికి ప్రధాన కారణాలలో ఒకటి. ఈ పరిస్థితి సందడిగా ఉండే నగరాల్లో ఆందోళనకరమైన ధోరణిగా మారుతోంది. వర్క్ షిప్ట్ వల్ల సరైన నిద్ర వేళలు ఉండవు. దీంతో కార్టిజోల్ హార్మోన్ పెరుగుతుంది. ఆరోగ్యానికి మేలు చేసే మెలటోనిన్ తగ్గి΄ోతుంది. లేట్‌నైట్స్ మేల్కొని ఉండటం వల్ల ఆకలి పెరగడంతో ఫుడ్ తెప్పించుకుని తింటారు. దీంతో కదలికలు ఉండవు. ఇక వర్క్‌ఫ్రమ్ హోమ్ వచ్చాక పడుకొని వర్క్ చేసే వారున్నారు. దీంతో వారి శరీరంలో ఏ ఆర్గాన్ అయితే బలహీనంగా ఉంటుందో దానిపైన త్వరగా ప్రభావం పడుతుంది. తినే వేళలు సరి చేసుకోవాలిచైనాలో పని సంస్కృతి ముఖ్యంగా టెక్ పరిశ్రమలో వారానికి ఆరు రోజుల ΄ాటు ఉదయం 9 నుండి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. న్యూట్రిషన్ విభాగానికి చెందిన డాక్టర్ జువో జియోక్సియా హెల్త్ టైమ్స్‌తో మాట్లాడుతూ ‘ఆలస్యంగా భోజనం చేయడం, అతిగా తినడం, నిద్రలేమి, ‘అధిక పని ఊబకాయానికి దారితీస్తుందని చె΄్పారు. ఈ సమస్యను అధిగమించాలంటే ఎక్కువ కూరగాయలు, తక్కువ మాంసాహారం తీసుకోవాలి. అంతేకాదు, తినే వేళలను సక్రమంగా ΄ాటించాలి. ఆరోగ్యంగా ఉండటానికి జీవనశైలిలో వ్యాయామాన్ని తప్పనిసరిగా చేర్చుకోవాలి’ అని సూచిస్తోంది. ఈ సమాచారం టెకీలందరికీ వర్తిస్తుంది.అరకేజీ ఫ్రూట్ –వెజ్ సలాడ్వయసులో ఉన్నప్పుడు పని, జీతం అన్నీ బాగానే అనిపిస్తాయి. అయితే, సరైన జీవన శైలి ΄ాటించక΄ోతే నలభై దాటిన దగ్గర నుంచి ప్రతి ఐదేళ్లకు ఆరోగ్యం దెబ్బతింటూ ఉంటుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో జుట్టు రాలే సమస్య ఎక్కువ చూస్తుంటాం. లుక్ కోసం అవసరం లేని కాస్మటిక్ ట్రీట్మెంట్లు చేయించుకుంటారు. లుక్ కాదు ఆరోగ్యమే ప్రధానమని గుర్తించాలి. పని ఒత్తిడిని అధిగమించడానికి మెడిటేషన్ ఔషధంలా పనిచేస్తుంది. ∙నిద్ర వేళలు సరిగ్గా చూసుకోవాలి. 6–8 గంటలు నిద్రకు కేటాయించుకోవాలి. ∙వ్యాయామం తప్పనిసరిగా ఉండాలి. ∙టైమ్‌కి ఆహారం తీసుకోవాలి. దీంతో΄ాటు ఫ్రూట్ సలాడ్, వెజ్ సలాడ్ రోజు వారీ ఆహారంలో చేర్చుకోవాలి. దీనివల్ల కొవ్వు పెరగదు. అతిగా ఆకలి అవడం ఉండదు. – డాక్టర్ జానకి, ΄ోషకాహార నిపుణులు -
లేఆఫ్ దడ.. కలవరపెడుతున్న డెల్ ప్రకటన
లేఆఫ్‌ల దడ టెకీలను పీడిస్తూనే ఉంది. తొలగింపులు కొనసాగుతాయని ప్రముఖ టెక్నాలజీ కంపెనీ డెల్ తెలియజేసింది. ఉత్పత్తుల డిమాండ్ తగ్గడం, విక్రయాలు మందగించడంతో వ్యయాలను నియంత్రణకు కంపెనీ కష్టాలు పడుతోంది. ఇప్పటికే వేలాది మందికి లేఆఫ్‌లు ప్రకటించిన కంపెనీ ఇవి ఇంకా కొనసాగుతాయని వెల్లడించడం ఉద్యోగులను కలవరపెడుతోంది.ఇప్పటికే గత నెలలో ప్రకటించిన లేఆఫ్‌లలో దాదాపు 12,500 మందికి ఉద్వాసన పలికింది డెల్. పర్సనల్ కంప్యూటర్లకు డిమాండ్ పుంజుకోకపోవడం, ఏఐ కోసం ఆప్టిమైజ్ చేసిన సర్వర్ల అమ్మకాలు లాభదాయకంగా లేవన్న ఆందోళనల నేపథ్యంలో ఖర్చుల నియంత్రణ కోసం ఉద్యోగుల తొలగింపులు ఇంకా కొనసాగుతాయని ప్రకటించింది.ఇదీ చదవండి: ‘ఇన్ఫోసిస్ సంగతేంటో చూడండి’..బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. డెల్ కంపెనీ ఉద్యోగులను తొలగింపులను కొనసాగించడంతోపాటు నియామకాలను సైతం తగ్గించనుంది. ఉద్యోగుల పునర్వ్యవస్థీకరణ, ఇతర చర్యలు 2025 ఫిబ్రవరి వరకు కొనసాగనున్నాయి. ఈ ఏడాది జూన్‌లో కంపెనీ ప్రకటించిన లేఆఫ్‌లతో చాలా మంది ఉద్యోగులు ప్రభావితమయ్యారు. ఇందులో సేల్స్ ఉద్యోగులే ఎక్కువ మంది. ప్రభావితమైన ఉద్యోగులు 12,500 మందికి పైనే ఉంటారని అంచనా వేసినా దాన్ని కంపెనీ ధ్రువీకరించలేదు. తొలగించినవారికి సీవెరెన్స్ కింద 328 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉందని నివేదిక పేర్కొంది. -
టెకీల పాలిట దారుణంగా ఆగస్ట్ నెల..
గడిచిన ఆగస్ట్ నెల టెకీల పాలిట దారుణంగా పరిణమించింది. ఈ ఒక్క నెలలోనే టెక్ రంగంలో ఏకంగా 27,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. 40 కంటే ఎక్కువ కంపెనీలు లే-ఆఫ్‌లను ప్రకటించాయి. ఈ తాజా రౌండ్ తొలగింపులను కలుపుకొంటే గడిచిన ఏడాదిగా 422 కంపెనీలలో లేఆఫ్‌లు 136,000 లకు పెరిగాయి.ఈ ఉద్యోగ కోతల్లో ఇంటెల్ అగ్రగామిగా ఉంది. ఇది 15,000 మంది ఉద్యోగులను తగ్గించనున్నట్లు ప్రకటించింది. ఇది దాని ఉద్యోగులలో 15%. సీపీయూ చిప్ టెక్నాలజీలో కంపెనీ అగ్రగామిగా ఉన్నప్పటికీ అధిక వ్యయాలు, తక్కువ మార్జిన్ల కారణంగా ఖర్చుల తగ్గింపు ప్రణాళికకు పూనుకుంది. 2020 నుంచి 2023 మధ్యకాలంలో కంపెనీ 10% ఎక్కువ మంది ఉద్యోగులను ఇంటెల్ నియమించుకుంది.ఇక టెలికమ్యూనికేషన్స్ పరికరాల తయారీ సంస్థ సిస్కో సిస్టమ్స్ తన వర్క్ ఫోర్స్‌లో దాదాపు 6,000 మంది లేదా 7 శాతం మంది ఉద్యోగులను తగ్గించుకోనున్నట్లు తెలిపింది. జాబితాలో మరొక పెద్ద పేరు ఐబీఎం. ఈ కంపెనీ చైనాలో దాని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాన్ని నిలిపివేయాలని నిర్ణయించుకుంది. ఇది వెయ్యి మందికి పైగా ఉద్యోగులను తొలగింపునకు దారితీసింది.మార్కెట్ పరిస్థితులు, మందగించిన ఆర్థిక కార్యకలాపాల కారణంగా జర్మన్ చిప్‌మేకర్ ఇన్ఫినియన్ కూడా 1,400 మంది ఉద్యోగులను తొలగించి, మరో 1,400 మందిని తక్కువ ఖర్చుతో కూడిన ప్రాంతాలకు బదిలీ చేయాలని ప్రణాళిక రచించింది. గోప్రో కంపెనీ తమ వర్క్‌ఫోర్స్‌లో 15% లేదా దాదాపు 140 మంది తగ్గించింది. ఇక యాపిల్ 100 మంది ఉద్యోగులను తొలగించింది.డెల్ టెక్నాలజీస్ కూడా భారీగానే తొలగింపులు చేపట్టనున్నట్లు వార్తల్లో నిలిచింది. బెంగళూరుకు చెందిన రేషామండి అనే అగ్రిటెక్ సంస్థ మొత్తం సిబ్బందిని తొలగించి మూతపడింది. వెబ్ బ్రౌజర్ కంపెనీ అయిన బ్రేవ్ 27 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.సోషల్ మీడియా సంస్థ షేర్‌చాట్ తన ఉద్యోగులలో 5% మందిని వదులుకుంటున్నట్లు ప్రకటించింది. -
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు తెలుగు టెకీలు దుర్మరణం
డల్లాస్: అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు తెలుగు టెకీలు మృతి చెందారు. డల్లాస్‌లో శనివారం(ఆగస్టు31) ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో నలుగురు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ప్రయాణిస్తున్న కారును ట్రక్కు బలంగా ఢీకొట్టింది. దీంతో వారంతా ప్రాణాలు కోల్పోయారు. -
టెకీలూ.. ఆఫీసులకు కుర్తా వేసుకురండి
టెకీలు, ఐటీ ఉద్యోగులు ఆఫీసులకు ఎలాంటి దస్తులు వేసుకుని వస్తారు..? చక్కగా సూటు బూటు వేసుకుని వస్తారు. కానీ కుర్తాలు వేసుకుని రావాలని చెబుతున్నారు ఓలా వ్యవస్థాపకుడు, సీఈవో భవిష్ అగర్వాల్.ఏఎన్ఐకి చెందిన స్మితా ప్రకాష్‌తో జరిగిన ఒక ఇంటర్వ్యూలో భవిష్ అగర్వాల్ మాట్లాడుతూ.. భారతీయులందరూ పాశ్చాత్య దుస్తులకు స్వస్తి పలికి కుర్తాలను ధరించాలని సూచించారు.“మనం కుర్తాలో మరింత సౌకర్యవంతంగా ఉండవచ్చు. ఇది ప్రత్యేకంగా భారతీయమైనది. నా దృష్టిలో, కుర్తా చాలా సొగసైన డ్రెస్. భారతీయులందరూ, ముఖ్యంగా యువ సాంకేతిక నిపుణులు కుర్తాలను ధరించాలని నేను అనుకుంటున్నాను” అని అగర్వాల్ అన్నారు.జూలై 8న షేర్ చేసిన ఈ పాడ్‌కాస్ట్ కొద్ది సమయంలోనే ట్రాక్‌ని పొందింది. చాలా మంది అగర్వాల్ భావాలతో ఏకీభవించడంతో కామెంట్ సెక్షన్ సానుకూల స్పందనలతో నిండిపోయింది. -
డబ్బు ఎలా ఖర్చు చేయాలి.. జర చెప్పండి ప్లీజ్: బెంగళూరు టెకీ జంట
పలు అవసరాలకు డబ్బులు సాయం చేయమని, ఆపదలో ఉన్నాం ఆదుకోమని అడగడం చాలా కామన్. కానీ డబ్బులు ఎక్కువగా ఉన్నాయి, ఎలా ఖర్చు చేయాలో చెప్పండి మహాప్రభో అని అడిగేవారిని ఎక్కడైనా చూశారా? సినిమాల్లో మాత్రమే కనిపించే ఇలాంటి రియల్ స్టోరీ గురించి తెలుసుకుందాం రండి! బెంగళూరు టెకీ జంట నెలకు రూ. 7 లక్షల ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. బెంగళూరులో ఇల్లు, ఖరీదైన కారు, సౌకర్యవంతమైన జీవితం. కానీ మిగిలిన డబ్బును పూర్తిగా ఎలా ఖర్చు చేయాలో తెలియడం లేదట. మిగులు ఆదాయాన్ని ఎక్కడ, ఎలా ఖర్చు చేయాలో తెలియని గందరగోళంలో ఉన్నామంటూ నెటిజనులను అభ్యర్థించడం వైరల్‌గా మారింది.భారతీయ నిపుణుల జీతాలు, ఆఫీస్ పరిస్థితులు, ఆర్థిక విషయాల గురించి చర్చించే ‘గ్రేప్‌వైన్’ అనే యాప్‌లో ఈ దంపతులు పోస్ట్ పెట్టగా ‘ఎక్స్’లోనూ చక్కర్లు కొడుతోంది. ‘గ్రేప్‌వైన్’ సహ వ్యవస్థాపకుడు, సీఈవో సౌమిల్ త్రిపాఠి ‘ఎక్స్’లో స్క్రీన్‌షాట్‌ను షేర్ చేయడంతో నెట్టింట ఇది హాట్‌టాపిక్‌గా నిలిచింది. 30 సంవత్సరాల వయస్సు గల భార్యాభర్తలు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. వార్షిక బోనస్‌తో పాటు నెలవారీ సంపాదన రూ. 7 లక్షలు. ఇందులో 2 లక్షల రూపాయలు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడతారు. ఇక నెల ఖర్చులు రూ. 1.5 లక్షలు పోను వారికి నెలకు రూ. 3లక్షలకు పైగానే మిగులుతోంది. ఈ దంపతులకు ఇంకా పిల్లలు కూడా లేరు. పైగా విలాసంగా జీవించాలనే, ఎక్కువగా ఖర్చు పెట్టాలనే కోరిక భార్యభర్తలిద్దరికీ లేదు. అందుకే మిగిలిన డబ్బును ఎలా, ఎక్కడ వినియోగించాలో అర్థం కావడంలేదు. అందుకే ఏమైనా సూచనలివ్వండి అంటూ పోస్ట్ పెట్టారు.దీంతో యూజర్లు కొంతమంది ఫన్నీగా, మరికొంతమంది సీరియస్‌గానే తెగ సలహాలిచ్చేస్తున్నారు. పబ్లిక్/ప్రైవేట్ కాస్ (లేదా రియల్ ఎస్టేట్) వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టమని, లగ్జరీ వెకేషన్‌కి వెళ్లమని కొందరు, పిల్లలకోసం ప్లాన్ చేసుకోమని ఇలా తోచినట్టు సలహాలిచ్చేశారు. దీంతోపాటు, జంతు సంక్షేమ స్వచ్ఛంద సంస్థలు లేదా అనాథాశ్రమాలకు విరాళం ఇవ్వాలని కోరారు. అంతేకాదు ''నాకు కొంత ఇవ్వండి, నాకు సరిపడా జీతం రావడం లేదు'' అని ఒకరు కమెంట్ చేశారు. మరి మీరేమంటారు.. కామెంట్ సెక్షన్లో తెలపండి. -
Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కంపెనీలలో లేఆఫ్‌ల పరంపర కొనసాగుతూనే ఉంది. ఆర్థిక అనిశ్చితి, ప్రాజెక్ట్‌లు తగ్గిపోవడం వంటి కారణాలతో ఖర్చులు తగ్గించుకునేందుకు అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. టెక్ కంపెనీల్లో లేఆఫ్‌లకు సంబంధించి షాకింగ్ రిపోర్ట్ ఒకటి వెల్లడైంది. ఒక్క ఏప్రిల్ నెలలోనే 21 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి టెక్ కంపెనీలు.layoffs.fyi ప్రచురించిన తాజా డేటా ప్రకారం.. టెక్నాలజీ రంగంలోని 50 కంపెనీల నుండి ఒక్క ఏప్రిల్ నెలలోనే 21,473 మంది ఉద్యోగులు ఉద్వాసనకు గురయ్యారు. ఈ ఏడాది లేఆఫ్‌ల ధోరణికి ఏప్రిల్ నెల తొలగింపులు అద్దం పడుతున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి కనీసం ఇప్పటి వరకూ 271 కంపెనీలు 78,572 మంది ఉద్యోగులను తొలగించాయి. జనవరిలో 122 కంపెనీలలో 34,107 ఉద్యోగాల కోతలు జరిగాయి. ఫిబ్రవరిలో 78 కంపెనీలు 15,589 మందిని తొలగించాయి. ఇక మార్చిలో 37 కంపెనీల్లో 7,403 మంది ఉద్యోగాలను కోల్పోయారు. మార్చి నుంచి ఏప్రిల్‌కు ఒక్క నెలలో ఉద్యోగుల తొలగింపులు మూడు రెట్లు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.ఏప్రిల్‌లో టెక్ తొలగింపులుయాపిల్ ఇటీవల 614 మంది ఉద్యోగులను తొలగించింది. ఇది మొదటి ప్రధాన రౌండ్ ఉద్యోగ కోత.పైథాన్, ఫ్లట్టర్, డార్ట్‌లో పనిచేస్తున్న వారితో సహా వివిధ టీమ్‌లలో గణనీయమైన సంఖ్యలో ఉద్యోగులను గూగుల్ తొలగించింది.అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో వందలాది ఉద్యోగాలను తగ్గించింది.ఇంటెల్ దాని ప్రధాన కార్యాలయంలోని దాదాపు 62 మంది ఉద్యోగులను లేఆఫ్ చేసింది. ఎడ్టెక్ కంపెనీ బైజూస్ సుమారు 500 మంది ఉద్యోగులను తొలగించింది.ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా అత్యధికంగా 14 వేల మందిని లేఆఫ్ చేసింది.ఓలా క్యాబ్స్ దాదాపు 200 ఉద్యోగాలను తొలగించింది. హెల్త్ టెక్ స్టార్టప్ హెల్తీఫైమ్ దాదాపు 150 మంది ఉద్యోగులను తొలగించింది. గృహోపకరణాలను తయారు చేసే వర్ల్‌పూల్ సుమారు 1,000 మందిని లేఆఫ్ చేసింది.టేక్-టూ ఇంటరాక్టివ్ కంపెనీ తమ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 5% మందిని తొలగించింది. నార్వేలోని టెలికాం కంపెనీ టెలినార్ 100 మంది ఉద్యోగులను తొలగించింది. -
ట్రాఫిక్ రూల్స్ పాటించలేదో.. నేరుగా మీ కంపెనీకే నోటీసులు
బెంగళూరు: రోడ్లపై ట్రాఫిక్ సిగ్నళ్లు, స్పీడ్ లిమిట్లను పట్టించుకోకుండా వాహనంపై ముందుకు దూసుకెళ్లే టెకీలకు కళ్లెం వేసేందుకు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు వినూత్న ప్రయోగం చేపట్టారు. దీని ప్రకారం..రహదారి నిబంధనలను బేఖాతరు చేసే టెకీలకు కాకుండా వారు పనిచేసే సంస్థలకు నేరుగా ట్రాఫిక్ పోలీసులు ఇకపై నోటీసులు అందజేస్తారు. అవుటర్ రింగ్ రోడ్, వైట్‌ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కారిడార్‌లో ఈ వారంలో ఇది ప్రయోగాత్మకంగా మొదలైంది. ట్రాఫిక్ ఉల్లంఘనల సంఖ్యలో భారీ తగ్గుదల నమోదైనట్లు గుర్తిస్తే ఈ పద్ధతినే మిగతా ప్రాంతాలకు సైతం క్రమేపీ విస్తరిస్తామని బెంగళూరు ట్రాఫిక్ ఉన్నతాధికారులు అంటున్నారు. రహదారి భద్రత, ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచడమే తమ లక్ష్యమంటున్నారు. ఈస్ట్ డివిజన్ పరిధిలోని ట్రాఫిక్ ఉల్లంఘనుల్లో ఇక్కడి టెక్నాలజీ సంస్థల్లో పనిచేసే వారే అత్యధికులు ఉండటంతో వారినే లక్ష్యంగా చేసుకుని ఈ కార్యక్రమం తీసుకువచ్చామన్నారు. -
గుడ్ న్యూస్ చెప్పిన టీసీఎస్: టెకీలకు భారీ ఊరట
TCS will hire 40,000 freshers ఐటీ దిగ్గజ సంస్థలు క్యాంపస్రిక్రూమెంట్లు దాదాపు లేనట్టే నని తేల్చి చెప్పిన నేపథ్యంలో దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ మాత్రం శుభవార్త అందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారీగా క్యాంపస్ రిక్రూట్మెంట్లను చేపట్టనుంది. దాదాపు 40 వేల మంది ఫ్రెషర్ల నియామకాలకు సిద్దమవుతున్నట్టు ప్రకటించింది. తద్వారా ఫ్రెషర్ల నియామకాల్లో మరో ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ సరసన టీసీఎస్ కూడా నిలిచింది. సాధారణంగా ప్రతీ ఏఏటా 35 నుంచి 40వేల మంది దాకా కొత్తవారిని తీసుకుంటుందనీ ఈ క్రమంలోనే 2024 ఆర్థిక సంవత్సరంలో కూడా 40 వేల ఉద్యోగులను నియమించుకోవాలని భావిస్తున్నట్టు టీసీఎస్ సీవోవో గణపతి సుబ్రమణియన్ తెలిపారు. అంతేకాదు ఇకపై ఎలాంటి కోతలు ఉండవని కూడా స్పష్టం చేశారు. డిమాండ్‌లో ఎలాంటి హెచ్చుతగ్గులనైనా ఎదుర్కొనేందుకు సర్వ సన్నద్ధంగా ఉందన్నారు. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను ఇటీవల ప్రకటించి టీసీఎస్ తాజాగా టెకీలకు ఈ తీపి కబురు చెప్పడం విశేషం. అక్టోబర్ 11న కంపెనీ ప్రకటించిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో నికర లాభం దాదాపు 9శాతం పెరిగి రూ.11,342 కోట్లకు చేరుకుంది. ఏకీకృత ఆదాయం రూ.59,692 కోట్లుగా ఉందని సీఈవో కె కృతివాసన్ తెలిపారు. అలాగే ఒక్కో షేరుకు రూ.9 మధ్యంతర డివిడెండ్ కూడా కంపెనీ ప్రకటించింది. కాగా దేశీయ రెండో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఫ్రెషర్ల నియమాకలపై చాలామందిని నిరాశపర్చిన సంగతి తెలిసిందే. -
కష్టాల్లో ఐటీ రంగం: టెకీ ఉద్యోగాలపై సంచలన నివేదిక
White collar tech jobs take backseat: వైట్ కాలర్ జాబ్అంటే ముందుగా గుర్తొచ్చేది టెక్ ఉద్యోగమే. అయితే టెక్ ఉద్యోగాలకు సంబంధించిన సంచలన నివేదిక ఒకటి ప్రస్తుతం నెలకొన్న ఆందోళనకు మరింత ఆజ్యం పోసింది. జాబ్ మార్కెట్లో ఐటీ రంగానికి ఎదురు గాలి తప్పడం లేదు. ప్రస్తుత టెక్ రంగాల్లో నెలకొన్న సంక్షోభం కారణంగా వెట్ కాలర్ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి భారతీయ జాబ్ మార్కెట్లు 2,835 స్కోర్‌ను నమోదు చేశాయి, ఇది గత నెలతో పోలిస్తే దాదాపు 6 శాతం గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. సెప్టెంబర్ 2023కి సంబంధించిన నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ ప్రకారం, భారతదేశంలో ఉపాధి ధోరణి నెలవారీగా మెరుగుపడుతున్నట్లు కనిపిస్తోంది. కానీ వార్షిక ప్రాతిపదికన ఇంకా బలహీన ధోరణే కనిపిస్తొంది. గత ఏడాదితో పోలిస్తే 8.6 శాతం క్షీణత నమోదు చేసింది. అయితే అనేక రంగాలు వృద్ధిని కనబరిచడం ఊరటనిస్తోంది. ముఖ్యంగా హాస్పిటాలిటీ , అండ్ ట్రావెల్ రంగం 22 శాతం వృద్ధిని సాధించి స్టార్ పెర్ఫార్మర్గా అవతరించింది. ఇటీవలి నెలల్లో నియామకాల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ఐటీ రంగం వెలవెలబోయింది. కష్టాల్లో ఐటీరంగం ప్రపంచ ప్రకంపనల మధ్య ఐటీ రంగం కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇటీవలి నెలల్లో నియామకాల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో, అయినప్పటికీ, బిగ్ డేటా టెస్టింగ్ ఇంజనీర్, IT, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అండ్ IT ఆపరేషన్స్ మేనేజర్ లాంటి ఉద్యోగాలకు అధిక డిమాండ్ ఉంది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పూణే వంటి ఐటీ-కేంద్రీకృత నగరాల్లో సెప్టెంబర్ 2023లో కొత్త జాబ్ ఆఫర్లు భారీగా తగ్గాయి. ఇప్పటికే దిగ్గజ ఐటీ కంపెనీలు ఖర్చులను తగ్గించుకునేపనిలో వేలాది మందిని తొలగించాయి. మెటా, అమెజాన్ సంస్థల తాజాగా మరో రౌండ్ కోతల వార్తలు ప్రపంచవ్యాప్తంగా టెకీలను ఆందోళనలో పడేస్తున్నాయి. హాస్పిటాలిటీ అండ్ ట్రావెల్ సెక్టార్ హాస్పిటాలిటీ అండ్ ట్రావెల్ సెక్టార్ గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే సెప్టెంబర్ 2023లో 22 శాతం వృద్ధితో టాప్ ప్లేస్‌ను ఆక్రమించింది. ఈ సీజన్లో చేసుకునే కుటుంబాలు ,ఒంటరి ప్రయాణీకు టూర్లు ఈ వృద్ధికి దోహదపడినట్టు తెలుస్తోంది. రెస్టారెంట్ మేనేజర్ , గెస్ట్ సర్వీసెస్ రోల్స్ వంటి ఉద్యోగాలు డిమాండ్ నేపథ్యంలో ముంబై ఈ రంగంలో ఉద్యోగ ఆఫర్లలో ముందుంది. BFSI ,ఆరోగ్య సంరక్షణ రంగాలు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు ఇన్సూరెన్స్ (BFSI) సెక్టార్ , హెల్త్‌కేర్ సెక్టార్ కూడా కొంత పురోగతి సాధించాయి. ప్రతి ఒక్కటి సెప్టెంబర్ 2023లో సంవత్సరానికి 7 శాతం వృద్ధిని నమోదు చేశాయి. BFSI రంగంలో, అహ్మదాబాద్, చండీగఢ్ , జైపూర్ వంటి నగరాలు బ్రాంచ్ మేనేజర్ అండ్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ వంటి పాత్రలకు డిమాండ్ పెరిగింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, BFSIలోని బ్యాంకింగ్ సబ్ సెగ్మెంట్ ఇదే కాలంలో 40 శాతం వృద్ధిని సాధించింది. హెల్త్‌కేర్ సెక్టార్లో, ల్యాబ్ టెక్నీషియన్, మెడికల్ రికార్డ్/ఇన్ఫర్మేటిక్స్ మేనేజర్ వంటి స్థానాలకు అధిక డిమాండ్ ఉంది. ఈ సెక్టార్లో హైరింగ్ ఊపందుకోవడంలో అహ్మదాబాద్, కోల్‌కతా ముందున్నాయి. ఆయిల్ & గ్యాస్ , ఆటో రంగాలు ఆయిల్ & గ్యాస్ , ఆటో రంగాలు కూడా సానుకూల ఉపాధి ధోరణులకు దోహదపడ్డాయి, గత సంవత్సరంతో పోలిస్తే సెప్టెంబర్ 2023లో రెండూ 6 శాతం వృద్ధిని నమోదు చేశాయి. BPO/ITES , FMCG రంగాలలో సవాళ్లు: మరోవైపు BPO/ITES, FMCG రంగాలు సవాళ్లను ఎదుర్కొన్నాయి. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే సెప్టెంబర్ 2023లో వరుసగా 25 శాతం మరియు 23 శాతం ప్రతికూల వృద్ధిని సాధించింది. నాన్-మెట్రోలు షైన్ ఉద్యోగాల కల్పలనో మెట్రోలతు పోలిస్తే నాన్‌మెట్రో నగరాలుల మెరుగ్గా ఉండటం విశేషం. 2023, సెప్టెంబరులో ఉద్యోగాల కల్పనలో నాన్-మెట్రో నగరాలు మెట్రోలను అధిగమించాయి. వడోదర, అహ్మదాబాద్, జైపూర్ వంటి నగరాలు అదే నెలతో పోలిస్తే నియామకంలో వరుసగా 4 శాతం, 3, 2 శాతం వృద్ధిని నమోదు చేశాయి. గత సంవత్సరం. వడోదర BPO/ITES,యు కన్స్ట్రక్షన్/ఇంజనీరింగ్ సెక్టార్ హైరింగ్‌లో రాణించింది. మరోవైపు నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ సోమవారం విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వార్షిక నివేదిక 2022-2023 ప్రకారం, 15 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సున్న నిరుద్యోగిత రేటు దేశంలో జులై 2022-జూన్ 2023 మధ్యకాలంలో ఆరేళ్ల కనిష్టం వద్ద 3.2 శాతంగా నమోదైంది. -
టాప్ 10 టెక్నాలజీ కంపెనీలు: అరకోటి మంది టెకీలు వీటిలోనే..
ప్రపంచవ్యాప్తంగా టెక్ జాబ్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. మంచి వేతన ప్యాకేజీలు, మెరుగైన లైఫ్ స్టైల్ కారణంగా చాలా వీటిని డ్రీమ్ జాబ్స్‌గా భావిస్తున్నారు. ఇలాంటి టెక్ జాబ్‌లు కల్పించే టెక్నాలజీ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా అనేకం ఉన్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా కేవలం 10 కంపెనీల్లోనే సుమారు అరకోటి మందికిపైగా టెకీలు పనిచేస్తున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ గ్యాడ్జెట్స్ నౌ నివేదిక ప్రకారం.. అత్యధికంగా ఉద్యోగాలు కల్పిస్తున్న టాప్ 10 టెక్నాలజీ కంపెనీల గురించి ఇక్కడ తెలుసుకుందాం.. ▶ప్రపంచ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) సుమారు 1,461,000 మంది ఉద్యోగులతో అగ్రస్థానంలో ఉంది. కంపెనీకి చెందిన క్లౌడ్ కంప్యూటింగ్, అమెజాన్ వెబ్ సర్వీసెస్‌తో సహా వివిధ విభాగాల్లో ఈ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ▶యాపిల్ (Apple)కు సంబంధించిన అతిపెద్ద ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారుగా ప్రసిద్ధి చెందిన ఫాక్స్‌కాన్ (Foxconn) 826,608 మంది ఉద్యోగులతో రెండవ స్థానంలో నిలిచింది. ఐఫోన్ల ఉత్పత్తిలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది. ▶జాబితాలో తర్వాతి స్థానంలో ఐటీ కన్సల్టెన్సీ దిగ్గజం యాక్సెంచర్ (Accenture) సుమారు 738,000 మంది ఉద్యోగులతో ఉంది. ▶భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 614,795 మంది గ్లోబల్ వర్క్‌ఫోర్స్ కలిగి ఉంది. ఇది ప్రపంచ ఐటీ పవర్‌హౌస్‌గా మారింది. ▶ఫ్రాన్స్‌కు చెందిన టెలిఫర్ఫార్మెన్స్ (Teleperformance) ప్రపంచవ్యాప్తంగా 410,000 మంది ఉద్యోగులతో కూడిన గ్లోబల్ డిజిటల్ బిజినెస్ సర్వీస్ ప్రొవైడర్. ▶యునైటెడ్ స్టేట్స్కు చెందిన కాగ్నిజెంట్ (Cognizant)లో దాదాపు 351,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ▶మరొక భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys)లో ప్రపంచవ్యాప్తంగా 336,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులతో కన్సల్టింగ్, ఐటీ సేవలలో ప్రత్యేక కంపెనీగా నిలిచింది. ▶జర్మన్ సమ్మేళనం సిమెన్స్ ప్రపంచవ్యాప్తంగా 190 కేంద్రాల్లో సుమారు 3,16,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. ▶యూఎస్ కేంద్రంగా ఉన్న ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఐబీఎం (IBM)లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 288,300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ▶సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) ప్రపంచవ్యాప్తంగా సుమారు 2,21,000 మంది ఉద్యోగులతో డ్రీమ్ కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. మైక్రోసాఫ్ట్ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 60 శాతం మంది దాని స్వదేశమైన యునైటెడ్ స్టేట్స్ నుంచే ఉన్నారు. -
జీతాల పెంపు: దిగ్గజ ఐటీ కంపెనీల ఉద్యోగులకు షాక్!
దేశీయ ఐటీ దిగ్గజాలు ఉద్యోగుల వేతనాల పెంపు విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆదాయం, ఖర్చులు లాంటి పలు సవాళ్లను ఎదుర్కొంటున్న పలు ప్రముఖ ఐటీ కంపెనీలు తమ ఉద్యోగుల జీతాల పెంపునకు సంబంధించి భిన్నమైన నిర్ణయాలు తీసుకున్నాయి. దీంతో ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ ఉద్యోగులకు తీవ్ర నిరాశ ఎదురు కానుంది. ఈమేరకు టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనాన్ని వెలువరించింది. దీని ప్రకారం ఇన్ఫోసిస్, HCLTech ఈసారి పెంపును నిలిపివేసినట్టు సమాచారం. సాధారణంగా ఇన్ఫోసిస్ జీతాల పెంపును జూన్/జూలైలో ప్రకటించడం,అవి ఏప్రిల్ నుండి అమలు కావడం జరుగుతూ ఉంటుంది. అయితే హెచ్‌సిఎల్‌టెక్ మధ్య నుండి సీనియర్ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లను దాటవేసిందట.అలాగే జూనియర్ స్థాయి ఉద్యోగుల జీతాల పెంపును వాయిదా వేసింది. ఇన్ఫోసిస్ 023-24 ఆర్థిక సంవత్సరానికి గాను తన వృద్ధి అంచనాను 4- 7శాతంనుంచి 1-3.5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. (ప్రౌడ్ ఫాదర్ జస్ప్రీత్ బుమ్రా నెట్‌వర్త్, లగ్జరీ కార్లు, ఈ వివరాలు తెలుసా?) భిన్నంగా టీసీఎస్, విప్రో: ఉద్యోగులకు ఊరట అయితే మరో టెక్ దిగ్గజం విప్రో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. మునుపటి సంవత్సరం సెప్టెంబర్‌తో పోల్చితే మూడవ త్రైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్) ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంచనా. టెక్ మహీంద్రా జూనియర్ , మిడ్-లెవల్ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లను ఇచ్చింది. అయితే సీనియర్‌ల్లో పావు వంతు వాయిదా వేసింది. అటు మరో ఐటీ దిగ్గజం టీసీఎస్ కూడా గత ఏడాది మాదిరిగానే తన ఉద్యోగులకు ఊరటనిచ్చింది. వారికి 6-8శాతం వరకు సగటు పెంపును, అత్యుత్తమంగా పనిచేసిన వారికి రెండంకెల పెంపు ప్రకటించింది. టీసీఎస్‌తో పాటు మధ్యతరహా ఐటి సంస్థలైన కోఫోర్జ్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ ఎల్‌టిఐ మైండ్‌ట్రీ తమ ఉద్యోగులకు జీతాలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. -
సింగపూర్‌లో ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
సాక్షి, సింగపూర్/ హైదరాబాద్: ఆగస్టు 6వ తేదీన సింగపూర్‌లో జరగనున్న ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలలో పాల్గొని విజయవంతం చేయాలని సింగపూర్‌లోని ప్రవాస తెలుగు వారికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు టెకీలకు సింగపూర్‌లోని ఇండియన్ హై కమిషనర్ కుమరన్ పిలుపునిచ్చారు. మహాసభలకు పూర్తి మద్దతు ఇస్తామని ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి చైర్మన్ సందీప్ కుమార్ మఖ్తల నాయకత్వంలోని బృందానికి హామీ ఇచ్చారు. సింగపూర్ ప్రభుత్వ సహకారం అందించేందుకు కృషి చేస్తానని సింగపూర్‌లోని ఇండియన్ హై కమిషనర్ కుమరన్ భరోసా ఇచ్చారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి చైర్మన్ సందీప్ మఖ్తల నాయకత్వంలోని బృందం నేడు కుమరన్‌తో సమావేశం జరిపింది. ఈ సందర్భంగా తెలుగు ఐటీ పరిశ్రమకు చెందిన నిపుణులు, ఇన్వెస్టర్లు, స్టార్టప్‌లు, టెక్నోక్రాట్స్ ఇటు పరిశ్రమ అభివృద్ధి అటు స్వరాష్ట్రంలో పెట్టుబడులు అనే అంశంపై విస్తృత అవకాశాలు అందించేందుకు సింగపూర్‌లో అంతర్జాతీయ మహాసభలను నిర్వహిస్తున్న విషయాన్ని బృందం వివరించింది. దాదాపు 100కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్న ఈ మహాసభ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారి సత్తాను చాటి చెప్పనున్నారని పేర్కొంటూ, తెలుగు రాష్ట్రాలు ప్రవేశ పెట్టిన ముఖ్యమైన విధానాలు, నిర్ణయాలకు సంబంధించి ఉన్నతాధికారుల నుంచి తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపింది. టెక్నికల్ ప్రజెంటేషన్, థాట్ ప్రొవొకింగ్ డిస్కషన్స్ వంటివి ఈ మహాసభల్లో భాగం చేయడం వల్ల కేవలం ప్రొఫెషనల్ నెట్వర్క్ విస్తరించుకోవడమే కాకుండా వారి సాంకేతిక పరిజ్ఞానం సైతం పెంపొందించుకునే అవకాశం దక్కుతుందని వెల్లడించింది. సింగపూర్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు జరగడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన సింగపూర్‌లోని ఇండియన్ హై కమిషనర్ కుమరన్ తమ పూర్తి మద్దతు ఇస్తామని ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి చైర్మన్ సందీప్ మఖ్తల నాయకత్వంలోని బృందానికి హామీ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలకు, ఇండియాకు, సింగపూర్‌కు మధ్య అనుసంధానత కల్పించనుందని సంతోషం వ్యక్తం చేశారు. సింగపూర్‌లోని తెలుగు టెక్నోక్రాట్స్ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వాన్ని భాగం చేస్తామని, సింగపూర్ ఐటీ మంత్రిని పాల్గొనేలా తాను సహకరిస్తామని హైకమిషనర్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రోగ్రాం ఫ్లయర్‌ను సింగపూర్‌లోని ఇండియన్ హై కమిషనర్ కుమరన్, ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి చైర్మన్ సందీప్ మఖ్తల తదితరులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండలి సభ్యులు రాకేష్, సింగపూర్ మండలి సభ్యులు కోటి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. (చదవండి: ప్రత్యేక ఆకర్షణగా నాటా విమెన్ ఫోరమ్) -
ఐటీ ఉద్యోగం కోసం చూస్తున్నారా? అయితే మీకో శుభవార్త!
ఎటు చూసినా ఉద్యోగాల కోతతో ఆందోళలో ఉన్న ఐటీ ఉద్యోగులకు, ఉద్యోగాలు వస్తాయో రావో అంటూ భయం భయంగా ఉన్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు అమెరికా సంస్థ తీపి కబురు అందించింది. మెటా, ట్విటర్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి టెక్‌దిగ్గజ సంస్థలు ఖర్చలు తగ్గింపుపేరుతో వేలాది మందిని తొలగిస్తున్న తరుణంలో ఐటీ కంపెనీ ఆక్స్ట్రియా (Axtria Inc) శుభవార్త చెప్పింది. డేటా సైన్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ , డేటా ఇంజినీరింగ్ రంగాలలో 1,000 మంది ఉద్యోగులను నియమించుకోవాలని భావిస్తోంది. గురుగ్రామ్, బెంగళూరు , నోయిడాలోఇప్పటికే ఉన్న ఆఫీసులతో పాటు పూణే హైదరాబాద్‌లో నిర్మిస్తున్న కార్యాలయాల్లో కొత్త ఉద్యోగాలు కల్పిస్తున్నట్టు సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. రాబోయే 8-10 నెలల్లో 1,000 మందికి పైగా డేటా సైంటిస్టులు, సాఫ్ట్వేర్ డెవలపర్లు, డేటా ఇంజనీర్లతో ఈ అవకాశాలను సృష్టించనున్నట్టు వెల్లడించింది. వచ్చే ఐదేళ్లలో డేటా సైన్స్ లో చాలా మార్పు వస్తుందనీ పీపుల్ ప్రాక్టీసెస్ హెడ్ శిఖా సింఘాల్ భావిస్తున్నారు. (అంబానీ,అదానీ కాదు: తొలి 100 కోట్ల ఎయిర్‌బస్ హెలికాప్టర్, ఇంకా విశేషాలు) అంతేకాదు రానున్న రెండేళ్లలో ఇంటెన్సివ్ క్యాంపస్ నియామకానికి సిద్ధమవుతోంది.ఇప్పటికే 2023కి సంబంధించి అగ్రశ్రేణి ఐఐటీ ప్లేస్మెంట్ కార్యాలయాలతో పాటు ఇతర ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తాజా నివేదికల సమాచారం. ప్రస్తుతం ఈ కంపెనీలో దేశవ్యాప్తంగా 3 వేల మంది ఆక్స్ట్రియాలో పని చేస్తున్నారు. మరిన్ని ఇంట్రస్టింగ్ కథనాలు, బిజినెస్ అప్డేట్స్ కోసం చదవండి: సాక్షిబిజినెస్ -
Layoffs crisis ఊడిపోతున్న ఐటీ ఉద్యోగాలు: ఇలా చేస్తే...!
ఇప్పుడు భారత ఐటీలో మాంద్యం కాదు.. దిద్దుబాటు జరుగుతోందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. భయపడే స్థాయిలో ప్రస్తుతం పరిస్థితులు లేవని వారు చెబుతున్నారు. ఉద్యోగం పోయినా మరొక కంపెనీలో చేరుతున్నారు తప్ప రోడ్డున పడ్డ వారెవరూ ఐటీలో లేరని స్పష్టం చేస్తున్నారు. 2001, 2008లో ఐటీ రంగం మందగమనానికి లోనై తిరిగి గాడిలో పడింది. ఏ రంగానికైనా ఒడిదుడుకులు సహజం. ఇందుకు ఐటీ మినహాయింపు కాదని నిపుణులు అంటున్నారు. కోవిడ్-19 దెబ్బతో ప్రపంచం అంతా సంప్రదాయ విధానాల నుంచి సాంకేతిక ఆధారిత పద్ధతులవైపు మళ్లింది. దీంతో తయారీ, బ్యాంకింగ్, బీమా, ఎఫ్ఎంసీజీ, ఈ-కామర్స్, ఆతిథ్యం, ఆహారం, ఆరోగ్యం, విద్య, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, రవాణా, సరుకు రవాణా.. ఇలా అన్నిరంగాల కంపెనీలూ ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకున్నాయి. ఇంకేముంది ఐటీ ప్రోడక్ట్, సర్వీస్ కంపెనీలు 2021, 2022లో ఎన్నడూ లేనంతగా ప్రాజెక్టులు చేజిక్కించుకున్నాయి. వీటి ఆదాయమూ ఊహించనంతగా పెరిగింది. కాంట్రాక్టుల రాకతో ఇబ్బడిముబ్బడిగా ఉద్యోగులను చేర్చుకున్నాయి. కొన్ని కంపెనీలు అయితే అవసరానికి మించి నియామకాలను చేపట్టాయి. ప్రాజెక్టుల ఆశతో బెంచ్‌ను మెయింటెయిన్ చేశాయి. కరోనా మహమ్మారి రాకతో రిమోట్ వర్కింగ్ విధానం తప్పనిసరి అయింది. నియామక ఇంటర్వ్యూలు వర్చువల్ విధానంలో జరిగాయి. ఇదే అదనుగా చాలాచోట్ల అసలు అభ్యర్థికి బదులు మరొకరు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇలా ఉద్యోగం సాధించిన వారిలో కొందరైతే ఒప్పందం కుదుర్చుకుని సబ్జెక్ట్ తెలిసివారితో పనులు చేయించుకున్నారు. గతంలో ఫ్రెషర్లలో మెరిట్ ఉన్నవారికే ఉద్యోగాలు వచ్చాయి. కరోనా సమయంలో ఒక మోస్తరు అభ్యర్థులకు సైతం జాబ్స్ వచ్చాయంటే ఐటీ కంపెనీలకు ప్రాజెక్టులు ఏ స్థాయిలో వెల్లువెత్తాయో అర్థం చేసుకోవచ్చు. నైపుణ్యం ఉన్నవారు అదనపు సంపాదన కోసం ఒకటికి మించిన ఉద్యోగాలు (మూన్‌లైటింగ్) చేశారు. ఐటీ పరిశ్రమలో మూన్‌లైటింగ్ ఎప్పటి నుంచో ఉంది. కానీ గడిచిన రెండేళ్లలో ఇది విస్తృతం అయింది. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంతో ఇంటి పట్టున ఉండే ఉద్యోగాలు చేసినవారికి ఇది కలిసి వచ్చింది. మహమ్మారి తెచ్చిన మార్పులతో అన్ని రంగాల్లోని కంపెనీలూ సాంకేతికతను అందిపుచ్చుకున్నాయి. అందుకే గడచిన రెండు సంవత్సరాల స్థాయిలో ఇప్పటి పరిస్థితులు లేవు. ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలకు కొత్త ప్రాజెక్టుల రాకలో స్పీడ్ తగ్గింది. క్లయింట్ అవసరాలకు అనుగుణంగా ఐటీ కంపెనీలు సాఫ్ట్‌వేర్‌కు రూపకల్పన, కోడింగ్ చేస్తాయి. పరీక్షలు జరిపి అడ్డంకులు లేవని నిర్ధారించుకున్నాక ఆ సాఫ్ట్‌వేర్‌ను అమలు చేస్తాయి. ఆ తర్వాత క్లయింట్లకు కావాల్సిన సపోర్ట్‌ను ఒప్పందంలో భాగంగా ఐటీ కంపెనీలు కొన్నేళ్లపాటు కొనసాగిస్తాయి. కరోనా కాలంలో వచ్చిన ప్రాజెక్టులు దాదాపు ఇప్పుడు సపోర్ట్ దశకు వచ్చాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. అంటే ప్రస్తుతం సపోర్ట్ సేవలు అందించే సిబ్బందికే ఎక్కువ పని ఉంటుందన్నది వారి మాట. సదరు సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిన కంపెనీకి కొత్త ప్రాజెక్టులు లేకపోతే డిజైన్, కోడింగ్, టెస్టింగ్ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులు మరో మార్గాలను వెతుక్కుంటున్నారు. కరోనా కాలంలో కొత్త కంపెనీలు పుట్టుకొచ్చినందున ఈ విభాగాల్లో ఉద్యోగావకాశాలకు కొరత లేదని మార్కెట్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు టెక్నాలజీ రోజురోజుకూ వేగంగా మారుతోంది. నూతన ప్రాజెక్టులు తగ్గాయి. కరోనా కాలంలో ఉద్యోగులు మూడు రెట్ల వరకు వేతనం అందుకోవడంతో ప్రస్తుతం కంపెనీలకు భారంగా పరిణమిస్తోంది. అందుకే వ్యయ నియంత్రణతోపాటు వ్యాపార పునర్వ్యవస్థీకరణకు నడుం బిగించాయి. కొత్త సాంకేతికతకు అప్‌గ్రేడ్ కాని ఉద్యోగులకు స్వస్తి పలుకుతున్నాయి. హైబ్రిడ్ లేదా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ విధానాలవైపు మళ్లడంతో ఉద్యోగులు ఆఫీసుకు రాక తప్పడం లేదు. తమకు బదులుగా ఇంకొకరి సాయంతో ఇంటర్వ్యూ పూర్తి చేసినవారు నైపుణ్య పరీక్షల్లో విఫలం అవుతున్నారు. అలాగే ఒకటికి మించి ఉద్యోగాలు చేస్తున్నవారిని హెచ్ఆర్ విభాగాలు ఏరివేస్తున్నాయి. బ్యాంకు స్టేట్మెంట్స్, ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల ఆధారంగా మూన్‌లైటింగ్‌కు పాల్పడిన వారిని గుర్తించి సాగనంపుతున్నాయి. పని లేక బెంచ్‌పై ఖాళీగా కూర్చున్న సిబ్బందిని తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని సంస్థలు ఇంటికి పంపించివేస్తున్నాయి. కొన్ని కంపెనీలు అయితే మాంద్యం బూచి చూపి సిబ్బంది సంఖ్యలో కోత విధిస్తున్నాయి. ఐటీతో ముడిపడి.. సాంకేతికత ఏదైనా సామాన్యుడికి చేరితేనే భవిష్యత్తు. ఫ్యూచర్‌ను అంచనావేసి అందుబాటులోకి తెచ్చిన ఏ పరిష్కారమైనా ఆదరణ చూరగొంటుంది. ఇప్పుడు ఐటీలో అదే జరిగింది. ఒకప్పుడు బ్యాంకులో క్యూలో నిలుచున్న రోజులు గుర్తుండే ఉంటాయి. నేడు పేమెంట్, బ్యాంకింగ్ యాప్స్‌తో క్షణాల్లో పని కానిచ్చేస్తున్నాం. ఫుడ్ డెలివరీ, రైడ్ హెయిలింగ్ యాప్స్, ఓటీటీ వేదికలు, సామాజిక మాధ్యమాలు.. ఒకటేమిటి ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా పెద్దదే అవుతుంది. ఈ అప్లికేషన్స్‌ను (యాప్స్) నడిపించేది సాంకేతికతనే. మానవ జీవితంలో సాంకేతికత లేకపోతే మనుగడ అసాధ్యం అన్నంతగా ముడిపడింది. ఆర్థికంగా, సామాజికంగా పెను మార్పులు చోటు చేసుకున్నాయి. అందుకే ఐటీకి భవిష్యత్తు ఎప్పుడూ ఉంటుందన్నది నిపుణుల మాట. ప్రపంచమే మార్కెట్.. ఒకప్పుడు యూఎస్ విపణిపైనే ఐటీ ఆధారపడేది. ఇప్పుడు ప్రపంచమే పెద్ద మార్కెట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఎండ్ యూజర్స్ ఉన్నారు. ఒక దేశంలో బ్యాంకు మూతపడిందనో, ఆ దేశం మాంద్యంలో చిక్కుకుందనో మొత్తం ఐటీ పరిశ్రమ నిలిచిపోదు. నిపుణులైన అపార మానవ వనరులు భారత్ సొంతం. అంతే కాదు ఇక్కడ లభించే సేవలు చౌక. అందుకే దిగ్గజ మల్టీ నేషనల్ కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయి. మనవాళ్లే ఎందుకంటే.. భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీల ప్రకారం.. ఇక్కడ మానవ వనరులకు అయ్యే ఖర్చు తక్కువ. అధిక నైపుణ్యం ఉన్నవారు దేశంలో కోకొల్లలు. ఇతర భాషలూ మాట్లాడగలరు. వివిధ దేశాల్లో ఉన్న క్లయింట్ల సమయం ప్రకారం పనిచేసేందుకు వెనుకాడరు. తార్కిక ఆలోచన (లాజికల్ థింకింగ్) భారతీయులకు ఎక్కువ. క్లయింట్ల ఆలోచనను సులువుగా అర్థం చేసుకుంటారు. కొన్నేళ్లుగా విద్యావిధానంలో వచ్చిన మార్పులు ఇందుకు దోహదం చేస్తున్నాయి. మరో ముఖ్య విషయం టీమ్ వర్క్ భారతీయుల ప్రత్యేకత. సమష్టి కృషి వల్ల పనులను నాణ్యత తగ్గకుండా, త్వరితగతిన పూర్తి చేయగలరు. కోడింగ్‌లో భారతీయులు దిట్ట. క్యాప్టివ్ కంపెనీల్లో నియామకాలు.. ఐటీ కంపెనీల్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి క్యాప్టివ్. అంటే తమ గ్రూప్ కంపెనీల కోసం సొంతంగా ఐటీ సేవలు, బ్యాక్ ఎండ్ సపోర్ట్ అందించేవి. మరొకటి క్లయింట్లు, ఎండ్ యూజర్ల కోసం పనిచేసే ఐటీ కంపెనీలు. కరోనా కాలంలో భారత్‌కు క్యాప్టివ్ కంపెనీలు క్యూ కట్టాయి. గోల్డ్‌మన్ శాక్స్, పెప్సికో, అపెక్స్ ఫండ్, సిట్కో ఫండ్, యూబీఎస్, స్టేట్ స్ట్రీట్ వంటివి వీటిలో ఉన్నాయి. క్యాప్టివ్ కంపెనీలు పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టాయి. ఈ రిక్రూట్మెంట్ ఇప్పటికీ పెద్ద ఎత్తున కొనసాగుతూనే ఉంది. రూ.5–12 లక్షల వార్షిక వేతనాల విభాగంలో కొత్త వారిని ఎక్కువగా చేర్చుకుంటున్నాయి. క్లయింట్ల కోసం పనిచేసే ఐటీ కంపెనీలు కొత్త నియామకాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. మరోవైపు టీసీఎస్, ఇన్ఫోసిస్‌లో రిక్రూట్మెంట్ జరుగుతూనే ఉంది. పల్లెలకూ ఐటీ పాకింది.. నియామకాలు కొనసాగుతుండడంతో ఐటీతో ముడిపడిన శిక్షణ సంస్థలు కొత్త కోర్సుల కోసం వచ్చిన అభ్యర్థులు, ఫ్రెషర్లతో సందడిగా ఉన్నాయి. ల్యాప్‌టాప్ అంటే తెలియనివారూ ఇక్కడికి వస్తున్నారంటే ఆశ్చర్యం వేయక మానదు. ఇంగ్లిష్‌పై ఏమాత్రం పట్టు ఉండదు. అయినా నేర్చుకుని స్థిరపడవచ్చన్నది ప్రగాఢ విశ్వాసం అభ్యర్థుల్లో కనపిస్తోంది. మారు మూల పల్లెలకూ ఐటీ చొచ్చుకుపోయింది. కరోనా కారణంగా స్వగ్రామాల్లో ఇంటికి చేరి ఉద్యోగాలు చేసినవారు లక్షల మంది ఉన్నారు. లక్షల్లో వేతనం అందుకుంటున్న వీరిని చూసిన ఇతర కుటుంబ సభ్యులు, స్నేహితులు, చుట్టుపక్కల వారికి ఐటీలో ఉద్యోగం సంపాదించాలనే ఆశ పుట్టింది. ఇప్పటికీ ఆఫర్స్ షాపింగ్.. ఆఫర్ లెటర్లు అందుకునే వారి సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ ఆఫర్స్ షాపింగ్ జరుగుతోంది. అంటే ఒక సంస్థ ఇచ్చిన ఆఫర్‌ను చూపించి మరో కంపెనీలో అధిక వేతనాన్ని డిమాండ్ చేయడం. ఇటీవల యూఎస్ ప్రభుత్వం జారీ చేసిన హెచ్1బీ వీసాలు అందుకున్న వారిలో భారతీయులూ ఉన్నారు. వీరిలో అనలిటిక్స్, క్లౌడ్ టెక్నాలజీ నిపుణులు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. భారత ఐటీ నిపుణులకు డిమాండ్‌ను సూచిస్తోంది ఇది. లే ఆఫ్స్ అనే మాటలు వింటున్నాం గాని, తమ కంపెనీలో అలాంటిదేమీ జరగడం లేదని యూఎస్‌కు చెందిన దిగ్గజ టెక్నాలజీ సంస్థలో పని చేస్తున్న సాయి శ్రీహిత్ తెలిపారు. ‘నా స్నేహితులు చాలా మంది ఐటీలో ఉన్నారు. ఉద్యోగం పోయిందనే మాట వారి నుంచి నేను వినలేదు. కొందరు కొత్త కోర్సులు నేర్చుకుని పని చేస్తున్న సంస్థలో రోల్ మారడమో, లేదా మరొక కంపెనీలో అధిక వేతనానికి చేరడమో చేస్తున్నారు’ అని అన్నారు. ఈ ఏడాది హైక్ తక్కువే.. ప్రాజెక్టులు వస్తాయన్న అంచనాలతో బెంచ్‌ను కంపెనీలు మెయింటైన్ చేస్తాయి. అంటే ప్రాజెక్టు లేనప్పటికీ ఉద్యోగులను చేర్చుకుంటాయి. సిబ్బందికి వేతనాలూ చెల్లిస్తాయి. ఎప్పుడైతే ప్రాజెక్టులు రావని నిర్ధారణ అవుతుందో సిబ్బంది తీసివేతలు మొదలవుతాయి. కొన్ని కంపెనీలు కొన్ని నెలల వేతనం ముందే చెల్లించి సిబ్బందిని ఇంటికి పంపిస్తాయి. కొన్ని కంపెనీలు వేతనాల్లో కోత విధించడం లేదా నిలిపివేయడం చేస్తాయి. దీంతో ఉద్యోగి చేసేదేమీ లేక రాజీనామా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇదే వాతావరణం నెలకొందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కొత్త ప్రాజెక్టుల సంఖ్య తగ్గడంతో 2023లో వేతన పెంపు నెమ్మదించవచ్చని వారు అంటున్నారు. అప్‌గ్రేడ్ అవ్వాల్సిందే.. సాంకేతికత ఎప్పటికప్పుడు మారుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ వంటివి చొచ్చుకు వస్తున్నాయి. టెక్నాలజీ మార్పులకు తగ్గట్టుగా ఈ రంగంలో పనిచేస్తున్న మానవ వనరులు ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాల్సిందే. లేదంటే ఇంటిబాట తప్పదని కంపెనీలు హెచ్చరిస్తున్నాయి. 2023లో కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంపై ఈ రంగ నిపుణులు దృష్టి సారిస్తున్నారు. సర్టిఫికెట్ కోర్సులకు డిమాండ్ పెరుగుతోందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఫుల్ స్టాక్ డెవలపర్, టెస్టింగ్, డేటా సైంటిస్ట్, క్లౌడ్ ఇంజినీర్, స్క్రమ్ మాస్టర్ వంటి నిపుణులకు భారీగా డిమాండ్ ఉంది. ఐటీలో ఏదో ఒక ఉద్యోగం.. 2020కి ముందు శిక్షణ సంస్థల్లో ఐటీ కోర్సులు నేర్చుకున్న వారిలో 40 శాతం మందికి ఉద్యోగాలు వచ్చాయి. 2021, 2022లో అభ్యర్థుల సంఖ్య రెండింతలైంది. 70–80 శాతం మంది జాబ్స్ సంపాదించారు. గడచిన రెండేళ్లతో పోలిస్తే ప్రస్తుతం నేర్చుకోవడానికి వచ్చే అభ్యర్థుల సంఖ్య 25 శాతం తగ్గింది. సక్సెస్ రేట్ 50 శాతం ఉంది. మాంద్యం వార్తల నేపథ్యంలో అభద్రతా భావం వల్లే శిక్షణ కోసం వచ్చేవారి సంఖ్య తగ్గిందని ఇన్స్టిట్యూట్స్ చెబుతున్నాయి. మరోవైపు ఏళ్ల తరబడి గ్రూప్స్‌కు సన్నద్ధం అయినవారు ఇప్పుడు ఐటీ వైపు చూస్తున్నారు. కొత్తగా శిక్షణ కోసం వచ్చిన వారిలో ఇటువంటి వారి సంఖ్య 50 శాతంపైగా ఉంటోందని సమాచారం. సబ్జెక్ట్ నేర్చుకుంటే ఐటీలో ఏదో ఒక ఉద్యోగం వస్తుందన్నది వారి నమ్మకం. కోవిడ్ తెచ్చిన మార్పులు.. ఒకప్పుడు బీటెక్‌లో ఈసీఈ, ఈఈఈ, సీఎస్ఈ, ఐటీతోపాటు ఎంసీఏ చదివినవారు ఐటీ వైపు వచ్చేవారు. మహమ్మారి కాలంలో, అలాగే ప్రస్తుతం డిగ్రీ పూర్తి అయినవారు, ఇతర విద్యార్హతలు ఉన్నవారూ సంబంధిత కోర్సులు చేసి ఐటీలో ప్రవేశిస్తున్నారు. అధిక వేతనాలు వీరిని ఆకర్షిస్తున్నాయి. ప్రాజెక్టులు వెల్లువెత్తడంతో కంపెనీలు అభ్యర్థుల విద్యార్హతలను పట్టించుకోకుండా నియామకాలు చేపట్టాయి. నాన్ బీటెక్, నాన్ ఐటీ నుంచి ఇటువైపు రావడం 2021 నుంచి ట్రెండింగ్ అయింది. హెచ్‌సీఎల్‌లో రూ.20 లక్షల వార్షిక వేతనం ఆమెది. ఉద్యోగం వదిలేయాలని డిసైడ్ అయ్యారు. నూతన సాంకేతికత నేర్చుకుని యూఎస్ వెళ్లాలన్నది ఆమె ఆలోచన. కొసమెరుపు ఏమంటే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న గ్రూప్–2 స్థాయి అధికారి అయిన తన భర్తను సైతం రాజీనామా చేయించి.. ఇద్దరూ విదేశీ గడ్డపై స్థిరపడాలని ఆమె నిర్ణయించుకోవడం. ప్రపంచం అంతా మందగమనం గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో ఈ ఒక్క సంఘటన చాలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో ఉన్న ఉజ్వల భవిష్యత్తు గురించి చెప్పడానికి! వేతనాలు ఇలా.. కొత్త కోర్సు నేర్చుకుని అప్‌గ్రేడ్ అయినవారు అదే సంస్థలో సగటున వేతనంలో 70-80 శాతం హైక్ సాధిస్తున్నారు. కంపెనీ మారినవారైతే రెండింతల శాలరీతో జాక్‌పాట్ కొట్టేస్తున్నారట. కీలక విభాగాల్లో పనిచేస్తున్న నిపుణుల జీతాలు మూడు రెట్ల వరకు అధికం అయ్యాయంటే ప్రస్తుత డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. కంపెనీ, ఉద్యోగి సామర్థ్యాలను బట్టి కోవిడ్ ముందు, ప్రస్తుతం వార్షిక వేతనాలు సగటున ఇలా ఉన్నాయి. అనుభవం కోవిడ్ ముందు ప్రస్తుతం (వార్షిక వేతనాలు లక్షల్లో) ఫ్రెషర్స్ రూ.2–5 రూ.4–10 1–3 ఏళ్లు రూ.5–8 రూ.8–20 3–10 ఏళ్లు రూ.6–16 రూ.15–40 10–15 ఏళ్లు రూ.15–25 రూ.25 లక్షల – రూ.1 కోటి 15 ఏళ్లకుపైబడి రూ.30–70 రూ.40 లక్షల – రూ.1 కోటి నైపుణ్యం ఉన్నవారే ఉంటారు..: ఐటీ రంగంలో నైపుణ్యం ఉన్నవారికే భవిష్యత్తు ఉంటుంది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అభ్యర్థులు అప్‌గ్రేడ్ అవ్వాల్సిందే. అనలిటిక్స్, క్లౌడ్ టెక్నాలజీ, సీఆర్ఎం విభాగాల్లో నిపుణులకు డిమాండ్ విపరీతంగా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాక ప్రభావం ఏ రంగాలపై ఉంటుంది, ఉద్యోగ అవకాశాలు ఎలా ఉండబోతున్నాయనే అంశంలో స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులు తగ్గిపోయి ఉండవచ్చు. అయినంత మాత్రాన భయపడేంత పరిస్థితులు లేవు. భారత్‌లో పెద్దగా లే ఆఫ్స్ లేవు. నైపుణ్యం ఉంటే ఒక కంపెనీ కాకపోతే మరొక కంపెనీలో ఉద్యోగం లభిస్తోంది. తప్పుడు పత్రాలతో ఉద్యోగం పొందిన వారికే ముప్పు. కొత్త ప్రాజెక్టుల విషయంలో స్పష్టత రాకపోవడంతో బెంచ్ మీదకు తీసుకోవడం లేదు – నానాబాల లావణ్య కుమార్, కో–ఫౌండర్, స్మార్ట్‌స్టెప్స్. ఉద్యోగం పోవడం సమస్యే కాదు..: ఇంటర్వ్యూకు వచ్చిన వారిలో గతేడాది వరకు ఆఫర్ షాపింగ్ చేసేవారి సంఖ్య 20 శాతం ఉండేది. ఇప్పుడు ఇలాంటి వారు ఏకంగా 50 శాతం ఉంటున్నారు. అభ్యర్థుల్లో 20 శాతం మంది లే ఆఫ్స్ కారణంగా ఉద్యోగం పోయినవారు వస్తున్నారు. జాబ్ పోయిందనేది సమస్యే కాదు. అభ్యర్థిలో టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయా లేదా అన్నదే కంపెనీలకు ప్రధానం. ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం అక్కర్లేదు. సరిగ్గా కమ్యూనికేట్ చేయగలిగితే చాలు. పురుషులైతే 1–2 ఏళ్లు గ్యాప్ ఉన్నా ఫర్వాలేదు. మహిళలు అయితే ఎంత గ్యాప్ ఉన్నా సంబంధిత సాంకేతికతలో నైపుణ్యం ఉంటే జాబ్ వస్తోంది. అభ్యర్థులు ఎవరైనా ఇప్పుడు వేతనంలో కనీసం 30 శాతం హైక్ డిమాండ్ చేస్తున్నారు – రేచల్ స్టెల్లా రాజ్, ఇంటర్నల్ టాలెంట్ అక్విజిషన్ రిక్రూటర్. ప్యాకేజ్ గురించి ఆలోచించవద్దు..: కొత్తగా ఐటీ రంగంలోకి వచ్చేవారు, కెరీర్ గ్యాప్ ఉన్నవారు ప్యాకేజీ గురించి ఆలోచించకుండా నైపుణ్యం పెంచుకోవడంపైనే ఫోకస్ చేయాలి. ఏ కోర్స్ చేస్తే మెరుగ్గా ఉంటుందో కెరీర్ గైడెన్స్ ద్వారా తెలుసుకోవాలి. దీర్ఘకాలిక లక్ష్యంతో అడుగుపెట్టాలి. టెక్నికల్ సబ్జెక్ట్, కమ్యూనికేషన్ స్కిల్స్‌తోపాటు ఇంటర్న్‌షిప్ అవకాశాలు చూసుకోవాలి. విభిన్న కంపెనీల్లో ఓపికగా ఇంటర్వ్యూల్లో పాల్గొని నాలెడ్జ్ సంపాదించాలి. డిగ్రీ చదివి మంచి ఇన్స్టిట్యూట్లో 6–12 నెలలపాటు శిక్షణ తీసుకుంటే చాలు. ఐటీ రంగంలో జాబ్ తప్పనిసరిగా దొరుకుతుంది. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నట్టయితే నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సిందే. నైపుణ్యం ఉంటే ఐటీ రంగంలో నిలదొక్కుకోవచ్చు. నియామక పత్రాలు అందుకుంటున్న వారి సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు – రమణ భూపతి, చైర్మన్, క్వాలిటీ థాట్ గ్రూప్. -నూగూరి మహేందర్ -
ఇండియన్ టెకీలకు గిట్‌హబ్ షాక్: టీం మొత్తానికి ఉద్వాసన
న్యూఢిల్లీ: ప్రముఖ డెవలపర్ ప్లాట్‌ఫారమ్ గిట్‌హబ్ మొత్తం భారతీయ ఇంజనీరింగ్ బృందాన్ని తొలగించనుంది. ఈ మేరకు గిట్‌హబ్ సీఈవో థామస్ దోమ్కే ఉద్యోగులకు ఈమెయిల్ సమాచారం అందించారు. ప్రపంచ మార్కెట్ పరిస్థితులు ఖర్చులను తగ్గించుకొనే క్రమంలో మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలోని గిట్‌హబ్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. "పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక" లో భాగంగా తీసుకున్న ఈ చర్యతో కనీసం 100 మంది భారతీయులు ఉద్యోగాలను కోల్పోనున్నారు. అమెరికా తరువాత రెండో అతిపెద్ద డెవలపర్ సెంటర్‌గా ఉన్న భారతీయ టీం మొత్తాన్ని తొలగించడం ఆందోళన రేపింది. అయితే ప్రతి వ్యాపారానికి స్థిరమైన వృద్ధి ముఖ్యమని సీఈవో ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో వెల్లడించారు. ప్రస్తుతం 100 మిలియన్ల డెవలపర్లున్నారు. రేపటి ప్రపంచానికి డెవలపర్-ఫస్ట్ ఇంజినీరింగ్ సిస్టమ్‌గా సంస్థ మారాల్సి ఉందన్నారు. తమ కస్టమర్లు GitHubతో వృద్ధి చెందేందుకు, వారి క్లౌడ్ అడాప్షన్ జర్నీని వేగవంతం, సరళీకృతం చేయడంలో సహాయపడటం కొనసాగించాలని సీఈవో తెలిపారు. (ఎలాన్ మస్క్‌కు మరో ఎదురుదెబ్బ: సోర్స్ కోడ్ లీక్ కలకలం) గత నెల ప్రారంభంలో గిట్‌హబ్ ప్రకటించిన విస్తృత క్రమబద్ధీకరణ ప్రయత్నంలో ఈ తొలగింపు భాగం కావచ్చని అంచనా. మార్చితో ముగిసే త్రైమాసికం నాటికి దాదాపు 10శాతం ఉద్యోగులను తగ్గించనున్నట్లు ఇంతకుముందే (ఫిబ్రవరిలో) సంస్థ ప్రకటించింది. GitHub slashes engineering team in India https://t.co/8K2toOvzZm by @refsrc — TechCrunch (@TechCrunch) March 28, 2023 (ఇదీ చదవండి: Disney Layoffs: మరో నాలుగు రోజులే, ఉద్యోగులకు ఈమెయిల్ బాంబు!) -
మరో బాంబు, వేలమందికి షాకివ్వనున్న టెక్ దిగ్గజం
సాక్షి,ముంబై: గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ వేలాదిమంది ఉద్యోగులకు షాకిస్తోంది. ఆల్ఫాబెట్ ప్రపంచవ్యాప్తంగా 12,000 ఉద్యోగాలను తగ్గించనుంది ఈ మేరకు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ శుక్రవారం ఉద్యోగులకు ఒక ఇమెయిల్‌లో సమాచారం అందించారు. ప్రత్యర్థి మైక్రోసాఫ్ట్ 10వేల మంది కార్మికులను తొలగిస్తామని చెప్పిన కొన్ని రోజుల తర్వాత తాజా పరిణామం వెలుగులోకి వచ్చింది. టెక్ దిగ్గజ సంస్థల్లో గత కొన్నాళ్లుగా సాగుతున్న ఉద్యోగాల తొలంపులు ఐటీ ఉద్యోగుల్లో కలకలం రేపుతున్నాయి. (స్విగ్గీ ఉద్యోగాల ఊచకోత: 380 మందిపై వేటు) ప్రపంచవ్యాప్తంగా తన సిబ్బందిలో 6 శాతం మేర తగ్గించుకోనుంది. ఖర్చుల నియంత్రణ, ముదురుతున్న ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొనే క్రమంలో ఆల్ఫాబెట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వర్క్‌ఫోర్స్‌ను సుమారు 12వేల మందిని తొలగిస్తున్నామనే బాధాకరమైన నిర్ణయాన్ని వెల్లడించడం కష్టంగా ఉంది. ఇష్టంతో కష్టపడి పనిచేసే అద్భుతమైన ప్రతిభావంతులకు వీడ్కోలు పలుకుతున్నందుకు చాలా విచారిస్తున్నాను. ఇప్పటికే ప్రభావితమైన ఉద్యోగులకు ప్రత్యేక ఇమెయిల్‌ను పంపాం అని పిచాయ్ తన ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. కంపెనీ చరిత్రలోఇంత పెద్ద స్థాయిలో ఉద్యోగులను తొలగించడం గతంలో ఎన్నడూ లేదని టెక్ వర్గాలు భాస్తున్నాయి. కాగా గత ఏడాదితో పోలిస్తే కంపెనీ లాభం 27 శాతం క్షీణించి 13.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది. -
ఐటీ ఉద్యోగుల్ని ముంచెత్తనున్న లేఆఫ్స్ సునామీ?
ఐటీ జాబ్స్! యువతకు డ్రీమ్ డెస్టినేషన్. భారీ వేతనాలు, వారంలో రెండు రోజుల సెలవులు, ఉద్యోగంలో చేరిన కొద్ది రోజులకే కొత్త ఇల్లు సహా.. ఏదైనా కొనగలిగే సమర్ధత. ఈఎంఐ సౌకర్యంతో ఏదైనా కొనేసే ఆర్ధిక స్థోమత. మొత్తంగా ఐటీ ఉద్యోగం అంటే లైఫ్ సెటిల్ అన్న ఫీలింగ్. అయితే ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయి. ఆర్ధిక మాంద్యం ముంచుకొస్తుందనే ఆర్ధిక నిపుణుల అంచనాల కారణంగా స్టార్టప్స్ నుంచి దిగ్గజ టెక్ కంపెనీల వరకు ఉద్యోగులకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నాయి. కాస్ట్ కటింగ్ పేరుతో వర్క్ ఫోర్స్‌ను తగ్గించుకుంటున్నాయి. ఇప్పటికే చిన్న, పెద్ద, మధ్య తరహా సంస్థలు ఈ ఏడాదిలో లక్షల మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపించాయి. గతేడాది టాప్ టెక్ దిగ్గజ సంస్థలైన ట్విటర్, యాపిల్, మెటాతో పాటు ఇతర కంపెనీలు వందల మందిని ఫైర్ చేశాయి. తాజాగా అమెరికాకు చెందిన ప్లేస్మెంట్ సంస్థ ఛాలెంజర్, గ్రే అండ్ క్రిస్మస్ నివేదిక విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది 965 సంస్థలు లక్షా 50 వేల మందికి పింక్ స్లిప్‌లు జారీ చేసినట్లు తేలింది. వచ్చే ఏడాదిలో ఆ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విచిత్రంగా ప్రస్తుతం తొలగింపులు 2008-09లో తలెత్తిన ఆర్ధిక మాద్యం వల్ల పోగొట్టుకున్న ఉద్యోగాల కంటే ఎక్కువగా ఉంది. 2018లో టెక్ కంపెనీలు 65,000 మంది ఉద్యోగులను తొలగించాయని, 2019లో కూడా అదే సంఖ్యలో టెక్కీలు ఉద్యోగాలు కోల్పోయారని సంస్థ గత నివేదికలు తెలిపాయి.కోవిడ్-19 ప్రారంభమైనప్పటి నుండి సుమారు 1400 టెక్ కంపెనీలు 2 లక్షల మందికి పైగా ఉద్యోగులను తొలగించాయని లేఆఫ్స్.ఫైఐ డేటా వెల్లడించింది. 2022 టెక్ రంగానికి అత్యంత చెత్త సంవత్సరంగా కాగా...2023 ప్రారంభంలో టెక్ పరిశ్రమ మరింత అధ్వాన్నంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేసింది. నవంబర్ మధ్య నాటికి, మెటా, ట్విటర్, సేల్స్ ఫోర్స్ , నెట్‌ఫ్లిక్స్ తో పాటు ఇతర టెక్ కంపెనీలు యుఎస్ టెక్ రంగంలో 73,000 మందికి పైగా సిబ్బందని తొలగించగా.. భారత్‌లో 17000 మందికి పైగా ఉపాధి కోల్పోయారు. టెక్ విభాగంలో తొలగింపులు సంవత్సరం మొదటి అర్ధభాగంలో ప్రారంభమై సంవత్సరం పొడవునా కొనసాగుతాయి. 2023 మొదటి అర్ధభాగంలో టెక్ తొలగింపులు మరింత దిగజారుతాయని నివేదికలు సూచిస్తున్నాయి. మెటా, అమెజాన్, ట్విటర్, నెట్ ఫ్లిక్స్ సహా అనేక పెద్ద టెక్ కంపెనీలు ఇప్పటికే 2022 వరకు వందలు, వేల మంది తొలగించాయి. ట్విటర్, మెటా, అమెజాన్ తో పాటు అనేక ఇతర టెక్ కంపెనీలు ఇప్పటికే తొలగించగా.. గూగుల్ వంటి కంపెనీలు రాబోయే నెలల్లో దాదాపు వేలాది మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. -
దోమలను తోలేసినంత తేలిగ్గా ఉద్యోగ కోతలు, ఎన్నాళ్లీ వేట?
ఉదయాన్నే ఆఫీసు కెళ్లిన మనిషి సాయంత్రానికి నిరుద్యోగి అయిపోయి ఇంటికి వస్తున్నాడు. మధ్యాహ్నం వరకు కంపెనీలో హుషారుగా ఉన్న వారు సాయంత్రానికి ఉద్యోగం పోయిన బాధతో ఏ బారుకో పోతున్నారు. దోమలను తోలేసినంత తేలిగ్గా కంపెనీల యాజమాన్యాలు ఉద్యోగులను ఇంటికి తోలేస్తున్నాయి. ఐటీ రంగమంతటా ఈ ట్రెండ్ కొనసాగుతోంది. అయితే వీటికి ఆజ్యం పోసింది మాత్రం మస్కే. పాశ్చ్యాత్య దేశాల్లోని ఈ సంక్షోభం భారతీయ యువతపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో అన్న ఆందోళనలు వినపడుతున్నాయి. ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ వచ్చీ రావడంతోనే వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపేశాడు. అమెజాన్, మెటా కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను వీధిన పడేశాయి. బైజూస్, నెట్ ప్లిక్స్, మైక్రోసాఫ్ట్,స్నాప్ కంపెనీలు ఎంత మంది ఉద్యోగాలకు శఠగోపం పెట్టచ్చా అని ఆలోచిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకించి ఐటీ రంగంలో ప్రస్తుతం ఉద్యోగాలు ఊడబీకే రుతువు మొదలైంది. కొద్ది నెలల పాటు ఈ ఉద్యోగ మేథం కొనసాగుతుంది. ఆర్ధికమాంద్యం తరుముకు వస్తోన్న నేపథ్యంలోనే ఉద్యోగాలు ఊడపీక్క తప్పడం లేదని యాజమాన్యాలు అంటున్నాయి. (మరో టెక్ దిగ్గజం సంచలన నిర్ణయం: ఉద్యోగులకు ఇక గడ్డుకాలమేనా?) ఎలాన్ మస్క్ ఏ ముహూర్తాన ట్విటర్ కంపెనీని సొంతం చేసుకున్నాడో కానీ అప్పట్నుంచే ఉద్యోగుల కుర్చీ కిందకు కుంపట్లు వచ్చి చేరాయి. కంపెనీ ఓనర్ గా సంస్థలో అడుగు పెట్టడానికి ముందే సంస్థలో సగానికి సగం మంది ఉద్యోగులను ఇంటికి పంపేసేందుకుసిద్ధమయ్యారు మస్క్. అలా ఉద్యోగాలు పీకేయకపోతే కంపెనీ దివాళా తీస్తుందని హెచ్చరించారు. వచ్చీ రావడంతోనే తనకు నచ్చని టాప్ బాసులను అవమానకరంగా ఇంటికి పంపిన మస్క్ ఆనందంతో ఓ డ్యాన్స్ చేశారు. ఆ తర్వాత ఉద్యోగులను వేటాడ్డం మొదలు పెట్టారు. ఎంతమందిని పీకేయచ్చు? ఎవరెవరిని పీకేయాలి? అన్న కోణంలో కసరత్తులు మొదలు పెట్టారు. ఆ క్రమంలోనే ఉద్యోగులందరికీ ఓ మెయిల్ పంపారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని కష్టపడి పనిచేస్తారా? లేకపోతే ఇళ్లకు పోతారా? అని బెదిరింపు ధోరణితో కూడిన ఏక వాక్య సందేశాన్ని పంపారు. కష్టపడి పనిచేస్తామని ముందుకు వచ్చేవారికి ఒక ఫాం ఇచ్చి దాన్ని పూర్తి చేయించి సంతకం తీసుకోవాలన్నది మస్క్ ప్లాన్. అయితే ఆ ఫాంస్ పంపిణీ చేయడానికి ముందే ఉద్యోగులు మస్క్ వైఖరిపై మండిపోయారు. చీటికీ మాటికీ ఉద్యోగం పీకేస్తాను అనేవాడు ఏం బాస్? అటువంటి బాస్ దగ్గర పని చేస్తే ఎంత చెయ్యకపోతే ఎంత? అనుకున్న మెజారిటీ ఉద్యోగులు నువ్వూ వద్దు నీ ఉద్యోగమూ వద్దు నీకో దండం అనేసి సెల్యూట్ చేస్తోన్న ఎమోజీ ఒకటి పెట్టేసి ఊరుకున్నారు. ఇక ట్విటర్లో అనుక్షణం భయపడుతూ ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదని ఉద్యోగులు నిశ్చయానికి వచ్చేశారు. అందరూ ఉద్యోగాలు మానేయడానికి మూకుమ్మడిగా సిద్దమవుతున్నారన్న సమాచారం అందగానే మస్క్ లో కంగారు మొదలైంది. అందరూ వెళ్లిపోతే కంపెనీని నడిపెదెవరు? అన్న ఆలోచన రాగానే ఇలాన్ మస్క్ దిద్దుబాటు చర్యలకు మొదలెట్టారు. ఉద్యోగుల్లో కొందరికి వర్క్ ఫ్రం హోం కొనసాగించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాం అన్నారు. మరి కొందరు కీలక ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఉద్యోగులు మాత్రం ఈ తాయిలాలకు లొంగేలా కనపడ్డం లేదు. బతికుంటే బలుసాకైనా తినచ్చు కానీ మస్క్ దగ్గర పనిచేయకూడదని నిర్ణయానికి వచ్చారు. (Google Layoffs ఉద్యోగులకు షాకింగ్ న్యూస్: 10 వేలమంది ఇంటికే!) ఉద్యోగాలు పీకేయడం అనేది ఇలాన్ మస్క్ ఒక్కరే చేస్తున్నది. కాదు. మస్క్ ఈ సంక్షోభంలో ఉండగానే ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ పదివేల మంది ఉద్యోగులపై వేటు వేయడానికి సిద్ధమైంది. ఎవరెవరికి పింక్ స్లిప్లులు ఇవ్వాలో జాబితాలు సిద్దం చేయిస్తోంది. ట్విటర్, అమెజాన్ లేనా తానేమన్నా తక్కువ తిన్నానా అనుకున్న మెటా కంపెనీ అధినేత జుకర్ బర్గ్ 11 వేల మందిని అర్జంట్ గా ఇంటికి పంపేసి ఖర్చులు తగ్గించేసుకోవాలని డిసైడ్ అయిపోయారు. మైక్రోసాఫ్ట్, యాపిల్, స్నాప్, సేల్స్ ఫోర్స్, లిఫ్ట్, స్ట్రైప్, బైజూస్ ,ఇంటెల్ వంటి టాప్ బ్రాండ్ ఐటీ కంపెనీలన్నీ కూడా వీలైనంత మేరకు ఖర్చులు తగ్గించుకోడానికి ఎంతో కొంత మంది ఉద్యోగులను ఇంటికి పంపాలన్న ఆలోచనతోనే ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో సాఫ్ట్ వేర్ రంగంలో ఇపుడు ఇదే అతి పెద్ద సంక్షోభం. దీని ప్రభావం యువతపై తీవ్రంగానే ఉంటుందంటున్నారు నిపుణులు. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు వీధిన పడితే నిరుద్యోగ సమస్య వెక్కిరించడం ఖాయం. కొత్తగా ఐటీ రంగంలో అడుగు పెట్టాలనుకునే నిపుణులకు అవకాశాలు దొరుకుతాయో లేదో తెలీని సందిగ్ధ పరిస్థితి. ఇక దీని ప్రభావం భారత దేశంపై ఎలా ఉంటుందనే ఆందోళన తీవ్రమవుతోంది. ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద ఐటీ రంగంలో అడుగుపెట్టే నిపుణులు ఎక్కువ సంఖ్యలో ఉండేది భారత్ నుంచే. చాలా దేశాలకు భారతీయ యువతే చీప్ లేబర్. అంతే కాదు భారతీయులే ఈ రంగంలో తిరుగులేని నైపుణ్యాలతో రాణించడమే కాకుండా కష్టపడి పనిచేస్తారన్న పేరూ ఉంది. అందుకే ఈ సంక్షోభం ప్రపంచ దేశాలన్నింటినీ వణికిస్తే వణికించవచ్చు కానీ ఇది పరోక్షంగా భారతీయులకు వరమే అవుతుందని నిపుణులు అంటున్నారు. కాకపోతే భారతీయ ఐటీ కంపెనీలకు మాత్రం కాస్త కష్టాలు తప్పకపోవచ్చు. ఎందుకంటే మన ఐటీ కంపెనీలకు బిజినెస్ ఇచ్చేదే అమెరికా కంపెనీలు. ఆ కంపెనీలే సంక్షోభంలో ఉంటే దానికి అనుగుణంగా మన ఐటీ కంపెనీలకు వచ్చే బిజినెస్సూ తగ్గుతుంది. ఉద్యోగులకు మాత్రం ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఇంతకీ ఎందుకీ సంక్షోభం? ఎందుకిలా ఉన్నట్లుండి ఓ సీజన్ మొదలైనట్లు ఉద్యోగాలు ఊడబీకుతున్నారు. వేల సంఖ్యలో ఉద్యోగులపై వేటు వేస్తున్నారు.? దీనికి బీజం 2020 ఆరంభంలోనే పడింది. ప్రపంచం మొత్తాన్ని గడ గడ లాడించిన కరోనా మహమ్మారి అన్ని రకాల వ్యవస్థలనూ చితక్కొట్టేసింది. ఆర్ధిక వ్యవస్థలయితే మరీ ఘోరంగా దెబ్బతినేశాయి. అప్పుడే వేలాది కంపెనీలు మూత పడ్డాయి. లక్షలాది మంది ఉద్యోగులు వీధిన పడ్డారు. ఆర్ధిక మాంద్యం అందరికీ నరకం చూపించింది. రెండేళ్ల పాటు దుర్భర పరిస్థితులే తిష్ట వేశాయి. కరోనా నుండి ప్రపంచం అయితే బయట పడింది. కాకపోతే కరోనా చావుదెబ్బ తీసిన వ్యవస్థలు మాత్రం ఇప్పటికీ పూర్తి స్థాయిలో కోలుకోలేదు. ఇపుడిపుడే నెమ్మదిగా ఒక్కో వ్యవస్థా ఊపిరి పీల్చుకునే ప్రయత్నం చేస్తోంది. సరిగ్గా ఈ దశలోనే మరో ఆర్ధిక మాంద్యం తరుముకు వస్తోంది. ప్రపంచాన్ని భయపెట్టడానికి 2023లో మరో ఆర్ధిక మాంద్యం రాబోతోందన్నది ఆర్ధిక వేత్తల అంచనా. అది కనీసం ఎనిమిది నెలల పాటు పట్టి పీడిస్తుంది. ఇప్పటికే కరోనా కారణంగా వ్యాపారాలు లేక లాభాలు ఆవిరైపోయి నష్టాల ఊబిలో కూరుకుపోతోన్న సంస్థలకు ఆర్ధిక మాంద్యం పేరు చెబితేనే వణుకు పుడుతోంది. అందుకే కాస్ట్ కటింగ్ ఆలోచనలో పడ్డారు అంతా. అంటే ఉన్నంతలో అనవసర ఖర్చులను తగ్గించుకోవాలనుకున్నారు. అనవసర ఖర్చుల్లో కంపెనీలకు ముందుగా కనిపించేవి అదనపు ఉద్యోగులే. తమ దగ్గర పనిచేస్తోన్న ఉద్యోగుల్లో ఎంతమందికి చేతి నిండా పని ఉంది? ఎందరు పనిలేక కాలక్షేపం చేస్తున్నారు? అన్నది చూస్తారు. ఒక వేళ అందరికీ చేతి నిండా పని ఉన్నా అందులో నాణ్యమైన పని చేసేవాళ్లు ఎంత మంది? నామమాత్రంగా పని చేశామంటే చేశాం అనిపించుకునే వాళ్లు ఎంతమంది? అన్న అంశంపై దృష్టి సారిస్తారు. ఆ తర్వాత వారిలో ఎంతమందిపై వేటు వేస్తే ఎంత ఖర్చు తగ్గుతుంది? సంస్థకు ఎంత ఆదా అవుతుంది? అన్నది చూస్తారు. ఈ లెక్కలన్నీ చూసుకున్న తర్వాతనే ఉద్యోగాలు ఊడబీకే పనిలో పడతారు. మస్క్ కంపెనీ తన చేతికి రాకముందే సగానికి పైగా ఉద్యోగులను తీసేయాలని ముందస్తుగానే ఓ నిర్ణయానికి వచ్చేశాడు. వచ్చే ఆర్ధిక మాంద్యం ఎనిమిది నెలలే ఉంటుందా? లేక ఆ తర్వాత అది మరి కాస్త ముదురుతుందా అన్నది ఇపుడే చెప్పలేం. కాకపోతే ఆర్ధిక వేత్తలు గత అనుభవాల ఆధారంగా వేసుకున్న అంచనాల ప్రకారం ఎనిమిది నెలల కంటే మాంద్యం ఉండే అవకాశాలు లేవంటున్నారు. కాలం కలిసొస్తే ఎనిమిది నెలల లోపే సంక్షోభం కనుమరుగు కావచ్చునని కూడా అంటున్నారు. (Twitter Hirings: ఎట్టకేలకు శుభవార్త చెప్పిన మస్క్,ఇండియన్ టెకీలకు గుడ్ న్యూస్) ఆ పరిస్థితి వచ్చే వరకు ఐటీ కంపెనీలే కాదు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను కలిగి అంతంత మాత్రంగా వ్యాపారాలు చేస్తోన్న ప్రతీ ఒక్కరూ ఉద్యోగుల మెడపై కత్తులు వేలాడదీయడం ఖాయం అంటున్నారు మేథావులు. సంక్షోభం ముగిశాక మళ్లీ పెద్ద సంఖ్యలో మానవవనరులు అవసరం కాగానే కంపెనీలు రిక్రూట్ మెంట్ల వైపు మొగ్గు చూపుతాయి. అంటే చేతిలో పని రాగానే ఉద్యోగులను నియమించుకుంటారు. వ్యాపారం తగ్గిన తర్వాత ఉన్న ఉద్యోగులపై వేటు వేస్తారు. సరఫరాకీ డిమాండ్ కీ మద్య ఉన్న సంబంధమే కంపెనీల్లో ఉద్యోగుల హైరింగ్ కూ ఫైరింగ్ కూ మధ్య ఉంటుందంటున్నారు ఆర్ధిక రంగ నిపుణులు. (బ్లూటిక్ వెరిఫికేషన్ ఫీజు: మరోసారి బ్రేక్, ఎందుకంటే?) అమెరికా వంటి దేశంలో ప్రస్తుతం మొదలైన సంక్షోభం కారణంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఇంటికి వెళ్లక తప్పదు. వారికి కొత్తగా ఉద్యోగాలు దొరకాలంటే చాలా కష్టం. బాగా నైపుణ్యాలు ఉన్న కొద్ది మందికి ఎక్కడో ఒక చోట దొరకచ్చుకానీ ఓ మాదిరి నైపుణ్యాలతో కాలక్షేపం చేసేవారికి అంత ఈజీగా ఉద్యోగాలు దొరకవంటున్నారు నిపుణులు. మస్క్ భారత దేశంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను వీధిన పడేశారు. అమెరికాలో సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు పోయే వారి భవిష్యత్ కొద్ది నెలల పాటు చీకటే. సాఫ్ట్వేర్ రంగంలో కొత్తగా పట్టభద్రులైన వారిల ప్రస్తుత ట్రెండ్ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే ఫ్రష్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు అంత తేలిగ్గా రావంటున్నారు నిపుణులు. ఉద్యోగులు ఇచ్చే పరిస్థితి లేనపుడు వీసాలూ కష్టమవుతాయి. ఇది భారత్ వంటి దేశాలపై ప్రభావం చూపచ్చు. కాకపోతే అది కలకాలం ఉండదంటున్నారు. ఈ సంక్షోభం నుండి అందరికన్నా ముందుగా బయటపడేది దీన్ని కూడా తమకు అనుకూలంగా మలుచుకునేది భారత్ ఒక్కటే అంటున్నారు. పాశ్చ్యాత్య దేశాల్లో నెలకొన్న సంక్షోభం భారతీయ యువతకు ఒక విధంగా వరమే అంటున్నారు మేథావులు. అమెరికా వంటి దేశాల్లో ఖర్చులు తగ్గించుకోడానికి ఉద్యోగులను ఇంటికి పంపుతోన్న కంపెనీలు తక్కువ వేతనాలకు దొరికే భారతీయ యువతను రిక్రూట్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వారు అంటున్నారు. కరోనా మహమ్మారి రెండేళ్ల పాటు అన్ని వ్యవస్థలనూ నమిలేయడం వల్లనే సంక్షోభం వెంటాడుతోందని మేథావులు అంటున్నారు. దీన్నుంచి పూర్తిగా బయట పడ్డానికి మరో అయిదేళ్లుకు పైనే పట్టచ్చన్నది వారి అంచనా. వచ్చే ఏడాది మొదటి ఆరు నెలలూ ఈ సంక్షోభం ఉండచ్చంటున్నారు నిపుణులు. ఆ తర్వాత మళ్లీ ఉద్యోగ మేళాలు పెద్ద ఎత్తున పుంజుకనే అవకాశాలుంటాయని వారు అంచనా వేస్తున్నారు. -సీఎన్ఎస్ యాజులు, కన్సల్టింగ్ ఎడిటర్, సాక్షి టీవీ -
లక్ అంటే టెకీలదే: అట్లుంటది ఐటీ కొలువంటే!
ముంబై: భారతీయ ఐటీ నిపుణులకు ఈ ఏడాది బాగా కలిసి వస్తోంది. టాప్ ఐటీ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీలు తమ ఉద్యోగుల జీతాలను భారీగా పెంచనున్నాయిట. గత కొన్ని త్రైమాసికాల్లో అట్రిషన్ రేటు భారీగా ఉండటంతో, ఉద్యోగులను, ముఖ్యంగా ఐటీ నిపుణులను నిలుపుకునేందుకు తంటాలు పడుతున్నాయి. ఏకంగా 70 నుంచి 120 శాతం దాకా తమ ఉద్యోగులను జీతాలను పెంచేందుకు నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో అనేక ఐటీ కంపెనీలు వేతనాల పెంపు, బోనస్ చెల్లింపుల లాంటి బంపర్ ఆఫర్లు ఇస్తున్నాయి. ఇప్పటికేచ చాలా కంపెనీల్లో జాయినింగ్ బోనస్ ను భారీ ఎత్తునే ఆఫర్ చేస్తున్నాయి. ఈ జాబితాలో విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ లాంటి దిగ్గజాలతో పాటు ఇతర టాప్ కంపెనీలున్నాయి. వ్యాపారాలు జీతాలు పెంచడం, బోనస్ సహా, ఇతర ప్రయోజనాలను అందించడం ద్వారా తమ ఉద్యోగులను నిలుపుకునేందుకు చూస్తున్నాయని మింట్ రిపోర్ట్ చేసింది. ఈ సమస్యలకు తోడు, సంస్థలో జీతాల పెంపు ఉండదనే వదంతుల నేపథ్యంలో ఈ సెప్టెంబరులోనే జీతాల పెంపు యథాతథంగా ఉంటుందని విప్రో స్పష్టం చేసింది. అంతేకాదు బెస్ట్ ఉద్యోగులకు మిడ్-మేనేజ్మెంట్ స్థాయిలో ప్రమోషన్లను కూడా ఇవ్వనుంది. ఇన్ఫోసిస్ ఇన్ఫోసిస్‌లో కూడా అట్రిషన్ రేటు ఎక్కువగానే ఉంది. ఇది కంపెనీ స్వల్పకాలిక లాభదాయకతపై ప్రభావంచూపుతుంది. జూన్ 2022తో ముగిసిన త్రైమాసికంలో అట్రిషన్ రేటు 27.7శాతం నుండి 28.4 శాతానికి పెరిగింది. దీన్నిగణనీయంగా తగ్గించాలని కంపెనీ యోచిస్తోంది. హైరింగ్ అండ్ కాంపిటేటివ్ కాంపెన్సేటివ్ రివిజన్ల ద్వారా టాలెంట్‌లో వ్యూహాత్మక పెట్టుబడులతో బలమైన వృద్ధిని సాధించ నున్నామని ఇన్ఫోసిస్ సీఎఫ్ఓ నీలాంజన్ రాయ్ వెల్లడించారు. ఇది తక్షణమే మార్జిన్లపై ప్రభావం చూపినప్పటికీ, ఇది అట్రిషన్ స్థాయిలను తగ్గించి, భవిష్యత్తు వృద్ధికి మంచి స్థానాన్ని ఇస్తుందన్నారు. టీసీఎస్ దేశీయ అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్‌లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ అధిక అట్రిషన్ రేటు 19.7గా ఉంది. దీన్ని తగ్గించుకునేందుకు 5 నుంచి 8 శాతం వేతనాల పెంపు అఫర్ చేస్తున్నామని టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ ప్రకటించారు. మంచి నైపుణ్యం కనబర్చిన వారికి వేతనం వృద్ధి మరింత ఉంటుందని ప్రకటించడం విశేషం. మిగిలిన టాప్ ఐటీ కంపెనీల్లో కూడా ఇదే ధోరణి కనిపిస్తోందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
ఆన్‌లైన్‌లోకి ఆటో మొబైల్.. భారీగా నియామకాలు!
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ కంపెనీలు టెక్ నిపుణుల వెంట పడ్డాయేంటి? అన్న సందేహం రాకమానదు. కానీ, కరోనా అనంతరం మారిన పరిస్థితులు, ముఖ్యంగా ఆటోమొబైల్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పుల నేపథ్యంలో కంపెనీలు టెక్నాలజీ నిపుణులపై పెద్ద ఎత్తున ఆధారపడడం తప్పడం లేదు. అధిక వేతనం ఆఫర్ ఇంతకుముందు ఎన్నడూ లేనంతగా టెక్నాలజీ నిపుణులను ఆటోమొబైల్ కంపెనీలు నియమించుకుంటున్నాయి. 35–40 శాతం అధిక వేతన ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. పెద్ద ఎత్తున డిజిటైజేషన్ నడుస్తుండడం.. వినియోగదారులు ఆన్లైన్లో కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇస్తుండడం కారణంగా.. ఆన్లైన్ విక్రయాలను పెంచుకునే దిశగా కంపెనీలు అడుగులు వేస్తున్నాయి. అదే సమయంలో సరఫరా వ్యవస్థలో సమస్యలను అధిగమించేందుకు.. కొనుగోళ్లు, తయారీ కార్యక్రమాల పర్యవేక్షణకు టెక్నాలజీయే కీలకమని అవి గుర్తించాయి. వీరికి డిమాండ్ టీమ్‌లీజ్ సంస్థ వద్దనున్న సమాచారాన్ని పరిశీలిస్తే.. ఆటోమొబైల్ పరిశ్రమలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ), డేటా సైన్స్, డేటా ఇంజనీరింగ్ నిపుణల నియమాకాలు కరోనా ముందు 2019తో పోలిస్తే 45 శాతం పెరగడం గమనార్హం. ‘‘గత రెండేళ్ల నుంచి వినియోగదారులు ఆన్లైన్ వేదికలపై వాహనాల గురించి తెలుసుకొని, కొనుగోలు చేయడం పెరిగింది. దీంతో ఆటోమోటివ్ కంపెనీలు కార్యకలాపాలను డిజిటైజ్ చేసి, వర్చువల్ విక్రయాలకు (ఆన్లైన్) వీలు కల్పించేందుకు, సౌకర్యం, సమర్థత పెంచేందుకు ఎక్కువ సమయం కృషి చేస్తున్నాయి’’ అని టీమ్‌లీజ్ డిజిటల్ ఏవీపీ (డైవర్సిఫైడ్ ఇంజనీరింగ్) మునీరా లోలివాలా చెప్పారు. వాహన తయారీదారులు తమ డీలర్ నెట్‌వర్క్‌ను కూడా డిజిటల్‌గా మార్చేందుకు పెట్టుబడులు పెడుతున్నాయి. ఖర్చులను తగ్గించుకోవడం, డీలర్ల స్థాయిలో వనరులను మెరుగ్గా వినియోగించుకోవడంతోపాటు.. మొత్తం కొనుగోలు ప్రక్రియను మార్చే దిశగా కంపెనీలు అడుగులు వేస్తుండడాన్ని గమనించాలి. ఇంత పెద్ద స్థాయిలో టెక్నాలజీని అందిపుచ్చుకోవడం నిపుణుల అవసరాలను గణనీయంగా పెంచినట్టు లోలివాలా చెప్పారు. డిజిటల్ మార్కెటింగ్, వినియోగదారుల సేవలు, వాహన ముందస్తు నిర్వహణ విభాగాల్లో నియామకాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15 శాతం అధికంగా ఉండొచ్చన్న అంచనాను వ్యక్తం చేశారు. మూడు నెలల్లోనే 18 వేల మంది.. ప్రస్తుత త్రైమాసికంలోనే (జూలై–సెప్టెంబర్) 18,000 టెక్నాలజీ ఉద్యోగాలకు డిమాండ్ ఏర్పడినట్టు లోలివాలా తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఈ సంఖ్య 25,000ను చేరుకోవచ్చని ఆమె చెప్పారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ డిమాండ్ 15–18 శాతం పెరగొచ్చని అంచనా వేశారు. విక్రయాలు, మార్కెటింగ్ విభాగాల్లో డేటా అనలిటిక్స్ నిపుణుల నియామకాలను పెంచినట్టు కార్ల తయారీ సంస్థలు సైతం అంగీకరిస్తున్నాయి. వినియోగదారులు డిజిటల్ చానళ్లవైపు మళ్లడంతో విచారణ నిర్వహణకు హైపర్ లోకల్ విధానాన్ని అనుసరిస్తున్నట్టు మారుతి సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ‘‘ప్రస్తుతం 35 శాతం విచారణలు (కొనుగోళ్లకు సంబంధించి వివరాలు) డిజిటల్ చానళ్ల నుంచే వస్తున్నాయి. గతంతో పోలిస్తే 3 శాతం పెరిగింది. లాక్డౌన్ల సమయాల్లో అయితే ఇది 50 శాతం వరకు ఉంది’’ అని శ్రీవాస్తవ వివరించారు. విక్రయాలకు సంబంధించి 26 టచ్పాయింట్లకు గాను 24ను డిజిటల్‌గా మార్చినట్టు.. మిగిలినవి కేవలం పరీక్షల కోసం ఉద్దేశించినవిగా చెప్పారు. ‘‘డిజిటల్ టూల్స్‌తో మా ప్లాట్‌ఫామ్‌ను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాం. కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో డేటాను ఉపయోగించుకుని కొనుగోలుదారులకు సౌకర్యవంతమైన అనుభవాన్ని అందించాలన్నది మా ప్రయత్నం. ఇటువంటి అధునాతన డిజిటల్ టూల్స్ వినియోగం వల్ల సీఆర్ఎం కార్యకలాపాలకు సంబంధించి నియామకాల్లో డేటా అనలిటిక్స్‌కు ప్రాధాన్యం ఎక్కువగా ఇస్తున్నాం’’ అని శ్రీవాస్తవ తెలిపారు. హ్యుందాయ్ మోటార్ ఇండియా సైతం సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ విభాగాల్లో అధిక నైపుణ్యాలున్న వారిని నియమించుకోవడానికి ప్రాధాన్యం ఇస్తోంది. డిమాండ్ ఇలా... - ఆటోమొబైల్ రంగంలో ఈ త్రైమాసికంలోనే 18,000 నిపుణులకు డిమాండ్ నెలకొంది. - ఈ ఆర్థిక సంవత్సరంలో 25,000 నియామకాలకు డిమాండ్ పెరగొచ్చన్న అంచనా. - 2022–23లో ఇటువంటి నిపుణులకు 15–18% అదనపు డిమాండ్ ఉండొచ్చు. - ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీల్లో చేయి తిరిగి నిపుణులకు డిమాండ్ 45 శాతం పెరిగింది. - 35–40 శాతం అధిక వేతనాలతో కంపెనీలు ఆఫర్లు ఇస్తున్నాయి. చదవండి: ఉద్యోగుల కోసం పోటీ పడుతున్న కంపెనీలు -
ఐటీ కొలువుల మేళా: భారీగా టెకీల నియామకం!
న్యూఢిల్లీ: ఐటీ ఉద్యోగులకు శుభవార్త. ఈ ఏడాది దేశంలో భారీగా నియామకాలు చేపట్టనున్నట్లు టిసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ వంటి దేశీయ దిగ్గజ సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. ఇప్పుడు ఆ జాబితాలో స్విట్జర్లాండ్ కు చెందిన క్రెడిట్ సూయిస్ వచ్చి చేరింది. అంతర్జాతీయ బ్యాంక్ సేవలకు టెక్నాలజీ కేంద్రంగా భారతదేశాన్ని నిలబెట్టడానికి క్రెడిట్ సూయిస్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ నియామకాలను చేపడుతున్నట్లు బ్యాంక్ తెలిపింది. ఐటీ నిపుణులకు డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో ఈ ఏడాది ఇండియాలో వేయికి పైగా టెకీల నియామకానికి ప్రణాళికలు రచించినట్లు స్విస్ బ్యాంక్ దిగ్గజం క్రెడిట్ సూస్ వెల్లడించింది. సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, క్లౌడ్, ఎపీఐ డెవలప్మెంట్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలకు సంబందించిన డెవలపర్లు, ఇంజనీర్లను ఎంచుకొనున్నట్లు తెలిపింది. గత మూడేళ్లలో 2 వేల మంది ఐటి ఉద్యోగులను బ్యాంక్ నియమించుకున్నట్లు పేర్కొంది. క్రెడిట్ సూయిస్ లక్ష్యం భారతదేశంలో అందుబాటులో ఉన్న నైపుణ్యం కలిగిన సాంకేతిక ప్రతిభావంతుల అంతర్గత సామర్థ్యాలను మరింత మెరుగుపరచడం అని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బ్యాంకు ఐటి సిబ్బందిలో భారతీయులు ఇప్పుడు దాదాపు 25 శాతం వాటాను కలిగి ఉన్నారు. చదవండి: ఈ పోటీలో గెలిస్తే రూ.50 వేలు మీ సొంతం? -
‘వాట్సాప్’.. అంతా ఓకేనా?
ఆ రంగం ఈ రంగం అని లేదు.. ఇప్పుడు అన్ని రంగాల వారు కరోనాతో బాధపడుతున్నారు. ఐటీ రంగమూ ఇబ్బందిపడుతోంది. హైదరాబాద్, సైబరాబాద్‌లలో పెద్ద సంఖ్యలో ఐటీ ఉద్యోగులు నివసిస్తున్నారు. వారిలో కుటుంబాలకు దూరంగా ఉంటున్నవాళ్లు, బ్యాచిలర్లు చాలా మంది ఉన్నారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇలాంటి వారికి తోడ్పాటు అందించేందుకు కొందరు కార్పొరేట్ ఉద్యోగులు తామే కుటుంబంగా మారారు. ఓ వాట్సాప్ గ్రూప్ ద్వారా చేయూత అందిస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్ సెకండ్ వేవ్ వేళ.. కాలక్షేపపు, అపోహలు పెంచే వాట్సాప్ గ్రూప్‌లకు భిన్నంగా తెలంగాణ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ కౌన్సిల్ (టీఎఫ్‌ఎమ్‌సీ) కరోనా హెల్ప్ డెస్క్ వాట్సాప్ గ్రూప్ పనిచేస్తోంది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో నెల రోజుల కింద టీఎఫ్‌ఎమ్‌సీ ఏర్పాటైంది. ఆస్పత్రుల్లో బెడ్స్, ప్లాస్మా, కోవిడ్ పేషెంట్‌కి ఫోన్ కన్సల్టేషన్, రోగులు సమీపంలోని ఆస్పత్రులకు చేరేందుకు సహకరించడం, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అందేలా తోడ్పడటం, అంబులెన్స్ సపోర్ట్.. వంటి సాయాన్ని ఆ గ్రూప్ ద్వారా అందిస్తున్నారు. ఒత్తిడిలో ఉన్నారు సైబరాబాద్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 1,500కి పైగా ఐటీ కార్యాలయాలకు చెందిన దాదాపు 6.5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని టీఎఫ్ఎంసీ వాట్సాప్ గ్రూప్ నిర్వాహకుడు ఎం.సత్యనారాయ ణ చెప్పారు. ఐటీ పరిశ్రమలో పనిచేసే కొందరు ప్రస్తుత పరిస్థితుల్లో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, ఈ నేపథ్యంలో వారికి మద్దతు అవసరమని గుర్తిం చి గ్రూప్‌ను నెలకొల్పామని తెలిపారు. ఈ వాట్సా ప్ గ్రూప్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ సేవలు అందిస్తుందని చెప్పామ ని.. కానీ దాదాపు రోజు మొత్తం పనిచేయాల్సి వస్తోందని పేర్కొన్నారు. తమ గ్రూప్‌లో ప్రస్తుతం 200 మంది సభ్యులు ఉన్నారన్నారు. నిజమైన సాయం కోసం టీఎఫ్‌ఎమ్‌సీ కరోనా హెల్ప్ డెస్క్ ఒక వాట్సాప్ డెస్క్. దీనిని విభిన్న సంస్థలకు చెందిన మోహిని, షానోజ్, గిరీష్, సత్యనారాయణ, శ్రుతి, సంధ్య, స్వప్న, రమాకాంత్, శ్రీనివాస్ తదితరులు అడ్మిన్స్‌గా నిర్వహిస్తున్నారు. వాట్సాప్, ఇతర సోషల్ మీడియా గ్రూపుల్లో వివిధ అవసరాల కోసం సంప్రదించండి అంటూ షేర్ అవుతున్న నంబర్లలో 90 శాతం నకిలీవేనని వారు చెప్తున్నారు. తాము మాత్రం వీలైనంత వరకు సాయం అందించే ఉద్దేశంతో గ్రూప్ ఏర్పాటుచేశామని స్పష్టం చేస్తున్నారు. మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంత నివాసితులు, ఐటీ ఉద్యోగులకే ప్రధానంగా సేవలు అందిస్తున్నా.. మిగతా రంగాల వారికి కూడా వీలును బట్టి తప్పక సహకరిస్తామని అంటున్నారు. తమ హెల్ప్ డెస్క్ వాట్సాప్ నంబర్ 6309371600 ద్వారా అభ్యర్ధనలు తెలుపవచ్చన్నారు. నిరుపేదల కోసం ఆక్సిజన్ హబ్ ఇంట్లో తగినన్ని సౌకర్యాలు సమకూర్చుకోలేని మైల్డ్ లక్షణాలున్న పేద కోవిడ్ రోగుల కోసం టీఎఫ్‌ఎమ్‌సీ ఆధ్వర్యంలో హైదరాబాద్ చందానగర్‌లోని కమ్యూనిటీ హాల్లో ఐసోలేషన్ కమ్ ఆక్సిజన్ హబ్‌ను ఈ గ్రూప్ నెలకొల్పుతోంది. దీనిని గురువారం ప్రారంభించనుంది. ఇందులో 14 రోజుల పాటు ఉచిత వసతి, అన్ని రకాల మందులు, ఆహారం, నర్సింగ్ కేర్‌తో పాటు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, ఆక్సిమీటర్స్ తదితర సదుపాయాలు సిద్ధంగా ఉంచుతున్నారు. ఏకకాలంలో 30 మందికి చోటు కల్పించవచ్చు. జీహెచ్ఎమ్సీ, ఐకియా, హార్స్కో, గ్రామెనెర్, జెనోటీల సహకారంతో దీనిని నిర్వహిస్తున్నామని సత్యనారాయణ తెలిపారు. ఈ హబ్‌లో ఉండగా అత్యవసర పరిస్థితి వస్తే తరలించడానికి అంబులెన్స్‌ను కూడా సిద్ధంగా ఉంచామన్నారు. బెడ్స్ కోసమే ఎక్కువ మాకు గత 10 రోజుల్లో 637 అభ్యర్థనలు వచ్చాయి. 600 అభ్యర్ధనలను మేం ఫుల్‌ఫిల్ చేశాం. ఇందులో 230 వరకూ అన్ని వసతులూ ఉన్న బెడ్స్ కోసం కాగా.. బ్లడ్, ప్లాస్మా కోసం 80, డాక్టర్ కన్సల్టేషన్ కోసం 25, ఆక్సిజన్ సప్లై కోసం 82 అభ్యర్థనలు వచ్చాయి. కేవలం హైదరాబాద్ నుంచి మాత్రమే కాకుండా వైజాగ్, విజయవాడ, నెల్లూర్, వరంగల్, తిరుపతి నగరాల నుంచి కూడా 130 మంది కాల్స్ చేశారు. అంబులెన్స్ గురించి కూడా పెద్ద సంఖ్యలో కాల్స్ వచ్చాయి – మోహిని చైతన్య, టీఎఫ్ఎంసీ సభ్యులు -
గుడ్‌న్యూస్ : టెకీలకు వేతన పెంపు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ నేపథ్యంలో నెలకొన్న అనిశ్చిత పరిస్ధితుల్లోనూ వ్యాపార కార్యకలాపాలను యథావిథిగా కొనసాగించిన ఉద్యోగులకు రివార్డుగా ఐటీ దిగ్గజం విప్రో వేతన పెంపును చేపట్టనుంది. కంపెనీలో 80 శాతం ఉద్యోగులకు డిసెంబర్ 1 నుంచి పెరిగిన వేతనాలను అందించనుంది. బీ3, దిగువ స్ధాయి సిబ్బందికి వేతన పెంపును వర్తింపచేయనున్న విప్రో సీనియర్ ఉద్యోగుల వేతనాల పెంపుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దేశంలో నాలుగో అతిపెద్ద ఐటీ సేవల ఎగుమతిదారు విప్రోలో ప్రస్తుతం 1.85 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా వేతన పెంపుతో దాదాపు 1.5 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. గతంలో మాదిరిగానే అత్యధిక సామర్థ్యం కనబరిచినవారికి ఇంక్రిమెంట్లు అందిస్తున్నామని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. చదవండి : విప్రో లాభం రూ. 2,465 కోట్లు ఈ ఏడాది ఆరంభంలో కరోనా వైరస్ వెంటాడటంతో వేతన పెంపును వాయిదా వేసిన పలు ఐటీ కంపెనీలు తిరిగి వేతన పెంపును, ప్రమోషన్లను ప్రకటిస్తుండటం టెకీల్లో ఆశలు రేపుతోంది. సవాళ్లతో కూడిన సంక్లిష్ట సమయంలోనూ తమ ఉద్యోగులు నిరంతరాయంగా వ్యాపారాన్ని కొనసాగేలా చూడటంతో పాటు అత్యంత నాణ్యమైన సేవలను కొనసాగించారని విప్రో ప్రతినిథి ఓ జాతీయ వెబ్‌సైట్‌తో పేర్కొన్నారు. మధ్య, సీనియర్ శ్రేణిలో కీలక నైపుణ్యాలను కాపాడుకునేందుకు కంపెనీ పలు చర్యలు చేపడుతుందని చెప్పారు. ఇక మరో ఐటీ దిగ్గజం టీసీఎస్ అక్టోబర్ 1 నుంచి వర్తించేలా వేతన పెంపును ప్రకటించగా, జనవరి నుంచి ఉద్యోగులందరికీ వేతన పెంపును చేపడతామని ఇన్ఫోసిస్ ప్రకటించింది. మెరుగైన సామర్ధ్యం కనబరిచినందుఉ ఈ ఏడాడి డిసెంబర్లో ప్రత్యేక ప్రోత్సాహకం అందచేస్తామని వెల్లడించింది. -
టీసీఎస్ ఉద్యోగులకు వేతన పెంపు
ముంబై : కోవిడ్-19తో ఆర్థిక మందగమనం కార్పొరేట్ కంపెనీలను వణికిస్తుంటే తమ ఉద్యోగులందరికీ వేతన పెంపు చేపట్టనున్నట్టు టెక్ దిగ్గజం టీసీఎస్ ప్రకటించింది. కంపెనీలోని అన్ని విభాగాల ఉద్యోగుల వేతనాలను పెంచనున్నట్టు టీసీఎస్ హెచ్ఆర్ వర్గాలు పేర్కొన్నాయని ఓ జాతీయ వెబ్సైట్ వెల్లడించింది. కంపెనీ గతంలో ఇచ్చిన తరహాలోనే అదే ఆనవాయితీని కొనసాగిస్తూ వేతన పెంపును చేపట్టినట్టు టీసీఎస్ హెచ్ఆర్ అధికారి స్పష్టం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తితో ఆర్థిక వ్యవస్థ కుదేలైన క్రమంలో ఐటీ కంపెనీలు కొద్దినెలలుగా వ్యయ నియంత్రణ చర్యలు చేపడుతున్నాయి. చదవండి : టీసీఎస్ మరో బంపర్ బైబ్యాక్ కరోనా కట్టడికి విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో వాణిజ్య, ఆర్థిక రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పలు కంపెనీలు లేఆఫ్‌లు, వేతన కోతలు విధించడంతో పాటు ఏడాది పాటు ప్రమోషన్లు, వేతన పెంపులను నిలిపివేసిన నేపథ్యంలో టీసీఎస్ వేతన పెంపును చేపట్టడం ఐటీ రంగానికి తీపికబురుగా మారింది. మరోవైపు టీసీఎస్‌లో నియామకాల ప్రక్రియా ఊపందుకుంది. భారత్‌లో 7,000 మంది ట్రైనీలను, అమెరికాలో 1000 మందిని ట్రైనీలను నియమించుకోనుంది. -
తెలుగోడి టిక్‌టాక్
-
టెకీల్లో లేఆఫ్స్ గుబులు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న క్రమంలో లక్షలాది మందికి ఉపాథి కల్పించే ఐటీ పరిశ్రమ భారీ కుదుపులకు లోనవుతుంది. మహమ్మారి వ్యాప్తితో డిమాండ్ కొరవడిన కారణంగా పలు ఐటీ కంపెనీలు ఉద్యోగులను మూకుమ్మడిగా తొలగించడం ఆందోళన రేకెత్తిస్తోంది. రాబోయే రోజుల్లో డిమాండ్ మెరుగుపడనిపక్షంలో భారత్‌లో సైతం ఇదే పరిస్థితి నెలకొంటుందని టెకీల్లో గుబులు మొదలైంది. ఇప్పటికే ఐటీ కంపెనీలు సామర్థ్యం కనబరచని ఉద్యోగులను ఇంటికి పంపుతున్నామని చెబుతుండగా, మరికొన్ని కంపెనీలు ప్రాజెక్టులు లేవంటూ సిబ్బందిని వదిలించుకుంటున్నాయి. ప్రస్తుత వ్యాపార పరిస్థితుల్లో అనిశ్చితి కారణంగా ఐటీ కంపెనీలు లేఆఫ్స్‌కు దిగాయని ఇటీవల పలు కంపెనీలు ఉద్యోగులను తగ్గిస్తున్న ధోరణి ఆధారంగా ఓ జాతీయ వెబ్సైట్ కథనం పేర్కొంది. తాజా ప్రాజెక్టులు కొనసాగడంపైనా స్పష్టత లేకపోవడంతో కొలువుల కోతకు కంపెనీలు మొగ్గుచూపుతున్నాయి. గత కొన్నేళ్లుగా ఆటోమేషన్తో పలు కంపెనీలు ఉద్యోగులను తగ్గించే పనిలో పడగా తాజాగా కోవిడ్-19తో ఈ పనిని మరింత వేగంగా ఐటీ కంపెనీలు ముందుకు తీసుకువెళుతున్నాయి. ఐబీఎం కార్పొరేషన్ ప్రపంచవ్యాప్తంగా 2000 మంది ఉద్యోగులపై వేటు వేయనుందని వార్తలు వచ్చాయి. ఈ జాబితాలో భారత్‌లో పనిచేసే ఉద్యోగులూ ఉండే అవకాశం ఉంది. ఉద్యోగుల తొలగింపుపై ఐబీఎం ఇంకా నోరుమెదపలేదు. మరో ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ ఇటీవలే భారత్‌లో పలువురు ఉద్యోగులను తొలగించడాన్ని గుర్తుచేస్తూ ఐటీ రంగంలో నెలకొన్న అనిశ్చితికి ఈ పరిణామాలు సంకేతమని చెబుతున్నారు. కోవిడ్-19తో లేఆఫ్స్ ఉండవని ఐటీ కంపెనీలు చెబుతున్నా ఐటీ సేవల డిమాండ్ ఇలాగే కొనసాగితే సామర్థ్యం ఆధారంగా ఉద్యోగులను కుదించే పరిస్థితి ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. చదవండి : లేఆఫ్స్‌పై ముఖ్యమంత్రికి టెకీల లేఖ -
భారతీయ టెక్కీలకు మోదీ సరికొత్త చాలెంజ్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ స్థాయిలో ‘మేడ్ ఇన్ ఇండియా’ యాప్‌లను రూపొందించేందుకు దేశ నలుమూలల ఉన్న సాఫ్ట్వేర్ టెక్కీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ‘ఆత్మనిర్భర్ భారత్ యాప్ ఇన్నోవేషన్ చాలెంజ్’ను ప్రకటించారు. ఇందులో పాల్గొనాలని దేశీయ టెక్ కంపెనీలు, స్టార్టప్‌లను ప్రధాని మోదీ కోరారు. మెయిటీ (MeitY), అటల్ ఇన్నొవేషన్ మిషన్, నీతి ఆయోగ్‌ల సంయుక్తంగా ఈ యాప్ ఇన్నొవేషన్ చాలెంజ్ నిర్వహించనున్నాయి. (చదవండి : భారత్‌కు పెరుగుతున్న మద్దతు!) ‘ప్రస్తుతం యాప్స్ తయారు చేసే ఔత్సాహికులు చాలా మంది ఉన్నారు. టెక్, స్టార్టప్స్‌లో వరల్డ్ క్లాస్ మేడిన్ ఇండియా యాప్స్ తయారు చేయగల సత్తా ఉంది. వారి ఐడియాలు, ఉత్పత్తులకు ప్రోతాహం కల్పించేందుకు ఆత్మనిర్భర్ భారత్ యాప్ ఇన్నొవేషన్ ఛాలెంజ్ నిర్వహిస్తోంది. యాప్స్ విభాగంలో మీకు అనుభవం, టాలెంట్, ఆసక్తి, కొత్త ఐడియాలు సృష్టించగల ఉత్సాహం, ప్లాన్ ఉన్నవారు ఇందులో పాల్గొనవచ్చు’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక టెక్కీలు, స్టార్టప్‌లు మేడిన్ ఇండియా యాప్‌లను డెవలప్ చేసేందుకు ఈ చాలెంజ్ ఉపయోగపడుతుంది. ఇందులో గెలిచిన వారికి బహుమతులతోపాటు పేరు ప్రఖ్యాతులు కూడా దక్కనున్నాయి. ఆయా విభాగాల్లో డెవలప్ చేసే అత్యుత్తమ యాప్‌లకు రూ.2 లక్షల నుంచి రూ.20 లక్షల భారీ నగదు బహుమతులను ఔత్సాహికులు పొందవచ్చు. యాప్‌లు సులభంగా వాడుకునే విధంగా, పూర్తిగా సురక్షితమైన ఫీచర్లు కలిగి ఉండాలి. ఈ చాలెంజ్ వల్ల దేశంలో ఉన్న ఔత్సాహిక యాప్ డెవలపర్లు, స్టార్టప్‌ల నుంచి ప్రతిభను వెలికి తీసేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఈ చాలెంజ్‌కు చెందిన పూర్తి వివరాల కోసం innovate.mygov.in అనే వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. ఈ చాలెంజ్‌లో పాల్గొనాలనుకునే వారు తమ అప్లికేషన్లను జూలై 18, 2020లోపు సమర్పించాలి. -
టెకీలకు ఊరట: మరిన్ని రోజులు ఇంటినుంచే పని!
బెంగళూర్ : లాక్డౌన్ నియంత్రణలను ప్రభుత్వం భారీగా సడలించినా పలు ఐటీ, టెక్నాలజీ కంపెనీలు ఇప్పటికిప్పుడు కార్యాలయాల్లో పూర్తిస్ధాయి సిబ్బందితో పనిచేయించేందుకు సిద్ధంగా లేవు. ఐటీ, టెక్నాలజీ కంపెనీలు ఇంటర్నెట్తో తమ పనులు చక్కబెట్టుకునే అవకాశం ఉండటంతో ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నా ఉత్పాదకతపై ఎలాంటి ప్రతికూల ప్రభావం లేదు. కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తున్న క్రమంలో మరికొద్ది నెలలు ఇదే విధానం కొనసాగించాలని ఐటీ కంపెనీలు యోచిస్తున్నాయి. కార్యాలయాల్లో నామమాత్రపు సిబ్బందిని అనుమతించాలని, అదీ రొటేషన్ విధానంలో అనుసరించాలని మరికొన్ని కంపెనీలు భావిస్తున్నాయి. ఉద్యోగుల వెసులుబాటుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని పలు ఐటీ కంపెనీలు యోచిస్తున్నాయి. 5,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్న గోల్డ్‌మన్ శాక్స్ బెంగళూర్ సర్వీస్ సెంటర్లో మరికొద్ది నెలల పాటు కేవలం 30 శాతం మందినే కార్యాలయం నుంచి పనిచేయించాలని కంపెనీ భావిస్తోంది. జూన్ మాసాంతంలో దశల వారీగా సిబ్బందిని అనుమతించాలని భావిస్తోంది. ఆఫీస్ నుంచి తిరిగి పనిచేయడమనేది ఉద్యోగులు స్వచ్ఛందంగా వారి వెసులుబాటు, సౌకర్యాన్ని బట్టి వారే నిర్ణయం తీసుకుంటారని గోల్డ్‌మన్ శాక్స్ ఇండియా హెడ్ గుంజన్ సంతాని పేర్కొన్నారు. ఇక ఉద్యోగి ప్రతి రెండు వారాలకు ఒక రోజు ఆఫీస్‌లో పనిచేసే విధానంపై సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ కసరత్తు సాగిస్తోంది. తమ కార్యాలయ భవనాల్లో పది శాతం ఉద్యోగులు మాత్రమే ఉండేలా గూగుల్ యోచిస్తోంది. ఇక సెప్టెంబర్ నాటికి భవనాల సామర్ధ్యంలో 30 శాతం వరకూ ఉద్యోగులను రొటేషన్ విధానంలో అనుమతించాలని యోచిస్తోంది. మరోవైపు ఈ ఏడాదంతా ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటును ఉద్యోగులకు కల్పిస్తామని ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ పేర్కొన్న విషయం తెలిసిందే. తొలుత 25 శాతం సిబ్బందితో కార్యాలయాలను తెరిచేందుకు ఫేస్బుక్ సన్నాహాలు చేస్తోంది. చదవండి : లాక్డౌన్ వారికి వరమే! -
లేఆఫ్స్‌పై ముఖ్యమంత్రికి టెకీల లేఖ
ముంబై : కోవిడ్-19 సంక్షోభంలో ఐటీ కంపెనీలు ఉద్యోగుల తొలగింపునకు, వేతన కోతలకు పాల్పడుతున్నాయని పేర్కొంటూ ఐటీ ఉద్యోగుల యూనియన్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాసింది. ఐటీ ఉద్యోగుల జీవనోపాధిని కాపాడేందుకు జోక్యం చేసుకోవాలని సీఎంను ఈ లేఖలో అభ్యర్ధించింది. మహారాష్ట్ర వ్యాప్తంగా పలు ఐటీ, ఐటీ అనుబంధ కంపెనీలు కోవిడ్-19 సాకుతో ఉద్యోగులపై వేటు వేస్తున్నాయని, వారి జీతాలను ఇవ్వకుండా, కోతలు విధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాయని జాతీయ ఐటీ ఉద్యోగుల సెనేట్(ఎన్ఐటీఈఎస్) సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు రాసిన లేఖలో పేర్కొంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు, మార్గదర్శకాలను పూర్తిగా ఉల్లంఘించడమేనని ఎన్ఐటీఈఎస్ ప్రధాన కార్యదర్శి హర్‌ప్రీత్ సలూజా అన్నారు. ఇలాంటి పరీక్షా సమయంలో ప్రభుత్వం ఉద్యోగుల హక్కులను కాపాడేలా ఆయా కంపెనీలను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని లేఖలో కోరింది. చదవండి : టెకీలపై మహమ్మారి ఎఫెక్ట్ -
మహమ్మారి ఎఫెక్ట్ : టెకీలకు ఇన్ఫీ షాక్
ముంబై : కరోనా మహమ్మారి ప్రభావంతో దిగ్గజ ఐటీ కంపెనీలు ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నాయి. లాక్‌డౌన్‌తో ప్రాజెక్టులు నిలిచిపోవడం, కొత్త ఆర్డర్లపై అనిశ్చితితో ఐటీ కంపెనీలు వ్యయ నియంత్రణపై కన్నేశాయి. ఈ ఏడాది దేశీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఉద్యోగులకు వేతన పెంపును, ప్రమోషన్లను పక్కనపెట్టింది. నియామకాలనూ నిలిపివేసిన ఇన్ఫోసిస్ కొంతమేరకు ఉద్యోగులకు ఊరట ఇస్తూ లేఆఫ్స్ ఉండవని ప్రకటించింది. ఇక సోమవారం నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన ఇన్ఫోసిస్ ఈ క్వార్టర్లో కంపెనీ లాభం 6 శాతం వృద్ధితో రూ 4321 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఈ క్వార్టర్లో రాబడి 8 శాతం ఎగిసి రూ 23,267 కోట్లకు చేరిందని తెలిపింది. షేర్‌కు రూ 9.50 చొప్పున ఫైనల్ డివిడెండ్‌ను ప్రకటించింది. కంపెనీ ఇప్పటికే అందించిన జాబ్ ఆఫర్లు కొనసాగుతాయని తెలిపింది. కరోనా అనిశ్చితి నేపథ్యంలో 2021లో కంపెనీ సామర్ధ్యంపై గైడెన్స్‌ను ఇవ్వడం లేదని పేర్కొంది. చదవండి : బ్రిటన్ ఆర్థికమంత్రిగా నారాయణమూర్తి అల్లుడు -
టెకీలపై మహమ్మారి ఎఫెక్ట్..
బెంగళూర్ : కోవిడ్-19 ప్రభావంతో అన్ని రంగాలు కుదేలవుతుంటే ఐటీ ఉద్యోగుల ఆశలపైనా ఈ మహమ్మారి నీళ్లు చల్లింది. కరోనా వైరస్ భయాలతో పలు ఐటీ కంపెనీల సేవలు మందగించడంతో స్లోడౌన్‌ను అధిగమించేందుకు ఆయా కంపెనీలు వేతన పెంపును నిలిపివేయడంతో పాటు బోనస్‌లోనూ కోతలు పెట్టవచ్చని భావిస్తున్నారు. పదేళ్ల కిందట అమెరికా ఆర్థిక సంక్షోభం నాటి పరిస్థితులే ఐటీ రంగంలో పునరావృతమవుతాయనే ఆందోళన నెలకొంది. బోనస్‌లు, ఇంక్రిమెంట్లు వంటి ప్రోత్సాహకాలన్నీ ఇప్పుడు నిలిచిపోయాయని టెక్ మహీంద్ర సీఈవో సీపీ గుర్నానీ ఓ వార్తాసంస్థతో వెల్లడించారు. ప్రజలను సురక్షితంగా ఉంచడంపైనా ఇప్పుడు అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉందని ఆయన చెప్పుకొచ్చారు. కరోనా ప్రభావంతో భారత ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని సూచించారు. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు క్యాంపస్‌ల నుంచి ట్రైనీలను ఇళ్లకు పంపించివేశాయి. అమెరికా, యూరప్ వంటి కీలక మార్కెట్లలో కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉండటంతో 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగ వృద్ధిని విశ్లేషకులు సవరిస్తున్నారు. ఐటీ పరిశ్రమ రాబడి వృద్ధి రేటు 3 నుంచి 8 శాతం తగ్గవచ్చని కొటాక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ అంచనా వేసింది. ఈ ప్రభావం ఉద్యోగలు వేతనాలు, బోనస్‌లు, ఇంక్రిమెంట్లపై ఉంటుందని భావిస్తున్నారు. విప్రో, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు ఈ ఏడాది చివరిలో వేతన పెంపును వర్తింపచేయనున్నాయి. చదవండి : కరోనా భయం: తుమ్మినందుకు చితక్కొట్టారు -
మరో ఇద్దరికి పాజిటివ్?
రాష్ట్రంలో కోవిడ్ కల్లోలం కొనసాగుతోంది. తాజాగా హైదరాబాద్‌లో మరో ఇద్దరికి ఈ వైరస్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఈ ఇద్దరూ మహిళలే. అపోలో ఆస్పత్రిలో పనిచేసే హౌస్ కీపింగ్ వర్కర్‌తోపాటు ఇటీవల ఇటలీ నుంచి వచ్చిన టెకీకి పాజిటివ్ అని తేలింది. అయితే, ఈ విషయంలో మరింత స్పష్టత కోసం వారి నమూనాలను పుణేలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. మంగళవారం గాంధీ ఆస్పత్రిలో 47 మంది అనుమానితుల నుంచి సేకరించిన నమూనాలను పరీక్షించగా.. 45 మందికి నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. కోవిడ్ సోకిందనే అనుమానంతో గాంధీ ఆస్పత్రికి తరలించిన నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డిపల్లి వాసి బాలరాజ్‌కు కూడా వైరస్ సోకలేదని వెల్లడైంది. బుధవారం మరో 36 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు జరుపుతున్నారు. రాష్ట్రంలో తొలి కోవిడ్ కేసు బాధితుడు, మహేంద్రహిల్స్‌కు చెందిన యువకుడి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. ఇక కోవిడ్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. వైరస్ అనుమానం ఉన్న వ్యక్తులు కార్పొరేట్ ఆస్పత్రులతోపాటు మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉండే హాస్పటల్స్‌లో చికిత్స చేయించుకోవచ్చని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ కోవిడ్ కలకలం సృష్టించింది. ఏపీలోని ఐదు జిల్లాల్లో పదిమందికి ఈ లక్షణాలు కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. ఇప్పటివరకు మొత్తం 29 మందికి ఈ మహమ్మారి సోకినట్టు తేలింది. కోవిడ్‌పై ప్రజల్లో ఉన్న అనుమానాలు, అపోహలను తొలగించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) రంగంలోకి దిగింది. ఇది ఎలా వ్యాపిస్తుంది? దీని లక్షణాలు ఏమిటి? ఈ వైరస్‌ను నియంత్రించేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో స్పష్టంచేసింది. సాక్షి, హైదరాబాద్: కోవిడ్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మంగళవారం గాంధీ ఆస్పత్రిలో 47 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షించగా, వీరిలో 45 మందికి నెగెటివ్ వచ్చినట్లు వైద్య ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు అనుమానిత బాధితులకు పాజిటివ్ వచ్చినట్లు తేలిందని వెల్లడించింది. మరింత స్పష్టత కోసం వారి నుంచి రెండోసారి నమూనాలు సేకరించి, పరీక్ష కోసం పుణే వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. వారి రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. కాగా, బుధవారం మరో 36 మంది అనుమానితుల నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు జరుపుతున్నారు. ఇటీవలే ఇటలీ వెళ్లొచ్చి.. తాజాగా కోవిడ్ సోకిన వారిలో ఒకరు అపోలో ఆస్పత్రికి చెందిన హౌస్ కీపింగ్ వర్కర్(మహిళ 40) కాగా, మరొకరు ఇటలీ నుంచి వచ్చిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని (32)ఉన్నారు. ఇటలీ నుంచి వచ్చిన టెకీ గత నెల 28న కొంపెల్లి జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ హోటల్లో బస చేసి, ఆ తర్వాత మరో హోటల్‌కు మారినట్లు తెలిసింది. ఆమెకు పాజిటివ్ రావడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమై, ఆమె పర్యటించిన ప్రాంతాలను, కలిసిన వ్యక్తులను కనిపెట్టే పనిలో పడ్డారు. క్యూ కడుతున్న టెకీలు.. ఇటలీ వెళ్లివచ్చిన సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు కోవిడ్ పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో ఆ కంపెనీలో పని చేస్తున్న టెకీలు గాంధీ ఆస్పత్రికి క్యూ కడుతున్నారు. బుధవారం సాయంత్రం వరకు ఐసోలేషన్ వార్డులో 24 మంది అనుమానితులు చేరినట్లు తెలిసింది. గాంధీ ఐసోలేషన్ వార్డుల్లో 27 పడకలు మాత్రమే అందుబాటులో ఉండటంతో చెకప్ కోసం వస్తున్న ఇంకొందరిని ఫీవర్, చెస్ట్ ఆస్పత్రులకు ప్రత్యేక అంబులెన్స్‌లో తరలిస్తున్నారు. కాగా, తమ కార్యాలయంలోని ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చిందని తెలియడంతో మైండ్ స్పెస్లోని డీఎస్ఎం సాఫ్ట్వేర్ కంపెనీ ఆ కార్యాలయ ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసేలా (వర్క్ ఫ్రం హోమ్) వెసులుబాటు కల్పించింది. గాంధీకి తగ్గిన ఓపీ.. ఓపీ విభాగానికి వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. రోజూ 3 వేల వరకు వచ్చే ఓపీ రోగులు వచ్చేవారు. కానీ బుధవారం మాత్రం 1,236 మందే వచ్చారు. గాంధీ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది సెలవులను రద్దు చేస్తున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్ తెలిపారు. నిలకడగా సాఫ్ట్వేర్ ఆరోగ్యం ప్రస్తుతం కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయి గత రెండు రోజుల నుంచి గాంధీ ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న మహేంద్రహిల్స్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ (24) ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. జ్వరం తగ్గిందని, ఊపిరితిత్తులు, గుండె ఇతర శరీర భాగాలు సక్రమంగా పనిచేస్తున్నాయని వివరించారు. కాగా, బాధితుడి తల్లిదండ్రులతో పాటు అదే ఇంట్లో అద్దెకు ఉంటున్న వారికి పరీక్షలు నిర్వహించగా, కోవిడ్ లేదని నిర్ధారణ కావడంతో బుధవారం వారిని గాంధీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. అయితే వారు ఇళ్లకు చేరుకోగా, కాలనీవాసులు అభ్యంతరం చెప్పారు. వైరస్ పూర్తిగా నియం త్రణ కాకుండా అనుమానితులను అప్పుడే జనావాసాలకు ఎలా పంపిస్తారని ప్రశ్నిస్తున్నారు. కోవిడ్ ఎఫెక్ట్‌తో మాస్క్‌లకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ఎన్–95 మాస్క్‌లు అందుబాటులో లేవని మెడికల్ షాపుల యజమానులు చెబుతున్నారు. ఫీవర్‌లో మరో రెండు.. నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో బుధవారం మరో రెండు అనుమానిత కోవిడ్ వైరస్ కేసులు నమోదయ్యాయి. ఎర్రగడ్డకు చెందిన ఓ యువకుడు(28), మియాపూర్‌కు చెందిన మరో వ్యక్తి(33) ఇటీవల విదేశాలకు వెళ్లి వచ్చారు. కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న వీరు ఫీవర్ ఆసుపత్రికి వచ్చారు. వీరిద్దరినీ ఐసోలేషన్ వార్డులో చేర్చుకుని పర్యవేక్షించారు. వారి నుంచి సేకరించిన నమూనాలను కోవిడ్ పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి పంపారు. కాగా, షాహినాత్నగర్కు చెందిన ఓ వైద్యుడు (53) ఇటీవల విదేశాలకు వెళ్లి వచ్చారు. కోవిడ్ అనుమానంతో బుధవారం ఫీవర్ ఆసుపత్రికి వచ్చారు. అయితే పరీక్షల కోసం ఐసోలేషన్ వార్డులో చేరాలని వైద్యులు సూచించగా, చెప్పాపెట్టకుండా అక్కడి నుంచి ఆ వైద్యుడు వెళ్లిపోయారని ఆస్పత్రివర్గాలు తెలిపాయి. గాంధీ ఆస్పత్రిలో మాస్కులు ధరించి విధులకు హాజరవుతున్న జూనియర్ డాక్టర్లు కోవిడ్.. డబ్ల్యూహెచ్ఓ ‘గైడ్’ ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా ‘కోవిడ్–19’పైనే చర్చ.. వైరస్ ఇలా వ్యాపిస్తుందని.. అలా సోకుతుందని.. ఫలానా జాగ్రత్తలు తీసుకోవాలని బయట వినిపిస్తున్న సలహా సూచనలెన్నో.. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మాత్రం ఇలాంటివి నమ్మొద్దని చెబుతోంది. వైరస్ వ్యాప్తి, తీసుకోవాల్సిన జాగ్ర త్తలపై స్పష్టమైన వివరణ ఇచ్చింది. గాలి ద్వారా సోకుతుందా? సోకదు. వ్యాధి సోకిన వారి శ్వాస లేదా తుమ్ము కారణంగా వెలువడే చిన్న నీటి కణాల ద్వారా మాత్రమే కోవిడ్ ఒకరి నుంచి ఇంకొకరికి సోకుతుంది. మలమూత్రాదుల ద్వారా ఇతరులకు సోకే అవకాశాలు తక్కువ. కోవిడ్ మలంలోనూ ఉన్నట్లు ప్రాథమిక పరిశీలనలు చెబుతున్నా ఈ మార్గంలో ఇతరులకు వ్యాపించడం ప్రస్తుత విస్తృతికి ప్రధాన కారణం కాదు. ఉపరితలంపై వైరస్ జీవితకాలం ఎంత? కొన్ని గంటల నుంచి రోజులపాటు బతికి ఉండవచ్చునని ఇప్పటివరకు జరిగిన అధ్యయనాలు చెబుతున్నాయి. ఏ రకమైన ఉపరితలం?, ఉష్ణోగ్రత, గాల్లో తేమశాతం, వాతావరణం వంటి అంశాలపై ఇది ఆధారపడి ఉంటుంది. చేతుల శుభ్రం ఎందుకు? సోప్, ద్రవం, శానిటైజర్ వంటి వాటితో తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం వల్ల చేతి ఉపరితలంపై వైరస్ ఉంటే నశించిపోతుంది. జలుబు, దగ్గు ఉన్న వారికి దూరంగా ఉండాలా? దగ్గు, తుమ్ములతో బాధపడుతున్న వారికి కనీసం మూడడుగుల దూరంలో ఉండాలి. దగ్గు లేదా తుమ్ముల ద్వారా నోరు, ముక్కు నుంచి బయటకొచ్చే అతిసూక్ష్మ ద్రవకణాల్లో వైరస్ ఉండొచ్చు. దగ్గరగా ఉంటే ఆ ద్రవాలను పక్కనున్న వారూ పీల్చే అవకాశాలు ఎక్కువ. కళ్లు, ముక్కు, నోరు ముట్టరాదా? వైరస్ ఉన్న ఉపరితలాన్ని ముట్టుకున్న చేతులతో ఇతర శరీర భాగాలను ముట్టుకుంటే మనకూ వైరస్ సోకే అవకాశం ఉంటుంది. తుమ్ములొస్తే ఏం చేయాలి? తుమ్మొచ్చినా, దగ్గొచ్చినా అరచేతులతో కాకుండా, మోచేతిని ముఖానికి అడ్డుగా పెట్టుకోవాలి. లేదంటే టిష్యూ పేపర్‌ను ఉపయోగించి, వెంటనే దాన్ని చెత్తబుట్టలో పడేయాలి. ఇలా చేయడం వల్ల కోవిడ్–19 నుంచే కాదు.. సాధారణ జలుబు నుంచి కూడా రక్షణ లభిస్తుంది. మందు, వైద్యం ఉన్నాయా? ప్రస్తుతానికి లేవు. యాంటీ వైరల్ మందులు కూడా అభివృద్ధి చేయలేదు. అయితే కోవిడ్ బాధితులకు ఉన్న రోగ లక్షణాలను తగ్గించేందుకు కొన్ని మందులు వాడతారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ మరణాల రేటు 3.4% మాత్రమే. అంటే వంద మందికి వ్యాధి సోకితే 97 మంది చికిత్సతో స్వస్థత పొందుతారు. కోవిడ్ కు విరుగుడుగా కొన్ని వ్యాక్సిన్లను ప్రస్తుతం పరీక్షిస్తున్నారు. మాస్క్‌లు అందరికీ అక్కర్లేదు.. దగ్గు, జలుబు వంటి శ్వాస సంబంధ సమస్యలు లేనివారికి మాస్కులతో పనిలేదు. కోవిడ్–19 లక్షణాలు (జ్వరం, దగ్గు) ఉన్న వారే మాస్కులు తొడుక్కోవాలని డబ్ల్యూహెచ్ఓ సూచిస్తోంది. కోవిడ్ వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించే వైద్య సిబ్బంది మాత్రం మాస్కులు తప్పనిసరిగా వాడాలి. తద్వారా నిజంగా అవసరమున్న వారికి మాస్కులు అందుబాటులో ఉంటాయని చెబుతోంది. సోపు, శానిటైజర్లతో చేతుల్ని శుభ్రం చేసుకున్నాకే మాస్కులు ముట్టుకోవాలి. లోహపు పట్టీ ఉన్న భాగం ముక్కు వద్ద ఉండాలి. ముక్కు, నోరు పూర్తిగా కప్పి ఉండేలా చూడాలి. వాడేశాక మాస్క్ ఉపరితలాన్ని తాకకుండానే చెత్తబుట్టలో వేయాలి. చేతులు శుభ్రంగా కడుక్కున్నాకే ఇతర పనులు చేపట్టాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.. కోవిడ్–19 లక్షణాలు బయటపడేందుకు ఒకటి నుంచి 14 రోజులు పడుతుంది. శరీరంలోకి వైరస్ ప్రవేశించాక ఐదు రోజులకల్లా లక్షణాలు కనిపిస్తాయి. ధూమపానాన్ని మానేయాలి. నాటువైద్యం జోలికి వెళ్లొద్దు. ఒకటికి రెండు మాస్కులు ధరిస్తే రక్షణ లభిస్తుందనుకోవడం సరికాదు. సొంత వైద్యం, యాంటీబయాటిక్‌లు వద్దు. అనారోగ్యంగా అనిపిస్తే ఇంట్లోనే ఉండిపోవాలి. జ్వరం, దగ్గు లేదా ఊపిరిపీల్చుకోవడంలో ఇబ్బంది ఎదురైతే వైద్య సహాయం తీసుకోవాలి. అంతర్జాతీయంగా కోవిడ్ సమాచారం ఎప్పటికప్పుడు వైద్యవ్యవస్థకు అందుబాటులో ఉంటుంది కాబట్టి.. ప్రభుత్వ వైద్యుల సలహా సూచనలు పాటించడం మేలు. కోవిడ్‌కు ఎక్కడ చికిత్స అందిస్తున్నారో కూడా ప్రభుత్వ వైద్యులకే తెలిసి ఉంటుంది. యాంటీబయాటిక్స్‌తో తగ్గుతుందా? కోవిడ్–19.. వైరస్ కారణంగా వచ్చే జబ్బు. కాబట్టి యాంటీబయాటిక్‌లు పనిచేయవు. వ్యాధి నివారణకు, చికిత్సకు యాంటీబయాటిక్‌లు వాడటం వల్ల ప్రయోజనం లేదు. – డబ్ల్యూహెచ్ఓ భయమేల! పరిశుభ్రతతో పారదోలుదాం... కోవిడ్.. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వైరస్. ఈ పేరు వింటేనే జనం గజగజా వణికిపోతున్నారు. కోవిడ్ లక్షణాలు కనిపించిన వ్యక్తిని విలన్లా చూస్తున్నారు. తమకు ఎక్కడ సోకుతుందో అని బెంబేలెత్తుతున్నారు. అయితే, ఈ వైరస్‌ని చూసి అస్సలు భయపడాల్సిన అవసరమే లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటివరకు ఎన్నో వైరస్లు మానవాళిని ఇబ్బంది పెట్టాయని.. ఇంతకంటే శక్తివంతమైన మహమ్మారులనే ఎదుర్కొన్న చరిత్ర మనకు ఉందనే విషయాన్ని మరచిపోవద్దని గుర్తు చేస్తున్నారు.సార్స్, మెర్స్ వంటి వైరస్‌లతో పోలిస్తే కోవిడ్ వల్ల సంభవించే మరణాల రేటు చాలా తక్కువని పేర్కొంటున్నారు. అందువల్లకోవిడ్ను చూసి భయపడకుండా ధైర్యంగా ఉండాలని చెబుతున్నారు. నమోదైన కేసుల సంఖ్యతో పోలిస్తే సంభవించిన మరణాల సంఖ్య చాలా తక్కువ సార్స్ మరణాల రేటు 9.5 శాతం,మెర్స్ మరణాల రేటు 34 శాతంఉండగా.. కోవిడ్ మరణాల రేటు 3.4 శాతం రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే 80 ఏళ్ల పైబడినవారిపైనే దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది వ్యాధి నిరోధక శక్తిఎక్కువగా ఉండే పిల్లల్లో కోవిడ్ ప్రభావంఅత్యంత స్వల్పం మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ ఈమహమ్మారిని సమర్థంగా దుర్కొంటుందనడానికి ఇదే నిదర్శనం వ్యక్తిగత, పరిసరాల శుభ్రత పాటిస్తూ.. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ మహమ్మారిని తరిమేయడం చాలా సులభం ఫేస్ మాస్కులతో పరీక్షలకు రావొచ్చు ఇంటర్ వార్షిక పరీక్షలు రాసే విద్యార్థులు ఫేస్ మాస్కులతో పరీక్షలకు హాజరుకావొచ్చు. వాటర్ బాటిల్స్ కూడా తెచ్చుకోవచ్చు. విద్యాశాఖ ఈ ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది. పరీక్షా కేంద్రం గేటు తెరిచే వరకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో గూమికూడతారని, అలా జరగకుండా ముందే గేట్లు తెరిచి విద్యార్థులను వారికి కేటాయించిన స్థానాల్లో వెళ్లి కూర్చునేందుకు అనుమతించాలని అధికారులను ఆదేశించింది. పరీక్షలు ప్రారంభం కావడానికి ముందు పరీక్షా కేంద్రం గదుల్లోని అన్ని బల్లలు, కుర్చీలు, తలుపులు, స్విచ్ బోర్డు లను ‘ఇన్ఫెక్షన్ల నివారిణి మందు’లో ముంచిన తడిగుడ్డతో శుభ్రపరచాలని సూచించింది. -
‘చావు’ తెలివితేటలు
సాక్షి, సిటీబ్యూరో: ప్రమాదవశాతు మృతిచెందిన ఐటీ ఉద్యోగుల సెల్‌ఫోన్ నంబర్ ఇంటర్నెట్లో.. లేదంటే వారి కార్యాలయానికి వెళ్లి తెలుసుకుంటారు. నకిలీ ఐడీలతో డూప్లికేట్ సిమ్‌కార్డు పొందుతారు. రూ.లక్షల్లో ప్రీ అప్రూవ్డ్ లోన్ (ముందస్తు ఆమోదిత రుణాలు) తీసుకుంటున్న ఆరుగురు సైబర్ నేరగాళ్ల ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. రూ.53,95,043 కొల్లగొట్టిన ఈ నయా తరహా చీటింగ్‌కు ఓ ప్రైవేట్ బ్యాంక్ సీనియర్ మేనేజర్ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. ఇన్ఫోసిస్‌లో పనిచేసిన పాలపర్తి రఘురాం పేరిట ఉన్న బ్యాంక్ ఖాతాలు వినియోగించి రూ.2,76,000 రుణం పొందిన విషయం.. ఆ తర్వాత రికవరీకి వెళితే అతడు చనిపోయాడన్న విషయం తెలిసిందని ఆ ఫిర్యాదులో పేర్కొనడంతో సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు ఈ నెల 2న కేసు నమోదుచేశారు. శనివారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ సజ్జనార్ క్రైమ్స్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని, అడిషనల్ డీసీపీ కవిత, ఏసీపీ శ్రీనివాస్‌లతో కలిసి వివరాలు వెల్లడించారు. నేరచరిత ఇదీ.. గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం గొట్టిపాడు వాసి, ప్రధాన నిందితుడు నిమ్మగడ్డ ఫణి చౌదరి ఇంటర్మీడియట్ వరకు చదివి ఒంగోలులోని ఆర్టీఏ కార్యాలయంలో డాటా ఎంట్రీ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేశాడు. ఆ సమయంలోనే డ్రైవింగ్ లైసెన్స్, ఇతర సర్టిఫికెట్ల కోసం నకిలీ ఓటర్ ఐడీలు, పాన్‌కార్డులు గురించి తెలుసుకున్నాడు. ఆ తర్వాత హైదరాబాద్‌లో 2011లో నకిలీ వాహన నమోదు పత్రాలు సృష్టించిన కేసులో మాదనన్నపేట పోలీసులు, 2012లో సీసీఎస్ పోలీసులు, 2019 జూన్‌లో అక్రమ కాల్ రూటింగ్ మోసంలో రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. కేపీహెచ్‌బీ, చైతన్యపురిలోనూ హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డులు ఉపయోగించి రూ.91 లక్షలు డ్రా చేసిన కేసులు అతడిపై ఉన్నాయి. నిమ్మగడ్డ ఫణి చౌదరి బంధువు గుంటూరు వాసులు వేణుగోపాల్, క్లాస్మేట్ అయిన పెడవల్లి శ్రీనివాసరావు, స్వరూప్‌నాథ్ చౌదరిలపై కేసులు ఉన్నాయి. స్వరూప్‌నాథ్ చౌదరి స్నేహితుడు కండ్రూ హరీశ్, వీర శంకర్రావులు సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ నేరగాళ్లతో కలిసి ప్రమాదవశాత్తు మరణించిన ఐటీ ఉద్యోగులే లక్ష్యంగా నయా మోసాలకు తెరలేపారు. ఈ ముఠాలోని నలుగురు నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని సీపీ సజ్జనార్ తెలిపారు. నయా మోసమిలా... ప్రమాదవశాత్తు మరణించిన ఐటీ ఉద్యోగుల వివరాలు ఇంటర్నెట్ ఉపయోగించి (మొబైల్ నంబర్, కార్యాలయ స్థలం వంటివి) గూగుల్, ఫేస్బుక్ తదితర సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్ల ద్వారా నిమ్మగడ్డ ఫణి చౌదరి, మండవ స్వరూప్‌నాథ్ చౌదరిలు సులభంగా తెలుసుకునేవారు. ఈ సెల్‌ఫోన్ నంబర్‌ను సేకరించాక హరీశ్, వేణు గోపాల్ ఫొటోలను ఉపయోగించి శ్రీనివాసరావు నకిలీ ఐడీలు సృష్టించి సెల్‌ఫోన్ నెట్వర్కింగ్ కేంద్రాల్లో సమర్పించి అదే డూప్లికేట్ సిమ్‌కార్డును పొందేవారు. అలా వారి వద్ద రెండు రోజులు సిమ్‌కార్డు పనిచేస్తున్న సమయంలోనే మృతుడు కస్టమర్‌గా ఉన్న బ్యాంక్‌ల నుంచి సంక్షిప్త సమాచారాలు సెల్‌ఫోన్ నంబర్‌కు వచ్చేవి. ఆ విధంగా బ్యాంక్ ఖాతాలను గుర్తించేవారు. ఆ తర్వాత స్వరూప్‌నాథ్ చౌదరి, హరీశ్‌లు ఆయా బ్యాంక్‌లకు వెళ్లి ఏదో ఒక కారణాన్ని సిబ్బందికి చెప్పి మొబైల్‌తో అనుసంధానంగా ఉన్న ఖాతాలను గుర్తిస్తారు. కస్టమర్ ఐడీ, బ్యాంక్ ఖాతాలను సేకరించాక నెట్ బ్యాంకింగ్‌లోకి లాగిన్ అయి ‘పాస్వర్డ్ మర్చిపోయారా’ అంటూ ఎంపికపై క్లిక్ చేసి జీమెయిల్, ఫోన్ నంబర్ సహాయంతో పాస్‌వర్డ్‌ను మారుస్తున్నారు. మరికొన్ని సందర్భాల్లో మృతుడి ఐటీ ఉద్యోగుల జీమెయిల్స్, ఈమెయిల్స్ ఇంటర్నెట్లో దొరికితే సరి. లేదంటే మొబైల్ స్టోర్, కొన్నిసార్లు బ్యాంక్‌ల్లో ఫోన్ నంబర్ ఇచ్చి తెలుసుకుంటున్నారు. ఇలా వారికి ఈమెయిల్ ఐడీ తెలియగానే పాస్‌వర్డ్‌ను బ్రేక్ చేసి ఆ మెయిల్‌కు గతలలో వచ్చిన రుణాలు, బ్యాంక్ ఖాతాలు, క్రెడిట్ కార్డు వివరాలు తెలుసుకుంటారు. ఇలా వీరు ఈమెయిల్‌కు మార్చిన పాస్వర్డ్ ద్వారా నెట్ బ్యాంకింగ్‌కు లాగిన్ అవుతారు. ఆ వెంటనే ప్రీ అప్రూవ్డ్ లోన్స్, క్రెడిట్ కార్డుల కోసం అభ్యర్థనలు పంపిస్తున్నారు. అలా ఆయా బ్యాంక్‌ల నుంచి రుణాలు మంజూరు కాగానే ఆ ఖాతా నుంచి వేణుగోపాల్, వీర శంకర్రావుల పేరుమీద తెరిచిన నకిలీ బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేసేవారు. ఆ తర్వాత బ్యాంక్‌లు, ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా చేసుకునేవారు. అలాగే తమ క్రెడిట్ కార్డుల నుంచి క్యాష్ పాయింట్స్‌లోని వివిధ అకౌంట్లకు బదిలీ చేసుకొని మూడు శాతం కమిషన్ ఇచ్చి డబ్బులు తీసుకునేవారు. మరికొన్ని సందర్భాల్లో మృతుల జీమెయిల్ ఐడీ వివరాలు తెలియకపోతే తాము పొందిన డూప్లికేట్ సిమ్ ద్వారా తమ రిజిస్టర్డ్ మెయిల్ ఐడీ మార్చాలని అభ్యర్థనలు పెట్టి మారాకా నెట్ బ్యాంకింగ్ లాగిన్ అయిన ప్రీ అప్రూవ్డ్ రుణాలు పొందేవారు. డెబిట్ కార్డులు కూడా అభ్యర్థన పెట్టి కొరియర్ కార్యాలయం నుంచి ఫోన్‌కాల్ రాగానే అక్కడికెళ్లి హరీశ్, వేణుగోపాల్‌లు నకిలీ గుర్తింపు కార్డులు సమర్పించి తీసుకునేవారు. భవిష్యత్‌లో ఈ మోసాలను నివారించేందుకు రుణాలు మంజూరు చేసే సమయంలో ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలని ఆర్బీఐకు లేఖ రాస్తాం. అలాగే సిమ్‌కార్డుల జారీలోనూ సరైన వెరిఫికేషన్ ఉండే విధంగా చూడాలని టెలికామ్ సర్వీసెస్‌కు సూచిస్తామ’ని సీపీ సజ్జనార్ వివరించారు. -
ఆ బ్యాంకులో టెకీల హైరింగ్..
బెంగళూర్ : ఎస్వీబీ ఫైనాన్షియల్ గ్రూప్ సబ్సిడరీ సిలికాన్ వ్యాలీ బ్యాంక్ తన బెంగళూర్ కార్యాలయం కోసం 200 మందికి పైగా ఉద్యోగులను నియమించేందుకు సన్నద్ధమవుతోంది. అమెరికాలో అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన ఎస్వీబీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30,000కి పైగా స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టింది. ఈ కంపెనీ బెంగళూర్ కార్యాలయం కోసం ఇంజనీర్లు, సిస్టమ్ ఆర్కిటెక్ట్స్, డేటా అనలిస్టుల హైరింగ్‌కు సిద్ధమైంది. ఎంపికైన అభ్యర్థులు ప్రాడక్ట్ డిజైన్, డెవలప్మెంట్ సహా పలు ప్రాజెక్టులపై పనిచేయాల్సి ఉంటుంది. అకౌంటింగ్, రెగ్యులేటరీ రిపోర్టింగ్, ప్రొక్యూర్మెంట్, ట్యాక్స్, ట్రెజరీ సపోర్ట్ వంటి సేవలను ఎస్వీబీ తమ క్లయింట్లకు అందచేస్తుంది. డిజిటల్ ఫ్లాట్‌ఫాంను అభివృద్ధి చేస్తూ నైపుణ్యాలను సంతరించుకున్న సిబ్బంది కోసం నియామక ప్రక్రియ చేపట్టామని సిలికాన్ వ్యాలీ బ్యాంక్ సీఈవో డేనియల్ బెక్ వెల్లడించారు. బెంగళూర్‌లో ఇటీవల సెంటర్‌ను ప్రారంభించిన ఈ బ్యాంకుకు అమెరికా సహా హాంకాంగ్, బీజింగ్ షాంఘై, లండన్, ఫ్రాంక్ఫర్ట్ వంటి పలు ప్రపంచ నగరాల్లో 30 కేంద్రాల నుంచి తన కార్యకలాపాలను సాగిస్తోంది. -
అదృశ్యమైన టెకీ జంట మృతి, చంపేశారా?
బెంగళూరు: కేరళకు చెందిన ప్రేమికుల ఆత్మహత్య కలకలం రేపుతోంది. గత 40 రోజులుగా కనిపించకుండా పోయిన ప్రేమికుల టెకీ జంట బెంగళూరు సమీపంలో ఒకే చెట్టుకు ఉరివేసుకుని చనిపోయి కనిపించారు. హెబ్బగోడి పోలీస్ స్టేషన్ పరిధిలో దట్టమైన అటవీ ప్రాంతంలో వీరి మృతదేహాలు కుళ్లిపోయి స్థితిలో నవంబరు 29 శుక్రవారం మధ్యాహ్నం గుర్తించారు. ప్రేమ పెళ్లికి నిరాకరించిన కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి వుంటారని పోలీసుల కథనం. మరోవైపు మృతదేహాలు పడి వున్న తీరును బట్టి, వీరిని చంపేసి, జనసంచారం లేని ప్రాంతంలో చెట్టుకు వేలాడదీసి వుంటారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. కేరళలోని ఎర్నాకుళంకు చెందిన శ్రీలక్ష్మి (21), అభిజిత్ మోహన్ (25) బెంగళూరులోని ఒక ప్రైవేట్ సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తున్నారు. వీరిద్దరూ అక్టోబర్ 11నుంచి కనిపించకుండా పోయారు. దీంతో ఇరు కుటుంబాలు పోలీసులను ఆశ్రయించాయి. మూడువారాలు గడిచినా శ్రీలక్ష్మి ఆచూకి లభించకపోవడంతో, కుటుంబ సభ్యులు కర్ణాటక హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. చివరికి చింతల మాడివాలాలోని అటవీ ప్రాంతంలో అతి దారుణమైన, అనుమానాస్పద స్థితిలో శవాలై తేలారు. మృతదేహాలను గుర్తించిన గొర్రెలకాపరి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఉదంతం వెలుగు చూసింది. మృతదేహాలు పూర్తిగా కుళ్ళిపోయి, మోహన్ తల, మొండెం వేరు పడి వుండగా, శ్రీలక్ష్మి తల చెట్టు నుండి వేలాడుతూ, మిగిలిన శరీరం కింద పడిపోయి వుంది. అయితే నవంబరు 23న తన మేనమామ అభిలాష్‌కు పోన్ చేసిన శ్రీలక్ష్మి, పెద్దవాళ్ల వేధింపులను తట్టుకోలేక చనిపోవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పి, ఫోన్ విసిరేసిందని ఆమె కుటుంబ సభ్యులు చెపుతున్నారు. అయితే కనిపించకుండా పోయిన రోజే వీరు మరణించి వుంటారనీ, ఇక శ్రీలక్ష్మి ఫోన్ చేసే అవకాశమే లేదని మరో వాదన. అటు ఈ జంట చనిపోయి నెలరోజులు అయ్యి వుంటుందని పోలీసులు కూడా అంచనా వేస్తున్నారు. మరోవైపు అక్టోబర్14న శ్రీలక్ష్మి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా పెళ్లికి అంగీకరించకపోవడం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్టుగా భావిస్తున్నామన్నారు. పోస్ట్‌మార్టం నివేదిక కోసం వేచి చూస్తున్నట్టు తెలిపారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని, తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసు అధికారి తెలిపారు. -
లేఆఫ్స్‌తో టెకీల్లో గుబులు..
హైదరాబాద్ : ఉద్యోగం కోల్పోతాననే ఆందోళనతో హైదరాబాద్‌లో 24 సంవత్సరాల సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ హరిణి ఆత్మహత్య టెకీల్లో కలవరం రేపుతోంది. వేతన పెంపు, లేఆఫ్స్‌కు సంవత్సరాంతం అనువైన సమయం కావడంతో ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోననే గుబులు ఐటీ ఉద్యోగులను వెంటాడుతోంది. ఆర్థిక మందగమనంతో ఉద్యోగుల తొలగింపుపై సర్వత్రా ఆందోళన నెలకొన్న క్రమంలో ఉద్యోగులకు బాసటగా తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ముందుకొచ్చింది. దాదాపు ప్రతి ప్రాజెక్టులో 18 శాతం ఉద్యోగులకు 4 రేటింగ్ ఇచ్చారని, అంటే వీరంతా 45 నుంచి 60 రోజుల్లో తమ సామర్ధ్యం మెరుగుపరుచుకోవాల్సి ఉంటుందని, లేని పక్షంలో వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తారని అసోసియేషన్ సభ్యులు సందీప్ కుమార్ మక్తానా ఓ టీవీ చానెల్‌తో మాట్లాడుతూ ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగులు తమకు ఎదురవుతున్న ఇబ్బందులను అసోసియేషన్‌తో పంచుకుని వారి నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అవకాశం ఉంది. అయితే ఇలాంటి సంస్థల్లో సభ్యత్వాలు తీసుకునేందుకు ఐటీ ఉద్యోగులను ఆయా కార్పొరేట్ సంస్థలు అనుమతించడం లేదు. యూనియన్ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు కంపెనీలు అనుమతించవని, ఉద్యోగాల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురైతే తాము ఒంటరిగా ఎదుర్కోవాల్సి వస్తోందని, ఏ ఒక్కరూ సాయం చేయరని ఓ ఉద్యోగి వాపోయారు. అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం కాగ్నిజెంట్ 13,000 మందిని సాగనంపుతూ దేశంలోనే అతిపెద్ద ఉద్యోగాల కోతకు దిగడం ఐటీ ఉద్యోగుల్లో అలజడి రేపుతోంది. వీరిలో అత్యధికులు మధ్యశ్రేణి, సీనియర్ పొజిషన్స్‌లో పనిచేస్తున్నవారే. ఇతర ఐటీ కంపెనీల్లోనూ ఇదే ట్రెండ్ నెలకొనడంతో అది ఉద్యోగుల శారీరక, మానిసిక, ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఉద్యోగుల అభద్రతాభావం కుంగుబాటుకు చివరికి ఆత్మహత్యలకూ దారితీస్తోంది. ఉద్యోగులను తొలగించే ప్రక్రియలో భాగంగా యాజమాన్యం ఉద్యోగుల మానసిక స్థైర్యం దెబ్బతీసేలా వారి సామర్ధ్యం సరిగ్గాలేదని చూపే ప్రయత్నం చేస్తోందని ఐటీ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఉద్యోగులను నిందించే బదులు నూతన ప్రాజెక్టులు లేదా క్లోజ్ చేసిన ప్రాజెక్టుల పునరుద్ధరణపై దృష్టిసారించాలని హితవు పలికింది. మరోవైపు ఉద్యోగులను తొలగించే క్రమంలో ప్రస్తుతం ఐటీ కంపెనీలు ఆఫర్ చేస్తున్న రెండు నెలల పరిహార ప్యాకేజ్‌ను ఆరు నెలలకు పెంచాలని అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. తెలంగాణలో ఐదు లక్షల మందికి పైగా ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారని వీరిలో అత్యధికంగా మధ్యశ్రేణి ఉద్యోగులే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. -
టెకీలను వెంటాడుతున్న లేఆఫ్స్..
న్యూఢిల్లీ : ఆర్థిక మందగడనం నేపథ్యంలో వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఐటీ కంపెనీలు మధ్య, సీనియర్ ఐటీ ఉద్యోగుల్లో 5 నుంచి 8 శాతం మందిని తొలగించాలని యోచిస్తున్నాయి. రానున్న త్రైమాసికాల్లో దిగ్గజ ఐటీ కంపెనీలు దాదాపు 10,000 నుంచి 20,000 మంది ఐటీ ఉద్యోగులపై వేటు వేయవచ్చని బిజినెస్ స్టాండర్డ్ అంచనా వేసింది. మార్జిన్ల నిర్వహణ, అమెరికాలో నియామకాలు ఊపందుకోవడం, నూతన టెక్నాలజీల రాక వంటి అంశాలు టెకీల తొలగింపునకు దారితీశాయని ఆ కథనం పేర్కొంది. రూ 20 లక్షల నుంచి రూ 40 లక్షల వార్షిక వేతనం అందుకునే ప్రాజెక్టు మేనేజర్లకు ఉద్యోగాలు కోల్పోయే ముప్పు అధికమని నిపుణులు పేర్కొంటున్నారు. కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ వంటి టాప్ కంపెనీలు ఇప్పటికే ఉద్యోగుల కోతపై తమ ఉద్దేశాలను విస్పష్టంగా వెల్లడించిన క్రమంలో ఇతర కంపెనీలూ ఇదే బాట పట్టనున్నాయి. కాగ్నిజెంట్ 12,000 మంది ఉద్యోగులను ఇంటిబాట పట్టిస్తుండగా, ఇన్ఫోసిస్ 10,000 మంది ఉద్యోగులను సాగనంపనుందనే వార్తలు వెలువడ్డాయి. ఉద్యోగుల సామర్థ్యం, వార్షిక సమీక్షలో భాగంగా ఉద్యోగుల తొలగింపు సాధారణమేనని ఆయా కంపెనీలు చెబుతున్నాయి. -
ఐటీ కంపెనీలపై సంచలన కేసు
సాక్షి, హైదరాబాద్: ఐటీ కంపెనీల్లో టెక్కీల కష్టాలు, పని ఒత్తిడి తదితర అంశాలపై చాలా కథనాలు ఇప్పటివరకూ విన్నాం. చదివాం. అయితే తాజాగా ప్రముఖ ఐటీ కంపెనీలపై ఉద్యోగులు ఏకంగా కోర్టుకెక్కడం సంచలనం రేపుతోంది. యాక్సెంచర్, కాగ్నిజెంట్, కాస్పెక్స్ కార్పొరేషన్ కంపెనీలపై హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు ఐటి ఉద్యోగులు కేసు నమోదు చేశారు. ఫోరమ్ ఎగైనెస్ట్ కరప్షన్ కార్యకర్తల బృందంతో కలిసి వీరు తెలంగాణ పిల్ హైకోర్టులో దాఖలు చేశారు. భారతదేశ ఐటి పరిశ్రమ చరిత్రలోనే ఒక మైలురాయి లాంటిదని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. "ఉపాధి పేరిట రాష్ట్రంలో వైట్ కాలర్డ్ బానిసత్వం" అని టెక్కీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎక్కువ పని గంటలు, ప్రోత్సాహకాలు ప్రకటించకపోవడం, చెత్త లీవ్ విధానం లాంటి వివిధ ఆరోపణలతో ఫిర్యాదు నమోదు చేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు అంగీకరించింది. దీనిపై నాలుగు వారాల్లో స్పందించాల్సిందిగా ఐటీ సంస్థలను ఆదేశించింది. అలాగే ఈ వ్యవహారంపై స్పందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కోర్టు నోటీసులిచ్చింది. ఐటి ఉద్యోగుల జీవితాలను మెరుగుపర్చడానికి, సంస్థల పని సంబంధిత దోపిడీని నిలువరించడానికి ఈ పిల్ దాఖలు చేశామని ఫోరం ఎగైనెస్ట్ అవినీతి అధ్యక్షుడు విజయ్ గోపాల్ వెల్లడించారు. అదనపు వేతనం లేకుండా దాదాపు పది గంటల విధులు, కార్యాలయ క్యాబ్‌ల ద్వారా రోజువారీ ప్రయాణంలో 4-5 గంటలు గడపవల్సి రావడం, సెలవులను సమయానికి కేటాయించకపోవడం లాంటి ఆరోపణలు ప్రధానంగా ఉన్నాయన్నారు. చట్టం ఏమి చెబుతుంది? 2002 లో ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ ప్రకారం తెలంగాణ, హైదరాబాద్, ఇతర ఐటి హబ్‌లలో వర్తించే చట్టాలు ఆసక్తికర విషయాలను వివరిస్తున్నాయి. ఉద్యోగులను వారానికి 48 గంటలు/ లేదా రోజుకు 8 గంటలు పని ఓవర్ టైం వారానికి 6 గంటలు, సంవత్సరానికి 24 గంటలు మాత్రమే ప్రతి ఉద్యోగికి సంవత్సరంలో 15 రోజుల పెయిడ్ లీవ్, 12 రోజుల క్యాజువల్ లీవ్, 12 రోజుల సిక్ లీవ్ ఇవ్వాలి మరోవైపు రాష్ట్రంలో (అప్పటి ఆంధ్రప్రదేశ్) తమ కార్యాలయాలను స్థాపించడానికి మరిన్ని ఐటి సంస్థలను ప్రోత్సహించేందుకు ఈ కార్మిక చట్టాలను దాటవేయడానికి వీలు కల్పించింది. మొత్తం 6 విభాగాలను బైపాస్ చేయడానికి అనుమతించారు. వీటిలో ప్రారంభ, ముగింపు గంటలు, రోజువారీ, వారపు పని గంటలు, సెలవులతోపాటు ఉద్యోగం నుంచి తొలిగించిన సందర్భంలో ఉద్యోగిని రక్షించడానికి నిబంధనలున్నాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏమింటే ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే ఆయా కంపెనీలకు కేవలం 100 రూపాయల జరిమానా మాత్రమే ప్రభుత్వం విధించవచ్చు. ఈ చట్టాన్నిమరో రెండేళ్లపాటు పొడిగిస్తూ 2019లో తెలంగాణా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
టెకీలకు తీపికబురు
బెంగళూర్ : ఐటీలో స్లోడౌన్ కనుమరుగవుతుండటంతో మళ్లీ నియామకాలు ఊపందుకున్నాయి. పలు కంపెనీలు సిబ్బంది సంఖ్యను పెంచుకునేందుకు రిక్రూట్మెంట్కు దిగుతుండటంతో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయి. మరోవైపు బహుళజాతి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ గోల్డ్‌మాన్ శాక్స్ బెంగళూర్ సెంటర్లో ఇంజనీరింగ్ హెడ్‌కౌంట్‌ను భారీగా పెంచుకోవాలని కసరత్తు సాగిస్తోంది. భారత్‌లో 290 మంది ఉద్యోగులతో 2004లో కార్యాలయాలను నెలకొల్పిన గోల్డ్‌మాన్‌కు ప్రస్తుతం 5000 మంది ఉద్యోగులు ఉన్నారు. తమ సంస్థ భారత్‌లో ఏటా 24 శాతం మేర విస్తరిస్తోందని, గత ఐదేళ్లలో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ 20 శాతం పెరిగాయని గోల్డ్‌మాన్ శాక్స్ సర్వీసెస్ ఇండియా హెడ్ గుంజన్ సంతాని చెప్పారు. వ్యాపార వృద్ధికి అనుగుణంగా తాము హైరింగ్ ప్రక్రియను చేపడతామని తెలిపారు. బెంగళూర్ సెంటర్ తమకు కీలకమని, ఇక్కడ కేవలం ఇంజనీరింగ్ కాకుండా ఆటోమేషన్, డిజిటైజేషన్ బిజినెస్‌ను కూడా అందిస్తున్నామని చెప్పారు. -
రాహుల్ సభలో టెకీల అరెస్ట్
బెంగళూర్ : రాహుల్ సభలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న టెకీలపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారని బీజేపీ ఆరోపించింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐటీ నగరం బెంగళూర్‌లోని మన్యతా టెక్‌పార్క్‌లో మంగళవారం ఐటీ ఉద్యోగులను ఉద్దేశించి రాహుల్ ప్రసంగిస్తుండగా వేదిక వెలుపల కొందరు ఆందోళనకారులు మోదీకి అనుకూలంగా నినాదాలు చేస్తూ రాహుల్ గో బ్యాక్ అంటూ పెద్దపెట్టున నినదించారు. వేదిక నుంచి రాహుల్ వెళ్లిపోవాలని వారు ప్లకార్డులు ప్రదర్శించారు. పోలీసులు వారించినా ఆందోళనకారులు రాహుల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండటంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన నిరసనకారుల్లో టెకీలు కూడా ఉన్నారని బీజేపీ పేర్కొంది. పోలీసు చర్యను తీవ్రంగా గర్హించిన బీజేపీ నిరసనకారులపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని ఖండించింది. కాంగ్రెస్-జేడిఎస్ పాలిత రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, ప్రజల భావప్రకటనా స్వేచ్ఛను పాలక సర్కార్ అణిచివేస్తోందని బీజేపీ ఆరోపించింది. -
‘ఆ సమయంలో మద్యం సేవించి ఉన్నారు’
కాలిఫోర్నియా : మద్యం సేవించిన కారణంగానే లోయలో పడి భారత టెకీ దంపతులు దుర్మరణం పాలై ఉంటారని స్థానిక మీడియా పేర్కొంది. మృతుల అటాప్సీ రిపోర్టులో ఈ విషయం వెల్లడైందని తెలిపింది. గతేడాది అక్టోబరులో కాలిఫోర్నియాలోని యోస్‌మిటే నేషనల్ పార్కులోని లోయలో పడి కేరళకు చెందిన విష్ణు విశ్వనాథ్(29), మీనాక్షి మూర్తి(30) మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రమాదం జరిగిన సమయంలో వారిరువురు ఆల్కహాల్ సేవించారని మారిపోసా కంట్రీ అధికారి ఆండ్రియా స్టెవర్ట్ తెలిపారు. (ఇండియన్ టెకీ దంపతుల దుర్మరణం) ఇథైల్ ఆల్కహాల్ సేవించారు ‘ఆ సమయంలో విష్ణు విశ్వనాథ్, మీనాక్షి ఇథైల్ ఆల్కహాల్ సేవించారు. అయితే డ్రగ్స్ తీసుకున్న ఆనవాళ్లు ఏమీలేవు. వారు లోయలో పడి పోవడానికి ఇది కూడా కారణం అయి ఉంటుందని’ ఆండ్రియా వ్యాఖ్యానించింది. కాగా కేరళకు చెందిన ఈ జంట 2014లో పెళ్లి చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండే విష్ణు, మీనాక్షిలకు సాహస యాత్రలు చేయడమంటే సరదా. ఈ క్రమంలో వారికి సంబంధించిన ప్రతీ అప్డేట్ని.. ‘హాలీడేస్ అండ్ హ్యాపిలీఎవర్‌ఆఫ్టర్స్’ పేరిట సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ స్నేహితులతో ఙ్ఞాపకాలు పంచుకునేవారు. -
ఇండియన్ టెకీ దంపతుల దుర్మరణం
కాలిఫోర్నియా : అమెరికాలో విషాదం చోటుచేసుకుంది. భారత్‌కు చెందిన టెకీ దంపతులు కాలిఫోర్నియాలోని యోస్‌మిటే నేషనల్ పార్కులోని లోయలో పడి మృతిచెందారు. వివరాలు..దక్షిణ భారత్‌కు చెందిన విష్ణు విశ్వనాథ్(29), మీనాక్షి మూర్తి(30) దంపతులు న్యూయార్క్‌లోని ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. ట్రెక్కింగ్, అడ్వెంచర్ ట్రిప్పులకు వెళ్లడమంటే సరదా ఉన్న ఈ జంట గురువారం కాలిఫోర్నియాలోని జాతీయ పార్కుకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అక్కడ ఉన్న 800 అడుగుల లోయలో పడిపోయారు. ఈ విషయం తెలుసుకున్న పార్క్ అధికారులు వీరి జాడ కోసం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం.. వీరి మృతదేహాలను కనుగొన్నారు. వీరిని సిస్కో కంపెనీలో పనిచేస్తున్న ఇండియన్ టెకీలుగా గుర్తించామని పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంతవరకు తెలియరాలేదన్నారు. కాగా వీరి మృతిపట్ల కేరళకు చెందిన చెంగునూర్ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం సంతాపం వ్యక్తం చేసింది. తమ పూర్వ విద్యార్థులైన విష్ణు, మీనాక్షి మరణించడం తమను తీవ్రంగా కలచివేసిందని పేర్కొంది. వీరిద్దరు 2006-10 బ్యాచ్‌కు చెందిన కంప్యూటర్ సైన్స్ విభాగానికి చెందిన విద్యార్థులు అని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేసింది. 2014లో పెళ్లి చేసుకున్న ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉండేవారని, వారికి సంబంధించిన ప్రతీ అప్డేట్ని.. ‘హాలీడేస్ అండ్ హ్యాపిలీఎవర్‌ఆఫ్టర్స్’ పేరిట సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తమతో ఙ్ఞాపకాలు పంచుకునే వారని సన్నిహితులు విషాదంలో మునిగిపోయారు. -
టెకీలకు గుడ్‌న్యూస్ : ఐటీలో నియామకాల వెల్లువ
సాక్షి, న్యూఢిల్లీ : రాబోయే ఆరు నెలల్లో ఐటీ రంగంలో సంస్థలు పెద్దఎత్తున నియామకాలు చేపట్టనున్నాయి.పలు ఐటీ కంపెనీలు ప్రధానంగా జూనియర్ లెవెల్ ఉద్యోగాలను భారీగా రిక్రూట్ చేస్తాయని ఎక్స్పెరిస్ ఐటీ ఎంప్లాయ్మెంట్ అవుట్‌లుక్ సర్వే వెల్లడించింది. అమెరికాలో ప్రతిపాదిత వీసా నియంత్రణల నేపథ్యంలో భారత్‌లో గత కొద్దినెలలుగా తగ్గుముఖం పట్టిన నియామకాలు క్రమంగా ఊపందుకుంటున్నాయని ఈ నివేదిక పేర్కొంది. రానున్న రెండు త్రైమాసికాల్లో ఐటీ రంగంలో నియామకాలు చేపట్టేందుకు పలు సంస్థలు సుముఖంగా ఉన్నట్టు నివేదిక తెలిపింది. భారీ ఐటీ దిగ్గజాలు హైరింగ్ ప్రణాళికలకు పదునుపెడుతుండగా, నాన్ ఐటీ కంపెనీలు సైతం డిజిటల్ వైపు మళ్లేందుకు అనుగుణంగా సాంకేతిక నిపుణుల నియామకంపై దృష్టిసారించాయి. ఐటీ కంపెనీలు భారీ వడపోతల అనంతరం జూనియర్ లెవెల్లో నియామకాలను పెద్దఎత్తున చేపడతాయని, సృజనాత్మకత, వినూత్న ఆలోచనాధోరణి కలిగిన వారికి ఆకర్షణీయమైన ప్యాకేజీలు లభిస్తాయని నివేదిక పేర్కొంది. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్‌చైన్, రోబోటిక్స్ వంటి నూతన టెక్నాలజీలపై స్టార్టప్‌లు పనిచేస్తుండటంతో స్టార్టప్‌లలోనూ నియామకాలు భారీగా ఉంటాయని నివేదిక అంచనా వేసింది. దేశవ్యాప్తంగా దాదాపు 550 ఐటీ కంపెనీల యాజమాన్యాలతో ఇంటర్వ్యూల ద్వారా వారి హైరింగ్ ప్రణాళికలను ఎక్స్పెరిస్ ఐటీ ఎంప్లాయ్మెంట్ అవుట్‌లుక్ సర్వే విశ్లేషించింది. -
హెచ్1బీ వీసా వాళ్లిష్టం
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి–హైదరాబాద్ : వివేక్ దహియా, హెచ్‌పీలో సీనియర్ ప్రోగ్రామర్, వార్షిక వేతనం 1.40 లక్షల డాలర్లు.. రాజ్ రంగసామి, ఇంటెల్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్, వార్షిక వేతనం 1.35 లక్షల డాలర్లు... ఇద్దరూ గడచిన ఎనిమిది సంవత్సరాలుగా అమెరికాలో ఫుల్‌టైమ్ ఉద్యోగాలు చేస్తున్నారు. మొదటిసారి హెచ్1బీ వచ్చినప్పుడు మూడేళ్లు, ఆ తర్వాత కాలంలో మరో మూడేళ్లు వీసా రెన్యువల్ అయింది. మూడోసారి హెచ్1బీ వీసా గడువు పొడిగింపు కోసం దరఖాస్తు చేశారు. అనేక లొసుగులు ఎత్తిచూపుతూ యునైటెడ్ స్టేట్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) నోటీసులు జారీ చేసింది. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా ఏ ఇబ్బంది లేకుండా వారు ఉద్యోగం చేశారు. చివరికి 210 రోజుల తర్వాత మరో ఏడాది పాటు హెచ్1బీ రెన్యువల్ అయ్యింది!! కానీ సెప్టెంబర్ 11వ తేదీ నుంచి అమెరికాలో పని చేస్తున్న విదేశీ ఐటీ ఉద్యోగులకు ఇలాంటి ఏ వెసులుబాటూ ఉండదు. అమల్లోకి రానున్న కొత్త నిబంధనల ప్రకారం వీసా పొడిగింపునకు వచ్చిన దరఖాస్తు సక్రమంగా ఉందని ఇమ్మిగ్రేషన్ అధికారి భావిస్తేనే ఆమోదిస్తారు. లేదంటే తిరస్కరణ తప్పదు. గతంలో మాదిరి నోటీసుల జారీ ఉండదు. అంతేకాదు వీసా పొడిగింపు దరఖాస్తు తిరస్కరించిన వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలంటూ నోటీసులు (ఎన్టీఏ) జారీ చేస్తారు. అప్పటికీ వెళ్లకపోతే పదేళ్ల పాటు అమెరికా రాకుండా బహిష్కరిస్తారు. వీసా పొడిగింపు దరఖాస్తులో ఏ లోపాలు లేకపోయినా ఇమ్మిగ్రేషన్ విభాగం తిరస్కరించిందని ఒకవేళ దరఖాస్తుదారుడు భావిస్తే అటార్నీ ద్వారా అప్పీల్ చేసుకోవచ్చు. అయితే గతంలో మాదిరి ఆ సమయంలో దరఖాస్తుదారుడు ఉద్యోగం చేయడానికి అర్హుడు కాడు. అప్పీల్ పరిష్కారమయ్యే వరకు గరిష్టంగా 240 రోజులు అమెరికాలో ఉండవచ్చు. అప్పటికీ దరఖాస్తులో మార్పు లేకపోతే తక్షణమే ఎన్టీఏ జారీ చేస్తారు. అప్పుడు దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. హెచ్1బీ వర్క్ వీసా కింద పని చేస్తూ పొడిగింపు అనుమతి కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగికి ఇమ్మిగ్రేషన్ విభాగం కారణం చెప్పకుండా ఎన్టీఏ జారీ చేసి.. అతడిని ఉద్యోగం నుంచి తప్పించాలని కంపెనీని ఆదేశించే భయంకరమైన నిబంధనను ఇటీవల యూఎస్సీఐఎస్ అమల్లోకి తెచ్చింది. ‘‘ముఖ్యంగా భారతీయ ఐటీ కంపెనీలకు ఇవన్నీ ఇబ్బందికరంగా పరిణమించాయి. మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో చెప్పలేకపోతున్నాం’’అని నాస్కామ్ ఉపాధ్యక్షుడు శివేంద్ర సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. యూఎస్సీఐఎస్ నిర్ణయాన్ని సవాల్ చేసిన ఉద్యోగి విధులు నిర్వహించడానికి వీల్లేదన్న నిబంధనల భారత ఐటీ పరిశ్రమకు పెద్ద సవాల్ వంటిదని ఆయన అన్నారు. దేశీయ ఐటీకి ఇబ్బందే అమెరికా ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త నిబంధనల కారణంగా అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో వంటి కంపెనీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ ఏడాది ఈ కంపెనీలకు జారీ చేసిన వర్క్ పర్మిట్ వీసాలు కేవలం 12 శాతం. అదే అమెరికన్ కంపెనీల విషయంలో పెద్దగా ఆంక్షలు లేకపోవడంతో వారు లబ్ధి పొందుతున్నారు. పెద్ద ఎత్తున ఆర్డర్లు చేతిలో ఉన్నా భారతీయ కంపెనీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇదే విషయాన్ని నాస్కామ్ చైర్ పర్సన్ దేబయాని ఘోష్ ఇటీవల విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ దృష్టికి తీసుకువెళ్లారు. విచిత్రమేమిటంటే అమెరికాలో ఇప్పటికప్పుడు టెక్నాలజీ రంగంలో 30 లక్షల మందికి ఉద్యోగావకాశాలు ఉన్నాయి. కాకపోతే నిపుణులైన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు (అమెరికా జాతీయులు) దొరక్క టెక్నాలజీ కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయని నాస్కామ్ పేర్కొంది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పగ్గాలు స్వీకరించిన తర్వాత భారత ఐటీ కంపెనీలు నిపుణులైన అమెరికా జాతీయుల కోసం వందల విశ్వవిద్యాలయాల్లో నియామకాలకు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. అయినా ఫలితం లేకపోయిందని, ఉద్యోగాల్లో చేరిన తర్వాత 67 శాతం మంది మొదటి ఆరు మాసాల్లోనే మానేస్తున్నారని, అందుకు కారణం వారిలో నైపుణ్యం లేకపోవడమేనని టీసీఎస్ ఓవర్సీస్ రిక్రూట్మెంట్ వైస్ ప్రెసిడెంట్ వివరించారు. ప్రస్తుత పరిణామాలు రానున్న రోజుల్లో అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందిగా మారుతాయని ఆయన వ్యాఖ్యానించారు. నాస్కామ్ కూడా ఇలాంటి అభిప్రాయంతోనే ఉంది. ‘‘హెచ్1 బీ వర్క్ వీసా నిబంధనల్లో తీసుకువచ్చిన మార్పులు ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. కొత్త నిబంధనల వల్ల అమెరికాలో ఐటీ కంపెనీలు విదేశీ నిపుణుల్ని ఉద్యోగాల్లోకి తీసుకోవడం సంక్లిష్టమైపోతుంది. అమెరికా నిపుణుల కొరతను ఎదుర్కొంటున్న ఈ సమయంలో ఇలాంటి నిబంధనలతో నిపుణులైన విదేశీయులు ఉద్యోగాల్లో కొనసాగడం తగ్గిపోతుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉన్న విదేశీ నిపుణులు తగ్గిపోవడం వల్ల ఎదురయ్యే ప్రభావాన్ని ఆ దేశం అంచనా వేయలేకపోతోంది’’అని నాస్కామ్ పేర్కొంది. -
అమెరికా అల్లుళ్లు అంటేనే ఆలోచిస్తున్నారు..
సాక్షి, న్యూఢిల్లీ : ఒకప్పుడు పెళ్లంటే..ఐటీ, అమెరికా అంటూ సాఫ్ట్వేర్ అల్లుళ్ల కోసం వధువు తల్లితండ్రులు పరుగులు పెట్టేవారు. ట్రంప్ దెబ్బతో ఇప్పుడు అమెరికా అంటేనే ఆడపిల్లల తల్లితండ్రులు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో తమ కుమార్తెలకు వివాహం జరిపించాలని తల్లితండ్రులు ఆరాటపడే పరిస్థితి క్రమంగా మారిపోతోంది. పెళ్లిళ్ల మార్కెట్లో భారత టెకీలకు గిరాకీ మసకబారుతోంది. ట్రంప్ ఆంక్షలతో పాటు వేతనాల్లో కోత, లేఆఫ్‌ల వంటి ముప్పులతో ఇంజినీర్లను ఎంచుకునేందుకు వధువు తల్లితండ్రులు వెనుకడుగు వేస్తున్నారు. హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వామికి వర్క్పర్మిట్లను నిరాకరించాలన్న ట్రంప్ యంత్రాంగ తాజా యోచన భారత ఐటీ ఇంజనీర్ల వైవాహిక ఆశలను మరింత నీరుగార్చింది. ఐటీ వరులు కావాలంటూ ఇచ్చే ప్రకటనలు సైతం ఇటీవల తగ్గిపోవడం మారుతున్న పెళ్లిళ్ల ధోరణులకు అద్దం పడుతుందని ఓ సర్వే నివేదిక వెల్లడించింది. గత ఏడాది ఆరంభం నుంచే ఐటీ ప్రొఫెషనల్స్‌ను వరుడిగా కోరుకునే యువతుల సంఖ్య తగ్గిపోతూ వస్తోందని వివాహ వెబ్సైట్ షాదీ.కామ్ సీఈవో గౌరవ్ రక్షిత్ అంటున్నారు. అమెరికాలో నివసించే ప్రొఫెషనల్స్‌ను జీవిత భాగస్వాములుగా ఎంచుకోవాలని కోరుకునే మహిళల సంఖ్య కూడా తగ్గిందని చెప్పుకొచ్చారు. ట్రంప్ నిర్ణయాలు టెకీల పెళ్లిళ్లనూ ప్రభావితం చేస్తున్నాయన్నారు. ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందో తెలీని టెకీల కంటే స్థిరమైన కెరీర్‌తో కూడిన ప్రభుత్వ ఉద్యోగులు, ఐఏఎస్, ఐపీఎస్‌లూ, వైద్యులు, వ్యాపారులు, ఇతర ప్రొఫెషనల్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. -
పగలు సాఫ్ట్వేర్.. రాత్రి క్యాబ్ డ్రైవర్
సాక్షి, హైదరాబాద్ : వరంగల్‌కు చెందిన కిరణ్‌కుమార్ నగరం లోని ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఉదయం 8గంటల నుంచి సాయం త్రం 5గంటల వరకు సంస్థలో బిజీగా ఉంటాడు. నెలకు రూ.45 వేల సంపాదన. ప్రతివారం సినిమా, నెలకు రెండుసార్లు ఔటింగ్.. ఇలా ఎంజాయ్‌చేసే కిరణ్ జీతం తన ఖర్చులకు సరి పోతుంది. దీంతో డబ్బు పొదుపు చేసేందుకు ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఉదయం సాఫ్ట్వేర్ ప్రొఫెష నల్గా పనిచేస్తూనే రాత్రి 8గంటల నుంచి 1గంట వరకు క్యాబ్ డ్రైవింగ్ చేయాలని నిర్ణయించు కున్నాడు. తనకున్న రూ.9 లక్షల విలువైన కారును ఓ ప్రముఖ క్యాబ్ కంపెనీలో లాగిన్ చేశాడు. రోజుకు 5గంటల నుంచి 6గంటల పాటు డ్రైవింగ్ ఎంజాయ్ చేస్తూ నెలకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు కిరణ్ సంపాదిస్తున్నాడు. ఇలా కిరణ్ ఒక్కడే కాదు.. పగలు కీబోర్డ్‌ను టకటకలాడించినా రాత్రిళ్లు స్టీరింగ్ తిప్పే టెక్కీలు చాలామందే ఉన్నారు. ఒక ప్రముఖ క్యాబ్ సంస్థ అంచనా ప్రకారం రాత్రి వేళల్లో క్యాబ్ డ్రైవ్ చేస్తున్న వాళ్లలో ఎక్కువమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. ఆర్థిక ఇబ్బందులు అధిగమించడం కోసం కొందరు, డ్రైవింగ్‌ను కూడా హాబీగా భావిస్తూ మరికొందరు రాత్రివేళ స్టీరింగ్ పడుతున్నారు. 28 శాతం మంది టెక్కీలు... హైదరాబాద్‌లో రెండు ప్రముఖ సంస్థలకు చెందిన క్యాబ్‌లు లక్షపైనే తిరుగుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకు అధిక సంఖ్యలో క్యాబ్‌లు నడుస్తున్నాయి. రాత్రి 7 నుంచి ఉదయం 4గంటల సమయంలో మాత్రం తక్కువ సంఖ్యలో సర్వీసులు ఉంటున్నాయి. ఈ రాత్రి సమయాల్లో నడిచే క్యాబుల్లో 28శాతం సాఫ్ట్వేర్ ఇంజనీర్ల క్యాబ్లే ఉంటాయని ఒక అంచనా. వీరితో పాటు మరో 18శాతం ఇతర ప్రైవేట్ రంగాల్లోని ఉద్యోగస్తులవి. మొత్తం 46శాతం మంది ప్రైవేట్ ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం క్యాబ్ సర్వీసులోకి రావడం ఆసక్తి కల్గిస్తోంది. లగ్జరీ కార్లకు డిమాండ్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెండు ప్రముఖ క్యాబ్సర్వీసుల్లో లగ్జరీ కార్లకు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. ఈ లగ్జరీ సర్వీసుల్లో ప్రీమియం, ఎస్యూవీ విభాగాలు అందుబాటులో ఉంటాయి. సాధారణ కార్లకు లగ్జరీ కార్లకు రేట్ల విషయంలో 50శాతం వ్యత్యాసం ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లగ్జరీ కార్లను ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఇప్పుడు ఆ కార్ల మెయింటెనెన్స్ కోసం ప్రీమియం, ఎస్యూవీ డిమాండ్లపై నడిపిస్తున్నారు. దీని ద్వారా తక్కువ ట్రిప్పులు చేసినా ఎక్కువ లాభం ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. వీకెండ్స్‌లో ఏకంగా రోజుమొత్తం సర్వీసులిస్తున్నారు. రెండు విధాలుగా... ప్రస్తుతం 28శాతం మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లలో 20శాతం మంది కార్ల యజమానులే డ్రైవర్లుగా వ్యవహరిస్తూ బిజినెస్ చేస్తున్నారు. మిగిలిన 8శాతం మంది నమ్మకస్తులను డ్రైవర్లుగా పెట్టి లగ్జరీ కార్లను క్యాబు సర్వీసుల్లోకి దించారు. ఉద్యోగ సొమ్ము సేవింగ్స్‌లోకి... జీతాన్ని పొదుపు ఖాతాలో జమచేసుకుంటున్న ప్రైవేట్ ఉద్యోగులు, నెలవారీ ఖర్చులు, ఇంటి కిరాయిలను క్యాబ్ సర్వీసు ద్వారా వచ్చే ఆదాయంతో తీర్చుకుంటున్నారు. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు తగ్గి మానసిక ఒత్తిడి లేకుండా ఉంటుందని చెప్తున్నారు. నాకు డ్రైవింగ్ హాబీ నాకు డ్రైవింగ్ ఇష్టం. మాదాపూర్‌లో పనిచేస్తాను. ఆఫీస్ అయిపోగానే ఫ్రెషప్ అయి క్యాబ్ యాప్‌లో లాగిన్ అవుతున్నాను. రాత్రి ఏడునుంచి రెండు గంటల వరకు ఐదారు ట్రిప్పులు ప్రీమియమ్ లేదా ఎస్‌యూవీలో నడుపుతున్నా. నెలకు రూ.20 నుంచి 24వేల వరకు వస్తోంది. డ్రైవింగ్ హాబీతో అదనపు ఆదాయం బావుంది. – చైతన్యసింగ్ ప్రొఫెషన్‌గా ఫీలవుతున్నా నేను మారుమూల ప్రాంతం నుంచి వచ్చా. కష్టపడి చదువుకొని మంచి సంస్థలో ఉద్యోగం చేస్తున్నా. అయితే ఇంట్లో ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని 6గంటల పాటు క్యాబ్ సర్వీసులో ఉంటున్నా. నెలకు రూ.20వేల వరకు వస్తోంది. దీనితో కుటుంబానికి, కారుకు సంబంధించి ఈఎంఐలు కట్టేస్తున్నాను. డ్రైవింగ్ అనుకున్నంత సులభంకాదు, ఇది కూడా ప్రొఫెషనల్ ఉద్యోగమే. – రాకేశ్‌కుమార్, కరీంనగర్ -
ఆ కొలువులకే టెకీల ఓటు
సాక్షి, బెంగళూర్: నూతన టెక్నాలజీపై పనిచేస్తున్న టెక్నోక్రాట్లు ప్రస్తుతం ఫ్రీలాన్స్ వర్క్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒకే సంస్థలో పూర్తికాల ఉద్యోగులుగా పనిచేయడం కంటే వివిధ సంస్థలకు సేవలందిస్తూ ఎక్కువ మొత్తం ఆర్జించేందుకే వారు మొగ్గుచూపుతున్నారని తాజా అథ్యయనం తేల్చింది. ఒకే కుర్చీకి రోజంతా అతుక్కుపోయేందుకు నవతరం టెకీలు ఎంతమాత్రం ఇష్టపడటం లేదని మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. నూతన టెక్నాలజీల్లో పనిచేసేందుకు నిపుణుల కొరత ఏర్పడటం కూడా టెకీ ఫ్రీలాన్సర్లకు పలు అవకాశాలను ముందుకు తెచ్చింది. సంఖ్యాపరంగా 1.5 కోట్ల మంది స్వతంత్ర ఉద్యోగులున్నభారత్ అమెరికా (6 కోట్లు) తర్వాతి స్ధానంలో నిలిచింది. ప్రస్తుతం భారత టెకీ ఫ్రీలాన్సర్లు డేటా విజువలైజేషన్, డేటా మైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియాల్లో పనిచేస్తున్నారని మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్ లెర్నింగ్ సీఈవో ఏపీ రామభద్రన్ తెలిపారు. ఇప్పటివరకూ పూర్తిస్దాయి ఉద్యోగులుగా ఉన్న వారిలో ఎక్కువ మంది ఫ్రీలాన్సర్లుగా మారడంతో ఆయా రంగాల్లో సమూల మార్పులు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. ఐటీ కంపెనీలు నూతన నైపుణ్యాలు, టెక్నాలజీలను సంతరించుకునే క్రమంలో నైపుణ్యం కలిగిన ఉద్యోగులను ఫ్రీలాన్సర్లుగా ఆహ్వానిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.ఇక ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్లైన్ వేదిక ఫ్రీలాన్సర్.కామ్‌లో నమోదు చేసుకున్న వారిలో అత్యధికులు భారతీయులే. ఈ వెబ్సైట్లో నమోదైన వారిలో 20 శాతం మంది భారతీయులున్నారు. టెకీల ఆలోచనాధోరణిలో మార్పులకు ఇది అద్దం పడుతున్నదని పరిశ్రమ నిపుణులు పేర్కొంటున్నారు. -
టెకీలకు ఈ కొలువులే హాట్
సాక్షి,న్యూఢిల్లీ: క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఇంజనీరింగ్ కాలేజ్ గ్రాడ్యుయేట్ల జాబ్ రోల్స్‌లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. భిన్న రంగాల్లో దూసుకొచ్చిన నూతన టెక్నాలజీల కారణంగా సంప్రదాయ కొలువుల స్ధానంలో కొత్త రోల్స్ ముందుకొచ్చాయి. బిగ్ డేటా అనలిటిక్స్, కృత్రిమ మేథ, మెషీన్ లెర్నింగ్, డిజిటల్ మార్కెటింగ్, మొబైల్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వంటి నూతన విభాగాల్లో తాజా టాలెంట్‌ను కొలువుతీర్చేందుకు కంపెనీలు క్యాంపస్‌ల బాట పడుతున్నాయి. గతంలో ఈ విభాగాల్లో వివిధ పొజిషన్స్‌లో ప్రైమరీ, మిడ్‌లెవెల్ ప్రొఫెషనల్స్‌కు ఆఫర్ చేసేవారు. అయితే ఎంట్రీ లెవెల్లోనే గ్రాడ్యుయేట్లను ఎంపిక చేసుకుని ఆయా విభాగాల్లో శిక్షణ ఇవ్వాలని కంపెనీలు భావిస్తున్నాయి. దీంతో ఈ ఏడాది ఈ నైపుణ్యాల్లో దేశవ్యాప్తంగా 12,000 ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్రొవెడర్ సింప్లీలెర్న్ పేర్కొంది. ఇక డిజిటల్ మార్కెటింగ్‌లో 12,480 మంది ఫ్రెషర్స్‌కు, మొబైల్ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో 11,700 మంది ఫ్రెషర్స్‌కు అవకాశాలున్నాయని వెల్లడించింది. గతంలో క్యాంపస్ రిక్రూట్మెంట్లు జరిగే క్లౌడ్ కంప్యూటింగ్, క్వాలిటీ మేనేజ్మెంట్, ఐటీ సేవల ఉద్యోగాల కన్నా ఈ సంఖ్య దాదాపు రెట్టింపు కావడం గమనార్హం. ఐటీ సేవలు, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగం నుంచి ఈ ఉద్యోగాలు సమకూరనున్నాయని సంస్థ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ కాశ్యప్ దలాల్ పేర్కొన్నారు. కస్టమర్లకు సేవలు అందించే క్రమంలో ఈ టెక్నాలజీలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని అన్ని కంపెనీలు గుర్తించడంతో ఆయా జాబ్ రోల్స్‌కు ప్రాధాన్యత పెరిగింది. ఇతర జాబ్లకు ఇచ్చే ప్రారంభ వేతనమే వీటికి ఉన్నప్పటికీ రెండు మూడేళ్లలో ఈ జాబ్రోల్స్లో కుదురుకునే అభ్యర్థులకు వేతన ప్యాకేజ్ భారీగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. -
హైదరాబాద్ టెకీల నిరసన
హైదరాబాద్: నగరంలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌కు వెళ్లే రోడ్డును తవ్వడానికి జీహెచ్ఎంసీ చేస్తున్న ప్రయత్నాలు మానుకోవాలని మహానగర టెకీలు డిమాండ్ చేస్తున్నారు. రోడ్డు తవ్వకానికి వ్యతిరేకంగా టెకీలు ఆన్లైన్లో క్యాంపైన్ కూడా నిర్వహించారు. క్యాంపైన్‌కు మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో.. కార్యాలయాలకు వాహనాలకు బదులు గుర్రాలపై వెళ్తూ వినూత్న నిరసనకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రస్తుతం ఉన్న తారు రోడ్డును సిమెంట్ రోడ్డుగా మార్చే ప్రయత్నాన్ని విరమించుకోవాలని కోరుతున్నారు. వచ్చే మూడు నుంచి నాలుగేళ్లలోపు ప్రస్తుతం ఉన్న తారు రోడ్డుకు ఎలాంటి ఢోకా ఉండబోదని కొందరు ఐటీ నిపుణులు చెబుతున్నారు. అలాంటప్పుడు ఇప్పటికిప్పుడు రోడ్డును తవ్వాల్సిన పనేంటని ప్రశ్నిస్తున్నారు. రోడ్డు తవ్వకం వల్ల ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌లో పనిచేసే ఉద్యోగులకు ప్రయాణ సమయం రెండు నుంచి మూడు గంటల పాటు పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో గుంతలో నిండిన రోడ్లు చాలానే ఉన్నాయని ముందు వాటిని సరిచేయాలని వ్యాఖ్యానిస్తున్నారు. -
టెకీలకు మరో హెచ్చరిక
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగ ఉద్యోగాల విషయంలో ప్రతిష్టంభన నెలకొన సంగతి తెలిసిందే. ఆటోమేషన్, కొత్త డిజిటల్ టెక్నాలజీస్ పెనుముప్పుగా విజృంభిస్తుండటంతో కంపెనీలు ఉద్యోగులపై భారీగానే వేటు వేస్తున్నాయి. అంతేకాక భవిష్యత్తులోనూ ఉద్యోగాలు ఉంటాయా? ఊడతాయా? అనే దానిపైన గ్యారెంటీ లేదు. ఈ సవాళ్లు భారత్ కు అతిపెద్ద సవాల్ గా ఉన్నాయని, దేశీయ ఐటీ కంపెనీలు తమ స్టాఫ్ ను రీ-ట్రైన్ చేయడం చాలా కష్టతరమని హెచ్చరికలు వస్తున్నాయి. 1.5 మిలియన్ మందిని లేదా ఇండస్ట్రీ వర్క్ ఫోర్స్ లో సగం మందిని రీ-ట్రైన్ చేయాల్సినవసరం ఉందని ఇటీవల ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ పేర్కొంది. కానీ ప్రస్తుతం నాస్కామ్, కన్సల్టింగ్ సంస్థ క్యాప్‌జెమినీతో కలిసి చేసిన అంచనాల్లో, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కొత్త స్కిల్-సెట్ లలో మధ్య, సీనియర్ స్థాయి దేశీయ ఐటీ కార్మికులు ఇమడలేరని తెలిపాయి. దీంతో మధ్యస్థాయి, సీనియర్ స్థాయి ఉద్యోగుల్లో కోత ప్రభావం అధికంగా ఉంటుందని తాజాగా హెచ్చరించాయి. తాను నిరాశాపూరిత విషయాన్ని చెప్పడం లేదని, కానీ ఇది ఎంతో సవాలుతో కూడుకున్న విషయమని క్యాప్‌జెమినీ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ శ్రీనివాస్ కందుల చెప్పారు. 60-65 శాతం మంది శిక్షణ పొందలేరని పేర్కొన్నారు. వీరిలో చాలామంది మధ్యస్థాయి నుంచి సీనియర్ స్థాయి వరకున్న వారేనని తెలిపారు. దీంతో వారు అత్యధికంగా నిరుద్యోగులుగా మారే అవకాశముందని చెప్పారు. ఐటీ కంపెనీలు కూడా మధ్యస్థాయి ఉద్యోగులకు ఎక్కువ వేతనాలు ఇచ్చే బదులు ఎక్కువ ప్రతిభావంతులనే తమ కంపెనీలో ఉంచుకోవడానికి మొగ్గుచూపుతాయని పేర్కొన్నారు. మధ్యస్థాయి ఉద్యోగులు కొత్త స్కిల్-సెట్లలో ఇమిడే అవకాశాలు తక్కువగా ఉన్నాయని, దీంతో వారు ఉద్యోగాల కోత బారిన పడతారని తాజా అంచనాలు వెల్లడిస్తున్నాయి. తక్కువ స్థాయి స్టాఫ్ కు లేదా కార్మికులకు తేలికగా కంపెనీ రీట్రైన్ చేస్తాయని చెప్పాయి. -
టెకీ ఉద్యోగ సంఘాలపై ఇన్ఫీ బాలకృష్ణన్
ఉద్యోగుల తొలగింపుతో ఆందోళనలో ఉన్న టెకీలు ఉద్యమ బాట పట్టడంపై ఐటీ పరిశ్రమ సీనియర్ స్పందించారు. ఉద్యోగుల సంక్షేమాన్ని బాగా చూసుకుంటున్నపుడు ఐటీ కంపెనీల్లో యూనియన్ల అవసరం లేదని టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ బోర్డు సభ్యుడు వి.బాలకృష్ణన్ తేల్చి చెప్పారు. అలాగే ఐటీ లో భారీ ఉద్యోగాల కోత అని వస్తున్న నివేదికలు కేవలం అతిశయోక్తి మాత్రమేనని కొట్టి పారేశారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన చెల్లింపుల విషయంలో తాము చాలా నైతికంగా వ్యవహరిస్తున్నామనీ ఇన్ఫీ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పిటిఐకి చెప్పారు. పనిపరిస్థితులు, జీత భత్యాలు అధికంగా ఉన్న ఐటీ పరిశ్రమలో అసలు ఉద్యోగ సంఘాల అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఉద్యోగులు, వారి హక్కుల పట్ల అస్తవ్యస్తంగా, అనైతికంగా వ్యవహరించే కంపెనీలకు తప్ప ఐటీ కంపెనీలకు ఉద్యోగ సంఘాలు అవసరం లేదని చెప్పారు. ఐటీలో సంక్షోభంలో ఉన్నపుడు యూనియన్లు పుట్టుకొస్తాయని, కానీ తర్వాత ఉనికిలోఉండవని పేర్కొన్నారు. ఈ సంక్షోభ సమయంలో కూడా తీసివేతలు రెండంకెల్లోనే న్నాయన్నారు. కాబట్టి, ఐటీ పరిశ్రమలో యూనియన్ అవసరం లేదనీ , ఒకవేళ యూనియన్ ఉన్నా బాగా శ్రద్ధ తీసుకుంటున్నారని భావించడం లేదన్నారు. మిగిలిన వాటిల్లా ఐటి సాంప్రదాయ పరిశ్రమ కాదు. ప్రపంచవ్యాప్తంగా ఇది పని అవకాశాలు కల్పిస్తూ భిన్నంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ప్రతిభ ఆధారంగా తొలగింపులు తప్ప, భారీ ఉద్యోగాల నష్టం అనేది అతిశయోక్తి తప్ప మరోకటి కాదని బాలకృష్ణన్ పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 150 బిలియన్ డాలర్లతో ఐటీ సర్వీసుల పరిశ్రమ ఒకే స్థాయిలో వృద్ధి చెందుతున్నట్లు కనిపిస్తోందనీ వచ్చే ఏడాది రెండింతలు పెరగవచ్చంటూ ఆయన కొత్త ఆశలురేకెత్తించారు. అంతేకాదు ఐటీలో అవకాశాలు చాలా పెద్దవిగా ఉన్నాయన్నారు. భారత్‌కు అతిపెద్ద మార్కెట్ అయిన అమెరికా ఆర్థిక వ్యవస్థ ఒకటిన్నర నుండి రెండు శాతం వద్ద పెరుగుతోందని బాలకృష్ణన్ తెలిపారు. -
ఈ యాప్ స్పెషల్ గా టెకీలకే..
బెంగళూరు : ఇటీవల ఐటీ ఇండస్ట్రీలో నెలకొన్న ఉద్యోగాల కోతతో చాలామంది టెకీలు జాబ్స్ ఎలా దొరుకుతాయోనని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అసలకే ఐటీ ఇండస్ట్రి తిరోగమనంలో ఉంది, జాబ్ పోతే, మరో ఉద్యోగం ఎలా వెతుకోవాలా? అని సతమతమవుతున్నారు. టెకీల ఆందోళనను గమనించిన ఐటీ ఇండస్ట్రి బాడీ నాస్కామ్, వారికి సాయం చేయడం కోసం ప్రత్యేకంగా ఓ యాప్ తీసుకొచ్చింది. 'స్టార్టప్ జాబ్స్' పేరిట ఈ యాప్ ను లాంచ్ చేసింది. ఎక్కడ ఖాళీలున్నా ఈ యాప్ వెంటనే టెక్నాలజీ ప్రొఫిషనల్స్ కు అలర్ట్ లను పంపిస్తుంది. టెక్నాలజీ, సేల్స్, మార్కెటింగ్ ఆపరేషన్స్ లాంటి స్టార్టప్స్ లో ఎంపికచేసిన జాబ్ ఓపెనింగ్స్ ను ఈ యాప్ ఆఫర్ చేస్తోంది. అభ్యర్థులు ఈ యాప్ లో తమ వీడియో ప్రొఫైల్స్ అప్ లోడ్ చేసుకోవడానికి వీలుంటుంది. దీంతో కంపెనీలు అభ్యర్థులు ప్రొఫైల్స్ ను చూసి, ఇంటర్వ్యూకు పిలువవచ్చు. కంపెనీలు తమ ప్రొఫైల్స్ ను చూసిన తర్వాత వెంటనే స్టేటస్ అప్ డేట్లను కూడా అభ్యర్థులు పొందుతారు. బెంగళూరుకు చెందిన హెచ్ఆర్ టెక్ స్టార్టప్ ఈ-పోయిస్ సిస్టమ్స్ ఈ యాప్ ను అభివృద్ది చేసింది. లండన్ బిజినెస్ స్కూల్ అల్యూమినీ సచిన్ అగర్వాల్, బిశాన్ సింగ్ ఈ స్టార్టప్ ను స్థాపించారు. హెచ్‌పీ, సిమెన్స్, ఫ్లిప్ కార్ట్, ఫస్ట్ సోర్స్, ఓలా, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, రిలయన్స్ దీనికి కస్టమర్లు. ఈ క్లిష్టతరమైన మార్కెట్లో తమకు నెప్పే ఉద్యోగాలను వెతుకోవడంలో ఈ యాప్ టెకీలకు ప్రత్యామ్నాయ మార్గమని 10వేల స్టార్టప్ కార్యక్రమ అధినేత కేఎస్ విశ్వనాథన్ చెప్పారు. -
బెంగళూరులోనే టెకీల జీతాలు ఎక్కువ
బెంగళూరు: వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడం వల్లనే టెకీలందరూ బెంగళూరు బాట పడుతున్నారని ఇంతకాలం భావించారు. కంపెనీలు ఎక్కువగా అక్కడ ఏర్పాటు చేయడానికి అక్కడి వాతావరణ పరిస్థితులు, ప్రభుత్వం ఇచ్చే రాయితీలు కారణం కావచ్చుకానీ, టెకీలు మాత్రం అధిక జీతాల కారణంగానే బెంగళూరు బాట పడుతున్నారని హెచ్ఆర్ కన్సల్టింగ్ సంస్థ ‘ర్యాండ్స్టడ్’ తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. భారత సిలికాన్ వ్యాలీగా గుర్తింపు పొందిన బెంగళూరులో సీనియర్ స్థాయి ఉద్యోగులకే కాకుండా జూనియర్ స్థాయి ఉద్యోగులకు కూడా జీతాలు ఎక్కువగా ఉన్నాయని దేశవ్యాప్తంగా 15 పరిశ్రమలు, లక్షమంది ఉద్యోగుల జీతాలను ర్యాండ్స్టడ్ విశ్లేషించగా తేలింది. బెంగళూరులో 15 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ స్థాయి ఉద్యోగులకు ఏడాదికి సరాసరి 28 లక్షల రూపాయలు చెల్లిస్తుండగా, ముంబైలో 27 లక్షల రూపాయలను, హైదరాబాద్‌లో 26.8 లక్షల రూపాయలు, ఢిల్లీ–ఎన్సీఆర్లో 26 లక్షలు, పుణెలో 25.5 లక్షల రూపాయలు చెల్లిస్తున్నారు. ఆరు నుంచి 15 ఏళ్ల వరకు అనుభవం ఉన్న మధ్య స్థాయి ఉద్యోగులకు ముంబైలో 10.5 లక్షల రూపాయలు, బెంగళూరులో 10.4 లక్షలు, చెన్నైలో 10.3 లక్షలు, ఢిల్లీ–ఎన్సీఆర్లో 10.2 లక్షలు, హైదరాబాద్‌లో 9.8 లక్షల రూపాయలు చెల్లిస్తున్నారు. ఇక జీరో నుంచి ఆరేళ్ల వరకు అనుభవం కలిగిన జూనియర్ స్థాయి ఉద్యోగులకు బెంగళూరులో 5.5 లక్షల రూపాయలు చెల్లిస్తుండగా, ఢిల్లీ–ఎన్సీఆర్లో 5.3 లక్షలు, చెన్నైతో 5.2 లక్షలు, ముంబైలో 5.1 లక్షలు, హైదరాబాద్‌లో 4.9 లక్షల రూపాయలు జీతాలు వస్తాయి. -
టెక్కీలు ఇవిచేస్తే.. 50 శాతం ఎక్కువ జీతం
బెంగళూరు : టెక్ ఇండస్ట్రీలో ఓ వైపు నుంచి ట్రంప్ షాక్ లు.. మరోవైపు ఆటోమేషన్ ముప్పు అసలు ఉద్యోగాలు వస్తాయో ఊడతాయో అర్థంకాని పరిస్థితుల్లో ఉద్యోగులు సతమతమవుతున్నారు. కానీ కొన్ని స్కిల్స్ ను నేర్చుకున్న టెక్కీలకు ఇండస్ట్రీలో భారీగా డిమాండ్ ఉంటుందట. డేటా విజులైజేషన్, డేటా సైన్సు, మిషన్ లెర్నింగ్ ప్రస్తుతం అత్యంత విలువైన టెక్నాలజీ రిక్రూటర్లుగా ఉన్నాయని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. ఇటీవల కాలంలో డిజిటల్ డేటా ఎక్కువగా జనరేట్ అవుతున్న క్రమంలో ఈ స్కిల్స్ నేర్చుకున్న టెక్నాలజీ నిపుణులకు డిమాండ్ ఏర్పడుతుందని తెలుస్తోంది. చాలామంది వర్కింగ్ ప్రొఫిషనల్స్ కూడా ఈ స్పెషల్ కోర్సులను నేర్చుకుంటున్నారని తెలిసింది. ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి 20 శాతం నుంచి 50 శాతం మధ్యలో వేతనాల పెంపు కూడా ఉంటుందని ఆన్ లైన్ లెర్నింగ్ ప్లాట్ ఫామ్ సింప్లిలెర్న్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ కౌసిక్ దలాల్ చెప్పారు. గత మూడేళ్లుగా బిగ్ డేటా, అనాలిటిక్స్ కోర్సులకు మంచి వృద్ధి నమోదవుతుందని పేర్కొన్నారు. డేటా సైన్సు కూడా ఎక్కడా తగ్గకుండా పాపులర్ చెందుతుందని తెలిపారు. గత ఆరునెలలుగా మిషన్ లెర్నింగ్, విజులైజేషన్ టూల్స్ కోర్సులు అత్యంత ఆకర్షణీయమైనవిగా ఉన్నాయని చెప్పారు. 25 శాతం సింప్లిలెర్న్ అప్లికెంట్లు మిషన్ లెర్నింగ్ ను ఎంపికచేసుకున్నారని వెల్లడించారు. కాగ ఈ కోర్సుల వ్యవధి 4 నుంచి 9 నెలలు. మొత్తం ఈ కోర్సులకు అయ్యే ఖర్చు ఒక్కో మోడ్యుల్ బట్టి రూ.25వేల రూపాయల నుంచి 60 వేల రూపాయల వరకు ఉంటుందని తెలిసింది. -
పైసా ఖర్చు లేకుండా ఆ దేశానికి ప్రయాణం
అమెరికాలో విదేశీయులకు ఆంక్షలు పెరిగిపోతున్న నేపథ్యంలో మిగతా దేశాల్లో నిబంధనలు సరళతరమవుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఇక న్యూజిలాండ్ కు ఉచితంగా ప్రయాణించవచ్చట. ఉచితంగా విమానంలో ప్రయాణించడం దగ్గర్నుంచి... అక్కడ ఫ్రీగా ఉండటం వరకు న్యూజిలాండ్ ఆఫర్ చేస్తోంది. న్యూజిలాండ్ రాజధాని నగరం వెల్లింగ్టన్ 100 టెక్ వర్కర్లకు ఈ ఆఫర్ అందిస్తోంది. తమ టెక్ హబ్ ను పెంచుకునే నేపథ్యంలో జాబ్ ఇంటర్వ్యూకు వచ్చిన వారికి ఈ ఆఫర్ ను అందించబోతున్నట్టు ప్రకటించింది. లుక్సీ పేరుతో వెల్లింగ్టన్ ఈ క్యాంపెయిన్ ను ప్రారంభించింది. 2017 మే 8 నుంచి మే 11 వరకు నాలుగు రోజుల పాటు జాబ్ ఇంటర్వ్యూలకు, టెక్ లీడర్లలతో మీట్-అప్స్ కు ఈ అరెంజ్మెంట్స్ చేస్తోంది. తమ టెక్ ఆవిష్కరణలు సదూర ప్రదేశాలకు ప్రయాణించాలని తాము భావిస్తున్నాం.. అందుకు అనుగుణంగా తమకు ఎక్కువమంది ప్రతిభావంతులైన ప్రజలు కావాలని వెల్లింగ్టన్ మేయర్ జస్టిన్ లెస్టర్ చెప్పారు. వెల్లింగ్టన్ లో ఇంటర్వ్యూకు హాజరుకావాలనుకునే వారు మొదట తమ అభ్యర్థిత్వాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుని, తమ సీవీని అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. అనంతరం వీడియో ఇంటర్వ్యూకు అభ్యర్థులను వెల్లింగ్టన్ ఆహ్వానిస్తోంది. అనంతరం ఎంప్లాయిర్స్ అభ్యర్థులను నామినేట్ చేస్తోంది. ఈ విధంగా జరిగిన ప్రక్రియలో అందుబాటులో ఉన్న వంద స్పాట్స్ లో అవకాశం దక్కించుకుని ఈ ఆఫర్ ను పొందవలసి ఉంటుంది. అనంతరం వెల్లింగ్టన్ లో జాబ్ ఇంటర్వ్యూకు హాజరుకావాలి. -
ఇద్దరు టెక్కీల జల సమాధి
తుమకూరు(కర్ణాటక): విహారానికి వచ్చిన ఐదుగురు టెక్కీల్లో ఇద్దరు జల సమాధి అయ్యారు. ఈ ఘటన తుమకూరు నగర సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. బెంగళూరుకు చెందిన కార్తీక్ (28), వరుణ( 26)తోపాటు మరో ముగ్గురు టెక్కీలు కోరమంగళలో ఉన్న హెచ్‌పీ కంపెనీలో పని చేస్తున్నారు. వీక్ఎండ్ కావడంతో ఆదివారం దేవరాయణదుర్గకు వచ్చారు. అక్కడ మద్యం తాగి సమీపంలోని చెరువులో ఈతకు వెళ్లారు. కార్తిక్ నీటిలో మునిగి పోతుండగ కాపాడటానికి వెళ్లిన వరుణ కూడా గల్లంతయ్యాడు. మిగతా ముగ్గురు అప్రమత్తమై క్యాత్సంద్ర పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికి తీశారు. అనంతరం పోస్టుమార్టం ఎగ్జామినేషన్ కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. -
ఇక టెకీల యూనియన్లు!
చెన్నై: దాదాపు 4.5లక్షల మంది టెకీలకు నిలయమైన చెన్నైలో తమిళనాడు ప్రభుత్వం టెకీలు కూడా యూనియన్లను స్థాపించుకోవచ్చని ప్రకటించింది. కార్మిక సంఘాలు వేసిన పిటిషన్ కు సమాధానం ఇచ్చిన ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేసింది. 1947 పారిశ్రామిక వివాదాలు యాక్ట్ కింద టెకీ ఉద్యోగులు కూడా సంఘాలను ఏర్పాటు చేసుకుని తన బాధలను వ్యక్తం చేయోచ్చని తెలిపింది. కాగా, ఐటీ సెక్టార్ ఈ ప్రకటనను విపరిణామంగా భావిస్తోంటే.. యూనియన్లు మాత్రం ఇది ఉద్యోగుల పాలిట వరంగా భావిస్తున్నారు. ట్రేడ్ యూనియన్లను స్థాపించుకోవడం ఉద్యోగుల హక్కు అని కొంతమంది యూనియన్ల ప్రతినిధులు అంటున్నారు. హెచ్ సీఎల్ లో పనిచేసే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను సరిగా పనిచేయడం లేదని గతనెలలో తీసేయగా.. మద్రాసు హైకోర్టు ఉద్యోగిని ఉన్నపళంగా తీసేయడాన్ని వ్యతిరేకిస్తూ తీర్పునిచ్చింది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కూడా ఒక పని చేసే వ్యక్తేనని కోర్టు వ్యాఖ్యానించింది. ఏవరినైనా ఉద్యోగంలో తీసుకున్న తర్వాత వర్క్ మాన్ షిప్ నుంచి ఉన్నపళంగా తప్పించలేరని తెలిపింది. దీంతో ఇప్పటివరకు ఫ్యాక్టరీలకే పరిమితమైన ట్రేడ్ యూనియన్లు టెకీ కంపెనీల్లో కూడా ఆరంభం కానున్నాయి. -
టెకీలు ఇక హాయిగా నిద్రపోవచ్చు..
బీజింగ్: సాధారణంగా బాస్లంటే ఎలా ఉంటారు. పని త్వరగా పూర్తవ్వాలని.. ముందుగా నిర్ణయించిన సమయంలోగా టార్గెట్ పూర్తి చేయాలని ఆదేశిస్తారు. అలా జరగలేదో వారి తీరు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శివతాండవం తప్పదు. వాస్తవానికి ఎంతపనిచేస్తున్నా ఉద్యోగుల విషయంలో యజమానుల ఉదాసీనత కాస్తంత తక్కువగానే ఉంటుంది. కానీ, చైనాలో ఆ పరిస్థితి మారుతోంది. తమ సంస్థల్లో పనిచేసే టెక్కీల క్షేమమే తమ లక్ష్యంగా మార్పు చెందుతోంది. అందుకు ఉదాహరణగా బైషాన్ క్లౌడ్ అనే కంపెనీ నిలుస్తోంది. దాయి జియాంగ్ అనే వ్యక్తి బీజింగ్ లో ని ఓ మిషనరీ సంస్థలో పనిచేస్తున్నాడు. ఇందులో ఒక షిప్ట్ 72 గంటలు ఉంటుంది. అంటే మూడు రోజులు. దీంతో అతడు ఎప్పుడుపడితే అప్పుడు అలసిపోయి నిద్రలోకి జారుకుంటాడన్నమాట. పనివేళల్లో అతడు ఓ తేలికపాటి కునుకు తీసినా అతడిని బాస్ ప్రశ్నించడు. ఇలా అతడు కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి గత పదిహనేళ్లుగా ఇలాగే ఉంది. దీంతో దాయి పనిచేసే సంస్థ బైషాన్ క్లౌడ్ ఇప్పుడు ఏకంగా ఓ పన్నెండు బంక్ బెడ్స్‌ను ఏర్పాటుచేసింది. ఆఫీసులోనే ఓ పక్కకు ఒక దానిపై ఒకటి అల్మారాల మాదిరిగా పెట్టించింది. ఈ 72గంటల షిప్టుల్లో ఉన్నవారు.. ఉదయం, రాత్రి అనే తేడా లేకుండానే ఎప్పుడంటే అప్పుడు ఏం చక్కా అందులోకి వెళ్లి నిద్రపోవచ్చు. ఇదంతా ఎందుకంటే.. ఉద్యోగుల మానసిక పరిస్థితి కుదురుగా ఉంటేనే సరిగా పని చేయగలరని ఆ కంపెనీ చెబుతోంది. అమెరికాతో పోటీ పడుతున్న చైనాకు ఇలాంటి పరిస్థితులు సర్వసాధారణం అని.. తక్కువ ఖర్చుతో ఎక్కువ శ్రామిక నైపుణ్యం లభించే ఆ దేశంలో ఇలా పనుల్లో ఉండగా కునుకిపాట్లు ఉండనే ఉంటాయని చెప్తుంటారు. తీవ్రమైన పోటీ వాతావరణం నెలకొన్న చైనాలో ఇప్పుడు ఉద్యోగుల కోసం ఇలాంటి సౌకర్యాలు ఏర్పాటుచేస్తున్నారు. అంతేకాదు.. ఆఫీసుల్లోనే ఇంటిని తలపించే వాతావరణం కూడా సిద్ధం చేస్తున్నారు. అయితే, ఈ ఉద్యోగులు మాత్రం తమ కుటుంబాలను మిస్సవుతున్నామని ఫీలవుతున్నారు. -
టెకీలు మెచ్చే టాప్ 10 నగరాల్లో హైదరాబాద్!!
ప్రపంచంలోని ఏ నగరంలో ఉండాలని టెకీలు ఎక్కువగా భావిస్తారు? వాళ్లకు ఏయే నగరాలంటే ఎక్కువ మక్కువ ఉంది? సరిగ్గా ఇదే విషయమై సామాజిక నెట్వర్కింగ్ సైట్ లింక్డ్ ఇన్ ఓ సర్వే చేసింది. అందులో టాప్ 10 నగరాల్లో ఐదు మన దేశానివే. అందులోనూ మూడో స్థానాన్ని మన హైదరాబాద్ దక్కించుకుంది. భారతీయ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరు మొత్తం జాబితాలో అగ్రస్థానంలో నిలవగా.. తర్వాత వరుసగా పుణె, హైదరాబాద్, చెన్నై ఉన్నాయి. ఢిల్లీ శివార్లలోని గుర్గావ్ పదో స్థానంలో ఉంది. బెంగళూరులో ఉండే 45 శాతం మంది ప్రజలు సాంకేతిక నిపుణులు. తర్వాత పుణె, చెన్నైలలో 43 శాతం మంది చొప్పున ఉన్నారు. వీటితో పోలిస్తే, శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియాలో కేవలం 31 శాతం మంది మాత్రమే ఉన్నారు. ఇంతకుముందు కంటే ఎక్కువగా పెద్ద నగరాలకు జనం బాగా వెళ్తున్నారని, భారతీయ సాంకేతిక రంగం అయితే విపరీతంగా అభివృద్ధి చెందుతోందని లింక్డ్ ఇన్‌లో రీసెర్చ్ కన్సల్టెంటుగా పనిచేస్తున్న సోహన్ మూర్తి తెలిపారు. భారతీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమ దాదాపు 118 బిలియన్ల డాలర్లు (7,09,700 కోట్లు) అని అంచనా. మొత్తం ప్రపంచంలోని 52 నగరాలను లింక్డ్ ఇన్ పరిశీలించింది. టాప్ టెన్ జాబితాలో ఇంకా సీటెల్, ఆస్టిన్, మెల్బోర్న్, సిడ్నీ నగరాలు నిలిచాయి. -
చోరీలు చేయిస్తూ చిక్కిన సాప్ట్వేర్ ఇంజినీర్
హైదరాబాద్ : చిన్నారులతో రైళ్లలో చోరీ చేయిస్తున్న ఓ సాప్ట్వేర్ ఇంజినీర్‌ను అంబర్ పేట పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు గోల్నాక నివాసి సుభాష్ సాప్ట్వేర్ ఇంజినీర్. వ్యసనాలకు బానిసైన అతగాడు చిన్నపిల్లలతో చోరీలు చేయిస్తున్నాడు. ఛేనంబర్ శంకర్ నగర్‌లోని ఓ ఇంటర్ నెట్ సెంటర్‌కు నిత్యం వెళ్లే అతడు అక్కడికి వీడియో గేమ్స్ ఆడేందుకు వచ్చే చిన్న పిల్లలను మచ్చిక చేసుకునేవాడు. వారిని హోటల్‌కి తీసుకెల్లి బిర్యానీ, ఐస్‌క్రీమ్ వంటివి తినిపించేవాడు. తర్వాత వారిని రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లి...రైళ్లలో ప్రయాణిస్తాడు. బోగీల్లో ఛార్జింగ్ పెట్టిన సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు చోరీ చేయిస్తాడు. ఇలా వెంకటాద్రి, నారాయణాద్రి,రాజ్‌కోట్, యశ్వంత్‌పుర తదితర రైళ్లలో చోరీలు చేయించేవాడు. దొంగతనం చేసిన వాటిని విక్రయించగా వచ్చిన డబ్బుతో జల్సా చేసేవాడు. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం అంబర్ పేట మారుతీనగర్ కు చెందిన 13ఏళ్ల బాలుడిని సుభాష్ రైళ్లలో చోరీ చేయించడానికి తీసుకెళ్లాడు. ఆ బాలుడు కనిపించకపోవటంతో తమ కుమారుడు అదృశ్యమయ్యాడని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. దీంతో సుభాష్, అతనికి సహకరించిన ఇంటర్ నెట్ సెంటర్ నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమచారం.